అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మంగళవారం వెల్లడించారు. అనంతపురం నగరంతో పాటు అన్ని మునిసిపల్ పట్టణాలు, కొత్తచెరువులో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,032 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్‌లను నియమించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు.