today onwards
-
నేడు ఆన్లైన్ విధానం ప్రారంభం
అనంతపురం సెంట్రల్: రవాణాశాఖలో డ్రైవింగ్ లైసెన్స్‌లు ఆన్లైన్ ద్వారా తీసుకునే విధానాన్ని శనివారం ప్రారంభిస్తున్నట్లు అనంతపురం ఉపరవాణా కమిషనర్ సుందర్‌వద్దీ తెలిపారు. ఎస్కేయూ సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలలో ఎల్ఎల్ఆర్ మేళా నిర్వహించి విద్యార్థులకు తొలిసారిగా ఆన్‌లైన్‌ద్వారా ఎల్‌ఎల్‌ఆర్‌లు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. సదరు కళాశాలతో పాటు ఇతర కళాశాల విద్యార్థులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. శనివారం నుంచి డ్రైవింగ్ లైసెన్స్‌లకు ఆన్లైన్లోనే దరఖాస్తు చేసుకోవాలన్నారు. తొలుత ఆన్లైన్లో 24 గంటల్లోనే ఎల్‌ఎల్‌ఆర్‌లు మంజూరు చేస్తామని వివరించారు. -
నేడు నుంచే ఆన్లైన్ ద్వారా ఎల్ఎల్ఆర్
అనంతపురం సెంట్రల్: ఆన్లైన్లో డ్రైవింగ్ లైసెన్స్‌లకు సంబంధించి ఆన్లైన్లో ఎల్‌ఎల్‌ఆర్‌లు పొందే నూతన విధానాన్ని శుక్రవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు ఉపరవాణా కమిషనర్ సుందర్‌వద్దీ ఒక ప్రకటనలో తెలిపారు. ఇటుకలపల్లి సమీపంలోని అనంతలక్ష్మి ఇంజినీరింగ్ కళాశాలల్లో విద్యార్థులకు ఆన్లైన్ ద్వారా ఎల్ఎల్ఆర్ మంజూరు చేసి నూతన ఆన్లైన్ విధానాన్ని ప్రారంభిస్తున్నట్లు వివరించారు. జిల్లాలోని ఇతర కళాశాల విద్యార్థులు కూడా ఈ మేళా పాల్గొని ఎల్ఎల్ఆర్ పొందాలని కోరారు. -
గూగూడుకు బ్రహ్మోత్సవ శోభ
నేటి నుంచి కుళ్లాయిస్వామి ఉత్సవాలు రాత్రికి స్వామివారి ప్రథమ దర్శనం ఏర్పాట్లు పూర్తిచేసిన ఆలయ అధికారులు నార్పల: రాష్ట్రంలోనే మొహర్రం ఉత్సవాలకు ప్రసిద్ధి చెందిన నార్పల మండలం గూగూడు కుళ్లాయిస్వామి ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం ఏటా మొహర్రం నెలలో ఈ ఉత్సవాలను హిందూ, ముస్లింలు ఐక్యమత్యంతో అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. 13 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో ఆలయ ప్రధాన అర్చకుడు హుస్సేనప్ప పాతెహ చదివింపులు నిర్వహించనున్నారు. ఇక స్వామివారి పంజాలను ప్రత్యేకంగా అలంకరించి పురవీధుల్లో ఉత్సవమూర్తులను తిరుమల కొండారెడ్డి వంశీకులు ఊరేగింపు నిర్వహించనున్నారు. క్షేత్ర ప్రాశస్త్యం పూర్వం నార్పల సమీపంలోని ఓ ప్రాంతంలో గుహుడు అనే మహర్షి ఓ ఆశ్రమం ఏర్పాటు చేసుకుని శ్రీరాముని కోసం తపస్సు చేయగా...అరణ్యవాసం వెళుతున్న శ్రీరాముడు సీతా, లక్ష్మణ సమేతుడై గుహుడి ఆశ్రమం సందర్శించి అతని ఆతిథ్యం స్వీకరించాడని పురాణాలు చెబుతున్నాయి. వనవాసం పూర్తి చేసుకున్న తర్వాత అయోధ్యకు వెళ్లే సమయంలో తిరిగి ఆశ్రమానికి వస్తానని శ్రీరాముడు మాట ఇవ్వగా...అప్పటి నుంచి గుహుడు అక్కడే తపస్సు చేస్తూ గడిపాడట. అయితే శ్రీరాముడి వనవాసం పూర్తయినా తన ఆశ్రమానికి రాకపోవడంతో కలత చెందిన గుహుడు ఆత్మార్పణం చేసుకునేందుకు ఓ అగ్నిగుండం ఏర్పాటు చేసుకుని అందులో దూసేందుకు సిద్ధమవగా...