- గ్రీవెన్స్‌లో మిశ్రా మార్కు
- తనదైన శైలిలో అర్జీల స్వీకరణ
ఆయన అలా... ఈయన ఇలా..
Published Tue, May 2 2017 12:02 AM | Last Updated on Thu, Mar 21 2019 8:35 PM
సోమవారం..ఉదయం 8:30 గంటలకు..కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం..
ప్రజావాణిలో తమ సమస్యలను చెప్పుకొనేందుకు అర్జీదారులు బారులుదీరారు.
వికలాంగులు, వృద్ధులు, చిన్నారులను చంకనబెట్టుకుని తల్లులు ఇలా కలెక్టరేట్ వెనుక ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవె¯Œ్స షెడ్ వద్ద క్యూ కట్టారు.
సమయం ఉదయం 9 గంటలైంది..
ఇంతలో కలెక్టరేట్ సిబ్బంది పరుగుపరుగున అక్కడి వచ్చారు. ఏం జరిగిందో అని అర్జీదారులు ఆసక్తిగా చూస్తుండగా..
‘‘కలెక్టర్‌గారు రమ్మంటున్నారు’’ అని సిబ్బంది చెప్పడంతో అర్జీదారులు ఆశ్చర్యపోయారు. వెంటనే సిబ్బంది వెంట నడిచారు. సిబ్బంది వారిని కలెక్టరేట్ పై అంతస్తులో కలెక్టర్ చాంబర్ పక్కనే ఉన్న కోర్టు హాలు వద్దకు తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ ఓ గదిలో టేబుల్ చుట్టూ పలు శాఖల అధికారులు, వారికి ఎదురుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కూర్చొని కనిపించారు.
సమయం 9.30 గంటలైంది..
మొదటి బ్యాచ్‌లో ఐదుగురుని కలెక్టర్ కోర్టు హాలులోకి పిలిపించారు. తనకు ఎదురుగా వేయించిన కుర్చీలో కూర్చోబెట్టి అర్జీదారులు తెచ్చిన విజ్ఞాపనలు తీసుకున్నారు. వాటిని పరిశీలించి కలెక్టరేట్‌లోని ఆయా సెక్షన్ల వారికి పంపించారు. అనంతరం రశీదులు అందజేశారు. ఇలా కొత్త కలెక్టర్ మిశ్రా తనదైన శైలిలో గ్రీవె¯Œ్సలో 180 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. గతంలో గంటలకొద్దీ గ్రీవె¯Œ్స వద్ద పడిగాపులు పడే అర్జీదారులు.. ఈ సారి హాలులో కూర్చుని అర్జీలు ఇవ్వడం, కొత్త కలెక్టర్ వాళ్ల సమస్యలను వినడం చూసి ఆశ్చర్యపోయారు. గత కలెక్టర్ అరుణ్‌కుమార్ తాను గ్రీవె¯Œ్సషెడ్‌లో ఉండి కిటికీలో నుంచి అర్జీలు స్వీకరించేవారు. అందుకు భిన్నంగా కలెక్టర్ మిశ్రా వినూత్నంగా గ్రీవె¯Œ్స నిర్వహించడంపై అర్జీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు హాలులోకి ఇద్దరి సాయంతో నడచి వస్తున్న వృద్ధుడిని చూసి కలెక్టర్ మిశ్రా కుర్చీలో నుంచి లేచి అతడికి ఎదురెళ్లి భుజంపై చేయి వేసి అతడి సమస్యలు తెలుసుకున్నారు. ఓ మహిళ తన భూ సమస్యను వెళ్లబోసుకుంటూ ఆయాసం రావడంతో తాను తాగే మంచినీళ్ల గ్లాసును ఆమెకు అందించి కలెక్టర్ మిశ్రా తన మానవత్వాన్ని చాటారు.
ఆలస్యంగా వచ్చిన వారికి గతంలో ప్రతి సోమవారం 11.30 గంటలకు గ్రీవె¯Œ్స ప్రారంభమయ్యేది. ఈ సోమవారం మాత్రం ఉదయం 9.40 గంటలకే కలెక్టర్ మిశ్రా గ్రీవె¯Œ్స ప్రారంభించారు. ఆలస్యంగా వచ్చిన అధికారులను కోర్టు హాలులోకి అనుమతించ లేదు. అయితే మహిళా అధికారిణిలను మాత్రం అనుమతించారు.
– సాక్షిప్రతినిధి, కాకినాడ
Advertisement
Advertisement