ఎన్నికల అనంతరం యూపీలో మాదిరిగా రాష్ట్రంలో దాడులు
విధ్వంసం సృష్టిస్తున్న కూటమి నేతలు
పేద, బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా దాడులతో చెలరేగిపోతున్నారు
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులను ఖండించాలి
ఎన్నికల అనంతరం రాష్ట్రంలో మానవ హక్కుల హననంపై
ప్రజా సంఘాల ధ్వజం.. గుంటూరులో రౌండ్ టేబుల్ సమావేశం
ఐదుగురు సభ్యులతో ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితి ఏర్పాటు
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): సార్వత్రిక ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత రాష్ట్రంలో హింసాకాండ చెలరేగిపోయిందని, ముఖ్యంగా పేద, బడుగు, బలహీన వర్గాలే లక్ష్యంగా కూటమి నేతలు దాడులతో చెలరేగిపోతున్నారని ప్రజాసంఘాల నాయకులు ధ్వజమెత్తారు. ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెలువడకముందు నుంచే కూటమి కార్యకర్తలు రాష్ట్రంలో విధ్వంసం ప్రారంభించారని, ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడులను ఖండించాలని చెప్పారు.
ఎన్నికల అనంతరం ఏపీలో జరుగుతున్న మానవ హక్కుల హననంపై ప్రజా సంఘాల సమాలోచన సదస్సు (రౌండ్‌టేబుల్ సమావేశం) సోమవారం గుంటూరు బ్రాడీపేటలోని సీపీఎం కార్యాలయంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ బైరి నరేష్, ప్రముఖ అంబేడ్కరిస్ట్, గాయకుడు రెంజర్ల రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
వీరంతా రాష్ట్రంలో జరుగుతున్న దాడులపై గళమెత్తారు. మానవ హక్కులను కాపాడేందుకు, రాష్ట్రంలో ప్రజా సంఘాలన్నీ కలిసి కూటమిగా ఏర్పడి పోరాటం చేసేందుకు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేశారు. దీనికి ఎన్నికల హింస వ్యతిరేక పోరాట సమితిగా నామకరణం చేశారు. అందరూ ఐక్యతతో, ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి, ఎన్నికల హింసను, పేద, బడుగు, బలహీన వర్గాలపై దాడులను అరికట్టాలని నిర్ణయించారు.
ఈ సందర్భంగా సదస్సుల్లో పాల్గొన్న వారి అభిప్రాయాలు వారి మాటల్లోనే..
ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోంది
ఏపీలో ఎన్నికల తరువాత జరుగుతున్న దాడులు చూస్తుంటే ప్రజాస్వామ్యం ఖూనీ అయిందనే చెప్పుకోవచ్చు. నాయకులను ప్రజల చేత ఎన్నుకునే విధంగా రాజ్యాంగం రూపొందింది. నేడు ఆ రాజ్యాంగానికి తూట్లు పొడిచేలా ప్రజలపై దాడులు జరుగుతున్నాయి. దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉంది. సోషల్ మీడియాను సమర్ధవంతంగా మలుచుకుని పోరాటాలు చేయడంలో అందరూ కలిసికట్టుగా ముందుకు రావాల్సిన సమయం ఆసన్నమైంది. నిరంతరం ఐక్యతతో ముందుకు సాగితేనే ఇలాంటి దాడులను ఆపగలం. – బైరి నరేష్, సామాజిక కార్యకర్త, మూఢ నమ్మకాల నిర్మూలన సంఘం జాతీయ అధ్యక్షుడు
యూపీ తరహా అరాచకాలకు ముఖ చిత్రంగా ఏపీ
యూపీ తరహా అరాచకాలకు ఏపీ ముఖచిత్రంగా మారుతోంది. రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. జేసీబీలతో ఇళ్లను కూలి్చవేయడం చూస్తుంటే యూపీలో పాలనే ఏపీలో కొనసాగుతుందేమో అనిపిస్తుంది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు హేయమైన చర్య. వీటిన్నింటినీ అడ్డుకునేందుకు ప్రజా సంఘాలన్నీ ఏకతాటిపైకి రావాలి. ఈ దాడులను వ్యతిరేకిస్తూ త్వరలో ప్రజాసంఘాలన్నింటితో కలిసి విస్తృత పోరాటం చేస్తాం. – రెంజర్ల రాజేష్, అంబేడ్కరిస్ట్, గాయకుడు
కూటమి పాలన ఎలా ఉండబోతోందో అర్థమవుతుంది
ఎన్నికల్లో కూటమి గెలిచిన తరువాత సీఎంగా చంద్రబాబునాయుడు ప్రమాణ స్వీకారం చేయకముందే రాష్ట్రంలో చెలరేగిన అల్లర్లు చూస్తుంటే...కూటమి పాలన ఐదేళ్లలో ఏ విధంగా ఉంటుందో స్పష్టంగా అర్ధమవుతోంది. ప్రజాసంఘాలన్నీ ఈ దాడులను అరికట్టేందుకు సరైన నిర్ణయంతో ముందుకు సాగాలి. – చిలుక చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
అధికారంలో ఉన్న పార్టీకి కొమ్ము కాస్తున్న అధికారులు
ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీకి అధికారులు కొమ్ము కాయడం బాధాకరం. ఎన్నికల ముందు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలను మారిస్తే వారు జిల్లాల్లో ఎటువంటి అల్లర్లు జరగకుండా ప్రత్యేక బృందాలను తీసుకువచ్చామని చెప్పినప్పటికి, ఎన్నికలైన తరువాత దాడులు జరగడం బాధాకరం. దాదాపు 30 గ్రామాల్లో మాదిగ పల్లెలను టార్గెట్ చేస్తూ కూటమి కార్యకర్తలు దాడులకు తెగబడ్డారు. ప్రజలకు రక్షణ కలి్పంచాల్సిన అధికారులు పక్షపాతంతో వ్యవహరించడం సిగ్గుచేటు. – కె.కృçష్ణ, కుల నిర్మూలన పోరాట సమితి ప్రధాన కార్యదర్శి
చట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన తరువాత చట్టబద్ధమైన పాలన లేకుండా పోయింది. ముఖ్యంగా పల్నాడులో వ్యాపారాలను స్వచ్ఛందంగా టీడీపీ నేతలకు అప్పగించాల్సిన పరిస్థితి. ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ నేతలకు తల వంచాల్సిన పరిస్థితులు చూస్తున్నాం. ముఖ్యంగా కుల ఆధిపత్యం చెలరేగిపోతోంది. ఈ దుష్పరిణామాలపై ప్రజా సంఘాలన్ని సంఘటితంగా పోరాడాల్సిన సమయం ఆసన్నమైంది. – కోలా నవజ్యోతి, భారత్ బచావో గుంటూరు, కృష్ణా జిల్లాల ఆర్గనైజింగ్ సెక్రటరీ
అన్యాయంగా కేసులు పెడుతున్నారు
రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచి్చన వెంటనే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. అన్యాయంగా వారిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ అక్రమ కేసులను ఖండించాలి. బాధితుల పక్షాన ప్రజా సంఘాలన్నీ నిలబడి వారిలో మనోధైర్యాన్ని నింపాలి. – జయసుధ, వీసీకే పార్టీ నాయకురాలు
ఐక్యతతో ముందుకు సాగాలి
రాష్ట్రంలో దాడులను ఐక్యతతో ఎదుర్కోవాలి. బా«ధితులకు అండగా ఉండాలి. వారి పక్షాన పోరాటం చేయాలి. భవిష్యత్తులో ఇలాంటి దాడులు జరగకుండా ప్రజా సంఘాలన్నీ ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి. – బాలరాజు, అంబేడ్కరిస్ట్, నెల్లూరు
రాష్ట్రంలో విధ్వంసం సృష్టించారు
కూటమి సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేయక ముందు నుంచే ఆ పార్టీల కార్యకర్తలు విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులు సమంజసం కాదు. ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ గళం విప్పి కూటమి అరాచకాలను ఎండగట్టాలి. – భాను, జర్నలిస్ట్
కలిసికట్టుగా ఒక తాటిపైకి రావాలి
రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా దళితులు, బహుజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. మాల, మాదిగలపై దాడులు పెరిగిపోయాయి. వీటిన్నింటిని అరికట్టాలంటే కలిసి కట్టుగా పోరాటం చేయాలి. దాడి చేయాలంటేనే భయపడే పరిస్థితులు రావాలి. – వాసిమళ్ల విజయ్, క్రిస్టియన్ యూత్ ప్రెసిడెంట్
ఈవీఎంలు బ్యాన్ చేయాలి
ఈవీఎంలు బ్యాన్ చేయాలని కొన్ని సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నాం. వాటిని బ్యాన్ చేస్తేనే ఎన్నికలు ప్రజాస్వామ్యబద్దంగా జరుగుతాయి. ప్రజా సమస్యల మీద పోరాడే వారిపై దాడులు పరిపాటిగా మారాయి. గెలిచిన వారు ప్రజా రంజక పాలన అందించాలే గానీ, వ్యక్తిగత రాజకీయాలు చేయకూడదు. – పొందుగల చైతన్య, హైకోర్టు న్యాయవాది
రాష్ట్రంలో యథేచ్ఛగా మానవ హక్కుల ఉల్లంఘన
77 సంవత్సరాల స్వాతంత్య్రం అనంతరం కూడా రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన యథేచ్ఛగా జరగడం గర్హనీయం. రాష్ట్రంలో మనిíÙని మనిషిగా గౌరవించలేని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వాలు మనుషుల మధ్య జరుగతున్న హింసను అరికట్టాలి. బాధితుల తరపున హైకోర్టులో పోరాడటానికి మేం సిద్ధం. – వేముల ప్రసాద్, హైకోర్టు అడ్వొకేట్
ప్రతి ఎన్నికల్లో దళిత పల్లెల్లో రక్తం పారుతోంది
ఎన్నికలు ఎప్పుడు జరిగినా దళిత పల్లెలే దాడులకు గురవుతున్నాయి. దాడుల్లో దళితుల రక్తం ఏరులై పారుతోంది. ఏపీలో కూటమి నేతలు దళిత పల్లెల్లో విధ్వంసం సృష్టిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఇటువంటి దాడులు పునరావృతం కాకుండా గట్టిగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. – బూరం అభినవ్, కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ
Comments
Please login to add a commentAdd a comment