supplementary exams
-
ఇంటర్లో ఇక ఆన్లైన్ మూల్యాంకనం
సాక్షి, అమరావతి/నరసరావుపేట ఈస్ట్: ఇంటర్మిడియట్ పరీక్షల జవాబు పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం ప్రక్రియకు ఇంటర్మిడియట్ విద్యా మండలి శ్రీకారం చుట్టింది. ఇప్పటివరకు అధ్యాపకులు సెంటర్లలో మాన్యువల్‌గా చేస్తున్న ప్రక్రియను ఇకపై ఇంటి నుంచి లేదా కళాశాల నుంచి ఆన్లైన్లో చేయవచ్చు. ఇందుకోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించింది. ప్రస్తుతం జరుగుతున్న సప్లిమెంటరీ పరీక్షల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని బోర్డు నిర్ణయించింది. ఈ విధానం వల్ల మూల్యాంకనంలో పొరపాట్లు జరగవని, తద్వారా రీ వెరిఫికేషన్ లేదా రీ కౌంటింగ్‌కు ఆస్కారం ఉండదని అధికారులు చెబుతున్నారు. ఖర్చు, సమయం ఆదా అవడంతో పాటు విద్యార్థికి నూరు శాతం న్యాయం జరుగుతుంది. తక్కువ సమయంలోనే ఫలితాలు ఇవ్వవచ్చని చెబుతున్నారు. డీఆర్డీసీల స్థానంలో స్కానింగ్ సెంటర్లు జవాబు పత్రాల మూల్యాంకనం కోసం ఇప్పటి వరకు ప్రతి జిల్లా కేంద్రంలో జిల్లా రీ కలెక్షన్, డి్రస్టిబ్యూషన్ సెంటర్ (డీఆర్డీసీ) లు ఉన్నాయి. ఆన్లైన్ మూల్యాంకనంలో డీఆర్డీసీ స్థానంలో రీజినల్ రిసెప్షన్ స్కానింగ్ సెంటర్లు (ఆర్ఆర్ఎస్సీ) ఏర్పాటు చేస్తున్నారు. గతంలో ప్రతి జిల్లాలో సేకరించిన జవాబు పత్రాలను జంబ్లింగ్ విధానంలో ఇతర జిల్లాలకు పంపేవారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా గుంటూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, తిరుపతి, కర్నూలు, విశాఖపట్నంలలో స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. పరీక్ష పూర్తయిన వెంటనే ఆ రోజు జవాబు పత్రాలను ఈ కేంద్రాల్లో స్కాన్ చేస్తారు. ప్రతి ప్రశ్నను పరిశీలించాల్సిందే ఆన్లైన్ మూల్యాంకనంలో పొరపాట్లకు తావుండదు. ఆఫ్‌లైన్ విధానంలో జరిగే అనేక పొరపాట్లకు ఆన్లైన్ విధానంతో చెక్ పెట్టవచ్చు. విద్యార్థి రాసినా, రాయకపోయినా ప్రతి ప్రశ్నను అధ్యాపకుడు పరిశీలించాలి. జవాబుకు ఇచి్చన గరిష్ట మార్కులకంటే ఎక్కువ వేసినా సిస్టం తీసుకోదు. – ఎం.నీలావతిదేవి,జిల్లా ఇంటర్మిడియట్ విద్యా శాఖాధికారి, పల్నాడు జిల్లాతప్పులకు ఆస్కారం లేదు ఎనీ్టఆర్ హెల్త్ యూనివర్సిటీ, పలు విద్యా సంస్థలు ఆన్లైన్ మూల్యాంకనం అమలు చేస్తున్నాయి. ఈ విధానంలో తప్పులకు ఆస్కారం ఉండదు. ముందుగానే కొన్ని జవాబు పత్రాలను సబ్జెక్టు నిపుణులతో మూల్యాంకనం చేయిస్తాం. వాటిని అధ్యాపకులకూ పంపిస్తాం. నిపుణులు మూల్యాంకనం చేసిన విషయం అధ్యాపకుడికి తెలియదు. దీనివల్ల వారు పేపర్లు ఎలా మూల్యాంకనం చేస్తున్నారో తెలుస్తుంది. మాన్యువల్ విధానంలో పలు పొరపాట్లు జరిగేవి. ఆన్లైన్ విధానంలో ఒక్క తప్పు కూడా జరగదు. – సౌరభ్ గౌర్,ఇంటర్ విద్యా మండలి కమిషనర్ఆన్లైన్ మూల్యాంకనం ఇలా..స్కాన్ చేసిన జవాబు పత్రాలను మూల్యాంకనం చేసేందుకు అర్హతలుండి జ్ఞానభూమి పోర్టల్‌లో నమోదైన అధ్యాపకులకు పంపిస్తారు. వారు httpr://apbieeva.order.in/ వెబ్సైట్లో తమ టీచర్ యుఐడీ ద్వారా ఓటీపీ నమోదు చేసి లాగిన్ అవ్వాలి. సైట్లో ప్రతి రోజూ ఒక్కో అధ్యాపకునికి 60 జవాబు పత్రాలు ఉంటాయి. ⇒ ఉదయం 7 నుంచి సాయంత్రం 8 గంటల్లోపు ఇల్లు లేదా కళాశాలలో సొంత ల్యాప్‌టాప్/ కంప్యూటర్ లేదా కాలేజీ సిస్టంలో మాత్రమే మూల్యాంకనం చేయాలి. ఇంటర్నెట్ కేంద్రాలు, బహిరంగ ప్రదేశాల్లోని కంప్యూటర్లను వినియోగించకూడదు. ⇒ మొత్తం 25 పేజీల బుక్‌లెట్‌లో విద్యార్థి వివరాలు ఉన్న మొదటి పేజీ తప్ప, మిగిలిన 24 పేజీలు అధ్యాపకులకు ఇస్తారు. తద్వారా ఏ పేపర్ ఎవరిదో అధ్యాపకులకు తెలియదు. మొదటి పేజీలోని విద్యార్థి బార్కోడ్ నంబర్ డీ–కోడ్ అవడంతో కంప్యూటర్ తప్ప మరొకరు గుర్తించడం సాధ్యం కాదు. ⇒ కంప్యూటర్‌కు ఉన్న కెమెరా ద్వారా ప్రతి 15 నిమిషాలకు అధ్యాపకుడి లైవ్ ఫొటో బోర్డుకు చేరుతుంది. తద్వారా మూల్యాంకనం ఎవరు చేస్తున్నారో ఉన్నతాధికారులకు తెలుస్తుంది. ⇒ ఆన్లైన్లో కనిపించే జవాబు పత్రాలను ఫొటోలు తీసినా, ఇతరులకు పంపినా ఆ వివరాలు కూడా బోర్డుకు తెలిసేలా ‘ఏఐ’ టెక్నాలజీని వినియోగించారు. ⇒ ఆన్లైన్ మూల్యాంకనంలో డాష్‌బోర్డుపై ఎడమ చేతి వైపు జవాబు పత్రం, కుడివైపు గ్రిడ్‌లో ప్రశ్నల నంబర్లు, వాటికి కేటాయించిన మార్కులు ఉంటాయి. పక్కనే ఎగ్జామినర్ ఇచ్చే మార్కుల నమోదుకు బాక్స్ ఉంటుంది. అధ్యాపకుడు అందులో మార్కులు వేయాలి. ⇒ విద్యార్థి ఏదైనా ప్రశ్నకు జవాబు రాయకపోతే ఆ ప్రశ్న సంఖ్య ఆన్లైన్లో కనిపిస్తుంది. ⇒ ఒక గ్రూప్‌లో 4 ప్రశ్నలకు జవాబులు రాయాల్సి ఉంటే కొందరు విద్యార్థులు 6 ప్రశ్నలకు జవాబులు రాస్తారు. ఇలాంటప్పుడు రాసిన అన్ని జవాబులకు మార్కులు వేయాలి. ఎక్కువ మార్కులు వచి్చన 4 జవాబులనే సిస్టం తీసుకుంటుంది. దీనిద్వారా విద్యారి్థకి న్యాయం జరుగుతుంది. ⇒ మాన్యువల్ మూల్యాంకనంలో ఎగ్జామినర్లు కొన్ని ప్రశ్నలకు మార్కులు వేయడం, మరికొన్నింటిని మర్చిపోవడం, టోటల్ మార్కుల నమోదులో పొరపాట్లు జరుగుతుంటాయి. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోరినప్పుడు ఇవి బయటపడుతున్నాయి. ఆన్లైన్ విధానంలో ఏ జవాబుకైనా మార్కులు ఇవ్వకపోతే వెంటనే ‘ఎర్రర్’ చూపి ఎక్కడ మార్కులు వేయలేదో చూపుతుంది. దీంతో మార్కుల నమోదు మర్చిపోయేందుకు ఆస్కారం లేదు. ప్రతి జవాబుకు తప్పనిసరిగా మార్కులు ఇవ్వాల్సి ఉంటుంది. ⇒ మూల్యాంకనం పూర్తయిన తర్వాత అధ్యాపకుడు ఇచి్చన మార్కులను చీఫ్ ఎగ్జామినర్ మరోసారి పరిశీలిస్తారు. జవాబు పత్రాల్లో 10 శాతం పత్రాలను మరోసారి మూల్యాంకనం చేసి ఫైనల్ మార్కులను నమోదు చేస్తారు. -
ఇంటర్ సప్లిమెంటరీ.. మహేశ్ ఒక్కడు పరీక్ష రాస్తే.. 8 మంది పర్యవేక్షణ
వెల్దుర్తి (తూప్రాన్): ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష కేంద్రానికి ఒక్క విద్యార్థి హాజరైతే ఎనిమిది మంది సిబ్బంది పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి ప్రభుత్వ శ్రీ రాయరావు సరస్వతీ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బుధవారం ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్ష నిర్వహించారు. ద్వితీయ సంవత్సరం సివిక్స్ పరీక్షకు వర్షపల్లి మహేశ్ అనే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. మొత్తం ముగ్గురు విద్యార్థులు ఫెయిల్ కాగా.. ఒక్క విద్యార్థి ఫీజు చెల్లించి పరీక్ష రాశాడు. పర్యవేక్షణకు చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్, ఎగ్జామినేషన్ ఇన్చార్జి, ఇన్విజిలేటర్, సహాయ ఇన్విజిలేటర్, జూనియర్ అసిస్టెంట్, ఏఎన్‌ఎంతోపాటు కాపలాగా ఒక కానిస్టేబుల్ విధులు నిర్వర్తించారు. పరీక్ష ముగిసిన అనంతరం పరీక్ష పత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించారు. -
AP: టెన్త్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, అమరావతి: పదో తరగతి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు బుధవారం (నేడు) విడుదలయ్యాయి. రాష్ట్ర విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఉదయం 10 గంటలకు ఈ ఫలితాలను విడుదల చేశారు. 64.23 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఫలితాలను www.sakshieducation.com లో చెక్ చేసుకోవచ్చు. టెన్త్ సప్లిమెంటరీకి 2,02,648 దరఖాస్తు చేయగా.. 191800 మంది పరీక్షలు రాశారు. బాలురులో పాసైన వారి సంఖ్య 66458 ఉత్తీర్ణతా శాతం 60.83 శాతం. పాసైన బాలికల సంఖ్య 56678. ఉత్తీర్ణత శాతం 68.76 శాతం. మొత్తంగా బాలికలు, బాలురు కలుపుకుని 1,23,231 మంది పాసయ్యారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 87.52 శాతం ఉత్తీర్ణత రాగా.. పశ్చిమగోదావరి జిల్లా అత్యల్పంగా 46.66 శాతం ఉత్తీర్ణులయ్యారు. చదవండి: మహిళ అభ్యర్థన.. చలించిపోయిన సీఎం జగన్.. 4 రోజులు తిరక్కముందే రెగ్యులర్, అడ్వాన్స్ సప్లిమెంటరీతో కలుపుకుని మొత్తంగా పదవ తరగతి పరీక్షలకి 6,06,070 పరీక్షలకి హాజరు కాగా.. 5,37,491 మంది ఉత్తీర్ణతా సాధించారు. మొత్తంగా ఉత్తీర్ణతా శాతం 88.68. ఈ ఒక్క సంవత్సరమే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలలో పాసైనవారిని రెగ్యులర్ పాస్‌గా పరిగణిస్తామని, కోవిడ్ కారణంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. -
రెండు లక్షల మంది భవితకు పరీక్ష, స్పందించిన ఇంటర్ బోర్డ్ కార్యదర్శి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు కొత్త వివాదాలు రేపుతున్నాయి. 2 లక్షల మందికిపైగా విద్యార్థుల భవిష్యత్ ఏంటనే ప్రశ్న తెరపైకొచ్చింది. పట్టణాల్లో ఫలితాలు మెరుగ్గా, గ్రామాల్లో తక్కువగా రావడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఫెయిలైన విద్యార్థులు ఇప్పుడు ఫస్ట్, సెకండియర్ పరీక్షలు ఎలా రాస్తారని, పోటీ పరీక్షలకు సిద్ధమవడానికి సమయమెక్కడ ఉంటుందనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.ఫెయిలైన ప్రభావం రెండో ఏడాదిపైనా ఉంటుందేమోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఫలితాలపై విద్యార్థి సంఘాలు ఇప్పటికే ఆందోళనకు దిగాయి. ఇంటర్ బోర్డు తీరును దుయ్యబడుతూ శుక్రవారం బోర్డు కార్యాలయం వద్ద సంఘాల నేతలు ధర్నా చేశారు. ప్రభుత్వ అధ్యాపకుల నుంచీ బోర్డు తీరుపై తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఇంటర్ ఫస్టియర్‌లో 2,35,230 మంది ఫెయిలయ్యారు. వీరిలో రెండుకుపైగా సబ్జెక్టులు ఫెయిలైన వాళ్లు 63 శాతం మంది ఉన్నారు. ఆన్లైన్ బోధనకు అవకాశం లేక వీళ్లకు ప్రతికూల ఫలితాలు వచ్చినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. ‘పరీక్షల్లో ఇచ్చిన ప్రశ్నలకు సంబంధించిన చాప్టర్లే వాళ్లు వినే అవకాశం చిక్కలేదు. నెట్ సిగ్నల్స్ అందడం లేదని విద్యార్థుల నుంచీ ఫిర్యాదులొచ్చాయి’ అని మహబూబ్‌నగర్‌కు చెందిన అధ్యాపకుడు నవీన్ తెలిపారు. మంచిర్యాల, పెద్దపల్లి, సిరిసిల్ల, మహబూబ్‌బాద్, భూపాలపల్లి, మెదక్, యాదాద్రి, సూర్యాపేట, గద్వాల, నాగర్‌కర్నూల్, వికారాబాద్ జిల్లాల నుంచి ఈ ఫిర్యాదులు వచ్చాయి. గ్రేస్ మార్కులేస్తే?: ఆన్లైన్ సౌకర్యం లేక గ్రామీణ విద్యార్థులు చాలా చాప్టర్లు వినలేదని వరంగల్‌కు చెందిన అధ్యాపకుడు సతీశ్‌వర్మ తెలిపారు. ఇప్పుడీ చాప్టర్స్ మొదటి నుంచీ చదివితేనే మార్చిలోనైనా పరీక్షలు రాయగలరన్నారు. కానీ విద్యార్థులు ఇప్పటికే సెకండియర్ ప్రిపరేషన్లో ఉన్నారని మరి సమయం ఎలా ఉంటుందని అన్నారు. ‘గ్రేస్ మార్కులిస్తే కనీసం 30 శాతం మంది బయటపడే వీలుంది’ అని హైదరాబాద్‌కు చెందిన లెక్చరర్ నీలేశ్ చెప్పారు. అంతా సక్రమంగానే చేశాం, విద్యార్థులు ఆందోళనకు గురవ్వొద్దు: ఇంటర్ బోర్డ్ కార్యదర్శి ఫస్టియర్ పరీక్ష ఫలితాలు గందరగోళం రేపుతున్న నేపథ్యంలో ఇంటర్ బోర్డ్ శుక్రవారం రాత్రి స్పందించింది. విద్యార్థులను అన్ని కోణాల్లోనూ సిద్ధం చేసిన తర్వాతే పరీక్షలు నిర్వహించామని బోర్డ్ కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ పత్రికా ప్రకటన విడుదల చేశారు. లాక్డౌన్ విధించేవరకూ కొంతకాలంపాటు ప్రత్యక్ష బోధన సాగిందని గుర్తు చేశారు. ఆ తరువాత విద్యార్థుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని సిలబస్‌ను 70 శాతానికి కుదించామన్నారు. అదనంగా బేసిక్ మెటీరియల్‌ను కూడా బోర్డ్ తన వెబ్సైట్లో అందుబాటులో ఉంచిందని చెప్పారు. ఎక్కువ ఐచ్ఛికాలతో ప్రశ్నాపత్రం ఇచ్చి పరీక్షలను తేలిక చేశామని పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు నిర్వహించామని, ఎక్కడా ఎలాంటి ఫిర్యాదు రాలేదని స్పష్టం చేశారు. రీ వెరిఫికేషన్ ఫీజును తగ్గిస్తున్నాం..: ఫలితాలపై సందేహాలుంటే విద్యార్థులు రీవెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చని, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచన మేరకు రీవెరిఫికేషన్ ఫీజు కూడా 50 శాతం తగ్గిస్తున్నామని జలీల్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు జవాబు పత్రాల ప్రతిని పంపుతామన్నారు. ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి అసంతృప్తికి గురవ్వొద్దని, బాగా ప్రిపేరై వచ్చే ఏప్రిల్‌లో మళ్లీ పరీక్ష రాసుకోవచ్చని చెప్పారు. -
AP: ఇంటర్ సప్లిమెంటరీపరీక్ష ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ అడ్వాన్సు సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. ఇంటర్మీడియెట్ ఫస్టియర్, సెకండియర్ విద్యార్థులకు సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను బోర్డు నిర్వహించింది. విద్యార్థులు ‘https:bie.ap.gov.in’ ద్వారా తమ షార్ట్ మార్కుల మెమోలను డౌన్లోడ్ చేసుకోవచ్చును. ఫలితాలకు సంబంధించిన గ్రీవెన్స్‌ను ‘ourbieap@gmail.com'’ ద్వారా లేదా 391282578 వాట్సాప్ నంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ ఫలితాలను education.sakshi.com వెబ్సైట్లో చూడొచ్చు. ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాల కోసం క్లిక్ చేయండి ఈ వెబ్సైట్లలో ఫలితాలు.. www.sakshieducation.com https:bie.ap.gov.in https://examresults.ap.nic.in https://results.apcfss.in -
కొడుకుతో సైకిల్‌పై 105 కి.మీ ప్రయాణం.. ఎందుకంటే
భోపాల్ : ‘పదో తరగతి పరీక్షలు.. ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి దాదాపు 100 మైళ్లకు పైగా దూరం. లాక్‌డౌన్‌తో పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఎలాంటి రవాణా సౌకర్యాలు లేవు. తన దగ్గర బైక్, కార్ లాంటి వాహనాలూ లేవు. కానీ చదువు ఎంతో ముఖ్యమో అర్థం చేసుకున్నాడు. చేసేది ఏం లేక సైకిల్‌పై 105 కిలోమీటర్లు ప్రయాణించి పరీక్ష హాల్‌కు చేరుకున్నాడు’. ఇదంతా కొడుకు చదువు కోసం తండ్రి పడిన ఆరాటం. స్వతహాగా తను చదువుకోక పోయినా..కొడుకు అయినా ఉన్నత విద్యావంతుడు కావాలని ఓ తండ్రి చేసిన ఆలోచన. 15 ఏళ్ల కొడుకును సైకిల్‌పై కూర్చొబెట్టుకొని వంద కిలోమీటర్లు ప్రయాణించి తమ పిల్లల కోసం ఏమైనా, ఎంతైనా చేయగలమని నిరూపించాడు ఆ తండ్రి. (ఫెయిలైన విద్యార్థులంతా పాస్) ఈ సంఘటన మధ్య ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. శోభ్రామ్ అనే 38 ఏళ్ల వ్యక్తికి పదో తరగతి చదివే కొడుకు ఆశిష్ ఉన్నాడు. అతనికి సప్లిమెంటరీ పరీక్షలు దగ్గర పడ్డాయి. అయితే ప్రస్తుత కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా బస్సుతో సహా ఎలాంటి రవాణా మార్గాలు అందుబాటులో లేవు. కొడుక్కి ఒక సంవత్సరం వృథా కావొద్దని ఆలోచించిన శోభ్రామ్ కొడుకు పరీక్షల కోసం ఆశిష్‌ను సైకిల్‌పై ఎక్కించుకొని 105 కిలోమీటర్ల దూరంలో ఉన్న ధార్ పట్టణానికి తీసుకెళ్లాడు. అక్కడ పరీక్ష రాయించి తిరిగి ఇంటికి తీసుకొచ్చాడు. अपने बेटे को परीक्षा दिलवाने ये पिता साइकिल से 3 दिनों का सफर तय करके धार पहुंचे, शुभकामनाएं अब बारी बेटे की है! @ChouhanShivraj @OfficeOfKNath @UmangSinghar @ndtvindia @ndtv #ExamResults pic.twitter.com/QHg6rEqJGr — Anurag Dwary (@Anurag_Dwary) August 19, 2020 ఈ విషయంపై శోభ్రామ్ మాట్లాడుతూ..‘ప్రస్తుతం రవాణా సౌకర్యాలు అందుబాటులో లేవు. మాకు డబ్బు, ద్విచక్ర వాహనం లేదు. ఈ సమయంలో ఎవరూ సాయం చేయరు. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. నేను ఇలా చేసి ఉండకపోతే నా కొడుక్కి ఒక ఏడాది వృథా అయ్యేది. ఒక రోజు ముందు బయల్దేరి మంగళవారం ధార్ చేరుకున్నాము.. మా వెంట అవసరమైన ఆహార వస్తువులు తీసుకెళ్లాము’ అంటూ పేర్కొన్నారు. శోభ్రామ్ తన కొడుకు కోసం ఎంతో మంచి పని చేశాడని.. ‘శభాష్ శోభ్రామ్’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఒక్క క్షణం.. అందరినీ పిచ్చోళ్లను చేశాడు) -
ఇంటర్లో గ్రేస్ మార్కులు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆయా సబ్జెక్టుల్లో కనీస పాస్ మార్కులను (గ్రేస్ మార్కులు) ఇచ్చే అవకాశం ఉంది. దీంతో పాటు పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ బోర్డు ప్రతిపాదనలు పంపించినా... కనీస పాస్ మార్కులు ఇచ్చేందుకే ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది. ప్రస్తుతం కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఇబ్బందికరమన్న ఆలోచన ప్రభుత్వ వర్గాల్లో ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా మూడు ప్రతిపాదనలను ప్రభు త్వానికి పంపించింది. అందులో ప్రభుత్వం ఏ ప్రతిపాదనకు ఓకే అంటే దానిని అమలు చేయాలని బోర్డు అధికారులు భావిస్తున్నారు. (నిర్లక్ష్యమే అసలైన మహమ్మారి) వార్షిక పరీక్షల్లో ఫెయిల్ అయిన 3,29,340 మంది విద్యార్థులు అందరికీ పరీక్షలు నిర్వహించేలా ప్రతిపాదించారు. అందరికీ పరీక్షల నిర్వహణ కుదరదనుకుంటే 1,67,630 మంది ప్రథమ సంవత్సర విద్యార్థులను పక్కన పెట్టి... 1,61,710 మంది ద్వితీయ సం వత్సర విద్యార్థులకైనా పరీక్షలు నిర్వహించా లని మరో ప్రతిపాదన చేశారు. ఇక ఈ రెండూ వద్దనుకుంటే విద్యార్థులకు కనీస పాస్ మార్కులను ఇచ్చి ఉత్తీర్ణులను చేసే ప్రతిపాద నను పంపించారు. ఆ మూడు ప్రతిపాదన లతో కూడిన ఫైలు ప్రస్తుతం సీఎం ఆమోదం కోసం పంపించారు. అయితే గతంలో ఉన్నత స్థాయిలో జరిగిన భేటీలో ప్రస్తుత కరోనా పరి స్థితుల్లో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవ చ్చనే అభిప్రాయానికే అధికారులు వచ్చారు. 10 నుంచి 20 వరకు గ్రేస్ మార్కులు కలపాలనే ఆలోచన చేసినా... అప్పటికీ పాస్ కాని వారు కోర్టులకు వెళితే న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొనాల్సి వస్తుందనే భావనతో అందరికీ పాస్ మార్కులు వేయాలనే ప్రతిపాదన వైపే మొగ్గారు. మొత్తం మూడు ప్రతిపాదనలతో సీఎం ఆమోదానికి ఫైలును పంపించారు. సీఎం ఓకే చెప్పాక ఇంటర్ బోర్డు తదుపరి కార్యాచరణను చేపట్టనుంది. ఆర్ట్స్, భాషా సబ్జెక్టుల్లో విద్యార్థులకు 100 మార్కులకుగాను 35 మార్కులు వేసి పాస్ చేయనున్నారు. మ్యాథమెటిక్స్‌లో గరిష్ట మార్కులు 75కు గాను 27 మార్కులను వేసి పాస్ చేస్తారు. కెమిస్ట్రీ, ఫిజిక్స్, బోటనీ, జువాలజీ వంటి సబ్జెక్టుల్లో 60 మార్కులకు 21 మార్కులు వస్తే పాస్ కాబట్టి ఆ మార్కులను వేసి విద్యార్థులందరిని పాస్ చేయనున్నారు. మరోవైపు ఇపుడు విద్యార్థులు మార్చిలో పాస్ అయినట్లు ఇవ్వాలా? జూన్/జూలైలో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ కింద పాస్ అయినట్లు ఇవ్వాలా? అన్న విషయంలోనూ నిర్ణయాన్ని ప్రభుత్వానికే వదిలేశారు. -
‘ఓపెన్’ విద్యార్థులకు జూలైలోనే సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: ఓపెన్ స్కూల్ పదో తరగతి, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను అక్టోబర్‌లో కాకుండా జూలైలో నిర్వహించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీనివల్ల సప్లిమెంటరీ పరీక్షలో ఉత్తీర్ణులయ్యే విద్యార్థులకు సంవత్సరం వృథా కాకుండా ఉంటుంది. అడ్మిషన్ నెంబరు ఆధారంగా పరీక్ష ఫీజు మీసేవా, ఏపీఆన్‌లైన్‌లో చెల్లించాలని డీఈఓ జనార్దనాచార్యులు, ఓపెన్ స్కూల్ కో–ఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు తెలిపారు. థియరీ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు పదో తరగతికి రూ.100, ఇంటర్‌కు రూ.150, ప్రాక్టికల్ పరీక్షలకు ఒక్కో సబ్జెక్టుకు పదో తరగతికి రూ.50, ఇంటర్‌కు రూ.100 చెల్లించాలన్నారు. ఈనెల 11 నుంచి 16 వరకు అపరాధ రుసుం లేకుండా చెల్లించవచ్చన్నారు. రూ.25 అపరాధ రుసుంతో 17, 18 తేదీల్లో, రూ.50 అపరాధ రుసుంతో 19, 20 తేదీల్లో చెల్లించవచ్చన్నారు. -
పరీక్ష.. ఒక్కడి కోసం 12 మంది!
