greevence
-
ఆయన అలా... ఈయన ఇలా..
గ్రీవెన్స్‌లో మిశ్రా మార్కు తనదైన శైలిలో అర్జీల స్వీకరణ సోమవారం..ఉదయం 8:30 గంటలకు..కాకినాడలోని జిల్లా కలెక్టర్ కార్యాలయం.. ప్రజావాణిలో తమ సమస్యలను చెప్పుకొనేందుకు అర్జీదారులు బారులుదీరారు. వికలాంగులు, వృద్ధులు, చిన్నారులను చంకనబెట్టుకుని తల్లులు ఇలా కలెక్టరేట్ వెనుక ప్రతి సోమవారం నిర్వహించే గ్రీవె¯Œ్స షెడ్ వద్ద క్యూ కట్టారు. సమయం ఉదయం 9 గంటలైంది.. ఇంతలో కలెక్టరేట్ సిబ్బంది పరుగుపరుగున అక్కడి వచ్చారు. ఏం జరిగిందో అని అర్జీదారులు ఆసక్తిగా చూస్తుండగా.. ‘‘కలెక్టర్‌గారు రమ్మంటున్నారు’’ అని సిబ్బంది చెప్పడంతో అర్జీదారులు ఆశ్చర్యపోయారు. వెంటనే సిబ్బంది వెంట నడిచారు. సిబ్బంది వారిని కలెక్టరేట్ పై అంతస్తులో కలెక్టర్ చాంబర్ పక్కనే ఉన్న కోర్టు హాలు వద్దకు తీసుకువెళ్లారు. అప్పటికే అక్కడ ఓ గదిలో టేబుల్ చుట్టూ పలు శాఖల అధికారులు, వారికి ఎదురుగా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కూర్చొని కనిపించారు. సమయం 9.30 గంటలైంది.. మొదటి బ్యాచ్‌లో ఐదుగురుని కలెక్టర్ కోర్టు హాలులోకి పిలిపించారు. తనకు ఎదురుగా వేయించిన కుర్చీలో కూర్చోబెట్టి అర్జీదారులు తెచ్చిన విజ్ఞాపనలు తీసుకున్నారు. వాటిని పరిశీలించి కలెక్టరేట్లోని ఆయా సెక్షన్ల వారికి పంపించారు. అనంతరం రశీదులు అందజేశారు. ఇలా కొత్త కలెక్టర్ మిశ్రా తనదైన శైలిలో గ్రీవె¯Œ్సలో 180 మంది నుంచి అర్జీలు స్వీకరించారు. గతంలో గంటలకొద్దీ గ్రీవె¯Œ్స వద్ద పడిగాపులు పడే అర్జీదారులు.. ఈ సారి హాలులో కూర్చుని అర్జీలు ఇవ్వడం, కొత్త కలెక్టర్ వాళ్ల సమస్యలను వినడం చూసి ఆశ్చర్యపోయారు. గత కలెక్టర్ అరుణ్‌కుమార్ తాను గ్రీవె¯Œ్సషెడ్‌లో ఉండి కిటికీలో నుంచి అర్జీలు స్వీకరించేవారు. అందుకు భిన్నంగా కలెక్టర్ మిశ్రా వినూత్నంగా గ్రీవె¯Œ్స నిర్వహించడంపై అర్జీదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కోర్టు హాలులోకి ఇద్దరి సాయంతో నడచి వస్తున్న వృద్ధుడిని చూసి కలెక్టర్ మిశ్రా కుర్చీలో నుంచి లేచి అతడికి ఎదురెళ్లి భుజంపై చేయి వేసి అతడి సమస్యలు తెలుసుకున్నారు. ఓ మహిళ తన భూ సమస్యను వెళ్లబోసుకుంటూ ఆయాసం రావడంతో తాను తాగే మంచినీళ్ల గ్లాసును ఆమెకు అందించి కలెక్టర్ మిశ్రా తన మానవత్వాన్ని చాటారు. ఆలస్యంగా వచ్చిన వారికి గతంలో ప్రతి సోమవారం 11.30 గంటలకు గ్రీవె¯Œ్స ప్రారంభమయ్యేది. ఈ సోమవారం మాత్రం ఉదయం 9.40 గంటలకే కలెక్టర్ మిశ్రా గ్రీవె¯Œ్స ప్రారంభించారు. ఆలస్యంగా వచ్చిన అధికారులను కోర్టు హాలులోకి అనుమతించ లేదు. అయితే మహిళా అధికారిణిలను మాత్రం అనుమతించారు. – సాక్షిప్రతినిధి, కాకినాడ -
సమస్యలపై స్పందించండి
చిత్తూరు (కలెక్టరేట్) : ‘మా సమస్యలపై స్పందించి పరిష్కరించండి సారూ..’ అంటూ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు సోమవారం ప్రజావాణిలో అధికారులకు మొరపెట్టుకున్నారు. సోమవారం స్థానిక కలెక్టరేట్లో మీకోసం ప్రజావాణిని ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ గిరీష, జేసీ–2 వెంకటసుబ్బారెడ్డి, డీఆర్వో విజయ్‌చందర్‌లు అర్జీదారుల నుంచి 92 వినతులు స్వీకరించారు. అందులో రెవెన్యూ 47, డీఆర్డీఏ 16, పౌరసరఫరాలు 13, వైద్య ఆరోగ్యశాఖ 3, హౌసింగ్, పోలీసు, ట్రాన్స్‌కోలకు రెండేసి చొప్పున, విద్యాశాఖకు ఒకటి, ఇతర శాఖలకు 5 చొప్పున వినతులు వచ్చాయి. అదేగాక ఉదయం 10 నుంచి 10.30 గంటల వరకు నిర్వహించిన కాల్‌యువర్ కలెక్టర్‌కు 12 ఫిర్యాదులు అందాయి. అందిన ఫిర్యాదులు, వినతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జేసీ ఆదేశించారు. -
ఉల్లిరైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి
కడప కార్పొరేషన్: జిల్లాలో ఉల్లి పంట సాగుచేసిన రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని కమలాపురం ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్‌రెడ్డి కోరారు. సోమవారం గ్రీవెన్స్‌లో ఆయన జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎకరాకు రూ.60 వేలు పెట్టుబడి పెట్టి రైతులు ఉల్లిపంటను సాగుచేసుకున్నారని, అదృష్టవశాత్తు పంట దిగుబడి కూడా బాగా వచ్చిందన్నారు. అయితే మార్కెట్లో క్వింటాలుకు కేవలం రూ.300–400 మాత్రమే అమ్ముడుపోతుండటంతో రైతులు పెట్టుబడులు రాక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వర్షాకాలమైనందున వాటిని నిల్వ ఉంచడం రైతులకు కష్టసాధ్యంగా మారిందన్నారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు సాగుచేసిన పంటను కొనుగోలు చేయాలని తద్వారా రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉల్లిరైతులు కూడా ఆత్మహత్యలు చేసుకొనే పరిస్థితి దాపురిస్తుందని హెచ్చరించారు. కలెక్టర్‌ను కలిసిన వారిలో వైఎస్ఆర్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్‌రెడ్డి, రైతులు భాస్కర్‌రెడ్డి, విశ్వనాథరెడ్డి, గంగిరెడ్డి పాల్గొన్నారు. -
ఏజెన్సీ గ్రామాలకు వెంటనే విద్యుత్
అల్లిపురం (విశాఖపట్నం): జీకే వీధి మండలం దారకొండ, ఎ.దారకొండ,గాలికొండ, జీకే వీధి, పెదవలస, దేవరాపల్లి, పంచుల, జర్రెల పంచాయితీలలో గల గ్రామాలకు ప్రభుత్వం నిరంతర విద్యుత్ కల్పించాలని సీపీఎం విశాఖ జిల్లా కమిటీ కార్యదర్శి కె.లోకనాథం, కమిటీ సభ్యులు వీవీ శ్రీనివాసరావు, జి.సత్యనారాయణ, ఎ.బుజ్జిబాబు, ఎ.దారకొండ సర్పంచ్ ముర్ల సంధ్యాకుమారి మంగళవారం ఈపీడీసీఎల్ డైరెక్టర్ శేషుకుమార్‌కు వినతి పత్రం అందజేశారు. ఆయా మండలాల్లో ప్రభుత్వం గత ఏడాది లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ పరికరాల వల్ల ఎటువంటి ఉపయోగం లేకుండా పోయిందని వారు వివరించారు. సోలార్ విద్యుత్ పలకలు ఏర్పాటు చేసి ఏడాది గడవకముందే మరమ్మతులకు గురవుతున్నాయని తెలిపారు. నాసిరకమైన మెటిరియల్ వాడటంతో సోటార్ విద్యుత్ పరికరాలు మరమ్మతులకు గురయ్యాయన్నారు. కాంట్రాక్టర్ స్పందించడం లేదని తెలిపారు. సోలార్ విద్యుత్‌కు కావాల్సిన మెటీరియల్‌ను 20 కిలోమీటర్ల దూరం వరకు కాలినడకతో గ్రామాలకు తీసుకెళ్లాల్సి వస్తోందని తెలిపారు. రవాణా ఖర్చులు కూడా ఇవ్వకుండా గ్రామస్తుల శ్రమను కాంట్రాక్టరు దోచుకున్నాడని తెలిపారు. శ్రమను దోచుకున్న కాంట్రాక్టర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని 50 గ్రామాలకు చెందిన ప్రజలు డైరెక్టర్‌కు విన్నవించుకున్నారు. ఏజెన్సీలో మంచు, వర్షాకాలం, శీతాకాలం దట్టమైన పొగమంచు కారణంగా చార్జింగ్ లేక పోవటంతో సోలార్ దీపాలు వెలగడం లేదని తక్షణమే ఆయా గ్రామాలకు సీలేరు నుండి శాశ్వత విద్యుత్తును అందించాలని వారు ఈపీడీసీఎల్ డైరెక్టర్ శేషుకుమార్‌కు వినతిపత్రం అందజేశారు.