జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో తప్పిన విద్యార్థుల కోసం జూన్ 18 నుంచి టెన్త్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. సప్లిమెంటరీ పరీక్షలకు ఫీజు చెల్లించేందుకు గడువు జూన్ 2 వరకు ఉంటుంది. బుధవారం సాయంత్రం 4 గంటలకు ఏపీ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాస రావు పదో తరగతి ఫలితాలను విడుదల చేశారు. బాలురు 91.15 శాతం మంది ఉత్తర్ణత సాధించగా, బాలికలు 91.71 శాతం మంది పాసవడం విశేషం. మొత్తమ్మీద 1.42 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.