శ్రీశైలం (కర్నూలు) : శ్రీభ్రమరాంబామల్లికార్జునస్వామివార్ల సన్నిధిలో కార్తీకమాసం సందర్భంగా ఆది, సోమవారాలలో వచ్చే భక్తులరద్దీని దృష్టిలో పెట్టుకుని ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలు, సుప్రభాత, మహా మంగళహారతి సేవలను రద్దు చేస్తున్నట్లు ఈవో సాగర్‌బాబు శుక్రవారం తెలిపారు. కార్తీకమాసంలో చివరి ఆదివారం, చివరి సోమవారానికి తోడుగా ఏకాదశి పర్వదినం కలిసి రావడంతో భక్తుల సంఖ్య లక్షల్లో ఉంటుందనే అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 6న ఆన్‌లైన్‌లో అభిషేకాలు బుకింగ్ చేసుకున్న సేవాకర్తలకు శనివారం సాయంత్రం స్వామివార్ల గర్భాలయంలో ఆర్జిత అభిషేకాలు, అమ్మవారి ఆలయంలో కుంకుమార్చనలను నిర్వహించుకోవచ్చునన్నారు.
అలాగే సోమవారం కోసం ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న సేవాకర్తలు మంగళవారం రోజున ఆర్జిత అభిషేకాలు, కుంకుమార్చనలను నిర్వహించుకునేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. తప్పనిసరిగా ఆయా రోజుల్లోనే ముందస్తు అభిషేకం టికెట్లను తీసుకోవడం ద్వారా అభిషేకాలను నిర్వహించుకోవాలనుకునే సేవాకర్తలు శ్రీవృద్ధ మల్లికార్జునస్వామివార్ల వద్ద అభిషేకాలు, అమ్మవారి ప్రాకార మండపంలో కుంకుమార్చనలను చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు ఈవో వెల్లడించారు.
శ్రీశైలంలో ఆది,సోమవారాల్లో ఆర్జితసేవలు రద్దు
Published Fri, Dec 4 2015 8:08 PM | Last Updated on Thu, Sep 27 2018 5:46 PM
Advertisement
Advertisement