karimnagar distirict
-
అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో.. జపాన్‌కు పయనమైన హర్షిత!
సాక్షి, కరీంనగర్/పెద్దపల్లి: రామగిరి మండలం చందనాపూర్ ప్రభుత్వ పాఠశాల పదో తరగతి విద్యార్థి డి.హర్షిత శుక్రవారం జపాన్‌కు బయలుదేరి వెళ్లింది. దాసరి మహేశ్–స్వప్న దంపతుల కుమార్తె దాసరి హర్షిత.. గైడ్ టీచర్ సంపత్‌కుమార్ సహకారంతో తను తయారుచేసిన బహుళప్రయోజనకర(హెల్మెట్) హెల్మెట్ ప్రాజెక్ట్ జిల్లా, రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ చూపి అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికైంది. ఈనెల 5 నుంచి పదో తేదీ వరకు జపాన్‌లోని టోక్యో నగరంలో నిర్వహించనున్న అంతర్జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో తన ప్రాజెక్ట్‌ను ప్రదర్శించన్నుట్లు హెచ్ఎం లక్ష్మి, గైడ్ టీచర్ సంపత్ కుమార్ తెలిపారు. ఈసందర్భంగా హర్షిత మాట్లాడుతూ, అంతర్జాతీయ వేదికపై తన ప్రాజెక్టు ప్రదర్శించడం సంతోషంగా ఉందని పేర్కొంది. -
మాజీ ఎమ్మెల్యే కేతిరి సాయిరెడ్డి కన్నుమూత
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, మాజీ జెడ్పీ చైర్మన్ కేతిరి సాయిరెడ్డి కన్నుమూశారు. తెల్లవారుజామున గుండెపోటుతో ఆయన తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్‌లో ఆయన చికిత్స పొందుతున్నారు. ఈ రోజు ఆయన స్వగ్రామం జూపాకలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. చదవండి: కోవిడ్ ఆస్పత్రిలో అగ్నిప్రమాదం: 13 మంది మృతి అవమానాలు భరించలేం, పార్టీలో నుంచి వెళ్లిపోదామా? -
రైతులపై ఇసుక మాఫియా దాడి
ముస్తాబాద్: కరీంనగర్ జల్లా ముస్తాబాద్ మండలంలో రైతులపై ఇసుక మాఫియా దాడులకు దిగింది. మండలంలోని కొండాపూర్ గ్రామం సమీపంలో మానేరు వాగు నుంచి కొంత కాలంగా ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. బుధవారం ఉదయం కూడా ఇసుక అక్రమ రవాణా జరుగుతుండగా వాగు వద్ద రైతులు అడ్డుకున్నారు. భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని, ఇసుకను తీయటానికి వీల్లేదన్నారు. దీంతో ఇసుక అక్రమ రవాణాదారులు రెచ్చిపోయారు. అడ్డుకున్న రైతులను తీవ్రంగా కొట్టి పరారయ్యారు. ఐదుగురు రైతులు స్పృహ తప్పి పడిపోగా.. స్థానికులు వారిని గుర్తించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. -
ప్రమాదవశాత్తు బావిలో పడిన విద్యార్థిని
కరీంనగర్ : ప్రమాదవశాత్తు హాస్టల్ విద్యార్థిని బావిలో పడింది. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాలు.. సుల్తానాబాద్‌లోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటున్న అనూష(15) జ్వరం రావడంతో మూడు రోజుల నుంచి పాఠశాలకు వెళ్లడంలేదు. శనివారం మధ్యాహ్నం హాస్టల్ దగ్గర ఉండే బావిలో ప్రమాదవశాత్తు పడింది. స్థానికంగా ఉన్న యువకులు వెంటనే స్పందించి ఆమెను రక్షించారు. అనంతరం ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ విషయంపై వార్డెన్ సుమతిని సంప్రదించే ప్రయత్నం చేయగా ఆమె అందుబాటులో లేదు. దీంతో విద్యార్థులను అడగ్గా వార్డెన్ హాస్టల్‌కు అప్పడప్పుడు వస్తుందని చెప్పారు. వార్డన్ భర్త మొత్తం హాస్టల్ నిర్వహణ చూస్తారని విద్యార్థులు తెలిపారు. (సుల్తానాబాద్) -
డబ్బులిస్తే... పింఛన్లు ఇప్పిస్తా
రామగుండం: డబ్బులిస్తే.. ఫించన్లు ఇప్పిస్తానంటూ పేదలు, వృద్ధులను మోసం చేయబోయిన ఓ యువకుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా రామగుండం మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఏడవ డివిజన్ ప్రశాంత్ నగర్లో బుధవారం మధ్యాహ్నం జరిగింది. పింఛన్ల కోసం డబ్బుల వసూళ్లకు యత్నించిన వేణుగోపాల్ అనే యువకుడిని కార్పొరేటర్ రవి, స్థానికులు కలసి పట్టుకుని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
4 ఇసుక ట్రాక్టర్లు సీజ్
కరీంనగర్ : ఇసుక మాఫియా ఆగడాలను అడ్డుకునేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. కరీంనగర్ జిల్లాలోని ఇసుక క్వారీలపై గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. కమలాపూర్ మండలంలోని మర్రిపల్లిగూడెం వాగు నుంచి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న నాలుగు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల తనిఖీలతో ట్రాక్టర్లను వదిలి నిందితులు పరారయ్యారు. ట్రాక్టర్లను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రిజిస్ట్రేషన్ నంబర్ల ఆధారంగా ట్రాక్టర్ యజమానులపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. (కమలాపూర్) -
లారీఓనర్ ను చంపిన డ్రైవర్
కరీంనగర్: డబ్బుల విషయంలో వచ్చిన పొరపొచ్చలు ఒకరి ప్రాణం తీశాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్‌మిల్ వద్ద జరిగింది. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న లారీడ్రైవర్ కుమార్ తన యజమాని గాలి సంపత్‌రావు(35)తో వాగ్వాదానికి దిగాడు. తనకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయిన లారీ డ్రైవర్ అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న పారతో యజమాని తల మీద బలంగా మోదాడు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్తానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంపత్‌రావు మృతిచెందాడు. (సుల్తానాబాద్)