అనంతపురం న్యూసిటీ :శ్రావణ మాసంలో మురడి, నేమకల్లు, కసాపురంలోని ఆంజనేయస్వామిలను ఒకే రోజులో దర్శనం చేసుకుంటే పుణ్యం రావడంతో పాటు కష్టాల నుంచి గట్టెక్కుతామని భక్తుల ప్రగాఢ నమ్మకం. భక్తుల సౌకర్యార్థం మూడు ఆలయాలను దర్శించుకునేందుకు ఆర్టీసీ ‘హనుమాన్ దర్శన్’ పేరిట ప్రత్యేక సర్వీసులు నడుపుతోంది. శ్రావణ తొలి శనివారాన్ని పురస్కరించుకుని అనంతపురం ఆర్టీసీ రీజియన్‌లోని 12 డిపోల నుంచి శనివారం ఉదయం ఆరు గంటలకే ‘హనుమాన్ దర్శన్’ బస్సులు బయల్దేరుతాయి. ప్రతి మంగళ, శనివారాల్లో ఈ ప్రత్యేక సర్వీసులు నడుపుతాయి.
టికెట్ ధర : అనంతపురం నుంచి నేమకల్లు, మురడి, కసాపురం వెళ్లడానికి పెద్దలకు రూ 500, చిన్నపిల్లలకు రూ.265 టికెట్ ధర ఉంటుంది. ప్రయాణికుల రద్దీకనుగుణంగా మరిన్ని బస్సులు తిప్పే అవకాశం ఉంది. శనివారం సీఎం పర్యటన నేపథ్యంలో కేవలం ఒక్క బస్సును మాత్రమే అందుబాటులో ఉంచారు.
రద్దీకనుగుణంగా బస్సులు : ప్రయాణికుల రద్దీకనుగుణంగా బస్సులు తిప్పుతామని అనంతపురం ఆర్టీసీ డీఎం బాలచంద్రప్ప పేర్కొన్నారు. రిజర్వేషన్ సౌకర్యాన్ని కూడా కల్పించామన్నారు.
నేటి నుంచి హనుమాన్ దర్శన్
Published Sat, Aug 6 2016 1:15 AM | Last Updated on Mon, Sep 4 2017 7:59 AM
Advertisement