అట్రాసిటీ కేసుల్లో న్యాయం జరిగేలా చర్యలు
Published Fri, Jan 6 2017 10:20 PM | Last Updated on Thu, Mar 21 2019 7:27 PM
కాకినాడ సిటీ :
జిల్లాలో అట్రాసిటీకి గురవుతున్న వారికి న్యాయం జరిగేలా విజిలె¯Œ్స అండ్ మానిటరింగ్ కమిటీ చర్యలు చేపట్టడంతో పాటు బాధితులకు పరిహారం సత్వర చెల్లింపునకు బాధ్యత తీసుకోవాల్సి ఉందని కలెక్టర్, కమిటీ చైర్మ¯ŒS హెచ్.అరుణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ విధాన గౌతమీ సమావేశపు హాలులో సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విజిలె¯Œ్స అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. కలెక్టర్ మాట్లాడుతూ అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లింపులో కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్పులు చేసిందని, దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 25ను జారీ చేసిందన్నారు. 2016 జీఓ నంబర్ 95 ప్రకారం ఎక్స్‌గ్రేషియా వెసులుబాటు కల్పించారని, కేసు ఎఫ్‌ఐఆర్ స్టేజిలోనే ఉన్నప్పటికీ ఎక్స్‌గ్రేషియా 10 శాతం ఇవ్వవచ్చని జీఓ చెప్తోందన్నారు. ఎస్పీ, డీఎస్పీ, ఆర్‌డీఓలు కొత్త జీఓ ప్రకారం స్పందించి ఎక్స్‌గ్రేషియా చెల్లింపునకు చర్యలు చేపట్టాలన్నారు. అలాగే కొత్తగా ఏర్పడిన కమిటీ బాధ్యతలను సక్రమంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టాలన్నారు. బాధితులకు ఎక్స్‌గ్రేషియా చెల్లించడానికి చర్యలతో పాటు ఈ మధ్యకాలంలో తప్పుడు కేసులు నమోదవుతున్నందున, సక్రమ కేసుల్లోని బాధితులకు సత్వర న్యాయం జరిపిం చి, తప్పుడు కేసుల నివారణకు పోలీసు అధికారులు కృషి చేయాలన్నారు. ఎంఎల్‌సీ టి.రత్నాబాయి మాట్లాడుతూ విజిలె¯Œ్స అండ్ మోనిటరింగ్ కమిటీ అజెండా ముందే ఇస్తే స్టడీ చేసి కేసులు చర్చించడానికి అవకాశం ఉంటుందని సూచించగా వచ్చే సమావేశం నుంచి సమాచారంతో పాటు అజెండాను కూడా పంపిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఎస్పీ రాజకుమారి, కాకినాడ అడిషనల్ ఎస్పీ దామోదర్, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, కాకినాడ ఆర్‌డీఓ బీఆర్ అంబేద్కర్, కమిటీ సభ్యులు, డీఎస్‌పీలు, పోలీసు అధికారులు పాల్గొన్నారు.
నూతన కమిటీ ఇదే.. : కొత్తగా ఏర్పడిన జిల్లా విజిలె¯Œ్స అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యుల వివరాలను కలెక్టర్ వివరించారు. ఈ కమిటీకి కలెక్టర్ చైర్మ¯ŒSగాను, జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎస్పీ సభ్యులుగా ఉంటారన్నారు. గ్రూప్–ఎ అధికారులు ముగ్గురుంటారని వారిలో ఎస్‌ఈ, ఆర్‌డబ్ల్యూఎస్ రాజేశ్వరరావు, డ్వామా పీడీ ఎ.నాగేశ్వరరావు, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ ఎం.సత్యనారాయణ సభ్యులుగా ఉన్నారన్నారు. అనధికార సభ్యు లు ఐదుగురు ఉంటారని, వారిలో మోర్త శారద (రాజమహేంద్రవరం), కళ్యాణం కోటేశ్వరరావు (కాకినాడ), ఉండ్రు రా మారావు (పాసర్లపూడి), పలివెల సత్యానందం (శంఖవరం), గుడాల కృష్ణ (కాకినాడ) నియమితులయ్యారని, అలాగే ముగ్గురు ఎ¯ŒSజీఓ సభ్యుల్లో గొర్రెల శ్రీకాంత్ (వై.రామవరం) దూళిపూడి వెంకటరమణ (మల్లవరం, తాళ్లరేవు మండలం), బాడుగు శ్రీకాంత్ (సామర్లకోట) సభ్యులుగానూ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా సోషల్ వెల్ఫేర్ డీడీని నియమించినట్టు తెలిపారు.
Advertisement
Advertisement