తన దూరదృష్టితో ఇది గమనించిన శ్రీరాముడు...ఆంజనేయుడిని గుహుడి దగ్గరకు పంపి తాను వస్తున్న వర్తమానం అందించాడని పురాణాలు చెబుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం సీతా, లక్ష్మణ సమేతుడైన శ్రీరాముడు అయోధ్యకు వెళ్తూ వెళ్తూ గుహుడి ఆశ్రమాన్ని సందర్శించి ఆతిథ్యం స్వీకరించాడట. ఆ తర్వాత శ్రీరాముడు అయోధ్యకు బయలుదేరి వెళ్లగా... ఆంజనేయస్వామి అక్కడే నిలిచిపోగా...ఆయనకు గుడికట్టించారని పురాణాలు చెబుతున్నాయి. గుహుడు ఆత్మార్పణం కోసం సిద్ధం చేసుకున్న అగ్నిగుండమే నేడు ఆలయం ఎదుట ఉన్న గుండమని భక్తులు చెబుతున్నారు. అందుకే ఇక్కడివచ్చే భక్తులు తప్పకుండా ఈ గుండం చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. గుహుడు తపస్సు చేసిన ఈ ప్రాంతమే కాలక్రమంలో గూగూడుగా మారిందని ఇక్కడి వారు చెబుతున్నారు. ఉత్సావాలు సాగేదిలా... గూగూడు కుళ్లాయిస్వామి బ్రహోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి 9 గంటలకు పీర్ల పెట్టెలో భద్రపరిచిన కుళ్లాయిస్వామి పంజాను బయటకు తీసి చందనం, గంధంతో శుద్ధిచేస్తారు. సంప్రదాయ పూజల అనంతరం భక్తులకు ప్రథమ దర్శనం చేయిస్తారు. - 23వ తేదీ స్వామివారి నిత్యపూజ నివేదన, - 24న అగ్నిగుండం ఏర్పాటు, - 25న కుళ్లాయిస్వామి పీర్లను చావిడిలో నిలుపుట, - 26న నిత్యపూజ నివేదన, - 27న ఐదవ సరిగెత్తు, - 28న నిత్యపూజ నివేదన, - 29న ఏడవ చిన్నసరిగెత్తు, రాత్రికి పీర్ల మెరవణి, - 30న నిత్యపూజ నివేదన, విడిదినం ప్రత్యేక పూజలు, - అక్టోబర్ నెల 1వ తేదీన పెద్ద సరిగెత్తు, రాత్రికి గ్రామోత్సవం, అగ్నిగుండ ప్రవేశం, - 2న పీర్లు జలధి కార్యక్రమం - 3న సాయంకాలం కుళ్లాయిస్వామి మూలవిరాట్ చివరి దర్శనంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఈఓ ఎల్ మోహన్‌రెడ్డి తెలిపారు. గూగూడు ఉత్సవాలను తిలకించడానికి రాష్రం నుంచే కాకుండా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, గోవా రాష్ట్రాల నుంచి హిందూ, ముస్లిం భక్తులు పెద్ద ఎత్తున రానుండటంతో భక్తులు ఎలాంటి అసౌకర్యాలకు గురికాకుండా ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
నేటి నుంచి ఎస్కేయూ క్రీడా పోటీలు
అనంతపురం సప్తగిరిసర్కిల్: శ్రీకృష్ణ దేవరాయ విశ్వవిద్యాలయం అంతర్ కళాశాలల గ్రూప్(బి) క్రీడా పోటీలు అనంతపురంలోని ఎస్ఎస్బీఎన్ కళాశాలలో బుధవారం నుంచి ప్రారంభం కానున్నట్లు ఆ కళాశాల ఫిజికల్ డైరెక్టర్ చంద్రమోహన్ తెలిపారు. బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్, షటిల్ బ్యాడ్మింటన్, బాక్సింగ్ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ పోటీల ప్రారంభోత్సవానికి ఎస్కేయూ రిజిస్ట్రార్ సుధాకర్‌బాబు హాజరుకానున్నారని అన్నారు. -
నేటి నుంచి ‘ఐద్వా’ ఆధ్వర్యంలో జీపుజాతా
అనంతపురం అర్బన్: జనావాసాల మధ్య మద్యం దుకాణాలు తొలగించాలని కోరుతూ అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) పోరుకు సిద్ధమైంది. బుధవారం నుంచి మూడు రోజులపాటు జిల్లాలో జీపు జాతా ద్వారా ప్రజలను చైతన్యపరచనుంది. మంగళవారం నగరంలోని కార్యాలయంలో ఐద్వా జిల్లా అధ్యక్షకార్యదర్శులు లక్ష్మీదేవి, సావిత్రి మాట్లాడారు. జనావాసాల మధ్య మద్యం దుకాణాలు ఏర్పాటు చేయడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలు వీటిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికైనా జనావాసాల మధ్యనున్న దుకాణాలను తొలగించకపోతే ఐద్వా ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు దిగుతామని హెచ్చరించారు. నేడు నగరంలోని శ్రీశ్రీ నగర్లో జీపుజాతా ప్రారంభమవుతుందన్నారు. 7, 8 తేదీల్లో మునిసిపాలిటీల్లో జీపు జాతా కొనసాగుతుందన్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకోవాలనే డిమాండ్‌తో ఈ నెల 11న కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్నామని, 15న చలో విజయవాడ కార్యక్రమం తలపెట్టామన్నారు. సమావేశంలో ఐద్వా నగర అధ్యక్ష, కార్యదర్శులు యమున, చంద్రిక, నాయకురాలు రామాంజినమ్మ పాల్గొన్నారు. -
నేటి నుంచి ఆకాశవాణిలో కొత్త కార్యక్రమాలు
అనంతపురం కల్చరల్: ఆకాశవాణిలో శుక్రవారం నుండి సరికొత్త కార్యక్రమాలను ప్రారంభిస్తున్నట్లు ఆకాశవాణి అసిస్టెంట్ డైరెక్టర్ వెంకటరాణి ఓ ప్రకటనలో తెలిపారు. మీతో ఆకాశవాణి, విను వినిపించు తదితర కార్యక్రమాలను ప్రసారమవుతాయన్నారు. ప్రతి ఆదివారం ఉదయం 9.30 గంటలకు దిక్సూచి, ప్రతి మంగళవారం ఉదయం 9.30 గంటలకు మన ఆలయాలు, ప్రతి శుక్రవారం ఉదయం 9.30 గంటలకు మధురం మధురం ఈ సమయం, ప్రతి శనివారం ఉదయం 9.30 గంటలకు స్మృతిపథం, సోమవారం, బుధవారం సాయంత్రం 5.30 గంటలకు మీతో ఆకాశవాణి, ప్రతి శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు విను వినిపించు కార్యక్రమాలతో పాటు ప్రతి ఆదివారం రాత్రి 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రోతల ఉత్తరాల కార్యక్రమాలు ప్రసారమవుతాయని చెప్పారు. -
నేటి నుంచి రెండో దఫా కౌన్సెలింగ్
జేఎన్టీయూ: ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో దఫా కౌన్సెలింగ్ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కేశవచంద్ర తెలిపారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల, అనంతపురం, ఎస్కేయూ హెల్ప్‌లైన్ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావచ్చన్నారు. 22వ తేదీతో కౌన్సెలింగ్ ముగుస్తుందన్నారు. ఇప్పటికే తొలి దఫా ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనవారు, రెండో దఫా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సిన అవసరం లేదన్నారు. అవసరం అనుకుంటే కేవలం వెబ్ ఆప్షన్లు మాత్రమే మార్చుకోవచ్చునని సూచించారు. 22 వరకు వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి షెడ్యూల్‌ను నిర్ధేశించారని పేర్కొన్నారు. -
నేటి నుంచి అండర్–19 క్రికెట్ పోటీలు
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే అండర్–19 బాలికల అంతర్ జిల్లాల క్రికెట్ పోటీలు శనివారం నుంచి ప్రారంభమవుతాయని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి కేఎస్ షాహబుద్దీన్ తెలిపారు. ఈ క్రీడా పోటీలను అనంత క్రీడా గ్రామంలో నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 15 నుంచి 20 వరకు పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రీడా పోటీల్లో అనంతపురం, వైఎస్సార్ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు జిల్లాలకు చెందిన అండర్–19 బాలికల జట్లు తలపడతాయన్నారు. ఈ క్రీడా పోటీలను అనంత క్రీడా గ్రామంలోని బీ క్రీడా మైదానం, విన్సెంట్ క్రీడా మైదానాల్లో నిర్వహిస్తామని తెలిపారు. అనంత క్రీడా గ్రామానికి ఇప్పటికే ఆయా జిల్లాలకు చెందిన బాలికల జట్లు చేరుకున్నాయన్నారు. మ్యాచ్‌ల వివరాలు తేది తలపడే జట్లు 15–07–2017 కడప–కర్నూలు 15–07–2017 అనంతపురం–నెల్లూరు 16–07–2017 చిత్తూరు–నెల్లూరు 16–07–2017 అనంతపురం–కర్నూలు 18–07–2017 అనంతపురం–కడప 18–07–2017 చిత్తూరు–కర్నూలు 19–07–2017 నెల్లూరు–కర్నూలు 19–07–2017 కడప–చిత్తూరు 20–07–2017 చిత్తూరు–అనంతపురం 20–07–2017 కడప–నెల్లూరు -
నేటి నుంచి వస్తు సేవల పన్ను అమలు
అనంతపురం : విలువ ఆధారిత పన్ను చట్టం, 2005 (వ్యాట్) స్థానంలో వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) చట్టం శనివారం నుంచి అమలులోకి రానుంది. వాణిజ్య పన్నుల శాఖ అనంతపురం డివిజన్ పరిధిలోని రిజిష్టర్ డీలర్లకు కొత్త చట్టంపై అవగాహన కల్పించేందుకు, వారి సందేహాలను నివృత్తి చేయడానికి అధికారులు చర్యలు చేపట్టారు. సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు : డివిజన్, సర్కిల్ పరిధిలోని జీఎస్టీ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఆయా కేంద్రాల్లో లేదా మెయిల్ ద్వారా సందేహాలను నివృత్తి చేసుకోవాలని అధికారులు సూచించారు. డివిజన్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ ఉప అధినేత టి.శేషాద్రి సెల్ : 9959552441ని సంప్రదించొచ్చు. అనంతపురం సర్కిల్–1 పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత పి.ఎర్రయ్య సెల్ : 80082 77270లో సంప్రదించాలి. అనంతపురం సర్కిల్–2 పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత ఎం. సుధాకర్ సెల్: 99499 92660 లో సంప్రదించాలి. గుంతకల్లు సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత జి.రాజేంద్రప్రసాద్ సెల్ : 99499 92924లో సంప్రదించాలి. తాడిపత్రి సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత ఎస్. సోనియాతార సెల్ : 98858 93710లో సంప్రదించాలి. హిందూపురం సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత డి.నాగేంద్రరెడ్డి సెల్ : 99499 92698లో సంప్రదించాలి. ధర్మవరం సర్కిల్ పరిధిలోని డీలర్లు జీఎస్టీ సహాయ అధినేత జి.వెంకటేశ్వరరెడ్డి సెల్ : 99499 92627లో సంప్రదించాలి. -
నేటి నుంచి జీవాలకు ‘డీవార్మింగ్’
- పశుశాఖ జేడీ కార్యాలయంలో మందులు పంపిణీ అనంతపురం అగ్రికల్చర్ : గొర్రెలు, మేకలకు మంగళవారం నుంచి ఉచితంగా నట్టల నివారణ (డీవార్మింగ్) మందులు తాపించే కార్యక్రమం జిల్లా అంతటా ప్రారంభమవుతుందని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్ జి.సన్యాసిరావు తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్ ప్రారంభంలో కురిసే తొలకరి వర్షాలకు మొలచిన గడ్డిని తినడం వల్ల గొర్రెలకు ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు. దీని వల్ల కాపర్లకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఏటా ముందుస్తుగా టీకాలు వేయడం జరుగుతోందని తెలిపారు. మంగళవారం నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. గొర్రెల కాపర్లు, జీవాల పెంపకందారులు పశువైద్యులు, ఇతర పశుశాఖ సిబ్బందిని సంప్రదించి, నట్టల నివారణ మందు తాపించాలన్నారు. జిల్లాలో ఉన్న ఐదు సబ్ డివిజన్లకు సోమవారం డీవార్మింగ్ మందు పంపిణీ చేశారు. మందుల కోసం పెద్ద సంఖ్యలో వాహనాలు, ఆ శాఖ సిబ్బంది తరలివచ్చారు. -
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ
అనంతపురం ఎడ్యుకేషన్ : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన వివరాలను ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ గోవిందునాయక్ మంగళవారం వెల్లడించారు. అనంతపురం నగరంతో పాటు అన్ని మునిసిపల్ పట్టణాలు, కొత్తచెరువులో మొత్తం 21 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. 6,032 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. రోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.15 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. ఎనిమిది ఫ్లయింగ్ స్క్వాడ్లను నియమించారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని చర్యలు చేపట్టినట్లు అసిస్టెంట్ కమిషనర్ తెలిపారు. -
నేటి నుంచి మూడో విడత విత్తన పంపిణీ
- 15న వేరుశనగ పంపిణీ ముగిసే అవకాశం - కొనసాగనున్న విత్తన కందులు, బహుధాన్యపు కిట్ల పంపిణీ అనంతపురం అగ్రికల్చర్ : జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో సోమవారం నుంచి మూడో విడత విత్తన వేరుశనగ పంపిణీ కొనసాగుతుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. జిల్లాకు 4.01 లక్షల క్వింటాళ్ల వేరుశనగ, 5 లక్షల కిట్లు బహుధాన్యపు విత్తనాలు, 6 వేల క్వింటాళ్లు మేర విత్తన కందులు కేటాయించిన విషయం తెలిసిందే. గతనెల 24 నుంచి విత్తన పంపిణీ ప్రారంభమైంది. పది రోజుల పాటు చేపట్టిన తొలి విడతలో 1,46,272 మంది రైతులకు 1,69,327 క్వింటాళ్లు పంపిణీ చేశారు. రెండో విడతగా ఈనెల 5 నుంచి 9వ తేదీ వరకు 72,174 మంది రైతులకు 84,166 క్వింటాళ్లు పంపిణీ జరిగింది. మొత్తం 2,18,446 మంది రైతులకు 2,53,493 క్వింటాళ్లు పంపిణీ చేశారు. కేటాయింపుల మేరకు ఇంకా 1.48 లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాల్సి ఉంది. ఇప్పటిదాకా 6,762 మంది రైతులకు 695 క్వింటాళ్లు కందులు పంపిణీ చేయగా, ఇంకా 53,000 క్వింటాళ్ల కందులు ఇవ్వాల్సి ఉంది. ఇప్పటి వరకు 27,852 బహుధాన్యపు కిట్లు పంపిణీ చేశారు. ఇంకా 4.72 లక్షల కిట్ల పంపిణీ ఎప్పుడో తెలియడం లేదు. రైతుల నుంచి స్పందన అంతంతమాత్రమే : ముందస్తు ప్రణాళిక ఉన్నా పంపిణీలో సర్వర్ సమస్యలు, యాప్‌లో సాంకేతిక సమస్యలు రావడం, సకాలంలో కిట్లు తయారు చేయకపోవడంతో కొంత అంతరాయం ఏర్పడింది. అనుకున్న విధంగా విత్తనాల పంపిణీ జరగలేదని తెలుస్తోంది. సోమవారం నుంచి మూడో విడత చేపట్టనున్నారు. అయితే పంపిణీకి రైతుల నుంచి స్పందన అంతంత మాత్రంగానే ఉండటం, రోజుకు 100, 200 క్వింటాళ్ల వేరుశనగ పంపిణీ కోసం పదుల సంఖ్యలో అధికారులు, సిబ్బంది కౌంటర్లలో ఉండటం కనిపిస్తుండటంతో విత్తన పంపిణీని సాధ్యమైనంత త్వరగా ముగించాలని భావిస్తున్నారు. ఈ క్రమంలో ఈనెల 15న తుది గడువుగా ప్రకటించి సాధ్యమైనంత ఎక్కువ మంది రైతులకు విత్తనం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మూడు విడతల్లో 3 నుంచి 3.20 లక్షల క్వింటాళ్లు పంపిణీ కావచ్చని అంచనా వేస్తున్నారు. కౌంటర్లు క్లోజ్ చేసిన తర్వాత మండల వ్యవసాయాధికారుల కార్యాలయాల్లోనే విత్తన కందులు, బహుధాన్యపు విత్తనాల కిట్లు పంపిణీ కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. -
కాపులపై సెక్షన్ 144 కత్తి
ఏలూరు (మెట్రో) : కాపుల ఉద్యమంపై ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించి కాపుల పోరా టాన్ని అణచివేసేందుకు యత్నించింది. అప్పట్లో టీడీపీ నాయకులు నిర్వహించిన జనచైతన్య యాత్రలకు మాత్రం అనుమతి ఇచ్చింది. తాజాగా, మరోమారు ఆ సామాజిక వర్గం వారిపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 25వ తేదీన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. 30వ తేదీ వరకూ కొనసాగే ఈ యాత్ర అంతర్వేది చేరుకోనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోనూ కాపులు ఎటువంటి సభలు పెట్టకూడదంటూ నిషేధాజ్ఞలు విధిం చింది. మంగళవారం నుంచి ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. 144 సెక్షన్ ప్రకారం.. ఐదుగురికి మించి గుంపులుగా తిరగకూడదని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞల అమలుకు జిల్లా పోలీస్ అధికారులతో ప్రజలు సహకరించాలని కోరారు. రేపు చలో రావులపాలెం ముద్రగడ పద్మనాభం బుధవారం రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల కాపు సంఘాల నేతలు సోమవారం సమావేశమయ్యారు. ముద్రగడకు సంఘీభావంగా కాపులంతా రావులపాలెం చేరుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని తీర్మానించారు. జిల్లానుంచి తరలివెళ్లే వారిని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవాలని పోలీస్ యంత్రాగానికి ఆదేశాలు అందాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు పాదయాత్రకు వెళ్లకుండా కాపు వర్గాలను అడ్డుకోవాలని సూచనలు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచే నిషేధాజ్ఞలు అమలు చేసేందుకు పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది. -
జై మాతాదీ
సకల జగత్తుకు మూలం.. త్రిమూర్తులకు శక్తి ప్రదాత.. త్రిలోకేశ్వరీ సకలాభీష్ట ప్రదాయిని దేవి నవరాత్రోత్సవాలు శనివారం నుంచి ప్రారంభంకానున్నాయి. తొమ్మిది రోజుల నిర్వహించే ఈ ఉత్సవాలు కోసం వాడవాడల్లో యుజవన సంఘాలు, ఉత్సవ కమిటీలు, ఫ్రెండ్స్ యూనిట్ల ఆధ్వర్యంలో మంటపాలు ఏర్పాటు చేశారు. – కరీంనగర్ కల్చరల్ తొలి పూజ: నవరాత్రోత్సవాల్లో భాగంగా శనివారం సాయంత్రం దుర్గామాతకు తొలిరోజు తొలి పూజలు నిర్వహిస్తారు. దేవీ నవరాత్రులు: ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభమయ్యే నవరాత్రుల్లో తొలిరోజు అమ్మ వారికి కలశస్థాపనం చేసి ప్రతిష్ఠిస్తారు. అప్పటి నుంచి విజయదశమి వరకు దేవీనవరాత్రులు నిర్వహిస్తారు. తొమ్మిది అవతారాలు : శక్తి స్వరూపిణి, ఆదిపరాశక్తి అయిన దుర్గామాతను శైలప్రతిథీ, బ్రహ్మచారిణి, చంద్రఘంటే , కూష్మాండేతి, స్కంధ మాతేతి, కాత్యాయనీతి, కాళరాత్రిచ, మహాగౌరీతి, సిద్ధిరాత్రి తొమ్మిది అవతారాల్లో భక్తులు కొలుస్తారు. దుర్గా ౖవైభవం : పూర్వం దుర్గుడు అనే రాక్షసుడు దేవతలను హింసిస్తుండా, దేవతాలందరూ ఒకచోటచేరి శక్తి స్వరూపం సమైక్య రూపంగా రూపొందించారు. శివశక్తి నుంచి శిరస్సు, విష్ణుశక్తి నుంచి భుజములు, బ్రహ్మశక్తి నుంచి చరణములు, ఇంద్రశక్తి నుంచి నడుము, కుభేరశక్తి నుంచి కేశం, పధ్వినుంచి పిరుదులు అవిర్భవించగా స్త్రీశక్తి దుర్గగా అవతరించిందని పురాన గాథ. ప్రీతి పాత్రమైన రోజులు : రుద్ర రూపిణి భద్రకాళిగా ఎనిమిదో రోజు జన్మించిన చాముండి తొమ్మిదో రోజు వీరవిహారం చేసి దైత్య సంహారం చేసిందని పురాణాల్లో పేర్కొన్నారు. పదోరోజు విజయలక్ష్మిగా జనుల ఆనందోత్సవాలకు ప్రతీకగా పూజలందుకుంటుంది. న వరాత్రుల్లో చివరి మూడు రోజులు అత్యంత ప్రీతిపాత్రమైనవి. వీటినే మనం దుర్గాష్టమి, విజయదశమి పేరిట ఉత్సవాలు జరుపుకుంటాం. ముస్తాబైన శ్రీ మహాశక్తి ఆలయం దేవి నవరాత్రోత్సవాలకు నగరంలోని చైతన్యపురిలోని శ్రీ మహాశక్తి దేవాలయం ప్రత్యేక అలంకరణలు, రంగురంగుల విద్యుద్దీపాలతో ముస్తాబైంది. ముగ్గురమ్మల మూలపుటమ్మ శ్రీమహాదుర్గగా, శ్రీ మహాలక్ష్మిగా, శ్రీమహాసరస్వతిగా ఒకే ప్రాంగణంలో పీఠాధిపతులు శ్రీ విద్యారణ్య భారతీస్వామి ప్రాణప్రతీష్ఠతో కొలువుదీరిన అమ్మవారు కోరిన కోరికలు తీర్చుతుందనే విశ్వాసంతో ఈ దేవాలయానికి రోజురోజుకు భక్తుల సంఖ్య పెరగడం విశేషం. ఈ దేవాలయంలో వైధిక, సాంస్కృతిక, అంగరంగ వైభవంగా జరుగుతాయి. నవరాత్రి ఉత్సవాలను తొమ్మిది రోజులపాటు అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఆలయ కమిటీ విసృత ఏర్పాటు చేసింది. -
నేటి నుంచి హనుమాన్ దర్శన్
అనంతపురం న్యూసిటీ :శ్రావణ మాసంలో మురడి, నేమకల్లు, కసాపురంలోని ఆంజనేయస్వామిలను ఒకే రోజులో దర్శనం చేసుకుంటే పుణ్యం రావడంతో పాటు కష్టాల నుంచి గట్టెక్కుతామని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తుల సౌకర్యార్థం మూడు ఆలయాలను దర్శించుకునేందుకు ఆర్టీసీ ‘హనుమాన్ దర్శన్’ పేరిట ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. శ్రావణ తొలి శనివారాన్ని పురస్కరించుకుని అనంతపురం ఆర్టీసీ రీజియన్‌లోని 12 డిపోల నుంచి శనివారం ఉదయం ఆరు గంటలకే ‘హనుమాన్ దర్శన్’ బస్సులు బయల్దేరుతాయి. ప్రతి మంగళ, శనివారాల్లో ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతాయి. టికెట్ ధర : అనంతపురం నుంచి నేమకల్లు, మురడి, కసాపురం వెళ్లడానికి పెద్దలకు రూ 500, చిన్నపిల్లలకు రూ.265 టికెట్ ధర ఉంటుంది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా మరిన్ని బస్సులు తిప్పే అవకాశం ఉంది. శనివారం సీఎం పర్యటన నేపథ్యంలో కేవలం ఒక్క బస్సును మాత్రమే అందుబాటులో ఉంచారు. రద్దీకనుగుణంగా బస్సులు : ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులు తిప్పుతామని అనంతపురం ఆర్టీసీ డీఎం బాలచంద్రప్ప పేర్కొన్నారు. రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించామన్నారు. -
నేటి నుంచి చిలుకూరు బాలాజీ బ్రహ్మోత్సవాలు
మొయినాబాద్ (రంగారెడ్డి): చిలుకూరులోని బాలాజీ బ్రహోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి. సాయంత్రం పుట్టమన్ను తెచ్చి హోమగుండాలు ఏర్పాటు చేసి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లన్నీ ఆలయ అర్చకులు పూర్తి చేశారు. శేష, హనుమంత, సూర్యప్రభ, గరుడ, గజ, పల్లకీ, అశ్వ వాహనాలను సిద్ధం చేశారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం సందర్భంగా గరుత్మంతుడికి పెట్టే నైవేద్యాన్ని సంతానంలేని మహిళలకు ప్రసాదంగా పంపిణీ చేయనున్నారు. మంగళవారం ఉదయం 8.30 గంటల నుంచి 11 గంటల వరకు గరుడ ప్రసాదాన్ని పంపిణీ చేస్తామని.. ప్రసాదం స్వీకరించే మహిళలు ఉదయం 8 గంటలకే చిలుకూరు ఆలయానికి చేరుకోవాలని అర్చకుడు రంగరాజన్ తెలిపారు.