విపత్కర పరిస్థితే | round table meeting | Sakshi
Sakshi News home page

విపత్కర పరిస్థితే

Published Sat, Dec 10 2016 11:33 PM | Last Updated on Mon, Sep 4 2017 10:23 PM

round table meeting

కోటగుమ్మం (రాజమహేంద్రవరం) :  
ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల రాష్ట్రంలో కో–ఆపరేటివ్‌ బ్యాంకులు, క్రెడిట్‌ సొసైటీల్లో విపత్కర పరిస్థితి నెలకొందని ఎ¯ŒSఏఎఫ్‌సీయూబీ డైరెక్టర్, ది విశాఖపట్నం కో–ఆపరేటివ్‌ అర్బ¯ŒS బ్యాంకు చైర్మ¯ŒS ఎం.ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఖాతాదారులకు జాతీయ బ్యాంకుల కంటే మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. కో–ఆపరేటివ్‌ అర్బ¯ŒS బ్యాంక్స్‌ అండ్‌ క్రెడిట్‌ సొసైటీస్‌ ఫెడరేష¯ŒS రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమహేంద్రవరంలోని కోళ్ల వీరాస్వామి కల్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. కాకినాడ కో–ఆపరేటివ్‌ అర్బ¯ŒS బ్యాంకు చైర్మన్, ఫెడరేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. కో–ఆపరేటివ్‌ బ్యాంకుల్లో డిపాజిటర్లు చాలా వరకు బ్యాంకు పాలకవర్గాలపై నమ్మకంతోనే డిపాజిట్లు చేస్తారన్నారు. నల్లధనం, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడానికి ఈ విధంగా నోట్లను రద్దు చేశామని ప్రధాని చెబుతున్నప్పటికీ ఆ లక్ష్యం ఎక్కడా నెరవేడం లేదన్నారు. వారానికి రూ.24 వేలు మాత్రమే ఇవ్వాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు నిర్దేశిస్తే కొందరి వద్ద రూ.కోట్లు పట్టుబడుతున్నాయన్నారు. తమ వద్ద పొదుపు చేసుకున్న డిపాజిటర్లకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోతున్నామన్నారు. డిపాజిట్లు పెరుగుతున్నాయని, ఆ తరువాత వారికి అసలు, వడ్డీ కలిపి చెల్లించాలంటే తిప్పలు తప్పడం లేదన్నారు. జాతీయ బ్యాంకుల్లా అనైతిక చర్యలకు దిగాల్సిన పని తమకు లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 48 బ్యాంకుల్లోనూ ఆర్‌బీఐ నిర్ణయం మేరకు డిజిటల్‌ లావాదేవీలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిట్టూరి రవీంద్ర మాట్లాడుతూ కో ఆపరేటివ్‌ బ్యాంకుల్లో జాతీయ బ్యాంకుల కంటే వడ్డీ అధిక శాతం వల్ల చాలా వరకూ పెన్షనర్లు తమ వద్దనే డిపాజిట్లు చేస్తున్నారన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు త్వరలో వర్క్‌ షాపులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. వివిధ కో ఆపరేటివ్‌ బ్యాంకు చైర్మన్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement