బడుగుల ఆశాజ్యోతి
-
-
110వ జయంతి వేడుకలో కలెక్టర్ అరుణ్‌కుమార్
-
వివిధ పథకాల ద్వారా ప్రోత్సాహకాలు, ఉపకరణాల పంపిణీ
కాకినాడ సిటీ :
మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవ¯ŒSరామ్ అణగారిన వర్గాల ప్రజలకు ఆశాజ్యోతిగా నిలిచారని, ఆయన సేవలను గుర్తు చేసుకుని, ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళాలని కలెక్టర్ అరుణ్‌కుమార్ పేర్కొన్నారు. జగ్జీవ¯ŒSరామ్ 110వ జయంతి వేడుకలను సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం కాకినాడలో ఘనంగా నిర్వహించారు. స్థానిక లేడీస్‌క్లబ్ సెంటర్‌లో ఉన్న ఆయన కాంస్య విగ్రహానికి కలెక్టర్ అరుణ్‌కుమార్, ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావు, ఇతర అధికారులు, వివిధ సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులరి్పంచారు. అనంతరం అంబేద్కర్ భవ¯ŒSలో నిర్వహించిన జయంతి సభలో జ్యోతిప్రజ్వలన చేసి ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. విద్యార్థినులు, కలెక్టర్ కేకు కట్ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ నిమ్న సామాజికవర్గంలో జన్మించి పట్టుదల, కృషితో సమాజంలో మహోన్నత శిఖరాలు అధిరోహించిన జగ్జీవ¯ŒSరామ్ జీవితం, ఆశయాలు అందరికీ ఆదర్శప్రాయమన్నారు. ఎస్సీ కార్పొరేషన్, వ్యవసాయ, మత్స్య శాఖల ద్వారా వివిధ పథకాలకు సంబంధించి సుమారు రూ.కోటి విలువైన ఉపకరణాలు, ప్రోత్సాహకాలను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్–2 జె.రాధాకృష్ణమూర్తి, జెడ్పీ సీఈవో పద్మ, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ శోభారాణి, డీఆర్‌డీఏ పీడీ మల్లిబాబు, ఎస్సీ కార్పొరేష¯ŒS ఈడీ అనురాధ, ఎంఆర్‌పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్నా, ఎస్సీ సంఘాల నాయకులు ధనరాశి శ్యాంసుందర్, కళ్యాణం కోటేశ్వరరావు, పిట్టా వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.