తడిసి ముద్దయ్యారు
ఏలూరు (మెట్రో) : పగలంతా ఉక్కబోతతో ఉక్కిరిబిక్కిరైన ఏలూరు నగర ప్రజలకు సోమవారం సాయంత్రం కురిసిన వర్షంతో ఒక్కసారిగా ఊరట కల్గింది. సాయంత్రం వరకు ఉష్ణ తాపంతో అవస్థలు పడిన ప్రజలు వాతావరణంలో వచ్చిన మార్పులతో కాస్త సేద తీరారు. అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షానికి ఎక్కడివారక్కడే నిలిచిపోయారు. మూడు రోజుల పాటు భానుడు తన విశ్వరూపాన్ని చూపించినా నాలుగో రోజైన సోమవారం వరుణుడు కరుణించడంతో నగర ప్రజలకు ఉక్కబోత, ఎండ వేడి నుంచి ఉపశమనం కల్గింది.