బోధనా పద్ధతుల్లో ఆలోచనలు పంచుకోండి
-
కలెక్టర్ అరుణ్‌కుమార్ పిలుపు
భానుగుడి(కాకినాడ) : బోధనా విధానాలపై ఉపాధ్యాయులకు తర్ఫీదునిచ్చేందుకు గెస్ట్ ఫ్యాకల్టీని ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ హెచ్‌ఆర్ అరుణ్‌కుమార్ సంబం«ధిత అ«ధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ కోర్టు హాలులో స్కూల్ కాంప్లెక్స్ సమావేశాల ప్రారంభం సందర్భంగా మండల స్థాయి అధికారులతో ఆయన వీడియో కాన్ఫరె¯Œ్స నిర్వహించి పలు విషయాలపై చర్చించారు. బోధనా పద్దతుల్లో ఆలోచనలను పంచుకోవాలని, ప్రాథమిక తరగతుల్లో విద్యాబోదనలో నాణ్యత పాటించాలని తద్వారా మోడల్ పాఠశాలల ఏర్పాటుకు అవకాశం ఉంటుందన్నారు. దీనికి డిజిటల్ తరగతి గదులను ఉపయోగించుకుని ముందుకు సాగాలన్నారు. డీఈఓ నెలకు రెండుసార్లు పాఠశాల కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించి సమీక్ష జరపాలని ఆదేశించారు. మార్చి 31నాటి 500 గ్రామాలను బహిరంగ మల విసర్జన లేని గ్రామాలుగా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ఉన్నామని దీనికి విద్యార్ధులు, యువత సంపూర్ణ సహకారం అందివ్వాలని కోరారు. ఎంపీడీఓలు, తహసీల్దార్లు, పంచాయతీ అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులను సమన్వయ పరచాలన్నారు. కార్యక్రమంలో డీఈవో ఆర్.నరసింహారావు, రాజీవ్ విద్యామిష¯ŒS పీవో మేకాశేషగిరి, సీఎంఓ ఇంటి వెంకట్రావు, ఏఎంఓ చామంతి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.