విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన కారు
ద్వారకాతిరుమల : శేషాచలకొండ ఘాట్‌రోడ్డుపైనుంచి దిగుతున్న ఒక కారు బ్రేకులు విఫలమవడంతో ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. కారులో ఉన్న భార్యాభర్తలు సీటుబెల్టు పెట్టుకోవడంతో సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడకు చెందిన దైత మురళీకష్ణ తన భార్యతో కలిసి శ్రీవారి దర్శనార్థం ద్వారకాతిరుమలకు మంగళవారం సాయంత్రం కారులో వచ్చారు. తిరిగి వస్తుండగా, ప్రమాదం జరిగింది. కారు ముందు భాగం ధ్వంసమైంది. విద్యుత్ స్తంభం విరిగింది. దీంతో గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచింది.