పాపన్న చరిత్రను గ్రామాల్లో ప్రచారం చేయాలి
-
తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరిగౌడ్
కాజీపేట: గోల్కొండ నవాబులను గడగడలాడించిన సర్ధార్ సర్వాయి పాపన్న చరిత్రను గ్రామస్థాయిలోకి తీసుకెళ్లి విస్తృతంగా ప్రచారం చేయాలని తెలంగాణ గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు బోనగాని యాదగిరిగౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం కాజీపేట గౌడ సంఘం కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ముఖ్య నాయకుల రౌండ్‌టేబుల్ సమావేశానికి జిల్లా గౌరవ అధ్యక్షుడు బైరి రవికృష్ణగౌడ్ అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో యాదగిరి మాట్లాడుతూ ఆగస్టు 1న ప్రారంభమై 10వ తేదీన ముగిసే పాపన్న చైతన్యయాత్రను విజ యవంతం చేయడానికి ప్రతి గ్రామం నుంచి భారీగా గౌడన్నలు తరలిరావాలని కోరారు. ఆగస్టు 18న పాపన్న జయంతి వేడుకలను రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పాపన్న చరిత్రను పాఠ్యంశాలల్లో చేర్చాలని, ట్యాంకు బండ్‌పై విగ్రహాన్ని అధికారికంగా ఆవిష్కరించడానికి అధికారులకు సీఎం కేసీఆర్ ఆదేశాలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో వండ్లకొండ వేణుగోపాల్, మారగోని భద్రయ్య, బైరి హరికృ ష్ణ, ఉడుగు శ్రీనివాస్, గడ్డం యాదగిరి, బొమ్మగాని వినోద్‌కుమార్, పిల్లల కుమారస్వామి, బండారి జనార్దన్, బూర శ్రీనివాస్, కె.అశోక్, గడ్డం రాజు, జి.శ్రీధర్ పాల్గొన్నారు.