హన్మకొండ జిల్లా వద్దే వద్దు...
Published Mon, Sep 5 2016 12:20 AM | Last Updated on Mon, Sep 4 2017 12:18 PM
విద్యారణ్యపురి : రాష్ట్రంలో కొత్త జిల్లా లు, డివిజన్ల ఏర్పాటు శాస్త్రీయంగా జరగడం లేదని పూలే ఆశయ సాధన సమితి(పాస్) వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ సంగాని మల్లేశ్వర్ అన్నారు. కేయూ దూర విద్యా కేంద్రంలోని జాఫర్ నిజాం సెమినార్ హాల్‌లో ఆదివారం ‘పాస్’ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మల్లేశ్వర్ మాట్లాడుతూ హన్మకొండ జిల్లా ఏర్పాటును ఎవరూ కోరకున్నా ప్రభుత్వం నిర్ణయించడం గర్హనీయమన్నారు. తొలుత మూడు జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని ప్రకటించి తీరా ముసాయిదా విడుదల సందర్భంగా హన్మకొండ జిల్లాను ఎవరి ప్రయోజనా ల కోసం తెరపైకి తెచ్చారో చెప్పాలన్నా రు. చారిత్రక ఓరుగల్లును విభజించే ఆలోచన, హన్మకొండ జిల్లా ఏర్పాటు యోచన విరమించుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో పాస్ బాధ్యులు డాక్టర్ వి.రాంచంద్రం, డాక్టర్ వడ్ల వీరాచారి, డాక్టర్ నల్లాని శ్రీనివాస్, శ్రీధర్, ఈశ్వర్‌కుమార్, నల్లపు శ్రీధర్, డాక్టర్ చింతం ప్రవీణ్‌కుమార్, దాడబోయిన శ్రీకాంత్, డాక్టర్ మంద వీరస్వామి, వి.సుధాకర్, ఎన్.రాజేందర్, తిరుపతి, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement