చిల్లర కొరతను అధిగమించేందుకు నగదుతో నిమిత్తం లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డులను, ఆ¯ŒSలై¯ŒS నెట్ బ్యాంకింగ్ వంటి ప్రత్యామ్నాయాల ద్వారా చెల్లింపులను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్, బ్యాంకులు, తపాలాశాఖ అధికారులతో కలిసి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు.
-
కలెక్టర్ అరుణ్‌కుమార్ సూచన
-
బ్యాంకర్లు, తపాలాశాఖ అధికారులతో భేటీ
కాకినాడ సిటీ:
చిల్లర కొరతను అధిగమించేందుకు నగదుతో నిమిత్తం లేకుండా డెబిట్, క్రెడిట్ కార్డులను, ఆ¯ŒSలై¯ŒS నెట్ బ్యాంకింగ్ వంటి ప్రత్యామ్నాయాల ద్వారా చెల్లింపులను అలవాటు చేసుకోవాలని కలెక్టర్ హెచ్.అరుణ్‌కుమార్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్ కోర్టు హాలులో కలెక్టర్, బ్యాంకులు, తపాలాశాఖ అధికారులతో కలిసి మంగళవారం మీడియా ప్రతినిధుల సమావేశం నిర్వహించారు. రూ.500. రూ.1000 నోట్ల రద్దు వల్ల ఎదురవుతున్న మారక నగదు కొరత, పౌర ఇబ్బందుల నివారణకు చేపట్టిన చర్యలను వివరించారు. ఆయన మాట్లాడుతూ పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో బ్యాంకులు, పోస్టాఫీసుల సహకారంతో జిల్లా ప్రజలకు లీగల్ మారక నగదు కొరత లేకుండా చర్యలు చేపట్టి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు. ప్రజలు రద్దయిన నోట్లను డిపాజిట్ చేసేందుకు, మార్చుకునేందుకు జిల్లాలో 760 బ్యాంకు బ్రాంచిలు, 54 సబ్ పోస్టాఫీసులు హెడ్ పోస్టాఫీసులు, నగదు విత్ డ్రా చేసుకునేందుకు 811 ఏటీఎంలు పనిచేస్తున్నాయన్నారు.
రూపే, డెబిట్ కార్డుల వినియోగంపై అవగాహన
జ¯ŒSధ¯ŒS ఖాతాలు పొందిన ప్రతి ఒక్కరికీ రూపే, డెబిట్ కార్డు జారీ చేశామని, వీరందరికీ ఈ కార్డు ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులు చేసే విధానంపై వెలుగు సీసీలు, యానిమేటర్లు, స్వయం సహాయక బృందాల మహిళల సహకారంతో అవగాహన కల్పిస్తున్నామని కలెక్టర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఏటీఎంలతో పాటు బ్యాంకుల బిజినెస్ కరస్పాండెంట్లు, మర్చంట్‌ల వద్ద రూ.50 వేల పరిమితి వరకూ నగదు డిపాజిట్, చెల్లింపు చేసేందుకు అవకాశం కలిగిన పోష్ మిషన్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. రిజర్వుబ్యాంకు నుంచి జారీ అయిన నగదును బ్యాంకులకు డైవర్ట్ చేస్తున్నట్టు అపోహలను తొలగించేందుకు ప్రతి బ్యాంకుకు ప్రతి రోజూ ఎంత నగదు ఆర్‌బీఐ నుంచి వచ్చింది, ఎంత నగదును బ్రాంచిలు, ఏటీఎంల ద్వారా ప్రజలకు పంపిణీ చేయడం జరిగిందనే అంశంపై ప్రత్యేక పర్యవేక్షణ పాటిస్తున్నామన్నారు.
బినామీల కోసం..
జ¯ŒSధ¯ŒS ఖాతాదారులు తమ ఖాతాలను బినామీ డిపాజిట్‌ల కోసం దుర్వినియోగం చేస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కలెక్టర్ హెచ్చరించారు. రద్దయిన నోట్ల మార్పిడిలో ప్రజల సందేహాలు, సమస్యలను తెలిపేందుకు 1800–425–3077 నంబర్‌తో కలెక్టరేట్‌లో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో ఆంధ్రా బ్యాంకు డీజీఎం ఆర్.భాస్కరరావు, ఎస్‌బీఐ రీజనల్ మేనేజర్ డీఎస్‌ఆర్‌కే సాయిబాబా మాట్లాడుతూ ఏటీఎంల ద్వారా ప్రజలకు రూ.100 నోట్లను అందుబాటులోకి తెచ్చామని, అన్ని ఏటీఎంలు పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. త్వరలోనే రూ.500 నోటు , రూ.2000 నోట్లను ఏటీఎంల ద్వారా కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేందుకు వాటిని కాలిబరేట్ చేస్తున్నామన్నారు. జాయింట్ కలెక్టర్ ఎస్. సత్యనారాయణ, ఎల్‌డీఎం బీవీ సుబ్రహ్మణ్యం, పోస్టల్ సూపరింటెండెంట్ బ్రహ్మయ్య, వివిధ బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.