లారీఓనర్ ను చంపిన డ్రైవర్ | murder attack in karimnagar distirict | Sakshi
Sakshi News home page

లారీఓనర్ ను చంపిన డ్రైవర్

Published Tue, Feb 3 2015 12:19 PM | Last Updated on Sat, Sep 2 2017 8:44 PM

డబ్బుల విషయంలో వచ్చిన పొరపొచ్చలు ఒకరి ప్రాణం తీశాయి.

కరీంనగర్: డబ్బుల విషయంలో వచ్చిన పొరపొచ్చలు ఒకరి ప్రాణం తీశాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్‌మిల్ వద్ద జరిగింది. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న లారీడ్రైవర్ కుమార్ తన యజమాని గాలి సంపత్‌రావు(35)తో వాగ్వాదానికి దిగాడు. తనకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు.

ఆగ్రహంతో ఊగిపోయిన లారీ డ్రైవర్ అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న పారతో యజమాని తల మీద బలంగా మోదాడు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్తానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంపత్‌రావు మృతిచెందాడు.
(సుల్తానాబాద్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement