‘గుర్తింపు’ ముందు అనేక సవాళ్లు! | - | Sakshi
Sakshi News home page

‘గుర్తింపు’ ముందు అనేక సవాళ్లు!

Published Mon, Jan 1 2024 2:02 AM | Last Updated on Mon, Jan 1 2024 11:38 AM

విజయోత్సవంలో ఏఐటీయూసీ నాయకులు - Sakshi

విజయోత్సవంలో ఏఐటీయూసీ నాయకులు

పెద్దపల్లి: సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో విజయం సాధించిన ఏఐటీయూసీ ముందు అనేక సవాళ్లు ఉన్నాయి. సంస్థలో ఏడోసారి జరిగిన ఎన్నికల్లో ఐఎన్‌టీయూసీపై 1,983 ఓట్ల మెజారిటీతో సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ)విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన పోరులో చివరకు విజయాన్ని ౖకైవసం చేసుకుంది. సంస్థ వ్యాప్తంగా ఆరు ఏరియాల్లో ఐఎన్‌టీయూసీ, ఐదు ఏరియాల్లో ఏఐటీయూసీ గెలిచాయి. ఈక్రమంలో ప్రధాన డిమాండ్ల సాధన బాధ్యత గెలిచిన యూనియన్‌పై సవాల్‌ విసురుతోంది. సొంతింటి పథకం, మారుపేర్ల మార్పు, నూతన భూగర్భగనుల తవ్వకం తదితర డిమాండ్ల సాధన అంతసులువు కానప్పటికీ.. పోరాటాల చరిత్ర కలిగిన గుర్తింపు యూనియన్‌ ఏఐటీయూసీ భవిష్యత్‌లో ఎలా ముందుకు సాగుతుందోనని సింగరేణి కార్మికులను ఆలోచింపజేస్తోంది.

ఏఐటీయూసీ ఎన్నికల మెనిఫెస్టో ఇదీ..

  • సింగరేణిలో రాజకీయ జోక్యం నియంత్రిస్తాం.
  • ఆర్థిక దుబారాను అరికడతాం.
  • కోలిండియా మాదిరిగా పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్‌ మాఫీ చేయాలని ఎప్పటి నుంచో డిమాండ్‌ వస్తోంది.
  • కార్మికుల పిల్లల ఉద్యోగ వయోపరిమితి 35ఏళ్ల నుంచి 40ఏళ్లకు పెంచుతాం.
  • సొంతింటి పథకం కింద 250గజాల ఇంటి స్థలం, రూ.20లక్షల వడ్డీలేని రుణం మంజూరు చేయిస్తాం.
  • నూతన భూగర్భగనులు తవ్వించి ఉద్యోగాలు పెంచడం
  • బొగ్గు వెలికితీసే ప్రాంతాల్లో కాంట్రాక్టు కార్మికులను తొలగించి పర్మినెంట్‌ కార్మికులను నియమించడం.
  • మైనింగ్‌స్టాఫ్‌, ట్రేడ్స్‌మెన్‌, ఈఅండ్‌ఎం సూపర్‌వైజర్లు, ఈపీ ఆపరేటర్లకు సర్ఫేస్‌లో అదే హోదా కల్పన.
  • ప్లేడే, పీహెచ్‌డీలకు ఎన్‌–వన్‌ విధానం తొలగించి పాత పద్ధతి కొనసాగిస్తాం.
  • మెడికల్‌ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న కార్మికులకు డబ్బులు లేకుండా అందరికీ అన్‌ఫిట్‌ చేయిస్తాం
  • సంస్థ ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చి సూపర్‌స్పెషాలిటీ వైద్యం అందించేలా కృషి చేస్తాం.
  • సింగరేణి పాఠశాలల్లో సీబీఎస్‌ఈ విద్యా బోధన అందుబాటులోకి తెస్తాం.
  • సీహెచ్‌పీల్లో పనిచేసే కార్మికులకు డస్ట్‌ అలవెన్స్‌ ఇప్పిస్తాం.
  • రిటైర్డ్‌ రోజునే కార్మికులకు టర్మినల్‌ బెనిఫిట్స్‌ అందేలా చూస్తాం.
  • చదువుకున్న కార్మికులకు సూటబుల్‌ ఉద్యోగాలు ఇప్పిస్తాం.
  • మహిళా కార్మికులను భూగర్బగనుల్లోకి దింపకుండా చూస్తాం.
  • అన్నిఏరియాల్లో కార్మికులకు డబుల్‌బెడ్‌రూమ్‌లు ఇచ్చేలా చూస్తాం.
  • క్యాంటీన్లలో నాణ్యమైన టిఫిన్స్‌ అందించేలా చూస్తాం.
  • గని ప్రమాదాల్లో ఇంక్రిమెంట్లు కోల్పోయిన వారికి వన్‌టైం సెటిల్‌మెంట్‌కింద ఇంక్రిమెంట్‌ ఇప్పిస్తాం.
  • తెలంగాణ ఇంక్రిమెంట్‌ బేసిక్‌లో కల్పించేలా చూస్తాం.
  • సింగరేణి డీఎంఎఫ్‌ఐటీ, సీఎస్‌ఆర్‌ నిధులు సింగరేణి ప్రభావిత ప్రాంతాల్లో ఖర్చు చేసేలా చూస్తాం.
  • మారుపేర్ల కార్మికులను సొంత పేర్లపై రెగ్యులరైజ్‌ చేసేలా చూస్తాం.
  • 2022లో జరిగిన 9డిమాండ్ల ఒప్పందం అమలయ్యేలా చూస్తాం.

కార్మికుల పక్షాన పోరు!
మాపై నమ్మకంలో ఎన్నికల్లో గుర్తింపు యూనియన్‌గా గెలిపించిన కార్మికులకు ధన్యవాదాలు. వారి పక్షాన నిలబడి సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ముందుకు సాగుతాం. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతీహామీని నెరవేర్చుతాం. పెర్క్స్‌పై ఇన్‌కంట్యాక్స్‌ మాఫీ, సొంతింటి కల నెర వేర్చుతాం. మారుపేర్లతో నిలిచిపోయిన డిపెండెంట్‌ ఉద్యోగాలను వన్‌టైం సెటిల్‌మెంట్‌ కింద క్లియర్‌ చేసేలా చూస్తాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కారమయ్యేలా దృష్టి సారిస్తాం. – సీతారామయ్య, అధ్యక్షుడు, ఏఐటీయూసీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement