
పరీక్ష రాస్తున్న విద్యార్థి, పక్కన అధికారులు, సిబ్బంది
సాక్షి, హుజురాబాద్ రూరల్: కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల పరీక్ష సెంటర్‌లో బుధవారం నిర్వహించిన ఎస్సెస్సీ సప్లిమెంటరీ హిందీ పరీక్షకు ఒకే ఒక్క విద్యార్థి హాజరయ్యాడు. ఉదయం 9.30గంటల నుంచి 12.45 వరకు జరిగిన హిందీ పరీక్షకు మొత్తం ఏడుగురు విద్యార్ధులు హాజరు కావాల్సి ఉండగా జమ్మికుంట విద్యోదయ పాఠశాలకు చెందిన కోండ్ర ప్రణయ్ హాజరయ్యాడు.
కాగా ఒక్కడి కోసం ఛీప్ సూపరింటెండెంట్, డిపార్ట్‌మెంట్ అధికారి, క్లర్క్, ఇన్విజిలేటర్, అటెండర్, వైద్యశాఖ ఉద్యోగి, ఇద్దరు పోలీసులు విధులు నిర్వహించారు. తనిఖీ కోసం ఇద్దరు చొప్పున కరీంనగర్ నుంచి రెండు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు వచ్చాయి. ఒక్క విద్యార్థి పరీక్ష రాయగా అధికారులు, సహాయక సిబ్బంది కలిపి ఓవరాల్‌గా 12 మంది విధులు నిర్వహించడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment