సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 29 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అనంతపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం, కదిరి, పెనుకొండలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇంటర్æ పరీక్షలకు 2,463 మంది, పదో తరగతి పరీక్షలకు 1,551 మంది అభ్యర్థులు హాజరవుతారు.
ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ప్రశ్నపత్రాలను కట్టుదిట్టమన బందోబస్తు మధ్య తరలించారు. సమీప పోలీస్‌స్టేషన్లలో భద్రపరిచి పరీక్ష రోజు కేంద్రానికి తీసుకెళ్తారు. పరీక్షల్లో కాపీయింగ్ ప్రోత్సహించవద్దని డీఈఓ లక్ష్మీనారాయణ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని.. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశ్నాపత్రాలను నిర్ణీత సమయంలో మాత్రమే తెరవాలని సూచించారు.