త్రివర్ణ పతాకాన్ని ఊరేగిస్తున్న యువతరం సేవ సమితి సభ్యులు
శ్రీకాళహస్తి : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో సోమవారం యువతరం సేవాసమితి ఆధ్వర్యంలో వెయ్యి అడుగుల పొడవు, ఐదు అడుగల వెడల్పు కలిగిన జాతీయ పతాకాన్ని ఊరేగించారు. ఈ ప్రదర్శన పట్టణంలోని నాలుగువూడ వీధుల్లో కనుల పండువగా సాగింది. ఈ ఊరేగింపును స్థానిక ప్రజలు ఆసక్తిగా తిలకించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు యువతరం సేవా సమితి నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.