round table meeting
-
రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిపోయిందని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా కూటమి నేతలు దాడులతో చెలరేగిపోతున్నారని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందు నుంచే కూటమి కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసం ప్రారంభించారని, ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడులను ఖండించాలని చెప్పారు.ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల హననంపై ప్రజా సంఘాల సమాలోచన సదస్సు (రౌండ్‌టేబుల్ సమావేశం) సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్, ప్రముఖ అంబేడ్కరిస్ట్, గాయకుడు రెంజర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.వీరంతా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై గళమెత్తారు. మానవ హక్కులను కాపాడేందుకు, రాష్ట్రంలో ప్రజా సంఘాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి పోరాటం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితిగా నామకరణం చేశారు. అందరూ ఐక్యతతో, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి, ఎన్నికల హింసను, పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులను అరికట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా సదస్సుల్లో పాల్గొన్న వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనే చెప్పుకోవచ్చు. నాయకులను ప్రజల చేత ఎన్నుకునే విధంగా రాజ్యాంగం రూపొందింది. నేడు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా మలుచుకుని పోరాటాలు చేయడంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. నిరంతరం ఐక్యతతో ముందుకు సాగితేనే ఇలాంటి దాడులను ఆపగలం. – బైరి నరేష్, సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడుయూపీ తరహా అరాచకాలకు ముఖ చిత్రంగా ఏపీ యూపీ తరహా అరాచకాలకు ఏపీ ముఖచిత్రంగా మారుతోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. జేసీబీలతో ఇళ్లను కూలి్చవేయడం చూస్తుంటే యూపీలో పాలనే ఏపీలో కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్య. వీటిన్నింటినీ అడ్డుకునేందుకు ప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి. ఈ దాడులను వ్యతిరేకిస్తూ త్వరలో ప్రజాసంఘాలన్నింటితో కలిసి విస్తృత పోరాటం చేస్తాం. – రెంజర్ల రాజేష్, అంబేడ్కరిస్ట్, గాయకుడుకూటమి పాలన ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు చూస్తుంటే...కూటమి పాలన ఐదేళ్లలో ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రజాసంఘాలన్నీ ఈ దాడులను అరికట్టేందుకు సరైన నిర్ణయంతో ముందుకు సాగాలి. – చిలుక చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఅధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అధికారులు కొమ్ము కాయడం బాధాకరం. ఎన్నికల ముందు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను మారిస్తే వారు జిల్లాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక బృందాలను తీసుకువచ్చామని చెప్పినప్పటికి, ఎన్నికలైన తరువాత దాడులు జరగడం బాధాకరం. దాదాపు 30 గ్రామాల్లో మాదిగ పల్లెలను టార్గెట్ చేస్తూ కూటమి కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ప్రజలకు రక్షణ కలి్పంచాల్సిన అధికారులు పక్షపాతంతో వ్యవహరించడం సిగ్గుచేటు. – కె.కృçష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శిచట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన తరువాత చట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది. ముఖ్యంగా పల్నాడులో వ్యాపారాలను స్వచ్ఛందంగా టీడీపీ నేతలకు అప్పగించాల్సిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలకు తల వంచాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా కుల ఆధిపత్యం చెలరేగిపోతోంది. ఈ దుష్పరిణామాలపై ప్రజా సంఘాలన్ని సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. – కోలా నవజ్యోతి, భారత్ బచావో గుంటూరు, కృష్ణా జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీఅన్యాయంగా కేసులు పెడుతున్నారు రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అన్యాయంగా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ అక్రమ కేసులను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడి వారిలో మనోధైర్యాన్ని నింపాలి. – జయసుధ, వీసీకే పార్టీ నాయకురాలుఐక్యతతో ముందుకు సాగాలి రాష్ట్రంలో దాడులను ఐక్యతతో ఎదుర్కోవాలి. బా«ధితులకు అండగా ఉండాలి. వారి పక్షాన పోరాటం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రజా సంఘాలన్నీ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. – బాలరాజు, అంబేడ్కరిస్ట్, నెల్లూరురాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే ఆ పార్టీల కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గళం విప్పి కూటమి అరాచకాలను ఎండగట్టాలి. – భాను, జర్నలిస్ట్ కలిసికట్టుగా ఒక తాటిపైకి రావాలి రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, బహుజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాల, మాదిగలపై దాడులు పెరిగిపోయాయి. వీటిన్నింటిని అరికట్టాలంటే కలిసి కట్టుగా పోరాటం చేయాలి. దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితులు రావాలి. – వాసిమళ్ల విజయ్, క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్ఈవీఎంలు బ్యాన్ చేయాలి ఈవీఎంలు బ్యాన్ చేయాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. వాటిని బ్యాన్ చేస్తేనే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతాయి. ప్రజా సమస్యల మీద పోరాడే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. గెలిచిన వారు ప్రజా రంజక పాలన అందించాలే గానీ, వ్యక్తిగత రాజకీయాలు చేయకూడదు. – పొందుగల చైతన్య, హైకోర్టు న్యాయవాదిరాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన 77 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం కూడా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరగడం గర్హనీయం. రాష్ట్రంలో మనిíÙని మనిషిగా గౌరవించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మనుషుల మధ్య జరుగతున్న హింసను అరికట్టాలి. బాధితుల తరపున హైకోర్టులో పోరాడటానికి మేం సిద్ధం. – వేముల ప్రసాద్, హైకోర్టు అడ్వొకేట్ప్రతి ఎన్నికల్లో దళిత పల్లెల్లో రక్తం పారుతోంది ఎన్నికలు ఎప్పుడు జరిగినా దళిత పల్లెలే దాడులకు గురవుతున్నాయి. దాడుల్లో దళితుల రక్తం ఏరులై పారుతోంది. ఏపీలో కూటమి నేతలు దళిత పల్లెల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – బూరం అభినవ్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ -
చంద్రబాబుకు అమ్ముడుపోయిన మంద కృష్ణకు బుద్ధి చెబుతాం
సాక్షి, అమరావతి: వర్గీకరణ పేరుతో ముప్పై ఏళ్లుగా మాదిగలకు వెన్నుపోటు పొడుస్తున్న మంద కృష్ణ ఎన్నికలు వచ్చేసరికి చంద్రబాబుకు తమ జాతిని తాకట్టు పెట్టడానికి సిద్ధమవుతాడని మాదిగ సంఘాలు మండిపడ్డాయి. చంద్రబాబుకు ప్యాకేజీకి అమ్ముడుపోయిన మంద కృష్ణ ఈ నెల 30న గుంటూరులో జరిగే సభకు ఎలా వస్తాడో చూస్తామని హెచ్చరించాయి. విజయవాడలోని ఐలాపురం కన్వెన్షన్ హాలులో ఆంధ్రప్రదేశ్ మాదిగ సంఘాల రౌండ్‌టేబుల్ సమావేశం గురువారం జరిగింది. రాష్ట్రంలోని 25 మాదిగ సంఘాల నాయకులు, ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మనువాద బీజేపీ, మోసకారి చంద్రబాబు కూటమికి ఎందుకు ఓటెయ్యాలని పలువురు మాదిగ సంఘాల నేతలు ప్రశ్నించారు. మనువాద విష కౌగిలికి మాదిగలను చేర్చేందుకు మంద కృష్ణ ప్రయత్నిస్తున్నాడని, చంద్రబాబుతో అక్రమ సంబంధం నెరపుతున్నాడని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. అధికారం చేపట్టిన వంద రోజుల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదిస్తానని హామీ ఇచ్చిన బీజేపీ పదేళ్లు అయినా పట్టించుకోలేదని, వర్గీకరణను అడ్డుపెట్టుకుని చంద్రబాబు మాదిగల ఓట్లతో రాజకీయ లబ్ధి పొందుతున్నాడని మండిపడ్డారు. ఇకపై మంద కృష్ణ ఆటలు సాగనివ్వబోమని, అతని ఎత్తులను కచ్చితంగా తిప్పి కొడతామని మాదిగ నేతలు హెచ్చరించారు. మాదిగల ద్రోహులు బాబు, మంద కృష్ణలకు గుణపాఠం చెబుతామన్నారు. రౌండ్‌టేబుల్ సమావేశం నిర్ణయాలను సంఘాల నేతలు మీడియాకు వెల్లడించారు. బాబు దగా చేస్తే.. జగన్ మేలు చేశారు నవ్యాంధ్ర ఎమ్మార్పిఎస్ సమాఖ్య అధ్యక్షులు పరిశపోగు శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ ద్వారా చంద్రబాబు హయాంలో మాదిగలకు 22 వేల ఉద్యోగాలొచ్చాయని మంద కృష్ణ పచ్చి అబద్ధాలు చెబుతున్నాడన్నారు. ముప్పై ఏళ్లుగా టీడీపీ చంకలో దూరిన మంద కృష్ణ రాష్ట్రంలోని మిగిలిన పార్టీలకు మాదిగలను దూరం చేసి జాతికి తీరని ద్రోహం చేశాడన్నారు. చంద్రబాబు పాలనలో మాదిగలకు జరిగిన మేలు ఏమిటో ఒక్కటి కూడా మంద కృష్ణ చెప్పలేడన్నారు. ఓట్లు పొందుతున్న చంద్రబాబు తగినన్ని సీట్లు కేటాయించలేదన్నారు. సీఎం వైఎస్ జగన్ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో మాదిగలకు పది సీట్లు కేటాయించడం సంతోషకరమన్నారు. చంద్రబాబు హయాంలో పది శాతం మాదిగ కుటుంబాలకు మేలు జరిగితే గొప్పలు చెప్పుకునేవారని, అదే సీఎం వైఎస్ జగన్ పాలనలో 90 నుంచి 96 శాతం మాదిగ కుటుంబాలు లబ్ధి పొందాయన్నారు. ఊరి చివర ఉండే వెలివాడల్లోని తమ ఇళ్ల వద్దకే వచ్చి సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అందిస్తోందన్నారు. ఎస్సీ శ్మశాన వాటికల సమస్యను అర్థం చేసుకుని ప్రతి ఊరిలో ఒక ఎకరం చొప్పున కేటాయించేలా ప్రభుత్వం చర్య తీసుకుందన్నారు. మాదిగలకు నిజమైన మేలు చేస్తున్న సీఎం వైఎస్ జగన్‌కు మద్దతు ఇవ్వడం తమ ధర్మం అన్నారు. ఏ హక్కుతో ఏపీకి వస్తావ్ ఎమ్మార్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మయ్య మాట్లాడుతూ.. మాదిగలకు ద్రోహం చేసిన టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి మంద కృష్ణ మద్దతివ్వడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆధార్ కార్డు, ఓటు హక్కు కూడా లేని మంద కృష్ణకు ఏ హక్కు ఉందని ఎన్నికలు వచ్చే సరికి మాదిగ జాతి మొత్తాన్ని చంద్రబాబుకు తాకట్టు పెడుతున్నాడని ప్రశ్నించారు. ప్యాకేజీకి అమ్ముడుపోయిన మంద కృష్ణ తన తీరు మార్చుకోకపోతే ఈ నెల 30న నిర్వహిస్తున్న సభను అడ్డుకుంటామని హెచ్చరించారు. గుంటూరులో ఎలా అడుగుపెడతాడో చూస్తామని, నీ సంగతి తేలుస్తామని అల్టిమేటం ఇచ్చారు. మాదిగలను అంబేడ్కర్ వాదం నుంచి మనువాదం వైపు నడిపే మంద కృష్ణ ప్రయత్నాలను అడ్డుకుంటామన్నారు. మాట్లాడిన వారిలో సువర్ణరాజు(ఏపీ ఎమ్మార్పీఎస్), చెరుకూరి కిరణ్(మాదిగ కార్పొరేషన్ సాధన సమితి), కొరిటిపాటి ప్రేమ్‌కుమార్(మాదిగ మహాసేన), మంద క్రిష్ణయ్య(ఆర్ఎంఆర్పీఎస్), గడ్డం బాపిరాజు(ఐఎన్ఎఫ్ఓఆర్ఎం), పొన్నెకంటి రమే‹Ù(మాదిగ దండోర), జానయ్య (జైభీమ్ ఎమ్మార్పిస్), ఈపూరి ఆదాం(బహుజన పరిరక్షణ సమితి), జుజ్జవరపు రవిప్రకా‹Ù(దళితసేన), మల్లవరపు నాగయ్య(అమరావతి ఎమ్మార్పిఎస్), వరదరాజులు(నేషనల్ ఎమ్మార్పీఎస్), పులిదాసు(ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ పరిరక్షణ సమితి), బి.మేరీ కుమారి ఉన్నారు. మాదిగలకు మేలు చేసిన జగన్ మాదిగలను చంద్రబాబు దగా చేస్తే సీఎం వైఎస్ జగన్ మేలు చేశారని మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు, లిడ్ క్యాప్ చైర్మన్ కాకుమాను రాజశేఖర్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ మందపాటి శేషగిరిరావు స్పష్టం చేశారు. మాదిగ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశానికి సంఘీభావంగా హాజరైన వారు మాట్లాడుతూ.. రాష్ట్రంలో మాదిగలకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. రూ.వేల కోట్లతో సంక్షేమాన్ని అందించారన్నారు. మాదిగలను అడ్డుపెట్టుకుని అన్ని రకాలుగా లబి్ధపొందిన మంద కృష్ణ మోసాలు ఇక సాగవన్నారు. పొరుగు రాష్ట్రం నుంచి వచ్చి ఆంధ్రప్రదేశ్ మాదిగ జాతిని చంద్రబాబుకు తాకట్టు పెడితే సహించేదిలేదన్నారు. తమకు అన్ని విధాలుగా అండగా నిలుస్తున్న సీఎం వైఎస్ జగన్ వెంటే మాదిగలు ఉన్నారని స్పష్టం చేశారు. -
కులగణనపై రౌండ్ టేబుల్ సమావేశం విజయవంతం..
-
బాబును రాష్ట్రం నుంచి బహిష్కరించాలి
సాక్షి, అమరావతి: ‘ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలు ప్రమాదకరం. ప్రతిపక్షాలు విధానపరమైన అంశాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలి. అధికారం కోసం అమాయకులను రెచ్చగొట్టడం సమంజసం కాదు. అసమర్థుల ఆఖరి అస్త్రమే హింస. పుంగనూరు, అంగళ్లు ఘటనలను నివారించాల్సిన చంద్రబాబు.. ఆయనే కార్యకర్తలను ఉసిగొల్పి పోలీసులపై దాడి చేయించడం హేయమైన చర్య. రాజ్యాధికారాన్ని ఎలాగైనా పొందాలనే ఉద్దేశంతో దారుణాలకు తెగబడుతున్న చంద్రబాబును రాష్ట్రం నుంచి, రాజకీయాల నుంచి బహిష్కరించాలి. తనపై పోలీసులు కేసు నమోదు చేస్తే స్పందించిన చంద్రబాబు.. దాడుల్లో గాయపడిన పోలీసులకు సంఘీభావం తెలియజేయకపోవడం ఆయన నీచత్వానికి పరాకాష్ట. అదేవిధంగా కొన్ని పత్రికలు వాస్తవాలను వక్రీకరిస్తూ ఏకపక్షంగా వార్తలు రాస్తూ మీడియా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తున్నాయి. అల్లరిమూకల దాడిలో కన్ను పోగొట్టుకున్న కానిస్టేబుల్, గాయపడిన 30 మంది పోలీసుల గురించి ఒక్కమాట కూడా రాయకపోవడం సిగ్గుచేటు. ఇదేమి జర్నలిజం..’ అని వివిధ రంగాల ప్రముఖులు, మేధావులు ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీ, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం విజయవాడలో ‘ఆంధ్రప్రదేశ్‌లో హింసా రాజకీయాలు–కట్టడి–మీడియా పాత్ర’ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. అంతకుముందు హింసా రాజకీయాలపై ప్రజలకు వాస్తవాలను తెలిపేలా ప్రచారం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పలువురు ప్రముఖుల అభిప్రాయాలు వారి మాటల్లోనే.. అనిశ్చితిని పెంచే కుట్ర ఎన్నికలు సమీపిస్తుండటంతో హింసా ధోరణిని పెంచి ప్రజల్లో అనిశ్చితిని సృష్టిస్తున్నారు. దానిని తిరిగి పాలకపక్షంపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హింసను ప్రభుత్వం అరికట్టలేకపోతోందని ఒక వర్గం మీడియా ప్రజలను తప్పుదారి పట్టిస్తోంది. పవన్ కళ్యాణ్ తన ప్రసంగాల్లో కార్యకర్తలు చావులకు సిద్ధపడి రావాలని పిలుపునివ్వడం వెనుక పెద్ద కుట్ర ఉందనే అనుమానం కలుగుతోంది. లోకేశ్ సైతం ఎక్కువ కేసులు ఉన్నవారికి పదవులు కట్టబెడతామని చెప్పడం హింసా రాజకీయానికి నిదర్శనం కాదా!. ప్రజలు ఇవన్నీ గుర్తించాలి. హింసను ప్రోత్సహించేవారికి బుద్ధి చెప్పాలి. – మేడపాటి వెంకట్, ఏపీ ఎన్ఆర్టీ సొసైటీ అధ్యక్షుడు రూట్ మ్యాప్‌ను ఎందుకు మార్చారు? చంద్రబాబు ప్లాన్ ప్రకారమే తన పర్యటన రూట్ మ్యాప్‌ను పుంగనూరు ఊరిలోకి మార్పు చేసినట్లు తెలుస్తోంది. శాంతిభద్రతల సమస్య సృష్టిస్తే పోలీసులు కాల్పులు జరుపుతారని, అప్పుడు తమ కార్యకర్తలు చనిపోతే సానుభూతి పొందవచ్చని పథకం రచించారు. సభకు వచ్చేటప్పుడు వ్యాన్లలో రాడ్లు, తుపాకులు తీసుకురావడమే ఇందుకు నిదర్శనం. కానీ పోలీసులు సంయమనంతో వ్యవహరించారు. – చెన్నంశెట్టి చక్రపాణి, మాజీ పోలీసుల అధికారి దిగజారిన ప్రతిపక్షాలు నాలుగేళ్లుగా ప్రభుత్వంపై దాడి జరుగుతూనే ఉంది. ప్రతిపక్షాలు దిగజారిపోయి ప్రవర్తిస్తున్నాయి. బాధితులను పట్టించుకోకుండా దాడులకు పురిగొల్పిన వారిని కొన్ని పత్రికలు, చానళ్లు వెనకేసుకురావడం క్రూరమైన చర్య. మేనిఫెస్టోను అమలు చేయని ప్రభుత్వాలను రీకాల్ చేయాలి. అప్పుడు చంద్రబాబు లాంటి నాయకులు నిలవలేరు. – చలాది పూర్ణచంద్రరావు, ఏపీ జర్నలిస్టు యూనియన్ అధ్యక్షుడు పవన్.. బలిదానాలు ఎందుకు? ప్రస్తుతం ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. ఇది నచ్చకనే చంద్రబాబు.. ఆయన తనయుడు లోకేశ్.. దత్తపుత్రుడు పవన్‌కళ్యాణ్ ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఆత్మబలిదానాలకు సిద్ధం కావాలని జనసేన కార్యకర్తలకు చెబుతున్నారు. ఎవరి ఆత్మను ఎవరు బలి తీసుకుంటారు. ఒక్కసారైనా ప్రతిపక్ష నాయకులుగా ప్రజల మేలుకోరే సూచనలను చేశారా?. – సునీత, మూరుతీ మహిళా సొసైటీ అధ్యక్షురాలు చంద్రబాబుపై సివిల్ వార్ తప్పదు హింసను ప్రేరేపిస్తున్న చంద్రబాబు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. చంద్రబాబుపై పోలీసులే తిరగబడే రోజు వస్తుంది. ఇకపై సివిల్ వార్ ప్రారంభమవుతుంది. అప్పుడు బయటకు రావాలంటేనే బాబు భయపడక తప్పదు. చంద్రబాబు తనను ప్రశ్నించిన వ్యక్తి రక్తం చూస్తాడు. ఈ విషయం అనేకసార్లు రుజువైంది. – మాదిగాని గురునాథం, ఎస్డీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రతిపక్షాల తీవ్రవాద రాజకీయం ఎన్నడూ రాష్ట్రంలో ఇలాంటి అరాచక పరిస్థితులు కనిపించలేదు. అధికారం కోసం అర్రులు చాస్తూ.. హింసాత్మక ధోరణిని అవలంబిస్తున్నారు. ప్రతిపక్షాలు తీవ్రవాద రాజకీయాలు చేస్తున్నాయి. పుంగనూరులో పోలీసులపై దాడి గురించి జాతీయ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశాం. ఇందులో ఆరు సెక్షన్ల ప్రకారం చంద్రబాబు నేరాలకు పాల్పడ్డారు. చంద్రబాబు, పవన్, లోకేశ్ చేస్తున్న వ్యాఖ్యలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ అరాచక తీవ్రవాద రాజకీయాలను మొగ్గలోనే తుంచాలి. –వీవీఆర్ కృష్ణంరాజు, ఏపీ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బాబు, పవన్ చీడపురుగులు చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ రాష్ట్రానికి పట్టిన చీడపురుగులు. అధికారం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. ప్రజల ఆర్థిక పరిస్థితులు పెంచాలని సీఎం జగన్ చూస్తుంటే... ప్రతిపక్షాలు మాత్రం జనం చావులను కోరుకుంటున్నాయి. చంద్రబాబు చేసే ప్రతి పనిలోనూ హింస దాగుంటుంది. కార్యకర్తలు చనిపోతే వారి శవాలపై నుంచి వచ్చి అధికారం పొందాలని ప్లాన్ వేశారు. – మాదిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఫోరం ఫర్ బెటర్ సొసైటీ గుంటూరు కన్వినర్ రక్తపాతాన్ని కోరుకుంటున్న బాబు చంద్రబాబు ఓ ఘోరీ, ఓ గజినీ మహ్మద్ మాదిరిగా రక్తపాతాన్ని కోరుకుంటున్నారు. అల్లర్లు సృష్టించి ప్రభుత్వాన్ని కూలదోయాలని ప్రయత్నిస్తున్నారు. విధి నిర్వహణలో మహిళా సీఐ ఓ వ్యక్తిని చెంపదెబ్బ కొడితే వీరంగం చేసిన వికృత రాజకీయ నటుడు పవన్ కళ్యాణ్.. ఇంతమంది పోలీసులకు గాయాలైతే ఎందుకు నోరు మెదపడంలేదు. అధికారాన్ని ప్రజల మనసుల ద్వారా గెలుచుకోవాలి. – విజయబాబు, ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు కన్నుపోయిన కానిస్టేబుల్పైసానుభూతి చూపరా..? రాష్ట్రంలో హింసా రాజకీయం పేట్రేగుతోంది. దీనిపై మేధావులు, పాత్రికేయులు, రాజకీయ పక్షాలు ప్రజలను అప్రమత్తం చేయాలి. అసలు హింసకు పాల్పడినవారెవరో, బాధితులెవరో అందరికీ తెలిసినా కొన్ని పత్రికలు, చానళ్లు పోలీసులదే తప్పని వక్రీకరించి వార్తలు రాయడం, ప్రసారం చేయడం సిగ్గుచేటు. కన్ను కోల్పోయిన కానిస్టేబుల్‌పై కనీస సానుభూతి చూపని చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు. పుంగనూరు, అంగళ్లులో పోలీసులు దెబ్బలు తిని ప్రజల ప్రాణాలు కాపాడారు. – కొమ్మినేని శ్రీనివాసరావు, ఏపీ మీడియా అకాడమీ చైర్మన్ -
పిల్లల టిఫిన్ బాక్సులు తెరిచి చూసి షాకయ్యా: గవర్నర్ తమిళిసై
సాక్షి, హైదరాబాద్: ‘మనం కరెన్సీని కాదు.. కేలరీలను లెక్కించడం చాలా ముఖ్యం’ అని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. మహిళా ఆరోగ్యంపై రాజ్‌భవన్‌లో ఏర్పాటు చేసిన రౌండ్‌టేబుల్ సమావేశానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. స్త్రీలు, కౌమారదశలో ఉన్న బాలికల మానసిక, శారీరక శ్రేయస్సు ప్రధానమని పేర్కొన్నారు. బాల్యం నుంచే బాలికలకు యోగా, శారీరక వ్యాయామం, సంప్రదాయ ఆహార ప్రాధాన్యాన్ని తెలియజేయాలన్నారు. పిల్లలకు తల్లిదండ్రులు ఎలాంటి ఆహారం ఇస్తున్నారో తెలుసుకోవాలంటే పిల్లల టిఫిన్ బాక్సులను తనిఖీ చేయాలని ఆమె సూచించారు. గతంలో తాను ఒకసారి అలా టిఫిన్ బాక్సులను పరిశీలించానని, చాలా బాక్సుల్లో బయటి నుంచి బర్గర్లు, చిప్స్, పఫ్స్, బిస్కెట్లు, స్నాక్స్ ఉండటం చూసి చాలా ఆశ్చర్యపోయానని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా మహిళల ఆరోగ్య అవసరాలపై ఇంకా స్పష్టత రాలేదని గవర్నర్ అభిప్రాయపడ్డారు. మారుమూల గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆరోగ్య పరీక్షలు నిర్వహించడానికి మరిన్ని మొబైల్ మెడికల్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు. ఆయు ష్మాన్ భారత్‌లో మహిళలకు ప్రయోజనం చేకూర్చేందుకు వ్యాధుల కవరేజీని ఎక్కువగా పెంచారని ఆమె వెల్లడించారు. -
వలంటీర్లకు పవన్ క్షమాపణ చెప్పాల్సిందే
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రజలకు నిస్వార్థంగా సేవ చేస్తున్న గ్రామ, వార్డు వలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు తప్పు అని ఒప్పుకుంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని పలువురు మేధావులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం ఆధ్వర్యంలో విజయవాడలో గురువారం ‘మానవ అక్రమ రవాణా–గ్రామ వలంటరీ వ్యవస్థ’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న వారు మాట్లాడుతూ.. ఏ వారాహిపై నుంచి పవన్ నిందలు వేశారో అదే వారాహిపై నుంచి క్షమాపణలు చెప్పకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లలో అతనిపై ప్రైవేటు కేసులు పెట్టాలని, అలాగే పరువునష్టం దావా వేయాలని ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. వలంటీర్ల వ్యవస్థ ఏర్పడినపుడు.. సంచులు మోసే ఉద్యోగం అని, ఇంట్లో మగాళ్లు లేనప్పుడు వెళ్లి తలుపులు కొడతారా అని అప్పట్లో చంద్రబాబు విమర్శించారని గుర్తు చేశారు. చంద్రబాబు మాటలను జనం పట్టించుకోకపోవడంతో పవన్‌ను రంగంలోకి దించారన్నారు. నిఘా సంస్థల పేరును వాడుకుని చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్‌ను పవన్ యథాతథంగా చదువుతున్నారని అన్నారు. అసలు ఏపీ కంటే తెలంగాణలోనే అధికంగా ఇలాంటి కేసులు నమోదవుతున్నాయని, అక్కడ కేసీఆర్‌ను పవన్ ప్రశ్నించగలరా అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో మేధావులు వెల్లడించిన అభిప్రాయాలు వారి మాటల్లోనే.. బిల్లును పాస్ చేయమని కేంద్రాన్ని కోరు.. యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వ్యవస్థలను ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసింది. మానవ అక్రమ రవాణాకు పేదరికం ఒక కారణమని గుర్తించి, దానిని నిర్మూలించడానికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు చేపడుతోంది. కేంద్రంలో గతంలో మేనకా గాంధీ మంత్రిగా ఉన్నప్పుడు మానవ అక్రమ రవాణాపై ఒక బిల్లు తయారు చేశారు. దానిని ఇప్పటి వరకూ పాస్ చేయలేదు. దీనిపై పవన్ నిలదీయాల్సింది కేంద్ర ప్రభుత్వాన్ని గానీ రాష్ట్రాన్ని కాదు. ప్రతి వ్యవస్థలోనూ తప్పులు చేసేవారున్నారు.. సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లను లోబరుచుకుని పిల్లలు పుట్టాక వదిలేసే వారున్నారు. అలాగని హీరోలందరూ అలానే ఉన్నారని అంటామా? –పి.విజయ్‌బాబు, ఏపీ ఇంటెలెక్చువల్స్ సిటిజన్స్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు. పవన్ మాటలు సమంజసం కాదు రాష్ట్రంలో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండటానికి జగన్ నిర్ణయాలు కారణం. గత ప్రభుత్వంలో పింఛన్ కావాలంటే జన్మభూమి కమిటీలకు లంచాలు సమర్పించాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఒకటో తేదీనే కోడి కూయకముందే ఇంటికొచ్చి ఇస్తున్నారు. దీంతో పల్లెల్లో బిక్షాటన పూర్తిగా పోయింది. వలంటీర్ల గురించి తప్పుగా మాట్లాడటం పవన్‌కు సమంజసం కాదు. –డాక్టర్ రామచంద్రారెడ్డి, విద్యావేత్త నిఘా వర్గాలు మీకెందుకు చెప్పాయి? ఏ రాజ్యాంగ పదవిలో ఉన్నారని పవన్‌కు కేంద్ర నిఘా వర్గాలు సమాచారం చెప్పాయి. నిఘా వర్గాల పేరును అడ్డుపెట్టుకుని కుట్ర పూరితంగా మాట్లాడుతున్నారు. వలంటీర్ల వ్వవస్థను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నారు. – పిల్లా రవి, న్యాయవాది. డేటా, పేర్లు బయటపెట్టండి భవిష్యత్ తరాల భవితకు పునాదులు వేస్తున్న ప్రభుత్వం ఇది. పవన్‌కు ఉన్న భావదారిద్య్రం మరొకరికి ఉండదు. రెండు లక్షల పుస్తకాలు చదివాడంట. కేంద్ర నిఘా సంస్థలు ఎలా పనిచేస్తాయో కూడా తెలియదా. పవన్ దగ్గర ఉన్న డేటా, అది చెప్పిన సంస్థల పేరు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నా –శిష్ల్ట ధనలక్ష్మి, న్యాయవాది. చంద్రబాబు ఉచ్చులో పవన్ ఏ వలంటీర్ ఎంత మందిని అక్రమ రవాణా చేశారో ఆధారాలుంటే పవన్ బయటపెట్టాలి. ప్రజల్లో జనసేన చులకనై.. ఆ పార్టీ తన చెప్పు చేతల్లో ఉండాలని చంద్రబాబు పన్నిన ఉచ్చులో కుట్రలో పవన్ ఇరుక్కుంటున్నారు –ఎన్వీ రావ్, అంతర్జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు. పవన్ చేసింది నేరం సెంట్రల్ ఇంటిలిజెన్స్ బ్యూరోని పవన్ బజారున పెట్టారు. మానవ అక్రమ రవాణా గురించి మాత్రమే ఇంటిలిజెన్స్ బ్యూరో చెవిలో చెప్పిందా లేక దేశ భద్రత రహస్యాలు కూడా చెప్పిందా? ఏపీ ప్రజలకు తెలియజేయమని తనకు నిఘా వర్గాలు చెప్పాయని పవన్ అనడం చాలా పెద్ద నేరం. –ఎ.ఎస్.ఎన్. రెడ్డి, విశ్రాంత పోలీస్ అధికారి. అప్పుడు నోరు లేవలేదేం చదువురాని ఎంతో మందికి వలంటీర్లు సేవలందిస్తున్నారు. కాస్టింగ్ కౌచ్ అభియోగం వచ్చినప్పుడు పవన్ ఎందుకు మాట్లాడలేదు. ఆధార్ డేటాను టీడీపీ హయాంలో సాఫ్ట్వేర్ సంస్థకు ఇచ్చినప్పుడు నోరెందుకు మూగబోయింది. 60 శాతం పైగా ఉన్న మహిళా వలంటీర్లు మానసికంగా బాధపడేలా చేశారు. – చంగవల్లి సాయిరాం, న్యాయవాది. జగన్ ఓ స్టేట్స్ మేన్ సీఎం వైఎస్ జగన్‌ను ఏకవచనంతో పిలిస్తే ఏమవుతుంది. దాని వల్ల జగన్‌కు ఏమీ నష్టం లేదు. ఆయన సమర్థవంతమైన పాలనతో దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఎన్నో జాతీయ అవార్డులను తెచ్చుకుంటున్న స్టేట్స్ మేన్(గొప్ప రాజనీతిజ్ఞుడు) సీఎం జగన్. పవన్ బహిరంగ క్షమాపణ చెబితే ఆయనకే మంచిది. కాదంటే ఇకపై సహించేది లేదు. – నరహరిశెట్టి నరసింహారావు, న్యాయవాది. -
టెలికం తయారీకి డాట్ దన్ను
న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం రంగంలో తయారీ వ్యవస్థకు దన్నునిచ్చేందుకు టెలికం శాఖ(డాట్) సన్నాహాలు ప్రారంభించింది. ఈ అంశంలో ప్రభుత్వం తీసుకోవలసిన చర్యలపై అవసరమైన సిఫారసులను సిద్ధం చేసేందుకు నాలుగు టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసింది. తద్వారా టెలికం తయారీ వ్యవస్థ(ఎకోసిస్టమ్)కున్న అవరోధాలను తొలగించి బలపడేందుకు ప్రోత్సాహాన్నివ్వనుంది. ఈ విషయాలను అధికారిక మెమొరాండం పేర్కొంది. ఈ నెల మొదట్లో టెలికం గేర్ల తయారీ కంపెనీలకు చెందిన 42 మంది చీఫ్‌లతో కమ్యూనికేషన్స్ మంత్రి అశ్వినీ వైష్ణవ్ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం ఇందుకు బీజం వేసింది. ఈ సమావేశంలో కంపెనీ చీఫ్‌లు లేవనెత్తిన సమస్యల పరిష్కారానికి టాస్క్‌ఫోర్స్‌ల ఏర్పాటు అవసరమున్నట్లు మంత్రి భావించారు. గేర్ తయారీకి బూస్ట్ టాస్క్‌ఫోర్సుల్లో ఒకదాని ద్వారా టెలికం గేర్ తయారీకి దశలవారీ ప్రోత్సాహక కార్యక్రమాన్ని డాట్ సిఫారసు చేస్తోంది. తద్వారా దేశీ సరఫరా చైన్ ఎకోసిస్టమ్‌కు బూస్ట్‌నివ్వాలని యోచిస్తోంది. దీంతో ప్రపంచ సంస్థలను ఆకట్టుకునే ప్రణాళికల్లో ఉంది. తాజా మెమొరాండం ప్రకారం ఈ టాస్క్‌ఫోర్స్‌కు ప్రభుత్వ రంగ రీసెర్చ్ సంస్థ సీడాట్ సీఈవో ఆర్కే ఉపాధ్యాయ్‌ను సహచైర్మన్‌గా ఏర్పాటు చేయనుంది. 2016లో దేశీయంగా మొబైల్ ఫోన్ల తయారీ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు దశలవారీ కార్యక్రమాన్ని నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. తేజాస్ నెట్వర్క్స్ సీఈవో సంజయ్ నాయక్ అధ్యక్షతన ఏర్పాటుకానున్న టాస్క్‌ఫోర్స్ ప్రస్తుత ఎకోసిస్టమ్‌ను అధ్యయనం చేస్తుంది. తదుపరి టెలి కం టెక్నాలజీ అభివృద్ధి నిధి, సెమికాన్ పాలసీ అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ వంటి పథకాల ద్వారా 4–5 చిప్ డెవలప్‌మెంట్స్‌కు అవకాశాలను సూచిస్తుంది. తద్వా రా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించనుంది. కస్టమ్ క్లియరెన్స్‌లపై దృష్టి మూడో టాస్క్‌ఫోర్స్ కస్టమ్ క్లియరెన్స్, ఎయిర్ కార్గో రవాణా, మౌలికసదుపాయాల అందుబాటుపై పరిశీలన చేపడుతుంది. తద్వారా లీడ్ సమయాన్ని మెరుగుపరచడం, ఉత్పత్తి, అమ్మకాలలో ఇన్వెంటరీని తగ్గించడం, కీలక విమానాశ్రయాలలో ఫ్రీ ట్రేడ్ వేర్‌హౌసింగ్ జోన్ల ఏర్పాటు తదితరాల ద్వారా లాజిస్టిక్స్ సవాళ్లకు చెక్ పెడుతుంది. టెలికం గేర్ తయారీదారుల సమాఖ్య వీవోఐసీఈ(వాయిస్) డైరెక్టర్ జనరల్ ఆర్కే భట్నాగర్ అధ్యక్షతన మరో టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయనుంది. ఈ టాస్క్‌ఫోర్స్ డిజిటల్ ఇండియా, డేటా సెంటర్లు, రైల్వే ఆధునీకరణ తదితరాలకు అవసరమైన 5జీ ప్రొడక్టుల అభివృద్ధి, తయారీకి దేశీయంగా కొత్త అవకాశాలను గుర్తించనుంది. ఈ టాస్క్‌ఫోర్స్‌లన్నీ 45 రోజుల్లోగా నివేదికలను దాఖలు చేయవలసి ఉంటుందని అధికారిక మెమొరాండం పేర్కొంది. -
దేశ చరిత్రలోనే ‘గృహ’త్తర అధ్యాయం
పాత గుంటూరు: గతంలో ఇంటి స్థలం కావాలంటే రోజుల తరబడి పోరాడాల్సి వచ్చేదని, సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మేధావులు, ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ‘పేదల ఇళ్లు – రాజకీయ సవాళ్లు’ అంశంపై మేధావులు, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని ఎన్జీవో హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు జి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదల ఇళ్లపై రాజకీయం చేస్తున్న పలు పార్టీల వైఖరిని ఎండగట్టారు. విపక్షాల రాద్ధాంతం తగదు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తుండటం గొప్ప విషయం. విపక్షాలు విజ్ఞత కోల్పోయి విమర్శలు చేయడం తగదు. – ఆచార్య డీఏఆర్ సుబ్రహ్మణ్యం, మహాత్మా గాంధీ కళాశాల వ్యవస్థాపకుడు బాబు, పవన్ రాజకీయాలకు తగరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు. నా దృష్టిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయ నేతలే కారు. ప్రజల బాధలు పట్టనోళ్లు రాజకీయాలకు తగరు. – ఆచార్య గురవయ్య, ఏసీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఇది స్వర్ణయుగం గుప్తుల స్వర్ణ యుగం గురించి మనం పుస్తకాలలో చదువుకున్నాం. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పాలనలో దానిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందరికీ ఇళ్లు ఇవ్వడం అనేది అతిపెద్ద యజ్ఞం. – చక్రపాణి, విశ్రాంత ఎస్పీ పేదల ఇళ్లు – పవర్‌స్టార్ కన్నీళ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్లను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మహిళా సాధికారతకు నిదర్శనం. పేదల ఇళ్లు–పవర్ స్టార్ కన్నీళ్లు అనే నినాదంతో మహిళలంతా ఉద్యమిస్తే కానీ వాళ్లకు బుద్ధి రాదు. – మంజుల, సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సీఎం నిజమైన ప్రజా పాలకుడు ఏకంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. జగనే నిజమైన ప్రజా పరిపాలకుడు. – గోళ్లమూడి రాజసుందరబాబు, ఐద్వా వ్యవస్థాపకులు రాజకీయాలకు అతీతంగా హర్షిద్దాం గతంలో ఇళ్ల స్థలాలు కావాలంటే రోజుల తరబడి ఆందోళన చేయాల్సి వచ్చేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇది అందరూ హర్షించదగ్గ అంశం. – జి.శ్రీనివాస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు గొప్ప విషయం ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమి సేకరించింది. నిరుపేదల ఇళ్ల కోసం మొత్తం 25 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది వాస్తవం. – పరిశపోగు శ్రీనివాసరావు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పవన్ ఆందోళన హాస్యాస్పదం జగనన్న ఇళ్లపై పవన్ కళ్యాణ్ ఆందోళన హాస్యాస్పదం. జగనన్న ఇళ్లు – జనసేనాని కన్నీళ్లు అని కార్యక్రమం పేరు మార్చితే బాగుంటుంది. – భగవాన్ దాస్, రాష్ట్ర విద్యార్థి ఉద్యమ నేత గూడు చెదరగొట్టే కుట్ర అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు ముఖ్యమంత్రి జగన్ కల్పిస్తున్న గూడు చెదర గొట్టేందుకు రాష్ట్రంలో ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. – తిప్పాబత్తుని గోవింద్, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇది సరికొత్త చరిత్ర తాడి తన్నేవాడి తల తన్నేవాడే జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని ఎత్తులు వేసినా.. వాటికి పైఎత్తు వేసి చిత్తు చేయగల సమర్థుడు. ఇళ్ల నిర్మాణం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు. – వేముల భారతి, అస్మిత మహిళా మండలి అధ్యక్షురాలు పవన్‌కొచ్చిన నొప్పేంటి? సొంత ఇంటి కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డాం. సీఎం జగన్ పుణ్యాన ఇప్పుడు సొంతింటిలో దర్జాగా ఉంటున్నాం. మాలాంటోళ్లకు జగనన్న ఇళ్లు ఇస్తే మీకొచ్చిన నొప్పేమిటి? – రత్నకుమారి, ఇంటి లబ్ధిదారురాలు -
ఆముదాలవలసలో నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణపై తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాలి
బీచ్ రోడ్డు (విశాఖ తూర్పు): పరిపాలన వికేంద్రీకరణపై కొన్ని మీడియా సంస్థలు, కొన్ని పార్టీలు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మేధావులు పిలుపునిచ్చారు. రాజధానిగా అమరావతి అసలు పనికి రాదని స్పష్టంగా చెప్పారు. మూడు రాజధానులతోనే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందుతాయని తేల్చి చెప్పారు. శుక్రవారం పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో ఏయూ హిందీ విభాగంలో మేధావుల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రంలోని పలువురు మేధావులు, పలు సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు, ఇతరులు పాల్గొన్నారు. పరిపాలన వికేంద్రీకరణ జరగల్సిందేనని చెప్పారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ లజపతిరాయ్ మాట్లాడుతూ.. రాజధాని, కోర్టులు ఎక్కడ ఏర్పాటు చేయాలనే అంశం భారత రాజ్యాంగంలో ఎక్కడా లేదని చెప్పారు. ప్రధాని, ముఖ్యమంత్రి పాలనకు అనుకూలమైన ప్రాంతంలో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. అమరావతి కాకుండా వేరే ప్రాంతంలో రాజధాని పెట్టడానికి రాజ్యాంగం ఒప్పుకోదంటూ కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. రాజధానులు ఎన్ని పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి అనేది పాలకుడి నిర్ణయమేనని అన్నారు. ఒక ప్రాంతం మీద అభిమానంతో కాకుండా రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఏర్పాటు చేయడం మంచి నిర్ణయమని తెలిపారు. ప్రాంతాలతో సంబంధం లేకుండా అందరూ స్వాగతించాల్సిన అంశమన్నారు. చంద్రబాబు రక్తం మరిగిన పులి పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక అధ్యక్షుడు సత్యనారాయణ మాట్లాడుతూ మనిషి రక్తం రుచి మరిగిన పులి మాదిరిగానే 14 ఏళ్లు సీఎంగా చేసిన చంద్రబాబు ప్రవర్తన కూడా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రతి అంశాన్నీ వ్యతిరేకించడమే బాబు ధ్యేయమని అన్నారు. ఏదో ఒక విధంగా రాష్ట్రాన్ని నాశనం చేసి లాభం పొందాలని ఆశిస్తున్నారన్నారు. అమరావతి రాజధాని కాదని, అది ఒక కమ్మ సామాజికవర్గం వ్యాపార సామ్రాజ్యమని అన్నారు. పరిపాలన వికేంద్రీకరణ ద్వారా ఇప్పటివరకు వెనుకబడిన ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. సీఎం జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయాలు సరైనవేనని, అందుకు సచివాలయ వ్యవస్థ, జిల్లాల విభజన నిదర్శనమని తెలిపారు. కరోనా సమయంలో సచివాలయ వ్యవస్థ ద్వారా వందలాది మంది ప్రాణాలను కాపాడారని అన్నారు. మారుమూల గ్రామాల ప్రజలు వారి సమస్యలు చెప్పుకొనేందుకు కలెక్టర్ కార్యాలయానికి రావాలంటే రెండు రోజులు పట్టేదని, ఇప్పుడు జిల్లాల విభజనతో వారి చెంతకే కలెక్టరేట్ వచ్చిందన్నారు. అమరావతి రైతులంతా బడా బాబులే: ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ వికేంద్రీకరణ పరిరక్షణ వేదిక గౌరవాధ్యక్షులు ప్రొఫెసర్ ఎన్ఏడీ పాల్ మాట్లాడుతూ తమిళనాడు నుంచి ఆంధ్రను విభజించినప్పుడు రాజధానికి మొదట విశాఖపట్నమే అనుకున్నా.. కొన్ని రాజకీయ పరిస్థితుల దృష్ట్యా కర్నూలుకు మార్చారన్నారు. ఆ తరువాత హైదరాబా«ద్‌కు మార్చి రాష్ట్ర ప్రజల సంపద అంతా అక్కడ పెట్టుబడులుగా పెట్టారన్నారు. ఇప్పుడు కూడా అదేవిధంగా చేయడం వల్ల ఒక ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందుతుందని, అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలంటే వికేంద్రీకరణ జరిగి తీరాల్సిందేనని చెప్పారు. వికేంద్రీకరణ ద్వారా అన్ని ప్రాంతాలకు విద్య, వైద్య, ఉద్యోగావకాశాలు సమానంగా అందుతాయని తెలిపారు. అమరావతి రైతులు అసలు రైతులే కాదని, అంతా బడాబాబులేనని విమర్శించారు. అసలు సిసలైన రైతులు ఉత్తరాంధ్రలో ఉన్నారన్నారు. వరదలొస్తే అమరావతి కొట్టుకుపోతుంది : ప్రొఫెసర్ ముత్తయ్య ప్రొఫెసర్ ముత్తయ్య మాట్లాడుతూ అమరావతి రాజధానిగా అస్సులు పనికి రాదన్నారు. వరదలు వస్తే అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఉందన్నారు. లక్షల కోట్లు వృథా తప్ప మరో ప్రయోజనం ఉండదన్నారు. వాయు, జల, రోడ్డు మార్గాలు ఉన్న విశాఖ నగరాన్ని రాజధానిగా చేస్తే రాష్ట్రానికి అనేక పరిశ్రమలు వస్తాయని చెప్పారు. తద్వారా ఆదాయం పెరిగి సంక్షేమ పథకాలను అమలు చేయవచ్చని తెలిపారు. విద్యార్థుల పోరాటాలు విజయవంతం అవుతాయి : ప్రొఫెసర్ పుల్లారావు ప్రొఫెసర్ పుల్లారావు మాట్లాడుతూ అన్ని ప్రాంతీల అభివృద్ధి కోసమే పరిపాలన వికేంద్రీకరణ అని, ప్రాంతీయ అభిమానంతో కాదని చెప్పారు. విద్యార్థులు చేసిన ఏ పోరాటమైనా విజయవంతం అవుతుందన్నారు. పరిపాలన వికేంద్రీకరణ పరిరక్షణ కోసం విద్యార్థులను భాగస్వామ్యం చేయటం అభినందనీయమన్నారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్లు సూర్యనారాయణ, శోభ శ్రీ , నల్ల సత్యనారాయణ, ప్రేమానందం, కృష్ణ, రాజామాణిక్యం, బార్ కౌన్సిల్ సభ్యులు అరుణ్ కుమార్, కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్: మంత్రి ధర్మాన
సాక్షి, శ్రీకాకుళం: మూడు రాజధానులకు మద్దతుగా జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి రెవన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు హాజరై.. మాట్లాడారు. రాష్ట్ర విభజన చట్టం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన 75 ఏళ్లలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేసి ఉంటే.. విభజన ఉద్యమం వచ్చేదికాదని, నష్టం ఉండేది కాదన్నారు మంత్రి ధర్మాన. ‘భారీ ఖర్చుతో ఏపీకి రాజధాని నిర్మాణం వద్దని శ్రీకృష్ణ కమిటీ చెప్పింది. అయినా లక్షల కోట్లతో అమరావతి ప్రతిపాదన చేశారు. చంద్రబాబుది రియల్ ఎస్టేట్ మోడల్ బ్రెయిన్. చంద్రబాబు సన్నిహితులు భూమి కొనుగోలు చేశాకే రాజధాని ప్రకటించారు. సింగపూర్ పార్లమెంట్లో ఈశ్వరన్ వ్యవహారం బయటపడటంతో చంద్రబాబు నాటకం తెలిసింది. పరిపాలన రాజధానిగా విశాఖకు అన్ని అర్హతలున్నాయి. చంద్రబాబు నారాయణ కమిటీ వేసి 3,940 సీక్రెట్ జీవోలు ఇచ్చారు.’ అని పేర్కొన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. ఈ కార్యక్రమానికి వివిధ రంగాల నిపుణులు హాజరై.. విశాఖను పాలన రాజధానిగా చేయాలని కోరారు. ఇదీ చదవండి: వికేంద్రీకరణకు మద్దతుగా తిరుమలకు పాదయాత్ర -
జెఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం
-
మన వికేంద్రీకరణ ఆకాంక్ష.. వాళ్లకూ తెలియాలి
సాక్షి, అనకాపల్లి: పాలనా వికేంద్రీకరణతోనే రాష్ట్ర భవిష్యత్తుకు బంగారు బాటలు పడతాయని ఉత్తరాంధ్ర మేధావులు, విద్యార్థులు, ఉద్యోగులు ముక్త కంఠంతో స్పష్టం చేశారు. ప్రాంతీయ విభేదాలకు సున్నితంగా తెరదించి, మూడు రాజధానులకు మద్దతిస్తూ రాష్ట్రమంతా ఏకమై శాంతియుతంగా ఉద్యమాలు నిర్వహించే సమయం వచ్చిందని అభిప్రాయపడ్డారు. పాదయాత్రగా వచ్చే అమరావతి దండుయాత్ర ఉత్తరాంధ్రకు చేరకుండా, మన ఆకాంక్ష తెలిసేలా రోజుకొక నియోజకవర్గంలో బంధ్లు నిర్వహించాలని.. రాస్తారోకోలు, ర్యాలీలు శాంతియుతంగా నిర్వహించాలని సూచించారు. విశాఖను పాలనా రాజధానిగా చేయాలంటూ అనకాపల్లి రింగ్ రోడ్డు సమీపంలోని పెంటకోట కన్వెన్షన్ హాలులో శుక్రవారం ఉత్తరాంధ్ర మేధావులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఉద్వేగభరిత వాతావరణంలో సాగిన ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన రాజకీయ, సామాజిక, ఉద్యోగ, విద్యార్థి.. మేధావి వర్గం వారంతా పాల్గొని తమ ఆకాంక్షను చాటారు. ఉత్తరాంధ్ర జిల్లాల అభివృద్ధికి విశాఖను రాజధానిగా చేయడమే మార్గమని నినదించారు. మాజీ వీసీ, ఉత్తరాంధ్ర నాన్‌పొలిటికల్ జేఏసీ చైర్మ న్ లజపతిరాయ్ అధ్యక్షతన ఈ కార్యక్రమం కొనసా గింది. ఏయూ ప్రొఫెసర్ షోరాన్ రాజ్, రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యుడు పక్కి దివాకర్, జేఏసి వైస్ చైర్మన్ దేముడు నాయుడు తదితరులు మాట్లాడారు. అమరావతి యాత్ర ఆపేయాలి ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధితో పాటు అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ఉత్తరాంధ్ర జేఏసీ ఉద్యమిస్తోంది. మద్రాస్ నుంచి విడిపోయిన సమయంలో తొలుత విశాఖనే రాజధానిగా ప్రతిపాదించారు. 1956 లోనే విశాఖ రాజధాని కావాలని అప్పటి అసెంబ్లీ తీర్మానం చేసింది. ఇప్పటికైనా మూడు రాజధానులు ఏర్పాటు చేయకుంటే భవిష్యత్తులో రాష్ట్రం మూడు ముక్కలయ్యే ప్రమాదం ఉంటుంది. అమరావతి యాత్ర ఇప్పటికైనా విరమించుకోవాలని జేఏసీ హెచ్చరిస్తోంది. లేదంటే ఉద్యమం మరింత తీవ్రతరం అవుతుంది. – లజపతిరాయ్, ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ చైర్మన్ టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహి వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది. అదే మా నాయకుడు సీఎం వైఎస్ జగన్ లక్ష్యం. అన్ని ప్రాంతాలు బావుండాలి.. అందరూ బావుండాలనేది వైఎస్సార్సీపీ ప్రభుత్వ ధ్యేయం. ఉత్తరాంధ్ర ప్రజలు విశాఖ రాజధాని కోరుకోవడం లేదని కొందరు టీడీపీ ఉత్తరాంధ్ర ద్రోహులు ప్రచారం చేస్తున్నారు. వారందరికీ విశాఖ గర్జన విజయవంతం కావడమే సమాధానం. ఉత్తరాంధ్ర జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టే ఉద్యమం ఆగదు. వారు ఏ కార్యక్రమం చేపట్టినా మా పార్టీ మద్దతు ఉంటుంది. విశాఖ రాజధాని అయితే రానున్న తరానికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. రాష్ట్రంలోని 26 జిల్లాలు అభివృద్ధి చెందాలంటే, విశాఖ రాజధాని కావాల్సిందే. – బూడి ముత్యాలనాయుడు, డిప్యూటీ సీఎం పాదయాత్ర సాగే ప్రాంతాల్లో బంద్ చేపట్టాలి విశాఖ పరిపాలన రాజధాని అన్నది ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష. పరిపాలన వికేంద్రీకరణ మా ప్రభుత్వ విధానం. అమరావతిని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయా లంటే రూ.ఐదారు లక్షలకోట్లు ఖర్చవుతుంది. చంద్రబా బు ఐదేళ్ల కాలంలో అమరావతికి రూ.6 వేలకోట్లు మాత్ర మే ఖర్చు చేశారు. అందులోనూ రూ.4,500 కోట్లు అప్పు. మిగతా రూ.1,500 కోట్లలో రూ.వెయ్యికోట్లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. ఈ లెక్కన ఆ ఐదేళ్లలో కేవలం రూ.500 కోట్లు మాత్రమే అమరావతికి ఖర్చుచేశారు. అమరావతి రైతులు భూమిని రియల్ ఎస్టేట్ తరహాలో ఇచ్చారు. విశాఖకు పరిపాలన రాజధానిగా అన్ని అర్హతలు ఉన్నాయి. చంద్రబాబు నిస్సిగ్గుగా విశాఖ రాజధానిని వ్యతిరేకిస్తున్నారు. అందుకే రైతుల ముసుగులో పాదయాత్ర చేయిస్తున్నారు. పచ్చ ముసుగు కప్పుకుని చేస్తున్న పాదయాత్ర జరుగుతున్న ప్రాంతంలో బైక్ ర్యాలీలు, నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలపాలి. షాపులు స్వచ్ఛందంగా మూసి వేసి, బంద్ నిర్వహించడం వంటివి జేఏసీ చేపట్టాలి. – బొత్స సత్యనారాయణ, విద్యా శాఖ మంత్రి ఉత్తరాంధ్ర ద్రోహులు బుద్ధి మార్చుకోవాలి అమరావతి రైతులపేరిట నిర్వహించేయాత్ర చంద్రబాబు బినామీల యాత్ర. విశాఖ పరిపాలన రాజధానిగా మారితే ఉత్తరాంధ్రలో వలసలు ఆగిపోతాయి. విశాఖలో అన్ని మౌలిక సదుపాయాలు సమకూరుతాయి. తక్కువ ఖర్చుతోనే అద్భుత రాజధానిగా విశాఖ అభివృద్ధి చెందనుంది. ఇప్పటికైనా ఉత్తరాంధ్ర టీడీపీ ద్రోహులు తమ బుద్ధి మార్చుకోవాలి. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ విప్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతిస్తాం ఉత్తరాంధ్ర జేఏసీ ఏర్పాటు చేసిన నెల రోజుల్లోనే ఉద్యమం ఉధృతమైంది. ఉత్తరాంధ్ర ప్రజలు పరిపాలన రాజధానిగా విశాఖను కోరుకోవడంలేదని చెప్పే ప్రతీ ఒక్కరికీ విశాఖ గర్జన ఒక సమాధానం. అమరావతి రైతుల పేరిట నిర్వహించే దండయాత్ర కారణంగానే ఈ ఉద్యమం మరింత ఉధృతం అయ్యింది. మీరు మా ప్రాంతానికి వచ్చి, మా ప్రాంతం అభివృద్ధి చెందకూడదని కోరుకుంటామంటే మేము ఎలా ఊరుకుంటాం? చంద్రబాబు, ఆయన పార్టీ నేతలంతా ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పాదయాత్ర చేపట్టారు. మా ఉత్తరాంధ్ర ఉద్యమకారులకు చెప్పులు చూపిస్తున్నారు. ఇప్పుడు అమరావతి పేరుతో మరోసారి మోసపోలేం. ఇప్పటికైనా పాదయాత్ర నిలిపివేస్తే మంచిదని కోరుతున్నాం. ఉత్తరాంధ్ర నాన్ పొలిటికల్ జేఏసీ ఏ నిర్ణయం తీసుకున్నా, దానికి మేము కట్టుబడి ఉంటాం. – గుడివాడ అమర్నాథ్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి తొడలు కొట్టడం సంస్కారమా? ఎంతో మంది ముఖ్యమంత్రులుగా పని చేసినా, అందులో కొందరు మాత్రమే ప్రజల గుండెల్లో నిలుస్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కోవలోకే వస్తారు. కేంద్రమే స్వయానా రాజధాని అంశం రాష్ట్ర పరిధిలోని అంశమని చెప్పింది. కానీ ఇక్కడ బీజేపీ నాయకులు అమరావతి ఏకీకృత రాజధాని కావాలని అనడం హాస్యాస్పదంగా ఉంది. చంద్రబాబు రైతుల ముసుగులో చేయిస్తున్న పాదయాత్రకు హైకోర్టు పలు ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. వాళ్లు వాటిని పట్టించుకోకుండా.. తొడలు కొడుతూ.. మీసాలు దువ్వుతూ.. రెచ్చగొట్టేలా ప్రవర్తిస్తుండటం దారుణం. ఇదేనా మీ సంస్కారం? తక్షణమే న్యాయస్థానం ఈ విషయాలను సుమోటోగా తీసుకుని పాదయాత్రను రద్దు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలి. – దాడి వీరభద్రరావు, మాజీ మంత్రి అభివృద్ధిని అడ్డుకుంటే ఊరుకోం ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా విశాఖ వాసులు అక్కున చేర్చుకుంటారు. అలాంటి మా ప్రాంత అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకునేది లేదు. దానికోసం ఎందాకైనా ముందుకు వెళతాం. మా మౌనాన్ని అమాయకత్వం అనుకుంటే పొరపాటే. సీఎం తీసుకున్న పరిపాలన వికేంద్రీకరణకు అందరూ మద్దతు పలుకుతున్నారు. విశాఖ పాలన రాజధాని అయితే దేశంలోనే ప్రధాన నగరాలకు దీటుగా అభివృద్ధి చెందుతుంది. – భీశెట్టి సత్యవతి, అనకాపల్లి ఎంపీ ఉద్యమం ద్వారానే సాధించుకుందాం రాజధాని అవ్వాలంటే రాష్ట్రం మధ్యలోనే ఉండనవసరం లేదు. చరిత్రను పరిశీలిస్తే.. ఉద్యమం ద్వారానే తెలంగాణాను సాధించుకున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా ఉద్యమం ద్వారానే పరిపాలన రాజధాని సాధించుకోవాలి. 29 గ్రామాల కోసం వారు రాజధాని అడిగితే.. రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాలు ఏమవ్వాలి? మన డిమాండ్‌కు మద్దతివ్వని పార్టీలను బంగాళాఖాతంలో కలపాలి. – జూపూడి ప్రభాకర్, ప్రభుత్వ సలహాదారు (సామాజిక న్యాయం) -
వికేంద్రీకరణకు మద్దతుగా అనకాపల్లిలో రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణతోనే సమగ్రాభివృద్ధి
సాక్షి, అమరావతి: అధికారం దూరమైందనే అక్కసుతో టీడీపీ నాయకులు ప్రజలపై కక్ష పెంచుకుని అడుగడుగునా అభివృద్ధి పనులకు ఆటంకాలు సృష్టిస్తున్నారని ఏపీ ఇంటెలెక్చువల్స్ అండ్ సిటిజన్స్ ఫోరం మండిపడింది. విజయవాడలో ఆదివారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ‘పాలనా వికేంద్రీకరణ: ప్రచారాలు, వాస్తవాలు’ అనే అంశంపై పలువురు న్యాయవాదులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. చంద్రబాబు బృందం మూడేళ్లుగా అభివృద్ధిని అడ్డుకుంటోందని ధ్వజ మెత్తారు. చారిత్రక తప్పిదాలను పునరావృతం చేసేందుకు మీడియాను, న్యాయవ్యవస్థను సైతం ఉపయోగించుకుంటోందన్నారు. అమరావతి పేరు తో దోపిడీ చేయడమే కాకుండా ఇతర ప్రాంతాలు ఎదగకుండా నీచ రాజకీయాలు చేయడం క్షమించరానిదన్నారు. ప్రభుత్వం దృష్టిలో శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురం నుంచి చిత్తూరు జిల్లాలోని చివరి గ్రామం వరకు ఒక్కటేనని, అన్ని ప్రాంతాలు సమగ్రాభివృద్ధి జరగాలన్నారు. చంద్రబాబు బృందం ఆయన వర్గ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తూ రెండు జిల్లాలు మాత్రమే అభివృద్ధి చెందాలని చెబుతోందన్నారు. మరో 30ఏళ్లకు కూడా పూర్తికాని అమరావతి కోసం రూ.లక్ష కోట్ల కు పైగా వెచ్చిస్తే మిగతా ప్రాంతాలు ఏం కావాలని ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోయాక బాబుకు ప్రజలు అధికారం ఇస్తే దుర్వినియోగం చేశారన్నారు. ప్రజలపై పగబట్టిన బాబు చంద్రబాబు బృందం తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు అమరావతి రైతులను పావులుగా మార్చేసింది. రైతులను పురిగొల్పి చంద్రబాబు తెరవెనుక ఆనందిస్తున్నారు. అమరావతి ప్రపంచ రాజధాని ఎలా అవుతుంది? భారీ నిర్మాణాలకు ఈ ప్రాంతం అనువుకాదని ఐఐటీ నిపుణులు నివేదిక ఇచ్చినా పట్టించుకోలేదు. నిర్మాణాల భారం లేకుండా రాజధాని కోసం నాగార్జున వర్సిటీ భవనాలు ఇస్తామన్నా తీసుకోకుండా గడ్డి తినేందుకు అమరావతిని ఎంచుకున్నారు. ఇక్కడ ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది. ఇలాంటి తప్పులకు విదేశాల్లో అయితే మరణ శిక్ష విధించేవారు. అధికారం ఊడగొట్టి 23 మంది ఎమ్మెల్యేలకు పరిమితం చేసినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేకపోగా ప్రజలపై పగబట్టారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు కోర్టులను వాడుకుంటున్నారు. అమరావతి భూములు వ్యవసాయయోగ్యమైనవి, ఇక్కడ ఆ తరహా పరిశ్రమలకే అనుకూలం. చంద్రబాబు ఇప్పటికైనా మారాలి, అన్ని ప్రాంతాల అభివృద్ధికి సహకరించాలి. – పి.విజయబాబు, రాష్ట్ర సమాచార హక్కు చట్టం మాజీ కమిషనర్ మిగతా ప్రాంతాలు ఏం కావాలి? చంద్రబాబు స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రగతిని బలిపెడుతున్నారు. ఆయనకు వంతపాడుతూ కొన్ని పత్రికలు, మీడియా అమరావతి రైతులను తప్పుదారి పట్టిస్తున్నాయి. ప్రాంతీయ అసమానతల వల్లనే తెలంగాణ విడిపోయింది, అదే తప్పు చంద్రబాబు అమరావతి పేరుతో చేశారు. వికేంద్రీకరణ అవసరమని శివరామకృష్ణ కమిటీ చెప్పినా పట్టించుకోకుండా అమరావతి పేరుతో రూ.వేల కోట్లు వెచ్చించి అన్నీ తాత్కాలిక భవనాలే నిర్మించారు. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచి వెళ్లారు. రూ.లక్షల కోట్లను అమరావతిలోనే వెచ్చిస్తే రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాలు ఏమైపోవాలి? మూడు రాజధానులతోనే అన్ని ప్రాంతాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. – పిళ్లా రవి, న్యాయవాది కొత్త రాజధాని నిర్మాణం అసాధ్యం ఏ దేశంలోనైనా అన్ని విధాలా అభివృద్ధి చెందిన నగరాన్నే రాజధానిగా ఎంచుకుంటారు. అప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుంది. భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు అన్నిచోట్లా పెద్ద నగరాలను రాజధానిగా ఎంచుకున్నారు. సృష్టికి ప్రతి సృష్టి చేయాలని కలలు కంటూ చంద్రబాబు అమరావతిని ఎంచుకున్నారు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుంటే ఇలాంటి తప్పు ఏ నాయకుడూ చేయరు. రాష్ట్రంలోని మూడు పెద్ద నగరాల్లో అధికార వికేంద్రీకరణ చేయాలి. కొత్త రాజధాని నగరం నిర్మించడం మాటలు కాదు. గుజరాత్ రాజధాని గాంధీనగర్ ఇప్పటికీ ప్రగతి సాధించలేకపోయింది. – కొణిజేటి రమేష్, పారిశ్రామికవేత్త రెండు జిల్లాలే ముఖ్యమా? అభివృద్ధి అంటే భవనాలు, పార్కులు కాదు. సామాన్యుడు తలెత్తుకు తిరిగేలా ఉండాలి. అమరావతిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చోటు ఇవ్వరట. వారికి స్థానం లేని ప్రాంతం రాజధాని ఎలా అవుతుంది? చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని నిరుపేదలు, సామాన్యుల హక్కులను దోచుకున్నారు. కేవలం రెండు జిల్లాలు అభివృద్ధి చెందితే చాలా? ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలు ఏమైపోవాలి? దీనికి చంద్రబాబు సమాధానం చెప్పాలి. – నామాల కోటేశ్వర్రావు, న్యాయవాది వికేంద్రీకరణ తప్పనిసరి అవసరం ఎవరైనా ఒకసారి తప్పు జరిగితే దాన్నుంచి గుణపాఠం నేర్చుకుంటారు. పాలకులైతే మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తారు. చేసిన తప్పును కప్పిపుచ్చుకునేందుకు మళ్లీమళ్లీ తప్పులు చేసేవారిని ఏమనాలి? చంద్రబాబు నాయుడు అదే చేస్తున్నారు. అధికారంలో ఉన్నవారు అన్ని ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. ప్రతిపక్ష టీడీపీ అమరావతి మాత్రమే అభివృద్ధి చెందాలని కోరుకుంటోంది. ఉత్తరాంధ్ర, రాయలసీమ రాష్ట్రంలో అంతర్భాగం కాదా? ఆ ప్రాంతాల అభివృద్ధి టీడీపీకి అవసరం లేదా? ప్రభుత్వం తీసుకున్న వికేంద్రీకరణ నిర్ణయాన్ని అడ్డుకుంటూ మరో తప్పు చేస్తున్నారు. – డాక్టర్ చన్నంశెట్టి చక్రపాణి, రిటైర్డ్ ఎస్పీ సమగ్రాభివృద్థికి వెన్నుపోటు పాలకులు విజ్ఞతతో నిర్ణయాలు తీసుకోవాలి. దేశంలో ఏ రాష్ట్రానికీ లేనన్ని ఆటంకాలను చంద్రబాబు సృష్టిస్తున్నారు. కేంద్రీకృత అభివృద్ధితో తెలుగు ప్రజలు ఏం కోల్పోయారో చరిత్ర చూస్తే అర్థమవుతుంది. చారిత్రక తప్పిదాలను చంద్రబాబు పునరావృతం చేశారు. వాస్తవానికి అమరావతి ప్రజలు ఇక్కడ రాజధాని కావాలని అడగలేదు. చంద్రబాబు తన వర్గం వారితో రైతుల భూములు బలవంతంగా తీసుకున్నారు. సైబర్ టవర్స్ నిర్మాణం సమయంలోనూ బ్లూప్రింట్ తయారీకి ముందే తనవారితో భూములు కొనిపించారు. అదే సూత్రాన్ని ఇక్కడా అమలు చేశారు. నాడు కేంద్ర మంత్రిగా ఉన్న వెంకయ్యనాయుడు, ఈనాడు అధినేత రామోజీరావు దీనికి సూత్రధారులు. అమరావతి అంతా అవినీతిమయం. – కృష్ణంరాజు, రాజకీయ విశ్లేషకులు -
విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం
-
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత: సజ్జల
సాక్షి, తాడేపల్లి: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘బీసీలకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం-బీసీలకు అందిస్తున్న పథకాలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారన్నారు. చదవండి: ‘మద్రాస్, హైదరాబాద్‌లో తంతే అమరావతిలో పడ్డాం’ ‘‘వైసీపీ బీసీ డిక్లరేషన్ పెట్టినపుడు ఎన్నికల జిమ్మిక్కులంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. ఓట్ల రాజకీయం అని ఆరోపించాయి. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత. విద్య ద్వారా సాధికారత సాధ్యమని వైఎస్సార్ నమ్మారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. వైద్యం ఖరీదైన రోజుల్లో నేనున్నాంటూ పేదలకు ఆపన్నహస్తం అందించిన నేత వైఎస్సార్. ఎంబీసీలు నేడు తమ ఉనికి నిలబెట్టుకుంటున్నారు. తమకు కావాల్సిన హక్కుల సాధనకు పోరాడగలుగుతున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీల సాధికారతకు ఆనాడు వైఎస్సార్ హయాంలో తొలి అడుగు పడింది. నేడు వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు. ఈ రోజు మా పార్టీ సభలు జరిగితే సగానికి పైగా వేదికపై బీసీ నేతలే ఉంటున్నారు. రిజర్వేషన్లు అమలు చేయడం పెద్ద పరీక్ష. అనుకున్న దానికంటే ఎక్కువ శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందని’’ సజ్జల అన్నారు. -
ఉత్తరాంధ్ర వెనుక బాటుతనంపై రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణకు మద్దతుగా పాడేరులో రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణకు మద్దతుగా నిడదవోలులో రౌండ్ టేబుల్ సమావేశం
-
పాడేరు కాఫీ హౌస్ లో రౌండ్ టేబుల్ సమావేశం
-
రాజమండ్రి ఎంపీ భరత్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ మీటింగ్
-
మూడుకే మా ఓటు
-
29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదు: మంత్రి బొత్స
సాక్షి, కాకినాడ: వికేంద్రీకరణతోనే అన్ని ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. అమరావతికి తమ ప్రభుత్వం వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. గతంలో చేసుకున్న ఒప్పందాలకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఏపీ అభివృద్ధి-పరిపాలన వికేంద్రీకరణ అంశంపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు సుభాష్ చంద్రబోస్, వంగా గీత, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ.. రాజధాని ప్రతిపాదనలపై లోతైన అధ్యయనం చేసినట్లు పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదన్నారు. ప్రభుత్వానికి 26 జిల్లాలు సమానమేనన్నారు. 29 గ్రామాల కోసం రాష్ట్రానికి సమస్య సృష్టించడం సరికాదని హితవు పలికారు. చదవండి: వికేంద్రీకరణపై రౌండ్‌టేబుల్ సమావేశం: మేధావులు ఏమన్నారంటే -
వికేంద్రీకరణపై రౌండ్‌టేబుల్ సమావేశం: మేధావులు ఏమన్నారంటే
సాక్షి, కాకినాడ: ఏపీ అభివృద్ధి- పరిపాలన వికేంద్రీకరణపై మేధావులు, విద్యార్థులు, రాజకీయ విశ్లేషకులు, గళం విప్పారు. వికేంద్రీకరణ అంశంపై కాకినాడలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, వేణుగోపాలకృష్ణ, దాడిశెట్టి రాజా, ఎంపీలు సుభాష్ చంద్రబోస్, వంగా గీత, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖలో అన్ని వనరులూ ఉండటం సానుకూలాంశంగా విద్యార్థులు పేర్కొన్నారు. చదవండి: ప్లీజ్.. తమ్ముళ్లూ ప్లీజ్.. టీడీపీ నేతలకు చంద్రబాబు లాలింపు విభజనతో నష్టపోయింది మనమే.. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృతం కావడంతోనే ఉద్యమాలు జరుగుతున్నాయని జర్నలిస్టులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాలూ అభివృద్ధి చెందాలన్నది మంచి ఆలోచన అన్నారు. హైదరాబాద్‌ను వదులుకోవడమే పెద్ద తప్పు. విభజన సమయంలో నష్టపోయింది మనమే అని జర్నలిస్టులు అన్నారు. సీఎం జగన్ లక్ష్యాన్ని స్వాగతిస్తున్నాం: కాకినాడ వాసులు వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమని కాకినాడ వాసులు అన్నారు. పాదయాత్ర పేరుతో దండయాత్రలా? అంటూ ప్రశ్నించారు. వికేంద్రీకరణ కోసం ఎందాకైనా ఉద్యమిస్తామని పేర్కొన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధి కాంక్షిస్తున్న ప్రభుత్వానికి సహకరిస్తామన్నారు. అమరావతి పేరుతో చేస్తున్న పాదయాత్రకు కర్త,కర్మ,క్రియ చంద్రబాబే. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలన్న సీఎం జగన్ లక్ష్యాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గతంలో చెన్నై, హైదరాబాద్‌ను వదులుకోవాల్సి వచ్చిందని.. ఒకే రాజధాని ఉంటే మళ్లీ అదే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.. వికేంద్రీకరణతోనే ఏపీ అభివృద్ధి సాధ్యమవుతుందని, ఉద్యోగావకాశాలు పెరుగుతాయని మేధావులు పేర్కొన్నారు. అభివృద్ధి అంతా ఒకే చోట కేంద్రీకృతం కాకూడదన్నారు. వికేంద్రీకరణ ఆలోచన అందుకే వచ్చింది: ఎంపీ బోస్ వికేంద్రీకరణతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్ అన్నారు. అభివృద్ధి అంతటా జరగాలని కోరుకుంటున్నామన్నారు. గత ప్రభుత్వం అనుసరించిన విధానాలతోనే వికేంద్రీకరణ ఆలోచన వచ్చిందన్నారు. సీఎం జగన్ ఆలోచించి, చర్చించి నిర్ణయం తీసుకున్నారని సుభాష్ చంద్రబోస్ తెలిపారు. -
పరిపాలన వికేంద్రీకరణకు మద్దతుగా రౌండ్ టేబుల్ సమావేశం
-
వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖలో రౌండ్ టేబుల్ మీటింగ్
-
రాజధానిపై హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాయలసీమ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం
-
రాయలసీమలోనే రాజధాని కావాలి..
తిరుపతి రూరల్: శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేసి రాయలసీమలో రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని రాయలసీమ అధ్యయనాల సంస్థ అధ్యక్షుడు భూమన సుబ్రమణ్యంరెడ్డి డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పోరాట సమితి(ఆప్స్) అధ్యక్షుడు రఫీహిందూస్థానీ అధ్యక్షతన తిరుపతి యూత్ హాస్టల్లో ‘మూడు రాజధానులు – వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాల అభివృద్ధి’ అనే అంశంపై గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సీమ ప్రాంతానికి చెందిన పలువురు మేధావులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు, యువత ఈ సమావేశంలో పాల్గొని సీమ ఆకాంక్షను వెలిబుచ్చారు. ఈ సందర్భంగా సుబ్రమణ్యంరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని ఏ ప్రాంత ప్రజలు అడగకున్నా స్వార్థం కోసమే గత పాలకులు అమరావతి పేరుతో రాజధానిని ఏర్పాటు చేశారని విమర్శించారు. ముందుగానే లీకులివ్వడంతో వందలాది ఎకరాలను గత పాలకులు మింగేశారని ఆరోపించారు. స్థిరమైన నగరాల్లోనే రాజధానిని అభివృద్ధి చేయాలని ఎస్వీయూ ప్రొఫెసర్ కృష్ణమోహనరెడ్డి కోరారు. అమరావతి ప్రాంత రైతులను టీడీపీ మోసం చేసి.. వారిని రోడ్డుపాల్జేసిందంటూ మండిపడ్డారు. రాయలసీమ రాజధాని ఆకాంక్షను ప్రభుత్వానికి తెలియజేసేందుకు యువత పోరాడాలని పిలుపునిచ్చారు. ఏ కమిటీ కూడా అమరావతిలోనే రాజధానిని పెట్టాలని సూచించిన దాఖలాల్లేవని సీనియర్ జర్నలిస్ట్ రాఘవశర్మ తెలిపారు. రాయలసీమకు వచ్చి సీమ వాసులు ఏర్పాటు చేసుకున్న మూడు రాజధానుల ఫ్లెక్సీలను చించిన దౌర్జన్యకారులకు టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు మద్దతు పలకడం దారుణమని రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ పురుషోత్తంరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సమావేశంలో ఆప్స్ జిల్లా అధ్యక్షుడు షేక్ మహమ్మద్ రఫీ, గిరిజన ప్రజా సమాఖ్య అధ్యక్షుడు శంకరనాయక్, సాహిత్య అకాడమీ కన్వీనర్ డాక్టర్ మస్తానమ్మ, మాల మహానాడు రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. -
కేంద్ర గెజిట్‌ను అడ్డుకుందాం
సాక్షి, పంజగుట్ట(హైదరాబాద్): ఈనెల 14నుంచి తెలుగురాష్ట్రాల్లోని కృష్ణా, గోదావరి నదులను, ప్రాజెక్టులను కేంద్రం చేతుల్లోకి తీసుకుంటున్న నేపథ్యంలో దానికి సంబంధించిన కేంద్రగెజిట్ను రెండు రాష్ట్రాల ప్రజలు అడ్డుకోవాలని అఖిలపక్షం నాయకులు పిలుపునిచ్చారు. కేంద్రం ఒకవైపు ప్రత్యేకరాష్ట్రంల ఇచ్చి మరోవైపు నీటిహక్కుల్ని లాక్కుంటే ఇక రాష్ట్రమిచ్చిన ప్రయోజనం ఏముందని నాయకులు ప్రశ్నించారు. అందుకే కేంద్ర గెజిట్ ప్రతుల్ని దగ్ధం చేయడంతోపాటుగా ఈ అంశంపై గవర్నర్‌కు వినతిపత్రం ఇవ్వాలని నిర్ణయించినట్లు శనివారం మీడియాకు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ‘కృష్ణాలో తెలంగాణకు న్యాయపరమైన వాటా సాధిద్దాం’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ మాట్లాడుతూ.. నదీ జలాల పంపకం సరిగ్గా జరగలేదని, ఆంధ్రాలో కేవలం గేట్లు ఎత్తితే నీరు పారుతుందని, తెలంగాణలో ఎత్తిపోతల ద్వారానే నీటిని వాడుకోవాల్సి పరిస్థితి ఉందని వివరించారు. కృష్ణా నీటి పంపకాల్లో వివాదం ఉంటే గోదావరి ప్రాజెక్టులపై కూడా కేంద్ర పెత్తనం ఏమిటని ప్రశ్నించారు. సీపీఐ నాయకులు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ .. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కలల ప్రాజెక్టు కాళేశ్వరం కూడా కేంద్రం అధీనంలోకి వెళ్లబోతోందని, ఇప్పటికైనా అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రం పెత్తనాన్ని ఆపాలని డిమాండ్ చేశారు. సమావేశంలో అధ్యయన వేదిక కన్వీనర్లు ఎం.రాఘవాచారి, ఎ.రాజేంద్రబాబు, టీడీపీ నాయకులు రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీపీఐ నాయకురాలు పశ్యపద్మ, పౌరహక్కుల సంఘం నాయకులు లక్ష్మణ్, రిటైర్డ్ ఇంజనీర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘కరోనా కంటే భయంకరంగా కల్వకుంట్ల కరోనా’
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేస్తున్నారని, ప్రశ్నించే గొంతులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని పలువురు వక్తలు పేర్కొన్నారు. ఓయూ జేఏసీ, తెలంగాణ మాదిగ దండోరా, తెలంగాణ విద్యార్థి ఉద్యమకారుల వేదిక సంయుక్త ఆధ్వర్యంలో ‘భారత రాజ్యాంగం– చట్టాల దుర్వినియోగం’ అనే అంశంపై సోమవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఓయూ జేఏసీ ప్రతినిధి చారకొండ వెంకటేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, తెలంగాణ మాదిగ దండోరా అధ్యక్షుడు దేవర సతీష్ మాదిగ, ప్రొఫెసర్ అన్సారీ, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ మానవతారాయ్‌లు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రస్తుతం ఉన్న కరోనా వైరస్ కన్నా రాష్ట్రంలో కల్వకుంట్ల కరోనా భయంకరంగా ఆవరించిందన్నారు. ప్రశ్నించినందుకు గతంలో మంద కృష్ణను రెండు నెలలు జైలులో పెట్టారని, తర్వాత ఎంతో మంది విద్యార్థి నాయకులను, ప్రొఫెసర్లను మావోయిస్టు బూచి చూపి అరెస్టులు చేశారన్నారు. ప్రస్తుతం 111 జీవోలో అక్రమ కట్టడాలు బయటపెట్టినందుకు రేవంత్ రెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రశ్నించినందుకు రేవంత్‌ను జైలులో పెడితే ఎన్నో వాగ్ధానాలు ఇచ్చి నెరవేర్చని ముఖ్యమంత్రిని కూడా జైలులో పెట్టాలన్నారు. రేవంత్ ఏమైనా తీవ్రవాదా..? స్టేషన్ బెయిల్ ఇవ్వాల్సిన కేసులో అక్రమంగా మరో 12 కేసులు బనాయించి బెయిలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఒక జాతీయ పార్టీ ఎంపీని అక్రమంగా అరెస్టు చేస్తే దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష ఎంపీలు ఎందుకు ప్రశ్నించడం లేదో అర్థం కావడంలేదన్నారు. ఒకే పార్టీకి చెందిన తోటి ఎంపీని అక్రమంగా అరెస్టు చేస్తే అదే పార్టీ నాయకులు ఎంపీకి వ్యతిరేకంగా మాట్లాడడం దుర్మార్గమని, మీరు అవలంభించిన విధానం వల్ల ఇకపై ఎవ్వరూ ఆ పార్టీలో చేరేందుకు జంకుతారని, ప్రస్తుతం పార్టీలో ఉన్న కార్యకర్తలు కూడా ప్రశ్నార్థకంలో పడ్డారన్నారు. ఢిల్లీ నుంచి హైకమాండ్ ఒక న్యాయవాదిని పంపించారని, ఈ విషయమై రాష్ట్ర కాంగ్రెస్ సిగ్గుపడాలన్నారు. సమావేశంలో ఓయూ జేఏసీ నాయకులు దరువు ఎల్లన్న, దుర్గం భాస్కర్, రెడ్డి జాగృతి నాయకులు శ్రీనివాస్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు దుర్గయ్య గౌడ్, రమేష్, రామ్మూర్తి గౌడ్ తదితరులు పాల్గొన్నారు. (తెరపైకి మరోసారి ఓటుకు కోట్లు కేసు) -
మా దగ్గర ఇన్వెస్ట్ చేయండి: ట్రంప్
న్యూఢిల్లీ: తమ దేశంలో మరింతగా ఇన్వెస్ట్ చేయాలంటూ భారత కంపెనీలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆహ్వానించారు. పెట్టుబడులు పెట్టడాన్ని సులభతరం చేసే దిశగా నియంత్రణలను మరింతగా సడలిస్తామని ఆయన హామీ ఇచ్చారు. భారత పర్యటనలో భాగంగా మంగళవారం దేశీ దిగ్గజ సంస్థల సీఈవోలతో రౌండ్‌టేబుల్ సమావేశంలో ట్రంప్ పాల్గొన్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ, మహీంద్రా అండ్ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా, టాటా సన్స్ చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా తదితర దిగ్గజాలు దీనికి హాజరయ్యారు. తమ వ్యాపార కార్యకలాపాలు, పెట్టుబడుల గురించి ట్రంప్‌నకు వారు వివరించారు. ‘మీ అందరికీ ధన్యవాదాలు. అపూర్వ విజయాలు సాధించిన మీకు అభినందనలు. మీరు అమెరికా రావాలని, బిలియన్ల కొద్దీ డాలర్లు ఇన్వెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను. మేం పెట్టుబడులను నిధులపరంగా కాకుండా ఉద్యోగాల కల్పన దృష్టితో చూస్తాం‘ అని ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో చట్టాలపరంగానూ, ప్రభుత్వపరంగానూ ఉన్న నియంత్రణలపరమైన సమస్యల అంశాన్ని ఈ సందర్భంగా కొందరు వ్యాపారవేత్తలు ప్రస్తావించారు. ‘చాలా నియంత్రణలను ఎత్తివేయబోతున్నాం. పెను మార్పులను మీరు త్వరలోనే చూడబోతున్నారు. ఇకనుంచి పరిస్థితి మరింత మెరుగుపడుతుంది‘ అని ట్రంప్ సమాధానమిచ్చారు.(సీఎన్ఎన్ X ట్రంప్) ఇక్కడ మేము.. అక్కడ మీరు.. అమెరికా, భారతీయ కంపెనీలు ఇరు దేశాల్లోనూ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని ట్రంప్ చెప్పారు. ఉపాధి కల్పనకు ప్రభుత్వాలు తోడ్పాటు మాత్రమే అందించగలవని, ప్రైవేట్ రంగమే వాస్తవానికి ఉద్యోగాలు కల్పించగలుగుతుందని ఆయన తెలిపారు. ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, తాను కలిసి పనిచేస్తున్నామని ట్రంప్ చెప్పారు. ‘మీ ద్వారా మేము ఈ దేశంలో, ఆయన మా దేశంలో ఉద్యోగాలు కల్పించగలుగుతున్నాం‘ అని ఆయన పేర్కొన్నారు. భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని చెప్పిన ట్రంప్.. మిగతా వివరాలు మాత్రం వెల్లడించలేదు. సీఈవోల సమావేశంలో మోదీపై ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ‘మోదీ చాలా మంచి వ్యక్తి అని ఎవరో చెప్పారు. ఆయన నిజంగా మంచి వ్యక్తే. అంతే కాదు చాలా స్థిరంగానూ వ్యవహరిస్తారు. ఆయన గొప్పగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు‘ అని ట్రంప్ కితాబిచ్చారు.(నమస్తే ట్రంప్ అదిరింది... ) మళ్లీ నేనే.. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి తానే గెలుపొందుతానం టూ ట్రంప్ ధీమా వ్యక్తం చేశారు. దీంతో మార్కె ట్లు భారీగా లాభపడతాయన్నారు. ఆర్థిక వ్యవస్థ, సైన్యం, వైద్యం తదితర రంగాలకు తమ ప్రభుత్వం ఎంతో తోడ్పాటు అందించిందని ట్రంప్ చెప్పా రు. తన సారథ్యంలో అమెరికా ఎకానమీ.. గతంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వృద్ధి చెందిందని అన్నారు. వాణిజ్య ఒప్పందానికి చేరువలో: గోయెల్ భారత్ అమెరికాలు కీలక వాణిజ్య ఒప్పందానికి అతి చేరువలో ఉన్నట్లు మంగళవారం వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయెల్ వెల్లడించారు. ఇందుకు సంబంధించి విధివిధానాలు ఖరారవుతున్నట్లు తెలిపారు. ‘యూఎస్–ఇండియా ఫోరమ్: పార్ట్నర్స్ ఫర్ గ్రోత్’ అన్న అంశంపై ఇక్కడ జరిగిన చర్చలో గోయెల్ మాట్లాడారు. పరస్పర భారీ వాణిజ్య ప్రయోజనాలు ఈ ఒప్పందం వల్ల ఒనగూరుతాయని అన్నారు. 2020 నాటికి కేంద్రం లక్ష్యాలను ఆయన ఈ సందర్భంగా వివరిస్తూ, ప్రతి కుటుంబానికీ సొంత ఇల్లు, 24 గంటలూ విద్యుత్, వంట గ్యాస్, ఇంటర్నెట్ విస్తృతి, నాణ్యమైన విద్య, ఆరోగ్య సంరక్షణ తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని వివరించారు. 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా భారత్‌ను తీర్చిదిద్దేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నట్లు వివరించారు. అమెరికా నుంచి చమురు దిగుమతులు పదింతలు నిత్యం 2,50,000 బ్యారెళ్ల చమురు దిగుమతి భారత్‌కు అమెరికా నుంచి చమురు సరఫరాలు రెండేళ్లలో పది రెట్లు పెరిగి.. రోజుకు 2,50,000 బ్యారెళ్ల స్థాయికి చేరాయి. రెండు దేశాల మధ్య ఇంధన బంధం బలోపేతాన్ని ఇది తెలియజేస్తోంది. ఢిల్లీలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సమక్షంలో జరిగిన వ్యాపార భేటీలో అమెరికా ఇంధన శాఖ మంత్రి డాన్ బ్రోలెట్ మాట్లాడుతూ.. భారత్ 2017లో అమెరికా నుంచి నిత్యం 25,000 బ్యారెళ్లను దిగుమతి చేసుకుంది. గత రెండేళ్లలో ఇది 25,000 బ్యారెళ్ల నుంచి నిత్యం 2,50,000 బ్యారెళ్ల దిగుమతి స్థాయికి చేరుకుంది. ఇది ఇంకా మెరుగుపడుతుందని అంచనా వేస్తున్నాం’’ అని బ్రోలెట్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఇంధన వ్యాపారం వేగంగా వృద్ధి చెందుతోందంటూ ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డాన్బ్రోలెట్ను అభినందించారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో మొదటి ఆరు నెలల కాలంలో అమెరికా 5.4 మిలియన్ టన్నుల చమురును భారత్‌కు ఎగుమతి చేసింది. భారత్‌కు అమెరికా ఆరో అతిపెద్ద చమురు వనరుగా అవతరించినట్టు పెట్రోలియం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఢిల్లీలో జరిగిన భారత్–అమెరికా వ్యాపార కార్యక్రమంలో భాగంగా తెలిపారు. అలాగే, అమెరికాకు భారత్ ఇప్పుడు 4వ అతిపెద్ద చమురు ఎగుమతి మార్కెట్‌గా మారినట్టు ఆయన వివరించారు.(రాష్ట్రపతి విందుకు కేసీఆర్ హాజరు) -
‘రాజధాని అభివృద్ధి అంటే భవనాలు కట్టడం కాదు’
సాక్షి, విశాఖపట్నం: అభివృద్ధి వికేంద్రీకరణను స్వాగతిస్తున్నామని మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ అన్నారు. అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణపై ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. రాజధాని విషయంలో గత ప్రభుత్వం నిరంకుశంగా, ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని ఆయన మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలోని ప్రజలు, రాజకీయపార్టీలను సంప్రదించలేదని ఆయన గుర్తుచేశారు. వికేంద్రీకరణ నాలుగు విధాలుగా జరగాలని శర్మ అభిప్రాయపడ్డారు. రాజకీయ, పరిపాలన, ఆర్థిక పరంగా వికేంద్రీకణ ఉండాలని తెలిపారు. సుప్రీంకోర్టు సలహాతో కోర్టులు కూడా మూడు లేదా నాలుగు బెంచ్‌లుగా ఏర్పాటు చేయాలన్నారు. న్యాయస్థానాలు గ్రామస్థాయి వరకు పెంచాలని ఈఏఎస్ శర్మ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ వీసీ ప్రొఫెసర్ చలం మాట్లాడుతూ.. విశాఖపట్నం రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణపై గతంలో శివరామకృష్ణ కమిటీ ఎనిమిది పేజీల నివేదిక ఇచ్చిందని ఆయన గుర్తు చేశారు. పాలన అన్నది ప్రజల వద్దకు వెళ్లాలంటే వికేంద్రీకరణ జరగాలన్నారు. విశాఖకు రాజధాని వస్తే ప్రజలకు ఆదాయం, సౌకర్యాలు పెరిగేలా ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర నుంచి వలస వెళ్లిన 15 లక్షల మంది తిరిగి వచ్చేలా.. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయాలని మాజీ వీసీ ప్రొఫెసర్ చలం పేర్కొన్నారు. లా యూనివర్సిటీ మాజీ వీసీ, న్యాయ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వై. సత్యనారాయణ మాట్లాడుతూ.. ఎగ్జిక్యూటివ్ కాపిటల్‌గా విశాఖపట్నంను ప్రభుత్వం ఎంచుకోవటం మంచి నిర్ణయమని కొనియాడారు. రాజధాని అభివృద్ధి అంటే ఒక చోట భూములు తీసుకుని భవనాలు కట్టడం కాదన్నారు. అభివృద్ధికి కావల్సిన అన్ని వనరులు విశాఖలో ఉన్నాయని ఆయన తెలిపారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ విశాఖలోనే ఉంటుందన్న ప్రభుత్వ నిర్ణయం అభినందనీయమన్నారు. రాజకీయ, విద్య, ఆర్ధిక రంగాల్లో అభివృద్ధి చెందిన నగరం విశాఖ అని ఆయన గుర్తుచేశారు. ప్రభుత్వపాలన చక్కగా నడవడానికి ప్రజలు మంచి దృక్పధంతో ఉన్నారని సత్యనారాయణ తెలిపారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలో చేసిన ప్రతిపాదనల్లో మంచి ప్రతిపాదన రాష్టాభివృద్ధికి కేంద్రం నుంచి నిధులు తీసుకోవటం అన్నారు. దానివల్ల రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. సీట్ ఆఫ్ గవర్నెన్స్ వల్ల అభివృద్ధి మరింత వేగవంతమవుతుందని ప్రొఫెసర్ సత్యనారాయణ అభిప్రాయపడ్డారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అసెంబ్లీ సాక్షిగా చేసిన రెండు ప్రకటనలను తాము స్వాగతిస్తున్నామని ఉత్తరాంధ్ర ప్రజాగాయకుడు, కవి రాజశేఖర్ తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ అనే మాట ఉత్తరాంధ్రవాసుల్లో ఆశలు చిగురింపజేసిందని చెప్పారు. కోటి జనాభా, 19 నదులున్న ఉత్తరాంధ్ర నేలలో అభివృద్ధి జరగాలని ఆయన పేర్కొన్నారు. వికేంద్రీకరణను అడ్డుకుంటున్న శక్తులు ఎవరైనా.. సోంపేట, కాకరపల్లి థర్మల్ అణువిద్యుత్ కార్మాగారాలను అడ్డుకోండని రాజశేఖర్ అన్నారు. విశాఖలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ, మాజీ వీసీ ప్రొఫెసర్ చలం, న్యాయ శాస్త్ర నిపుణులు ప్రొఫెసర్ వై. సత్యనారాయణ, ప్రజాగాయకుడు, కవి రాజశేఖర్ పాల్గొన్నారు. -
మహిళలపై నేరాలకు మద్యమే కారణం
పంజగుట్ట: మహిళలపై జరుగుతున్న నేరాలకు మద్యమే కారణమని మాజీ ఎమ్మెల్సీ, విద్యావేత్త ప్రొఫెసర్ కె.నాగేశ్వర్రావు అభిప్రాయపడ్డారు. మద్యం కారణంగా రాష్ట్రానికి ఏటా రూ.11 వేల కోట్ల ఆదాయం వస్తుందని, ప్రభుత్వాలు దీనిని ఒక ఆర్థిక వనరుగానే చూస్తున్నాయి కానీ.. దానివల్ల కలిగే నష్టం గురించి ఆలోచించడం లేదన్నారు. ‘మహిళలపై హింస ఎవరిదెంత పాత్ర–మన కర్తవ్యం’అనే అంశంపై శనివారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. కమిటీ ఆఫ్ కన్సర్స్ సిటిజన్స్, ప్రెస్‌క్లబ్ హైదరాబాద్, వీ అండ్ షీ, వందేమాతరం ఫౌండేషన్, కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవల్యూషన్, గ్రామ వికాస్ భారత్, గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ, గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్, వికాస్ యూత్ సంయుక్త ఆధ్వర్యంలో ‘సాక్షి’దినపత్రిక ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ దిలీప్‌రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. అనంతరం దిలీప్‌రెడ్డి మాట్లాడుతూ.. మహిళలపై జరుగుతోన్న దారుణాలకు తాత్కాలిక పరిష్కారాలు కాకుండా, శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో వక్తలు మాట్లాడిన అంశాలపై ప్రణాళిక రూపొందించి.. ఆచరణలోకి తెచ్చేందుకు కృషిచేద్దామని సూచించారు. -
చంద్రబాబుకు బీజేపీ, సీపీఎం ఝలక్
సాక్షి, విజయవాడ: గతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును నమ్మి మోసపోయామని, మరోసారి అందుకు సిద్ధంగా లేమని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు విజయవాడలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి బీజేపీ, సీపీఎంతో పాటు మిగిలిన అన్ని పార్టీలు రావాల్సిందిగా ఆయన పిలుపునిచ్చారు. అయితే బీజేపీ, సీపీఎం నేతలు ఈ సమావేశానికి హజరుకాకుండా చంద్రబాబుకు ఝలక్ ఇచ్చారు. ఈ క్రమంలో బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. బీజేపీతో కలవడం కోసమే చంద్రబాబు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారని అభిప్రాయపడ్డారు. టీడీపీకి తోక పార్టీగా ఉండటం తమకు ఇష్టం లేదని, సొంతంగానే ఉద్యమాలు చేస్తామని పేర్కొంటున్నారు. మాటమీద నిలబడని వ్యక్తి పవన్ అదే విధంగా సీపీఎం సైతం చంద్రబాబు తీరును తప్పుబట్టింది. రాజధాని రైతులు, రైతు కూలీలను చంద్రబాబు మోసం చేశారని సీపీఎం విమర్శించింది. అభివృద్ధి వికేంద్రీకరణ అనేది తమ సిద్ధాంతం అని వెల్లడించింది. ఈ సందర్భంగా సీపీఎం కార్యదర్శి మధు మాట్లాడుతూ.. ‘ఏపీ రాజధాని అంశం వివాదాస్పదం కావడం మాకు ఇష్టం లేదు. అందుకే చంద్రబాబు ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ భేటీకి సీపీఎం హాజరు కావడం లేదు. వికేంద్రీకరణ ప్రాతిపదిక మీద రాష్ట్ర రాజధాని నిర్మాణం జరగాలి. హైదరాబాద్ రాజధాని సందర్భంగా జరిగిన తప్పిదాలె మరోసారి జరగొద్దు. పవన్ కల్యాన్ మతం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. మాట మీద నిలబడని వ్యక్తి పవన్. బీజేపీ, అమిత్ షాలను పొడగటం సిగ్గుచేటు. ఏపీలో జనసేన మనుగడ ప్రశ్నార్థకం. దిశ కేసు నిందితులపై పవన్ వ్యాఖ్యలు ఆయన అపరిపక్వతకు నిదర్శనం’ అని మండిపడ్డారు. -
కాపు, తెలగ, బలిజ నేతల రౌండ్ టేబుల్ సమావేశం
-
యురేనియం అన్వేషణ ఆపేయాలి..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లో యురేనియం అన్వేషణ, తవ్వకాలను తక్షణమే నిలిపేయాలని వివిధ పార్టీలు, స్వచ్ఛంద, ప్రజాసంఘాలు, నిపుణులతో కూడిన అఖిలపక్ష సమావేశం డిమాండ్ చేసింది. తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో చేసిన తీర్మానంలోని అంశాలపై ఇంకా స్పష్టతివ్వాలని పేర్కొంది. పలు డిమాండ్లను అఖిలపక్షం ఏకగ్రీవంగా ఆమోదించింది. అయోమయానికి గురిచేస్తున్నారు.. సోమవారం దస్పల్లా హోటల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో నాదెండ్ల మనోహర్ అధ్యక్షతన ‘యురేనియం ఆపాలి.. నల్లమలను పరిరక్షించాలి’అంశంపై ఈ సమావేశం జరిగింది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. యురేనియం పరిశోధన, అన్వేషణ, వెలికితీత ఏ రూపంలో ఉన్నా వాటిని కాంగ్రెస్ వ్యతిరేకిస్తోంద న్నారు. యురేనియం అన్వేషణ నల్లమలపై ఎక్కుపెట్టిన తుపాకీ అని, దాన్ని తప్పక దించాలని జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ అఖిలపక్షాన్ని కేంద్రం వద్దకు తీసుకెళ్లి, యురేనియం అన్వేషణకు అనుమతించబోమని చెప్పా లని సీపీఐ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. యురేనియం తవ్వకాలు, అన్వేషణ ఆపేస్తామన్న నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి తెలపాలని టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం అన్నారు. అనంతరం మాజీ న్యాయమూర్తి గోపాల్‌గౌడ, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మాట్లాడారు. సమావేశంలో నిపుణులు, పర్యావరణవేత్తలు బాబూరావు, కె.పురుషోత్తంరెడ్డి, డి.నర్సింహారెడ్డి, ప్రొ.జయధీర్ తిరుమలరావు, కొండవీటి సత్యవతి, వి.సంధ్య, అరవింద్, తెలంగాణ ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, కాంగ్రెస్ నేత వీహెచ్, మూమెంట్ అగెన్ట్ యూరోనియం ప్రతినిధి కె.సజయ, హైదరాబాద్ టైగర్ కన్జర్వేషన్ సొసైటీ ఇమ్రాన్ సిద్దిఖీ తదితరులు పాల్గొన్నారు. -
బీసీ రిజర్వేషన్ల కోసం కొట్లాడుదాం..!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గించడాన్ని నిరసిస్తూ పలు రాజకీయ పార్టీలు, బీసీ సంఘాలు బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించాయి.ఈ సందర్భంగా అన్ని పార్టీల ఆధ్వర్యంలో ఈనెల 28న సీఎస్‌కు వినతి పత్రం అందించాలని నిర్ణయించారు. 29న రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్లల ముట్టడికి పిలుపునిచ్చినట్లు నేతలు వెల్లడించారు. గోల్కొండ హోటల్లో జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. బీసీల ఓట్లతో గెలిచి వారికే వెన్నుపోటు పొడుస్తున్నారని మండిపడ్డారు. సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా జన గణన చేసి రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని కులసంఘాలు ఎమ్మెల్యేల గెలుపునకు తీర్మానం చేశాయని, ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలనే నిలదీయండని అన్నారు. ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలి.. బీసీల రిజర్వేషన్లను 22 శాతానికి తగ్గించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకటరెడ్డి అన్నారు. రిజర్వేషన్లను తగించి బీసీలను తీవ్రంగా అవమానించారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీఆర్ఎస్ గెలవాలని కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారని చాడా మండిపడ్డారు. రిజర్వేషన్లు తగ్గిస్తూ ప్రభుత్వం విడుదల చేసని ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ప్రధానిని ఎందుకు కలుస్తున్నారు.. బీసీల రిజర్వేషన్ల సాధన కోసం న్యాయపోరాటంతో పాటు ఉద్యమాలను కూడా ఉదృతం చేయాలని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. రిజర్వేషన్ల సాధన కోసం రాజకీయ పార్టీలు ముందుకు రావాలని కోరారు. కేసీఆర్ ప్రధాని నరేంద్ర మోదీని ఎందకు కలుస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 1200 మంది బీసీలకు అన్యాయం జరిగింది.. బీసీల రిజర్వేషన్లను తగ్గించడంతో 1200 మంది బీసీలు పోటీకి దూరమైయ్యారని టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ పేర్కొన్నారు. చట్ట సభల్లో రిజర్వేషన్లు అమలు చేసి తీరాలని, జంతర్ మంతర్ వద్ద ధర్మాకు తన వంతు సహకారం అందిస్తానని వెల్లడించారు. పార్టీలకతీతంగా బీసీల రిజర్వేషన్ల కోసం పోరాటం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌తో పాటు పలువురు బీసీ సంఘాల నేతలు కూడా పాల్గొన్నారు. -
నాయకత్వం మారాలి.. అదీ జగన్‌తోనే..
కాకినాడ / జగన్నాథపురం: అవినీతి ఊబిలో కూరుకుపోయి ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటున్న ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వ మార్పు అవసరమని మేధావులు, ఎన్ఆర్ఐలు పేర్కొన్నారు. ఆ మార్పు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డితోనే సాధ్యమని స్పష్టం చేశారు. స్థానిక డి కన్వెన్షన్ హాలులో ‘ఆంధ్రప్రదేశ్‌లో నాయకత్వ మార్పు ఎందుకు అవసరం’? అనే అంశంపై విశ్రాంత ఐఏఎస్ అధికారి శ్రీకాంత్‌రెడ్డి అధ్యక్షతన శనివారం సాయంత్రం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. ఎన్ఆర్ఐలు, ప్రొఫెసర్లు, విద్యావేత్తలతో పాటు వివిధ రంగాల నిపుణులు ఈ సమావేశంలో పాల్గొని రాజకీయాలకు అతీతంగా ప్రస్తుత రాష్ట్రం ఎదుర్కొంటున్న అసమర్థ, అవినీతిపాలనను ఎండగడుతూనే ప్రత్యామ్నాయ నాయకత్వం దిశగా ప్రజలు చైతన్యవంతం కావాల్సిన అవసరాన్ని వివరించారు. ప్రధానంగా సమర్థవంతమైన ప్రతిపక్షపాత్ర పోషిస్తూ సుమారు 3 వేల కిలోమీటర్లకు పైగా ప్రజా సంకల్పయాత్ర చేసి సమస్యలను స్వయంగా తెలుసుకుంటూ నిరంతరం ప్రజల మధ్యే ఉంటున్న జగన్ ఈ రాష్ట్రానికి దిక్సూచి కాగలరన్న అభిప్రాయం వివిధ వర్గాల్లో వ్యక్తమైంది. సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తారని ఆశించి పట్టం కడితే చివరకు ప్రజల ఆశలపై నీళ్ళు చల్లి రాష్ట్ర భవితను అంధకారంలోకి నెట్టారని వక్తలు అభిప్రాయపడ్డారు. అన్ని వర్గాల ప్రజలు బాబు చేతిలో మోసపోయారన్నారు. తెలుగుదేశం పార్టీకి చెందిన ఓ మహిళా నేత కూడా ఈ సమావేశానికి హాజరై డ్వాక్రా సంఘాలను, ఇతర వర్గాలను సర్కార్ దగా చేసిన వైనాన్ని ఎండగట్టడం విశేషం. మా ప్రభుత్వంలో దగా తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్నాను. జన్మభూమి కమిటీ సభ్యురాలిగా, డ్వాక్రా సంఘ నిర్వాహకురాలిగా కూడా ఉన్నా. ఇలాంటి వేదికపై వాస్తవం చెప్పకుండా ఉండలేను. డ్వాక్రా రుణాల రద్దు పేరుతో మహిళలకు అన్యాయం చేశారు. పసుపు కుంకుమలు ఇస్తామంటూ మేము దాచుకున్నడబ్బునే తిరిగి మాకు ఇస్తున్నారు. దీనికి ఎంతో ప్రచారం చేసుకుంటున్నారు. ఎంతో మంది వృద్ధుల వేలిముద్రలు పడక పింఛన్లు ఇవ్వడంలేదు. అలాంటి సొమ్మంతా ఎక్కడికిపోతుందో? ఏమైపోతుందో అర్థంకావడంలేదు. ఇంత అన్యాయం జరుగుతున్నా పార్టీ జెండా పట్టుకుని తిరుగుతున్నా మేమేమి మాట్లాడలేకపోతున్నాం. – కె.వరలక్ష్మి, యాదవ సంఘ మహిళా అధ్యక్షురాలు, టీడీపీ నాయకురాలు మంచిచేసే పార్టీకే మద్దతు ఎంతగా మొత్తుకున్నా ఆంధ్రప్రదేశ్‌ను విభజించేశారు. ఆ తరువాత విభజన హామీలు కూడా అమలు చేయకుండా రాష్ట్రానికి కేంద్రం అన్యాయం చేసింది. ఇక్కడ పింఛన్ విధానాన్నీ తొలగించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యోగ, కార్మిక వర్గాలకు మంచి చేసే పార్టీలకే మా మద్దతు ఉంటుంది. – బూరిగ ఆశీర్వాదం, జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు ఆయనే ఉంటే విభజన అయ్యేది కాదు వైఎస్ రాజశేఖరరెడ్డి జీవించి వుంటే రాష్ట్రం ముక్కలయ్యేది కాదు. ఈ సమస్యలూ ఉండేవి కాదు. ప్రస్తుత సర్కార్ పింఛన్ వి«ధానాన్ని రద్దు చేసి, పదవీ విరమణ చేశాక భద్రత లేకుండా చేస్తోంది. వెయ్యి, రెండు వేలకు ఓట్లు అమ్ముకునే స్థితి కల్పించిన ప్రస్తుత పరిస్థితి మారాలంటే జగన్ నాయకత్వం ఈ రాష్ట్రానికి కావాలి. – బుద్దరాజు సత్యనారాయణరాజు, సీనియర్‌సిటిజన్స్ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌తోనే యువతకు చేయూత ప్రతిభకలిగిన ఏ విద్యార్థీ విద్యకు దూరంకారాదన్న సంకల్పంతో ఫీజు రీయింబర్స్మెంట్, పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించాలనే లక్ష్యంతో ఆరోగ్యశ్రీ వంటి బృహత్తర పథకాలు ప్రవేశపెట్టిన నాటి వైఎస్ పాలన మళ్లీ చూడాలంటే జగన్‌తోనే సాధ్యం. – డాక్టర్ జఫ్రుల్లా, కార్డియాలజిస్ట్, ప్రముఖ వైద్యులు వీళ్లా మన పాలకులు? రాజధాని నిర్మాణం, ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దిగమింగుతున్నారు. టీడీపీ మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేల అవినీతి బాగోతాలు ఐటీ దాడుల్లో వెలుగులోకి వస్తున్నాయి. ప్రజలు, మేధావులు ఆలోచించి ఓటు వేయాలి. ప్రజా సమస్యలను స్వయంగా పరిశీలించి మేనిఫెస్టో తయారు చేస్తోన్న యువనేత జగన్‌కు ఒక్క అవకాశం ఇవ్వాలి. ప్రజల కోసం పనిచేసే నాయకుడిపాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తారన్న నమ్మకం, విశ్వాసం ప్రజల్లో నెలకొంది. – డాక్టర్ జి.వెంకటరమణ, సామాజిక కార్యకర్త స్వేచ్ఛను కోల్పోయాం రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయాం. అంబేద్కర్ ఇచ్చిన స్వేచ్ఛను కూడా కోల్పోయాం, రాష్ట్రం ముక్కలయ్యాక అన్ని వర్గాల ప్రజలకు కష్టాలు తప్పలేదు. . – సలీమ్, ముస్లిం ప్రతినిధి నాయకత్వ మార్పు అవసరం విద్య, వైద్య, వ్యవసాయంతో సహా అన్ని వర్గాలు తీవ్ర సంక్షోభంలో ఉన్నాయి. ప్రజల జీవన ప్రమాణాలు దిగజారిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో నాయకత్వమార్పు ఎంతో అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరక్క తల్లిదండ్రులు దిగాలు పడుతున్నారు. సెజ్‌పేరుతో 10వేల ఎకరాలు సేకరించి ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదు. – మలసాని శ్రీనివాసరావు, ఫ్రీలాన్స్జర్నలిస్ట్ అరచేతిలో వైకుంఠం సీఎం చంద్రబాబు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు. ఆయన మాటకు విలువలేని పరిస్థితి నెలకొంది. ప్రతీరోజు చంద్రబాబు మాటలతో మోసపోతూనే ఉన్నాం. వైఎస్ బాటలో నడిచే జగన్ నాయకత్వాన్ని బలపర్చాలి. – ఎంజీకే రాజు, అడ్వకేట్ జాబు వస్తుందని నమ్మాం జాబు కావాలంటే బాబు రావాలన్న ప్రచారాన్నినమ్మి మోసపోయాం. సింగపూర్‌ను చూపించి రైతులను మోసం చేశారు. తాత్కాలిక నిర్మాణాలతో కోట్లు కొల్లగొట్టారు. రైతుల త్యాగాలతో ఆయన అస్మదీయులు కోట్లకు పడగలెత్తారు. ఇలాంటి ప్రభుత్వాలను తరిమికొట్టాలి. జగన్ రాకతోనే ప్రజలకు కష్టాలకు విముక్తి. – సంజయ్‌కుమార్, నిరుద్యోగి వైఎస్ పాలనలో అన్ని వర్గాలు హ్యాపీ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో ప్రజలు, ఉద్యోగులు ఎలాంటి కష్టం లేకుండా గడిపారు. ఇప్పుడు పరిస్థితి మారింది. అప్పుడు చిరంజీవిని చూడడానికి వచ్చి వైఎస్‌కు ఓట్లు వేసినట్టు, ఇప్పుడు పవన్‌ను చూసేందుకు వచ్చిన ప్రజలు జగన్‌కు ఓట్లు వేసి గెలిపిస్తారు. ప్రభుత్వాలు రాజ్యాంగాన్ని ఉల్లంఘించి పాలిస్తున్న నేపథ్యంలో ప్రజలంతా చైతన్యవంతులై చట్టాలను, రాజ్యాంగాలను గౌరవించే ప్రభుత్వాలను ఎన్నుకోవాలి. – కోరా జయరాజు, రిటైర్డ్ డిప్యూటీ కలెక్టర్ అనైతిక పొత్తులు ఆంధ్రప్రదేశ్‌ను ముక్కలు చేసి రాష్ట్ర భవిష్యత్‌ను అంధకారంలోకి నెట్టిన కాంగ్రెస్‌తో టీడీపీ తెలంగాణలో పొత్తులు పెట్టుకోవాలనుకోవడం దిగజారుడుతనమే. ఇలాంటి చర్యలు ద్వారా రాష్ట్ర ప్రజల మనోభావాలను చంద్రబాబు దెబ్బతీçస్తున్నారు. మరోవైపు వేలకోట్ల అవినీతితో రాష్ట్రప్రతిష్టను మంటగలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో జగన్‌వంటి యువనాయకత్వంతోనే రాష్ట్రానికి మంచి రోజులు రాగలవు. – శ్రీకాంత్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ రైతులకు ఉరితాడు ఆంధ్రప్రదేశ్‌కు రాజధానికి కావాలని భూములిచ్చిన రైతులు ఇప్పుడు ఉరితాడుకు వేలాడుతున్నారు. లక్షల కోట్ల అప్పుల్లో ఉండి ఆర్భాటాలతో రోజులు గడుపుతూ రాష్ట్రాన్ని మరింత కుంగదీస్తున్నారు. పేదలకు తినేందుకు తిండి, ఉండేందుకు నీడ లేని పరిస్థితుల్లో మద్యం మాత్రం ఏరులై పారుతోంది. ప్రత్యేక విమానాల్లో ప్రపంచ పర్యటనలు చేస్తూ ప్రజాధనాన్ని దుబారాగా ఖర్చు పెడుతున్నారు. – వి.హనుమంతరావు, విశ్రాంత ప్రిన్సిపాల్, కాకినాడ జగన్‌తోనే మంచి భవిత జగన్ నాయకత్వంలోనే ఆంధ్రప్రదేశ్ పూర్వ వైభవాన్ని సంతరించుకోగలదు. నాలుగున్నరేళ్ల టీడీపీ పాలనలో విద్య, వైద్య, ఆరోగ్యం, శాంతిభద్రతల విషయంలో సర్కార్ పూర్తిగా విఫలమైంది. ప్రజాస్వామ్య విలువలను కాపాడుతూ రాజ్యాంగాన్ని పరిరక్షించగలిగే బలమైన నాయకత్వం రాష్ట్రానికి అత్యవసరం. అది జగన్వల్లే సాధ్యం. – హర్షవర్దన్, ఎన్ఆర్ఐ కాకి లెక్కలు... ప్రచార ఆర్భాటం నాలుగున్నరేళ్ల చంద్రబాబు పాలన కాకి లెక్కలు.. ప్రచార ఆర్భాటంతోనే గడిచిపోయింది. జీడీపీ పేరుతో తప్పుడు లెక్కలు చూపించి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మెరుగ్గా చూపించడం వల్లే రాష్ట్రం ప్రత్యేక హోదా కోల్పోయింది. రాష్ట్రానికి 9వేల కోట్ల పెట్టుడులు వస్తే, 19 లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చాయంటూ ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేసుకుంటున్నారు. చంద్రబాబు అధికారం నుంచి దిగిపోయి జగన్ పగ్గాలు చేపట్టినప్పుడే రాష్ట్రానికి మళ్లీ మంచి రోజులు వస్తాయి. – వడిశెట్టి నారాయణరెడ్డి, సైకాలజిస్ట్ -
బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం
సాక్షి, హైదరాబాద్: నగరంలోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఓబీసీ ఫెడరేషన్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ జాతీయ ప్రెసిడెంట్ జస్టిస్ వి.ఈశ్వరయ్య, టీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్, మాజీ కేంద్ర మంత్రి దత్తాత్రేయ, పొన్నాల లక్ష్మయ్య, టీడీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, మాజీ ఎంపీ వి.హనుమంత రావు, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీ బూరనర్సయ్య గౌడ్ మాట్లాడుతూ.. బీసీల రాజ్యాధికారం కోసం సుదీర్ఘ పోరాటం కొనసాగుతుందని తెలిపారు. బీసీ రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలపై ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత బీసీలపై ఉందన్నారు. లోక్ సభలో బీసీలపై బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేశారు. బీసీల కోసం కేంద్ర మంత్రులకు 2వేల లేఖలు రాశానని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం 11 సంవత్సరాలు పోరాటం చేశానని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు అన్నారు. బీసీల కోసం ప్రత్యేక పార్టీ అవసరం లేదు.. ప్రతి పార్టీలో బీసీ నేతలు ఉన్నారన్నారు. జ్యోతిరావు పూలే బీసీల కోసం గొప్ప పోరాటం చేశారని తెలిపారు. పూలే విగ్రహాలను అన్ని గ్రామాల్లో ఏర్పాటు చేసి, ఆయన భవనాలు కట్టించాలని కోరినా ఫలితం లేకుండా పోయిందన్నారు. బీసీ భవన్ కోసం ఏర్పాటు చేసిని స్థలాలను బీసీ నాయకులే కబ్జా చేశారని పేర్కొన్నారు. కొంతమంది నేతలు రాజ్యాధికారం మా రక్తంలోనే ఉంది అన్నట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఓట్లు మాత్రమే బీసీలవి అధికారం మాత్రం ఎవరిదో అన్నట్లు ఉందన్నారు. కేసీఆర్ క్యాబినెట్లో ఎంత మంది బీసీలన్నారో చెప్పాలని ప్రశ్నించారు. టీటీడీపీ ప్రెసిడెంట్ ఎల్.రమణ మాట్లాడుతూ.. పార్లమెంట్లో బీసీ రిజర్వేషన్ బిల్లుకు ఆమోదం కోసం పోరాటం చెయ్యాలని అన్నారు. బీసీల ఓట్లను ఇతర నేతలు ఎలా ఉపయోగించుకుంటున్నారో తెలుసుకొని వాటిని మన కోసం మన వైపు మళ్లించుకోవాలని రమణ పేర్కొన్నారు. బీసీ కులాలను ఒకేతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చెయ్యాలన్నారు.బీసీలకు అధికారం వచ్చేందుకు నా వంతు కృషిచేస్తానని రమణ అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఓబీసీల అధికారం కోసం కృషిచేస్తున్న ఈశ్వరయ్యకు అభినందనలు తెలిపారు. బీసీల సంఖ్య ఎక్కువ ఉన్నా.. ఐకమత్యం లేదని, ఓబీసీలను దేశంలో చిన్నచూపు చూస్తున్నారని పేర్కొన్నారు. ఓబీసీ బిల్లు బీజేపీ ఆధ్వర్యంలో లోక్‌సభలో ఆమోదం పొందినా రాజ్యసభలో మాత్రం పాస్ కాదని తెలిపారు. టీటీడీపీ ఎంపీ దేవేందర్ గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాల నుంచి రిజర్వేషన్లు ఉన్నాయి.. కానీ రాను రాను ఒకరిపై ఒకరు అజమాయిషీ చలాయించడం జరుగుతుందని అన్నారు. ఓటు హక్కు అనే విషయంపై సుదీర్ఘమైన చర్చ జరిగిన తరువాతే ఓటు హక్కును కల్పించారని తెలిపారు. ఈ రోజుల్లో కొంత మంది రాజుల తరహాలో ప్రవర్తిస్తున్నారు.. కానీ గతంలో ప్రతి ఒక్కరు అధికారులే, నాయకులేనని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నుంచి ముఖ్యమంత్రి వరకు రాజ్యాంగానికి లోబడే పని చెయ్యాలి.. కానీ ఎవ్వరూ రాజ్యాంగానికి లోబడి పనిచెయ్యడం లేదన్నారు. -
‘విభజన హామీలపై దమ్ముంటే చర్చకు రండి’
సాక్షి, విజయవాడ : కడప స్టీల్ ప్యాక్టరీ సాధన ఉద్యమం తీవ్రతరం అవుతోంది. కేంద్ర ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయాల్సిందే అని అఖిలపక్ష పార్టీల నేతలు పేర్కొన్నారు. కడపలో స్టీల్ ప్యాక్టరీ నిర్మించే వరకు ఉద్యమం ఆగదని వారు తెలపారు. ఉద్యమానికి సంఘీబావంగా సీపీఐ, సీపీఎం, వైఎస్సార్సీపీ, జనసేన, కాంగ్రెస్, ఆమ్ అద్మి పార్టీల నేతలు, వివిధ ప్రజాసంఘాల నేతలు విజయవాడలో గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. స్టీల్ ప్యాక్టరీ రాయలసీమ ప్రాంత ప్రజల సమస్య మాత్రమే కాదు.. అది రాష్ట్ర ప్రజల సమస్య అని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వెనకబడిన రాయలసీమ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ.. కడపలో స్టీల్ ప్యాక్టరీ నిర్మాణం చేపడతామని విభజన సమయంలో హామీ ఇచ్చారు. అవి ఎట్టి పరిస్థితుల్లోనూ అమలు జరపాల్సిందేననని ఆయన పేర్కొన్నారు. ‘స్టీల్ ప్యాక్టరీ నిర్మాణాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దు. ఇది ఇప్పటి సమస్య కాదు..13వ షెడ్యుల్‌లో పొందుపరిచిన అంశం. ఈ విషయంలో రాష్ట్ర ప్రజలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేశాయి. ఇప్పుడు టీడీపీ రాజకీయ నాటకం ఆడుతుందని’ ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రానికి చెందిన బీజేపీ నాయకులు 80 శాతం హామీలు అమలు జరిపామని చెబుతున్నారు. వారికి అసలు విభజన హామీలపై అవగాహన లేనట్లుందని విమర్శుల గుప్పించారు. బీజేపీ నేతలు మీడియా సమక్షంలో విభజన హామీలపై చర్చిద్దాం.. దమ్ముంటే చర్చకి రావాలని రామకృష్ణ సవాలు విసిరారు. టీడీపీ ప్రజలు మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు నాటకాలు ఆడుతున్నారని ఆయన మండిపడ్డారు. 29వ తేదిన కడపలో జిల్లాలో జరిగే బంద్‌కు పూర్తి మద్దతు తెలుపుతామన్నారు. అంతేకాక ఆ రోజు బంద్‌లో ప్రత్యక్షంగా పాల్గొంటామని తెలిపారు. విద్యార్థులు ఉద్యమంలో పెద్దెత్తున పాల్గొనేలా ఉద్యమాన్ని నిర్మించాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు. కడప ఉక్కు, విశాఖ రైల్వే జోన్, ఉత్తారాంధ్ర ప్రత్యేక ప్యాకేజీ సాధించే వరకు ఉద్యమాన్ని విరమించే ప్రసక్తి లేదని సీపీఎం రాష్ట్ర నేత సీహెచ్ బాబురావు స్పష్టం చేశారు. అవసరమైతే మరోసారి రాష్ట్ర బంద్‌కు పిలుపునిస్తామన్నారు. కడప జిల్లా బంద్‌కు పూర్తిగా సంఘీబావం ప్రకటిస్తూ ప్రత్యక్షంగా పాల్గొంటామని ఆయన తెలిపారు. బీజేపీ, టీడీపీ రాజకీయ ప్రయోజనం కోసం రాష్ట్ర ప్రజలతో ఆటలాడితే తగిన బుద్ధి చెబుతామని బాబురావు హెచ్చరించారు. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదంతో గతంలో జరిగిన ఉద్యమాన్ని కడప జిల్లా సీపీఐ కార్యదర్శి ఈశ్వరయ్య గుర్తు చేశారు. అదే మాదిరి ప్రస్తుతం రాష్ట్రంలో కడప స్టీల్ ప్యాక్టరీ సాధన కోసం అలాగే ఉద్యమిస్తామని ఆయన పేర్కొన్నారు. అనాడు 38మంది విద్యార్థుల ప్రాణత్యాగం చేశారు.. ఎటువంటి పోరాటానికైన మేము సిద్ధంగా ఉన్నామని ఈశ్వరయ్య అన్నారు. టీడీపీ నేతలు రాష్ట్రంలో నిరహరదీక్షలు కాదు.. ఢిల్లీలో దీక్షలు చేయాలని ఈశ్వరయ్య హితవు పలికారు. -
‘అధికార వికేంద్రీకరణే శరణ్యం’
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరగాలంటే అధికార వికేంద్రీకరణ జరగాలని పలువురు ప్రముఖులు అభిప్రాయపడ్డారు. రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయాలని కోరుతూ సుందరయ్య విజ్ఙాన కేంద్రంలో జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. జస్టిస్ ఈశ్వరయ్య, జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి, జస్టిస్ ఎ.గోపాలరావు, జస్టిస్ బి.శేషశయన రెడ్డి, జస్టిస్ జి.క్రిష్ణ మోహన్ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యఅతిధులుగా మాజీ ప్రధాన కార్యదర్శులు ఐవైఆర్ కృష్ణారావు, అజయ్ కల్లం, మాజీ అడ్వకేట్ జనరల్ సివి మోహన్ రెడ్డి విచ్చేశారు. రాయలసీమకు హైకోర్టు కావాలని కోరడం న్యాయమైన కోరిక అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. 11 రాష్ట్రాల్లో రాజధాని ఒకచోట, హైకోర్టులు మరో చోట ఉన్నాయని గుర్తు చేశారు. అలా ఒప్పుకోవద్దు: ఐవైఆర్ రాయలసీమలోనే ఏపీ హైకోర్టు ఏర్పాటు చేయాలని మాజీ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు అన్నారు. రాజధానిలో హైకోర్టు, రాయలసీమలో బెంచ్ అంటే ఒప్పుకోవద్దని సూచించారు. రాయలసీమ, కళింగాంధ్ర అభివృధ్దికి ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఏకపక్ష నిర్ణయాలు: కల్లం ఏపీ రాజధాని విషయంలో పాలకులు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని అజయ్ కల్లం ఆరోపించారు. అధికార పార్టీ నేతలు కొన్న భూముల ధరల పెంపు కోసమే అంతా ఒకేచోట అంటున్నారని తెలిపారు. ప్రధాన నిర్ణయాలు ప్రజాభిప్రాయంతో తీసుకోవడమే పరిపక్వ ప్రజాస్వామ్యం అని పేర్కొన్నారు. సిడ్నీలో చిన్న ఎయిర్పోర్ట్ కోసం అందరినీ ఒప్పించడానికి 20 ఏళ్లు పట్టిందని వెల్లడించారు. అధికార వికేంద్రీకరణ జరిగితేనే అభివృద్ధి సాధ్యమన్నారు. -
వేదికపై అశోక్‌బాబు.. వెనుదిరిగిన చలసాని
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంపై ఏపీజేఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి ప్రత్యేక హోదా సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్‌తో పాటు ఎపీఎన్జీవో నేత అశోక్‌బాబు తదితరులను నిర్వాహకులు ఆహ్వానించారు. ఈ క్రమంలో సమావేశానికి వచ్చిన చలసాని, వేదికపై ఉన్న అశోక్‌బాబును చూసి సమావేశంలో పాల్గొనకుండానే వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో నిర్వాహకులు ఆయనను బుజ్జగించేందుకు ప్రయత్నించారు. హోదా ఉద్యమాన్ని కొందరు నీరుగారుస్తున్నారని ఈ సందర్భంగా చలసాని నిరసన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్ర ఉద్యమాన్ని నీరుగార్చిన వ్యక్తులే.. మళ్లీ ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ఉపయోగించుకునే యత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. -
విభజన హామీలపై సీపీఐ రౌండ్ టేబుల్ సమావేశం
-
నయీమ్ డైరీని బయట పెట్టాలి
సాక్షి, హైదరాబాద్: గ్యాంగ్‌స్టర్ నయీమ్ డైరీ వివరాలను బయటపెట్టాలని సీపీఐ నేతృత్వంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు డిమాండ్ చేశారు. నయీమ్ కేసును సీబీఐతో విచారణ జరిపి నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ బుధవారం మఖ్దూం భవన్లో సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 12న హైదరా బాద్‌లో నయీమ్ బాధితులతో ముఖాముఖి సదస్సును నిర్వహించాలని తీర్మానిం చారు. నయీమ్ ఆస్తులతో పాటు అతనితో సంబంధమున్న రాజకీయ నేతలు, పోలీసుల ఆస్తులు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. నయీమ్ కేసులో తీసుకున్న చర్యలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. భువనగిరి, వరంగల్, హైదరాబాద్‌లలో నయీమ్ బాధితులతో సమావేశాలు ఏర్పాటు చేసి ఒక బుక్లెట్ విడుదల చేయనున్నట్లు సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. సమావేశంలో మానవ హక్కుల వేదిక కన్వీనర్ జీవన్‌కుమార్, సీపీఎం నేత నర్సింగరావు, పౌరహక్కుల సంఘ నేత నారాయణరావు, న్యూడెమోక్రసీ నేత గోవర్ధన్, గాదె ఇన్నయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన: చాడ సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. మఖ్ధూమ్ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడేందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తులతో కూటమిని ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యలపై పోరాటమే లక్ష్యంగా కూటమి పనిచేస్తుందని వివరించారు. ముందస్తు ఎన్నికలు, 2018 మహాసభల నిర్వహణ, పంచాయతీ రాజ్ చట్టం తదితర అంశాలపై తమ కార్యవర్గ సమావేశం చర్చించిందని తెలిపారు. జనసేన నాయకుడు పవన్ కల్యాణ్‌కు తన మాటలపై తనకే స్పష్టత లేదని చాడ విమర్శించారు -
విద్యార్ధుల ఆత్మహత్యలపై రౌండ్‌టేబుల్ సమావేశం
-
సాగునీటి వనరులతోనే ‘అనంత’ సమగ్రాభివృద్ధి
100 టీఎంసీల కోసం ప్రజా ఉద్యమం – పైసా ఖర్చులేని పనులకు రూ.కోట్ల కేటాయింపు ఎవరి కోసం – ప్రాజెక్టు పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనం దోపీడి చేస్తున్న టీడీపీ నేతలు – రౌండ్ టేబుల్ సమావేశంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అనంతపురం అగ్రికల్చర్ : సాగునీటి వనరులతోనే జిల్లా సమగ్రాభివృద్ధి సాధ్యమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. గురువారం స్థానిక ప్రెస్‌క్లబ్ కాన్ఫరెన్స్ హాలులో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు అధ్యక్షతన ‘సాగునీటి ప్రాజెక్టులు-పెరుగుతున్న అంచనాలు, అభివృద్ధికా? అవినీతికా?’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాష్‌రెడ్డి మాట్లాడుతూ జిల్లాకు 100 టీఎంసీల నీటి కేటాయింపుల కోసం వైఎస్ఆర్సీపీ చేపట్టనున్న ప్రజా ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ప్రజా సంఘాలు పార్టీలకు అతీతంగా కలసి రావాలని కోరారు. హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తయినా 40 టీఎంసీల నీటి కేటాయింపులకు సంబంధించిన జీఓ విడుదల చేయకుండా చంద్రబాబు సర్కారు మీనమేషాలు లెక్కిస్తోందన్నారు. తుంగభద్ర ప్రాజెక్టు నుంచి 32.50 టీఎంసీలు, బీటీపీ ప్రాజెక్టు నుంచి 4.9 టీఎంసీల నీటిని ప్రతి సంవత్సరం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా అప్పర్ భద్ర ప్రాజెక్టు నుంచి పరశురాంపురం బ్యారేజీ మీదుగా బీటీపీకి, పేరూరు డ్యాంకు, కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని అన్ని చెరువులకు కేంద్ర ప్రభుత్వ నిధులతో నీటిని నింపేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కర్ణాటకపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. హంద్రీనీవా ఎగువ ప్రాంతాలకు(జీడీ పల్లి) నీటిని సాధించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మడకశిర బ్రాంచ్ కెనాల్ నుంచి పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీటిని తీసుకెళ్లే అవకాశం ఉన్నా.. రూ.1,140 కోట్లతో టెండర్లను ఆహ్వానించడం ఎవరి లబ్ధి కోసమని ప్రశ్నించారు. తాత్కాలిక పద్ధతుల ద్వారా రూ.100 కోట్లతో బోరంపల్లి లిఫ్ట్ నుంచి బీటీపీ ప్రాజెక్టుకు నీళ్లిచ్చే పరిస్థితి ఉన్నా రూ.450 కోట్లు కేటాయించడం దారుణమన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడున్న చంద్రబాబు సర్కారు మెడలు వంచే విషయంలో పోరుబాటకు సిద్ధం కావాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. మేధావులు, విశ్రాంత ఇంజనీర్లు, సాగునీటి నిపుణులతో చర్చించి త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రకటించాలని తీర్మానించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు మీసార రంగన్న, ధనుంజయయాదవ్, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి ఓ.నల్లప్ప, ఐఎన్టీయూసీ నాయకులు అమీర్‌బాషా, రైతు సంఘం రాష్ట్ర నాయకుడు ఎంకే వెంకటరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు మహదేవ్, వన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. - పట్టిసీమ అక్రమాలు, పోలవరం అంచనాల పెంపు, ప్రాజెక్టు పనుల్లో జాప్యం చేస్తున్నారని.. హంద్రీ–నీవా నీరు కుప్పం తీసుకెళ్లేందుకు సీఎం చంద్రబాబు యత్నిస్తున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ విమర్శించారు. - కరువు కోరల్లోని అనంతపురం జిల్లా సమగ్రాభివృద్ధి సాధించాలంటే సాగునీటి వనరులే శరణ్యమని మానవహక్కుల వేదిక నాయకులు బాషా తెలిపారు. - జిల్లాకు 35 టీఎంసీల నీళ్లు తెచ్చామని గొప్పలు చెబుతున్న టీడీపీ మంత్రులు, నేతలు ఒక్క ఎకరా ఆయకట్టుకు కూడా ఆ నీటిని పారించలేకపోయారని రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఆర్.చంద్రశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. -
‘పబ్లిసిటీ పిచ్చితో రోడ్డున పడేశారు’
విశాఖపట్నం: విశాఖ భూకబ్జాలపై సీబీఐ విచారణ జరగాల్సిందేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు. లక్ష ఎకరాల భూమి కబ్జా అయిందని స్వయంగా కలెక్టరే చెప్పారని గుర్తు చేశారు. విశాఖలో భూముల కబ్జాలపై గురువారం వివిధ పార్టీ నేతలంతా కలిసి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. దీనికి వైఎస్ఆర్సీపీ నేతలు విజయసాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, అమర్నాథ్, సీపీఎం నేత నర్సింగరావు, సీపీఐ నేత స్టాలిన్, లోక్‌సత్తా నేత బాబ్జీ, బీఎస్పీ నేత బంగారి పలువురు విద్యావేత్తలు, మేధావులు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారంతా మాట్లాడారు. అవేంటో ఒకసారి గమనిస్తే.. విజయసాయిరెడ్డి: ‘భూకబ్జాలపై సీబీఐ విచారణ జరిపించాలి. లక్ష ఎకరాల భూమి కబ్జా అయిందని కలెక్టరే చెప్పారు. అధికార పార్టీ నేతలకు భూకబ్జాలతో సంబంధం ఉంది. పలువురు మంత్రులు పాత్ర కూడా ఉంది. భూకబ్జాలపై వచ్చే నెల 14న హోంమంత్రి రాజ్‌నాథ్‌ను కలుస్తాం. ఆ తర్వాత రాష్ట్రపతిని కలుస్తాం. ఈ నెల 15న కలెక్టరేట్లో పబ్లిక్ హియరింగ్‌లో ప్రజావాణిని వినిపిస్తాం. బాధితులకు వైఎస్ఆర్సీపీ అండగా ఉంటుంది. బొత్ససత్యనారాయణ: ‘రాష్ట్రంలో అవినీతి మరోసారి బట్టబయలైంది. అసెంబ్లీలో వర్షపు నీరు లీకుపై స్పీకర్ వ్యాఖ్యలు హాస్యాస్పదం. కుట్ర జరిగిందని చెప్పి స్పీకర్ పక్కదారి పట్టిస్తున్నారు. అసెంబ్లీలో డొల్లతనం ఒక్క వర్షానికే తేటతెల్లమైంది. చదరపు అడుగు నిర్మాణానికి రూ.రెండు వేలకు బదులు రూ.తొమ్మిది వేలు ఇచ్చి అవినీతికి పాల్పడ్డారు. సీఆర్డీఏ కమిషనర్ వ్యాఖ్యలకు, స్పీకర్ వ్యాఖ్యలకు పొంతనే లేదు. ప్రతిపక్ష నేత ఛాంబర్‌కే విచారణను పరిమితం చేయడమేమిటి? మొత్తం లీకులపై దర్యాప్తునకు ఆదేశించండి’ సీపీఎం నేత నర్సింగరావు: ‘కంప్యూటరీకరణ పేరుతో టీడీపీ నేతలు భూములు కొల్లగొట్టారు. అసైన్డ్ భూములను వదిలిపెట్టలేదు. భూకబ్జాల విషయంలో మంత్రి అయ్యన్నపాత్రుడు, బీజేపీ ఎల్పీ నేత విష్ణు కుమార్ రాజు మాటపై నిలబడాలి. భూములు కోల్పోయిన బాధితుల పక్షాన మేం ఉంటాం. అధికార పార్టీ నేతలపై చర్యలు తీసుకునే వరకు వదిలపెట్టం’ సీపీఐ నేత స్టాలిన్: ‘పేదల భూములను అధికార పార్టీ నేతలు గద్దల్లా తన్నుకెళ్లారు. పేదలకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం’ లోక్‌సత్తానేత బాబ్జీ:‘ప్రభుత్వానికి పబ్లిసిటీ పిచ్చి పట్టింది. బాధితులు రోడ్డున పడ్డా కనీస స్పందన లేదు’ -
లక్ష ఎకరాలు మాయం చేశారు: బొత్స
విశాఖ : విశాఖలో సంచలనం రేపుతున్న భూ కబ్జాలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురువారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీ విజయ సాయిరెడ్డి, బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్తో పాటు కాంగ్రెస్, సీపీఎం, లోక్‌సత్తా, జనసేన, ప్రజసంఘాలు, మేథావులు పాల్గొన్నారు. టీడీపీ పాలనలో జరుగుతున్న భూ కుంభకోణాలు, కబ్జాలపై వారు చర్చించారు. ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ... ఈ భూ కుంభకోణం వెనుక పెద్దల పాత్ర ఉందని, ప్రభుత్వంపై ఆరోపణలు వస్తే వాటిపై విచారణకు సిద్ధంగా ఉండాలని అన్నారు. భూ కుంభకోణం జరిగిందని సాక్షాత్తూ మంత్రే చెబుతున్నారు. ఒక మంత్రిపై మరో మంత్రి ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించాలన్నారు. విశాఖ భూములపై డేగల్లా వచ్చి వాలిపోతున్నారని బొత్స వ్యాఖ్యానించారు. హుద్‌హుద్ తుఫానులో రికార్డులు కొట్టుకు పోయాయని చిన్నపిల్లలకు చెప్పినట్లు కథలు చెప్పడం విడ్డూరమన్నారు. ఈ భూ దందాలపై వీధి పోరాటాలకు దిగాల్సిన అవసరం ఉందని బొత్స సత్యనారాయణ పిలుపు నిచ్చారు. రాష్ట్రంలో పరిస్థితులు బాధాకరంగా ఉన్నాయన్నారు. విశాఖలో లక్ష ఎకరాలు మాయం చేశారని అన్నారు. దసపల్లా బూముల్లో టీడీపీ కార్యాలయం ఎలా కట్టారని ఆయన ప్రశ్నించారు. ఈ భూ కబ్జాపై సీబీఐ విచారణ జరిగేలా రాజకీయా పార్టీలు పోరాటాలు చేయాలని వైఎస్ఆర్ సీపీ రాజ్యసభ ఎంపీ విజయ్ సాయిరెడ్డి అన్నారు. బహిరంగ విచారణతో వాస్తవాలు వెలుగులోకి రావన్నారు. లక్ష ఎకరాల కబ్జా జరిగిందని కలెక్టరే స్వయానా చెప్పారని, అయితే లోకేశ్‌తో మంతనాలతో అనంతరం జిల్లా కలెక్టర్ మాట మార్చారన్నారు. -
‘గొంతెత్తే హక్కు కోల్పోయేలా కనిపిస్తోంది’
హైదరాబాద్: ‘సమస్యలను చెప్పుకోవడం, సర్కారుపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి పౌరుడికీ ఉంది. ఆ హక్కును కాలరాసే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. కానీ రాష్ట్రంలో ప్రజల హక్కులను నిర్భందించే ప్రయత్నం జరుగుతోంది. ఇది మంచి సంకేతం కాదు. ఎన్నో పోరాటల ఫలితంగా ఇందిరాపార్క్ వద్ద నిరసనలు, ధర్నాలు చేసుకోవడానికి అవకాశం దక్కింది. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ధర్నాచౌక్‌ను ఎత్తేస్తాం.. అవేవో నగర శివారు ప్రాంతాల్లో చేసుకొండి అంటే కుదరదు. ఈనెల 23న ఇందిరాపార్క్ వద్ద భారీ సదస్సు నిర్వహిస్తున్నాం. వచ్చే వాళ్లంతా బోనాలు, బతుకమ్మలు, పీర్లు, వృత్తుల చిహ్నాలతో హాజరు కావాలి. సగటుపౌరుడి బలమేంటో ప్రభుత్వానికి తెలియజేయాలి.’ అని తెలంగాణ ఐక్య కార్యచరణ సమితి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ పిలుపునిచ్చారు. ధర్నాచౌక్ పరిరక్షణపై బుధవారం మక్ధూంభవన్లో వామపక్ష పార్టీలు రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించాయి. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి హాజరైన కోదండరామ్ మాట్లాడుతూ.. ‘జేఏసీ ఆధ్వర్యంలో రైతు దీక్ష కోసం అనుమతి అడిగితే పోలీసులు నిరాకరించారు. నిర్వాసితుల దీక్ష అంటే అందుకూ అనుమతి ఇవ్వలేదు. ఇక నిరుద్యోగ సభకు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారు. అనుమతి కోసం పోలీసులను సంప్రదిస్తే పొద్దంతా వేచి చూడాల్సిన పరిస్థితి. తీరా అంతసేపు ఎదురుచూస్తే రాత్రికి వచ్చి అనుమతి ఇవ్వడం లేదు అని తాపీగా చెప్తారు. తెల్లారి కార్యక్రమం చేసుకోనీయకుండా చేస్తున్నారు. ఇదంతా ఒక రకమైన అణిచివేతలా కనిపిస్తోంది.’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఇక సామాన్యుడు గొంతెత్తే హక్కును సైతం కోల్పోయేలా కనిపిస్తోందని, ఇందిరాపార్క్ వద్ద నిరసన వ్యక్తం చేసుకోవద్దనడం సరైన నిర్ణయం కాదని మండిపడ్డారు. ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఈనెల 23న చేపట్టే కార్యక్రమానికి అన్ని వర్గాలు హాజరు కావాలన్నారు. అక్కడే వంటా-వార్పు చేపట్టాలని, కళాకారులతో ఆటా-పాటా, ధూంధాం కూడా ఉంటుందన్నారు. కార్యక్రమానికి వచ్చే వాళ్లంతా జాతీయ జెండాతో పాటు తెలంగాణ ప్రతీకలైన చిహ్నాలను వెంట తెచ్చుకోవాలన్నారు. జిల్లాస్థాయిలో కూడా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. -
జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్ కల్పించాలి
హిందూపురం అర్బన్ : ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ కులాల వారికి జనాభా ప్రతిపాదికన రిజర్వేషన్లు కల్పించాలని సామాజిక హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ డి.జగదీష్ అన్నారు. గురువారం స్థానిక ఐఎంఏ హాలులో వివిధ కులసంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 85 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కులాలకు అనుగుణంగా రిజర్వేషన్లు లేకపోవడంతో 15 శాతం ఉన్న అగ్రకులాల వారే 50 శాతం ఉద్యోగాలు పొందుతున్నారన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులు ఉపసంహరించకోవడంతో ప్రైవేట్ రంగంలో కూడా రిజర్వేషన్లు అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా సామాజిక హక్కుల వేదిక శంఖారావం పూరించిందన్నారు. ఈమేరకు జనవరి 26న మొదలైన బస్సు యాత్ర మార్చి 4న హిందూపురం, 7న అనంతపురంలో బహిరంగ సభతో ముగుస్తుందన్నారు. వేదిక కార్యనిర్వాహక కార్యదర్శి జాఫర్, కురుబ సంఘం రాయలసీమ అధ్యక్షుడు బోరంపల్లి ఆంజినేయులు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, సీపీఐ డివిజన్ కార్యదర్శి సురేష్, వాల్మీకి సంఘంఅధ్యక్షుడు వెంకటచలపతి, సాధుశెట్టి సంఘం అధ్యక్షుడు వెంకటస్వామి, ఎమ్మార్పీఎస్, వివిధ కులసంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా పోరాటం
తక్షణం ప్రభుత్వం స్పందించాలి కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేయాలి రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ కంబాలచెరువు : (రాజమహేంద్రవరం) : ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా ప్రత్యక్ష పోరాటాలకు దిగుతామని ప్రజాసంఘాలు, విద్యార్థి సంఘాలు తెలిపాయి. రాజమహేంద్రవరంలోని ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద దీక్షలు చేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులకు మద్దతుగా ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆ సంఘం జిల్లా కార్యదర్శి బి.పవ¯ŒS మాట్లాడుతూ ఏళ్ల తరబడి కళాశాలల్లో అధ్యాపక వృత్తినే నమ్ముకుని జీవించి, చివరికి వయసు మించిపోయి ఉద్యోగ అర్హత కోల్పోయిన కాంట్రాక్టు అధ్యాపకుల కుటుంబాలకు దిక్కెవరన్నారు. వారి న్యాయమైన డిమాండ్లను నెరవేర్చి పదో పీఆర్సీ అమలు చేయాలని, పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. జేఏసీ నాయకుడు వి.కనకరాజు మాట్లాడుతూ కాంట్రాక్టు అధ్యాపకులకు ఎన్నికల్లో టీడీపీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. యూటీఎఫ్ నాయకుడు పి.మురళీకృష్ణ మాట్లాడుతూ ప్రభుత్వం కాంట్రాక్టు అధ్యాపకులను నిర్లక్ష్యం చేయడం సరికాదన్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి న్యాయం చేయాలని కోరారు. చదువులు చెప్పే పంతుళ్లు ఇలా రోడ్డు పాలు కావడం బా«ధాకరమని ఎల్ఐసీ యూనియ¯ŒS నాయకులు పి.సతీష్ వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విద్యారంగానికి కీలకమైన కాంట్రాక్టు అధ్యాపకుల డిమాండ్లు పరిష్కరించాలని కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జె.రూపస్‌రావు సూచించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఆర్.ఈశ్వరరావు, దేశిరెడ్డి బలరామానాయుడు, గంగాధరరావు, నల్లా రా>మారావు, వి.రాంబాబు, ఎం.ఎస్.ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పోల‘వరం’.. కారాదు శాపం
చట్టానుసారం పరిహారం ఇవ్వాలి లేకుంటే ప్రభుత్వంపై జాతీయస్థాయిలో ఉద్యమం రౌండ్ టేబుల్ సమావేశంలో పార్టీలు, సంఘాల నేతలు గోదావరిపై పోలవరం ప్రాజెక్టు.. తెలుగుజాతి చిరకాలపు కల. అదే ప్రాజెక్టు నిర్వాసితుల పాలిట పీడకలలా పరిణమిస్తోంది. ప్రాజెక్టు వల్ల ఎన్నో ఊళ్లు, ఎంతో సాగుభూమి ముంపునకు గురవడం అనివార్యం. అలా సర్వస్వం కోల్పోయే వారికి ప్రాజెక్టు సాకారమై, ఆ నీటితో బంగారు పంటలు పండే మైదాన ప్రాంతంలోనే కోల్పోయిన భూమికి భూమిని ఇవ్వడమే న్యాయమన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. అయితే.. తరతరాలుగా బతికిన ఊళ్లనూ, బువ్వ పెట్టిన భూములనూ వదులుకోవలసి వచ్చిన నిర్వాసితులకు అంత ఆశ లేనేలేదు. న్యాయమైన పరిహారం ఇచ్చి, భూమికి భూమిగా రాళ్ల దిబ్బలను కాక.. నాలుగు విత్తులు జల్లితే నలభై గింజలు పండే కాస్త మంచి భూమినీ ఇస్తే చాలనుకుంటున్నారు. ఆ అల్ప సంతోషాన్ని కలిగించడానికీ సర్కారుకు మనసొప్పడం లేదు. ఈ నేపథ్యంలో నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం రాజమహేంద్రవరం ఆనం రోటరీ హాలులో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వాసితులకు న్యాయం జరగాల్సిందేనని, అందరికీ ఒకేరీతిలో పరిహారం ఇవ్వాలని ముక్తకంఠంతో డిమాండ్ చేసింది. లేకుంటే జాతీయస్థాయిలో ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించింది. సాక్షి, రాజమహేంద్రవరం : పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టం ప్రకారం పరిహారం చెల్లించకపోతే జాతీయ స్థాయిలో ఉద్యమం చేయాలని పోలవరం నిర్వాసితుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం తిర్మానించింది. ఆదివారం రాజమహేంద్రవరంలోని ఆనం రోటరీ హాల్లో సామాజికవేత్త పెంటపాటి పుల్లారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీపీఐ, సీపీఎం, బీజేపీ, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్, రాష్రీ్టయ ప్రజా కాంగ్రెస్, దళిత హక్కులపోరాట సమితి, ఏఐటీయూసీ, ఏఐఎస్, బీకేఎంయూ, పౌరహక్కుల సంఘం, జట్ల లేబర్ యూనియన్, విలీన మండలాల లాంచీ యూనియన్, నిర్వాసితుల సంఘాల నేతలు, నిర్వాసితులు మాట్లాడారు. ఏదైనా ప్రాజెక్టుకు భూమి తీసుకుని ఐదేళ్లలో దానిని ఉపయోగించకపోతే రద్దు అవుతుందని చట్టం చెబుతోందని నేతలు పేర్కొన్నారు. 2005లో సేకరించిన భూమి 12 ఏళ్లుగా వినియోగంలో లేదని పేర్కొన్నారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం 2009 నుంచి తీసుకున్న భూములకు ఈ నిబంధన వర్తిస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు అవసరమేనన్న నేతలు, నిర్వాసితులకు పూర్తి స్థాయిలో పరిహారం చెల్లించే వరకూ నిర్మాణం ఆపాలని డిమాండ్ చేశారు. నిధులు కేంద్రం ఇస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెడుతోందని, అలాంటప్పుడు పరిహారం ఇవ్వడానికి నిధులు లేవని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఒకే ప్రాజెక్టు పరిధిలో ఒక్కో విధంగా పరిహారం ఇస్తున్నారని దుయ్యబట్టారు. సమావేశంలో ఆయా పార్టీలు, సంఘాల నేతలు, నిర్వాసితులు తమ వాదనను వినిపించారు. ప్రభుత్వం దిగిరాకపోతే యుద్ధం తప్పదు ప్రాజెక్టు పరిధిలో ఐదు లక్షల మంది నిర్వాసితులున్నారు. కేంద్రం ఇచ్చే డబ్బులు వారికి ఇస్తే ప్రాజెక్టు నిర్మాణానికి నిధులెక్కడని సీఎం చంద్రబాబు ప్రశ్నిస్తున్నాడు. ప్రాజెక్టుకు ఎవరూ వ్యతిరేకం కాదు. నిర్వాసితులకు న్యాయం చేయకపోతే యుద్ధం తప్పదు. జాతీయ స్థాయిలో ఉద్యమం చేస్తాం. పార్లమెంట్ ముందు ధర్నా చేస్తాం. – కె.రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చట్టసభల్ని రద్దు చేసి రాజులమని ప్రకటించుకోండి.. ప్రభుత్వ సంస్థలు పనిచేయడంలేదు. చట్టాలు అమలు చేయాలని ప్రజలు పోరాటాలు చేయాల్సి వస్తోంది. ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబులు తమకు తాము రాజు, సామంతరాజులుగా ప్రకటించుకోండి. చట్ట సభలు రద్దు చేయండి. ఖర్చు అయినా తగ్గుతుంది. – ఉండవల్లి అరుణ్‌కుమార్, మాజీ ఎంపీ ఒక్కో ప్రాంతంలో ఒక్కో రేటు పోలవరం కుడికాలువ భూసేకరణకు రూ.52 లక్షలు, పట్టిసీమకు రూ.20 లక్షలు ఇచ్చారు. విలీన మండలాల్లో రూ.లక్షపదిహేను వేలు ఇచ్చారు. పరిహారం అడిగితే ఉన్మాదులంటున్నారు. విలీన మండలాల్లో పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఆస్పత్రుల్లో డాక్టర్లు లేరు. – మిడియం బాబూరావు, మాజీ ఎంపీ ఎమ్మెల్యేల్ని కొనడానికే పట్టిసీమ ఎమ్మెల్యేల్ని కొనుగోలు చేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టిసీమ ఎత్తిపోతలు చేపట్టారు. పాలనను లాభనష్టాలు బేరీజు వేసుకునే వ్యాపారంలా నిర్వహిస్తున్నారే తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదు. ఇంత నీచమైన ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేదు. –జీవీ హర్షకుమార్, మాజీ ఎంపీ రాష్ట్ర సర్కారు నిధుల్ని మళ్లించకూడదు.. రైతులు, నిర్వాసితులకు జరిగిన నష్టాన్ని మా పార్టీ గుర్తించింది. నిర్వాసితులకు రూ.40 వేల కోట్లు ఇచ్చేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులు మళ్లించకుండా నిర్వాసితులకే ఇవ్వాలి. కాకినాడ సెజ్‌ను రద్దు చేయాలి. కొత్తగా సేకరించాలి. – వై.మాలకొండయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎన్నికల హామీ ఏమైంది? 2014 ఎన్నికల్లో నిర్వాసితులకు పూర్తి న్యాయం చేస్తామని సీఎం చంద్రబాబు ఇచ్చిన హామీ ఏమైంది? పోలవరం ప్రాజెక్టుకు నిధులు కేంద్రం ఇస్తే రాష్ట్రం ఖర్చు పెడుతోంది. కమీషన్ల కోసం పట్టిసీమ, పురుషోత్తపట్నం అంటూ రూ.నాలుగువేల కోట్లు తగలేస్తున్నారు. అవి నిర్వాసితులకు ఇవ్చొచ్చుకదా? – కందుల దుర్గేష్, వైఎస్సార్సీపీ నేత 2013 చట్టం ప్రకారం ఇవ్వాలి 2013 చట్టం ప్రకారం నిర్వాసితులకు పరిహారం ఇవ్వాలి. ప్రభుత్వమే చట్టాలను ఉల్లంఘిస్తోంది. అలాంటప్పుడు ప్రజలు పోరాటాలు చేయకుండా ఎలా ఉంటారు? నిర్వాసితులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటుంది. – ఎ¯ŒSవీ శ్రీనివాస్, కాంగ్రెస్ నేత గ్రామ సభ అనుమతి తీసుకోలేదు పీసా చట్టం ప్రకారం గిరిజన గ్రామాల్లో గ్రామ సభ అనుమతి తీసుకోవాలి. భూములు తీసుకునేటప్పుడు ఈ అనుమతి తీసుకోలేదు. అటవీ హక్కుల గుర్తింపు చట్టం ప్రకారం మిగిలి ఉన్న 10 వేల ఎకరాలకు పరిహారం ఇవ్వాలి. గిరిజన చట్టాలను ప్రభుత్వం తుంగలోతొక్కుతోంది. – పల్లా త్రినాథ్, గిరిజన lహక్కుల నేత ఉద్యోగాలు ఇవ్వాలని వైఎస్ తలచారు వైఎస్ హయాంలో పోలవరం కుడి, ఎడమ కాలువలు తవ్వారు. నిర్వాసితుల్లో అర్హులైన వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని తలచారు. పెద్దగా చదువుకోని వారికి ఐటీఐ శిక్షణ ఇచ్చి ప్రాజెక్టు వద్ద ఉద్యోగాలు ఇవ్వాలనుకున్నారు. ఆయన వెళ్లిపోయాక గిరిజన సమస్యలు మరిచారు. – రౌతు సూర్యప్రకాశరావు, మాజీ ఎమ్మెల్యే ఎన్నికల ముడిసరుకుగా మారింది పోలవరం రాజకీయపార్టీలకు ఎన్నికల్లో ముడిసరుకుగా మారింది. బాధితుల తరఫున ప్రశ్నిస్తున్న వారిపై ప్రభుత్వం కేసులు పెడుతోంది. హోదా ఇమ్మంటే ప్యాకేజీ ఇచ్చారు. పోలవరాన్ని కూడా ముంచారు. బడ్జెట్లో రూ.100 కోట్లు కేటాయించారు. – మేడా శ్రీనివాస్, రాష్రీ్టయ ప్రజా కాంగ్రెస్ ఆస్పత్రుల్లో నీళ్లు కూడా లేవు విలీన మండలాల్లోని పీహెచ్‌సీల్లో ప్రసవం జరిగే గదిలో కనీసం నీళ్లు కూడా లేవు. ఆయా గ్రామాల్లో కనీస వసతులు లేవు. పునరావాసం కల్పించే వరకూ వసతులు కల్పించాలి. పరిహారం ఇచ్చే వరకు పనులు ఆపాలి. – టి.అరుణ్, సీపీఎం అర్బ¯ŒS జిల్లా అధ్యక్షుడు చెట్ల కింద ఉంటున్నాం మమ్మల్ని సవతి తల్లిలా చూస్తున్నారు. గ్రామం ఖాళీ చేయించారు. ఇళ్లు ఇవ్వలేదు. చెట్ల కింద ఉంటున్నాం. మాకు అన్ని చేశామని అసెంబ్లీ, హైకోర్టుల్లో చెబుతున్నారు. అందరినీ ప్రభుత్వం మోసం చేస్తోంది. – కట్టా కనకదుర్గ, అంగుళూరు, దేవీపట్నం మండలం బలవంతంగా ఖాళీ చేయించారు అర్ధరాత్రి వచ్చి బలవంతంగా మమ్మల్ని ఖాళీ చేయించారు. ఇద్దె ఇళ్లలో ఉంటున్నాం. ఆడపిల్లలకు ప్యాకేజీ ఇవ్వలేదు. వారికి పెళ్లిళ్లు చేయలేకపోతున్నాం. పొలాలు తీసుకున్నారు. పనులు లేవు. – ఇంటి సూర్యకాంతం, అంగుళూరు కనీస వసతులు లేవు ఇళ్లు కట్టిస్తాం. ప్యాకేజీలు ఇస్తాం అని అధికారులు చెప్పారు. ఇళ్ల వద్ద నీరులేదు. రోడ్లు లేవు. ఎవరైనా చస్తే పూడ్చడానికి శ్మశానాలు లేవు. ఎనిమిదేళ్ల నుంచి అధికారుల చుట్టూ తిరుగుతున్నాం. అయినా పట్టించుకోవడం లేదు. – వరలక్ష్మి, అంగుళూరు జిరాయితీకి రూ.లక్షన్నర మాత్రమే ఇచ్చారు రైతుల వద్ద దశాబ్దం కిందట జిరాయితీ భూములు తీసుకుని లక్షన్నర ఇచ్చారు. ఐదేళ్లలో అవి వాడక పోతే రద్దు అయినట్లే. కొత్త భూసేకరణ చట్టం ప్రకారం మళ్లీ సేకరించాలి. పరిహారం ఇవ్వాలి. డీ ఫాం భూములకు 2013 చట్టం ప్రకారం రూ.10 లక్షలు ఇస్తున్నారు. – జె.వి.సత్యనారాయణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి -
విపత్కర పరిస్థితే
కోటగుమ్మం (రాజమహేంద్రవరం) : ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల రాష్ట్రంలో కో–ఆపరేటివ్ బ్యాంకులు, క్రెడిట్ సొసైటీల్లో విపత్కర పరిస్థితి నెలకొందని ఎ¯ŒSఏఎఫ్సీయూబీ డైరెక్టర్, ది విశాఖపట్నం కో–ఆపరేటివ్ అర్బ¯ŒS బ్యాంకు చైర్మ¯ŒS ఎం.ఆంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. పరిస్థితులు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా ఖాతాదారులకు జాతీయ బ్యాంకుల కంటే మెరుగైన సేవలందిస్తున్నామన్నారు. కో–ఆపరేటివ్ అర్బ¯ŒS బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ ఫెడరేష¯ŒS రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాజమహేంద్రవరంలోని కోళ్ల వీరాస్వామి కల్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. కాకినాడ కో–ఆపరేటివ్ అర్బ¯ŒS బ్యాంకు చైర్మన్, ఫెడరేష¯ŒS రాష్ట్ర అధ్యక్షుడు చిట్టూరి రవీంద్ర అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆంజనేయులు మాట్లాడారు. కో–ఆపరేటివ్ బ్యాంకుల్లో డిపాజిటర్లు చాలా వరకు బ్యాంకు పాలకవర్గాలపై నమ్మకంతోనే డిపాజిట్లు చేస్తారన్నారు. నల్లధనం, తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలు అరికట్టడానికి ఈ విధంగా నోట్లను రద్దు చేశామని ప్రధాని చెబుతున్నప్పటికీ ఆ లక్ష్యం ఎక్కడా నెరవేడం లేదన్నారు. వారానికి రూ.24 వేలు మాత్రమే ఇవ్వాలని బ్యాంకులకు రిజర్వు బ్యాంకు నిర్దేశిస్తే కొందరి వద్ద రూ.కోట్లు పట్టుబడుతున్నాయన్నారు. తమ వద్ద పొదుపు చేసుకున్న డిపాజిటర్లకు ఏ మాత్రం న్యాయం చేయలేకపోతున్నామన్నారు. డిపాజిట్లు పెరుగుతున్నాయని, ఆ తరువాత వారికి అసలు, వడ్డీ కలిపి చెల్లించాలంటే తిప్పలు తప్పడం లేదన్నారు. జాతీయ బ్యాంకుల్లా అనైతిక చర్యలకు దిగాల్సిన పని తమకు లేదన్నారు. రాష్ట్రంలో ఉన్న 48 బ్యాంకుల్లోనూ ఆర్బీఐ నిర్ణయం మేరకు డిజిటల్ లావాదేవీలకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. చిట్టూరి రవీంద్ర మాట్లాడుతూ కో ఆపరేటివ్ బ్యాంకుల్లో జాతీయ బ్యాంకుల కంటే వడ్డీ అధిక శాతం వల్ల చాలా వరకూ పెన్షనర్లు తమ వద్దనే డిపాజిట్లు చేస్తున్నారన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలందించేందుకు త్వరలో వర్క్ షాపులు, శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వివరించారు. వివిధ కో ఆపరేటివ్ బ్యాంకు చైర్మన్లు పాల్గొన్నారు. -
పౌర హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
* తుళ్ళూరులో కేవీపీఎస్ ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం * అంబేడ్కర్ కల్పించిన పౌరహక్కులపై ప్రసంగించిన ప్రతిపక్ష పార్టీలు ప్రజా సంఘాల నేతలు తుళ్లూరు: డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని ప్రతిపక్ష పార్టీలు, ప్రజా సంఘాల నేతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు.అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా కులవివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో తుళ్లూరులోని ఎస్సీ కమ్యూనిటీ హాలులో మంగళవారం రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రాజదాని ప్రాంత సీఐటీయూ నాయకుడు జె.నవీన్ ప్రకాష్ అద్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర కెవీపీఎస్ అధ్యక్షుడు ఆండ్ర మాల్యాద్రి మాట్లాడుతూ ప్రభుత్వాలు చేస్తున్న తప్పులను ఎత్తి చూపినా, ,ప్రశ్నించినా వారిపై తప్పుడు కేసులు పెట్టి వేధించడం, రాజకీయ కక్షలకు దిగడం వంటి చర్యలకు ప్రభుత్వాలు పాల్పడడం ప్రజాస్వామ్యానికి తూట్లు పొడవడమే అన్నారు. మేధావులు, ,ప్రజాసంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఏకమై హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో సీపీఐ నాయకులు రాజు, ఈశ్వరరావు, సీపీఎం నాయకులు ఎం.రవి, జె.వీర్లంకయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు బత్తుల కిషోర్, నందిగం సురేష్, ప్రజాసంఘాల నేతలు స్వచ్ఛంద సంస్థల నేతలు రామారావు, బిళ్ళా నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
నోట్ల రద్దుతో ప్రజలకు ఇక్కట్లు
* కేవీపీఎస్ రౌండ్ టేబుల్లో సమావేశంలో వక్తల ఆవేదన విజయవాడ(లబ్బీపేట): పెద్ద నోట్ల రద్దుతో ప్రజలు అల్లాడుతున్నారని వివిధ సంఘాల నాయకులు మండిపడ్డారు. ‘కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి(కేవీపీఎస్) ఆధ్వర్యంలో గురువారం ‘పెద్ద నోట్లు రద్దు– దళిత గిరిజన ప్రజల ఇక్కట్లు’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. స్థానిక గిరిపురం బాబూజగ్జీవన్‌రామ్ గ్రంథాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో పలు సంఘాలకు చెందిన నేతలు మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో ప్రధాని క్షమాపణ చెప్పాలన్నారు. ఎన్నికల ముందు ప్రజలకిచ్చిన వాగ్దానం ప్రకారం జన్‌ధన్‌యోజన అకౌంట్లో రూ.10 వేలు వేయాలని డిమాండ్ చేశారు. కొత్త నోట్లు వచ్చేంత వరకూ పాత నోట్లు చలామణిలో ఉంచాలన్నారు. క్యూలైన్లలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులకు నవంబర్ జీతాలు నగదు రూపంలోనే చెల్లించాలని కోరారు. దేశంలో చలామణిలో ఉన్న నగదులో 86 శాతం రూ.500, రూ1000 నోట్లు ఉన్నాయని, 90 శాతం నగదు రూపంలోనే ఆర్థిక లావాదేవీలు జరుగుతున్నాయని తెలిపారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి అండ్ర మాల్యాద్రి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, దళిత హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుట్టి రాయప్ప, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు నత్తా యోనారాజు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు కె. ఏసు, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బరావమ్మ, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు జి.నటరాజు. మాతంగి దిలీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బీసీలను మోసగిస్తే గుణపాఠం తప్పదు
విజయవాడ (గాంధీనగర్) : బీసీలను మోసగిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు తగిన రీతిలో బుద్ధి చెబుతామని పలు బీసీ సంఘాల నాయకులు హెచ్చరించారు. స్థానిక ఎంబీ విజ్ఞాన కేంద్రంలో బీసీ సమస్యల పరిష్కారం కోరుతూ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో శనివారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. సమావేశానికి అధ్యక్షత వహించిన బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లు కాపాడుకునేందుకు ఎంతటి ఉద్యమానికైనా వెనుకాడబోమన్నారు. అన్నిరంగాల్లో ముందున్న అగ్రకులాలను బీసీ జాబితాలో చేర్చితే బాబు భరతం పడతామని హెచ్చరించారు. బీసీ జనసభ రాష్ట్ర అధ్యక్షుడు డా. జి గంగాధర్ మాట్లాడుతూ రాయితీల కోసం కాదు, రాజ్యాధికారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. బట్రాజు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కోటంరాజు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల మాదిరిగానే బీసీ ఆట్రాసిటీ యాక్ట్ తీసుకురావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగిరేకుల వరప్రసాద్ మాట్లాడుతూ బీసీలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. బీసీ కార్పొరేషన్‌కు నిధుల కేటాయింపులో అంకెల గారడీ తగదన్నారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్, పీసీసీ ప్రధాన కార్యదర్శి కె. శివాజీ, బీసీ యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్, అన్నం శివరాఘవయ్య, పలగాని సుధాకర్, నూకాలమ్మ, 40కి పైగా బీసీ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. -
ఆక్వాపుడ్ పార్కు నిర్మాణం తక్షణమే ఆపాలి
రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు తాడేపల్లిగూడెం కాలుష్యాన్ని వెదజల్లే ఆక్వాఫుడ్ పార్కు ఏర్పాటు తక్షణమే నిలుపుదల చేయాలని , గ్రామాలపై పోలీసు నిర్భంధాన్ని ఎత్తివేయాలని , అక్రమ కేసులు ఎత్తివేయాలని బుధవారం స్ధానిక సుందరయ్య భవనంలో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. వైఎస్ఆర్సీపి ఎస్సీఎస్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి లంకా మోహన్‌బాబు మాట్లాడుతూ తుందుర్రు పరిసర ప్రాంతాలలో ప్రజలపై చంద్రబాబు ప్రభుత్వం నిర్భంద వైఖరి ప్రదర్శించడం చాలా దారుణమన్నారు. వెంటనే పోలీసు పహరాను తొలగించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు కండెల్లి సోమరాజు మాట్లాడుతూ జీరోశాతం కూడా కాలుష్యం లేకుండా పరిశ్రమను ఏర్పాటుచేస్తున్నామని , యాజమాన్యం చేసిన ప్రకటనలో వాస్తవం లేదన్నారు. గొంతేరు నది పూర్తిగా పాడవుతుందని ప్రొఫెసర్ స్వామి ఇతరులు చెప్పినా కూడా ప్రభుత్వం పెడచెవినపెట్టి . యాజమాన్యానికి కొమ్ముకాస్తుందని ఆరోపించారు. కులనిర్మూలన సమితి రాష్ట్ర నాయకులు మెరిపో జాన్‌రాజు మాట్లాడుతూ సన్న,చిన్నకారు రైతులకు ఈ పాలనలో రక్షణ లేకుండా పోయిందన్నారు. ప్రశ్నించే వారిపై కేసులుపెట్టి ఉద్యమాలను అణచివేయాలని చూడటం అవివేకమన్నారు. గుజరాత్ తిరస్కరించిన ఆక్వాపార్కును ఇక్కడ ఏర్పాటుచేయడం ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడటమే నన్నారు. నిర్భంద గ్రామాల పరిశీలనకు వెళుతున్న అఖిలపక్ష నాయకులపై కేసులు పెట్టడం అన్యాయమని సీపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకులు మామిడి దానవరప్రసాద్ అన్నారు. నాయకులపై దురుసుగా ప్రవర్తిస్తున్న ఎస్ఐ సుధాకరరెడ్డిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఐటియు నాయకులు చిర్ల పుల్లారెడ్డి, గొన్నాబత్తుల నాగేశ్వరరావు, మడకరాజు, వర్రి సత్యనారాయణ, చింతా పద్మావతి, ఏ.విజయ. పి.సరోజ పందల సన్యాసిరావులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ఘోరంగా విఫలం!
⇒ చంద్రబాబు తీరును ఎండగట్టిన రైతు సంఘాలు ⇒ దామాషా పద్ధతిలో నీటిపంపిణీకి అంగీకరించం : మాజీ మంత్రి వడ్డే విజయవాడ(గాంధీనగర్) : కృష్ణానదిపై తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టుల విషయమై ఎపెక్స్ కౌన్సిల్ ఎదుట తమ వాదనలు వినిపించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఘోరంగా విఫలమయ్యారని పలువురు వక్తలు ఘాటుగా విమర్శించారు. విజయవాడ ప్రెస్‌క్లబ్‌లో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో ‘ కృష్ణా, గోదావరి నదులపై ఎగువ రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ప్రాజెక్టులు- రాష్ట్రానికి జరిగే అన్యాయం’ అనే అంశంపై బుధవారం రౌండ్‌టేబుల్ సమావేశం జరిగింది. రైతు సంఘం ఉపాధ్యక్షుడు ఎన్. గురవయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు వక్తలు మాట్లాడుతూ.. ఈ నెల 21న డిల్లీలో జరిగిన ఎపెక్స్ కౌన్సిల్ సమావేశం రాష్ట్ర రైతాంగాన్ని నిరాశపరిచిందన్నారు. సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ.. దిగువనున్న నీటి పారుదల ప్రాజెక్టుల ప్రయోజనాలకు భంగం కలగకూడదని విభజన చట్టంలో స్పష్టం చేశారన్నారు. తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు-రంగారెడ్డి, దిండి ప్రాజెక్టులు విభజన చట్టానికి విరుద్దమన్నారు. వీటికి ఏ ఒక్క అనుమతి లేదన్నారు. ఎపెక్స్ కౌన్సిల్ సమావేశంలో దీన్ని సమర్థంగా, బలంగా తిప్పకొట్టడంలో చంద్రబాబు విఫలమయ్యారన్నారు. సీఎం చంద్రబాబు ఏ ఒక్క విషయంలోనూ రైతుసంఘాల ప్రతినిధులు, నీటిపారుదల రంగ నిపుణుల అభిప్రాయాలు, సలహాలు తీసుకోకపోవడం దురదృష్టకరమన్నారు. ఎఐకెఎస్ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకటయ్య మాట్లాడుతూ.. చంద్రబాబుకు ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారన్నారు. గతంలో అధికారంలో ఉన్నప్పుడు అల్మట్టి ఎత్తు పెంచుతుంటే గుడ్లప్పగించి చూశారని ధ్వజమెత్తారు. చంద్రబాబు నిర్లక్ష్య వైఖరి కారణంగానే కృష్ణా డెల్టా సంక్షోభంలో చిక్కుకుందని, ఇకనైనా కళ్లు తెరిచి డెల్టా ప్రయోజనాలు కాపాడాలని వైఎస్సార్సీపీ అవనిగడ్డ నియోజకవర్గ సమన్వయకర్త సింహాద్రి రమేష్ సూచించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం (సీపీఎం) ప్రధాన కార్యదర్శి వంగల సుబ్బారావు, రైతుసంఘం (సీపీఐ) ప్రధాన కార్యదర్శి కెవివి ప్రసాద్ మాట్లాడుతూ.. మొట్టమొదటి సారిగా కృష్ణాడెల్టాకు కాలువల ద్వారా నీళ్లిచ్చే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. మిగులు జలాలపై చివరి రాష్ట్రమైన ఏపీ వాడుకునే అవకాశం కల్పించాలని తీర్మానం చేశారు. ఈ సమవేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి అక్కినేని వనజ, రైతాంగ సమాఖ్య అధ్యక్షుడు నాగేంద్రనాథ్, రిటైర్డ్ డెప్యూటీ సీఈ కోనేరు రాజేంద్రప్రసాద్, వివిధ సంఘాల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు. -
కృష్ణా జలాల వివాదం పై రౌండ్ టేబుల్ మీట్
-
గ్యాస్ నిక్షేపాల కోసం ఉద్యమించాలి
రౌండ్ టేబుల్ సమావేశంలో వివిధ పార్టీల నేతలు బోట్‌క్లబ్ (కాకినాడ) : కేజీ బేసిన్ పరిధిలోని జిల్లాలో గ్యాస్ నిక్షేపాల కోసం రాష్ట్ర, జిల్లా స్థాయిల్లో ఉద్యమించాలని వివిధ పార్టీల నేతలు పిలుపునిచ్చారు. స్థానిక ఎన్జీవో హోంలో సీపీఎం ఆధ్వర్యాన మంగళవారం జరిగిన అఖిలపక్షం రౌండ్‌టేబుల్ సమావేశంలో పలు పార్టీల నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ, కేజీ బేసిన్లో రిలయన్స్ సంస్థ అక్రమంగా రూ.11 వేల కోట్ల విలువైన గ్యాస్‌ను తరలించుకుపోయిందని ఆరోపించారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించడం లేదన్నారు. దీనివల్ల జిల్లాకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. ఓఎన్జీసీకి చెందిన నిక్షేపాలను రిలయన్స్ అక్రమంగా తరలించుకుపోయినట్టు జస్టిస్ షా కమిటీ నివేదిక ఇచ్చిందని గుర్తు చేశారు. కేజీ బేసిన్లో గ్యాస్‌ను ఇక్కడి సంస్థలకు, జిల్లా ప్రజలకు ఇవ్వకుండా అక్రమంగా తరలించుకుపోవడం దారుణమన్నారు. కార్పొరేట్ సంస్థలకు చంద్రబాబు ప్రభుత్వం దాసోహమైపోయిందని విమర్శించారు. గ్యాస్ నిక్షేపాల కోసం జరిగే న్యాయమైన పోరాటానికి తమ పార్టీ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సీపీఎం జిల్లా కార్యదర్శి దువ్వా శేషుబాబ్జీ మాట్లాడుతూ రియలన్స్ అక్రమాలపై ఓఎన్జీసీ ఇప్పటికే న్యాయపోరాటం చేస్తోందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు దడాల సుబ్బారావు మాట్లాడుతూ, కేజీ బేసిన్ డి6 బ్లాక్‌లో అధిక గ్యాస్ నిక్షేపాలున్నాయన్నారు. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు 1999లో బీజేపీ పాలకులు ఈ బ్లాక్‌లో గ్యాస్ వెలికితీసే అవకాశాన్ని రిలయన్స్‌కు ఇచ్చేలా చట్ట సవరణ చేశారన్నారు. బిడ్ దాఖలు చేసే అవకాశాన్ని కూడా గుజరాత్‌కు చెందిన జీఎస్పీసీకి బీజేపీ ధారాదత్తం చేసిందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా బీజేపీకి వంత పాడి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కారని అన్నారు. వైఎస్ఆర్ సీపీ నగర కో ఆర్డినేటర్ ముత్తా శశిధర్ మాట్లాడుతూ, షా కమిటీ రిపోర్టు బయటకు వచ్చినా పార్లమెంట్లో ఏవిధమైన ప్రస్తావనా రాకపోవడం శోచనీయమన్నారు. సీనరేజ్ కూడా ప్రభుత్వం వసూలు చేయలేకపోయిందన్నారు. జేఏసీ చైర్మన్ బూరిగ ఆశీర్వాదం మాట్లాడుతూ, రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఉద్యమాలకు అండగా నిలుస్తామన్నారు. సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ నాయకులు బుగతా బంగార్రాజు, సీహెచ్.నాగేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) న్యూ డెమోక్రసీ నాయకులు జె.వెంకటేశ్వర్లు, సీపీఐ నాయకులు నక్కా కిషోర్, బీఎస్పీ నాయకుడు చొల్లంగి వేణుగోపాల్, ఆర్పీఐ నాయకుడు అయితాబత్తుల రామేశ్వరరావు, జేఏసీ మాజీ నేత ఆచంట రామారాయుడు, బీసీ సబ్‌ప్లాన్ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు తూతిక విశ్వనాథం, జనవిజ్ఞాన వేదిక నగర అధ్యక్షుడు ఆలపాటి శ్రీనివాస్, కోనసీమ దళిత వేదిక కన్వీనర్ జంగా బాబూరావు తదితరులు కూడా మాట్లాడారు. జేఏసీ కార్యదర్శి పితాని త్రినాథరావు, వైఎస్సార్ సీపీ ప్రచార కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, ఐద్వా నాయకులు కె.సుభాషిణి, ఎస్.భవాని, ఉద్యోగ సంఘ నాయకులు పసుపులేటి శ్రీనివాస్, కె.నాగేశ్వరరావు, సరెళ్ళ చంద్రరావు, సూర్యనారాయణ, మాధవరావు, పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు. -
అధికారికంగా నిర్వహించాలి
విలీన దినోత్సవంపై రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ విలీన దినోత్సవాన్ని ఈ నెల 17న రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో డిమాండ్ చేసింది. ఉత్సవాల నిర్వహణ ద్వారా భారత్‌లో హైదరాబాద్ స్టేట్ విలీనమైన చరిత్రను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరముందని అభిప్రాయపడింది. ప్రజాస్వామ్య ఆకాంక్షలను గౌరవించేలా, నాటి పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకునేందుకు ఇది తోడ్పడుతుందని పేర్కొంది. విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేలా కేంద్రమే ఆదేశాలివ్వాలని సమావేశంలో కొందరు వక్తలు పేర్కొన్నారు. ‘సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలి’ అనే అంశంపై సోమవారం హైదరాబాద్‌లో కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. వివిధ రంగాల ప్రముఖులు ఈ భేటీలో పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. త్యాగాలు గుర్తు చేసుకోండి: కోదండరాం హైదరాబాద్ స్టేట్ విలీనాన్ని చారిత్రక వాస్తవంగా గుర్తించాలని.. సెప్టెంబర్ 17ను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా జరపాలని టీజేఏసీ చైర్మన్ కోదండరాం విజ్ఞప్తి చేశారు. ప్రజాస్వామ్య తెలంగాణ ఆకాంక్షల కోసం షేక్ బందగీ, చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య వంటి వారు చేసిన త్యాగాలను గుర్తు చేసుకునేందుకు దీనిని ఒక సందర్భంగా చూడాలన్నారు. విలీన దినాన్ని జరుపుకోలేకపోతే చరిత్ర దూరమవుతుందని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రితో, ఇతర రాజకీయపార్టీలతో చర్చించడంతో పాటు... ప్రభుత్వం కూడా అఖిలపక్ష సమావేశం నిర్వహించేలా చొరవ తీసుకోవాలని బండారు దత్తాత్రేయను కోరా రు. విలీన దినోత్సవాల నిర్వహణ ఒక వర్గం పై టార్గెట్ చేసినట్లుగా ఉండకూడదని.. ఈ విషయంగా గతంలో కొన్ని తప్పులు జరిగాయని, అందువల్ల చర్చించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబర్ 17 చర్యకు దారితీసిన పరిస్థితులు, నిజాంపై వ్యతిరేకత, భూస్వామ్య వ్యతిరేక ఉద్యమం వంటి వాటిని మతపరమైన దృష్టితో చూడొద్దని సూచించా రు. జేఏసీ తరఫున సెప్టెంబర్ 17న 2 నిమిషాలు మౌనం పాటించి, జాతీయజెండా ను ఎగురవేయాలని నిర్ణయించామని చెప్పారు. ఎంతో ఘనమైన చరిత్ర.. తెలంగాణ పోరాటానిది ఎంతో ఘనమైన చరిత్ర అని, దానిని అధికారికంగా జరపకపోవడం సరికాదని ప్రముఖ శిల్పి ఎక్కా యాదగిరిరావు పేర్కొన్నారు. ప్రభుత్వం విలీన దినోత్సవాన్ని నిర్వహించాలని గాయకుడు గోరటి వెంకన్న కోరారు. చరిత్రాత్మక దినోత్సవంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సెప్టెంబర్ 17ను నిర్వహించాలని సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ విజ్ఞప్తిచేశారు. భారత చరిత్రను, హైదరాబాద్ చరిత్రను విడదీసి చూడలేమని జస్టిస్ ఎల్.నర్సింహారెడ్డి పేర్కొన్నారు. విలీనానికి ముందు ప్రజలు పడిన బాధలు, కన్నీటి గాథలు, మహిళల కష్టాలు, కన్నీళ్లు ఎన్నో ఉన్నాయని... దానికి మతపరమైన రంగు పులమడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. ప్రజలపై జరిగిన అకృత్యాలకు కారణం నిజామేనని, ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేసిన నిజాం విగ్రహాన్ని తొలగించాలని ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, ప్రొఫెసర్ జియా హసన్ డిమాండ్ చేశారు. సమావేశంలో చుక్కా సత్తయ్య, వెల్చాల కొండలరావు, బాబురావు వర్మ, పాశం యాదగిరి, టీజేఏసీ కో కన్వీనర్ వెంకటరెడ్డి, ప్రొఫెసర్లు లక్ష్మి, లక్ష్మణ్, వరలక్ష్మి, మల్లికార్జున్, మురళీధర్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. నా వంతు ప్రయత్నం చేస్తా: దత్తాత్రేయ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే అంశంపై కేంద్ర మంత్రిగా కాకుండా సీనియర్ రాజకీయవేత్తగా, సామాజిక కార్యకర్తగా తన వంతు ప్రయత్నిస్తానని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రభుత్వంతో త్వరగా చర్చించాల్సి ఉందని తెలిపారు. చరిత్రను వక్రీకరించకుండా.. జరిగిన చరిత్ర, ఉద్యమ స్వభావం తరతరాలుగా తెలుసుకుని స్ఫూర్తి పొందాల్సి ఉందని పేర్కొన్నారు. నిజాం స్టేట్‌లో భాగంగా ఉన్న మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల్లో అధికారికంగా నిర్వహిస్తున్నట్లుగా.. తెలంగాణలోనూ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. -
హన్మకొండ జిల్లా వద్దే వద్దు...
విద్యారణ్యపురి : రాష్ట్రంలో కొత్త జిల్లా లు, డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయంగా జరగడం లేదని పూలే ఆశయ సాధన సమితి(పాస్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అన్నారు. కేయూ దూర విద్యా కేంద్రంలోని జాఫర్ నిజాం సెమినార్ హాల్లో ఆదివారం ‘పాస్’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లేశ్వర్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ఏర్పాటును ఎవరూ కోరకున్నా ప్రభుత్వం నిర్ణయించడం గర్హనీయమన్నారు. తొలుత మూడు జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించి తీరా ముసాయిదా విడుదల సందర్భంగా హన్మకొండ జిల్లాను ఎవరి ప్రయోజనా ల కోసం తెరపైకి తెచ్చారో చెప్పాలన్నా రు. చారిత్రక ఓరుగల్లును విభజించే ఆలోచన, హన్మకొండ జిల్లా ఏర్పాటు యోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పాస్ బాధ్యులు డాక్టర్ వి.రాంచంద్రం, డాక్టర్ వడ్ల వీరాచారి, డాక్టర్ నల్లాని శ్రీనివాస్, శ్రీధర్, ఈశ్వర్‌కుమార్, నల్లపు శ్రీధర్, డాక్టర్ చింతం ప్రవీణ్‌కుమార్, దాడబోయిన శ్రీకాంత్, డాక్టర్ మంద వీరస్వామి, వి.సుధాకర్, ఎన్.రాజేందర్, తిరుపతి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. -
అణగారిన పేద వర్గాలను అణచి వేస్తోంది
హిందూపురం టౌన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ వర్గాలకు కొమ్ము కాస్తూ అణగారిన పేద వర్గాలను అణచి వేస్తోందని సామాజిక హక్కుల వేదిక రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సామాజిక హక్కుల వేదిక, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఫోరం ఆధ్వర్యంలో శనివారం సాయంత్రం స్థానిక ఐఎంఏ హాలులో జిల్లా, రాష్ట్ర స్థాయి వివిధ కుల సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ జనాభాలో అధికంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు విద్య, వైద్య, ఉపాధి అవకాశాలు లేక, ప్రభుత్వ తోడ్పాటు లేక అణచివేతకు గురవుతున్నారన్నారు. అర్హులకు ఇళ్ల స్థలాలు ఇచ్చి, ఇళ్లు నిర్మించి, దళిత, గిరిజన, బలహీన వర్గాలకు ప్రభుత్వమే భూములు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. దీనిపై ఈ నెల 17న అనంతపురంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. సమావేశంలో సామాజిక హక్కుల వేదిక కన్వీనర్ జగదీష్, జాతీయ వడ్డెర సంఘం నాయకులు జయంత్, ఎమ్మార్పీఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మధు, ఆర్పీఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శ్రీరాములు, ఓపీడీఆర్ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాసులు, మైనార్టీ రాష్ట్ర నాయకులు నదీమ్, బీఎస్పీ రాష్ట్ర నాయకులు నాగభూషణం, నూర్‌మహ్మద్, సాలార్‌బాషా, వేదిక సభ్యులు జాఫర్, కాటమయ్య, ఆనంద్‌కుమార్, శ్రీరాములు, కష్ణానాయక్, సురేష్, దాదాపీర్, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఉద్యమించాలి
కడప వైఎస్సార్ సర్కిల్ : జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ప్రజా ఉద్యమంలా పోరాటం సాగించాలని ఎమ్మెల్యే ఎస్బి అంజద్‌బాషా పేర్కొన్నారు. శనివారం సీపీఐ ఆధ్వర్యంలో స్థానిక రా.రా. గ్రంథాలయంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజన చట్టంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేస్తామని పొందుపరిచి ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం దారుణమన్నారు. కేంద్ర ప్రభుత్వం విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేయాల్సిందిపోయి తనకేమి పట్టనట్లు వ్యవహారించడం తగదన్నారు. రాయలసీమలో నిరుద్యోగం తాండవించి, వలసలు వెళుతుంటే వారి గురించి పట్టించుకున్న దాఖలాలు లేవన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చకుండా జిల్లాపై సవతి తల్లి ప్రేమ చూపడం సరికాదన్నారు. జిల్లాలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటుపై కేంద్రంతో పోరాడాల్సిందిపోయి కేంద్ర పెద్దలు చెప్పినట్లు తల ఊపుతూ ఎలాంటి అభివృద్ది నిధులు కేటాయించకుండా చేయడం దారుణమన్నారు. రాష్ట్ర విభజన జరిగి నాలుగు సంవత్సరాలు గడుస్తున్నా ఇంతవరకు ఉక్కు ఫ్యాక్టరీ ఊసే ఎత్తకపోవడం సహించరాని విషయమన్నారు. పీసీసీ అధికార ప్రతినిధి నీలి శ్రీనివాసరావు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అ«ధికారంలోకి వచ్చి రెండున్న సంవత్సరాలు దాటుతున్నా ఎటువంటి అభివృద్దిగానీ, జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేసిన పాపాన పోలేదన్నారు. ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి నాగసుబ్బారెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతం అన్ని రంగాల్లో వెనుకబడి ఉందని, పారిశ్రామికంగా అభివృద్ది జరగాలంటే జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు తప్పనిసరి అన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి పోరాటాలు సాగించాలని పిలుపునిచ్చారు. అవసరమైతే ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా నిర్వహించడానికి సిద్దం కావాలన్నారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాంత అభివృద్ది కోసం కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అందుకు న్యాయవాదులు తమవంతు మద్దతుగా ఆందోళనలు నిర్వహించడానికి సిద్దంగా ఉన్నారన్నారు. రాయలసీమ ఎస్సీ ఎస్టీ హ్యూమన్ రైట్స్ కన్వీనర్ జేవీ రమణ మాట్లాడుతూ సీమలో పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బండి జకరయ్య మాట్లాడుతూ వెఎస్సార్ జిల్లా అన్ని విధాలా వెనుకబడి ఉందన్నారు.ప్రభుత్వం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు కృషి చేయాలని, లేనిపక్షంలో ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షులు సంగటి మనోహర్, సంఘ సేవకుడు సలావుద్దీన్, సీపీఎం కార్యవర్గ సభ్యుడు కృష్ణమూర్తి, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు పి.అంకుశం, ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి ఓబులేశు, పీడీఎస్‌యూ నాయకులు నాగేంద్ర పాల్గొన్నారు. -
హోదా కోసం త్యాగాలకు సిద్ధం
నెల్లూరు (టౌన్) : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు త్యాగాలకు సిద్ధమని పలువురు నాయకులు చెప్పారు. ఆదివారం నెల్లూరులోని దర్గామిట్టలో ఉన్న ఎన్జీఓ హోంలో ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకహోదా జేఏసీ వివిధ సంఘాల నాయకులతో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా జేఏసీ జిల్లా కన్వీనర్ అంజయ్య మాట్లాడుతూ హోదా విషయంలో నాటకాలు ఆపాలన్నారు. ఈనెల 5వ తేదీన రాజ్యసభలో హోదాపై పెట్టే ఓటింగ్‌లో రాజకీయాలకు అతీతంగా ఓటు వేయాలని డిమాండ్ కోరారు. ఓటింగ్‌కు దూరంగా ఉన్న పార్టీలకు తగిన బుద్ధిచెబుతామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ పిలుపునిచ్చిన బంద్‌కు తమ సంపూర్ణ మద్దతు తెలుపుతున్నట్లు ప్రకటించారు. ఆయా సంఘాల నాయకులు అల్లాడి గోపాల్, శేఖర్, చంద్రశేఖరరెడ్డి, స్వర్ణ వెంకయ్య, ఫయాజ్, చంద్రశేఖర్, శంకరయ్య, నాగేంద్రకుమార్, ఆదినారాయణ, వంశీకృష్ణ, మనోహర్, నరసింహ, మురళీకృష్ణయాదవ్, అన్వర్‌బాష, శ్రీనివాసులు, వెంకటరమణలు పాల్గొన్నారు. -
పాపన్న చరిత్రను గ్రామాల్లో ప్రచారం చేయాలి
తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరిగౌడ్ కాజీపేట: గోల్కొండ నవాబులను గడగడలాడించిన సర్ధార్ సర్వాయి పాపన్న చరిత్రను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం కాజీపేట గౌడ సంఘం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల రౌండ్‌టేబుల్ సమావేశానికి జిల్లా గౌరవ అధ్యక్షుడు బైరి రవికృష్ణగౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ ఆగస్టు 1న ప్రారంభమై 10వ తేదీన ముగిసే పాపన్న చైతన్యయాత్రను విజ యవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి భారీగా గౌడన్నలు తరలిరావాలని కోరారు. ఆగస్టు 18న పాపన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాపన్న చరిత్రను పాఠ్యంశాలల్లో చేర్చాలని, ట్యాంకు బండ్‌పై విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించడానికి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో వండ్లకొండ వేణుగోపాల్, మారగోని భద్రయ్య, బైరి హరికృ ష్ణ, ఉడుగు శ్రీనివాస్, గడ్డం యాదగిరి, బొమ్మగాని వినోద్‌కుమార్, పిల్లల కుమారస్వామి, బండారి జనార్దన్, బూర శ్రీనివాస్, కె.అశోక్, గడ్డం రాజు, జి.శ్రీధర్ పాల్గొన్నారు. -
కాపులను బీసీల్లో చేర్చే ప్రతిపాదన విరమించుకోవాలి
కడప రూరల్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాపులను బీసీ జాబితాలో చేర్చే ప్రతిపాదన విరమించుకోకపోతే బీసీ వర్గాలు తిరుగుబాటు ఉద్యమాలకు సిద్ధం కావాలని బీసీ జేఏసీ రాష్ట్ర కమిటీ నేతలు పిలుపునిచ్చారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప నగరం ఎన్జీఓ కాలనీలోని సాయి ఫంక్షన్ హాలులో ఏపీ బీసీ జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యుడు ఎస్.యానాదయ్య అధ్యక్షతన బీసీ ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అన్నా రామచంద్రయ్య యాదవ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కేవలం తన స్వార్థ ప్రయోజనాల కోసం కాపులను బీసీ జాబితాలో చేర్చాలనుకోవడం తగదన్నారు. కాపులు ఎలాంటి వివక్షకు గురికాకుండా అన్ని రంగాల్లో ఆర్థికాభివృద్ధి సాధించారని తెలిపారు. బీసీ వర్గాలు ఇప్పటికీ వివక్షకు గురికావడంతోపాటు అన్ని రంగాలలో వెనుకబడి ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉన్న రిజర్వేషన్లు బీసీలకు ఏమాత్రం సరిపోవడం లేదన్నారు. ఇలాంటి తరుణంలో కాపులను బీసీ జాబితాలో చేర్చడం ఏమిటని ప్రశ్నించారు. జనాభాలో 50 శాతానికి పైగా బీసీ వర్గాలు ఉన్నప్పటికీ రాష్ట్ర మంత్రివర్గంలో అత్యధిక శాతం మంది కాపు వర్గానికి చెందినవారే మంత్రులుగా కొనసాగుతున్నారన్నారు. బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి పెంచాలని డిమాండ్ చేశారు. అలాగే మంజునాథ కమిషన్ రాష్ట్రంలో ఎక్కడ పర్యటించినా అడ్డుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు ఊసా సాంబశివరావు, గూడూరు వెంకటేశ్వర్లు, ఎంవీఎస్ మూర్తి, రాజగోపాల్, బొర్రా రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలని సమావేశం
ఉరవకొండ (అనంతపురం) : ప్రజల పక్షాన పోరాడుతున్న సాక్షి ప్రసారాలను నిబంధనలకు విరుద్ధంగా ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ ఉరవకొండలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మీడియాపై ప్రభుత్వం దమనకాండను సమావేశం ముక్తకంఠంతో ఖండింది. వెంటనే సాక్షి టీవీ ప్రసారాలు పునురుద్ధరించాలని.. లేకుంటే ప్రజా ఉద్యమం తప్పదని హెచ్చరించింది. ఈ సమావేశానికి వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, బీజేపీ, ఎమ్మార్పీఎస్, ప్రజా, విద్యార్థి సంఘాల నేతలతోపాటు విలేకరులు పాల్గొన్నారు. -
రైల్వే జోన్ వస్తే రాష్ట్రానికి మేలు: బొత్స
రాజకీయ నిర్ణయం తీసుకోవాలి.. విభజన చట్టం హామీని అమలు చేయాలి రౌండ్‌టేబుల్ సమావేశంలో వైఎస్సార్సీపీ నేత బొత్స విశాఖపట్నం: విశాఖపట్నం రైల్వే జోన్ రాష్ట్రానికి... రాష్ట్ర ప్రజలకు... రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన సమస్య అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. విశాఖకు రైల్వే జోన్ వస్తే ఉత్తరాంధ్రకే కాదు.. రాష్ట్రం మొత్తానికి మేలు జరుగుతుంది ఆయన అన్నారు. బుధవారం విశాఖ ఆంకోసా హాలులో రైల్వే జోన్ సాధనకు 'రైల్వే జోన్ మన హక్కు-స్ఫూర్తి విశాఖ ఉక్కు' అనే నినాదంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో బొత్స సత్యనారాయణ మాట్లాడారు. మోదీ మంత్రి వర్గంలోని వెంకయ్యనాయుడు విశాఖ రైల్వే జోన్ కోసం కేంద్రంపై ఎందుకు ఒత్తిడి చేయడం లేదని ప్రశ్నించారు. రైల్వే జోన్ ఇవ్వడానికి కేంద్రానికి ఉన్న ఇబ్బంది ఏమిటో అర్థం కావడం లేదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాపై విభజన చట్టం లేదన్నారు.. మరి రైల్వే జోన్ చేర్చారు కదా? ఎందుకు అమలు చేయడం లేదు? పైగా రాష్ట్ర శాసనసభలోనూ విశాఖలో రైల్వే జోన్ ఏర్పాటు చేయాలని వైఎస్సార్సీపీ మద్దతుతో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. జోన్‌పై కేంద్ర ప్రభుత్వం జాప్యం చేయడం తగదు. తక్షణమే రైల్వే జోన్ ఏర్పాటు చేస్తే ఆ పేరు మీకే వస్తుంది. ఆ లబ్ది మీరే పొందండి అని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బొత్స సూచించారు. గతంలో ఏర్పాటు చేసిన రైల్వే జోన్లు రాజకీయ కోణంలో చేసిన వేనవేనని ఆయన గుర్తు చేశారు. విశాఖ జోన్‌పై కూడా ఎలాంటి సాకులూ చెప్పకుండా రాజకీయ నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్ చేశారు. ఇందుకు అన్ని పార్టీల నాయకులు సహకరించాలని కోరారు. కేంద్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, విశాఖ ఎంపీ కె.హరిబాబు, టీడీపీ మంత్రులు, ఎంపీల మాట చెల్లుబాటవుతుందని, ఒత్తిడి చేసి జోన్ తీసుకురావాలన్నారు. సీఎం చంద్రబాబు జోన్‌పై ఇదిగో, అదిగో అంటూ మోసం చేస్తున్నారని విమర్శించారు. రైళ్లను అడ్డుకోవడం, ఉద్యమాలు, ఆందోళనలతో రాష్ట్రంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకముందే జోన్ ప్రకటించాలని సూచించారు. జోన్ కోసం కార్యాచరణ రూపొందించాలని కోరారు. జోన్ సాధన కోరుతూ ఈ నెల 14 నుంచి వైఎస్సార్సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ చేపట్టనున్న నిరవధిక నిరాహార దీక్షకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి రైల్వే జోన్ సాధనకు గిరిజనులు అండగా ఉంటారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ విభజన చట్టంలో పేర్కొన్న మేరకు రైల్వే జోన్ ఇచ్చి తీరాలన్నారు. టీడీపీ, బీజేపీలు అధికారంలోకి వచ్చి మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా జోన్ ఇవ్వలేదన్నారు. దీనిపై ఉత్తరాంధ్ర ప్రజలు, అన్ని పార్టీల నేతలు, మేధావులు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, విద్యార్థి, మహిళా సంఘాల మద్దతు కలిపి 14న విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రైల్వే జోన్ సాధనకు నిరవధిక నిరాహారదీక్షకు దిగుతున్నట్టు ప్రకటించారు. ప్రజాస్పందన అధ్యక్షుడు, రిటైర్డు ఐఈఎస్ అధికారి సీఎస్ రావు మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన ఆరు నెలల్లోపు విశాఖకు ఇస్తామన్న రైల్వే జోన్ ఇవ్వలేదన్నారు. స్థానిక ఎంపీ హరిబాబు జోన్ వస్తుందంటూ రెండేళ్లుగా మోసం చేసినందుకు ఎంపీ హరిబాబుపై అవిశ్వాసం పెట్టడానికి ప్రజల్లోకి వెళ్లాలని పిలుపునిచ్చారు. హరిబాబు ఇచ్చిన మాట నిలబెట్టుకోనందుకు ఎంపీ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రౌండ్‌టేబుల్ సమావేశంలో ఎమ్మెల్యే బూడి ముత్యాలనాయుడు, మాజీ ఎమ్మెల్యేలు గొల్ల బాబూరావు, తైనాల విజయకుమార్, కర్రి సీతారామ్, మాజీ ఎమ్మెల్సీ డీవీ సూర్యనారాయణరాజు, సీపీఎం జిల్లా కార్యదర్శి లోకనాథం, సీపీఐ కార్యదర్శి పైడిరాజు, లోక్‌సత్తా నేత భీశెట్టి బాబ్జీ, రైల్వే శ్రామిక యూనియన్ జోనల్ కార్యదర్శి చలసాని గాంధీ, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు వంశీకృష్ణయాదవ్, కోలా గురువులు, రొంగలి జగన్నాథం, రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కంపా హనోకు, జాన్‌వెస్లీ, పార్టీ జిల్లా పార్టీ మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్, ఉత్తరాంధ్ర రక్షణ వేదిక అధ్యక్షుడు ఎస్.ఎస్.శివశంకర్, ఉత్తరాంధ్ర పొలిటికల్ జేఏసీ కన్వీనర్ జేటీ రామారావు, ఏయూ ప్రొఫెసర్లు బాబీవర్థన్, జాన్, న్యాయవాదులు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. -
రోహిత్ చట్టం తేవాలి
- పౌర సంఘాలతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం - రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు హైదరాబాద్: బీజేపీ, ఆర్ఎస్ఎస్, హిందుత్వ శక్తుల కుట్రలో భాగంగానే హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ ఆత్మహత్య జరిగిందని పలువురు వక్తలు ఆరోపించారు. అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ద్వారా నాటకాలాడుతూ దళిత విద్యార్థులను ఎదగనివ్వకుండా చేస్తున్నారని దుయ్యబట్టారు. నిర్భయ చట్టం తరహాలో రోహిత్ చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్యకు కేంద్ర మంత్రులు స్మృతి ఇరానీ, రాజ్‌నాథ్ సింగ్, బండారు దత్తాత్రేయ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఆదివారమిక్కడ తెలంగాణ డెమోక్రటిక్, సెక్యులర్ అలయెన్స్ సంస్థ ఆధ్వర్యంలో ‘రోహిత్ ఆత్మహత్య-జరుగుతున్న పరిణామాలు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అలయెన్స్ కన్వీనర్ డాక్టర్ కొల్లూరి చిరంజీవి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్, తామీరే మిల్లత్ ఉపాధ్యక్షుడు జియా ఉద్దీన్ నయ్యర్, ప్రొఫెసర్ నాగేశ్వర రావు, జమాతే ఇస్లామీ ప్రతినిధి అజారుద్దీన్, న్యాయవాది కె.ఎం.రాందాస్, ఏఐసీసీ సభ్యులు ఖలీ ఖుర్ రెహ్మాన్, జూపాక సుభద్రలతో పాటు మరో 40 సంఘాల ప్రతినిధులు పాల్గొని ప్రసంగించారు. రోహిత్ ఆత్మహత్యపై ఢిల్లీ, ముంబై, కేరళలోని నగరాల్లోనే ఆందోళనలు జరుగుతున్నాయని,హైదరాబాద్‌లో కేవలం హెచ్‌సీయూ క్యాంపస్‌కే పరిమితమయ్యాయని కొల్లూరి చిరంజీవి అన్నారు. పౌరసంస్థలతో కలసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేయడానికి సిద్ధం కావాలని సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించినట్లు పేర్కొన్నారు. -
ప్రత్యేక హోదా - ఏపీ పేరుతో రౌండ్ టేబుల్ సమావేశం
-
సాక్షి ఆధ్వర్యంలో రౌండ్‌టేబుల్ సమావేశం
-
ప్రత్యేకహోదాపై సీపీఎం రౌండ్ టేబుల్ సమావేశం
కృష్ణా(కంకిపాడు): సమగ్ర అభివృద్ధి, రాజధాని ప్రత్యేక హోదాతో పాటు పలు అంశాలపై సీపీఎం ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కృష్ణా జిల్లా కంకిపాడులో నిర్వహించిన ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్రనాయకులు మురళికృష్ణతో పాటు పలువురు ప్రజాసంఘాల నాయకులు పాల్గొని రాష్ట్ర సమస్యలపై చర్చించారు. -
సెక్షన్-8పై రౌండ్ టేబుల్ సమావేశం రసాభాస
-
ప్రత్యేక హోదా కోసం సమావేశం
వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఇన్సాఫ్ విద్యా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గురవారం జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు శివాజీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. -
జెండాలు.. అజెండాలు పక్కన పెట్టాలి
ఏపీకి ప్రత్యేక హోదా సాధనపై రౌండ్ టేబుల్ సమావేశం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని అన్ని రాజకీయ పార్టీలు డిమాండ్ చేశాయి. ఏపీ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం హైదరాబాద్‌లో ‘ప్రత్యేక హోదా సాధన’పై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో జెండాలు- అజెండాలు పక్కన పెట్టి అందర్ని ఢిల్లీకి తీసుకువెళ్లాలని ఈ సమావేశంలో పాల్గొన్న వివిధ పార్టీల నేతలు డిమాండ్ చేశారు. మోడీపై పోరాడే సత్తా బాబుకు లేదు: సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మాట్లాడుతూ, మోదీపై పోరాడే సత్తా చంద్రబాబుకు లేదన్నారు. పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి మాట్లాడుతూ, ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబును మించిన వారు లేరన్నారు. ప్రత్యేక హోదాపై మోదీ ఇంటి వద్ద ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ధర్నా చేయాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహనరావు అన్నారు. టీడీపీ మంత్రులను వెనక్కి పిలవాలి: చెవిరెడ్డి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ ప్రత్యేక హోదా కోసం కేంద్రంపై టీడీపీ ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కేంద్ర మంత్రులను వెనక్కి పిలిస్తే.. కేంద్రం దిగొస్తుందని అన్నారు. ప్రత్యేక హోదాను సాధించుకునేందుకు చంద్రబాబుతో కలసి వస్తామన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే విషయంలో సాంకేతికపరమైన ఇబ్బందులున్నాయనడం పచ్చి అవకాశదానికి నిదర్శమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. ఏపీ విద్యార్ధి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు డీవీ కృష్ణాయాదవ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సినీ నటుడు శివాజీ, కాంగ్రెస్ నాయకులు తులసీరెడ్డి, గిడుగు రుద్రరాజు తదితరులు పాల్గొన్నారు. సదస్సులో చేసిన తీర్మానాలు: ఈ నెల 31న నెల్లూరులో విస్తృత స్థాయి సమావేశం, జూన్ 2న రాష్ట్ర విభజన దినం సందర్భంగా నల్ల రిబ్బన్, నల్ల జెండాలతో నిరసన, 3వ తేదీన ఎంపీలు, కేంద్రమంత్రుల ఇళ్ల వద్ద ధర్నా, 4వ తేదీన అనంతపురంలోని ఎస్కే వర్సిటీ ప్రాంగణంలో విస్తృత స్థాయి సమావేశం, 5వ తేదీన నాగార్జున వర్సిటీలో విద్యార్థి జేఏసీ సమావేశం. భవిష్యత్తు కార్యాచరణపై చర్చ. -
ఈ కలెక్టర్ మాకొద్దు..
కడప రూరల్ : జిల్లా కలెక్టర్ కేవీ రమణ వ్యవహార శైలిపై అఖిలపక్షం నేతలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాజ్యాంగ బద్ధంగా పని చేయని ఆయన ఈ జిల్లా కలెక్టర్‌గా అర్హులు కారని పేర్కొన్నారు. కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం మానవ హక్కుల వేదిక జిల్లా కన్వీనర్ జయశ్రీ అధ్యక్షతన రౌండు టేబుల్ సమావేశం నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ, కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, కార్మిక సంఘం నేతలు జిల్లా కలెక్టర్ తీరుపై మండిపడ్డారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన ఆయన ఇష్టానుసారం వ్యవహారిస్తున్నారని ఆరోపించారు. జిల్లాకు రావడానికి పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారంటూ జిల్లా ప్రతిష్ఠను దెబ్బ తీశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కలెక్టర్ ఈ జిల్లాకు వద్దని పేర్కొన్నారు. ప్రభుత్వం తక్షణమే ఆయన్ను వెనక్కి పిలిపించుకోవాలని, మంచి అధికారిని ఇక్కడికి పంపాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, గవర్నర్ నరసింహన్‌తోపాటు చీఫ్ సెక్రటరీలకు తీర్మానం కాపీలను పంపాలని నిర్ణయించారు. కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్రమోడిలకు కూడ ఫిర్యాదులు పంపాలని నిర్ణయించారు. కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, రైతు సంఘం నాయకులు చంద్రమౌళీశ్వర్‌రెడ్డి, నాయకులు ప్రతాప్‌రెడ్డి, ఫణిరాజు తదితరులు పాల్గొన్నారు. ప్రజలను పట్టించుకోవడం లేదు జిల్లా కలెక్టర్ కేవీ రమణ పరిపాలన, వ్యవహార శైలి ఏమాత్రం బాగా లేదు. ఒక పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు ఒక బాలిక పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. అది జిల్లాలో పెద్ద సంచలనం అయింది. ఆ గ్రామస్తులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. విచారణ కోసం వచ్చిన జిల్లా కలెక్టర్ సదరు ఉపాధ్యాయునికి వత్తాసు పలకడం దారుణం. పాఠాలు చెప్పడంలో భాగంగానే ‘గిల్లడం’ జరిగిందని పేర్కొనడం మరీ దారుణం. పోలీసులు అతనిపై కేసు పెట్టినా కలెక్టర్ క్లీన్ చిట్ ఇవ్వడం శోచనీయం. మైదుకూరులో ఒక కంపెనీ మందును రైతులు వాడడంతో వంద ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. న్యాయం కోసం ఆ రైతులు జిల్లా కలెక్టర్‌ను కలిస్తే రెండు, మూడు దఫాలు తిప్పుకుని ఫోరంకు వెళ్లాలని సూచించడం ఈ కలెక్టర్‌కే చెల్లింది. కడప స్పోర్ట్స్ స్కూలు వ్యవహారానికి సంబంధించి అవినీతికి పాల్పడిన స్పెషల్ ఆఫీసర్‌ను తన పక్కనే కూర్చొబెట్టుకుని అతనికి అనుకూలంగానే మాట్లాడి కింది స్థాయి ఉద్యోగులపై చర్యలు చేపట్టడం ఎంత వరకు సబబు? ప్రజలకు మేలు చేయని ఈ కలెక్టర్ మాకొద్దు. జిల్లాలో ప్రొద్దుటూరు ఆస్పత్రి సమస్యలపై పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుంటే అటువైపు కన్నెత్తి చూడలేదు. విద్యార్థులు రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తే స్పందనే ఉండదు. ఫిర్యాదు చేయాలని వస్తే కలిసే అవకాశం ఇవ్వరు. ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన అధికారి నియంతృత్వంతో వ్యవహరించడం ఎంత వరకు సమంజసం? - జయశ్రీ, మానవ హక్కుల ఐక్య వేదిక జిల్లా కన్వీనర్ ప్రజలన్నా, ప్రజా ప్రతినిధులన్నా లెక్కలేదు కేవీ రమణ జిల్లా కలెక్టర్ కాకముందు బ్యాగుల కుంభకోణంలో సస్పెండ్ అయ్యారు. అనంతరం జిల్లాకు కలెక్టర్‌గా వచ్చారు. ఆయన తీరు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూస్తున్నాం. జిల్లా సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబును కలవాలంటే కలవనీయలేదు. ప్రజలు దరఖాస్తులు ఇవ్వడానికి వెళితే కనీసం తలెత్తి కూడా చూడరు. సాక్షాత్తు జెడ్పీ చైర్మన్‌నే పట్టించుకోలేదు. నాకు కలెక్టర్‌ను కలవడానికి మూడు రోజుల సమయం పట్టింది. కలెక్టర్‌ను ఇక్కడి నుంచి పంపడమే మేలు. ఇది వెనుకబడిన జిల్లా. రాష్ట్ర విభజన నేపథ్యంలో అన్ని విధాల ఇబ్బందులు పడుతున్నాం. కరువు జిల్లాలో ఇలాంటి కలెక్టర్ పనిచేస్తే ప్రజలకు మరింత నష్టమే. - నారాయణ, సీపీఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కలెక్టర్ తీరు మారాలి జిల్లా కలెక్టర్ అనుసరిస్తున్న తీరు పద్ధతిగా లేదు. ఆయన తీరు మారాలి. ప్రజల కోసం పని చేయాలి. అపాయింట్మెంట్ పద్ధతిని రద్దు చేయాలి. కలెక్టర్ అంటే జిల్లా సంక్షేమం కోసం, ప్రజల బాగు కోసం పని చేయాలి. అన్ని వర్గాలను కలుపుకు పోవాలి. అందరికీ అందుబాటులో ఉండాలి. అలా కాకుండా వ్యవహరిస్తే ఎవరూ ఒప్పుకోరు. - నాగ సుబ్బారెడ్డి, సీపీఐ నాయకుడు జిల్లా కలెక్టర్‌పై చర్చ ఇదే మొదటిసారి జిల్లా చరిత్రలో కలెక్టర్ వ్యవహార శైలిపై చర్చ జరగడం ఇదే మొదటిసారి. నచ్చిన వారికి క్లీన్ చిట్ ఇవ్వడం, నచ్చని వారికి పనిష్మెంట్ ఇవ్వడం తగదు. జిల్లా అభివృద్ధి కోసం మాత్రమే ఆయన పని చేయాలి. రాజకీయ నాయకునిలా వ్యవహరించడం, మాట్లాడటం పనికిరాదు. జిల్లా కలెక్టర్ కలెక్టర్‌గానే వ్యవహరించాలి. వంద సంవత్సరాలుగా ఒకే సమయపాలన పాటిస్తున్న విద్యా మందిర్‌లో పేరెంట్స్ వ్యతిరేకిస్తున్నా, ఆయన కుమార్తె కోసం పాఠశాల వేళలు మార్పించిన ఘనత ఈ కలెక్టర్‌దే. - నజీర్ అహ్మద్, డీసీసీ అధ్యక్షుడు ఆసక్తి ఉంటే రాజకీయాల్లోకి రావడం మంచిది పారిశ్రామికవేత్తలు జిల్లాకు రావాలంటే భయపడుతున్నారని కలెక్టర్ చెప్పడం దారుణం. ఆయన జిల్లా ప్రతిష్ఠను దెబ్బ తీశారు. అవమానపరిచారు. జిల్లా అంటే అందరికీ ప్రేమ, అభిమానం ఉంది. 2004 నుంచి 2009 వరకు పారిశ్రామికవేత్తలు కడప చుట్టూ తిరిగారు. ఇక్కడ ఎన్నో ఫ్యాక్టరీలు ఏర్పాటు కావాల్సి ఉంది. పాలకుల నిర్లక్ష్యం కారణంగా అవి ఏర్పాటు కాలేదు. ఆ మేరకు ప్రభుత్వం మౌలిక వసతులు, నీటి సౌకర్యం కల్పించలేదు. దానిని విస్మరించి.. ‘పారిశ్రామిక వేత్తలు భయపడుతున్నారు.. ఎలాంటి రాజకీయ వివక్ష లేదు’ అంటూ జిల్లా కలెక్టర్ రాజకీయ నాయకుడిలా మాట్లాడటం తగదు. ఆసక్తి ఉంటే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావడం మంచిది. ప్రభుత్వం ఆయన్ను వెనక్కి పిలిపించుకుని సమర్థుడైన కలెక్టర్‌ను పంపాలి. - ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు జిల్లా పరువు తీశారు పారిశ్రామికవేత్తలు జిల్లాకు రావడానికి భయపడుతున్నారని కలెక్టర్ వ్యాఖ్యానించి జిల్లా పరువు తీశారు. కలెక్టర్ స్థాయిలో ఉన్న అధికారి అలా వ్యాఖ్యానించడం మంచి పద్ధతి కాదు. కలెక్టర్ విషయంలో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమించడానికి సన్నద్దం కావాలి. ఆయన మాట వినని అధికారులకు వేధింపులు తప్పడం లేదు. జిల్లా వ్యాప్తంగా అనేక మంది అధికారులు కలెక్టర్ తీరుతో వేదనకు గురవుతున్నారు. జిల్లా ప్రజలకు జవాబుదారిగా ఉండాల్సిన ఆయన టీడీపీలోని కొందరికి మాత్రమే జవాబుదారిగా ఉంటున్నారు. - గూడూరు రవి, జెడ్పీ చైర్మన్ కలెక్టర్‌తో ప్రభుత్వం క్షమాపణ చెప్పించాలి జిల్లా వాసులు ఆవేశపరులని, పారిశ్రామికవేత్తలు ఇక్కడికి రావడానికి భయపడుతున్నారని కలెక్టర్ వ్యాఖ్యానించడం ఆశ్చర్యం కలిగించింది. ఆయన అంత మాటన్నా జిల్లా ప్రజలు శాంతి స్వభావులు కాబట్టే ఏమి పట్టించుకోలేదు. ఈ సంగతిని ఆయన గమనించాలి. బాధ్యతగల అధికారిగా ఆయన ఇలా అమర్యాదగా ప్రవర్తించడం తగదు. ఇదే సంఘటన తెలంగాణలో జరిగి ఉంటే కేసులు నమోదయ్యేవి. ఇక్కడి ప్రజలు స్నేహశీలురు కాబట్టి సరిపోయింది. రాయలసీమ పట్ల, జిల్లా పట్ల అనాదిగా వివక్ష కొనసాగుతోంది. కనీస పరిజ్ఞానం లేని అధికారికి ఐఏఎస్ గుర్తింపు ఇవ్వడమే సరైంది కాదు. పారిశ్రామిక ప్రగతి కోసం కనీస వసతులు కల్పించకుండా ‘పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు.. నమ్మకం లేక వెనుకంజ వేస్తున్నార’ని స్వయాన కలెక్టరే వ్యాఖ్యానించడం తీవ్ర అభ్యంతరకరం. కలెక్టర్ తీరు పద్ధతిగా లేదు. తక్షణమే ప్రభుత్వం ఆయనతో జిల్లా ప్రజలకు క్షమాపణలు చెప్పించాలి. - సీహెచ్ చంద్రశేఖర్‌రెడ్డి, రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షులు -
'పే స్కేలు పెంచకుంటే ఉద్యమమే'
గుంటూరు: నాగార్జున వర్సిటీలో అసిస్టెంట్ సీమాంధ్ర కాంట్రాక్టు లెక్చరర్ల భవిష్యత్తుపై శనివారం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఇందులో పలు యూనివర్సిటీల కాంట్రాక్టు లెక్చరర్లు పాల్గొన్నారు. ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌తో పాటు పే స్కేల్ పెంచాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఉద్యమం తీవ్రతరం చేస్తామని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. -
మందడంలో రౌండ్‌టేబుల్ సమావేశం రసాభాస
గుంటూరు : గుంటూరు జిల్లా తుళ్లురు మండలం మందడంలో శుక్రవారం రౌండ్‌టేబుల్ సమావేశం రసాభాసగా మారింది. జస్టిస్ లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతుండగా టీడీపీ నేత అనుమోలు హరి అడ్డుకున్నారు. దాంతో రైతులు ఎదురు తిరిగారు. ఈ సందర్భంగా టీడీపీ నేత వర్గీయులు, రైతుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దాంతో అక్కడ కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. -
'బడ్జెట్ పూర్... రాజధాని సింగపూర్'
హైదరాబాద్: ఏపీ రాజధాని కోసం జరుగుతున్న భూసేకరణపై ప్రజలు, రైతుల్లో పలు భయాలు నెలకొన్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం స్పష్టత ఇవ్వడంలేదని పలువురు వక్తలు ఆరోపించారు. రాజధాని విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జనచైతన్య వేదిక నిర్వహించిన ఏపీ రాజధాని-భూ సేకరణ అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. దీనికి పలు పార్టీల నేతలు, మేధావులు హాజరయ్యారు. రాజధాని కోసం జరుగుతున్న భూసేకరణ, ప్రభుత్వ వైఖరి గురించి తమ అభిప్రాయాలను వెల్లడించారు. రాజధాని వ్యవహారాన్ని ఏపీ ప్రభుత్వం సొంత వ్యవహారంలా చూస్తోందని విమర్శించారు. రాజధాని కోసం భూమి సేకరిస్తున్నారా లేదా సమీకరిస్తున్నారని ప్రశ్నించారు. 'బడ్జెట్ పూర్... రాజధాని సింగపూర్' అన్న తరహాలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఎద్దేవా చేశారు. -
సమైక్యంపై ఏకవాక్య తీర్మానం: అశోక్‌బాబు
అశోక్‌బాబు డిమాండ్ బిల్లు తిప్పి పంపినా విభజన ఆగకపోవచ్చు సాక్షి, విజయవాడ: శాసనసభలో సమైక్యమనే ఏకవాక్య తీర్మానం చేయాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు పి.అశోక్‌బాబు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ జర్నలిస్ట్‌ల ఫోరం ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడలో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 22వ తేదీన జరిగే చలో హైదరాబాద్ కార్యక్రమానికి ఇంటికొకరు తరలి రావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్‌కు వెళ్తే ఏం చేయాలనే అంశంపై 22వ తేదీ తర్వాత భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. అసెంబ్లీలో బిల్లును తిప్పి పంపినంత మాత్రాన విభజన ఆగకపోవచ్చన్నారు. చర్చకు అదనపు సమయం రాకపోతే ఏం చేయాలనే దానిపై దృష్టి పెట్టామన్నారు. కేంద్రం మొండివైఖరి వీడకపోతే రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ స్తంభింపజేస్తామని హెచ్చరించారు. ఎంపీ లగడపాటి రాజగోపాల్ మాట్లాడుతూ పార్లమెంట్ జరిగేలోపు ఒకసారి గ్రిడ్‌ను పనిచేయకుండా చేస్తే ఆ వేడి కేంద్రానికి తాకుతుందని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నగర అధికార ప్రతినిధి తాడి శకుంతల మాట్లాడుతూ, పార్టీలు భేదాభిప్రాయాలు పక్కన పెట్టి సమైక్యత కోసం నిలబడాల్సిన అవసరం ఉందన్నారు. ఉద్యోగసంఘాల నేతలు మాట్లాడుతూ, విద్యుత్ ఉద్యోగులు దక్షిణాది గ్రిడ్‌ను ఆపగలిగితే దాని ప్రభావం కేంద్రంపై పడుతుందని అభిప్రాయపడ్డారు. ఏపీజేఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్ రామాంజనేయులు పాల్గొన్నారు. -
APJF ఆధ్వర్యంలో రాజికీయ పార్టీలతో సదస్సు
-
‘భూ సంస్కరణ’లపై రౌండ్ టేబుల్ సమావేశం
కడప అగ్రికల్చర్, న్యూస్‌లైన్: కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన భూ సంస్కరణల జాతీయ ముసాయిదాను యథాతథంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. బుధవారం నగరంలోని సీఐటీయూ కార్యాలయంలో జాతీయ భూ సంస్కరణల ముసాయిదాపై నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న భూ సీలింగ్ చట్టాల అమలులో ఉన్న లోపాలను ఇప్పటికైనా అంగీకరించడం సంతోషదాయకమన్నారు. ప్రస్తుతమున్న చట్టాలను ఉపయోగించి బెంగాల్, కేరళ, జమ్మూకాశ్మీర్‌లలో పేదలకు భూ పంపిణీ, కౌలుదారులకు హక్కులు కల్పించడంలో చేసిన కృషి దేశమంతటా అదేవిధంగా అమలు జరగాలని, అందుకు కేంద్రప్రభుత్వం ముసాయిదాను పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టం తీసుకు రావాలని కోరుతున్నామన్నారు. కేంద్రం ప్రతిపాదించిన భూగరిష్ట పరిమితి 1973 చట్టంలో సవరణలు చేసి సానుకూల అంశాలను చేర్చాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటికే 11 రకాలుగా భూములను వర్గీకరించారని అన్నారు. దీని ప్రాతిపదిక మీద భూ సీలింగ్ పరిమితి అన్ని జిల్లాల్లో అమలు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి బి.నారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ యోగ్యమైన భూములను సాగు చేసుకోవడానికి ఏక్‌సాల్ పట్టాలు ఇవ్వాలని కోరారు. టీడీపీ నగర కార్యదర్శి బాలకృష్ణయాదవ్, బీసీ రాష్ట్ర మహాసభ అధ్యక్షుడు అవ్వారు మల్లికార్జున, దళిత ప్రజాపార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సంగటి మనోహర్, రాయలసీమ దళిత హక్కుల పోరాట సమితి కన్వీనర్ రమణ, బీఎస్పీ జిల్లా నాయకుడు కానుగదానం, సీహెచ్ఆర్డీ శివారెడ్డి, జిల్లా రైతు వ్యవసాయ కూలీ సంఘం కార్యదర్శి నాగరాజు, కుల వివక్ష పోరాట సమితి జిల్లా కార్యదర్శి మొండెం సుధీర్‌కుమార్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జకరయ్య తదితరులు మాట్లాడారు.