సాక్షి, హుజురాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష సెంటర్లో బుధవారం నిర్వహించిన ఎస్సెస్సీ సప్లిమెంటరీ హిందీ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. ఉదయం 9.30గంటల నుంచి 12.45 వరకు జరిగిన హిందీ పరీక్షకు మొత్తం ఏడుగురు విద్యార్ధులు హాజరు కావాల్సి ఉండగా జమ్మికుంట విద్యోదయ పాఠశాలకు చెందిన కోండ్ర ప్రణయ్ హాజరయ్యాడు. కాగా ఒక్కడి కోసం ఛీప్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారి, క్లర్క్, ఇన్విజిలేటర్, అటెండర్, వైద్యశాఖ ఉద్యోగి, ఇద్దరు పోలీసులు విధులు నిర్వహించారు. తనిఖీ కోసం ఇద్దరు చొప్పున కరీంనగర్ నుంచి రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వచ్చాయి. ఒక్క విద్యార్థి పరీక్ష రాయగా అధికారులు, సహాయక సిబ్బంది కలిపి ఓవరాల్‌గా 12 మంది విధులు నిర్వహించడం గమనార్హం. -
నేటి నుంచి ఓపెన్ స్కూల్ సప్లిమెంటరీ పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్: సార్వత్రిక విద్యా పీఠం(ఓపెన్ స్కూల్) ద్వారా పదో తరగతి, ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ నెల 29 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. అనంతపురం, కళ్యాణదుర్గం, ధర్మవరం, కదిరి, పెనుకొండలో పరీక్ష కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఇంటర్æ పరీక్షలకు 2,463 మంది, పదో తరగతి పరీక్షలకు 1,551 మంది అభ్యర్థులు హాజరవుతారు. ఐదు ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం ప్రశ్నపత్రాలను కట్టుదిట్టమన బందోబస్తు మధ్య తరలించారు. సమీప పోలీస్స్టేషన్లలో భద్రపరిచి పరీక్ష రోజు కేంద్రానికి తీసుకెళ్తారు. పరీక్షల్లో కాపీయింగ్ ప్రోత్సహించవద్దని డీఈఓ లక్ష్మీనారాయణ, ఓపెన్ స్కూల్ కోఆర్డినేటర్ గంధం శ్రీనివాసులు సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఉంటుందని.. ఎవరైనా సమస్యలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రశ్నాపత్రాలను నిర్ణీత సమయంలో మాత్రమే తెరవాలని సూచించారు. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షలకు నోటిఫికేషన్ విడుదల
ఎస్కేయూ: ఎస్కేయూ పరిధిలోని బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ మొదటి, రెండు, మూడేళ్ల సప్లమెంటరీ పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూషన్ ప్రొఫెసర్ శ్రీరాములు ఓ ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 14 దరఖాస్తు చివరి తేదీగా నిర్ణయించామన్నారు. రూ.150 అపరాధ రుసుంతో 18 వరకూ, రూ.500 అపరాధ రుసుంతో సెప్టెంబర్ 22వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవడానికి వెసులుబాటు కల్పించాలన్నారు. కర్నూలు జిల్లా విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మంగళవారం వెల్లడించారు. అనంతపురం నగరంతో పాటు అన్ని మునిసిపల్ పట్టణాలు, కొత్తచెరువులో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,032 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. -
నేటి నుంచి ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు
– జిల్లాలో 80 పరీక్ష కేంద్రాల ఏర్పాటు - సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు కర్నూలు సిటీ: ఇంటర్మీడియట్ సçప్లమెంటరీ పరీక్షలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి ఇంటర్ బోర్డు ప్రాంతీయ కార్యాలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. నేటి నుంచి 23వ తేది వరకు జరగనున్న పరీక్షలకు జిల్లాలో మొత్తం 80 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పరీక్ష కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉంటుంది. జిల్లాలో మొదటి సంవత్సర పరీక్షలకు 29,272 మంది, రెండో సంవత్సర పరీక్షలకు 9549 మంది విద్యార్థులు హాజరుకానున్నారు. సెంటర్ల సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించాలని ఇప్పటీకే అధికారులు ఆదేశాలు ఇచ్చారు. జిల్లాలో 12 సమస్యాత్మకమైన కేంద్రాలు ఉన్నట్లు గుర్తించారు. 11 కేంద్రాలకు సకాలంలో బస్సుల సౌకర్యం కల్పించేందుకు ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బోర్డు అధికారులు చర్యలు తీసుకున్నారు. పరీక్ష సమయంలో కరెంట్ కట్ కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులను కోరారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్ ఒకరు, డిపార్ట్మెంటల్ అధికారి ఒకరు ఉంటారు. ఆయా కేంద్రాల్లో విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఇన్విజిలేటర్లను ఆ కేంద్ర పర్యవేక్షకులు నియమించుకుంటారు. -
