start today
-
తొలిరోజు టెట్ ప్రశాంతం
సాక్షి, విశాఖపట్నం : ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) తొలిరోజు ప్రశాంతంగా ముగిసింది. ఆదివారం నుంచి ఈ నెల 19 వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షకు నగరంలో 11 కేంద్రాలను (షీలానగర్, చినముషిడివాడ, పెదగంట్యాడ, శొంఠ్యాం, కొమ్మాది, బక్కన్నపాలెం, గుడిలోవ, పీఎంపాలెం, గంభీరం, ఏవీఎన్ కాలేజీల్లో) ఏర్పాటు చేశారు. ఉదయం 9.30 నుంచి 12 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5 గంటల వరకు ఈ పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం సెషన్లో 1990 మంది అభ్యర్థులు పరీక్ష రాయాల్సి ఉండగా 1922 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో 2840 మందికి 2742 మంది అభ్యర్థులు పరీక్ష రాశారు. ఇలా ఉదయం పరీక్షకు 68 మంది, మధ్యాహ్నం పరీక్షకు 98 మంది వెరసి 166 మంది అభ్యర్థులు గైర్హాజరయ్యారు. పరీక్ష ప్రారంభానికి గంట ముందుగా అభ్యర్థులు కేంద్రాలకు చేరుకోవాలన్న అధికారులు నిబంధన విధించారు. అందుకనుగుణంగానే ఆయా అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షా కేంద్రాల్లోకి సెల్ఫోన్లను, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించలేదు. పెందుర్తి: టీచర్స్ ఎలిజిబిలిటి టెస్ట్(టెట్) పెందుర్తి సమీపంలోని చినముషిడివాడలోని ఇయాన్ డిజిటల్ జోన్–1, జోన్–2 కేంద్రంగా ఆదివారం ప్రశాంతంగా ప్రారంభమైంది. అభ్యర్థులు పరీక్షకు దాదాపు గంట ముందుగానే కేంద్రానికి చేరుకున్నారు. పలువురు అభ్యర్థులు ఆఖరి నిమిషాల్లో కేంద్రానికి రావడంతో ఆత్రుతగా పరుగులు తీశారు. ఆయా కేంద్రాల్లో ఈ నెల 19 వరకు జోన్–1లో 6,750 మంది, జోన్–2లో 17,000 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరు కానున్నట్లు అధికారులు వెల్లడించారు. అక్కిరెడ్డిపాలెం(గాజువాక): షీలానగర్ ఆయాన్ సెంటర్లో టెట్ ఆదివారం మధ్నాహ్నం జరిగింది. ఈ పరీక్షకు 600 మంది హాజరైనట్లు నిర్వాహకులు తెలిపారు. అనకాపల్లి అలకండి గ్రామానికి చెందిన అంధ విద్యార్థి కర్రి స్వాతి టెట్ పరీక్షకు హాజరయ్యారు. -
నేటి నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 29 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అనంతపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం, కదిరి, పెనుకొండలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇంటర్æ పరీక్షలకు 2,463 మంది, పదో తరగతి పరీక్షలకు 1,551 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ప్రశ్నపత్రాలను కట్టుదిట్టమన బందోబస్తు మధ్య తరలించారు. సమీప పోలీస్స్టేషన్లలో భద్రపరిచి పరీక్ష రోజు కేంద్రానికి తీసుకెళ్తారు. పరీక్షల్లో కాపీయింగ్ ప్రోత్సహించవద్దని డీఈఓ లక్ష్మీనారాయణ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని.. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశ్నాపత్రాలను నిర్ణీత సమయంలో మాత్రమే తెరవాలని సూచించారు. -
ఏపీలో బడికొస్తా కార్యక్రమం
-
నేటి నుంచి డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు
ఎస్కేయూ : శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం పరిధిలోని డిగ్రీ కోర్సుల్లో రెండు, నాలుగు సెమిస్టర్లకు సంబంధించిన పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమవుతున్నట్లు ఎవాల్యుయేషన్స్ డైరెక్టర్ రెడ్డివెంకటరాజు తెలిపారు. తొలిసారిగా ఆన్లైన్ ప్రశ్నాపత్రానికి వాటర్‌మార్క్ విధానం అమలు చేస్తున్నామన్నారు. నిర్ధేశించిన సమయం కంటే గంట ముందు పరీక్ష కేంద్రం వద్దకు రావాలన్నారు. నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతిచ్చేదిలేదన్నారు. ఏప్రిల్ 28న పాలిసెట్ పరీక్ష ఉన్నందున మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష జరుగుతుందన్నారు. మిగతా పరీక్షలు యథాతథంగా జరుగుతాయని వివరించారు. -
నేటి నుంచి తైక్వాండో పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : జిల్లా స్థాయి తైక్వాండో క్రీడాపోటీలు ఆదివారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు తైక్వాండో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గురుస్వామి తెలిపారు. క్రీడా పోటీలు స్థానిక ఇండోర్ స్టేడియంలో జరుగనున్నట్లు చెప్పారు. ఓపెన్ సబ్–జూనియర్, క్యాడెట్, జూనియర్స్, సీనియర్స్ విభాగాల్లో బాల, బాలికలకు నిర్వహిస్తామన్నారు. ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఈనెల 27న ఉదయం 9 గంటలకు ఇండోర్ స్టేడియంలో తమ పేర్లను నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ : 7382440946లో సంప్రదించాలన్నారు. -
నేడు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు