money issue
-
Karimnagar: రూ.3 వేల కోసం ప్రాణం తీసుకున్నాడు
సాక్షి, జగిత్యాల: తండ్రి రూ.3 వేలు ఇవ్వలేదని, క్షణికావేశంలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. మల్లాపూర్‌కు చెందిన అప్పాల మల్లేశ్–జల దంపతులకు కుమార్తె, కుమారుడు వికాస్(19) ఉన్నారు. కూతురికి వివాహం కాగా కుమారుడు స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మిడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. గురువారం ఉదయం తల్లి జల వ్యవసాయ పనులకు వెళ్లింది. తండ్రి గొర్రెలను మేపేందుకు వెళ్తుండగా వికాస్ తనకు రూ.3 వేల కావాలని అడిగాడు. ఇప్పుడు తన వద్ద లేవని, సాయంత్రం వచ్చాక ఇస్తానని చెప్పి, మల్లేశ్ గొర్రెలను మేపేందుకు వెళ్లాడు. దీంతో మనస్తాపానికి గురైన వికాస్ క్షణికావేశంలో ఇంట్లోకి వెళ్లి, ఉరేసుకున్నాడు. ఒక్కగానొక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఆ తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీన్‌కుమార్ పేర్కొన్నారు. -
జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి..
యశవంతపుర: హనీట్రాప్ దందాలు ఆగడం లేదు. తాజాగా కర్నాటకలో మరొకటి వెలుగులోకి వచ్చింది. ఇచ్చిన అప్పు చెల్లించమని అడిగినందుకు వృద్ధుడిని ట్రాప్ చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో దావణగెరె పట్టణం సరస్వతీ నగరకు చెందిన యశోధ (32)ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. వివరాల ప్రకారం.. నగరంలోని శివకుమారస్వామి లేఔట్‌కు చెందిన చిదానందప్పకు సరస్వతి నగరకు చెందిన యశోధతో పరిచయం ఏర్పడింది. పరిచయం ఇద్దరి మధ్య స్నేహంగా మారింది. చిదానందప్పను తరచూ కాఫీకి ఇంటికి పిలిచేది. ఈ క్రమంలో అతని వద్ద నుంచి ఆమె రూ. 86 వేలు అప్పుగా తీసుకుంది. రోజులు గడచినా అప్పు చెల్లించకపోవడంతో చిదానంద డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. జ్యూస్‌లో మత్తు మందు ఇచ్చి... ఒక రోజు వాకింగ్ ముగించుకొని ఇంటికి వెళ్తున్న చిదానందప్పను యశోధ ఇంటిలోకి పిలిచి జ్యూస్ ఇచ్చింది. అది తాగిన కొద్దిసేపటికే అతను స్పృ హ తప్పాడు. ఆ తరువాత కొన్ని గంటల తరువాత లేచి చూస్తే అతని ఒంటి మీద దుస్తులు లేవు. ఆందోళన చెందిన చిదానందప్ప బట్టలు వేసుకొని ఇంటికి వెళ్లిపోయాడు. రెండు రోజుల తరువాత యశోధ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసింది. అతను లేదని చెప్పడంతో తన వద్ద అశ్లీల వీడియో ఉందని, రూ. 15 లక్షలు ఇవ్వాలని, లేదంటే ఆ వీడియోను కుటుంబ సభ్యులకు పంపిస్తానని బెదిరించింది. ఆందోళన చెందిన చిదానందప్ప తన స్నేహితుల వద్ద గోడును వెళ్లబోసుకున్నాడు. అంతలోనే చిదానంద నగ్నంగా ఉన్న ఫొటోను వాట్సాప్‌లో పంపింది. ఈ విషయం ఆయన కొడుకు దృష్టికి రావడటంతో ఆయన దావణగెరె కేటీజే నగర పోలీసులకు ఫిర్యాదు చేయటంతో యశోధను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. -
యువతిని వెతికి ఇంటికి తీసుకొచ్చి, ఆపై.. స్పీడ్ బ్రేకర్స్ దగ్గర దొరికిపోయారు!
దొడ్డబళ్లాపురం(బెంగళూరు): యువతిని హత్య చేసి శవాన్ని తరలిస్తూ నలుగురు పట్టుబడ్డారు. బెంగళూరు రాజరాజేశ్వరి నగరలో రఘు, దుర్గ దంపతుల ఇంట్లో తమిళనాడుకు చెందిన సౌమ్య (22) అనే యువతి పనిచేసేది. డబ్బుల విషయమై గొడవ జరిగి సౌమ్య ఎక్కడికో వెళ్లిపోయింది. గత సోమవారం సౌమ్యను వెతికి ఇంటికి తీసుకువచ్చిన రఘు, దుర్గ ఆమెను దారుణంగా కొట్టి చంపేశారు. శవాన్ని శ్రీరంగపట్టణం వద్ద పారవేయాలని నాగరాజు, వినోద్‌ల సాయంతో శవాన్ని బైక్‌పై తీసుకెళ్లారు. రామనగర కలెక్టరేట్ ముందు స్పీడ్ బ్రేకర్స్ వద్ద శవం జారి కిందపడింది. అక్కడే ఉన్న పోలీసులు అనుమానంతో పరిశీలించగా గుట్టు రట్టయింది. దీంతో నిందితులను అరెస్టు చేశారు. చదవండి: వివాహేతర సంబంధం: అర్ధరాత్రి బైక్‌పై వస్తుంటే అడ్డగించి.. -
పట్టించుకోవట్లేదని ప్రియుడి కళ్లలో కారం కొట్టింది!
-
ఘోరం: తీసుకున్న డబ్బు అడిగినందుకు ఎంత పనిచేశారు..
సాక్షి, వరంగల్: డబ్బు అడిగినందుకు మహిళను దారుణంగా హత్య చేసి సెప్టిక్ ట్యాంక్‌లో పడవేసిన నిందితులను అరెస్టు పర్వతగిరి పోలీసులు అరెస్టు చేసినట్లు ఈస్ట్‌జోన్ డీసీపీ వెంకటలక్ష్మి తెలిపారు. హన్మకొండలోని కమిషనరేట్‌లో బుధవారం నిర్వహించిన సమావేశంలో డీసీపీ నిందితుల వివరాలను వెల్లడించారు. పర్వతగిరి మండలం అన్నారం షరీఫ్‌కు చెందిన ఒగ్గు కొంరయ్య తన భార్య కొంరమ్మ(50) ఈనెల 4 సాయంత్రం నుంచి కనిపించడం లేదని పర్వతగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు మిస్సింగ్ కింద కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఇంతలోనే ఈనెల 8న పోడేటి కృష్ణ పర్వతగిరి పోలీసుల ఎదుట లొంగిపోయి కొంరమ్మను తన స్నేహితుడు మేకల రాజు తో కలిసి హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఈ సందర్భంగా విచారణ చేపట్టగా వివరాలు వెల్లడించారు. ఇద్దరు నిందితులు మంచి స్నేహితులని, నిందితుడు కృష్ణ ఇంటి వద్ద తరుచూ దావత్ చేసుకుంటారని డీసీపీ తెలిపారు. ఈనెల 4న వీరితో పాటు పంథినికి చెందిన మని, కుమార్ కృష్ణ ఇంటి దగ్గర దావత్ చేసుకున్నారు. మృతురాలు ఒగ్గు కొంరమ్మ సాయంత్రం 4 గంటల సమయంలో కృష్ణ ఇంటికి వచ్చి డబ్బు ఇవ్వాలని ఆడగగా పంపించివేశారు. మృతురాలు మరోసారి డబ్బు కోసం ఇంటికి రాగా నిందితులు కృష్ణ, రాజు ఆమెను బలవంతం చేయబోగ తిరస్కరించి, విషయాన్ని పెద్దలకు చెబుతానని బెదిరించింది. దీంతో కృష్ణ ఇటుకతో, రాజు కర్రతో కొట్టి ఆమెను హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని సెప్టిక్ ట్యాంక్‌లో పడేసి మూసివేసినట్లు డీసీపీ పేర్కొన్నారు. అయితే, కొమురమ్మ ఆచూకీ కోసం ఆరా తీసే క్రమంలో కృష్ణపై అనుమానం రాగా, ఎలాగైన దొరికిపోతాననే భయంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిపారు. కాగా, నిందితులను గుర్తించడంలో ప్రతిభ కనపరిచిన మామునూర్ ఏసీపీ నరేష్ కుమార్, పర్వతగిరి ఇన్స్పెక్టర్ కిషన్, ఎస్సైలు నరేష్, మహేందర్ డీసీపీ అభినందించారు. చదవండి: మంచాన పడ్డ భార్యను చూసేందుకు బైక్‌పై; 20 మీటర్లు ఎగిరి చెట్టు కొమ్మకు -
డబ్బులు ఇవ్వమన్నందుకు సుశీల్ నన్ను చితకబాదాడు
ముంబై: జూనియర్ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్ మెడకు మరో కేసు మెడకు చుట్టుకునేలా ఉంది. ఇప్పటికే మర్డర్ కేసులో అరెస్టైన సుశీల్‌కు ఢిల్లీ రోహిణి కోర్టు శనివారం మరో నాలుగు రోజల రిమాండ్ పొడిగించింది. తాజాగా సుశీల్ కుమార్ ఒక కిరాణా షాప్ ఓనర్‌ను బెదిరించడంతో పాటు అతనిపై దాడికి దిగి దౌర్జన్యానికి పాల్పడినట్లు సతీశ్ యాదవ్ ఇండియా టుడే ఇంటర్య్వూలో తెలిపారు. సతీష్ యాదవ్ మాట్లాడుతూ.. '' నేను 18 సంవత్సరాలుగా ఛత్రసాల్ స్టేడియానికి సరుకులు అందిస్తున్నా. సుశీల్ మామ సత్పాల్ సింగ్ ఛత్రసాల్ స్టేడియంలో కోచ్‌గా ఉన్న సమయంలో నాకు అతనితో మంచి అనుబంధం ఉంది. ఆ అనుబంధం కారణంగా తక్కువ ధరకే సరుకులు అందిస్తుండేవాడిని. కాగా గతేడాది లాక్డౌన్ సమయంలో స్డేడియానికి కోచ్‌గా ఉన్న బీరేంద్ర సరుకుల అందించాలని కోరాడు. అతని ఆర్డర్‌పై నేను రేషన్ అందించాను. అయితే బీరేంద్ర ట్రాన్స్ఫర్ కావడం... అతని స్థానంలో కొత్త కోచ్ వచ్చాడు. నాకు రావాల్సిన రూ. 4 లక్షలు ఇవ్వాలని ఛత్రసాల్ కొత్త కోచ్ అశోక్‌ను అడిగాను. ఒకరోజు అశోక్ నన్ను పిలిచి డబ్బు చెల్లిస్తానని బిల్లులు తీసుకున్నాడు. మరునాడు ధర్మ అనే వ్యక్తి వచ్చి సుశీల్ కుమార్ మిమ్మల్ని పిలుస్తున్నారని చెప్పి వెళ్లాడు. డబ్బు ఇస్తారనే ఆశతో అక్కడికి వెళ్లిన నాకు సుశీల్ డబ్బు ఇవ్వనని చెప్పడంతో అతని కాళ్ల మీద పడి మీరు డబ్బు ఇవ్వకపోతే ఇక్కడే చచ్చిపోతా అని అన్నాను. దానికి సుశీల్ ''అవునా.. ఇక్కడే చచ్చిపోతావా.. అయితే చావు'' అంటూ తన అనుచరులను పిలిచి ఇష్టం వచ్చినట్లు కొట్టించి దౌర్జన్యం చేశాడు. మళ్లీ కనిపిస్తే చంపేస్తానని బెదరించడంతో భయంతో ఇంటికి వెళ్లిపోయాను.'' అని చెప్పుకొచ్చాడు. కాగా సతీష్ యాదవ్ తనపై దాడి చేసిన సుశీల్ బృందంపై గత సెప్టెంబర్‌లో ఫిర్యాదు ఇచ్చినా పోలీసులు పట్టించుకోలేదు. తాజాగా సుశీల్ హత్య కేసులో అరెస్ట్ అయిన విషయం తెలుసుకున్న సతీష్ యాదవ్ తనపై దాడికి దిగిన సుశీల్‌పై మరోసారి ఫిర్యాదు చేస్తానని తెలిపాడు. చదవండి: రెజ్లర్ హత్యకేసు: సుశీల్ కుమార్ రిమాండ్ పొడిగింపు -
రూ.50 కోసం గొడవ, షాపులోని గుమాస్తా మృతి
సాక్షి, సత్తెనపల్లి: యాభై రూపాయల విషయంలో తలెత్తిన వివాదం ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. తమ షాపు యజమానితో వినియోగదారుడు గొడవ పడుతుండగా మధ్యలో సర్ది చెప్పటానికి వెళ్లిన గుమస్తా.. వారి దాడిలో గాయపడి చనిపోయాడు. ఈ ఘటన బుధవారం రాత్రి సత్తెనపల్లిలో జరిగింది. వివరాలు.. సత్తెనపల్లిలోని పాత మార్కెట్ వద్ద ఉన్న శ్రీలక్ష్మి మారుతి సంగం పార్లర్లో పల్లపు కోటి వీరయ్య 15 రోజుల క్రితం కొన్ని వస్తువులు తీసుకుని రూ.50 ఫోన్ పే చేశాడు. అయితే అది ఫెయిల్ కావడంతో.. రూ.50 తర్వాత ఇస్తానని వెళ్లిపోయాడు. షాపు యజమాని వైకుంఠవాసి మూడు, నాలుగుసార్లు అడిగినా వీరయ్య ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించలేదు. రెండు రోజుల కిందట వీరయ్య సోదరుడు నాగేశ్వరరావు ఆ రూ.50 చెల్లించాడు. ఈ విషయం తెలిసి మనస్తాపానికి గురైన వీరయ్య.. తన మరో సోదరుడు తిరుమలేశ్వరరావుతో కలసి బుధవారం రాత్రి 10.30 సమయంలో సంగం పార్లర్ వద్దకు వచ్చి వైకుంఠవాసి, ఆయన భార్యతో గొడవకు దిగాడు. షాపులో గుమస్తాగా పనిచేస్తున్న షేక్ బాజీ(27) సర్దిచెప్పేందుకని.. వారి మధ్యకు వెళ్లాడు. ఆ గొడవలో దెబ్బలు తగలడంతో బాజీ కింద పడి స్పృహ కోల్పోయాడు. బాజీని వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుటుంబానికి చేదోడుగా ఉన్న బాజీ చిన్న వయసులోనే మృతి చెందడంతో.. అతని కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనిపై వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం ఆరుగురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్ఐ రఘుపతి తెలిపారు. -
డబ్బు ఎగ్గొట్టేందుకే ఆత్మహత్య నాటకం
టీ.నగర్ : తిరునెల్వేలి కలెక్టర్ కార్యాలయంలో ఆత్మాహుతికి ప్రయత్నించిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించగా రుణంగా తీసుకున్న నగలు, నగదు ఎగ్గొట్టేందుకు ఈ నాటకం ఆడినట్లు తెలిసింది. నెల్లై జిల్లా, కలక్కాడు సమీపంలోని చిదంబరపురం మేలరథవీథికి చెందిన కృష్ణవేణి (25), భామామీనా (26). వీరి భర్తలయిన మురుగన్,పుగళ్ సేట్టు సోదరులు. గత నెల 27వ తేదీన నెల్లై కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్స్‌డే జరుగుతుండగా కృష్ణవేణి, భామామీనా కిరోసిన్ క్యాన్‌తో అత్మాహుతికి ప్రయత్నించారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. వారు కలెక్టర్ శిల్పా ప్రభాకర్ సతీష్‌కు ఇచ్చిన ఫిర్యాదులో చిదంబరపురానికి చెందిన నలుగురి వద్ద కంతు వడ్డీకి నగదు తీసుకున్నట్లు, నగదు చెల్లించిన తర్వాత కూడా వారు వడ్డీ కోరుతూ బెదిరిస్తున్నట్లు తెలిపారు. దీని గురించి కలక్కాడు పోలీసులకు తెలిపినా విచారణ జరపలేదని ఆరోపించారు. ఇలా వుండగా సేతురాయపురానికి చెందిన వసంతా (80) కలక్కాడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో కృష్ణవేణి, భామామీనా తన బంధువులని, వారు 2018లో నగదు సాయం కోరగా నిరాకరించానని, రెండు రోజుల తర్వాత వారు తమ భర్తలతో వచ్చి నగదు కోరారని, ఆ సమయంలో తాను నగదు లేదని చెప్పి 15 సవర్ల బంగారు చెయిన్, ఐదు సవర్ల నెక్లెస్, గాజులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నగలను ఐదు నెలల తర్వాత ఇస్తానని చెప్పిన వారు తిరిగి ఇవ్వలేదన్నారు. నగలు అడిగితే హత్య చేస్తామని బెదిరించినట్లు తెలిపారు. ప్రస్తుతం వీటిని ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. దీంతో పోలీసులు కృష్ణవేణి, మరుగన్, భామామీనా, పుగల్‌సేట్, మురుగన్ తల్లి మయిల్పై కేసు నమోదు చేశారు. కృష్ణవేణి, భామామీనాలను అరెస్టు చేసిన పోలీసులు మురుగన్, పుగల్‌సేట్, మయిల్ కోసం గాలిస్తున్నారు. -
తమ్ముడిని హతమార్చిన అన్న
సాక్షి, పెద్దదోర్నాల (ప్రకాశం): పెండ్లి బాజాలు మోగిన ఆ యింట్లో పక్షం రోజుల్లోనే మృత్యుఘంటికలు మోగాయి. పచ్చని తోరణాలు ఇంకా వాడకముందే ఆ ఇంట బంధు మిత్రుల రోదనలు మిన్నంటాయి. ఇంటికి పెద్ద దిక్కయి పెళ్లి పెద్దగా వ్యవహరించిన రక్తంపంచుకుపుట్టిన అన్నే సొంత తమ్ముడిని బాణాన్ని సంధించి దారుణంగా హతమార్చాడు. పెండ్లికి చేసిన అప్పు విషయమై సోదరుల మధ్య జరిగిన చిన్నపాటి వివాదం ఈ దుర్ఘటనకు కారణంగా తెలుస్తోంది. మండల పరిధిలోని భ్రమరాంబ చెంచు కాలనీలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన లో గూడేనికి చెందిన గిరిజన యువకుడు భూమని వెంకటేశం (22) అన్న భూమని కొండయ్య చేతితో హతమయ్యాడు. ఎస్సై సుబ్బారావు కథనం మేరకు మండల పరిధిలోని భ్రమరాంబ చెంచు కాలనీకి చెందిన భూమని కొండయ్య, వెంకటేశంలు అన్నాతమ్ముళ్లు. భూమని వెంకటేశంకు కొర్రప్రోలుకు చెందిన లక్ష్మీతో 15 రోజుల క్రితం వివాహం జరిగింది. గిరిజన సంప్రదాయరీతిలో అట్టహాసంగా పెండ్లిని జరిపించారు. ఈ పెండ్లికి పెద్దగా బాధ్యతలు తీసుకున్న భూమని కొండయ్య తమ్ముడి పెండ్లి ఖర్చుల కోసం 25 వేల రూపాయలను అప్పుగా తీసుకుని ఆ డబ్బును తమ్ముడికి అందజేశాడు. ఈ క్రమంలో అన్నాతమ్ముల మధ్య ఆదివారం రాత్రి డబ్బు విషయంలో చిన్నపాటి వివాదం జరిగింది. పెండ్లి కోసం అందజేసిన డబ్బును తిరిగి ఇవ్వాలని కొండయ్య తమ్ముడిపై ఒత్తిడి తెచ్చాడు. దీంతో తన వద్ద ఉన్న మేకలను అమ్మి ఇవ్వాల్సిన మొత్తం డబ్బులను ఇస్తానని వెంకటేశం తెలిపాడు. అయితే మధ్యం మత్తులో ఉన్న కొండయ్య తమ్ముడితో తీవ్ర స్థాయిలో వాగ్వాదానికి దిగి అందుబాటులో ఉన్న విల్లంబుతో వెంకటేశంపై బాణాన్ని సంధించాడు. బాణం ఛాతి మధ్యభాగలో దిగటంతో వెంకటేశం సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మృతుడి భార్య లక్ష్మీ ఫిర్యాదుతో మార్కాపురం డీఎస్పీ నాగేశ్వరరెడ్డి, ఇన్చార్జ్ సీఐ శ్రీరామ్, ఎస్సై సుబ్బారావులు సంఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టనున్నట్లు సీఐ శ్రీరామ్ తెలిపారు. -
డబ్బుల కోసం ఎదురుచూపు
రైతుకు పంట వేసినప్పటి నుంచి చేతికి వచ్చే వరకు తిప్పలే. కష్టపడి పండించిన పంటను అమ్మి డబ్బుల కోసం ఎదురుచూడా ల్సిన పరిస్థితి. అప్పులు చేసి రబీలో సాగుచేసిన సోయా, శనగ పం టను కొనుగోలు కేంద్రాలు విక్ర యించారు. నెలలు గడుస్తున్నప్పటికీ నేటికి డబ్బులు రాక అవస్థలు పడుతున్నారు. ఖరీఫ్‌కు రైతులు సన్నద్ధమ వుతున్న తరుణంలో డబ్బులు రాక అవస్థలు పడాల్సిన దుస్థితి. జైనథ్: ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తున్నప్పటికీ కూడా గత ఖరీఫ్‌లో మార్కెట్లో అమ్మిన సోయా, రబీలో అమ్మిన శనగల విత్తనాల డబ్బులు ఇంకా విడుదల కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరికి లక్షలో సొమ్ము రావాల్సి ఉండగా, నెలలు గడుస్తున్న ఇంకా బ్యాంకు ఖాతాలో జమ కాకపోవడంతో పెట్టుబడి కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. గత సంవత్సరం తీసుకున్న అప్పు పూర్తిగా కట్టలేక, కొత్త అప్పు దొరకక సతమతమతున్నారు. ఇటీవలే సోయా డబ్బుల కోసం ఆదిలాబాద్ పట్టణంలోని మార్కెట్ కమిటీ కార్యాలయం ఎదుట రైతులు ధర్నాకు దిగారు. అయినప్పటికీ ఫలితం లేకపోవడంతో డబ్బుల కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఆరు నెలలైన అందని సోయా డబ్బులు.. ఈ సంవత్సరం జనవరి 20వరకు సోయా కొనుగోలు చేస్తున్నట్లు హాకా అధికారులు ప్రకటించారు. అయితే మధ్యలో 8వ తేదీన కొనుగోళ్లు నిలిపివేస్తున్న ఆదేశాలు జారీ చేశారు. దీంతో మార్కెట్ కమిటీల్లో కొనుగోళ్లు చేసిన రైతుల వివరాలు ఆన్లైన్ చేయడం వీలుకాలేదు. రైతుల పేర్లు సైట్లో రిజిస్ట్రేషన్ చేసినప్పటికీ భూమి వివరాలు, బ్యాంకు ఖాతా వివరాలు, లాట్ వివరాలు పూర్తిగా ఆన్లైన్ కాలేదు. అయితే ఈ సమస్య జైనథ్, ఆదిలాబాద్ మార్కెట్లో తలెత్తింది. హాకా ఉన్నత స్థాయి అధికారులు, మండలాల్లో కొనుగోలు చేపట్టిన అధికారుల నడుమ సమన్వయ లోపం, మార్కెట్లో కొన్న గింజలకు సంబంధించి ఏ రోజుకారోజు ఆన్లైన్ చేసేందుకు అవకాశం లేకపోవడంతో రెండు మండలాల్లో 93 మంది రైతులకు సంబంధించిన రూ.50లక్షల డబ్బులు నిలిచిపోయాయి. వీరి వివరాలు ఆన్లైన్ కాకపోవడంతో అసలు డబ్బులు వస్తాయా? వస్తే ఎప్పుడు వస్తాయి? అనేది తెలియని పరిస్థితి నెలకొంది. దీంతో బాధిత రైతులు లబోదిబోమంటున్నారు. తమ సమస్య పరిష్కరించాలని అధికారుల చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా.. ధర్నాలు చేస్తున్నా.. ఆరు నెలలుగా సమస్య అపరిష్కృతంగానే ఉండటంతో జిల్లా వ్యాప్తంగా 93మంది రైతుల 50లక్షల రూపాయలు పెండింగ్‌లోనే ఉన్నాయి. ఆగిన రూ.70కోట్ల సోయా డబ్బులు.. ఈ సంవత్సరం మార్చి 13 నుంచి ఎప్రిల్ 8వరకు జిల్లా వ్యాప్తంగా మార్క్‌ఫెడ్ జిల్లా వ్యాప్తంగా శనగలు కొనుగొలు చేసింది. మార్చి 13 నుంచి 20 వరకు కొనుగోలు చేసిన రైతుల డబ్బులు వారి ఖాతాల్లో జమ అయ్యాయి. కాకపోతే మార్చి 21 నుంచి ఏప్రిల్ 8 వరకు శనగలు అమ్మిన రైతుల డబ్బులు ఇంకా వారి ఖాతాల్లో జమ కాలేదు. అధికారులు మాత్రం ప్రభుత్వం నుంచే నిధులు విడుదలకాలేదని చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా 8వేలకుపైగా రైతులకు రూ.70కోట్ల డబ్బులు ఇంకా విడుదల కావాల్సి ఉంది. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముంచుకొస్తుండటంతో రైతులు పెట్టుబడి కోసం డబ్బుల లేక అప్పులు చేస్తున్నారు. సోయా, శనగ డబ్బులు ఇవ్వాలి జనవరిలో అమ్మిన సోయా, మార్చిలో అమ్మిన శనగ రెండింటి డబ్బులు రావాల్సి ఉంది. క్వింటాల్‌కు రూ.3399 చొప్పున 20క్వింటాళ్ల సోయలు, క్వింటాల్‌కు రూ.4620 చొప్పున 60క్వింటాళ్ల శనగలు విక్రయించాను. ఒక్క రూపాయి కూడా రాలేదు. - చిందం మోహన్, రైతు, జైనథ్ పది రోజుల్లో వస్తాయి.. జిల్లా వ్యాప్తంగా 8వేలకు పైగా శనగ రైతులకు రూ.70 కోట్ల డబ్బులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వం నుంచి నిధులు ఇంకా విడుదల కాలేదు. శనగ రైతుల డబ్బులు పది రోజుల్లో వస్తాయి. ఉన్నత అధికారులకు సమస్యను విన్నవించాం. ఈ సీజన్ ప్రారంభంలో రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అవుతాయి. రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. - పుల్లయ్య, డీఎం, మార్క్‌ఫెడ్ -
ఉపాధి‘హామీ’ గాలికి!
ఆదిలాబాద్‌రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరుగుతున్న పనులను సోమవారం ‘సాక్షి’ బృందం విజిట్ చేయగా.. కూలీలు పడుతున్న పలు ఇబ్బందులు వెలుగులోకి వచ్చాయి. మండే ఎండల్లో పని చేసేందుకు వారు నానా అవస్థలు పడుతున్నారు. వారికి కనీస సౌకర్యాలు కల్పించాల్సిన అధికారులు మాత్రం ఆ దిశగా చర్యలు తీసుకుంటున్న దాఖలాలేవీ కనిపించలేదు. పనులు జరుగుతున్న చోట దగ్గర టెంట్లు, తాగునీటి వసతులు కూడా ఏర్పాటు చేయలేదు. ఇంటి నుంచి తెచ్చుకున్న నీళ్లే తాగుతున్నామని కూలీలు ‘సాక్షి’ ఎదుట వాపోయారు. ఇక ఓఆర్ఎస్ ప్యాకెట్లు, వైద్యం వంటి సౌకర్యాల జాడే కానరాలేదు. చాలా మందికి పనులు కల్పించకపోవడం వల్ల కూడా వలసబాట పడుతున్నట్లు తెలిసింది. ఆదిలాబాద్‌రూరల్: మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు క్షేత్రస్థాయిలో వసతులు కరువయ్యాయి. రోజురోజుకూ జిల్లాలో ఎండలు మండుతున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కూలీలు సేదతీరడానికి టార్పిన్లు అందించకపోవడంతో ఎండలోనే సేదతీరాల్సిన దుస్థితి నెలకొంది. ప్రతీ సంవత్సరం ఉపాధి హామీ కూలీలకు ఫస్ట్ ఎయిడ్ బాక్సులు పంపిణీ చేస్తారు. కానీ ఈ ఏడాది వాటి పంపిణీ కూడా జరగకపోవడంతో ఏదైనా గాయమైతే కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. గతేడాదికి సంబంధించిన పస్ట్ ఎయిడ్ బాక్సులను వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నా.. అవి మాత్రం క్షేత్రస్థాయిలో ఎక్కడ కనిపించడం లేదు. ఇదిలా ఉండగా 2018–19లో కూలీలకు కనీస వేతనంగా రూ.205 అందించారు. కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే కనీస వేతన కొలమానం ప్రకారం.. ఈ ఏడాది 2019–20 ప్రకారం కూలీలకు రోజు వారీ వేతనాన్ని మరో రూ.6 పెంచారు. కానీ నిధులు అందుబాటులో లేకపోవడంతో వాటిని కూడా సకాలంలో అందించడం లేదని తెలుస్తోంది. పెంచిన వేతనంతో జిల్లాలో లక్షలాది మందికి మేలు కలుగనుంది. జిల్లాలో 2018–19 ఆర్థిక సంవత్సరానికి 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించగా ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 38 లక్షల పని దినాలను కల్పించారు. ఇందులో 6,550 కుటుంబాలకు వంద రోజుల పని దినాలు కల్పించిన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ మేరకు కూలీలకు ఆర్థిక సంవత్సరం మొత్తంలో రూ.64 కోట్లు చెల్లించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో 40 లక్షల పని దినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్ణయించి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. సకాలంలో కూలీలకు డబ్బులు రాకపోవడంతో పనులకు సైతం వెళ్లేందుకు అంతగా ఆసక్తి కనబర్చడం లేదని కూలీలు పేర్కొంటున్నారు. రెండు నెలల కూలి పెండింగ్.. ఎండల్లో పని చేస్తున్న కూలీలకు సకాలంలో వేతనాలు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పనులు చేసి కూడా సకాలంలో డబ్బులు రాకపోతే తమ కుటుంబాలను పోషించుకేనేదేలా అంటూ కూలీలు ప్రశ్నిస్తున్నారు. రెండు నెలల నుంచి వేతనాలు రావడం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ కొంతమంది కూలీలకు గతేడాది డిసెంబర్ నుంచి డబ్బులు రావడం లేదని కూలీలు వాపోతున్నారు. జిల్లాలో 13 మండలల్లో ఉపాధి హామీ పనులు కొనసాగుతుండగా, రెండు నెలల నుంచి ఒక్కో మండలానికి రూ.5లక్షల నుంచి రూ.6లక్షల వరకు డబ్బులు రావాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. కనీసం 40 దినాల పని లభించేనా.. ఉపాధి పనుల్లో జాబ్ కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలనేది ప్రభుత్వ లక్ష్యం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. ఇద్దరు సభ్యులు ఉన్న కుటుంబాలు అనేకం ఉన్నాయి. వీరికి న్యాయం చేసేలా ఒక్కొక్కరికి కనీసం 40 రోజులు పని కల్పించాలన్నది ప్రభుత్వ నిర్ణయం. హరిత హారం కోసం పంచాయతీకి ఒక నర్సరీని ఏర్పాటు చేశారు. ఎక్కువ పనులు చేయడం ద్వారా కూలీలకు అందించే సగటు వేతనం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో రోజుకు కనీసం రూ. 190 వేతనం వచ్చేలా చేయాలని అధికారులు ప్రయత్నిస్తున్నారు. కాగా 2018–19లో జిల్లాలో కూలీలకు సగటు వేతనం 178 మాత్రమే అందింది. పనికి వెళ్తున్న కూలీలు.. 63 వేల మంది.. వేసవిని దృష్టిలో ఉంచుకొని కూలీలు ఉదయం పూటనే ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లాలో ప్రస్తుతం 63 వేల మంది కూలీలు ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు లక్ష మంది కూలీలకు ఉపాధి కల్పిం చేందుకు అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా ఇందులో 13 మండలలోని ఉపాధి హామీ కూలీలకు ఉపాధి హామీ పనులను కల్పిస్తున్నారు. లక్ష్యం నేరవేరేనా.. జిల్లాలో ఆయా మండలల్లోని ఉపాధి హామీ కూలీలకు వేసవి కాలంలో లక్ష మందికి రోజు కూలీ పని కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ సకాలంలో డబ్బులు రాకపోవడంతో కూలీలు పనులకు వెళ్లేందుకు మొగ్గు చూపడం లేదు. దీంతో వారి లక్ష్యం చేరడం కష్టంగా మారింది. డబ్బులు రాలేదు.. వడూర్‌లో ఉపాధి పనులు చేసిన. ఇప్పటికీ డబ్బులు రాలేదు. అధి కారులకు తెలిపినా పట్టించుకోవడంలేదు. కూలీలను ఆదుకుం టామని చెప్పే మాటలు మాటలకే పరిమితమైనాయి. అధికారులు స్పందించి కూలీలకు డబ్బులు సకాలంలో చెల్లించేలా చర్యలు తీసుకుంటే బాగుంటుంది. – సింగం పరమేశ్వర్, కూలీ, వడూర్ ఇంటి నుంచే నీళ్లు తెచ్చుకుంటున్నాం పనులు చేస్తున్న చోట నీళ్ల సరఫరా లేదు. తాగే నీళ్లను ఇంటి నుంచే తెచ్చుకోవాలని చెప్తున్నరు. నీళ్లకు డబ్బులు ఇస్తున్నామంటున్నారు కానీ అవి వస్తున్నాయో లేదో నాకు మాత్రం తెలియదు. మెడికల్ కిట్లు లేవు. ఎండ ఎక్కువగా ఉన్నందున కనీసం ఓఆర్ఎస్ ప్యాకెట్లైనా ఇస్తే బాగుంటుంది. నీడ కోసం టెంట్లు లేవు. సేదతీరాలంటే ఎక్కడైనా చెట్టు ఉంటే కొద్దిసేపు ఉంటున్నం లేకపోతే లేదు.– హెచ్‌కే రమేష్, కూలీ, చిట్యాల్బోరి -
అప్పు తీర్చమంటే.. స్క్రూడ్రైవర్‌తో పొడిచాడు
విజయవాడ: నగరంలోని వన్ టౌన్ చిట్టినగర్‌లో దారుణం జరిగింది. గ్రంది వెంకట రంగారావు అనే వ్యక్తిని సెల్‌ఫోన్ మెకానిక్ గా పనిచేస్తున్న తాజ్ అనే యువకుడు స్ర్కూ డ్రైవర్‌తో పొడిచాడు. పోలీసులు తాజ్‌ను ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. ఛాతి భాగంలో స్ర్కూ డ్రైవర్ బలంగా దిగడంతో వెంటనే అతడిని అలాగే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ వివరాలివి.. రంగారావు తన సెల్‌ఫోన్‌ను రిపేర్ చేయమని తాజ్‌కు ఇచ్చాడు. దాన్ని విక్రయించాలంటూ తాజ్ సలహా ఇవ్వగా అందుకు అతను అంగీకరించాడు. రూ.5వేలకు సెల్‌ఫోన్‌ను విక్రయించిన తాజ్ ఆ డబ్బులు రంగారావుకు ఇవ్వలేదు. గతంలో రంగారావు వద్ద అప్పుగా తీసుకున్న రూ.4 వేలతో కలిపి మొత్తంగా రూ.9 వేలు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి చిట్టినగర్ ఈద్గా సెంటర్లో తాజ్‌ను పట్టుకున్న రంగారావు తనకు రావాల్సిన రూ.9వేల గురించి నిలదీశాడు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరగగా కోపం పట్టలేక తాజ్ స్ర్కూ డ్రైవర్‌తో రంగారావును పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. నిందితుడు తాజ్‌ను పోలీసులు ఆదివారం ఉదయం అదుపులోకి తీసుకున్నారు. -
అప్పు తీర్చమంటే స్ర్కూ డ్రైవర్‌తో పొడిచాడు
-
విపత్కర పరిస్థితే
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల రాష్ట్రంలో కో–ఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల్లో విపత్కర పరిస్థితి నెలకొందని ఎ¯ŒSఏఎఫ్సీయూబీ డైరెక్టర్, ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ అర్బ¯ŒS బ్యాంకు చైర్మ¯ŒS ఎం.ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఖాతాదారులకు జాతీయ బ్యాంకుల కంటే మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. కో–ఆపరేటివ్ అర్బ¯ŒS బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేష¯ŒS రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమహేంద్రవరంలోని కోళ్ల వీరాస్వామి కల్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. కాకినాడ కో–ఆపరేటివ్ అర్బ¯ŒS బ్యాంకు చైర్మన్, ఫెడరేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిటర్లు చాలా వరకు బ్యాంకు పాలకవర్గాలపై నమ్మకంతోనే డిపాజిట్లు చేస్తారన్నారు. నల్లధనం, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడానికి ఈ విధంగా నోట్లను రద్దు చేశామని ప్రధాని చెబుతున్నప్పటికీ ఆ లక్ష్యం ఎక్కడా నెరవేడం లేదన్నారు. వారానికి రూ.24 వేలు మాత్రమే ఇవ్వాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు నిర్దేశిస్తే కొందరి వద్ద రూ.కోట్లు పట్టుబడుతున్నాయన్నారు. తమ వద్ద పొదుపు చేసుకున్న డిపాజిటర్లకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోతున్నామన్నారు. డిపాజిట్లు పెరుగుతున్నాయని, ఆ తరువాత వారికి అసలు, వడ్డీ కలిపి చెల్లించాలంటే తిప్పలు తప్పడం లేదన్నారు. జాతీయ బ్యాంకుల్లా అనైతిక చర్యలకు దిగాల్సిన పని తమకు లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 48 బ్యాంకుల్లోనూ ఆర్బీఐ నిర్ణయం మేరకు డిజిటల్ లావాదేవీలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిట్టూరి రవీంద్ర మాట్లాడుతూ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో జాతీయ బ్యాంకుల కంటే వడ్డీ అధిక శాతం వల్ల చాలా వరకూ పెన్షనర్లు తమ వద్దనే డిపాజిట్లు చేస్తున్నారన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు త్వరలో వర్క్ షాపులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. వివిధ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్లు పాల్గొన్నారు. -
నగదు రహిత లావాదేవీలు జరపండి
కలెక్టర్ అరుణ్‌కుమార్ సూచన బ్యాంకర్లు, తపాలాశాఖ అధికారులతో భేటీ కాకినాడ సిటీ: చిల్లర కొరతను అధిగమించేందుకు నగదుతో నిమిత్తం లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డులను, ఆ¯ŒSలై¯ŒS నెట్ బ్యాంకింగ్ వంటి ప్రత్యామ్నాయాల ద్వారా చెల్లింపులను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్, బ్యాంకులు, తపాలాశాఖ అధికారులతో కలిసి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రూ.500. రూ.1000 నోట్ల రద్దు వల్ల ఎదురవుతున్న మారక నగదు కొరత, పౌర ఇబ్బందుల నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు. ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల సహకారంతో జిల్లా ప్రజలకు లీగల్ మారక నగదు కొరత లేకుండా చర్యలు చేపట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజలు రద్దయిన నోట్లను డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు జిల్లాలో 760 బ్యాంకు బ్రాంచిలు, 54 సబ్ పోస్టాఫీసులు హెడ్ పోస్టాఫీసులు, నగదు విత్ డ్రా చేసుకునేందుకు 811 ఏటీఎంలు పనిచేస్తున్నాయన్నారు. రూపే, డెబిట్ కార్డుల వినియోగంపై అవగాహన జ¯ŒSధ¯ŒS ఖాతాలు పొందిన ప్రతి ఒక్కరికీ రూపే, డెబిట్ కార్డు జారీ చేశామని, వీరందరికీ ఈ కార్డు ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులు చేసే విధానంపై వెలుగు సీసీలు, యానిమేటర్లు, స్వయం సహాయక బృందాల మహిళల సహకారంతో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఏటీఎంలతో పాటు బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్లు, మర్చంట్ల వద్ద రూ.50 వేల పరిమితి వరకూ నగదు డిపాజిట్, చెల్లింపు చేసేందుకు అవకాశం కలిగిన పోష్ మిషన్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రిజర్వుబ్యాంకు నుంచి జారీ అయిన నగదును బ్యాంకులకు డైవర్ట్ చేస్తున్నట్టు అపోహలను తొలగించేందుకు ప్రతి బ్యాంకుకు ప్రతి రోజూ ఎంత నగదు ఆర్బీఐ నుంచి వచ్చింది, ఎంత నగదును బ్రాంచిలు, ఏటీఎంల ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందనే అంశంపై ప్రత్యేక పర్యవేక్షణ పాటిస్తున్నామన్నారు. బినామీల కోసం.. జ¯ŒSధ¯ŒS ఖాతాదారులు తమ ఖాతాలను బినామీ డిపాజిట్ల కోసం దుర్వినియోగం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. రద్దయిన నోట్ల మార్పిడిలో ప్రజల సందేహాలు, సమస్యలను తెలిపేందుకు 1800–425–3077 నంబర్‌తో కలెక్టరేట్లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు డీజీఎం ఆర్.భాస్కరరావు, ఎస్బీఐ రీజనల్ మేనేజర్ డీఎస్ఆర్కే సాయిబాబా మాట్లాడుతూ ఏటీఎంల ద్వారా ప్రజలకు రూ.100 నోట్లను అందుబాటులోకి తెచ్చామని, అన్ని ఏటీఎంలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే రూ.500 నోటు , రూ.2000 నోట్లను ఏటీఎంల ద్వారా కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వాటిని కాలిబరేట్ చేస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, ఎల్డీఎం బీవీ సుబ్రహ్మణ్యం, పోస్టల్ సూపరింటెండెంట్ బ్రహ్మయ్య, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు. -
ఉద్దేశ్యం మంచిదే.. ఆచరణలో వికటించింది
రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు దేవీచౌక్, కల్చరల్ (రాజమహేంద్రవరం) : పెద్ద నోట్ల రద్దు ఉద్దేశ్యం మంచిదే అయినా, ఆచరణలో వికటించిందని చాంబర్ ఆఫ్ కామర్సు రాష్ట్ర కన్వీనర్ అశోక్‌కుమార్ జై¯ŒS అన్నారు. లోక్‌సత్తా పౌర నిఘా వేదిక ఆధ్వర్యంలో కోటిపల్లి బస్టాండు సమీపంలోని ఇండియా ఇండిపెండె¯Œ్స సెంటరులో ఆర్థిక నిపుణులు, న్యాయవాదులు, రాజకీయవేత్తలు, ప్రజాసంఘాల ప్రతినిధులతో పెద్ద నోట్ల రద్దులో చట్ట నిబద్ధత అనే అంశంపై సోమవారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో జై¯ŒS మాట్లాడారు. నోట్ల రద్దు సంగతి కొందరికి ముందే తెలిసిపోయిందన్నారు. సీపీఐ నాయకుడు మీసాల సత్యనారాయణ మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు ప్రజలను మభ్యపెట్టడానికేనన్నారు. లోక్‌సత్తా ఉద్యమ సంస్థ కార్యకర్త జె.రవి మాట్లాడుతూ మోదీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తుల కొమ్ముకాస్తోందని విమర్శించారు. జిల్లా వినియోగదారుల హక్కుల పరిరక్షణ సమితిప్రతినిధి బీఎ¯ŒS వర్మ మాట్లాడుతూ ప్రభుత్వాలు సీబీఐ వంటి దర్యాప్తు సంఘాలను దుర్వినియోగం చేస్తున్నాయన్నారు.రాష్ట్ర బార్ అసోసియేష¯ŒS అధ్యక్షుడు ముప్పాళ సుబ్బారావు సమావేశానికి పంపిన సందేశంలో ముందుగానే అస్మదీయులకు లీకులు ఇచ్చి, అన్నీ సర్దుకున్నాక ఈ ప్రకటన చేశారని ధ్వజమెత్తారు. ప్రముఖ న్యాయవాది మద్దూరి శివసుబ్బారావు మాట్లాడుతూ హోం వర్కు చేయకుండా తీసుకున్న చర్య అన్నారు. ఖాతాదారునిపై నిబంధనలు విధించడం చట్ట విరుద్ధమని లోక్‌సత్తా పౌర నిఘా వేదిక కన్వీనర్ ఎంవీ రాజగోపాల్ పేర్కొన్నారు. సభకు అధ్యక్షత వహించిన రాష్ట్రపతి అవార్డు గ్రహీత చింతపాటిశర్మ మాట్లాడుతూ సముద్రంలో నీరు ఎంత ఉన్నా, దాహం తీరడానికి గుక్కెడు నీరు లేకపోతే ప్రయొజనం లేదన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మ¯ŒS అల్లు బాబి మాట్లాడుతూ హీరోలు కావాలనుకుని నేతలు జీరోలయ్యారని విమర్శించారు. ఆడిటర్ టి.వీరభద్రరావు, న్యాయవాది వల్లూరి సురేష్, జె.కాళేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
లారీఓనర్ ను చంపిన డ్రైవర్
కరీంనగర్: డబ్బుల విషయంలో వచ్చిన పొరపొచ్చలు ఒకరి ప్రాణం తీశాయి. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం సుద్దాల గ్రామంలోని రాజరాజేశ్వరి రైస్‌మిల్ వద్ద జరిగింది. సోమవారం సాయంత్రం మద్యం మత్తులో ఉన్న లారీడ్రైవర్ కుమార్ తన యజమాని గాలి సంపత్‌రావు(35)తో వాగ్వాదానికి దిగాడు. తనకు డబ్బులు ఎక్కువ ఇవ్వాలని గొడవ పెట్టుకున్నాడు. ఆగ్రహంతో ఊగిపోయిన లారీ డ్రైవర్ అంతటితో ఆగకుండా పక్కనే ఉన్న పారతో యజమాని తల మీద బలంగా మోదాడు. దీంతో ఆయనకు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే స్పందించిన స్తానికులు సుల్తానాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున సంపత్‌రావు మృతిచెందాడు. (సుల్తానాబాద్)