అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత! | - | Sakshi
Sakshi News home page

అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత!

Published Sat, Nov 4 2023 1:28 AM | Last Updated on Sat, Nov 4 2023 1:16 PM

- - Sakshi

ప్రాజెక్ట్‌తో హర్షిత

సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: రామగిరి మండలం చందనాపూర్‌ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి డి.హర్షిత శుక్రవారం జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. దాసరి మహేశ్‌–స్వప్న దంపతుల కుమార్తె దాసరి హర్షిత.. గైడ్‌ టీచర్‌ సంపత్‌కుమార్‌ సహకారంతో తను తయారుచేసిన బహుళప్రయోజనకర(హెల్మెట్‌) హెల్మెట్‌ ప్రాజెక్ట్‌ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి పదో తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించన్నుట్లు హెచ్‌ఎం లక్ష్మి, గైడ్‌ టీచర్‌ సంపత్‌ కుమార్‌ తెలిపారు. ఈసందర్భంగా హర్షిత మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తన ప్రాజెక్టు ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement