కరీంనగర్: పేదరిక నిర్మూలనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయి. తాజాగా ‘జాతీయ బహుముఖ పేదరిక సూచి (ఎంపీఐ)– ఒక ప్రగతి సమీక్ష’ పేరిట నీతి ఆయోగ్ విడుదలచేసిన నివేదిక గణాంకాలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జాతీయస్థాయిలో నిర్వహించిన ఈసర్వేలో పలుఆసక్తికర విషయాలు బయటపడ్డాయి.
ముఖ్యంగా దేశంలో పేదరికం తగ్గి, ఆర్థిక అంతరాలు క్రమంగా సమసిపోతున్నాయని నివేదిక పునరుద్ఘాటించింది. నేషనల్ ఫ్యామిలీ అండ్ హెల్త్ సర్వే (ఎన్‌హెచ్‌ఎఫ్‌ఎస్)–4తో ఎన్‌హచ్‌ఎఫ్‌ఎస్–5తో పోల్చి ఈ సర్వే వివరాలను నీతి ఆయోగ్ విడుదల చేసింది. దీని ప్రకారం.. ఉమ్మడి జిల్లాలోనూ పేదరికం తగ్గింది. జగిత్యాలలో 4.77 శాతం, రాజన్న సిరిసిల్లలో 3.68 శాతం, కరీంనగర్‌లో 2.50 శాతం, పెద్దపల్లిలో 2.17 శాతంగా నమోదైంది.
ఇందులో పెద్దపల్లి అతితక్కువ 2.17 శాతం పేదరికంతో రాష్ట్రంలో అత్యంత తక్కువ సంఖ్యలో పేదలు ఉన్న జిల్లాగా రికార్డు సృష్టించింది. జిల్లాలో అధికశాతం పారిశ్రామిక ప్రాంతం కావడం, రోడ్డు రవాణా, రైల్వే కనెక్టివిటీ, విద్యా, వైద్యం తదితర సదుపాయాల దృష్ట్యా మొదటి నుంచి పెద్దపల్లి జిల్లా ముందువరుసలో నిలిచింది. తాజాగా నీతిఆయోగ్ విడుదలచేసిన నివేదికలోనూ ఇదే విషయం పునరావృతం కావడం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment