నేటి నుంచి జీవాలకు ‘డీవార్మింగ్‌’ | today onwards dewarming of animals | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జీవాలకు ‘డీవార్మింగ్‌’

Published Mon, Jun 26 2017 9:53 PM | Last Updated on Tue, Sep 5 2017 2:31 PM

నేటి నుంచి జీవాలకు ‘డీవార్మింగ్‌’

నేటి నుంచి జీవాలకు ‘డీవార్మింగ్‌’

- పశుశాఖ జేడీ కార్యాలయంలో మందులు పంపిణీ
అనంతపురం అగ్రికల్చర్‌ : గొర్రెలు, మేకలకు మంగళవారం నుంచి ఉచితంగా నట్టల నివారణ (డీవార్మింగ్‌) మందులు తాపించే కార్యక్రమం జిల్లా అంతటా ప్రారంభమవుతుందని పశుసంవర్ధకశాఖ జేడీ డాక్టర్‌ జి.సన్యాసిరావు  తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ ఖరీఫ్‌ ప్రారంభంలో కురిసే తొలకరి వర్షాలకు మొలచిన గడ్డిని తినడం వల్ల గొర్రెలకు ఈ వ్యాధి వ్యాపిస్తుందన్నారు.

దీని వల్ల కాపర్లకు నష్టం జరిగే అవకాశం ఉన్నందున ఏటా ముందుస్తుగా టీకాలు వేయడం జరుగుతోందని తెలిపారు.   మంగళవారం నుంచి జూలై 6వ తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగిస్తామన్నారు. గొర్రెల కాపర్లు, జీవాల పెంపకందారులు పశువైద్యులు, ఇతర పశుశాఖ సిబ్బందిని సంప్రదించి, నట్టల నివారణ మందు తాపించాలన్నారు. జిల్లాలో ఉన్న ఐదు సబ్‌ డివిజన్లకు సోమవారం డీవార్మింగ్‌ మందు పంపిణీ చేశారు. మందుల కోసం పెద్ద సంఖ్యలో వాహనాలు, ఆ శాఖ సిబ్బంది తరలివచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement