రథంపై కలశాలను ప్రతిష్టాపన
ఐరాల: కాణిపాకం బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం జరగనున్న రథోత్సవానికి విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఉదయం ఆలయ మూషిక మండపంలో రథ కలశాలు, గొడుగులు,బ్రహ్మను ఉంచి విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం,ప్రత్యేక పూజలు చేశారు.ఆ తరువాత గొడుగులు, రథసారథి ,బ్రహ్మకు సంప్రోక్షణ పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ కాణిపాకం పురవీధుల్లో ఊరేగించి రథంపై ప్రతిష్టించారు. రథోత్సవాన్ని వీక్షిచేందుకు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈఓ పూర్ణచంద్రారావు తెలిపారు.