
టెన్త్‌లో 63 శాతం..ఇంటర్‌లో 69 శాతం ఉత్తీర్ణత
ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి లోకేశ్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ ఫలితాలను సోమవారం విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. పరీక్షలో విజయం సాధించిన విద్యార్థులకు ఈ సందర్భంగా మంత్రి శుభాకాంక్షలు తెలిపారు. జూన్ ఒకటో తేదీ నుంచి 8 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు నిర్వహించారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు 15,058 విద్యార్థులు హాజరు కాగా, 9,531 మంది (63.30 శాతం) ఉత్తీర్ణత సాధించారు.
ఇంటర్మిడియట్ పరీక్షలకు 27,279 విద్యార్థులు హాజరు కాగా 18,842 మంది (69.07 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ఫలితాలను ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం వెబ్‌సైట్ https://apopenschool.ap.gov.in/ చూడవచ్చని ఓపెన్ స్కూల్ డైరెక్టర్ కె.నాగేశ్వర్‌రావు తెలిపారు. మార్కులు తక్కువగా వచ్చిన విద్యార్థులు రీ కౌంటింగ్ కోసం సబ్జెక్టుకు రూ.200, రీ వెరిఫికేషన్ కోసం సబ్జెక్టుకు రూ.1000 చొప్పున చెల్లించి ఈ నెల 8వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment