
ప్రతీకాత్మక చిత్రం
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ పలు దళిత సంఘాలు సోమవారం భారత్ బంద్‌కు పిలుపునిచ్చాయి. సుప్రీంకోర్టు నిర్ణయం వల్ల ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగే అవకాశం ఉందని వ్యాఖ్యానించాయి. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్‌ను దుర్వినియోగ పరుస్తున్నారనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు గత నెల 20న కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఎస్సీ, ఎస్టీ యాక్ట్‌పై ప్రభుత్వ ఉద్యోగిని అరెస్ట్ చేయాలంటే ప్రత్యేకంగా నియమించిన అధికారుల అనుమతి కావాలంటూ పేర్కొంది.
అలాగే సామాన్యులనైనా(ఎస్టీ, ఎస్సీలు కాకుండా మిగతా కులాలకు చెందినవారు) అరెస్ట్ చేయాలంటే సీనియర్ ఎస్పీ అనుమతి కావాలని పేర్కొంది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల కారణంగా ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం బలహీనపడుతుందని భావించి బీజేపీ ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనుంది.
దేశవ్యాప్తంగా పలు దళిత సంఘాలు సోమవారం ఆందోళనలు కొనసాగించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అట్రాసిటీ యాక్ట్ అంతకుముందు ఎలా ఉందో అలానే ఉంచాలని నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్(ఎన్‌సీఎస్‌టీ), నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ కాస్ట్స్(ఎన్‌సీఎస్‌సీ)లు డిమాండ్ చేశాయి.
Comments
Please login to add a commentAdd a comment