డిగ్రీ సప్లిమెంటరీ పరీక్షల బహిష్కరణ
హైదరాబాద్: డిగ్రీ, పీజీ సప్లిమెంటరీ పరీక్షలను బహిష్కరిస్తున్నట్లు తెలంగాణ ప్రైవేట్ డిగ్రీ, పీజీ కాలేజీల యజమాన్యాల సంఘం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్ మెంటు బకాయిలు చెల్లించేవరకూ డిగ్రీ, పీజీ పరీక్షలకు సహకరించమని తేల్చి చెప్పింది. -
అక్టోబర్ 1 నుంచి ‘ఓపెన్’ సప్లిమెంటరీ ఎగ్జామ్స్
సంగారెడ్డి మున్సిపాలిటీ: ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాటు చేసినట్లు డీఈఓ రమేష్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అక్టోబర్ 1 నుంచి 14 వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ప్రతిరోజు ఉదయం 9.30 గంటల నుంచి 12.30 వరకు, మధ్యాహ్న 2 గంటల నుంచి 5 వరకు పరీక్షలు ఉంటాయని చెప్పారు. ఎనిమిది ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటుచేశామన్నారు. ఇంటర్ పరీక్షలకు 1371 మంది, 10వ తరగతికి 1912 మంది విద్యార్థులు హాజరుకానున్నారని తెలిపారు. -
‘పది’ తప్పిన విద్యార్థులపై దృష్టిసారించాలి
శంషాబాద్ రూరల్: ఇక్కడి పాఠశాలలో ఈసారి ఎంతమంది విద్యార్థులు పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయ్యారు.. వారంతా సప్లిమెంటరీ పరీక్షలు రాశారా.. వారంతా చదువుకు దూరంకాకుండా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు సూచించారు. మండల పరిధిలోని పాల్మాకుల వద్ద ఉన్న తెలంగాణ మోడల్ స్కూలు ఆవరణలో హరితహారంలో భాగంగా శనివారం ఎమ్మెల్యే ప్రకాష్‌గౌడ్‌తో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులతో కలెక్టర్ కాసేపు ముచ్చటించారు. పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు ఎలాగో పైచదువులకు వెళ్తారు.. ఫెయిలైన వారు.. చదువు కొనసాగించేలా వారి తల్లిదండ్రులతో మాట్లాడి ఆ దిశగా చర్యలు తీసుకోవాలని కలెక్టరు సూచించారు. మొక్కల పెంపకంలో విద్యార్థుల పాత్ర కీలకమని తెలిపారు. పాఠశాలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని, బస్సు సౌకర్యం లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని ఉపాధ్యాయులు, స్థానికులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. పాఠశాలలో ఎన్సీసీ తరగతులు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరారు. దీంతో స్పందించిన కలెక్టర్.. ఇక్కడ సర్వే చేరుుంచి బోరు వేయడానికి చర్యలు తీసుకుంటామని, ఆర్టీసీ అధికారులతో మాట్లాడి బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. పాఠశాలలోని సమస్యలను తనకు ఎస్ఎంఎస్ ద్వారా పంపించాలని, ఒక వేళ సమస్యలు పరిష్కారం కాకుంటే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. పాఠశాలలో కిచెన్ షెడ్, ఫర్నీచర్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత, ఉపసర్పంచ్ హరీందర్‌గౌడ్, ఎంపీపీ చెక్కల ఎల్లయ్య, నాయకులు రమేష్, వెంకటేష్‌గౌడ్, సుభాష్, ఉమ్లానాయక్, తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ విద్యార్థిని అదృశ్యంపై కలకలం
అనంతపురం: అనంతపురంలోని గుత్తి రోడ్డులోని ఇంటర్ పరీక్ష కేంద్రానికి వెళ్లిన అమ్మాయి అదృశ్యమైంది. అయితే ఆ విద్యార్థిని హాల్‌టికెట్ గుంతకల్లు రైల్వే ప్లాట్‌ఫారంపై లభించడం కలకలం రేపుతోంది. బ్రహ్మసముద్రం మండలం పోలేపల్లికి చెందిన రాజన్న కూతురు గీత అనంతపురం శారదనగర్‌లోని ఓ ప్రైవేట్ రెసిడెన్షియల్ కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివింది. ఫెయిల్ కావడంతో ప్రస్తుతం సప్లిమెంటరీ పరీక్షలు రాస్తోంది. గతంలో చదివిన కళాశాలలోనే ప్రస్తుతం ఉంటోంది. బుధవారం ఉదయం పరీక్ష కేంద్రానికి ఆటోలో వెళ్లింది. పరీక్ష ముగిసిన తర్వాత తనకు ఫోన్ చేస్తే వచ్చి తీసుకెళ్తానని చెప్పిన ఆటోడ్రైవర్ తన సెల్ నంబర్ ఇచ్చాడు. పుస్తకం వెనుకవైపు నంబర్ రాసుకుంది. అయితే మధ్యాహ్నం ఒంటి గంటకు ఆటో డ్రైవర్‌కు ఫోన్‌కాల్ వచ్చింది. ‘గీత అనే అమ్మాయి హాల్ టికెట్, ఓ పుస్తకం గుంతకల్లు రైల్వే స్టేషన్లో పడి ఉన్నాయని’ చెప్పారు. ఉదయం పరీక్ష కేంద్రం వద్ద వదిలిపెట్టిన అమ్మాయి గుంతకల్లుకు ఎలా వెళ్లిందని కంగారుపడ్డ ఆటో డ్రైవరు నేరుగా కళాశాలకు వెళ్లి ప్రిన్సిపల్ సంజీవప్రసాద్‌కు విషయం చెప్పాడు. ఆయన తిరిగి గుంతకల్లు నుంచి వచ్చిన సెల్‌నంబర్‌కు ఫోన్ చేసి వివరాలు కనుగొన్నారు. విద్యార్థిని అదృశ్యమైందని భావించి నేరుగా అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఉదయం పరీక్ష కేంద్రం వద్ద ఆటో డ్రైవర్ వదిలిపెట్టిన తర్వాత గుంతకల్లుకు ఎలా వెళ్లింది, ఎవరైనా మాయమాటలు చెప్పి పిల్చుకెళ్లారా? స్నేహితురాళ్లతో కలసి వెళ్లిందా, లేక ఇతర బలమైన కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు కూపీ లాగుతున్నారు. గీత తల్లిదండ్రులు ఉపాధి కోసం బెంగళూరుకు వలస వెళ్లారని సీఐ రాఘవన్ తెలిపారు. -
24 నుంచి ఇంటర్ సప్లిమెంటరీ
హైదారాబాద్: ఈ నెల 24 నుంచి 30 వరకు తెలంగాణ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ అశోక్ తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు ఇంటర్ ఫస్టియర్, మధ్యాహ్నం 2:30 నుంచి 5:30 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. -
జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తప్పిన విద్యార్థుల కోసం జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు గడువు జూన్ 2 వరకు ఉంటుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. బాలురు 91.15 శాతం మంది ఉత్తర్ణత సాధించగా, బాలికలు 91.71 శాతం మంది పాసవడం విశేషం. మొత్తమ్మీద 1.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. -
ఇంటర్ ప్రైవేటు విద్యార్థులకు హాజరు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రాయాలనుకునే ప్రైవేటు ఆర్ట్స్ విద్యార్థులకు హాజరు మినహాయింపు సదుపాయం కల్పిస్తున్నట్లు ఇంటర్మీడియెట్ బోర్డు శనివారం ప్రకటి ంచింది. హాజరు మినహాయింపు కోరుకునే అభ్యర్థులు రూ. 500 ఫీజు చెల్లించి ఏప్రిల్ 10వ తేదీ లోగా ఇంటర్ బోర్డు సెక్రటరీకి దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలకు సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు సరిగా లేకున్నా, వివరాలు అసంపూర్తిగా ఉన్న దరఖాస్తులను తిరస్కరిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి చదివిన వారు తప్పనిసరిగా మైగ్రేషన్ సర్టిఫికెట్ జతపరచాల్సి ఉంటుంది. 10వ తరగతి పాసై ఏడాది గడిచిన అభ్యర్థులు నేరుగా ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు, రెండేళ్లు గ్యాప్ ఉన్న వారు ఒకేసారి ఫస్టియర్, సెకండియర్ పరీక్షలు రాయవచ్చు. ఇంటర్ బైపీసీతో పరీక్షలు రాసిన విద్యార్థులు మేథమేటిక్స్ సబ్జెక్టును కూడా రాయాలనుకుంటే దరఖాస్తు చేసుకోవచ్చు. www.bie.telangana.gov.in వెబ్సైట్ నుంచి దరఖాస్తు ఫారాలను విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. -
‘ఓపెన్’ పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సార్వత్రిక విద్యా పీఠం (ఓపెన్) ఇంటర్, పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 18 నుంచి 28వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లనూ అధికారులు పూర్తిచేశారు. 1,931 మంది విద్యార్థులు హాజరయ్యే ఇంటర్ పరీక్షలకు ఏడు, 2,852 మంది విద్యార్థులు హాజరయ్యే పదో తరగతి పరీక్షలకు పది పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. విజయనగరం, పార్వతీపురం, ఎస్.కోట ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు సప్లిమెంటరీ పరీక్షల ప్రశ్నత్రాలు ప్రత్యేక వాహనంలో శనివారం జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. వాటిని డీఈఓ జి. కృష్ణారావు, పరీక్షల విభాగం అసిస్టెంట్ కమిషనర్ సాయిబాబా, ఓపెన్ స్కూల్ జిల్లా కో ఆర్డినేటర్ లక్ష్మణరావు, రూట్ ఆఫీసర్లు పరిశీలించి స్ట్రాంగ్ రూమ్‌లో భద్రపరిచారు. ఇక్కడ నుంచి సెంటర్ల వారీగా రూట్ ఆఫీసర్లు, పోలీసు ఎస్కార్ట్ సహకారంతో ప్రత్యేక వాహనాల్లో ఆయా కేంద్రాల సమీపంలోని పోలీస్ స్టేషన్లకు తరలిస్తారు. పకడ్బందీగా నిర్వహించాలి: వీడియో కాన్ఫరెన్స్ ద్వారా డీఈఓకి ఆదేశాలు ఓపెన్ స్కూల్ పది, ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని డీఈఓ జి.కృష్ణారావుకు ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలొచ్చాయి. ఈ మేరకు శనివారం వీడియోకాన్ఫెరెన్స్ ద్వారా నిర్వహించిన సమీక్ష సమావేశంలో పరీక్షల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడా మాల్‌ప్రాక్టీస్ జరగకుండా చూడాలన్నారు.