దేశ చరిత్రలోనే ‘గృహ’త్తర అధ్యాయం | Intellectuals and civil society leaders Jagananna Houses For Poor | Sakshi
Sakshi News home page

దేశ చరిత్రలోనే ‘గృహ’త్తర అధ్యాయం

Published Fri, Nov 18 2022 4:56 AM | Last Updated on Fri, Nov 18 2022 7:45 AM

Intellectuals and civil society leaders Jagananna Houses For Poor - Sakshi

గుంటూరులో పేదల ఇళ్లు – రాజకీయ సవాళ్లపై రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో మాట్లాడుతున్న వక్తలు

పాత గుంటూరు: గతంలో ఇంటి స్థలం కావాలంటే రోజుల తరబడి పోరాడాల్సి వచ్చేదని, సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మేధావులు, ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ‘పేదల ఇళ్లు – రాజకీయ సవాళ్లు’ అంశంపై మేధావులు, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని ఎన్జీవో హాల్‌లో రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు జి.శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదల ఇళ్లపై రాజకీయం చేస్తున్న పలు పార్టీల వైఖరిని ఎండగట్టారు. 

విపక్షాల రాద్ధాంతం తగదు 
సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తుండటం గొప్ప విషయం. విపక్షాలు విజ్ఞత కోల్పోయి 
విమర్శలు చేయడం తగదు.  
 – ఆచార్య డీఏఆర్‌ సుబ్రహ్మణ్యం, మహాత్మా గాంధీ కళాశాల వ్యవస్థాపకుడు

బాబు, పవన్‌ రాజకీయాలకు తగరు 
రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బాబా సాహెబ్‌ అంబేడ్కర్‌ ఆలోచనా విధానాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు. నా దృష్టిలో చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ రాజకీయ నేతలే కారు. ప్రజల బాధలు పట్టనోళ్లు రాజకీయాలకు తగరు.
 – ఆచార్య గురవయ్య, ఏసీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్‌

ఇది స్వర్ణయుగం 
గుప్తుల స్వర్ణ యుగం గురించి మనం పుస్తకాలలో చదువుకున్నాం. ఇప్పుడు సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో దానిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందరికీ ఇళ్లు ఇవ్వడం అనేది అతిపెద్ద యజ్ఞం. 
– చక్రపాణి, విశ్రాంత ఎస్పీ

పేదల ఇళ్లు – పవర్‌స్టార్‌ కన్నీళ్లు
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ఇళ్లను మహిళల పేరిట రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వడం మహిళా సాధికారతకు నిదర్శనం. పేదల ఇళ్లు–పవర్‌ స్టార్‌ కన్నీళ్లు అనే నినాదంతో మహిళలంతా ఉద్యమిస్తే కానీ వాళ్లకు బుద్ధి రాదు.
– మంజుల, సీనియర్‌ న్యాయవాది, సామాజిక కార్యకర్త

సీఎం నిజమైన ప్రజా పాలకుడు 
ఏకంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్‌ జగన్‌ శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. జగనే నిజమైన ప్రజా పరిపాలకుడు.
– గోళ్లమూడి రాజసుందరబాబు, ఐద్వా వ్యవస్థాపకులు

రాజకీయాలకు అతీతంగా హర్షిద్దాం 
గతంలో ఇళ్ల స్థలాలు కావాలంటే రోజుల తరబడి ఆందోళన చేయాల్సి వచ్చేది. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాక పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇది అందరూ హర్షించదగ్గ అంశం. 
– జి.శ్రీనివాస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు

గొప్ప విషయం 
ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమి సేకరించింది. నిరుపేదల ఇళ్ల కోసం మొత్తం 25 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది వాస్తవం.      
– పరిశపోగు శ్రీనివాసరావు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు

పవన్‌ ఆందోళన హాస్యాస్పదం 
జగనన్న ఇళ్లపై పవన్‌ కళ్యాణ్‌ ఆందోళన హాస్యాస్పదం. జగనన్న ఇళ్లు – జనసేనాని కన్నీళ్లు అని కార్యక్రమం పేరు మార్చితే బాగుంటుంది.  
– భగవాన్‌ దాస్, రాష్ట్ర విద్యార్థి ఉద్యమ నేత 

గూడు చెదరగొట్టే కుట్ర 
అంబేడ్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పేదలకు ముఖ్యమంత్రి జగన్‌ కల్పిస్తున్న గూడు చెదర గొట్టేందుకు రాష్ట్రంలో ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది.  
– తిప్పాబత్తుని గోవింద్, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు

ఇది సరికొత్త చరిత్ర 
తాడి తన్నేవాడి తల తన్నేవాడే జగన్‌. చంద్రబాబు, పవన్‌ కళ్యాణ్‌ ఎన్ని ఎత్తులు వేసినా.. వాటికి పైఎత్తు వేసి చిత్తు చేయగల సమర్థుడు. ఇళ్ల నిర్మాణం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు.
– వేముల భారతి, అస్మిత మహిళా మండలి అధ్యక్షురాలు

పవన్‌కొచ్చిన నొప్పేంటి?
సొంత ఇంటి కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డాం. సీఎం జగన్‌ పుణ్యాన ఇప్పుడు సొంతింటిలో దర్జాగా ఉంటున్నాం. మాలాంటోళ్లకు జగనన్న ఇళ్లు ఇస్తే మీకొచ్చిన నొప్పేమిటి?  
– రత్నకుమారి, ఇంటి లబ్ధిదారురాలు 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement