houses for poor people
-
ఇళ్లు.. ఇవ్వాల్సిందే: హైకోర్టు
సాక్షి, అమరావతి: పేదలకు ఓ గూడు కల్పించాలన్న సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ సంక్షేమ పథకం అమలు కావాల్సిందేనని హైకోర్టు తేల్చి చెప్పింది. స్వార్థ, నిగూఢ ప్రయోజనాలు, ఇతర కారణాలతో ఈ పథకం అమలు కాకుండా నిరోధించడం, అడ్డుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. సంక్షేమ రాజ్యంలో భాగంగా నిజమైన పేద లబ్ధిదారులను గుర్తించి గృహ వసతి కల్పించాల్సిన రాజ్యాంగ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని తెలిపింది. తద్వారా రాజ్యాంగం పేదలకు కల్పించిన హక్కులను పరిరక్షించినట్లవుతుందని పేర్కొంది. ఒకసారి పరిహారం చెల్లించి భూమిని సేకరించిన తరువాత ఆ భూమిపై రాష్ట్ర ప్రభుత్వానికే సంపూర్ణ హక్కులుంటాయంది. పరిహారం అందుకున్న వారు ఆ భూమిపై ఎలాంటి యాజమాన్య హక్కులను, ప్రయోజనాలను కోరలేరని పేర్కొంది. పరిహారం చెల్లించి సేకరించిన భూమిని ఏ ప్రజా ప్రయోజనం కోసమైనా వినియోగించవచ్చని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం తీసుకున్న విధానపరమైన నిర్ణయం రాజ్యాంగ విరుద్ధంగా, చట్ట విరుద్ధంగా ఉన్నప్పుడు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నప్పుడు, అధికార పరిధిని దాటి తీసుకున్న నిర్ణయమైనప్పుడు, విస్తృత ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్నప్పుడు మాత్రమే న్యాయ సమీక్షకు ఆస్కారం ఉంటుందని స్పష్టం చేసింది. కర్నూలు జిల్లా బనగానపల్లె మండలం భానుముక్కాల, బాతులూరుపాడు, యనకండ్ల, బనగానపల్లె గ్రామాల పరిధిలో 130.86 ఎకరాల భూమిని నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని హైకోర్టు సమర్థించింది. భూ పంపిణీ విషయంలో అధికారులు జారీ చేసిన ప్రొసీడింగ్స్ అన్నీ సక్రమమేనని ప్రకటించింది. శ్రీశైలం కుడి కాలువ (ఎస్ఆర్బీసీ) రక్షణ నిమిత్తం మిగిలిన భూమికి ఫెన్సింగ్ వేసి అక్రమణల నుంచి, అక్రమ సాగు నుంచి పరిరక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాలువ నిర్వహణ, భద్రత, మరమ్మతుల కోసం తక్షణమే అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని సూచించింది. ఇళ్ల స్థలాల కోసం పంపిణీ చేయదలచిన స్థలాల్లో నిర్మించే ఇళ్లను నిబంధనలకు అనుగుణంగా పటిష్టంగా నిర్మించాలని ఆదేశించింది. ఎస్ఆర్బీసీ కాలువ సమీపంలో ఉన్న భూములను నవరత్నాల కింద ఇళ్ల పట్టాల నిమిత్తం సేకరించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను పరిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ గురువారం 89 పేజీల కీలక తీర్పు వెలువరించారు. ఆ భూమిని ఇళ్ల స్థలాలకు కేటాయించడం సరికాదు.. కర్నూలు జిల్లాలో పలు సర్వే నెంబర్లలో 130.86 ఎకరాల భూమిని ఇళ్ల పథకం కింద అర్హులైన పేదలకు పంపిణీ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరఫున న్యాయవాది కె.రతంగపాణిరెడ్డి, రాష్ట్ర ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఎస్ఆర్బీసీ చుట్టు పక్కల ఇళ్ల నిర్మాణం వల్ల ప్రజల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని పిటిషనర్ల తరపు న్యాయవాది వాదించారు. నీటిపారుదల కోసం ఉద్దేశించిన భూముల్లో ఇళ్ల నిర్మాణం వల్ల భవిష్యత్తులో వరదలు సంభవిస్తే పెద్ద సంఖ్యలో ప్రజల ప్రాణాలు ప్రశ్నార్థకంగా మారుతాయన్నారు. కాలువ భవిష్యత్ అవసరాల కోసం కేటాయించిన భూమిని నిరుపయోగంగా ఉందన్న కారణంతో తీసుకోవడం సరికాదన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను రద్దు చేయాలని కోర్టును కోరారు. అన్యాక్రాంతం చేసేందుకే ఆ వ్యాజ్యాలు.. అయితే ఈ వాదనలను అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తోసిపుచ్చారు. పిటిషనర్లు సదరు భూములను ఆక్రమించుకుని అక్రమంగా సాగు చేస్తున్నారని, అందుకే ఈ వ్యాజ్యాలు దాఖలు చేశారన్నారు. కాలువ, బఫర్ జోన్‌లోని భూమి జోలికి వెళ్లలేదని తెలిపారు. 130 ఎకరాలను తీసుకోవడం వల్ల ఎస్ఆర్బీసీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పిటిషనర్లు సాంకేతిక పరిజ్ఞానం లేకుండా కేవలం ఆందోళనతోనే వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. ఆ భూములు నివాసయోగ్యమైనవేనని అధికారులు నివేదిక ఇచ్చిన తరువాతనే ఇళ్ల స్థలాల కోసం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు నివేదించారు. ఆ భూములు జీవో 510 పరిధిలోకి రావని తెలిపారు. ఇప్పటికే ఆ భూముల్లో లేఔట్లు సిద్ధం చేశారని, అంతర్గత రోడ్లు కూడా వేశారని, హద్దు రాళ్లు నాటడం పూర్తయిందని సుధాకర్‌రెడ్డి కోర్టు దృష్టికి తెచ్చారు. కాలువకు ఇరువైపులా 30 మీటర్ల బఫర్ జోన్‌ను నిర్వహిస్తున్నామన్నారు. ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసేందుకే ఈ పిటిషన్లు దాఖలు చేశారని తెలిపారు. ఈ వ్యాజ్యాలకు విచారణార్హతే లేదన్నారు. ఎస్ఆర్బీసీ రక్షణకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది... ‘ఏ ప్రయోజనం కోసం గతంలో భూములను తీసుకున్నారో అందుకోసం ఉపయోగించనందున అలాంటి భూములను వెనక్కి తీసుకుని పేదలకు ఇళ్ల స్థలాల కింద పంపిణీ చేయాలన్నది ప్రభుత్వ విధానపరమైన నిర్ణయం. ఎస్ఆర్బీసీ రక్షణకు ప్రభుత్వం తగిన భద్రతా చర్యలు తీసుకుంది. నిబంధనలు నిర్దేశించిన దూరాన్ని పాటించారు. ఎస్ఆర్బీసీ నిర్మించిన నాటి నుంచి ఇప్పటి వరకు గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్‌కు 800 నుంచి 1,000 క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలైంది. అది కూడా ఆగస్టు – మార్చి నెలల మధ్యలోనే. మిగిలిన సమయంలో కాలువలో ఎలాంటి నీరు ఉండదు. మిగిలిన సమయంలో కాలువను తనిఖీ చేసి ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టానికి తావు లేకుండా మరమ్మతులు నిర్వహిస్తున్నారు. వాస్తవానికి ఈ వ్యాజ్యాల్లో పిటిషనర్లు పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ప్రభుత్వ విధాన నిర్ణయాన్ని సవాలు చేయలేదు. స్వార్థ, నిగూఢ ప్రయోజనాల కోసం, ఇతర ఏ కారణాలతోనూ సంక్షేమ పథకాలు అమలు కాకుండా నిరోధించడం, ఆటంకపరిచేందుకు వీల్లేదు’ అని జస్టిస్ కృష్ణమోహన్ తన 89 పేజీల తీర్పులో పేర్కొన్నారు. -
చరిత్ర ఎరుగని సాహసం..
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం ద్వారా దేశ చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా, ఎవరూ సాహసించని రీతిలో అక్కచెల్లెమ్మలకు ఏకంగా 31.19 లక్షల ఇళ్ల స్థలాలు ఇవ్వగలిగామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఇంటి స్థలం, ఇల్లు రూపంలో ప్రతి నిరుపేద అక్కచెల్లెమ్మకు రూ.20 లక్షల వరకు విలువైన ఆస్తిని ఇవ్వగలిగే గొప్ప అవకాశాన్ని దేవుడు తనకు ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకం కింద 4,07,323 మంది లబ్ధిదారులకు బ్యాంకు రుణాలపై వడ్డీని రీయింబర్స్ చేస్తూ రూ.46.90 కోట్ల మొత్తాన్ని సీఎం జగన్ బటన్ నొక్కి నేరుగా వారి ఖాతాల్లో జమ చేశారు. గురువారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో లబ్ధిదారులను ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. అక్కచెల్లెమ్మలకు మంచి చేస్తూ.. దేవుడి దయతో ఈ రోజు మరో మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. నవరత్నాలు –పేదలందరికీ ఇళ్లు పథకం లబ్ధిదారులైన 12,77,373 మంది అక్కచెల్లెమ్మలకు ఒక్కొక్కరికి రూ.35 వేలు చొప్పున పావలా వడ్డీకే రుణాలిప్పించాం. వాటికి సంబంధించి తొలి దఫాలో 4,07,323 మందికి పావలా వడ్డీ కింద ఇవాళ సుమారు రూ.47 కోట్లు జమ చేస్తున్నాం. ప్రతి ఆర్నెళ్లకు ఒకసారి ఈ కార్యక్రమం చేపడతాం. గతంలో సున్నా వడ్డీ డబ్బులు అక్కచెల్లెమ్మలకు విడుదల చేసినప్పుడు 5,43,140 మందికి దాదాపు రూ.54 కోట్లు విడుదల చేశాం. ప్రతి అక్కచెల్లెమ్మకు మంచి చేస్తూ పావలా వడ్డీకే రూ.35 వేలు రుణం అందించడం ద్వారా ఇళ్ల నిర్మాణం పురోగతిని వేగవంతం చేస్తున్నాం. బ్యాంకుల దగ్గర నుంచి పొందిన రుణాలను 9 నుంచి 11 శాతం వరకు వడ్డీతో తిరిగి చెల్లించే కార్యక్రమం అక్కచెల్లెమ్మలు సక్రమంగా చేయాలి. అది వారి బాధ్యత. అలా అక్కచెల్లెమ్మలు కట్టిన వడ్డీ సొమ్మును తిరిగి వారికి అందించే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఈ క్రమంలో అక్కచెల్లెమ్మలకు నికరంగా రూ.35 వేలపై పావలా వడ్డీ మాత్రమే పడుతుంది. విలువైన స్థిరాస్తి.. రాష్ట్రంలో ఇప్పటికే 22.25 లక్షల ఇళ్ల నిర్మాణం జరుగుతోంది. రాష్ట్ర చరిత్రలో ఇది ఎక్కడా, ఎప్పుడూ చూడని విధంగా చేపడుతున్నాం. ఒక్కో ఇంటి నిర్మాణానికి దాదాపు రూ.2.70 లక్షలు ఖర్చవుతుంది. మరో రూ.లక్ష మౌలిక సదుపాయాల కోసం అదనంగా ఖర్చవుతుంది. ఇంటి నిర్మాణం, మౌలిక వసతుల కోసం దాదాపు రూ.3.70 లక్షలు ఖర్చు అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో రూ.1.80 లక్షలు నేరుగా అక్కచెల్లెమ్మలకు ఇస్తున్నాం. మరో రూ.35 వేలు పావలా వడ్డీకి రుణాలను అందుబాటులోకి తెచ్చాం. దాదాపు రూ.15 వేలు ఖరీదు చేసే ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తున్నాం. సిమెంట్, మెటల్ ఫ్రేమ్స్ లాంటి వివిధ రకాల నాణ్యమైన వస్తువులను మార్కెట్ ధర కన్నా తక్కువకు సబ్సిడీపై అందించడం ద్వారా రూ.40 వేల దాకా ప్రయోజనం చేకూరుస్తున్నాం. మనం ఇచ్చిన ఇంటి స్థలం మార్కెట్ విలువ ప్రాంతాన్ని బట్టి కొన్ని జిల్లాల్లో రూ.15 లక్షల పైచిలుకు ఉంది. ఈ విలువ మీద ఇళ్లు, మౌలిక సదుపాయాల విలువలను కలిపితే ప్రతి అక్కచెల్లెమ్మకు రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ ఆస్తిని తోబుట్టువుగా సమకూరుస్తున్నాం. ► కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, ఏపీ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ షర్మిలారెడ్డి, సీఎస్ డాక్టర్ జవహర్‌రెడ్డి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, ప్రత్యేక కార్యదర్శి బి.ఎండీ.దీవాన్ మైదిన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ లక్ష్మీ షా, సెర్ప్ సీఈవో ఏఎండీ ఇంతియాజ్, మెప్మా ఎండీ వి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. కోటిమంది.. జయహో జగనన్నా పిల్లాపాపలతో కలిపి సుమారు కోటిమంది అక్కచెల్లెమ్మలకు శాశ్వత చిరునామా కల్పిస్తున్న గొప్ప యజ్ఞం జగనన్న ఇళ్ల నిర్మాణం. ఒక గ్రామం ఏర్పడాలంటే సుమారు 50 నుంచి 100 సంవత్సరాలు పడుతుంది. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రెండున్నర ఏళ్లలో 17 వేల జగనన్న కాలనీల రూపంలో కొత్త ఊళ్లను నిర్మించడం ఇదే ప్రథమం. ఇది దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. సీఎం జగన్‌కు మినహా మరెవరికీ ఇది సాధ్యం కాదు. ప్రభుత్వం 31 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఇళ్ల స్థలాలు ఇచ్చి 22 లక్షల గృహ నిర్మాణాలు చేపట్టగా ఇప్పటికే 9 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తై నిరుపేద మహిళలు పిల్లాపాపలతో సంతోషంగా జీవిస్తున్నారు. కోటిమంది జయహో జగనన్నా అని నినదిస్తున్నారు. పేదలకు పక్కా గూడు కల్పించే ఈ మహా యజ్ఞం ఎంత మంది మారీచులు అడ్డుపడినా ఆగదు. – జోగి రమేష్, గృహ నిర్మాణ శాఖా మంత్రి ఓ ఆడబిడ్డకు ఇంకేం కావాలి? ఎన్నో ఏళ్లుగా అద్దె ఇంట్లో ఉంటున్నాం. గత ప్రభుత్వ హయాంలో ఇంటి కోసం తిరిగి తిరిగి అలిసిపోయా. ఈ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ ద్వారా సచివాలయంలో దరఖాస్తు చేసుకోగానే స్థలం మంజూరైంది. వెంటనే పట్టా ఇచ్చారు. విశాఖలో అడుగు భూమి లేని నాకు ఈ రోజు రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన స్ధలాన్ని, ఇంటిని కూడా అందించారు. ఇదంతా నమ్మలేకపోతున్నా. మాకిచ్చిన స్థలంలో ఇంటి నిర్మాణానికి ఎన్నో విధాలుగా అండగా నిలిచారు. బ్యాంకు ద్వారా పొందిన రుణానికి వడ్డీ కూడా మీరే కడుతున్నారు. కాలనీలో రోడ్లు, కరెంట్, నీళ్లు అన్నీ ఇచ్చారు. ఒక ఆడపిల్లకు అన్నగా మీరు (సీఎం జగన్) చేయాల్సిందంతా చేశారు. ఇంతకంటే ఏం కావాలి? మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. నేను పొదుపు సంఘం ద్వారా లబ్ధి పొందా. కరోనా సమయంలో ఎంతో ఆందుకున్నారు. మళ్లీ మీరే మాకు సీఎంగా రావాలి. – హైమావతి, లబ్ధిదారు, విశాఖపట్నం ద్వారకను తలపించేలా కాలనీలు మేం తమిళనాడు నుంచి ఇక్కడ స్థిరపడ్డాం. గుంటూరు జిల్లా పేరేచర్ల జగనన్న కాలనీలో నాకు ప్రభుత్వం ఇచ్చిన ఇంటి స్థలం విలువ రూ.10 లక్షలు ఉంటుంది. దానికి తోడు ఇల్లు కట్టుకోవడానికి కూడా సాయం చేశారు. ఎన్ని జన్మలెత్తినా మీ (సీఎం జగన్) రుణం తీర్చుకోలేం. కాలనీలో కరెంటు, రోడ్లు, వాటర్ అన్ని సౌకర్యాలున్నాయి. ఒక్క రూపాయి లంచం ఇవ్వకుండా, ఏ కార్యాలయం చుట్టూ తిరగకుండా ఇచ్చారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం ఇచ్చిన ఇంట్లోనే ఉంటున్నా. మా కాలనీలో లైటింగ్, ఆర్చ్ గేట్ కట్టారు. లైటింగ్ చూడటానికి రెండు కళ్లు సరిపోలేదు. అప్పట్లో శ్రీకృష్ణుడు ద్వారక కట్టిస్తే అన్ని కులాలు కలిసి బతికేవారట. ఇప్పుడు జగనన్న కాలనీలు కూడా ద్వారక లాంటివే. తల్లిదండ్రులు జన్మనిస్తే మీరు మాకు జీవితమిచ్చారు. మీలాంటి సీఎంను గతంలో ఎన్నడూ చూడలేదు. మా పిల్లలను స్కూల్‌కు పంపితే అన్నీ ఇస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తున్నానని గర్వంగా చెబుతున్నా. మా ఇంట్లో రేషన్ బియ్యం తింటాం. రేషన్ బండి ఇంటి ముందుకే వస్తోంది. ఏ ప్రయాస లేకుండా సరుకులు తీసుకుంటున్నాం. మిమ్మల్ని మళ్లీ గెలిపించుకుంటాం జగనన్నా. – పగడాల స్వర్ణ సింధూర, లబ్ధిదారు, గుంటూరు మీ సంకల్పం గట్టిది పదేళ్లు అద్దె ఇంట్లో ఉన్నాం. కిరాయి కట్టలేక చాలా ఇబ్బందులు పడ్డాం. మీరు తెచ్చిన సచివాలయాల వ్యవస్థతో రూపాయి ఖర్చు పెట్టకుండా ఇంటి స్థలం ఇచ్చారు. సొంతిల్లు కట్టుకునేందుకు రూ.35 వేలు బ్యాంకు రుణం అందించారు. ఆ వడ్డీ భారం మాపై పడకుండా మీరు తీసుకున్న నిర్ణయానికి హ్యాట్సాఫ్. నా ఇంటి స్థలం ఇప్పుడు రూ. 5 లక్షలు ఉంది. భవిష్యత్‌లో రూ.10 లక్షలు కూడా కావచ్చు. ఈ ప్రభుత్వంలో నాకు రేషన్ కార్డు కూడా మంజూరైంది. ఏ పథకం కావాలన్నా సులభంగా అందుతోంది. మా పాపకు అమ్మ ఒడి వస్తోంది. మా అత్తయ్య చేయూత డబ్బులతో చీరల వ్యాపారం చేస్తోంది. మామకు వృద్ధాప్య పింఛన్ ఇంటి వద్దకే తెచ్చి ఇస్తున్నారు. గతంలో పింఛన్ కోసం ఎంతో ప్రయాసలు పడ్డాం. పేద మహిళ లక్షాధికారి కావాలన్న మీ (సీఎం జగన్) సంకల్పం గొప్పది. మీ ద్వారా నా కుటుంబం రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు లబ్ధి పొందింది. – వహిదా ఖానం, లబ్ధిదారు, కడప -
కళ్లెదుటే ఖరీదైన లోగిళ్లు!
కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన అప్పారావు దినసరి కూలి. ఆర్నెళ్ల క్రితం వరకూ నెలకు రూ.2,500 అద్దె చెల్లించాల్సి రావడంతో కుటుంబ పోషణ చాలా కష్టంగా ఉండేది. ఆయన భార్య రత్నం సొంత ఇంటి కలను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం ద్వారా నెరవేర్చింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడుకు వెళ్లే రోడ్డులో అత్యంత ఖరీదైన ప్రాంతంలో ఆమె కుటుంబానికి ప్రభుత్వం ఉచితంగా స్థలాన్ని ఇవ్వడంతోపాటు గృహ నిర్మాణానికి ఆర్థికంగా చేదోడుగా నిలిచింది. ఏమ్మా ఈ ఇల్లు మీదేనా? చాలా బాగుందంటూ ఎవరైనా పలకరిస్తే చాలు.. ‘అవునండీ సీఎం జగన్ మాకిచ్చిన కానుక ఈ ఇల్లు. ఇన్నాళ్లూ అద్దెలు కట్టలేక, పిల్లల చదువులు, కుటుంబ పోషణకు చాలా ఇబ్బందులు పడ్డాం. కొత్త ఇంటిలోకి వచ్చాక చిన్న టిఫిన్ సెంటర్ నడుపుతున్నా. వేడినీళ్లకు చన్నీళ్లలా మా సంపాదన ఉంది’ అని ఆనందంగా చెబుతోంది. సామర్లకోట లేఔట్లో ఇల్లు నిర్మించుకుని నివాసం ఉంటున్న కృష్ణకుమారి అనే మహిళను ఇక్కడికి వచ్చి ఎన్నిరోజులు అయింది? అని పలుకరించగా ‘నా భర్త చిరు వ్యాపారి. వివాహం అయిన రోజు నుంచి అద్దె ఇంటిలోనే ఉంటున్నాం. సంపాదన ఖర్చులకే సరిపోయేది కాదు. స్థలం కొనడానికే రూ.10 లక్షలు దాకా ఉండాలి. దీంతో ఇక ఇంటి కల నెరవేరదని ఆశ వదులుకున్న తరుణంలో ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇచ్చి ఇంటిని కూడా మంజూరు చేస్తోందని తెలియడంతో దరఖాస్తు చేసుకున్నాం. ఎనిమిది నెలల క్రితం గృహ ప్రవేశం కూడా చేశాం. నా బిడ్డ చదువులకు కూడా ప్రభుత్వం సాయం చేస్తోంది. ఇప్పటివరకు మూడుసార్లు అమ్మఒడి వచ్చింది. రూ.75 వేలు పొదుపు సంఘం రుణం వచ్చింది’ అని సంతోషం వ్యక్తం చేస్తోంది. (వడ్డే బాలశేఖర్ – సామర్లకోట నుంచి సాక్షి ప్రతినిధి): ఒకేసారి 30 లక్షల మందికిపైగా ఇళ్ల స్థలాలు.. అది కూడా ఖరీదైన ప్రాంతాల్లోనే.. ఆపై గృహ నిర్మాణాలను కూడా చేపట్టడం దేశ చరిత్రలోనే ఒక సంచలనం. అక్క చెల్లెమ్మల సొంతింటి స్వప్నాన్ని సాకారం చేసేందుకు భూ సేకరణ కోసమే రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.75,670 కోట్లను వ్యయం చేసింది. అంత విలువైన స్థిరాస్తిని మహిళల చేతుల్లో పెట్టింది. పేదల పక్కా ఇళ్ల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 68,677 ఎకరాలను పంపిణీ చేసిందని కేంద్ర గృహ నిర్మాణ శాఖ సైతం ప్రశంసించింది. 17,005 జగనన్న కాలనీల్లో సకల సామాజిక, కనీస సదుపాయాలను కల్పిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఇందుకోసం దశలవారీగా దాదాపు రూ.30 వేల కోట్లను వ్యయం చేస్తోంది. ఇక ఆగస్టు నెలాఖరు వరకు 21.31 లక్షల ఇళ్ల నిర్మాణాల కోసం మరో రూ.12,295.97 కోట్లను అక్క చెల్లెమ్మల ఖాతాలకు పారదర్శకంగా జమ చేసింది. ఉచితంగా ఇచ్చే ఇసుకతోపాటు రాయితీపై సామగ్రిని సమకూరుస్తోంది. తద్వారా మరో రూ.40 వేల మేరకు లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. ఇళ్ల నిర్మాణాలు పూర్తయిన ప్రాంతాన్ని బట్టి స్థలం, ఇంటి విలువ రూ.15 లక్షలు, ఆపైన పలుకుతుండటం విశేషం. ఇళ్ల లబ్ధిదారుల్లో బీసీ మహిళలే అత్యధికంగా ఉన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికార యంత్రాంగానికి మార్గ నిర్దేశం చేస్తున్నారు. పూర్తైన ఇళ్లకు మంచినీటి, విద్యుత్ సరఫరాపై క్షేత్రస్థాయిలో ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్ల ద్వారా తనిఖీలు జరిపి నిర్థారించేలా చర్యలు తీసుకున్నారు. రోజు వారీ లక్ష్యాలను నిర్ధారించి ఎప్పటికప్పుడు పురోగతిని సమీక్షిస్తుండటంతో ఐదు లక్షలకుపైగా పేదల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా పూర్తయ్యాయి. ఖరీదైన ప్రాంతంలో పేదలకు ఇళ్లు కాకినాడ జిల్లా సామర్లకోట – ప్రత్తిపాడు రోడ్డులో 2,412 నిరుపేద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 54 ఎకరాల్లో ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. రెండు కాలనీలుగా పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించారు. ఇప్పటివరకు 800 వరకూ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యింది. మరో 1,408 ఇళ్లు పునాదిపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఈ నెల 5వ తేదీన సామర్లకోట వైఎస్సార్ జగనన్న కాలనీని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సందర్శించి పేదల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో సామర్లకోట మునిసిపాలిటీలోని జగనన్న కాలనీల్లో ‘సాక్షి’ క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టింది. సామర్లకోట నుంచి ప్రత్తిపాడు వెళ్లే ప్రధాన రహదారికి పక్కనే ఇళ్ల స్థలాలు పంపిణీ చేశారు. ఇక్కడ సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.10 లక్షలపైన పలుకుతోందని చెబుతున్నారు. విద్యుత్, నీటి సరఫరాతో పాటు, ఇతర సదుపాయాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తోంది. స్థలం, ఇంటి రూపంలో ఒక్కో పేద మహిళకు రూ.15 లక్షలకుపైగా విలువైన ఆస్తిని సీఎం జగన్ సమకూర్చారు. అత్యంత నాణ్యత ప్రమాణాలతో.. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాలను స్మశానాలతో పోల్చుతూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, ఆ పార్టీ నాయకులు విషం కక్కారు. నిత్యం పేదల ఇళ్ల పథకంపై ఎల్లో మీడియా విష ప్రచారం చేస్తోంది. ఈ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా కాలనీల్లో అత్యంత నాణ్యత ప్రమాణాలతో పేదల ఇళ్ల నిర్మాణాలున్నాయి. ప్రతి ఇంటికీ హాల్, కిచెన్, బెడ్రూమ్, వరండా, స్టేర్ కేస్ లాంటి వసతులు ఉండటం విశేషం. సామర్లకోటలో మెజారిటీ లబ్ధిదారులు తామే ఇళ్లు నిర్మించుకునే ఆప్షన్ ఎంచుకున్నారు. ఆప్షన్–3 లబ్ధిదారుల ఇళ్లను షీర్వాల్ టెక్నాలజీలో అజయ వెంచర్స్ లేబర్ ఏజెన్సీ నిర్మిస్తోంది. ఉచితంగా ఇసుక.. సబ్సిడీపై సామగ్రి నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్రవ్యాప్తంగా పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ రెండు విడతల్లో 21.25 (టిడ్కోతో కలిపి) లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇంటి నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు చొప్పున ప్రభుత్వం అందిస్తోంది. పావలా వడ్డీకే రూ.35 వేలు బ్యాంక్ రుణం, రూ.15 వేలు విలువైన ఉచిత ఇసుక, సబ్సిడీపై సిమెంట్, స్టీల్, మెటల్ ఫ్రేమ్స్, ఇతర నిర్మాణ సామాగ్రిని అందించడం ద్వారా మరో రూ.40 వేల మేర లబ్ధిదారులకు ప్రయోజనాన్ని చేకూరుస్తోంది. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా.. పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఈ ఏడాది ఆగస్టు నాటికి ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు నిర్మాణం పూర్తయిన ఇళ్లు 5,24,850కి చేరుకున్నాయి. మిగిలినవి శరవేగంగా కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లాలో అత్యధికంగా 43,602 ఇళ్లు పూర్తయ్యాయి. విజయనగరం జిల్లాలో 37,141 ఏలూరు జిల్లాలో 26,815 ఇళ్లు పూర్తయ్యాయి. లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ బిల్లులను ప్రభుత్వం వేగంగా చెల్లిస్తోంది. నిర్మాణాలు పూర్తయిన వెంటనే ఇళ్లకు చకచకా విద్యుత్, నీటి సరఫరా కనెక్షన్లు అందచేస్తోంది. 5న సామర్లకోట లే అవుట్లో ఇళ్లకు సీఎం జగన్ ప్రారంభోత్సవాలు పేదలందరికి ఇళ్లు–నవరత్నాల్లో భాగంగా పూర్తయిన ఐదు లక్షల గృహాల ప్రారంభోత్సవ కార్యక్రమం ఈ నెల 5వ తేదీన సామర్లకోటలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేతుల మీదుగా జరుగుతుందని గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక సీఎస్ అజయ్ జైన్ తెలిపారు. అదే రోజు జిల్లాలు, నియోజకవర్గాల వారీగా ఎంపిక చేసిన లే అవుట్లలో ఇళ్లను మంత్రులు, ప్రజా ప్రతినిధులు ప్రారంభిస్తారని, సామూహిక గృహ ప్రవేశాలు ఉంటాయని అజయ్ జైన్ ‘సాక్షి’కి వెల్లడించారు. ఐదు లక్షల గృహాల లే అవుట్లలో నూటికి నూరు శాతం మంచినీటి, విద్యుత్ సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు. రహదారులు, అంతర్గత రహదారులు, స్వాగత తోరణాలు కూడా పూర్తైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు 5.24 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయని చెప్పారు. తిరగకుండానే మంజూరైంది.. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకుంటే పట్టించుకోలేదు. ఆ పార్టీ సానుభూతిపరులం కాదని సంక్షేమ పథకాల నుంచి తొలగించారు. తమ పార్టీ జెండా పట్టుకుంటే అన్నీ వస్తాయని ఆ పార్టీ నాయకులు చాలాసార్లు ఆశ పెట్టారు. ఇప్పుడు ఏ నాయకుడు, ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండానే మాకు ఇంటి స్థలం మంజూరైంది. త్వరలో గృహప్రవేశం కూడా చేయనున్నాం. ప్రభుత్వం మాకిచ్చింది సెంటు స్థలమేనని హేళనగా మాట్లాడుతున్న టీడీపీ నాయకులు వారి ప్రభుత్వంలో గజం స్థలం కూడా ఇచ్చిన పాపాన పోలేదు. – సూర్య భాస్కర్ కుమార్, సామర్లకోట, కాకినాడ జిల్లా దశాబ్దాల కల నెరవేరింది.. మా ఆయన చిరు వ్యాపారి. ఆయన సంపాదనంతా ముగ్గురమ్మాయిల చదువులు, కుటుంబ పోషణకే సరిపోయేది. వారికి పెళ్లిళ్లు చేయడానికి తలకు మించిన భారమైంది. దీంతో మాకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలన్న కోరిక అలాగే మిగిలిపోయింది. ఇప్పుడు సీఎం జగన్ మా దశాబ్దాల ఇంటి కలను నెరవేర్చారు. ఆయన రుణం ఈ జన్మకు తీర్చుకోలేం. – లంక లక్ష్మి, వైఎస్సార్–జగనన్న కాలనీ సామర్లకోట, కాకినాడ జిల్లా ఇంతకన్నా మేలు ఏ ప్రభుత్వం చేయలేదు.. నెలకు రూ.3,500 చెల్లించి అద్దె ఇంట్లో ఉండేవాళ్లం. సుమారు 10 ఇళ్లు మారాం. గత ప్రభుత్వంలో ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇచ్చిన సెంటు స్థలంలో ఇల్లు నిర్మించుకుని ఆత్మగౌరవంతో జీవిస్తున్నాం. మా పిల్లల చదువులకు కూడా అమ్మఒడి ద్వారా సీఎం జగన్ అండగా నిలుస్తున్నారు. ఇంతకన్నా మేలు మాకు ఏ ప్రభుత్వం చేయలేదు. – వి.సతీష్, పద్మావతి, వైఎస్సార్, జగనన్న కాలనీ సామర్లకోట పేదరిక నిర్మూలనే లక్ష్యంగా.. రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూలించడమే లక్ష్యంగా సీఎం జగన్ పాలిస్తున్నారు. ప్రజల కనీస అవసరాల్లో ఒకటైన గూడు కోసం ఏ ఒక్కరు బాధ పడకుండా చర్యలు చేపట్టారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనిధంగా పేదలకు ఏకంగా 30 లక్షలకు పైగా ఇంటి పట్టాలు ఇచ్చారు. ఐదు లక్షల ఇళ్లను త్వరలో లబ్ధిదారులకు అందిస్తున్నాం. శరవేగంగా మిగిలిన నిర్మాణాలను కూడా పూర్తి చేస్తాం. – దవులూరి దొరబాబు, పెద్దాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త ఎప్పటికప్పుడు పురోగతి పరిశీలన పేదల ఇళ్ల నిర్మాణాలను శరవేగంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. జిల్లాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి ఎప్పటికప్పుడు పనుల పురోగతిని సమీక్షిస్తున్నాం. సామర్లకోటలో త్వరలో సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు చేస్తున్నాం. – డాక్టర్ లక్ష్మీశా, ఎండీ, ఏపీ గృహనిర్మాణ సంస్థ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం ద్వారా దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారికి సమాజంలో సముచిత స్థానం లభిస్తుంది. ఇది కేవలం గృహ నిర్మాణంగానే చూడకూడదు. ఇళ్ల నిర్మాణంతో అనుబంధ రంగాల కార్మికులకు కూడా ఉపాధి లభిస్తుంది. సిమెంట్, ఇనుము, ఇటుకలు.. ఇలా వివిధ పరిశ్రమల ఉత్పత్తిలో వృద్ధి పెరుగుతుంది. తద్వారా ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం జరుగుతుంది. పేదలు తమ సంపాదనలో తిండికి పెట్టే ఖర్చుతో సమానంగా ఇంటి అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారికి పక్కా ఇళ్లు సమకూరితే అద్దెల భారం తగ్గుతుంది. ఆ మొత్తాన్ని మంచి ఆహారం, ఆరోగ్యం, పిల్లల భవిష్యత్ కోసం ఖర్చు చేస్తారు. దీంతో మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుంది. – ప్రొఫెసర్ కె.మధుబాబు, ఆర్థిక శాస్త్రం విభాగాధిపతి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం -
రేపు సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్‌కు చేరుకుంటారు. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన మోడల్ హౌస్‌ను పరిశీలిస్తారు. అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీకోసం ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. -
ఇది పేదల విజయం
పేదలు మరింత నిరుపేదలుగా మారాలి.. పెత్తందార్లకు జీ హుజూర్ అంటూ బతకాలి.. పేదల పిల్లలు పెద్ద పెద్ద చదువులు చదవరాదు.. ఇంగ్లిష్ చదువులు అసలే చదవకూడదు.. కనీసం వారికి నిలువ నీడ కూడా లేకుండా ఉంటేనే తమ ఆటలు సాగుతాయన్నది చంద్రబాబు అండ్ కో మానసిక పరిస్థితి. అమరావతి ప్రాంతంలో వారికి ప్రభుత్వం సెంటు భూమి ఇస్తామంటే ఇదే పచ్చ గ్యాంగ్, ఎల్లో మీడియాతో కలిసి గగ్గోలు పెట్టింది. బాబు 3డి గ్రాఫిక్స్ రాజధానిలోని సింగపూర్, మలేషియా, జపాన్‌లు మురికి కూపాలైపోతాయని ఆందోళనలు, చర్చోపచర్చలతో ప్రజల్లో విష బీజాలు నింపడానికి విఫలయత్నం చేసింది. నిస్సిగ్గుగా కోర్టులకూ ఎక్కింది. ‘రాజధాని అయినంత మాత్రాన అక్కడ పేదలు ఉండకూడదంటే ఎలా?’ అని హైకోర్టు తలంటినప్పటికీ ఈ పచ్చ గ్యాంగ్‌కు బుద్ధి రాలేదు. రైతుల పేరుతో సుప్రీంకోర్టులోనూ వంకర బుద్ధి చూపించబోయింది. ‘పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం ఏ విధంగా అన్యాయం? రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పు పట్టలేం’ అని తాజాగా గడ్డి పెట్టింది. అయినా వీళ్లలో మార్పు వస్తుందని ఆశించలేం. ఈ పెత్తందార్ల యుద్ధాన్ని ఎదిరిస్తూ.. వారి కుట్రలను సమర్థవంతంగా తిప్పికొడుతూ సీఎం వైఎస్ జగన్ గట్టిగా నిలవడం వల్లే పేదలకు న్యాయం జరిగింది. ఇది పేదల కోసం నిలబడ్డ ప్రభుత్వ ఘన విజయం. సాక్షి, అమరావతి: రాజధానిలో పేదలకు స్థానమే లేకుండా చేసేందుకు తెలుగుదేశం పార్టీ పన్నిన కుట్రలు, కుతంత్రాలను సుప్రీంకోర్టు పటాపంచలు చేసింది. రాజధాని ప్రాంతంలో పేదలకు 5 శాతం భూమి కేటాయించాలన్న సీఆర్డీఏ చట్ట నిబంధనలను తూచా తప్పకుండా అమలు చేస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వాన్ని అడ్డుకునేందుకు శక్తివంచన లేకుండా తెలుగుదేశం పార్టీలు పెద్దలు చేసిన యత్నాలను సుప్రీంకోర్టు తిప్పికొట్టింది. పేదలకు ఇళ్ల స్థలాలు రాకుండా చేసేందుకు న్యాయవాదులకు కోట్ల రూపాయలను వెదజల్లినా టీడీపీ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. పేదలకు వ్యతిరేకంగా రైతుల ముసుగులో పిటిషన్లు దాఖలు చేయించి, వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వాన్ని నిరోధించాలన్న అభ్యర్థనలను సుప్రీంకోర్టు నిర్ద్వందంగా తోసిపుచ్చింది. చట్ట ప్రకారం రాజధాని ప్రాంతంలో వేలాది మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అనుమతిచ్చింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా ప్రభుత్వాన్ని నిరోధించేందుకు నిరాకరిస్తూ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇచ్చేందుకు నిరాకరించింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులు రాజధాని ప్రధాన కేసులో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ కేఎం జోసెఫ్, జస్టిస్ అరవింద్ కుమార్ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా అడ్డుకోండి రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు 1,134 ఎకరాల భూమిని ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల కలెక్టర్లకు బదలాయించేందుకు సీఆర్డీఏకు అనుమతిస్తూ ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో 45ను సవాలు చేస్తూ అమరావతి రైతులు హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలు చేశారు. జీవో 45 అమలును నిలుపుదల చేయడంతో పాటు పేదలకు ఎలాంటి ఇళ్ల స్థలాలు కేటాయించకుండా ప్రభుత్వాన్ని నిరోధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని అనుబంధ వ్యాజ్యాలు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం ఇటీవల విచారణ జరిపి వాటిని కొట్టేసింది. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని ధర్మాసనం తన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ మధ్యంతర ఉత్తర్వులను సవాలు చేస్తూ అమరావతి రైతులు కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ వ్యాజ్యాలపై బుధవారం జస్టిస్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ, సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది ఎస్.నిరంజన్‌రెడ్డి, పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, రంజిత్ కుమార్ తదితరులు వాదనలు వినిపించారు. ఈ విచారణకు హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కూడా హాజరయ్యారు. ఎలా చూసినా పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపిస్తూ, పిటిషన్లు దాఖలు చేసిన పిటిషన్లకు ఎలాంటి విచారణ అర్హత లేదన్నారు. వేలాది మంది రైతుల్లో కనీసం పది మంది కూడా కోర్టుకు రాలేదన్నారు. సీఆర్డీఏ చట్టం ప్రకారం కూడా ఐదు శాతం భూమి ఈడబ్ల్యూఎస్ (ఎకనామికల్లీ వీకర్ సెక్షన్) వర్గాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. దాని ప్రకారమే రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోందని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. రాజధాని ప్రధాన కేసులో అనుకూలంగా తుది తీర్పు రాకపోతే పరిస్థితి ఏమిటని ప్రశ్నించింది. ఒకవేళ అలా జరిగినా ప్రస్తుతం పేదలకు చేస్తున్న కేటాయింపులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. ఎందుకంటే సీఆర్డీఏ చట్టమే పేదలకు ఐదు శాతం భూమి ఇవ్వాలని చెబుతోందని తెలిపారు. కాని ఇప్పుడు పేదలకు ప్రభుత్వం ఇస్తున్నది కేవలం 3.1 శాతం భూమి మాత్రమేనన్నారు. 34 వేల ఎకరాల్లో సుమారు 1,200 ఎకరాలు మాత్రమే పేదలకు కేటాయించామని తెలిపారు. సీఆర్డీఏ చట్టంలో సెక్షన్ 53 డీ ప్రకారం పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం ప్రభుత్వానికి ఉందన్నారు. ఆర్–5 జోన్లో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడం వల్ల ఎలక్ట్రానిక్ సిటీ (ఈ–సిటీ)కి వచ్చిన ఇబ్బందేంటో తెలియడం లేదన్నారు. ఇళ్ల స్థలాల కేటాయింపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు మాత్రమే ఇచ్చిందని తుది విచారణ జరగాల్సి ఉందన్నారు. కోర్టులో దాఖలు అవుతున్నవన్నీ వ్యక్తిగత పిటిషన్లేనని, ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు కాదని వివరించారు. ఈ పది మంది వెనుక ఎవరున్నారో పరిశీలించండి వేల మంది భూములిచ్చిన రైతులుండగా, కేవలం పది మందే కోర్టుకు ఎందుకొచ్చారో, దీని వెనుక ఎవరున్నారో పరిశీలించాలన్నారు. ప్రస్తుతం పేదలకు కేటాయించిన స్థలాల వల్ల పిటిషనర్లకు చెందిన రిటర్నబుల్ ప్లాట్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని సింఘ్వి తెలిపారు. పేదలకు ప్రస్తుతం కేటాయించిన స్థలాలు ఈ–సిటీ దగ్గర్లో ఉన్నాయని, 6,500 ఎకరాల ఈ–సిటీలో ప్రభుత్వం పేదలకు కేటాయించిన స్థలం చాలా తక్కువని చెప్పారు. అసలు ఆర్–5 జోన్లోనే ఎందుకు.. మరెక్కడైనా ఇవ్వొచ్చుగా అని ప్రశ్నించినా సమాధానం చెప్పగలమన్నారు. ప్రస్తుతం ఉన్న నాలుగు జోన్లలో జోన్–1ను ప్రస్తుతం ఉన్న గ్రామాల కారణంగా ముట్టుకునే పరిస్థితి లేదని, జోన్–2 స్పెషల్ ఏరియా అని.. ఢిల్లీలో లుటియన్స్ ఢిల్లీ మాదిరి అని తెలిపారు. జోన్–3 భూములిచ్చిన వారికి ఇచ్చిన రిటర్నబుల్ ప్లాట్లు ఉన్న ప్రాంతమని, జోన్–4 హై డెన్సిటీ ప్రాంతం అని ఆయన ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. అందుకే పేదల కోసం ఆర్–5 జోన్‌ను సృష్టించామని తెలిపారు. రిటర్నబుల్ ప్లాట్లు ఒక చోట, ఈ–సిటీ మరో చోట అని తెలిపారు. ఒకవేళ పిటిషనర్లు హైకోర్టులో గెలిచినా కూడా సీఆర్డీఏ చట్టం ప్రకారం పేదలకు ఐదు శాతం భూమి కేటాయించాల్సిందేన్నారు. రాజధాని ప్రధాన వ్యాజ్యాలు జూలైలో విచారణకు రానున్నాయని, ఒకవేళ పిటిషనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చినా రాజధాని ప్రాంతాన్ని అభివృద్ధి చేయాల్సిందేనని, అప్పుడు కూడా ఐదు శాతం ఈడబ్ల్యూఎస్‌కు కేటాయించాల్సి ఉంటుందని వివరించారు. మాస్టర్ ప్లాన్‌ను మార్చలేదు సీఆర్డీఏ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ.. మాస్టర్ ప్లాన్‌లో ఎలాంటి మార్పులు చేయడం లేదని స్పష్టం చేశారు. కేటాయించిన స్థలాల్లో నివాసాలు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం మద్దతు ఇస్తుందన్నారు. చట్ట ప్రకారం పేదలకు ఐదు శాతం స్థలాలు కేటాయించాల్సి ఉందన్నారు. భూసేకరణ అనేది ప్రభుత్వం ప్రజల కోసమే చేస్తుందని, దాన్ని ఇతరత్రా ప్రజా ప్రయోజనాల కోసం కూడా వినియోగిస్తుందని తెలిపారు. ఈడబ్ల్యూఎస్ వర్గాలకు స్థలాల కేటాయింపు ప్రజా ప్రయోజనం కాదని అనడం ఎంత మాత్రం సబబు కాదన్నారు. అంతకు ముందు పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాదులు శ్యాం దివాన్, రంజిత్ కుమార్ తదితరులు వాదనలు వినిపిస్తూ.. 29 గ్రామాలకు చెందిన 33 వేల మంది రైతులు భూ సమీకరణ కింద ప్రభుత్వానికి రాజధాని కోసం భూములు ఇచ్చారన్నారు. అమరావతిలో మీడియా సిటీ, నాలెడ్జి సిటీ, జస్టిస్ సిటీ, ఎలక్ట్రానిక్ సిటీ ఇలా తొమ్మిది రకాల సిటీలు అభివృద్ధి చేయాలని మాస్టర్ ప్లాన్‌లో ఉందన్నారు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్‌లో 5 శాతం పేదలకు ఇళ్ల స్థలాలను తొమ్మిది సిటీలకు విస్తరించాలన్నారు. మాస్టర్ ప్లాన్‌లో 17 వేల ఎకరాలు రెసిడెన్షియల్ జోన్లకు కేటాయించారని పేర్కొన్నారు. జూలైలో తుది తీర్పు రానుందని, అంతకు ముందుగానే పట్టాలు కేటాయించడం సబబు కాదని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులపై స్టే ఇవ్వడానికి ధర్మాసనం నిరాకరించింది. అటు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల్లో, ఇటు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంలో ఏ రకంగానూ జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. -
ఏది నిజం?: ‘ఈనాడు’ దిగజారుడు రాతలు
‘మేం ఉండే చోట పేదలుండటానికి వీల్లేదు!.వాళ్లకు ఇక్కడ స్థలాలిస్తే ‘సామాజిక తూకం’ దెబ్బతింటుంది’’ అంటూ న్యాయస్థానాలకు వెళ్లి ఓడిపోయిన వారికి ఇంకా కొమ్ముకాస్తున్నారు చంద్రబాబు నాయుడు! కోర్టు తీర్పును అమలు చేయొద్దంటూ ఆందోళనలు చేసి... శాంతిభద్రతల సమస్యలు సృష్టించబోయిన వారిని పోరాట యోధులుగా పతాక శీర్షికలకెక్కిస్తున్నారు బాబు రాజకీయ గురువు రామోజీరావు!!. పేదలకు వ్యతిరేకంగా న్యాయస్థానాల్లో కోట్ల రూపాయలు ఖర్చు చేసి... ఓడిపోయాక కూడా వారి సొంతింటి కలను అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారంటే ఏమనుకోవాలి వీళ్లని? చేతిలో నాలుగు టీవీ ఛానెళ్లు, మూడు పత్రికలు ఉన్నాయి కదా అని ఎంతకైనా తెగిస్తారా? తమకు ఏమనిపిస్తే అది రాస్తూ... యావత్తు రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టిస్తూనే ఉంటారా? ముసుగులేసుకుని మద్దతిచ్చే పార్టీలు, నాయకులు ఉన్నారు కదా అని ఎలాంటి ప్రచారమైనా చేస్తారా? పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకూడదన్నది చంద్రబాబు నాయుడి విధానం. అందుకే... ఎక్కడికక్కడ ఆయా స్థలాలు కేటాయించవద్దంటూ కోర్టుల్లో కేసులు వేయించారు. చివరికి ఇళ్ల స్థలాలన్నీ మహిళల పేరిట ఇవ్వటం కూడా తప్పని న్యాయ పోరాటం చేశాడు. అలా చేసి... తనకు అనుకూలంగా తీర్పు రప్పించుకుని... కొన్నాళ్ల పాటు పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపులను, నిర్మాణాలను ఆపగలిగారు కూడా!. చివరకు అవ్వాతాతల ఇళ్ల వద్దకే వెళ్లి పింఛన్లు అందజేస్తున్న వలంటీర్ల వ్యవస్థపై కూడా విషం చిమ్మారు. పేదలు ఇంగ్లిష్ మీడియంలో చదవటాన్ని కూడా వ్యతిరేకించారు చంద్రబాబు. దీన్ని వ్యతిరేకిస్తూ కోట్లాది రూపాయలు ఖర్చుచేసి కార్పొరేట్ మాఫియా తరఫున సుప్రీంకోర్టు వరకూ పోరాటం సాగించారు. చివరికి ఓడిపోయినా... కొన్నాళ్లపాటు మాత్రం ఆపగలిగారు. రాష్ట్ర ప్రభుత్వం తెగ అప్పులు చేస్తోందని పదేపదే తన అనుకూల మీడియాతో దుష్ప్రచారం చేయిస్తూనే... రాష్ట్ర ప్రభుత్వం నిధుల సమీకరణకు చేసిన ప్రతి ప్రయత్నానికీ అడ్డు తగిలారు చంద్రబాబు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూముల వేలం నుంచి మొదలుపెడితే ప్రతిచోటా న్యాయపరమైన అడ్డంకులే!. న్యాయ ప్రక్రియపై తనకున్న ‘పట్టు’తో చాలా కేసులో అనుకూల తీర్పులూ రాబట్టుకోగలిగారు!. దేశవ్యాప్తంగా మూడు బల్క్‌డ్రగ్ పార్కులకు కేంద్రం అనుమతివ్వగా... తెలంగాణ సహా అందరితోనూ పోటీ పడి మరీ... ఒకదాన్ని రాష్ట్రం దక్కించు కుంది. కానీ ఈ పార్కు రాష్ట్రానికి కేటాయించవద్దంటూ తెలుగుదేశం నేత యనమల రామకృష్ణుడి చేత నేరుగా కేంద్రానికే లేఖ రాయించారు చంద్రబాబు!!. ఇక్కడేమో రాష్ట్రానికి ప్రాజెక్టులు రావటం లేదని తన మీడియాతో ప్రచారం చేయిస్తూనే ఉన్నారు!!. మూలపేట పోర్టు (గతంలో భావనపాడు) నుంచి భోగాపురం ఎయిర్‌పోర్టు వరకూ ప్రతి ప్రాజెక్టు విషయంలోనూ ఎవరో ఒకరితో భూములకు సంబంధించో, పర్యావరణానికి సంబంధించో కేసులు వేయిస్తూనే వచ్చారు చంద్రబాబు. ఆయన లక్ష్యమల్లా ఒక్కటే. ఈ ప్రభుత్వ హయాంలో ఏ పనీ కాకూడదు. రాష్ట్రానికి గానీ, రాష్ట్ర ప్రజలకు గానీ మంచి జరక్కూడదు. అంతెందుకు!!. పరిపాలన వికేంద్రీకరణ విషయంలోనూ అదే కథ!. అమరావతిలోనే అన్నీ ఉండాలి తప్ప... వేరెక్కడా ఎలాంటి అభివృద్ధీ జరగకూడదనే దారుణమైన కుతంత్రంతో... రైతుల పేరిట అమరావతిలో ఉద్యమాలు, యాత్రలు, న్యాయపోరాటాలు... ఒకటా రెండా!!. చివరకు రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లు కేటాయిస్తే సామాజిక తూకం దెబ్బతింటుందంటూ కోర్టులకెక్కారు చంద్రబాబు మనుషులు. అసలు అన్ని వర్గాల ప్రజలూ ఉంటేనే కదా రాజధాని? కొందరికే పరిమితమైతే అదో గేటెడ్ కమ్యూనిటీ అవుతుంది తప్ప రాష్ట్ర రాజధాని ఎలా అవుతుంది? వాస్తవానికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ దొరికిపోయి... ఏపీలో అందరినీ డైవర్ట్ చెయ్యడానికి చంద్రబాబు ఆరంభించిన మహా రియల్ ఎస్టేట్ వెంచర్ అది!. బలహీన సామాజికవర్గాలు, ఆర్థికంగా వెనుకబడ్డవారు ప్రవేశించడానికి వీల్లేని ఓ గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులా దాన్ని తీర్చిదిద్దాలనుకున్నారు బాబు. పేద సామాజిక వర్గాలు, కులాల వారు అక్కడకు పనివాళ్లుగా ఉదయం వచ్చి, సాయంత్రం వెళ్లిపోవాలే తప్ప, హక్కుదారులుగా, వాటాదారులుగా నివాసం ఉండే అవకాశం వాళ్లకి ఇవ్వకూడదనుకున్నారు. కానీ ఇక్కడే 50వేల మందికి ఇళ్ల స్థలాలు, వాటిలో ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్న డిజైన్‌తో చంద్రబాబు కట్టాలని భావించిన సామాజిక కోటను బద్దలుకొట్టేశారు ముఖ్యమంత్రి జగన్. దాన్ని అందరి రాజధానిగా మార్చాలని భావించారు. కోర్టు ద్వారా చంద్రబాబు కొన్నాళ్లు అడ్డుకున్నా... అంతిమంగా న్యాయమే గెలిచింది. రాజధాని అందరిదీ అని న్యాయస్థానం చెప్పకనే చెప్పింది. అక్కడితో ఆగిపోవాల్సి ఉన్నా... చంద్రబాబు ఆగటం లేదు. తన అనుకూల వర్గాల చేత అక్కడ ధర్నాలు, ఆందోళనలు చేయిస్తూ శాంతిభద్రతల సమస్యలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు. పోలీసులు అడ్డుకుంటే... తన అనుకూల మీడియాతో దుర్మార్గపు వార్తలు రాయిస్తున్నారు. అయినా పేదలకు ఇళ్లు వద్దంటూ ఆందోళనలు చేసేవారిని పతాక శీర్షికల్లోకి ఎక్కించి మరీ రెచ్చగొడుతున్న ‘ఈనాడు’ పత్రికను ఏమనుకోవాలి? రామోజీరావుకు అసలు బుద్ధుందా? పేదలకు భూములివ్వాలని గతంలో పోరాటాలు చేసిన పార్టీలు కూడా ఇపుడు చంద్రబాబు నాయుడితో చేతులు కలిపి, పేదలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నాయంటే... వీళ్లందరికీ పిచ్చి ఏ స్థాయిలో ముదిరిపోయిందో అర్థం కావటం లేదా? అసలెందుకు ఈ ఆర్5 జోన్? చంద్రబాబు ఏర్పాటు చేసిన రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్డీఏ)లో పేదలు ఉండే అవకాశం లేకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు చంద్రబాబు. వాస్తవానికి పూలింగ్ నిమిత్తం సేకరించిన భూమిలో 5 శాతాన్ని పేదలకు ఇవ్వాలని సీఆర్డీఏ చట్టం స్పష్టంగా చెబుతున్నా... చంద్రబాబు దాన్ని పట్టించుకోలేదు. పైపెచ్చు దీనికి గండికొట్టడానికి... సీఆర్డీఏ పరిధిలో ఏ ప్లాటుకైనా కనీసం 120 చదరపు గజాలు తప్పనిసరి అని, ఆ మాత్రం లేకుంటే ఎలాంటి నిర్మాణాలకూ ప్రభుత్వం అనుమతివ్వకూడదనే నిబంధనను తెచ్చారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి, ఇళ్లు నిర్మిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం... గుంటూరు, ఎన్టీయార్ జిల్లాల్లోని పేదలకు సైతం ఇళ్ల స్థలాలివ్వాలని సంకల్పించి... ఈ 120 గజాల నిబంధనను సవరించింది. దీనికోసం సదరు నిబంధన వర్తించని విధంగా ఆర్–5 జోన్‌ను ఏర్పాటు చేసి.. దానికి అనుగుణంగా సీఆర్డీఏ పరిధిలో 1402.58 ఎకరాలు కేటాయించి 50,004 మందికి ఇంటి స్థలాలిచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. న్యాయపోరాటాల వల్ల ప్రక్రియ ఆగిపోగా... తాజాగా అడ్డంకులన్నీ తొలగటంతో... పట్టాలిచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దీన్ని కూడా అడ్డుకునేందుకు మళ్లీ రైతుల ముసుగులో ఆందోళన మొదలుపెట్టించారు చంద్రబాబు. అక్కడితో ఆగలేదు కూడా. గతంలో వారికి స్థలాలివ్వవద్దని చెప్పిన వీరంతా.... ఇపుడు వీళ్లకు వేరేచోట ఇవ్వండంటూ మళ్లీ న్యాయస్థానాలకు వెళ్లే దుస్సాహసానికి దిగుతున్నారంటే చంద్రబాబు కుయుక్తులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. క్రమం తప్పకుండా కౌలు చెల్లిస్తున్నా... అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం క్రమం తప్పకుండా కౌలు చెల్లిస్తున్నా తెలుగుదేశం మాత్రం అబద్ధాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోంది. దాదాపు 22 వేల మంది రైతులకు గత తొమ్మిదేళ్లుగా ప్రభుత్వం కౌలు చెల్లిస్తోంది. గతేడాది కూడా జూన్ నెలలో రూ.194 కోట్లను కౌలుగా చెల్లించింది. ప్రభుత్వ భూముల ఆక్రమణ పరిధిలో ఉన్న భూములకు మాత్రం (కేటగిరీ 4,5,6) కౌలు చెల్లించడం లేదు. సీఆర్డీఏకు ఇచ్చిన భూముల్లో సుమారు 2900 ఎకరాలపై యాజమాన్య హక్కుల విషయంలో కేసులు నమోదవడంతో సీఐడీ దర్యాప్తు చేస్తోంది. వీటిలో కేసులు తేలినవాటికి ఎప్పటికప్పుడు కౌలు చెల్లిస్తున్నారు. ప్రతి ఏటా మే, జూన్ నెలల్లో కౌలు చెల్లింపు చేస్తున్నారు. అయినా రైతుల ముసుగులో టీడీపీ ఆందోళనలకు దిగటం... ‘ఈనాడు’, దాని తోకలు ఈ ఆందోళనను చిలవలు పలవలు చేసి దుష్ప్రచారం చేయటం... ఇదంతా ఈ రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యమే. అసలైన వికేంద్రీకరణ అంటే ఇదీ... తాను నిర్మించే రాజధానిలో పేదలకు నివసించే హక్కు లేకుండా చేశారు చంద్రబాబు. కానీ పాలనను, అభివృద్ధిని వికేంద్రీకరిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాత్రం... అమరావతితో పాటు అటు విశాఖలోను, ఇటు కర్నూలులో కూడా భారీ ఎత్తున పేదలకు ఇళ్ల స్థలాలిచ్చారు. విశాఖ, కర్నూలుల్లో ఇళ్ల నిర్మాణాలు కూడా చాలావరకూ వివిధ దశల్లో ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, నిరుపేద వర్గాలకు ఆలయ బోర్డులు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీల్లో... మొత్తంగా రాజకీయ నియామకాల్లో యాభై శాతం వాటా ఇచ్చిన తొలి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని... రాజధాని ప్రాంతాన్ని తన వర్గీయుల గేటెడ్ కమ్యూనిటీగా మార్చేయాలనుకున్న చంద్రబాబుతో పోల్చగలమా? అసలు రాష్ట్రంలో ఒకేసారి 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలివ్వటం... వారికి ఇళ్లు నిర్మించుకోవటంలో సహకరించటం చేస్తున్న ప్రభుత్వాన్ని గతంలో ఎన్నడైనా చూశామా? స్వాతంత్య్రంవచ్చి 75 ఏళ్లుగడిచినా.. పేదలకు ఇళ్లు లేని పరిస్థితి ఉందంటే సిగ్గు పడాల్సిన అవసరం లేదా? అలాంటి పరిస్థితిని చక్కదిద్దడానికి పాటుపడుతున్న ప్రభుత్వానికి సహకరించాల్సింది పోయి అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్న పార్టీని ఏమనాలి? మీడియా ముసుగులో ఆ పార్టీకి కొమ్ము కాస్తూ.. పేదల సొంతింటి కలకు అడ్డుపడుతున్న రామోజీరావును, ఆయన తోక మీడియాను ఏమనాలి? ఫిలిం సిటీ పేరిట కోటల్లాంటి సౌధాలు కట్టుకుని కూడా పేదల ఇళ్లకు అడ్డుపడుతున్న ఈ దుష్ట చతుష్టయాన్ని ఏం చేయాలి? రాజధాని ప్రాంతంలో పేదలకు స్థలాలిస్తే ముంబైలోని ధారవి లాంటి మురికి వాడలు తయారవుతాయని వాదించటం దుర్మార్గం కాదా? పేదలకు అమరావతిలో ఇళ్లస్థలాలిస్తే డెమెగ్రఫిక్ ఇన్‌బ్యాలెన్స్ వస్తుందని వాదించటం ఒకరకమైన అంటరాని తనం కాదా? కులవివక్షకు పరాకాష్ట కాదా? ఎన్ని మొట్టికాయలు పడినా ఇంకా వారు ఢిల్లీ స్థాయిలో పోరాటం చేస్తున్నారంటే.. ఇంతకన్నా దారుణం ఏముంది? -
ఇదీ మార్పు అంటే.. వెల్లటూరులో మారిన బతుకు చిత్రం
ఈ ఫొటోలో సొంతింటి ముందు సంతోషంగా సెల్ఫీ తీసుకుంటున్న టి.తిరుపతిస్వామి, వేళంగిణి కుటుంబం ఏడాది క్రితం వరకు బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం వెల్లటూరులో కృష్ణా కెనాల్ పిల్లకాలువ గట్టుపై పూరి గుడిసెలో నివసించింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, చలికి వణుకుతూ దశాబ్దాల పాటు దుర్భర జీవితాన్ని అనుభవించింది. గత ప్రభుత్వంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇంటి స్థలం మంజూరు కాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద వేళంగిణికి ఇంటి స్థలంతో పాటు ఇంటిని కూడా నిర్మించి ఇచ్చింది. దీంతో గత ఏడాది సెప్టెంబర్‌లో ఈ కుటుంబం గృహ ప్రవేశం చేసింది. ‘నా చిన్నప్పటి నుంచి కాలువ గట్టుపై మురికి కూపంలో గుడిసెల్లోనే బతికా. దీపం వెలుతురు మినహా కరెంటు కనెక్షన్ లేదు. వర్షాలు పడితే గుడిసె వరదనీటిలో మునిగిపోయేది. మురికి నీటి కారణంగా దోమలు బెడద తీవ్రంగా ఉండేది. పాములు, తేళ్లు, కీటకాలు గుడిసెలోకి వచ్చేవి. సీఎం జగన్ ప్రభుత్వం మా గోడును ఆలకించింది. మాకంటూ ఓ సొంతిల్లు ఉంది. ఇప్పుడు కంటి నిండా నిద్ర పోతున్నాం’ అని వేళంగిణి కృతజ్ఞతలు తెలిపింది. పాకల్లోకి పందులు.. ఇదే కాలనీలో కంతేటి పైడమ్మకు కూడా ఇల్లు మంజూరైంది. ఆమె కుటుంబం కూడా కొన్ని దశాబ్దాలు కాలువ గట్లపైనే మగ్గింది. ఆ కుటుంబానికి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం సొంత ఇంటిని సమకూర్చింది. ప్రతి నెలా ఒకటో తేదీనే పైడమ్మ ఇంటి వద్దే పెన్షన్ అందుకుంటోంది. మీ బతుకు చిత్రంలో ఎలాంటి మార్పు వచ్చిందని పైడమ్మను ప్రశ్నిస్తే ఆమె కళ్లు చెమర్చాయి. ‘ఒకప్పుడు కాలువ పక్కన జంతువులతో కలిసి జీవించాం. పని కోసం బయటికి వెళితే పందులు మా పాకల్లోకి దూరి వండుకున్న అన్నం తినేసి కకావికలం చేసిన ఘటనలు కోకొల్లలు. ఆ జీవితం పగోడికి కూడా రాకూడదని దేవుడిని కోరుకుంటా. ఎంత కష్టం చేసినా మేం గజం స్థలం కూడా కొనలేం. అలాంటిది ఈ రోజు మాకంటూ సొంతిల్లు ఉందంటే సీఎం జగన్ చలువే’ అని పైడమ్మ చెప్పింది. (వడ్డే బాలశేఖర్ – వెల్లటూరు వైఎస్సార్, జగనన్న కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి): రూ.లక్ష కోట్లు.. 30 లక్షల మందికిపైగా సొంతింటి యోగం! ఇళ్ల స్థలాలు, గృహ నిర్మాణాల కోసం దేశంలోనే తొలిసారిగా భారీ మొత్తంలో వ్యయం చేస్తూ లక్షల మంది అక్క చెల్లెమ్మల ఆకాంక్షలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నెరవేరుస్తోంది. వైఎస్సార్ జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17 వేలకు పైగా ఊర్లను, లక్షల్లో గృహాలను నిర్మిస్తోంది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇప్పటివరకూ రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి (టిడ్కో ఇళ్లతో కలిపి) అనుమతులిచ్చింది. ఇందులో 3.40 లక్షల గృహాల ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. 4.67 లక్షల ఇళ్లు రూఫ్ లెవల్ పై దశలో నిర్మాణంలో ఉన్నాయి. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు చకచకా నీటి సదుపాయం, కరెంట్ కనెక్షన్లను ప్రభుత్వం సమకూరుస్తోంది. రూపాయి ఖర్చు లేకుండా.. అద్దెలు కట్టలేక దశాబ్దాల పాటు కాలువ గట్లపై పాకల్లో మగ్గిపోయిన నిరుపేద కుటుంబాలు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సంతోషంగా జీవిస్తున్నాయి. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా బాపట్ల జిల్లా వెల్లటూరులో రూ.96 లక్షలతో 3.18 ఎకరాలను సేకరించిన రాష్ట్ర ప్రభుత్వం 115 ప్లాట్లు లబ్ధిదారులకు అందించింది. 28 మంది ఎస్సీలు, 85 మంది ఎస్టీలు, ఒక బీసీ కుటుంబానికి ఇళ్ల స్థలాలను కేటాయించింది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున నగదు అందచేసింది. అయితే ప్రభుత్వం స్థలంతోపాటు నిర్మాణానికి బిల్లులు ఇచ్చినప్పటికీ సొంతంగా ఇంటిని నిర్మించుకోలేని దీనస్థితిలో ఈ కుటుంబాలు ఉండటంతో విలేజ్ రీకన్స్ట్రక్షన్ ఆర్గనైజేషన్ (వీఆర్వో) ముందుకొచ్చి చేయూత అందించింది. దీంతో నిరుపేదలు ఒక్క రూపాయి కూడా ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఇళ్లు సిద్ధమయ్యాయి. స్థలాల మంజూరు, నిర్మాణ బిల్లులు, లేఅవుట్లలో రోడ్లు, మంచినీరు, కరెంట్ సరఫరా లాంటి కనీస వసతుల కల్పన కోసం ఈ ఒక్క లేఅవుట్‌కు రూ.7.46 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. నిరుపేదలకు పక్కా ఇంటిని సమకూర్చడం ద్వారా ఒక్కో కుటుంబానికి రూ.6.73 లక్షల మేర లబ్ధి చేకూర్చింది. పేదల ఇళ్ల కోసం వ్యయం ఇలా ► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి రూ.56,102.91 కోట్లు ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు (తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు) ► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో ప్రయోజనం రూ.13,758 కోట్లు అటు ఇల్లు.. ఇటు చదువులు నా భర్త కూలి పనులకు వెళ్తే రోజుకు రూ.500 వరకూ వస్తుంది. పిల్లలతో ఇబ్బంది పడుతూ పూరి గుడిసెల్లోనే జీవించాం. ఇప్పుడు ప్రభుత్వం మాకు పక్కా ఇంటిని సమకూర్చడంతోపాటు నా బిడ్డ చదువుకు కూడా సాయం చేస్తోంది. – జ్యోతి, వైఎస్సార్ జగనన్న కాలనీ, వెల్లటూరు నేను, చెల్లి ఆడుకుంటున్నాం మేం గుడిసెలో ఉన్నప్పుడు చుట్టూ ఎప్పుడు బురదే. దోమలు విపరీతంగా కుట్టేవి. వర్షం పడితే గుడిసెలోకి నీళ్లు వచ్చేవి. పైనుంచి వర్షం కారేది. అమ్మనాన్న నన్ను, చెల్లిని ఒళ్లో పడుకోబెట్టుకునే వాళ్లు. ఇప్పుడు కొత్త ఇంట్లోకి వచ్చాం. ఎంత వర్షం వచ్చినా ఇబ్బంది లేదు. ఇక్కడ అంతా బాగుంది. నేను చెల్లి బాగా ఆడుకోగలుగుతున్నాం. – వెంకట్నాథ్ (జ్యోతి కుమారుడు) తరతరాల దుస్థితికి తెర మా పూర్వీకులు, మేం పూరి గుడిసెల్లోనే పుట్టాం. అక్కడే పెరిగాం. తరతరాలుగా పూరి గుడిసెల్లోనే జీవిస్తున్నాం. మా పిల్లల సగం జీవితం కూడా వాటిల్లోనే గడిచింది. సీఎం జగన్ మా కోసమే ఇళ్ల పథకం తెచ్చినట్లున్నారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇంటి స్థలం, ఇల్లు మంజూరు చేశారు. మాతో పాటు మా ఇద్దరు బిడ్డలకు వేర్వేరుగా మూడు ఇళ్లు వచ్చాయి. – తుమ్మ రాముడు, లక్ష్మి, వైఎస్సార్ జగనన్న కాలనీ, వెల్లటూరు పక్కా ఇల్లు.. పెన్షన్ నా వయసు 60 పైనే ఉంటుంది. ఇన్నేళ్లలో నాకు, నా పిల్లలకు ఓ చిరునామా అంటూ లేదు. సీఎం జగన్ మాలాంటి వాళ్ల గోడును ఆలకించి పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చారు. ఇవాళ మాకు పక్కా ఇల్లు, శాశ్వత చిరునామా ఉంది. – ఇళ్ల సాంమ్రాజ్యం, వైఎస్సార్, జగనన్న కాలనీ, వెల్లటూరు భావి తరానికి విలువైన స్థిరాస్తి పూరిపాకల్లో బతికిన మాకు ఇది కొత్త జీవితమే. మురికి కుంటల్లో మగ్గిపోతున్న మా తలరాతలను సీఎం జగన్ మార్చారు. పెద్దల నుంచి మాకు ఎటువంటి ఆస్తులు రాలేదు. మా పిల్లలకు విలువైన ఈ ఇంటిని ఆస్తిగా అందిస్తాం. – కలగంటు జ్యోతి, వైఎస్సార్, జగనన్న కాలనీ, వెల్లటూరు -
‘ఇంటి’పైనా అక్కసేనా రామోజీ!?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోనే కాదు, దేశ చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో 30 లక్షలకు పైగా పక్కా ఇళ్ల నిర్మాణం చేపడుతూ నిరుపేదల సొంతింటి కలను సీఎం జగన్ సాకారం చేస్తున్నారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద రూ.56,103 కోట్లు ఖర్చుచేసి 71,811 ఎకరాల్లో 30 లక్షలకు పైగా పేద మహిళలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఇలా వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా 17,005 కొత్త ఊళ్లను నిర్మిస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కో లబ్ధిదారునికి పక్కా ఇంటి రూపంలో రూ.10 లక్షల మేర స్థిరాస్తి సమకూరుతోంది. దీంతో చంద్రబాబుకు రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారింది. ఈ క్రమంలో ఏదో రకంగా బాబుకు మేలు చేయాలని నిశ్చయించుకున్న ఈనాడు రామోజీరావు పేదలకు ప్రభుత్వం చేస్తున్న మంచిపై బురదజల్లడమే పనిగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా.. పేదలందరికీ ఇళ్ల పథకంపై పనిగట్టుకుని నిత్యం విష ప్రచారం చేస్తున్నారు. తాజాగా శుక్రవారం ‘ఇవేం కాలనీలు జగనన్నా?’ అంటూ ఈనాడులో ఓ కథనం ప్రచురించారు. చిరుజల్లులు కురిసినా కాలనీలు జలమయం అవుతున్నాయంటూ అడ్డగోలుగా రాసుకొచ్చారు. ఈ క్రమంలో రామోజీ విష ప్రచారం వెనుక వాస్తవాలివీ.. ఈనాడు : కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గొడవర్రు జగనన్న కాలనీ జలమయం అయింది. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులు అవస్థలు పడుతున్నారు. వాస్తవం : గత కొద్దిరోజులుగా రాష్ట్రంలో ఎడతెగని వర్షాలు కురుస్తున్నాయి. ఇదే క్రమంలో ఈనెల మూడో తేదీన రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం కురిసిన ప్రాంతాల్లో కంకిపాడు మండలం కూడా ఒకటి. లోతట్టు ప్రాంతాల్లో నీరు ఆగడం సర్వసాధారణం. అలాంటిది కంకిపాడు మండలంలోని లేఅవుట్లో నీరు ఆగిందంటూ ఈనాడు గుండెలు బాదుకుంది. అయితే, ఈ లేఅవుట్లో ఇప్పటికే 50 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 254 ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. నాడు కళ్లకు గంతలు పేదలకు పెద్దఎత్తున మేలు జరుగుతుంటే దానిపైనా నేడు రామోజీరావు దుష్ప్రచారం చేస్తున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చిన్నపాటి వర్షానికే సంద్రాన్ని తలపించే లోతట్టు ప్రాంతంలోనే చంద్రబాబు రాజధాని తలపెట్టారు. అదే విధంగా రూ. వందల కోట్లు ఖర్చుచేసి నిర్మించిన తాత్కాలిక సచివాలయంలో ధారగా వర్షం కారిన విషయం అందరికీ తెలిసిందే. అయితే, సీఎం తమవాడన్న కారణంతో రామోజీకి అప్పట్లో అవేమీ కనపడలేదు. కళ్లుండి కబోది అయ్యారు. కానీ, నేడు అవన్నీ మర్చిపోయి గోరంతను కొండంతగా చూపి విషం కక్కుతున్నారు. నిజానికి.. తేలికపాటి వర్షాలకే ముంబై, చెన్నై, హైదరాబాద్ వంటి మహానగరాలు జలమయమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అలాంటిది సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం పడిన రోజుల్లో లేఅవుట్లలో నీరు నిలిచిందని రామోజీ రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. గృహ యజ్ఞంపై దుష్ప్రచారం ఇక పేదలందరికీ ఇళ్ల పథకంపై తరచూ విషపు రాతలు రాయడం రామోజీ దుష్ప్రచారంలో భాగమే. ఈ పథకం కింద ఇళ్ల పట్టాల పంపిణీకి రూ.56,102.91 కోట్లు, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం మరో రూ.36,026 కోట్లు.. లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లు చొప్పున ప్రభుత్వం ఖర్చుచేస్తూ సీఎం జగన్ గృహ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నారు. ఈనాడు : కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుతాపురత్రయం గ్రామంలోని లేఅవుట్లో చిన్నపాటి వర్షానికి నీళ్లు నిలిచాయి. చెరువును తలపిస్తోంది. వాస్తవం : శుక్రవారం ఉదయం ఈ లేఅవుట్లో సాధారణ పరిస్థితి నెలకొంది. చెరువును తలపించేలా వర్షపునీరు లేదు. ఈ లేఅవుట్లో ఇప్పటికే 47 ఇళ్లు పూర్తయ్యాయి. మరో 115 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయి. మొత్తంగా 234 ఇళ్లు ఈ లేఅవుట్లో నిర్మిస్తున్నారు. ఈనాడు : కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం చినవలసల లేఅవుట్‌లోనూ వర్షానికి నీళ్లు ఆగాయి. వాస్తవం : గడిచిన నాలుగు రోజులుగా ఈ మండలంలో వర్షాలు కురుస్తున్నాయి. ఈ నెల రెండో తేదీన తాళ్లరేవు మండలంలో 91 మి.మీ వర్షపాతం నమోదైంది. ఈ నెల ఒకటో తేదీ నుంచి నాలుగో తేదీ మధ్య ఈ మండలంలో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. ఈ లేఅవుట్లో కూడా 30 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. మరో 36 ఇళ్లు నిర్మాణ దశల్లో ఉండగా, 103 ఇళ్లు నిర్మించాల్సి ఉంది. -
పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాల పంపిణీ మంచి పరిణామం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని పేదలకు పక్కా గృహాల కల్పనలో భాగంగా ప్రభుత్వమే పెద్ద ఎత్తున ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం మంచి పరిణామమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖలోని గ్రామీణ గృహ నిర్మాణ డైరెక్టర్(రూరల్ హౌసింగ్) శైలేష్‌కుమార్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు పట్ల శైలేష్‌కుమార్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన–గ్రామీణ్(పీఎంఏవై–గ్రామీణ్) పురోగతిని పరిశీలించడంలో భాగంగా సోమవారం రాష్ట్రానికి వచ్చిన శైలేష్‌కుమార్ విజయవాడలోని గృహ నిర్మాణ సంస్థ ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీతో పాటు, ఇంటి నిర్మాణానికి ఉచితంగా ఇసుక, సబ్సిడీపై నిర్మాణ సామగ్రి, పావలా వడ్డీకి రూ.35 వేలు సాయం వంటి ప్రభుత్వం చేపడుతున్న చర్యలను ప్రశంసించారు. పీఎంఏవై–గ్రామీణ్ కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాలను సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలని చెప్పారు. పథకం అమల్లో గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది కీలక పాత్ర పోషిస్తున్నారని గృహ నిర్మాణ సంస్థ ఎండీ లక్ష్మిషా చెప్పడంతో సచివాలయాల వ్యవస్థ గురించి శైలేష్‌కుమార్ అడిగి తెలుసుకున్నారు. జేఎండీ ఎం.శివప్రసాద్, చీఫ్ ఇంజినీర్ జీవీ ప్రసాద్, ఎస్ఈలు జయరామాచారి, నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
నాణ్యతలో రాజీవద్దు
పేదలందరికీ ఇళ్లు పథకానికి మనందరి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. లే అవుట్లలో మౌలిక సదుపాయాల కల్పన అనంతరం వాటి నిర్వహణ విషయంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలక పాత్ర పోషించాలి. ఈ మేరకు భవిష్యత్ ప్రణాళిక ఉండాలి. కోర్టు కేసుల కారణంగా పలువురు లబ్ధిదారులకు ప్రత్యామ్నాయ స్థలాలను కేటాయించాలని నిర్ణయించాం. ఈ క్రమంలో భూసేకరణకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. - సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: సొంత ఇల్లు అనేది పేదల చిరకాల స్వప్నం అని, ఈ క్రమంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల్లో ఏ చిన్న లోపానికి కూడా తావు ఇవ్వద్దని గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. లే అవుట్లలో ఏర్పాటు చేసిన ల్యాబ్‌లను వినియోగించుకుని ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ, ప్రతి పేద కుటుంబానికి అత్యంత నాణ్యమైన ఇంటిని అందించాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ఆయన గృహ నిర్మాణ శాఖపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పేదల ఇళ్ల నిర్మాణ పురోగతిని అధికారులు సీఎంకు వివరించారు. వర్షాలు పూర్తిగా తగ్గి, వాతావరణం అనుకూలిస్తుండటంతో గత డిసెంబర్ నుంచి ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతోందని తెలిపారు. నిర్మాణంలో నాణ్యత లోపించకుండా తీసుకున్న చర్యలను వివరించారు. నాణ్యతను పరీక్షించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా 36 ల్యాబ్‌లు ఏర్పాటు చేశామని చెప్పారు. ఇప్పటి వరకు మెటల్ నాణ్యతపై 285 పరీక్షలు.. సిమెంటుపై 34, స్టీలుపై 84, ఇటుకలపై 95 పరీక్షలు నిర్వహించామని తెలిపారు. ఇంటి నిర్మాణం పూర్తయిన 15 రోజుల్లోగా విద్యుత్ కనెక్షన్ ఇస్తున్నట్టు ట్రాన్స్‌కో అధికారులు వివరించారు. కోర్టు కేసుల కారణంగా ప్రకాశం, అనంతపురం జిల్లాల్లోని రెండు లేఅవుట్లకు బదులుగా ప్రత్యామ్నాయ భూములను ఎంపిక చేశామన్నారు. సుమారు 30 వేల మందికి త్వరలోనే పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఇళ్ల నిర్మాణం కోసం జనవరి ఆఖరు నాటికి రూ.7,630 కోట్లు ఖర్చు చేశామన్నారు. మొత్తంగా ఈ పథకం మొదలు పెట్టినప్పటి నుంచి రూ.13,780 కోట్లు ఖర్చు పెట్టామని చెప్పారు. ఇప్పటి వరకు సుమారు 2.75 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేశామని, మరో 74 వేల ఇళ్లకు స్లాబ్ వేసే పనులు కొనసాగుతున్నాయని, ఇంకో 79 వేల ఇళ్లు రూఫ్ లెవెల్లో ఉన్నాయన్నారు. మార్చి నాటికి సుమారు 5 లక్షల ఇళ్లు పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. లే అవుట్లలో ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతున్న కొద్దీ మౌలిక సదుపాయాలను ప్రాధాన్యతా క్రమంలో ఏర్పాటు చేసుకుంటూ ముందుకు వెళ్లాలని సూచించారు. నిర్మాణం పూర్తయిన ఇళ్లకు కరెంట్, నీటి కనెక్షన్లు వెంటనే ఇవ్వాలని, క్షేత్ర స్థాయిలో పనిచేసే సిబ్బంది.. లబ్ధిదారులతో ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని ఆదేశించారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ఉన్నత స్థాయి సమీక్షలో మాట్లాడుతున్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ ప్రభుత్వం చేయని విధంగా సాయం ► పేదల సొంతింటి కలను సాకారం చేయడం కోసం చరిత్రలో ఏ ప్రభుత్వం చేయని విధంగా మనం చర్యలు తీసుకున్నాం. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల’ పథకం కింద ప్రభుత్వం ఇప్పటి వరకు చేసిన ఖర్చును ఓసారి పరిశీలిస్తే.. ఇళ్ల నిర్మాణం కోసం ఉచితంగా ఇసుక పంపిణీ, తక్కువ ఖరీదుకే సామగ్రిని అందించడం రూపంలో ప్రభుత్వం రూ.13,780 కోట్లు ఖర్చు చేసింది. ► ఇళ్ల నిర్మాణ పనులు మొదలు పెట్టడానికి కాలనీల్లో అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.3,117 కోట్లు ఖర్చు చేశాం. వైఎస్సార్, జగనన్న కాలనీల్లో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, రహదారులు తదితర సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు వెచ్చిస్తున్నాం. అంటే కేవలం జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసమే రూ.36,026 కోట్ల మేర ఖర్చు చేస్తున్నాం. ► పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీ కోసం రూ.17,132.78 కోట్ల విలువ చేసే 28,554.64 ఎకరాల ప్రభుత్వ భూములు తీసుకున్నాం. రూ.15,364.5 కోట్ల విలువ చేసే 25,374.66 ఎకరాల భూములను కొనుగోలు చేశాం. విశాఖలో పేదలకు పంపిణీ చేసిన భూముల విలువ రూ.12,405 కోట్లు. ఇళ్ల పట్టాల కోసం ఇచ్చిన ఇతర భూములు 13,425.14 ఎకరాలు. వీటి విలువ రూ.11,200.62 కోట్లు. ఇలా మొత్తంగా అన్ని రకాలుగా ఇళ్ల పట్టాల కోసం పేదలకు పంచిన భూములు 71,811.49 ఎకరాలు కాగా, వీటి విలువ రూ.56,102.91 కోట్లు. ఇలా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కోసం మన ప్రభుత్వం రూ.1,05,908.91 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. గణనీయమైన సహాయం ► మరోవైపు టిడ్కో ఇళ్ల లబ్ధిదారులకు మన ప్రభుత్వం గణనీయమైన సహాయం చేస్తోంది. గత మూడున్నరేళ్లలో ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పన, 300 చదరపు అడుగుల ఇళ్లు ఉచితంగా అందించడం, మిగిలిన కేటగిరీల లబ్ధిదారులకు తమవంతుగా చెల్లించిన వాటిపై సబ్సిడీ ఇవ్వడంతో పాటు, ఉచితంగా రిజిస్ట్రేషన్ల రూపంలో అండగా నిలిచాం. ► టిడ్కో ఇళ్ల కోసం గత ప్రభుత్వం ఐదేళ్లలో చేసిన ఖర్చు రూ.8,015 కోట్లు. మన ప్రభుత్వం చేసిన ఖర్చు, పేదలకు కల్పించిన ప్రయోజనాల విలువ చూస్తే మొత్తంగా రూ.20,755 కోట్లు. టిడ్కో ఇళ్ల నిర్మాణ ఖర్చు, మౌలిక సదుపాయాల కోసం ఈ మూడున్నరేళ్లలో రూ.8,734 కోట్లు ఖర్చు పెట్టాం. దీంతో పాటు 300 చదరపు అడుగుల ఇళ్లను ఉచితంగా ఇవ్వడం ద్వారా దాదాపు రూ.10,339 కోట్ల లబ్ధి చేకూర్చాం. 300 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు తమ వంతుగా చెల్లించాల్సిన మొత్తాన్ని పూర్తిగా మాఫీ చేసి వారికి ఎంతో ఉపశమనం కలిగించాం. ► మిగిలిన వారికీ ఊరట కల్పించే చర్యల్లో భాగంగా 365, 430 చదరపు అడుగుల ఇళ్ల లబ్ధిదారులు తమ వంతుగా చెల్లించాల్సిన డబ్బులో కల్పించిన సబ్సిడీ కారణంగా రూ.482 కోట్ల మేర మేలు చేకూర్చాం. రిజిస్ట్రేషన్ చార్జీలను కూడా తొలగించి ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేయించడం ద్వారా మరో రూ.1,200 కోట్ల భారాన్ని ప్రభుత్వం భరిస్తోంది. ► ఈ సమీక్షలో గృహ నిర్మాణ, మున్సిపల్ శాఖ మంత్రులు జోగి రమేశ్, ఆదిమూలపు సురేశ్, హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దవులూరి దొరబాబు, టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, సీఎస్ డాక్టర్ జవహర్ రెడ్డి, మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి మహమ్మద్ దివాన్ మైదిన్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ లక్ష్మీషా, జేఎండీ శివప్రసాద్, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్ పాల్గొన్నారు. -
Fact Check: లక్షణంగా ఇళ్ల నిర్మాణం.. కానీ, దుష్ట చతుష్టయం మాత్రం!
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గత మూడున్నరేళ్లలో పట్టణాల్లో 15.6 లక్షలు, గ్రామీణ ప్రాంతాల్లో 1.79 లక్షలకుపైగా గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. వీటిలో 15 లక్షలకు పైగా ఇళ్లకు శంకుస్థాపనలు చేయగా సుమారు 1.80 లక్షలకు పైగా గృహ నిర్మాణాలు పూర్తయ్యాయి. మిగిలినవి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. ఇలా లక్షల సంఖ్యలో ఇళ్లతో ఏకంగా కొత్త ఊళ్లనే ప్రభుత్వం నిర్మిస్తుంటే దుష్ట చతుష్టయం మాత్రం యథాప్రకారం బురద చల్లుతోంది. దున్న ఈనిందంటే.. పార్లమెంట్ సమావేశాల సందర్భంగా 2019–20 నుంచి 2021–22 మధ్య ప్రధాని ఆవాస్ యోజన –గ్రామీణ్(పీఎంఏవై–జీ) కింద ఎన్ని ఇళ్లు నిర్మించారని లోక్‌సభలో పలువురు ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర గృహ నిర్మాణ శాఖ స్పందించి రాష్ట్రాల వారీగా నివేదికను అందించింది. ఏపీలో 2019–20 నుంచి 2021–22 మధ్య ఐదు ఇళ్లు నిర్మించారని అందులో పేర్కొంది. దీంతో దున్నపోతు ఈనిందంటే గాటికి కట్టెయ్ అన్న చందంగా మూడున్నరేళ్లలో సీఎం జగన్ ప్రభుత్వం కేవలం ఐదు ఇళ్లనే నిర్మించిందంటూ టీడీపీ నాయకులు, ఆ పార్టీ సోషల్ మీడియా విభాగం, దుష్ట చతుష్టయం దుష్ఫ్రచారానికి దిగాయి. ఆ ఐదు ఇళ్లు 2016–18 నాటివే 2019–20 నుంచి 2021–22 మధ్య రాష్ట్రంలో పీఎంఏవై–జీ కింద నిర్మించిన ఐదు ఇళ్లు 2016–17, 2017–18లో మంజూరైనవే కావడం గమనార్హం. నాడు 1.23 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు లభించగా టీడీపీ ప్రభుత్వం 68 వేల ఇళ్ల నిర్మాణాలు మాత్రమే ప్రారంభించింది. అయితే ఇందులో 46 వేల ఇళ్లు మాత్రమే పూర్తయ్యాయి. అప్పట్లో మంజూరై నిర్మాణం ఆలస్యం అయిన ఐదు ఇళ్లు 2019 – 2022 మధ్య పూర్తయ్యాయి. ఇదే అంశాన్ని కేంద్రం పార్లమెంట్‌కు వెల్లడించింది. ఇదీ అసలు సంగతి.. 2019–20, 2020–21 మధ్య కేంద్ర ప్రభుత్వం పీఎంఏవై–జీ కింద రాష్ట్రంలో ఇళ్ల నిర్మాణానికి ఎలాంటి అనుమతులివ్వలేదు. 2021–22లో మాత్రం 1,79,060 ఇళ్లను రాష్ట్రానికి మంజూరు చేసింది. ఈ క్రమంలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల చొప్పున కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 31న జీవో ఎంఎస్ నెంబర్–2 విడుదల చేసింది. ఇళ్ల పథకం రెండో దశను ఈ ఏడాది ఏప్రిల్ 28వ తేదీన సీఎం జగన్ ప్రారంభించారు. 2024 మార్చి నాటికి 1.79 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. గత ఏడు నెలల్లో 67 వేల ఇళ్లకు శంకుస్థాపనలు పూర్తై వివిధ దశల్లో నిర్మాణాలు కొనసాగుతున్నాయి. -
పేదల ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు టాప్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద నిరుపేదల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా ఉత్తమ పనితీరుతో రాష్ట్రంలోనే తొలినుంచి మొదటి స్థానంలో నిలుస్తోంది. ఈ జిల్లాలో 73,496 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇప్పటివరకు 63,517 ఇళ్లకు శంకుస్థాపన చేశారు. ఇందులో 52,386 ఇళ్లు (82 శాతం) పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. శంకుస్థాపన చేసిన 67,437 ఇళ్లలో 42,964 (64 శాతం) ఇళ్లు, 70,221 ఇళ్లలో 42,554 (61 శాతం) ఇళ్లు పునాది, ఆపై దశల నిర్మాణంతో అన్నమయ్య, విజయనగరం జిల్లాలు రెండు, మూడుస్థానాల్లో ఉన్నాయి. విశాఖ జిల్లాలో 1.35 లక్షల ఇళ్లకు ప్రభుత్వం అనుమతులు జారీచేసింది. వీటిలో 63,389 ఇళ్లకు శంకుస్థాపన చేయగా 9,043 ఇళ్లు పునాది, ఆపై దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. దీంతో ఈ జిల్లా ప్రస్తుతం ఇళ్ల నిర్మాణంలో చివరిస్థానంలో ఉంది. న్యాయపరమైన చిక్కులు వీడటంతో విశాఖపట్నం కార్పొరేషన్ పరిధిలో నిర్మిస్తున్న 1.24 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఈ ఏడాదిలోనే అనుమతులు లభించాయి. ఈ ఇళ్ల నిర్మాణాలు ఇటీవల ప్రారంభం కావడం విశాఖ చివరిస్థానంలో ఉండటానికి ప్రధాన కారణం. పుంజుకున్న నిర్మాణాలు రాష్ట్రవ్యాప్తంగా ఇటీవల కురిసిన భారీవర్షాల ప్రభావం ఇళ్ల నిర్మాణంపై పడింది. ప్రస్తుతం వర్షాలు తగ్గుముఖం పట్టి, వాతావరణం కూడా సహకరిస్తుండటంతో ఇళ్ల నిర్మాణాలు పుంజుకున్నాయి. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వం రెండుదశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఇందులో 2.62 లక్షలు టిడ్కో ఇళ్లు. మిగిలిన 18.63 లక్షల ఇళ్లకుగాను 15.15 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. వీటిలో 8.70 లక్షల ఇళ్లు పునాది ముందుదశలో, 2.85 లక్షల ఇళ్లు పునాది, 73,622 ఇళ్లు రూఫ్ లెవల్, 1.05 లక్షల ఇళ్లు ఆర్సీ దశలో నిర్మాణంలో ఉన్నాయి. 1,79,263 ఇళ్ల నిర్మాణం ఇప్పటికే పూర్తయింది. ఇందులో 95 వేలకుపైగా ఇళ్లకు కనీస మౌలిక సదుపాయాలు కరెంటు, నీటిసరఫరా కనెక్షన్లు ఇప్పటికే ఇచ్చారు. మిగిలిన ఇళ్లకు ఇస్తున్నారు. హౌసింగ్ డే రోజు సచివాలయ సిబ్బంది నుంచి కలెక్టర్ వరకు లేఅవుట్ల సందర్శన పేదల ఇళ్ల నిర్మాణంపై ప్రభుత్వం తొలినుంచి ప్రత్యేకదృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రతి శనివారాన్ని హౌసింగ్ డేగా పరిగణిస్తోంది. ఈ క్రమంలో శనివారం కలెక్టర్లు, జేసీలు, డివిజన్, మండలస్థాయి అధికారులు, సచివాలయాల సిబ్బంది లేఅవుట్లను సందర్శిస్తున్నారు. అధికారులు తాము లేఅవుట్లను సందర్శించిన ఫొటోలను గృహనిర్మాణ సంస్థ రూపొందించిన హౌసింగ్ డే యాప్‌లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లేఅవుట్లలో తమదృష్టికి వచ్చిన సమస్యలు, ఇబ్బందులను యాప్ ద్వారా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకొచ్చే అవకాశం కల్పించారు. ఆన్లైన్లో వచ్చిన సమస్యలు, ఇబ్బందులను ఎప్పటికప్పుడు పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 19న 961 లేఅవుట్లను 5,548 మంది మండల స్థాయి అధికారులు, 3,051 మంది సచివాలయాల స్థాయి అధికారులు సందర్శించారు. రోజువారీ లక్ష్యాలు ఇస్తున్నాం ఇళ్ల నిర్మాణాలు మరింత వేగంగా చేపట్టడానికి చర్యలు తీసుకుంటున్నాం. జిల్లాల వారీగా రోజువారీ లక్ష్యాలను ఇస్తున్నాం. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేకదృష్టి పెడుతున్నాం. స్వయంగా ఆయా జిల్లాలకు రాష్ట్రస్థాయి అధికారులం వెళ్లి నిర్మాణాలు ఆలస్యం అవడానికి కారణమైన సమస్యల్ని తెలుసుకుని వాటిని పరిష్కరిస్తున్నాం. హౌసింగ్ డే రోజున పథకంతో ముడిపడి ఉన్న అధికారులు రెండు లేఅవుట్లు సందర్శించాల్సి ఉంటుంది. లేఅవుట్లో సందర్శించినట్టుగా ఫొటోలను హౌసింగ్ డే యాప్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించాం. – అజయ్‌జైన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, గృహనిర్మాణ శాఖ -
నిర్దేశించిన గడువులోగా ఇళ్ల నిర్మాణం
సాక్షి, అమరావతి: నిర్దేశించుకున్న సమయంలోగా ఇళ్ల నిర్మాణం పూర్తి కావాలని, ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో గూడు లేని లక్షలాది మంది నిరుపేదలకు గృహ యోగం కల్పించాలనే గొప్ప సంకల్పంతో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ఈ పథకంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా రెండు దశల్లో ఇప్పటి వరకు 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు ఇవ్వగా, 17.77 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేసినట్టు అధికారులు ఈ సందర్భంగా సీఎంకు వివరించారు. ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోందన్నారు. వైఎస్సార్– జగనన్న కాలనీల్లో విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ వసతుల కల్పనకు ఇప్పటికే డీపీఆర్‌లు సిద్ధం చేశామని చెప్పారు. ఈ సమీక్షలో సీఎం జగన్ ఏమన్నారంటే.. నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి ► ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ పథకం కోసం రూ.5,655 కోట్లు ఖర్చు చేశాం. ఇళ్ల నిర్మాణ ప్రగతిపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలి. సమీక్షించాలి. లేఅవుట్లలో పర్యటించాలి. ఇలా చేయడం ద్వారా మరింత వేగంగా నిర్మాణాలు చేపట్టడానికి చర్యలు తీసుకోవచ్చు. ► లేఅవుట్లను సందర్శించినట్టుగా అధికారులు ఫొటోలను హౌసింగ్ యాప్‌లో అప్లోడ్ చేయాలి. ప్రతి శనివారం హౌసింగ్ డే గా నిర్వహిస్తున్నారు. ఈ ఒరవడిని అలాగే కొనసాగించాలి. వీలైనంత ఎక్కువ సమయాన్ని కేటాయించాలి. హౌసింగ్ డే రోజున తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ లేఅవుట్లకు వెళ్లాలి. వీటితో పాటు పేదలకు ప్రభుత్వమే నిర్మించి ఇస్తున్న ఆప్షన్–3 ఇళ్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టండి. నాణ్యతలో రాజీపడొద్దు ► ఇళ్ల నిర్మాణ నాణ్యతలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దు. ప్రతి దశలోనూ నాణ్యత నిర్ధారణ పరీక్షలు చేపట్టండి. నాణ్యత ప్రమాణాలపై స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) పాటిస్తూ ముందుకు వెళ్లండి. వార్డు, గ్రామ సచివాలయాల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్ అసిస్టెంట్ సేవలను గృహ నిర్మాణ పథకం కోసం విస్తృతంగా వాడుకోవాలి. నాణ్యత ప్రమాణాలు పాటించే అంశంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ భాగస్వామ్యం ఉండాలి. ► లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సమయానికి విద్యుత్, తాగునీరు, డ్రైనేజీ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలి. అనంతరం మిగిలిన మౌలిక సదుపాయాలను కల్పిస్తూ ముందుకు వెళ్లాలి. ఈ క్రమంలో లేఅవుట్ల వారీగా ప్రాధాన్యత పనులు గుర్తించండి. వాటిని నిర్దేశిత సమయంలోగా పూర్తి చేయండి. ► ఈ సమీక్షలో గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేశ్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై. శ్రీలక్ష్మి, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, ఏపీ టిడ్కో ఎండీ శ్రీధర్, ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణ, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ కార్యదర్శి ఇంతియాజ్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక కార్యదర్శి రాహుల్ పాండే, గృహ నిర్మాణ సంస్థ జేఎండీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దేశ చరిత్రలోనే ‘గృహ’త్తర అధ్యాయం
పాత గుంటూరు: గతంలో ఇంటి స్థలం కావాలంటే రోజుల తరబడి పోరాడాల్సి వచ్చేదని, సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు చేపట్టాక ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయిందని మేధావులు, ప్రజా సంఘాల నేతలు అభిప్రాయపడ్డారు. ‘పేదల ఇళ్లు – రాజకీయ సవాళ్లు’ అంశంపై మేధావులు, ప్రజా సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో గురువారం గుంటూరులోని ఎన్జీవో హాల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు జి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. పేదల ఇళ్లపై రాజకీయం చేస్తున్న పలు పార్టీల వైఖరిని ఎండగట్టారు. విపక్షాల రాద్ధాంతం తగదు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీకి కట్టుబడి అర్హులందరికీ ఇళ్లు కట్టించి ఇస్తుండటం గొప్ప విషయం. విపక్షాలు విజ్ఞత కోల్పోయి విమర్శలు చేయడం తగదు. – ఆచార్య డీఏఆర్ సుబ్రహ్మణ్యం, మహాత్మా గాంధీ కళాశాల వ్యవస్థాపకుడు బాబు, పవన్ రాజకీయాలకు తగరు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ ఆలోచనా విధానాన్ని సీఎం వైఎస్ జగన్ ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు. నా దృష్టిలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరూ రాజకీయ నేతలే కారు. ప్రజల బాధలు పట్టనోళ్లు రాజకీయాలకు తగరు. – ఆచార్య గురవయ్య, ఏసీ న్యాయ కళాశాల ప్రిన్సిపాల్ ఇది స్వర్ణయుగం గుప్తుల స్వర్ణ యుగం గురించి మనం పుస్తకాలలో చదువుకున్నాం. ఇప్పుడు సీఎం వైఎస్ జగన్ పాలనలో దానిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. అందరికీ ఇళ్లు ఇవ్వడం అనేది అతిపెద్ద యజ్ఞం. – చక్రపాణి, విశ్రాంత ఎస్పీ పేదల ఇళ్లు – పవర్‌స్టార్ కన్నీళ్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇళ్లను మహిళల పేరిట రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వడం మహిళా సాధికారతకు నిదర్శనం. పేదల ఇళ్లు–పవర్ స్టార్ కన్నీళ్లు అనే నినాదంతో మహిళలంతా ఉద్యమిస్తే కానీ వాళ్లకు బుద్ధి రాదు. – మంజుల, సీనియర్ న్యాయవాది, సామాజిక కార్యకర్త సీఎం నిజమైన ప్రజా పాలకుడు ఏకంగా 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇవ్వడమే కాకుండా ఇళ్లు కట్టించి ఇచ్చే బృహత్తర కార్యక్రమానికి సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టడం గొప్ప విషయం. జగనే నిజమైన ప్రజా పరిపాలకుడు. – గోళ్లమూడి రాజసుందరబాబు, ఐద్వా వ్యవస్థాపకులు రాజకీయాలకు అతీతంగా హర్షిద్దాం గతంలో ఇళ్ల స్థలాలు కావాలంటే రోజుల తరబడి ఆందోళన చేయాల్సి వచ్చేది. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పేదలందరికీ ఇళ్లు కట్టించి ఇస్తున్నారు. రాజకీయాలకు అతీతంగా ఇది అందరూ హర్షించదగ్గ అంశం. – జి.శ్రీనివాస్, ఆంధ్ర రాష్ట్ర ప్రజా పార్టీ వ్యవస్థాపకుడు గొప్ప విషయం ప్రజలకు ఇళ్ల స్థలాల కోసం ప్రభుత్వం 71,811 ఎకరాల భూమి సేకరించింది. నిరుపేదల ఇళ్ల కోసం మొత్తం 25 వేల ఎకరాల భూమిని కొనుగోలు చేసింది. రూ.11 వేల కోట్లు ఖర్చు చేసింది. ఇది వాస్తవం. – పరిశపోగు శ్రీనివాసరావు, నవ్యాంధ్ర ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు పవన్ ఆందోళన హాస్యాస్పదం జగనన్న ఇళ్లపై పవన్ కళ్యాణ్ ఆందోళన హాస్యాస్పదం. జగనన్న ఇళ్లు – జనసేనాని కన్నీళ్లు అని కార్యక్రమం పేరు మార్చితే బాగుంటుంది. – భగవాన్ దాస్, రాష్ట్ర విద్యార్థి ఉద్యమ నేత గూడు చెదరగొట్టే కుట్ర అంబేడ్కర్ ఆశయాలకు అనుగుణంగా పేదలకు ముఖ్యమంత్రి జగన్ కల్పిస్తున్న గూడు చెదర గొట్టేందుకు రాష్ట్రంలో ఒక పెద్ద కుట్ర జరుగుతోంది. దీన్ని తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది. – తిప్పాబత్తుని గోవింద్, ఎస్సీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇది సరికొత్త చరిత్ర తాడి తన్నేవాడి తల తన్నేవాడే జగన్. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఎన్ని ఎత్తులు వేసినా.. వాటికి పైఎత్తు వేసి చిత్తు చేయగల సమర్థుడు. ఇళ్ల నిర్మాణం ద్వారా సరికొత్త చరిత్ర సృష్టించారు. – వేముల భారతి, అస్మిత మహిళా మండలి అధ్యక్షురాలు పవన్‌కొచ్చిన నొప్పేంటి? సొంత ఇంటి కోసం ఎన్నో ఇక్కట్లు పడ్డాం. సీఎం జగన్ పుణ్యాన ఇప్పుడు సొంతింటిలో దర్జాగా ఉంటున్నాం. మాలాంటోళ్లకు జగనన్న ఇళ్లు ఇస్తే మీకొచ్చిన నొప్పేమిటి? – రత్నకుమారి, ఇంటి లబ్ధిదారురాలు -
రచ్చ కోసం 'ఇంటి' బాట
సాక్షి, అమరావతి: పేదలు కోరుకునేది తినటానికి గుప్పెడు మెతుకులు, తలదాచుకోవటానికి ఓ గూడు! వీటిని సమకూర్చాల్సిన బాధ్యత ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలదే. మరి ప్రజాస్వామ్యయుతంగా దీన్ని చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ దేశంలోనే తొలిసారిగా 31 లక్షల మందికిపైగా పేదలకు ఇళ్ల స్థలాలిచ్చి గృహాలను కూడా నిర్మించి ఇస్తున్న ప్రభుత్వంపై రాళ్లేస్తున్న వారిని ఏమనాలి? పేదల కన్నీళ్లు తుడుస్తామంటూ మొసలి కన్నీళ్లు కారుస్తూ బయల్దేరిన వారికి ఎలా బుద్ధి చెప్పాలి? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు 1996–2004, 2014–19 మధ్య సీఎంగా ఉన్నారు. ఆయన హయాంలో ఏనాడూ నిరుపేదలకు సెంటు స్థలం ఇచ్చిన దాఖలాలు లేవు. పారదర్శకంగా ఇళ్లను మంజూరు చేసిందీ లేదు. అయినాసరే ఈనాడు రామోజీరావుకు అంతా ‘పచ్చ’గానే కనిపించింది. గూడు లేక నిరుపేదలు పడుతున్న ఇక్కట్లు ఆయన కంటికి కానరాలేదు. వారి మొర వినపడలేదు. 2014లో వచ్చిన జనసేనానిది కూడా ఇదే వైఖరి. చంద్రబాబుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే లక్ష్యంగా వీరు పని చేస్తారు. ప్రజలకు ఎనలేని మేలు చేకూర్చే సంక్షేమ కార్యక్రమాలపైనా బురద జల్లేందుకు వెనుకాడరు. లక్షల మంది పేద ప్రజల సొంతింటి కలను సాకారం చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం పట్ల ఈనాడు రామోజీ, ఇతర పచ్చమీడియా, దత్తపుత్రుడి వైఖరి చూస్తుంటే’ ఇదే నిజమని మరోసారి రుజువవుతోంది. రూ.మూడు లక్షల కోట్ల సంపద సృష్టి రాష్ట్ర ప్రభుత్వం పేదల ఇళ్ల పథకం కింద 30.25 లక్షల మంది అక్క చెల్లెమ్మలకు విలువైన ప్రాంతాల్లో స్థలాలు పంపిణీ చేసింది. 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాలు పంపిణీకి రూ.56,102.91 కోట్లు ఖర్చు చేసింది. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపు ద్వారా 17 వేల వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా ఊళ్లనే నిర్మిస్తోంది. ఒక్కో ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు చొప్పున చెల్లిస్తోంది. పేదలపై ఇంకా అదనపు భారం పడకూడదని, బయట అప్పులు చేసి వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ఇంటికి రూ.35 వేల చొప్పున బ్యాంకు రుణాన్ని పావలా వడ్డీకే సమకూరుస్తోంది. మరోవైపు ఉచితంగా ఇసుక, మార్కెట్ ధరల కన్నా తక్కువ రేటుకు సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రిని సరఫరా చేస్తోంది. సబ్సిడీపై సామగ్రి సరఫరా, ఇతర రాయితీల ద్వారా రూ.13,758 కోట్ల మేర పేదలకు లబ్ధి చేకూరుస్తోంది. కేవలం ఇళ్లు నిర్మించడమే కాకుండా కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు పెద్దపీట వేసింది. కరెంట్, నీరు లాంటి కనీస వసతుల కోసం రూ.3,117 కోట్లు వెచ్చిస్తోంది. మరోవైపు శాశ్వత మౌలిక సదుపాయాల కల్పన కోసం ఏకంగా రూ.36,026 కోట్లు వ్యయం చేస్తోంది. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. వీటిలో 1.7 లక్షల ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. మరో 1.2 లక్షల ఇళ్లు స్లాబ్ దశ పూర్తై ముగింపు దశలో ఉన్నాయి. మిగిలిన ఇళ్లు వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్నాయి. పేదల ఇళ్ల నిర్మాణం ద్వారా రూ.మూడు లక్షల కోట్ల సంపదను ప్రభుత్వం సృష్టిస్తోంది. అది ఎలాగంటే.. ప్రభుత్వం పంపిణీ చేసిన స్థలాల విలువ గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి 4 లక్షల దాకా ఉండగా పట్టణ ప్రాంతాల్లో రూ.5 లక్షల నుంచి 7 లక్షల వరకూ ఉంది. ఈ క్రమంలో ఇంటి నిర్మాణం పూర్తయ్యే సరికి ఆస్తి విలువ రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల మేరకు చేరుతుంది. ఈ లెక్కన 31 లక్షల మంది పేదలకు పక్కా ఇళ్ల కల్పన ద్వారా రూ.2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల మేర సంపదను ప్రభుత్వం సృష్టిస్తోంది. ఆర్నెళ్లలో రెండు రకాలుగా.. ప్రభుత్వం చేస్తున్న సాయంతో లబ్ధిదారులు ఇళ్లు కట్టుకోలేకపోతున్నారంటూ రామోజీ తన పత్రికలోనే కొద్ది నెలల క్రితం కథనాలు ప్రచురించారు. అయితే ఐదారు నెలలు తిరగక ముందే కొత్త పల్లవి అందుకున్నారు. ప్రభుత్వమే కొన్ని కంపెనీల ద్వారా చేపట్టిన ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణంలో స్కామ్ జరుగుతోందనే ఆరోపణలకు దిగారు. ఆర్నెళ్లలోనే భిన్నాభిప్రాయాలను వెలువరించడం ఆయనకే చెల్లింది. అసలు ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణంలో స్కామ్‌లు, అక్రమాలు జరుగడానికి తావు లేదు. ఇళ్ల లబ్ధిదారులందరికీ రూ.1.80 లక్షల బిల్లు, బ్యాంకు రుణం ద్వారా రూ.35 వేలు సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంటే మొత్తంగా రూ.2.15 లక్షలు. ఈ సాయం అందించినా ఇళ్ల నిర్మాణం తమవల్ల కావడం లేదని, ప్రభుత్వమే కట్టించి ఇవ్వాలని రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మందికి పైగా లబ్ధిదారులు కోరారు. దీంతో లాభాపేక్ష లేకుండా ప్రభుత్వం నిర్ధారించిన రూ.2.15 లక్షల మొత్తంతోనే ఇళ్లు నిర్మించి ఇవ్వడానికి కొన్ని కంపెనీలు, భవన నిర్మాణ మేస్త్రీలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వీరికి లబ్ధిదారులతో ఒప్పందం కుదిర్చి ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇందులో ఈనాడుకు ఏం స్కామ్ కనిపించిందని అడ్డుకుంటున్నారని ఆప్షన్–3 లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఎందుకింత అక్కసు అంటే..? దేశంలో ఎక్కడా లేని రీతిలో పేదలెవరూ సొంతిల్లు లేక ఇబ్బంది కూడదనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం చూసి చంద్రబాబు బృందం బెంబేలెత్తుతోంది. ఈ పథకం దిగ్విజయంగా పూర్తయితే తనకు రాజకీయ భవిష్యత్తు ఉండదనే దృఢ నిశ్చయానికి వచ్చిన ఆయన దీన్ని అడ్డుకునేందుకు శతవిధాలా ప్రయత్నించారు. తమ పార్టీ నాయకుల ద్వారా కోర్టులను ఆశ్రయించి ఇళ్ల పట్టాల పంపిణీకి ఆటంకాలు కల్పించారు. అయితే ప్రభుత్వ సంకల్పం ముందు ఈ కుటిల యత్నాలు ఫలించలేదు. దీంతో ఈనాడు, ఇతర పచ్చ మీడియా ద్వారా తప్పుడు కథనాలతో ప్రభుత్వంపై దుష్ప్రచారానికి తెగించారు. అయితే అది కూడా ఆశించిన మేర ఫలితం ఇవ్వకపోవడంతో ఈసారి దత్తపుత్రుడిని రంగంలోకి దింపారు. తొలి నుంచి ఈ చేష్టలు గమనిస్తున్న రాష్ట్ర ప్రజలు జనసేనాని ఆదుర్దా అంతా రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకమై విలపిస్తున్న బాబు కన్నీళ్లు తుడవడం కోసమేనని వ్యాఖ్యానిస్తున్నారు. మా కన్నీళ్లు నాడు కనపడలేదా? మాటల ప్రభుత్వం కాదని రుజువు చేశారు మహారాష్ట్ర నుంచి జీవనోపాధి కోసం 13 ఏళ్ల క్రితం వచ్చి పాలకొండలో స్థిరపడ్డాం. రోజువారీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నా. నాకు ముగ్గురు పిల్లలు. అద్దె ఇంట్లో ఉంటున్నా. ఆధార్, రేషన్, ఓటరు కార్డు పాలకొండలో ఉన్నాయి. ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ కాళ్లు అరిగేలా తిరిగినా గత ప్రభుత్వాలు సంక్షేమ పథకాలు మంజూరు చేయలేదు. గత ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీ వాగ్దానాలు చూసి అందరూ ముందు ఇలాగే మాటలు చెబతారు. అధికారంలోకి వస్తే పట్టించుకోరని భావించా. ఇది మాటల ప్రభుత్వం కాదని సీఎం జగన్ రుజువు చేశారు. మాకు ఇంటి స్థలం, ఇళ్లు మంజూరైంది. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయి. త్వరలో ఇంటి నిర్మాణం పూర్తవుతుంది. ఇప్పుడు పేదల గురించి మాట్లాడుతున్న పార్టీలు నాడు మా గోడు ఆలకించలేదు. – కుంబారు సంతోష్, పాలకొండ, పార్వతీపురం మన్యం జిల్లా రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు అరకొర సంపాదనలో నెలకు రూ.3 వేలు ఇంటి అద్దె, ఇతర అవసరాలకు సరిపోయేది. టీడీపీ అధికారంలో ఉండగా ఎన్నిసార్లు ఇంటి స్థలం చోసం దరఖాస్తు చేసుకున్నా ఫలితం దక్కలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక వలంటీర్ మా ఇంటికే వచ్చి దరఖాస్తు తీసుకున్నాడు. రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల బిల్లు ఇచ్చారు. – కొల్లి కన్నమ్మ, కొత్త మూలకుద్దు, భీమిలి మండలం, విశాఖ జిల్లా ఫలించిన 40 ఏళ్ల నిరీక్షణ సొంతింటి కోసం 40 ఏళ్లుగా ఎదురు చూశా. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాకే ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. ప్రైవేట్ వెంచర్ల తరహాలో నీటి కోసం బోర్లు, కరెంట్ సరఫరా చేపట్టారు. సిమెంట్, ఐరన్, ఇసుక ఇంటి వద్దకే సరఫరా చేస్తున్నారు. – పాలే ఈశ్వరరావు, చాటపర్రు, ఏలూరు జిల్లా నాడు ఆరుసార్లు దరఖాస్తు గత ప్రభుత్వ హయాంలో ఆరుసార్లు ఇళ్ల పథకానికి దరఖాస్తు చేస్తుకున్నా రాలేదు.అర్హత ఉండి కూడా మాకు ఇల్లు మంజూరు చేయకపోవడంపై అధికారులను పశ్నిస్తే సమాధానం లేదు. నాయకుల చుట్టూ తిరిగినా ఫలితం కనిపించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మాకు మొదటి విడతలోనే పక్కా గృహాన్ని మంజూరు చేసింది. ఈ రోజు ప్రజల కన్నీటి గురించి మాట్లాడుతున్న ఏ నాయకుడూ ఆ రోజు కనిపించలేదు. – స్నేహలత, కోట గుండ్ల పల్లె, అన్నమయ్య జిల్లా జనసేన, ఈనాడు మొసలి కన్నీళ్లు 20 ఏళ్లు నిలువ నీడ లేక ఇబ్బంది పడితే ఏ నాయకుడూ పట్టించుకోలేదు. టీడీపీ హయాంలో ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా సెంటు స్థలం ఇవ్వలేదు. ఆ పార్టీకి వత్తాసు పలికే జనసేన, ఈనాడు మా గురించి మొసలి కన్నీళ్లు కారుస్తున్నారు. వారంతా పేదల గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది. ఈ రోజు జగనన్న కాలనీల సందర్శనకు వస్తున్న పవన్ టీడీపీ హయాంలో మేం నిలువ నీడలేక ఇబ్బంది పడినప్పుడు ఏమయ్యారు? సీఎం జగన్ చేస్తున్న సాయం చాలా పెద్దది. మేం ఎంతో తృప్తిగా ఉన్నాం. – సాంబశివ, బైరెడ్డిపల్లి, చిత్తూరు జిల్లా ఈ సాయం ఎంతో గొప్పది.. దశాబ్దాలుగా సొంతిల్లు లేక ఎన్నో ఇబ్బందులు పడ్డాం. గత ప్రభుత్వ హయాంలో ఎన్నోసార్లు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకోలేదు. ఇప్పుడు ఎలాంటి వ్యయ ప్రయాసలు లేకుండా స్థలం, ఇల్లు సమకూరాయి. ప్రభుత్వం చేస్తున్న సాయం మాకెంతో గొప్పది. అధికారంలో ఉండగా సెంటు భూమి ఇవ్వని టీడీపీని పవన్ ఎందుకు విమర్శించడం లేదు? – శ్రీచందన, బుక్కపట్నం మండలం బుచ్చయ్యగారి పల్లి గ్రామం, శ్రీసత్యసాయి జిల్లా డీడీ కట్టించుకుని ఇల్లు లేదన్నారు.. గత ప్రభుత్వ హయాంలో పక్కా ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే డీడీ కట్టించుకుని చివరకు ఇల్లు లేదన్నారు. డబ్బులు వసూలు చేసి అనర్హులకు ఇళ్లు కేటాయించారు. దీంతో ఇక ఇల్లు వస్తుందనే ఆశ వదులుకున్నా. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అనర్హులను తొలగించి మాలాంటి పేదలను గుర్తించి రూపాయికే ఇల్లు ఇచ్చింది. సొంతింటి కల నెరవేరినందుకు ఆనందంగా ఉంది. అన్ని వసతులతో పేదలకు ఇల్లు కేటాయించిన సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – కమల, మంగళగిరి, గుంటూరు జిల్లా మా కన్నీళ్లు ఈరోజు గుర్తొచ్చాయా? టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్‌కు పేదలు ఎందుకు గుర్తు రాలేదు? ఈ ప్రభుత్వం మాకు నిలువ నీడ కల్పించి కన్నీళ్లు తుడుస్తుంటే బురద చల్లుతారా? – ఇడుపుల రాజకుమారి, మాగల్లు, ఎన్టీఆర్ జిల్లా తప్పుడు ప్రచారం.. పుత్తూరు పరిధిలోని జగనన్న కాలనీలో ఇంటి నిర్మాణం పూర్తి కావస్తోంది. నాలా ఎంతో మంది గృహ ప్రవేశాల కోసం ముహుర్తాలు పెట్టుకుంటున్నారు. కాలనీల్లో అన్నీ బాగున్నాయి. మేం సంతోషంగా ఉన్నాం. టీడీపీ, జనసేన, వారి అనుకూల పచ్చ మీడియా తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. – ఎ. రాధిక, రాజాజీ స్ట్రీట్, పుత్తూరు, చిత్తూరు జిల్లా మా కష్టసుఖాలు మీకేం తెలుసు? టీడీపీ, జనసేన, వాటి అనుకూల పత్రికలు, చానళ్లకు మా బాధలు, కష్టాలు ఏం తెలుసని మాట్లాడుతున్నారు? వారికి నిజంగా మా కష్టాలు తెలిసి ఉంటే ఇన్నేళ్లు మేం అద్దె ఇళ్లలో ఉండాల్సిన దుస్థితి ఉండదు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసిన చంద్రబాబు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఇల్లు ఎందుకు కట్టించి ఇవ్వలేదు? ఆ పార్టీకి మద్దతిచ్చి గెలిపించిన పవన్ నాడు ఎందుకు ప్రశ్నించలేదు? మా బాధలు, కష్టాలు తెలిసిన నాయకుడు సీఎం జగన్ ఒక్కడే. అందుకే మాకు ఈ రోజు సొంత ఇళ్లు సమకూరుస్తున్నారు. – బొడసింగి పుణ్యావతి, జగతిమెట్ట కాలనీ , టెక్కలి, శ్రీకాకుళం జిల్లా ఈనాడు ద్వంద్వ వైఖరి ఇలా.. 13–06–2022 రూ.1.80 లక్షల బిల్లు, రూ.35 వేలు బ్యాంకు రుణం కలిపి మొత్తంగా రూ.2.15 లక్షల్లో ఇల్లు పూర్తి చేయాలా...? అబ్బే ఎలా కుదురుతుంది..? ఇచ్చే డబ్బుకు, అయ్యే ఖర్చుకు పొంతన లేకుండా పోతోంది. పేదలు ఇళ్లు నిర్మించుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. పేదల ఇళ్లు పునాదే దాటడం లేదు. 09–11–2022 పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వమే కాంట్రాక్టర్లను ఎంపిక చేస్తోంది. ఆ సంస్థలు ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం ఇచ్చే రూ.1.80 లక్షల బిల్లు, లబ్ధిదారులకు బ్యాంకు రుణం కింద వచ్చే రూ.35 వేలు కలిపి మొత్తం రూ.2.15 లక్షలతో ఇంటిని నిర్మిస్తున్నారు. దీని వెనుక పెద్ద స్కామ్ దాగుంది!! పేదల పట్ల దత్తపుత్రుడి విధానం నాడు (2014–19) టీడీపీ హయాంలో పేదలకు ఇళ్ల పట్టాలు పంచిన దాఖలాలు లేవు. నిలువ నీడ లేదని పేదలు ప్రాథేయపడ్డా ఇళ్ల దరఖాస్తులను పట్టించుకున్న పాపాన పోలేదు. లక్షల మంది నిరుపేదలు తలదాచుకునేందుకు చోటు లేక, అద్దె ఇళ్లలో అవస్థలు పడుతున్నా ఏ రోజూ జనసేనాని స్పందించ లేదు. నాటి ప్రభుత్వాన్ని కనీసం ప్రశ్నించలేదు. నేడు (2019 తరువాత) నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం 31 లక్షల మంది నిరుపేదలకు గృహ యోగం కల్పిస్తోంది. ప్రభుత్వమే ఇళ్ల స్థలాలను పంపిణీ చేయడంతో పాటు ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు బిల్లు రూపంలో, పావలా వడ్డీకి రూ.35 వేలు బ్యాంకు రుణం ద్వారా సాయం చేస్తోంది. రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయి. చరిత్రలో కనీవినీ ఎరుగని స్థాయిలో పేదలకు మేలు జరుగుతుంటే లోపాయికారీ ఒప్పందాల మేరకు కన్నీళ్లు తుడుస్తానంటూ, ప్రశ్నిస్తానంటూ బయల్దేరారు. -
ఆ ఇళ్లు.. బడుగుల ఆత్మగౌరవ సౌధాలు
ఎందరో అభాగ్యుల దుర్భర జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు– పేదలందరికీ ఇళ్లు’ పథకం వెలుగులు నింపుతోంది. ఒక్క రూపాయి ఖర్చులేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అలాగే, పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. ఇప్పుడు వీరి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీకి ‘సాక్షి’ వెళ్లి తెలుసుకుంది. రోజంతా నా భర్త వెంకటేశ్వరరావు కూలికెళ్తే వచ్చే డబ్బు ఇద్దరు పిల్లల పెంపకం, కుటుంబ పోషణకే సరిపోయేది. దీంతో చాలాసార్లు అద్దె ఇంట్లోకి వెళ్దామనుకున్నా ఆర్థిక స్థోమత సహకరించక ఆ ప్రయత్నం విరమించుకున్నాం. గుడిసెల్లో నిద్రలేని రాత్రులు ఎన్నో గడిపాం. వర్షం వస్తే పైకప్పు నుంచి నీరు ధారలా కారుతుండేది. దీంతో పిల్లలను నేను, నా భర్త ఒళ్లో పడుకోబెట్టుకుని, పురుగు పుట్రా వస్తుందేమోనని బిక్కుబిక్కుమంటూ బతికాం. మా పరిస్థితి చూసి బంధువులెవరూ పెద్దగా ఇంటికి వచ్చేవారు కాదు. కానీ, ఇప్పుడా అవస్థలు మాకులేవు. మేం ఉంటున్న గుడిసెలను ఖాళీ చేయించి ఇక్కడే మాకు ప్రభుత్వం ఇళ్ల పట్టా ఇవ్వడమే కాక ఇంటిని కూడా నిర్మించి ఇచ్చింది. ప్రస్తుతం అందులో దర్జాగా ఉంటున్నాం. ఇదంతా తల్చుకుంటే నిజంగా కలలాగే ఉంది. కేవలం మాకు గూడు కల్పించడమే కాదు.. నా బిడ్డల చదువుకు అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఆర్థిక చేయూత ఇస్తోంది. అంతేకాక.. వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండుసార్లు రూ.10వేల చొప్పున లబ్ధిపొందాను. గతంలో ఏ ప్రభుత్వం మాకు ఇంతలా సాయపడలేదు. మా బతుకు చిత్రాన్నే మార్చిన ముఖ్యమంత్రి జగనన్నకు జీవితాంతం రుణపడి ఉంటాం. – కవిత, జక్కంపూడి, విజయవాడ రూరల్ మండలం పూరి గుడిసెల్లో ఉన్నప్పుడు ఏటా రెండుసార్లు పైకప్పు మార్చాల్సి వచ్చేది. ఇందుకు రూ.20వేలకు పైగానే ఖర్చయ్యేది. నా భర్త కొన్నేళ్ల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇద్దరు పిల్లలను చూసుకుంటూ నేను కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. కుటుంబ పరిస్థితులు సరిగాలేక నా కొడుకు పదో తరగతితో చదువు మానేసి ఫ్యాక్టరీలో పనికెళ్తున్నాడు. అమ్మాయి ఇంటి వద్దే ఉంటుంది. దీనావస్థలో ఉన్న మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంది. పక్కా ఇంటిని నిర్మించి ఇచ్చి ఎంతో మేలు చేసింది. వైఎస్సార్ ఆసరా పథకం కింద రెండుసార్లు రూ.17 వేల చొప్పున ఆర్థిక సాయం అందింది. సున్నా వడ్డీ, ఇతర పథకాలు మమ్మల్ని ఎంతో ఆదుకుంటున్నాయి’’. – వి. పద్మ, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్ మండలం .. ఇలా ఎంతో మంది పేదల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం వెలుగులు నింపుతోంది. ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రభుత్వం వారికి ఇళ్ల పట్టాలు మంజూరు చేసింది. అలాగే పక్కా ఇళ్లను నిర్మించి ఇచ్చింది. టీడీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు నా భర్త చాలా ఏళ్ల క్రితం చనిపోయాడు. మేం కూడా పూరి గుడిసెలో ఉండే వాళ్లం. గత ప్రభుత్వ హయాంలో స్థలం, ఇంటికోసం చాలాసార్లు దరఖాస్తు చేసుకున్నా ఇవ్వలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మాకు స్థలం ఇచ్చి, ఇళ్లు నిర్మించి ఇచ్చారు. ఈ ప్రభుత్వం వచ్చాకే నాకు వితంతు పింఛన్ మంజూరైంది. పూరిగుడిసెల్లో ఉన్నపుడు వర్షం కారుతుండేది. పాములు, తేళ్లు కుట్టి ఆస్పత్రులకు వెళ్లిన సందర్భాలూ ఉన్నాయి. ఇప్పడు మాకంటూ ఒక ఇల్లుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్నాయి. అంతేకాదు.. మా కాలనీ వద్దకే రేషన్ బండి కూడా వస్తోంది. – అవనిగడ్డ లక్ష్మి, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్ మండలం మా కష్టాలు తీరాయి.. నాకు పెళ్లి కాకముందు నుంచి నా భర్త కుటుంబం పూరి గుడిసెలో ఉంటోంది. నాకు ఇద్దరు పిల్లలు. బాలింతగా ఉన్న సమయంలో చలికాలం, వర్షాకాలం చిన్న పిల్లలతో గుడిసెలో చాలా ఇబ్బందులు పడ్డాను. ఐదు, ఆరు మంది చిన్న గుడిసెలో ఉండేవాళ్లం. మేం పడ్డ కష్టాలు పగవాడికి కూడా రాకూడదు. ఉండటానికి ఇల్లులేక, అద్దెలు కట్టడానికి స్థోమత లేని మాలాంటి నిరుపేదల కష్టాలు అనుభవించే వారికే తెలుస్తుంది. జగనన్న పుణ్యమా అని మా కష్టాలన్నీ తీరాయి. సొంతింట్లో ఉంటున్నాం. ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాం. – వి. సీతమ్మ, జక్కంపూడి గ్రామం, విజయవాడ రూరల్ మండలం ఇప్పుడు వీరి జీవన పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకునేందుకు విజయవాడ రూరల్ మండలం జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీకి ‘సాక్షి’ వెళ్లింది. అక్కడి ఎస్టీ మహిళలతో మాట్లాడితే వారు పైవిధంగా స్పందించారు. అంతా కలలా ఉందని చెబుతుంటే వారి కళ్లల్లో ఎంతో సంతోషం సాక్షాత్కరించింది. 42 ఇళ్ల నిర్మాణం పూర్తి.. జక్కంపూడి గ్రామంలోని జగనన్న కాలనీలో పేదలకు 156 ప్లాట్లను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 136 ఇళ్ల నిర్మాణానికి అనుమతులు జారీ అయ్యాయి. ఇప్పటికే 42 ఇళ్ల నిర్మాణం పూర్తయింది. ఈ 42 ఇళ్లలో 20కు పైగా ఇళ్లు గతంలో ఇక్కడే పూరిగుడిసెల్లో నివాసం ఉండే ఎస్టీలకు సంబంధించినవి. మరో 30 ఇళ్లు శ్లాబ్ దశ పూర్తయి ఫినిషింగ్ దశల్లో ఉన్నాయి. మిగిలిన ఇళ్ల నిర్మాణం వివిధ దశల్లో కొనసాగుతోంది. ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో సెంటు స్థలం మార్కెట్ విలువ రూ.3 లక్షల మేర ఉంటుంది. ఇంత ఖరీదైన స్థలాలను ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు అందిస్తోంది. ఉచితంగా ఇసుక, మార్కెట్ ధరల కన్నా తక్కువకు నిర్మాణ సామగ్రి అందిస్తోంది. మూడు శాతం వడ్డీకి రూ.35వేల బ్యాంకు రుణాలు అందిస్తూ అదనపు సాయం సమకూరుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది నిరుపేదలకు గూడు జక్కంపూడి గ్రామానికి చెందిన ఎస్టీలు, ఇతర నిరుపేద కుటుంబాల తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా లక్షల మంది నిలువ నీడలేని పేదలకు సీఎం జగన్ ప్రభుత్వం సొంత గూడు కల్పిస్తోంది. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఏకంగా 30 లక్షల మందికి పైగా పేదలకు పక్కా గృహాలను నిర్మిస్తోంది. ఇందులో భాగంగా.. 30.25 లక్షల మందికి ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులివ్వగా ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. జక్కంపూడి గ్రామంలోని ఎస్టీల తరహాలో ఇళ్లు నిర్మించుకునే స్థోమతలేని నిరుపేదల కోసం ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్‌ను ఇచ్చారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా 3.24 లక్షల మంది ఎంచుకున్నారు. లాభాపేక్ష లేకుండా ఈ ఇళ్లను నిర్మించేందుకు స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కాంట్రాక్టర్లకు 10–20 మంది లబ్ధిదారులను గ్రూప్‌గా చేసి నిర్మాణాలు చేపడుతున్నారు. (జక్కంపూడి జగనన్న కాలనీ నుంచి సాక్షి ప్రతినిధి వడ్డే బాలశేఖర్) -
YSR Jagananna Colonies: గూడు కట్టిన అభిమానం
అద్దె కట్టే స్థోమత లేదు..సొంతిళ్లు కట్టించారు నా పేరు లక్ష్మీ దేవి, మాది కడప నగరం నానాపల్లె. నెలకు రూ. 5వేలు అద్దె కట్టలేక ఇబ్బందులు ఎదుర్కొన్నాం. పిల్లలను రెక్కల కష్టంపై పోషించుకుంటూ ఉండేవాళ్లుం. మాకు సొంతిళ్లు సమకూరుతుందా అని అనుకునే వాళ్లం. జగనన్న నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇంటి స్థలం మంజూరు చేశారు. అందులో ఇళ్లు కట్టుకొని అనందంగా ఉన్నాం. జగనన్న మేలు మరిచిపోలేం నాపేరు రేష్మా. మాది కడపలోని బిస్మిలా నగర్. నా భర్త కూలీ పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తు.. భారమైనా ఇంటికి అద్దె కట్టుకుంటూ వచ్చాం. జగనన్న పుణ్యమా అని లక్షల విలువ చేసే స్థలం ఇచ్చారు. ప్రభుత్వం రూ. 1.80 లక్షలు మంజూరు చేసింది. ఎస్ఆర్జీఈఎస్ ద్వారా రూ.30 వేలు, డ్వాక్రా సంఘం నుంచి రూ. లక్ష వడ్డీ రాయితీపై రుణం ఇచ్చారు. ఈ నగదుతో ఇళ్లు కట్టుకున్నాం. దాదాపు రూ. 10 లక్షల విలువైన ఇంటికి యజమానిని చేసిన జగనన్న మేలు మరచిపోలేం. జగననన కాలనీల్లో సౌకర్యాలు బాగున్నాయి నాపేరు అయేషా. మాది కడప నగరం, బిస్మిల్లా నగర్ .ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద ప్రజలకు ఇంటి స్థలం ఇచ్చి అదుకున్నారు. ఇలాంటి ముఖ్యమంత్రిని ఎప్పటికీ మరచిపోలేం. అన్ని రకాల సౌకర్యాలతో జగనన్న కాలనీలు ఏర్పాటు చేసి అదుకున్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: చిరు సంపాదనతో అద్దె చెల్లిస్తూ అవస్థలు పడే పేద వాడి గుండెలో సంబరం గూడు కట్టుకుంది. వారి సొంతింటి కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిజం చేశారు.జిల్లాలోని 529 జగనన్న కాలనీలో పేదల ఇళ్ల నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. ఇప్పటికే కొందరు లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకుని గృహ ప్రవేశాలు చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తాగునీటి సౌకర్యం, విద్యుత్ లైన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసి పేద ప్రజల సొంతింటి కలను సాకారంచేసేలా కృషి చేస్తోంది.దీంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని 529 జగనన్న కాలనీల్లో 1,18,605 మందికి ఇంటి స్థలాలు జిల్లాలో ఏర్పాటైన 529 జగనన్న కాలనీల్లో దాదాపు 1,18,605 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో 68,808 గృహాలను రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోగా, 37,625 బేస్మెంట్ దశలో ఉన్నాయి. 25,625 గృహాలు బేస్మెంట్ పూర్తి చేసుకోగా,రూఫ్ లెవెల్లో 2789, రూఫ్ లెవెల్ పూర్తయినవి 2094 ఉన్నాయి. 595 గృహాలు పూర్తయ్యాయి. సొంత స్థలంలో ఇంటి నిర్మాణాన్ని చేపట్టిన వారిలో మొత్తం లబ్ధిదారులు 30,210 మంది ఉండగా, 7586 గృహాలు బేస్‌మెంట్‌లోపు ఉన్నాయి. 4676 బేస్మెంట్ పూర్తి చేసుకున్నాయి. రూఫ్ లెవెల్లో 3010, రూఫ్ పూర్తయిన గృహాలు 5354 ఉన్నాయి. అలాగే 6129 గృహాలు పూర్తయ్యాయి. కొత్త ఊర్లను తలపిస్తున్న గృహ సముదాయాలు జగనన్నకాలనీలోని గృహసముదాయాలు కొత్త ఊర్లను తలపిస్తున్నాయి. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటిస్థలాలు అందజేయడంతో వాటిని నిర్మించుకునే పనిలో లబ్ధిదారులు నిమగ్నమయ్యారు. అంతేకాకుండా ప్రభుత్వం విలువైన స్థలాలను అందజేయడంతో ప్రజలు ఆనందంగా తమ ఇళ్లను నిర్మించుకుంటున్నారు. పేదల కళ్లలో కనిపిస్తున్న అనందం ఇన్నాళ్లు అద్దె ఇళ్లలో బాడుగకు ఉంటూ కాలాన్ని వెళ్లదీస్తున్న తరుణంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేశారు. ఇంటి నిర్మాణానికి రూ. 1.80 లక్షలు ఉచితంతోపాటు స్వయం సహాయ సంఘాల సభ్యులకు రూ. 30 వేలు, డ్వాక్రా రుణం కింద మరో రూ. లక్ష రుణాన్ని వడ్డీ రాయితీతో మంజూరు చేశారు. దీంతో ప్రజలు తమకు కావాల్సిన రీతిలో ఇంటి నిర్మించుకుంటున్నారు. ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. -
AP: గృహ యజ్ఞం.. పేదల సొంతింటి కల సాకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా గూడు లేని లక్షల మంది పేదలు సొంతింటి యజమానులు అవుతున్నారు. రెండు దశల్లో 21.25 లక్షలకుపైగా (టిడ్కో ఇళ్లతో కలిపి) గృహ నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. పేదల ఆవాసాల కోసం దాదాపు రూ.1.06 లక్షల కోట్లను వ్యయం చేస్తూ అక్క చెల్లెమ్మల చేతికి విలువైన స్థిరాస్తిని కానుకగా అందచేస్తోంది. ఇది ఎంత పెద్ద యజ్ఞమంటే.. 30.25 లక్షల మంది పేదలకు 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీ కోసం ప్రభుత్వం రూ.56,102.91 కోట్లు వెచ్చించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు ఖర్చు చేస్తుండటంతో ఏకంగా కొత్త పట్టణాలే తయారవుతున్నాయి. ఇళ్ల లబ్ధిదారులకు రాష్ట్ర వాటా కింద చెల్లింపులతోపాటు ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. సకల సదుపాయాలతో నిర్మిస్తున్న ఒక్కో ఇంటి విలువ సగటున కనీసం రూ.10 లక్షల వరకు ఉంటుందని అంచనా. కొన్ని చోట్ల ఖరీదైన ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలను అందిస్తున్న నేపథ్యంలో వీటి విలువ మరింత అధికంగా ఉండే అవకాశం ఉంది. మొత్తమ్మీద పేదల గృహ నిర్మాణాల ద్వారా రూ.2.5 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల మేర సంపదను సృష్టిస్తోంది. మరోవైపు పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలను కొనసాగించి పనులు కల్పించడం ద్వారా కోవిడ్ సమయంలోనూ ఆర్థిక కార్యకలాపాలు మందగించకుండా ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించింది. డిసెంబర్‌కు ఐదు లక్షల ఇళ్లు.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం నిరుపేద కుటుంబాలకు వరంగా మారింది. దశాబ్దాలుగా గూడు లేక అవస్థలు పడుతున్న లక్షల మందికి ఊరటనిస్తోంది. పథకం కింద రెండు దశల్లో 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేయగా 17.24 లక్షల గృహ నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. వీటి నిర్మాణం 2024 మార్చి నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఈ ఏడాది డిసెంబర్ 21 కల్లా ఐదు లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 3.5 లక్షలు, టిడ్కో ఇళ్లు 1.5 లక్షలు ఈ గడువులోగా పూర్తి చేసేలా గృహ నిర్మాణ శాఖ కసరత్తు చేస్తోంది. ఒకవైపు ఇళ్ల నిర్మాణాన్ని చేపడుతూనే మరోవైపు కనీస సదుపాయాల కల్పన పనులను ప్రభుత్వం కొనసాగిస్తోంది. నిర్మాణం పూర్తి చేసుకున్న ఇళ్లకు చకచకా కరెంట్, నీటి సరఫరా కనెక్షన్లు సమకూరుస్తోంది. మనిషికి కనీస అవసరాలైన కూడు, గూడు, దుస్తులు లాంటి కనీస అవసరాలను కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అయితే స్వాతంత్య్రం వచ్చి దశాబ్దాలు గడుస్తున్నా రాష్ట్రంలో లక్షల కుటుంబాలకు నిలువ నీడ లేదు. ఆ నిరుపేదల గోడును 2019 ఎన్నికలకు ముందు పాదయాత్ర సందర్భంగా ప్రతిపక్ష నేత హోదాలో వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా విన్నారు. నేను ఉన్నానని హామీ ఇచ్చారు. మాట మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకాన్ని ప్రవేశపెట్టారు. పథకం ద్వారా ఏకంగా 30.25 లక్షల మంది నిరుపేదలకు రాష్ట్రవ్యాప్తంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. వైఎస్సార్, జగనన్న కాలనీల రూపంలో ఏకంగా ఊళ్లనే నిర్మిస్తూ ఓ మహాయజ్ఞాన్ని తలపెట్టారు. దీన్ని చూసి 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే టీడీపీ అధినేత చంద్రబాబులో ఆందోళన మొదలైంది. ఆయన అధికారంలో ఉండగా రాష్ట్రంలో పేదలకు సెంటు స్థలం కూడా ఇవ్వలేదు. పారదర్శకంగా పక్కా ఇళ్లను నిర్మించిన పాపాన పోలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ నిర్మాణ మహాయజ్ఞం పూర్తయితే ఇక తనకు రాజకీయ భవిష్యత్తే ఉండదని ఓ నిర్ణయానికి వచ్చిన చంద్రబాబు తన పార్టీ కార్యకర్తలు, నాయకుల ద్వారా కోర్టులకెక్కి పలు అడ్డంకులు సృష్టించారు. అయితే ప్రభుత్వ దృఢ సంకల్పం ముందు ఆ పాచికలు పారలేదు. దీంతో తాజాగా దత్తపుత్రుడిని రంగంలోకి దింపి డిజిటల్ క్యాంపెయిన్ పేరిట పేదల ఇళ్లపై బురద జల్లే మరో కార్యక్రమానికి టీడీపీ తెర తీసింది. దర్జాగా ఉంటున్నాం నా భర్త, నేను వ్యవసాయ కూలీలం. ఇద్దరు పిల్లలు. సొంతిల్లు లేదు. అద్దె కట్టే స్తోమత లేక బంధువుల ఇంట్లో ఉండేవాళ్లం. ఇల్లు పైకప్పు సరిగా లేక వర్షాలు పడినప్పుడు అవస్థలు ఎదుర్కొన్నాం. టీడీపీ హయాంలో ఇంటి స్థలం కోసం ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా రాలేదు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక మొదటి దరఖాస్తుకే స్థలం, ఇంటిని కూడా మంజూరు చేశారు. రూ.1.80 లక్షలు ఇచ్చారు. ఇంటి నిర్మాణం పూర్తయింది. ఇప్పుడు దర్జాగా సొంతింట్లో ఉంటున్నాం. – షేక్ ఫాతిమాబీ, ఫణిదం, సత్తెనపల్లి మండలం పల్నాడు జిల్లా సదుపాయాలన్నీ కల్పించారు.. సొంతిల్లు లేక చాలా ఏళ్లు ఇబ్బంది పడ్డాం. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద దరఖాస్తు చేసుకోవడంతో గ్రామం వెలుపల స్థలం కేటాయించారు. ఊరికి దూరంగా ఇవ్వడంతో భయపడ్డాం. ఇంటి నిర్మాణానికి చేయూత ఇవ్వడంతో పాటు కాలనీలో విద్యుత్, తాగు నీరు తదితర సదుపాయాలన్నీ సమకూర్చారు. మా జగనన్న లేఅవుట్లో 400 మందికిపైగా పేదలు ఇళ్లు కట్టుకున్నారు. – పి. దుర్గాదేవి, జేగురుపాడు, కడియం మండలం, తూర్పుగోదావరి రూ.3 లక్షల విలువైన స్థలం జగనన్న ముఖ్యమంత్రి అయిన తరువాత మాకు రూ.3 లక్షల విలువైన స్థలం ఇచ్చారు. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల యూనిట్‌కు గానూ ఇప్పటి వరకు రూ.48వేల బిల్లు వచ్చింది. కాలనీలో వసతులు కల్పిస్తున్నారు. – కొల్లి కనకమ్మ, కొత్తమూలకుద్దు, అనకాపల్లి జిల్లా గతంలో ఎన్నడూ చూడలేదు పేదలకు పక్కా ఇళ్ల కోసం సీఎం జగన్ తీసుకున్న చర్యలు గతంలో ఏ ప్రభుత్వంలోనూ చూడలేదు. జగనన్న కాలనీలో నాకు స్థలం కేటాయించారు. నిర్మాణ బిల్లులు కూడా సకాలంలో అందించారు. ఇప్పటికే ఇల్లు పూర్తి కావచ్చింది. జగనన్న ప్రభుత్వంలో అర్హతే కొలమానంగా లబ్ధి చేకూరుతోంది. కాలనీలో విద్యుత్, రహదారులతోపాటు ఇతర మౌలిక సదుపాయాల కల్పన వేగంగా చేపడుతున్నారు. – మండల్ క్రిష్ణ, నగర పంచాయతీ పాలకొండ మూడు దశాబ్దాల కల మూడు దశాబ్దాలుగా అద్దె ఇళ్లలో ఉంటున్నాం. సీఎం జగన్ ప్రభుత్వం మా సొంత ఇంటి కలను నెరవేరుస్తోంది. రూఫ్ లెవల్ వరకు నిర్మాణం పూర్తయ్యింది. రూ.50 వేల వరకు బిల్లు కూడా వచ్చింది. – జంగం అన్నపూర్ణ, మంత్రాలయం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాకే మాది పశ్చిమ గోదావరి జిల్లా. 30 ఏళ్ల కిందట పుట్టపర్తికి వలస వచ్చాం. మూడు దశాబ్దాలు అద్దె ఇంట్లోనే ఉన్నాం. ఎన్నో ప్రభుత్వాలు మారాయి కానీ సొంతింటి కల మాత్రం వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాతే నెరవేరింది. పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లి వద్ద జగనన్న కాలనీలో ఇల్లు ఇచ్చారు. నిర్మాణం పూర్తయింది. – కె. భానుమతి, పుట్టపర్తి ఇన్నాళ్లకు కల నెరవేరింది ఉప్పలూరు గ్రామానికి 13 ఏళ్ల క్రితం వచ్చాం. సొంత స్థలం లేదు. ఎన్నో సార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు చుట్టూ స్థలం కోసం తిరిగినా రాలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఉప్పలూరు లే అవుట్‌లోనే స్థలం కేటాయించారు. ఇంటి నిర్మాణం పూర్తి చేసి గృహ ప్రవేశం కూడా చేశాం. ఎన్నో ఏళ్లకు సొంతింటి కల తీరింది. చాలా ఆనందంగా ఉంది. కాలనీలో తాగునీటి సరఫరా సమృద్ధిగా ఉంది. – పోసిన శివనాగమల్లేశ్వరి, ఉప్పలూరు, కంకిపాడు మండలం, కృష్ణాజిల్లా పేదల ఇళ్ల కోసం ప్రభుత్వం చేస్తున్న వ్యయం ఇలా ► 30.25 లక్షల మందికి 71,811.49 ఎకరాల్లో ఇళ్ల స్థలాల పంపిణీకి– రూ.56,102.91 కోట్లు ► వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సదుపాయాల కల్పన కోసం రూ.36,026 కోట్లు (ఇళ్ల నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా తాత్కాలిక సదుపాయాలకు రూ.3,117 కోట్లు, శాశ్వత సదుపాయాల కోసం రూ.32,909 కోట్లు) ► లబ్ధిదారులకు ప్రభుత్వ వాటా కింద చెల్లింపులు, ఇతర రాయితీల రూపంలో రూ.13,758 కోట్లు (రూ.15 వేల విలువ చేసే ఇసుకను ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. రూ.40 వేల విలువైన సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామగ్రిని మార్కెట్ ధరల కన్నా తక్కువకు రాయితీతో సరఫరా చేస్తోంది.) జగనన్న కాలనీల్లో శాశ్వత సదుపాయాల కల్పన వ్యయం రూ.కోట్లలో నీటి సరఫరా– 4,128 విద్యుత్, ఇంటర్నెట్– 7,989 డ్రైనేజీ, సీవరేజ్– 7,227 రోడ్లు, ఆర్చ్‌లు– 10,251 పట్టణ ప్రాంత లేఅవుట్లలో వసతుల కల్పన – 3,314 ఇళ్ల నిర్మాణాలకు చేసిన ఖర్చు (2021–22, 2022–23 ఆర్థిక సంవత్సరాలకు గానూ ఇప్పటి వరకూ) లబ్ధిదారులకు బిల్లుల చెల్లింపు– రూ.6149,10,54,963 నిర్మాణ సామగ్రి– రూ.1629,99,83,047 ఇతర ఖర్చు– రూ. 656,68,14,937 మొత్తం– రూ.8435,78,52,947 రూ.10 లక్షల ఇంటికి యజమాని అంబేడ్కర్ కోనసీమ జిల్లాకు చెందిన తాకాసి దేవీ సత్యనారాయణ కుటుంబం చాలా ఏళ్లుగా అద్దె ఇంట్లో జీవనం సాగిస్తోంది. టీడీపీ హయాంలో ఎన్నిసార్లు ఇంటి స్థలం కోసం దరఖాస్తు చేసుకున్నా కనికరించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్కసారి అర్జీ పెట్టుకున్నారు. ఏ ఆఫీస్ చుట్టూ తిరగలేదు. కొద్ది రోజులకే స్థలం మంజూరై ఇంటి పట్టా అందింది. ఇప్పుడు ఇంటి నిర్మాణం కూడా పూర్తైంది. రూ.10 లక్షల విలువ చేసే ఆస్తిని సీఎం జగన్ అందించారని ఆ కుటుంబం సంతోషంగా చెబుతోంది. ఫిబ్రవరిలో గృహప్రవేశం అంబేడ్కర్ కోనసీమ జిల్లా బుల్లియ్యరేవుకు చెందిన వి.రమాదుర్గ వాలంటీర్ కాగా ఆమె భర్త కార్పెంటర్. ఇద్దరి సంపాదన నెలకు రూ.20 వేల లోపే. ఇంటి అద్దె, పిల్లల చదువులు, ఇతర అవసరాలకు సంపాదన సరిపోక అవస్థలు ఎదుర్కొన్నారు. అక్కడ సెంటు స్థలం రూ.3 లక్షల పైమాటే ఉండటంతో సొంతిల్లు కలేనని రమాదుర్గ వేదనకు గురయ్యేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ఆమెకు ఉచితంగా ఇంటి స్థలం అందింది. గృహ నిర్మాణానికి ఆర్థిక సాయం అందడంతో వేగంగా కొనసాగుతోంది. ఇటీవల స్లాబ్ కూడా వేశారు. ప్రస్తుతం గోడలకు ప్లాస్టింగ్, ఇతర పనులు జరుగుతున్నాయి. వచ్చే ఫిబ్రవరికి ఇంటి నిర్మాణం పూర్తవుతుందని, ఆ నెలలో మంచి రోజులు ఉన్నందున గృహ ప్రవేశం చేస్తామని రమాదుర్గ చెబుతోంది. ఆమెతో పాటు బుల్లియ్యరేవులోని వైఎస్సార్ జగనన్న లేఅవుట్లో పేదలకు ప్రభుత్వం 170 ఇళ్లను మంజూరు చేసింది. 60 ఇళ్ల నిర్మాణం దాదాపు పూర్తి కాగా మిగిలినవి వేగంగా కొనసాగుతున్నాయి. -
AP: రాజధానిలో 900.97 ఎకరాల్లో పేదలకు ఇళ్లు
సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాలను గృహ అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా సీఆర్డీఏ మాస్టర్ ప్లాన్‌లోని జోన్లలో మార్పులు చేసింది. చదవండి: ఎగుమతుల హబ్‌గా ఏపీ.. ఈ మేరకు శుక్రవారం డ్రాఫ్ట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న అఫర్టబుల్, ఈడబ్ల్యూఎస్ హౌసింగ్ జోన్‌తోపాటు రెసిడెన్షియల్ జోన్ నిబంధనల్లో మార్పులు చేస్తూ కొత్త జోన్‌ను తీసుకురానుంది. దీనిపై నవంబర్ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపింది. -
విశాఖలో టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి : విశాఖపట్నం మురికివాడల్లోని నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కూడిన పక్కా ఇళ్లు అందిస్తోంది. ఈ మేరకు జీవీఎంసీలోని మొత్తం 13 ప్రాంతాల్లో జీ+3 విధానంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను శనివారం లబ్ధిదారులకు అందించనుంది. ఇటీవల మంగళగిరి, తెనాలిలలో నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు అందించిన టిడ్కో అధికారులు మహా విశాఖ నగరపాలక సంస్థ పరిధిలోనూ నేడు తొలి విడతగా 2,632 యూనిట్లను లబ్ధిదారులకు అందించనున్నారు. విశాఖ మహానగరంలో మొత్తం 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తుండగా, తొలి విడతలో రాజీవ్ కాలనీ, పైడిమాంబ కాలనీ, చిలకపేట, ఆదర్శ గ్రామం, సీహార్స్ కాలనీ, గౌరీనగర్, సుద్దగెడ్డ, ఏఎస్ఆర్ కాలనీ, టీఆర్ ముత్యమాంబ కాలనీ, రాతిచెరువు, అగనంపూడి, పరవాడ, చినముషిడివాడ ప్రాంతాల్లో పూర్తిచేసిన ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ఒకప్పుడు ప్రజలు జీవించేందుకు అవసరమైన కనీస వసతులు కూడా లేక చాలా ఇబ్బందులు పడేవారు. అలాంటి పరిస్థితుల నుంచి ఈ 13 కాలనీల్లో నేడు పక్కా ఇళ్లతోపాటు రోడ్లు, మురుగునీటి పారుదల వ్యవస్థ, విద్యుత్ వంటి సౌకర్యాలు కల్పించి నిరుపేదలు సగౌరవంగా జీవించే స్థాయిలో ఇళ్లను నిర్మించారు. అన్ని వసతులతో పూర్తిచేసిన ఈ ఇళ్లను లబ్ధిదారులకు అందిస్తున్నామని, అందుకు అవసరమైన ఏర్పాట్లుచేసినట్లు టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ ‘సాక్షి’కి తెలిపారు. పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా వీటిని శనివారం లబ్ధిదారులకు అందిస్తామని ఆయన వివరించారు. పంపిణీ ప్రాంగణంలోనే లబ్ధిదారులకు ఇళ్ల తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలను కూడా ఇవ్వనున్నారు. ఆయా ప్రాంతాల్లో పంపిణీ ఏర్పాట్లను శుక్రవారం టిడ్కో చైర్మన్ జమ్మాన ప్రసన్నకుమార్, చీఫ్ ఇంజనీర్ గోపాలకృష్ణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు పరిశీలించారు. డిసెంబర్లో మరో 8 వేలు మహా విశాఖ నగర పాలక సంస్థ పరిధిలో వివిధ కేటగిరీల్లో మొత్తం 20 వేలకు పైగా టిడ్కో ఇళ్లను నిర్మిస్తున్నాం. శనివారం మొదటి విడతగా 2,632 యూనిట్లను 13 ప్రాంతాల్లో లబ్ధిదారులకు అందిస్తాం. డిసెంబర్లో మరో 8 వేల ఇళ్లను పంపిణీ చేస్తాం. మిగిలిన యూనిట్లను వచ్చే మార్చి నాటికి అందిస్తాం. టిడ్కో ఇళ్లు నిర్మించిన అన్నిచోట్లా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్ని మౌలిక వసతులు కల్పించాకే ఇళ్లను అప్పగిస్తున్నాం. – చిత్తూరు శ్రీధర్, టిడ్కో ఎండీ -
ఆవ భూముల్లో ఇళ్ల పట్టాలకు లైన్ క్లియర్
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ, రాజానగరం మండలాల్లోని ఆవ భూముల్లో ఇళ్ల పట్టాల మంజూరుకు లైన్ క్లియర్ అయింది. నవరత్నాలు – పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఆవ భూముల్లో ఇళ్ల పట్టాల మంజూరుకు హైకోర్టు ఆమోదం తెలిపింది. ఈ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించకుండా ప్రభుత్వాన్ని ఆదేశించాలని, ఆ భూముల విషయంలో అక్రమాలు జరిగాయని, వీటిపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలను కొట్టేసింది. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు భారీ స్థాయిలో నివాస వసతి కల్పిస్తోందని, అందులో భాగంగానే పేదలందరికీ ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తున్నామని, స్టే వల్ల 40 వేల మందికి పట్టాల మంజూరు ఆగిపోయిందన్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనతో హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల పట్టాల మంజూరుపై విధించిన స్టేను ఎత్తివేసింది. ఆవ భూముల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయన్న పిటిషనర్ల వాదనను సైతం హైకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులు ధర్మాసనం మంగళవారం తీర్పు వెలువరించింది. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఎ.శ్రీనివాసరావు 2020లో దాఖలు చేసిన ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్)పై విచారణ జరిపిన అప్పటి సీజే నేతృత్వంలోని ధర్మాసనం.. ఆవ భూములను పేదలందరికీ ఇళ్ల పథకం కింద ఇళ్ల స్థలాలకు కేటాయించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ అదే ఏడాది ఆగస్టులో మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఇదే అంశంపై మరిన్ని వ్యాజ్యాలు కూడా దాఖలయ్యాయి. ఈ వ్యాజ్యాలపై ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం సుదీర్ఘ విచారణ జరిపింది. రాక్షసుల్లా ప్రజా సంక్షేమాన్ని అడ్డుకుంటున్నారు ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ప్రజా సంక్షేమాన్ని ఆశించి పూర్వ కాలంలో మహర్షులు చేసిన యాగాలను రాక్షసులు హోమగుండంలో రక్త మాంసాలు వేసి అడ్డుకున్నట్లుగానే ఇప్పుడు ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమ పథకాలను ప్రజా ప్రయోజన వ్యాజ్యాల పేరుతో కొందరు అడ్డుకుంటున్నారని తెలిపారు. భూ సేకరణ చట్ట నిబంధనలకు లోబడే సంప్రదింపుల ద్వారా భూములు తీసుకున్నామన్నారు. చట్టం నిర్దేశించిన దానికంటే ఎక్కువే పరిహారం చెల్లించామని వివరించారు. భూములు ఇచ్చిన వారికి, తీసుకుంటున్న వారికి లేని అభ్యంతరం పిటిషనర్లకు ఎందుకని అన్నారు. పిటిషనర్ల తరపు న్యాయవాది డీవీఎస్ఎన్ ప్రసాద్‌బాబు వాదనలు వినిపిస్తూ.. ముంపునకు గురయ్యే ఆవ భూముల్లో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తోందని, నిర్దేశించిన దానికంటే ఎక్కువ చెల్లించారని, ఇదో పెద్ద కుంభకోణమని, అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం, ఈ ఏడాది సెప్టెంబర్ 1న తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పు వెలువరించింది. ప్రభుత్వం తరఫున అదనపు ఏజీ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. భూములు ఇచ్చిన వారికి, తీసుకుంటున్న వారికి లేని అభ్యంతరాలను పిటిషనర్లు లేవనెత్తడాన్ని తప్పుపట్టింది. ఆవ భూముల కొనుగోళ్లలో రూ.700 కోట్ల మేర అక్రమాలు జరిగాయన్న పిటిషనర్ల వాదనను సైతం ధర్మాసనం తోసిపుచ్చింది. -
జోరుగా టిడ్కో ఇళ్ల పంపిణీ
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందజేసే ప్రక్రియ వేగం పుంజుకుంది. కోనసీమ జిల్లా మండపేట పురపాలక సంఘం పరిధిలో నిర్మించిన ఇళ్లలో 2,720 యూనిట్లను పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ చేతుల మీదుగా సోమవారం లబ్ధిదారులకు అందజేశారు. ఈ నెల 15న మంగళగిరి పరిధిలో, 21న జీవీఎంసీలో కూడా ఇళ్లను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లుచేశారు. వీటితోపాటు తెనాలి, పొన్నూరు, చిలకలూరిపేట నంద్యాలతోపాటు మొత్తం తొమ్మిది పట్టణాల్లో 20,176 ఇళ్లను పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది జూన్ 23న విజయనగరంలో ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆగస్టు నాటికి 39,820 యూనిట్లను టిడ్కో అధికారులు అందజేశారు. అలాగే, సెప్టెంబర్‌లో ఆదోనిలో 2,500, ఎమ్మిగనూరులో రెండువేల యూనిట్లను పంపిణీ చేశారు. నిజానికి వర్షాల కారణంగా పంపిణీ ఆలస్యమైనా ఆ తర్వాత నిర్మాణాలు పూర్తిచేసుకున్న చోట అన్ని వసతులు కల్పించి లబ్ధిదారులకు అందించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. దీంతో మౌలిక వసతులు కల్పించి నెలన్నర వ్యవధిలో 39,820 యూనిట్లను పంపిణీ చేశారు. మొత్తం రెండు నెలల వ్యవధిలో 44,320 ఇళ్లను లబ్ధిదారులకు అందించారు. ఈ నెలలో మరో 20,176 యూనిట్లను అందించనున్నారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిదిద్ది నిర్మాణం మరోవైపు గత టీడీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంచేసిన టిడ్కో ఇళ్ల పథకాన్ని ప్రస్తుత వైఎస్సార్ సీపీ సర్కారు పునరుద్ధరించి 88 పట్టణ స్థానిక సంస్థల్లో 2,62,216 ఇళ్లను జీ ప్లస్ త్రీ విధానంలో నిర్మాణం చేపట్టింది. వీటిలో 300 చ.అ. విస్తీర్ణంగల 1,43,600 ఇళ్లను ఒక్క రూపాయికే అందించడంతో పాటు వీటికయ్యే ఆర్థిక భారం రూ.3,805 కోట్లను ప్రభుత్వమే భరిస్తోంది. ఇక 365 చ.అ., 430 చ.అ. విస్తీర్ణం కలిగిన 1,18,616 ఇళ్ల నిర్మాణం కూడా వేగంగా పూర్తి చేస్తోంది. అంతేకాక, లబ్ధిదారులు అందరికీ ఆర్థికంగా లబ్ధి చేకూర్చేందుకు దాదాపు రూ.1,000 కోట్లను ప్రభుత్వమే భరించి ఉచితంగా రిజిస్ట్రేషన్లు చేస్తోంది. టిడ్కో ఇళ్ల పత్రాలు, తాళాలు గృహ సముదాయ ప్రాంగణాల్లోనే అందజేస్తున్నామని, ఇకపైనా అదే విధానం కొనసాగుతుందని టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్ ‘సాక్షి’కి తెలిపారు. అక్టోబర్ నెల పంపిణీ ప్రక్రియ మండపేట నుంచి ప్రారంభించామని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ చెప్పారు. ఇళ్ల పంపిణీ ప్రాంగణంలోనే ఇంటి తాళాలతో పాటు రిజిస్ట్రేషన్ పత్రాలు కూడా అందిస్తున్నట్లు ఆయన వివరించారు. పేదలకు అండగా ప్రభుత్వం.. గత టీడీపీ ప్రభుత్వం టిడ్కో ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేయకుండా వదిలేసింది. మా ప్రభుత్వం 2.62 లక్షల ఇళ్లల్లో 1.43 లక్షల యూనిట్లు నిరుపేదలకు చెందినవే. వీటికి గత పాలకులు ఒక్కో యూనిట్‌కు రూ.2.60 లక్షల ధర నిర్ణయించి, బ్యాంకు రుణాలు మంజూరు చేశాక, ప్రతి నెలా రూ.3 వేల చొప్పున 20 ఏళ్లు చెల్లించాలని చెప్పింది. అలా చెల్లిస్తే ఒక్కొక్కరు మొత్తం రూ.7.20 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. 1.43 లక్షల మందిపైనా సుమారు రూ.10 వేల కోట్లకు పైగా భారం పడుతుంది. కానీ, సీఎం వైఎస్ జగన్ 300 చ.అ. ఇళ్లను ఒక్క రూపాయికే ఇచ్చారు. అంతేకాక.. రూ.6 వేల కోట్లతో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. డిసెంబర్ నాటికి మొత్తం 2.62లక్షల యూనిట్లను అందజేస్తాం. – డాక్టర్ ఆదిమూలపు సురేష్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి -
డ్రైనేజీ.. కరెంట్.. నీళ్లు
నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో భాగంగా ఇప్పటిదాకా మొత్తం 21.25 లక్షల ఇళ్లను మంజూరు చేశాం. ఆ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి. ప్రాధాన్యత పనులపై ప్రధానంగా దృష్టి సారించి, ప్రణాళిక మేరకు పనులు చేపట్టాలి. చాలా చోట్ల కాలనీలు కాదు.. ఏకంగా పట్టణాలనే నిర్మిస్తున్నందున మౌలిక సదుపాయాల్లో ఎలాంటి లోటుపాట్లు లేకుండా శ్రద్ధ పెట్టాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలకు పక్కా గృహాలు నిర్మించి ఇచ్చే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని, ప్రధానంగా డ్రైనేజీ, కరెంట్, తాగు నీటిపై దృష్టి పెట్టామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. ఈ క్రమంలో ప్రభుత్వ లక్ష్యాలను చేరుకోవడానికి అధికారులు మరింత కృషి చేయాలని, పనులు వేగంగా సాగేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’పై తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా గత సమీక్షలో సీఎం జారీ చేసిన ఆదేశాల అమలు తీరును అధికారులు వివరించారు. ఈ పథకం కింద 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు రూ.4,318 కోట్ల విలువైన పనులు చేశామని తెలిపారు. తొలి దశలో 15.6 లక్షలు, రెండో దశలో 5.65 లక్షలు.. మొత్తంగా 21.25 లక్షల ఇళ్లను ఇప్పటి వరకు మంజూరు చేశామన్నారు. ఇన్నాళ్లూ నిర్మాణ పనులు ముమ్మరంగా కొనసాగాయని, ప్రస్తుతం వర్షాల నేపథ్యంలో మందకొడిగా సాగుతున్నాయని తెలిపారు. వర్షాలు తగ్గగానే మళ్లీ పనులు ఊపందుకుంటాయన్నారు. అక్టోబర్ నుంచి వారానికి 70 వేల ఇళ్ల చొప్పున ఒక దశ నుంచి వేరే దశకు నిర్మాణం మారేలా ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఇంటిని ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్–3 ఎంపిక చేసుకున్న ఇళ్ల పనులు కూడా వేగవంతంగా చేపడుతున్నామని చెప్పారు. ఆప్షన్–3 ఇళ్లు నిర్మించే కాంట్రాక్టర్లతో వారం వారం పనుల పురోగతిపై సమీక్ష చేస్తున్నామని తెలిపారు. పనులు పూర్తయిన టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పజెబుతున్నామని చెప్పారు. ఇళ్ల పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న 96.8 వేల మందికి పట్టాలు ఇచ్చామన్నారు. మరో 1.07 లక్షల మందికి పట్టాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నామని చెప్పారు. ఈ క్రమంలో సీఎం వైఎస్ జగన్ ఏమన్నారంటే.. ఏజెన్సీ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి ► పేదల ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ఇళ్ల నిర్మాణాలు వేగంగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోండి. గృహ నిర్మాణంలో వెనకబడ్డ జిల్లాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి. ఏజెన్సీ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి. ► ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే సరికి వైఎస్సార్ జగనన్న కాలనీల్లో డ్రైనేజీ, కరెంటు, తాగు నీరు వంటి కనీస మౌలిక వసతులు కల్పించాలి. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో రాజీ పడొద్దు. ప్రాధాన్యత పనులపై స్పష్టమైన ప్రణాళిక రూపొందించుకుని, ఆ మేరకు అడుగులు ముందుకు వేయాలి. మరో వైపు ఇళ్ల నిర్వహణపైనా ప్రత్యేక దృష్టి పెట్టండి. లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. ► ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలను వేగంగా చేపట్టండి. స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) ప్రకారం కాంట్రాక్ట్ సంస్థలు లే అవుట్లలో బ్రిక్స్ ప్లాంట్ల ఏర్పాటు, ఇతర చర్యలు చేపట్టాయో లేదో పరిశీలించాలి. నిర్మాణమైన ఇళ్లలో సమకూర్చే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్ లైట్లు నాణ్యమైనవిగా ఉండాలి. కాలనీల రూపంలో కొన్ని చోట్ల ఏకంగా మున్సిపాలిటీలే వెలుస్తున్నాయి. అలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పౌర సేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. ► ఈ ఏడాది డిసెంబర్ నాటికి అన్ని టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అందించాలి. ఈ ఇళ్లలో మౌలిక సదుపాయాల కల్పన పనులను అత్యంత నాణ్యతతో చేపట్టాలి. ఈ సమీక్షలో పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, సీఎస్ సమీర్ శర్మ, ఏపీఎస్‌హెచ్‌సీఎల్ చైర్మన్ దవులూరి దొరబాబు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సీఎస్ సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా, టిడ్కో ఎండీ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
Andhra Pradesh: ఇళ్ల పథకంలో జోక్యానికి ఎన్జీటీ ‘నో’
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం విషయంలో జోక్యానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) తిరస్కరించింది. ఈ పథకం కింద నంద్యాల జిల్లాలో 5,200 ఇళ్ల పట్టాల మంజూరువల్ల పర్యావరణపరంగా కుందు నది తీవ్రంగా ప్రభావితమవుతుందంటూ దాఖలైన పిటిషన్‌ను హరిత ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. కుందు నది పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టిందని ఎన్జీటీ స్పష్టంచేసింది. పేదల ఇళ్ల నిర్మాణాన్ని అడ్డుకునేందుకు టీడీపీ చేసిన కుట్రలు ట్రిబ్యునల్ తీర్పుతో పటాపంచలయ్యాయి. మరోవైపు.. ఇళ్ల స్థలాల మంజూరువల్ల పర్యవరణంగా కుందు నదిపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయంటూ పిటిషనర్ చేసిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాల్లేవని ఎన్జీటీ తెలిపింది. 5,200 ఇళ్ల స్థలాల మంజూరుకు ఉద్దేశించిన 145.61 ఎకరాల భూమిని పేదలందరికీ ఇళ్ల పథకం కోసం ఉపయోగించవచ్చా? లేదా? అన్న విషయం జోలికి కూడా తాము వెళ్లబోవడంలేదని ఎన్జీటీ తేల్చిచెప్పింది. ఆ భూములను ఇళ్ల స్థలాలకు కేటాయించడంపై హైకోర్టులో విచారణ జరుగుతున్న నేపథ్యంలో, ఆ భూముల విషయంలో తాము ఏ రకంగానూ జోక్యం చేసుకోవడంలేదని వివరించింది. ఇరువైపులా బఫర్‌జోన్ ఏర్పాటుచేసి కుందు నది బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలపట్ల సంతృప్తి వ్యక్తంచేసింది. నది ప్రవాహ ఎగువ, దిగువ ప్రాంతాల్లో శాస్త్రీయ ప్రాతిపదికన ప్రభుత్వం ప్రతిపాదించిన చర్యలు వరద విషయంలో పిటిషనర్ వ్యక్తంచేసిన అనుమానాలన్నింటినీ నివృత్తి చేసేలా ఉన్నాయని స్పష్టంచేసింది. అయితే, కుందు నదికి ఇరువైపులా ఏర్పాటుచేసిన బఫర్ జోన్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టడానికి వీల్లేదని తెలిపింది. ఒకవేళ హైకోర్టు ఆ 145 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయించడాన్ని సమర్థించినప్పటికీ, పేదలందరికీ ఇళ్ల పథకం ప్రాజెక్టు అమలు విషయంలో పర్యావరణ చట్టాలను తూచా తప్పకుండా అమలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే, వ్యర్థాల నిర్వహణ నిబంధనలను పాటించాలని, కుందు నదిలో గానీ, బఫర్ జోన్ ప్రాంతంలోగానీ వదలడానికి, వీల్లేదని ఆదేశించింది. ఈ మేరకు ఎన్జీటీ జ్యుడీషియల్ మెంబర్ జస్టిస్ కె. రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ కొర్లపాటి సత్యగోపాల్ ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది. ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల ఇబ్బంది లేదు కుందు నది విస్తరణ నిమిత్తం నంద్యాల మండలం, మూలసాగరం పరిధిలో ప్రభుత్వం 2013లో 209.5 ఎకరాల భూమిని సేకరించింది. ఇందులో కొంతభాగాన్ని బఫర్ జోన్‌కు కేటాయించింది. మిగిలిన 145 ఎకరాల భూమిలో పేదలకు 5,200 ఇళ్ల పట్టాలు మంజూరుచేయాలని నిర్ణయించింది. దీన్ని సవాల్ చేస్తూ నంద్యాల సంజీవ్‌నగర్‌కు చెందిన షేక్ నూమాన్ బాషా పేరుతో ఎన్జీటీలో ఫిర్యాదు నమోదైంది. ఆ 145 ఎకరాల భూమిని ఇళ్ల స్థలాల కోసం కేటాయిస్తే వర్షాకాలంలో నంద్యాల ప్రజలు వరదను ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై ఎన్జీటీ ప్రభుత్వ వివరణ కోరింది. అలాగే, క్షేత్రస్థాయిలో వాస్తవాలను పరిశీలించేందుకు ఓ కమిటీని కూడా ఏర్పాటుచేసింది. ఇళ్ల స్థలాల కేటాయింపువల్ల ఎలాంటి ప్రతికూల ప్రభావం పడదంటూ కమిటీ నివేదిక ఇచ్చింది. సర్కారు అన్ని జాగ్రత్తలూ తీసుకుంది ఇక ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. కుందు నది పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుందన్నారు. నదికి ఇరువైపులా బలోపేతం చేసేందుకు నిర్మాణ పనులను సైతం ప్రారంభించిందన్నారు. తగినంత భూమిని బఫర్ జోన్ కింద విడిచిపెట్టి మిగిలిన భూమినే ఇళ్ల స్థలాల మంజూరు కోసం వినియోగిస్తున్నామన్నారు. అదనపు ఏజీ వాదనలతో ఏకీభవించిన ఎన్జీటీ ధర్మాసనం ఇళ్ల స్థలాల కేటాయింపు వల్ల కుందు నదిపై పర్యావరణపరంగా ఎలాంటి ప్రభావం ఉంటుందన్న అంశానికే తాము పరిమితమవుతున్నట్లు తెలిపింది. -
‘పేదల ఇంటికి’ మరింత సాయం
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అదనపు సాయం అందిస్తోంది. ఈ పథకం కింద 30 లక్షలకు పైగా ఇళ్లు లేని పేదలకు పక్కా ఇళ్లను ప్రభుత్వం నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా పేదలకు ఇళ్ల స్థలాలను ఉచితంగా పంపిణీ చేయడమే కాకుండా, ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. ఇసుక ఉచితంగా ఇస్తోంది. సబ్సిడీపై ఐరన్, సిమెంట్ ఇతర నిర్మాణ సామగ్రి ప్రభుత్వమే సమకూరుస్తోంది. మరో అడుగు ముందుకు వేసి ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున బ్యాంక్ రుణాలను అందిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్లను రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వం నిర్మిస్తోంది. వీటి నిర్మాణం చురుగ్గా సాగుతుంది. ఇళ్లు నిర్మించుకుంటున్న 4,38,868 మంది లబ్ధిదారులకు ఇప్పటివరకు రూ.1,548.24 కోట్లు బ్యాంకుల నుంచి రుణంగా ఇప్పించింది. ఈ రుణాల మంజూరుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. రుణాలు సకాలంలో మంజూరయ్యేలా సమన్వయం కోసం ప్రత్యేకంగా క్షేత్ర స్థాయిలో సిబ్బందికి బాధ్యతలు అప్పగించింది. మరో వైపు గృహ రుణం మంజూరులో కీలకమైన సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారిందని ప్రభుత్వం గుర్తించింది. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఎస్ఎల్బీసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం సిబిల్ స్కోరు విషయాన్ని బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లింది. సిబిల్ స్కోర్ నుంచి మినహాయించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఎస్ఎల్బీసీ.. ఈ గృహాల లబ్ధిదారులకు సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలివ్వడం గమనార్హం. దీంతో ‘నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు’ లబ్ధిదారులకు సులభంగా పావలా వడ్డీకి రుణాలు లభిస్తున్నాయి. -
ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణానికి అవసరమైన పనులను వారంలోగా పూర్తి చేయాలని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ ఆ శాఖ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులతో ఆయన బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారులను కాంట్రాక్టర్లకు మ్యాపింగ్ చేయడం, అవగాహన ఒప్పందాలు, బ్యాంక్ ఖాతాలను ప్రారంభించడం తదితర పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని చెప్పారు. విశాఖపట్నంలో సుమారు 1.24 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నందున.. లబ్ధిదారులకు బ్యాంక్ ఖాతాలు ప్రారంభించేందుకు వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. కాంట్రాక్టర్లు సకాలంలో నిర్మాణాలు పూర్తి చేయడానికి చర్యలు చేపట్టాలని, ఇందుకోసం ప్రతి లేఅవుట్లో ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గృహ నిర్మాణ సంస్థ ఎండీ డాక్టర్ నారాయణ భరత్ గుప్తా మాట్లాడుతూ.. నిర్మాణాలకు సకాలంలో సామగ్రి సరఫరాతో పాటు బిల్లులు చెల్లిస్తామన్నారు. -
ఫుల్ స్పీడ్‌తో ఇళ్లు
రాష్ట్రంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లను నిర్మించి అందచేసే నవరత్నాలు – పేదలందరికీ ఇళ్లు పథకానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ నిధులు సక్రమంగా విడుదల చేస్తున్నాం. పేదల గృహ నిర్మాణ పనులను వేగంగా కొనసాగించాలి. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాల్లో వేగం మరింత పెరగాలని అధికార యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. విశాఖలో ఇప్పటికే ఇళ్ల స్థలాలు ఇచ్చిన నేపథ్యంలో గృహ నిర్మాణాలను త్వరగా చేపట్టాలని నిర్దేశించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో కనీస సదుపాయాల కల్పనపై దృష్టి పెట్టాలని సూచించారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సోమవారం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలివీ.. అర్హులందరికీ ఇవ్వాల్సిందే.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద ఇప్పటికే 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ఇటీవలే విశాఖలో 1.24 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేశాం. ఈ ఇళ్ల నిర్మాణాలను వీలైనంత త్వరగా ప్రారంభించాలి. ఇళ్ల నిర్మాణంతోపాటు వైఎస్సార్ జగనన్న కాలనీల్లో సమాంతరంగా కనీస సదుపాయాల కల్పన పనులపై దృష్టి పెట్టాలి. డ్రైనేజీ, నీరు, విద్యుత్తు లాంటి కనీస సదుపాయాలు కల్పించాలి. ప్రతి దశలోనూ నాణ్యతపై దృష్టి పెట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడొద్దు. కాలనీల్లో ఇంకా ఎక్కడైనా ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులు మిగిలిపోతే వేగంగా పూర్తి చేయాలి. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్లు లేఅవుట్లలో ఇటుకల తయారీ యూనిట్లు, ఇతర ఏర్పాట్లు చేసుకున్నారో లేదో పర్యవేక్షించాలి. లబ్ధిదారుల సహాయార్థం టోల్‌ఫ్రీ నంబర్ ఏర్పాటు చేయాలి. ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు కేటాయించిన స్థలాన్ని నిర్దిష్టంగా చూపించి పట్టా, సంబంధిత డాక్యుమెంట్లన్నీ అందచేయాలి. ఇళ్ల పట్టాల మంజూరులో ఎలాంటి జాప్యం జరగటానికి వీల్లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇళ్ల స్థలం మంజూరు కావాల్సిందే. సమీక్షలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్వ సదుపాయాలతో టిడ్కో ఇళ్లు పట్టణ పేదల కోసం నిర్మిస్తున్న టిడ్కో ఇళ్లను పూర్తి సదుపాయాలతో లబ్ధిదారులకు అందించాలి. లబ్ధిదారుల పేర్లతో ఇళ్ల రిజిస్ట్రేషన్ల ప్రక్రియను వేగవంతం చేయాలి. ఇప్పటికే 75 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు పూర్తయ్యాయి. మరో 73 వేల ఇళ్ల రిజిస్ట్రేషన్లు ఈ నెలాఖరు కల్లా పూర్తి చేయాలి. మొత్తం 1.48 లక్షల ఇళ్లను లబ్ధిదారుల పేర్లతో రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలి. లబ్ధిదారులకు బ్యాంకు రుణాలు త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి. నిర్మాణాల్లో పెండింగ్ పనులను పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేస్తాం. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలి. టిడ్కో ఇళ్ల నిర్వహణపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టాలి. నిర్వహణ మెరుగ్గా ఉండేలా మార్గదర్శకాలు రూపొందించాలి. వేగంగా ఆప్షన్ 3 ఇళ్ల నిర్మాణం విశాఖలో పేదల ఇళ్ల నిర్మాణాలను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, అక్టోబరు చివరి నాటికి మొదలవుతాయని అధికారులు తెలిపారు. మరోవైపు ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. వైఎస్సార్ జగనన్న కాలనీల్లో పనుల ప్రగతిపై సమీక్ష, సందేహాల నివృత్తికి వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యాన్ని అక్కడ నుంచే కల్పించినట్లు తెలిపారు. 15 నుంచి 20 రోజుల్లోగా 1.4 లక్షల టిడ్కో ఇళ్లు అన్ని సదుపాయాలతో సిద్ధమవుతాయని వెల్లడించారు. ఇళ్ల స్థలాల కోసం అందిన దరఖాస్తులను పరిష్కరించి 2,03,920 మందిని అర్హులుగా నిర్ణయించి ఇప్పటికే లక్ష మందికి పట్టాలు అందచేసినట్లు వెల్లడించారు. మిగతా వారికీ ఇళ్ల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దొరబాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక, ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్షి, ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్, టిడ్కో ఎండీ సీహెచ్ శ్రీధర్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ భరత్ గుప్తా, సీసీఎల్ఏ కార్యదర్శి ఏ.బాబు తదితరులు సమీక్షలో పాల్గొన్నారు. -
AP: సొంతింటి కల.. నెరవేరుతోందిలా
సాక్షి, అమరావతి: పేదల సొంతింటి కల సాకారానికి సీఎం వైఎస్ జగన్ సర్కార్ పెద్దపీట వేస్తోంది. దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో చర్యలు చేపడుతోంది. ఏకంగా 30.76 లక్షల పేద కుటుంబాల సొంతింటి కలను నిజం చేసేందుకు ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఉచితంగా ఇంటి స్థలాలను పంపిణీ చేసింది. అంతటితో వదిలేయకుండా.. నిర్మాణానికి రూ.1.80 లక్షల సాయం అందిస్తోంది. ఇదికాక.. సబ్సిడీపై నిర్మాణ సామాగ్రి సరఫరా, లేఅవుట్లలో మౌలిక వసతులు ఇలా అనేక విధాలుగా సర్కారు సాయం చేస్తోంది. మొత్తంమీద ఇలా లబ్ధిదారులకు ప్లాట్ల కేటాయింపు, మౌలిక సదుపాయాల కల్పన, బిల్లు చెల్లింపులు, సబ్సిడీల రూపంలో రూ.లక్ష కోట్లకు పైగా ప్రభుత్వం పేదలకు మేలు చేకూరుస్తోంది. బాబు హయాంలో బిల్లు, సిమెంట్ మాత్రమే ఇక టీడీపీ హయాంలో సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు మాత్రమే అనుమతులిచ్చారు. కానీ, దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంజూరు చేసిన దాఖలాల్లేవు. పైగా.. ఇళ్ల మంజూరు జన్మభూమి కమిటీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడి ఉండేది. అంతేకాక.. లబ్ధిదారుడి ఇంటి నిర్మాణానికి బిల్లుతో పాటు సిమెంట్‌ను మాత్రమే సబ్సిడీపై ప్రభుత్వం అందించింది. యూనిట్లు కూడా అప్పట్లో చాలా తక్కువ. దీంతో 2014 నుంచి 2019 మధ్య 4,07,544 టన్నుల సిమెంట్‌ను మాత్రమే లబ్ధిదారులకు సరఫరా చేశారు. మొత్తంమీద టీడీపీ హయాంలో ఇల్లు కావాలనుకునే వారికి పెద్దగా ఒరిగింది ఏమీలేదు. అప్పట్లో లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నా.. టీడీపీకి బాకాలూదే ఎల్లో మీడియాకు చీమకుట్టినట్లు కూడా అనిపించలేదు సరికదా.. దానిని మహాద్భుతంలా చిత్రీకరించాయి. పక్కాఇళ్లు లేక ముందు గుబ్బల కనక విజయలక్ష్మి నివసించిన పూరి గుడిసె, ప్రస్తుతం నిర్మించుకున్న పక్కా ఇంటి ముందు గుబ్బల కనక విజయలక్ష్మి నిర్మాణానికీ సర్కారు చేయూత పథకం కింద తొలిదశలో రాష్ట్రవ్యాప్తంగా 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కో ఇంటి నిర్మాణానికి ఉచితంగా 20 టన్నుల ఇసుక, సబ్సిడీపై 100 బస్తాల సిమెంట్, 480 కిలోల ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రిని ప్రభుత్వం అందిస్తోంది. ఇలా ఇప్పటివరకూ 34,93,026 టన్నుల ఇసుక, 8,16,280 టన్నుల సిమెంట్, 66,880 టన్నుల ఇనుము లబ్ధిదారులకు సరఫరా చేశారు. ఈ క్రమంలో రూ.15 వేల విలువైన ఇసుక, సిమెంట్, ఇనుము, ఇతర నిర్మాణ సామాగ్రి సబ్సిడీపై అందించడం ద్వారా రూ.40వేల మేర లబ్ధిదారులకు ఆదా అవుతోంది. ఈ లెక్కన ఒక్క నిర్మాణ సామాగ్రి రూపంలోనే ఒక్కో లబ్ధిదారుడికి రూ.55వేల మేర మేలు చేకూరుస్తోంది. దీంతోపాటు పావలా వడ్డీకే రూ.35వేల చొప్పున బ్యాంకు రుణాలు అందిస్తోంది. ఈ ఫొటోలో కనిపిస్తున్న మహిళ పేరు సయ్యద్ ఫజ్లునా. ఈమెది అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం. భర్త రియాజ్, కుమారుడు సలీం, కోడలు, చిన్నపిల్లతో కలిసి జయనగర్‌లో నివాసముంటోంది. కూలీ పనులు చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. వీరికి సొంతిల్లు లేదు. 2019 ముందువరకూ చాలాసార్లు ప్రయత్నించినా మంజూరుకాలేదు. కానీ, సీఎం జగన్ ప్రభుత్వం స్థలం, ఇల్లు మంజూరు చేస్తోందని తెలిసి ఫజ్లునా దరఖాస్తు చేసింది. కురాకులతోట లేఅవుట్లో స్థలం మంజూరుతో పాటు ఇంటి నిర్మాణానికి అనుమతులూ లభించాయి. ప్రభుత్వం ఉచితంగా ఇసుక, సబ్సిడీతో సిమెంట్, ఇనుము కూడా అందించింది. దీంతో.. ‘మాకు గతంలో సొంతిల్లు లేకపోవడంతో బంధువులు, చుట్టుపక్కల వాళ్లకు మాపై చిన్నచూపు ఉండేది. ఇప్పుడు మా సొంతింటి కలను నెరవేరుస్తున్న జగన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు’.. అని ఫజ్లునా భావోద్వేగానికి గురైంది. ఇంటికి క్యూరింగ్ చేస్తున్న లబ్ధిదారు సయ్యద్ ఫజ్లునా 30 ఏళ్ల కల నెరవేరింది నా భర్త పడాల నర్సింహులు సైకిల్‌పై తిరుగుతూ పూల వ్యాపారం చేస్తుంటాడు. మేం 30ఏళ్లుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటికోసం గతంలో ఎన్నిసార్లు అర్జీ పెట్టుకున్నా ప్రయోజనం లేకపోయింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక మాకు స్థలం, ఇల్లు మంజూరైంది. నిర్మాణం పూర్తయింది. మా ఇంటి కల నెరవేరింది. – పడాల జగదాంబ, మార్టేరు, పెనుమంట్ర మండలం పశ్చిమ గోదావరి పూరి గుడిసె నుంచి పక్కా ఇంటికి.. మేం గుడిసెలో ఉంటున్నాం. వర్షాకాలంలో మా పరిస్థితి చాలా దారుణం. గతంలో చాలాసార్లు ఇంటికోసం దరఖాస్తు చేసుకున్నాం. ఫలితంలేదు. ప్రస్తుత ప్రభుత్వం స్థలం, ఇల్లు మంజూరు చేసింది. ఆర్థిక సహాయమూ చేయడంతో సొంత ఇంటిని నిర్మించుకున్నాం. పూరిగుడిసె నుంచి పక్కా ఇంటికి మారాం. సొంతింట్లోకి అడుగు పెడతామని ఊహించలేదు. – గుబ్బల కనక విజయలక్ష్మి, నర్సింగపురం, పిఠాపురం మండలం, కాకినాడ జిల్లా -
CM YS Jagan: స్పీడ్‌గా ‘ఆప్షన్ 3’
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం ద్వారా ప్రభుత్వమే నిర్మించి ఇచ్చే ఆప్షన్ – 3 ఎంచుకున్న లబ్ధిదారుల గృహ నిర్మాణాలను సత్వరమే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ) పాటించాలని స్పష్టం చేశారు. కోర్టు కేసులతో వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై ఈ నెలాఖరులోగా స్పష్టత కోసం ప్రయత్నించాలని అధికారులకు నిర్దేశించారు. పేదల ఇళ్ల నిర్మాణాలు, 90 రోజుల్లో లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీపై సోమవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణ ప్రగతిని అధికారులు వివరించారు. గతంలో ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా కాలనీల్లో అవసరమైన చోట్ల ల్యాండ్ లెవలింగ్, ఫిల్లింగ్, అంతర్గత రోడ్లు, గోడౌన్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ఆప్షన్–3 ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే... ప్రత్యామ్నాయ ప్రణాళికలు ఆప్షన్–3 ఇళ్లను నిర్మించే కాంట్రాక్టర్లు పనులపై ఎస్ఓపీలు రూపొందించాలి. ఇళ్ల నిర్మాణానికి అవసరమైన వనరులన్నీ కాలనీల్లో సమకూర్చుకున్నారా? ఇటుకల తయారీ యూనిట్లు కాలనీలకు సమీపంలోనే ఏర్పాటయ్యాయా? తదితర అంశాలు అందులో ఉండాలి. ఎస్ఓపీల ప్రకారం అధికారులు పర్యవేక్షించాలి. గోడౌన్లతోపాటు నీరు, విద్యుత్ సరఫరా లాంటి కనీస సదుపాయాలను కాలనీల్లో సమకూర్చుకుని నిర్మాణాలను వేగంగా చేపట్టాలి. కోర్టు కేసులతో వివాదాల్లో ఉన్న ఇళ్ల స్థలాలపై ఈ నెలాఖరులోగా స్పష్టత కోసం ప్రయత్నించాలి. స్పష్టత రాని పక్షంలో ఆగస్టు మొదటి వారంలో ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలి. ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్న నిరుపేదలకు ఎక్కడ ఇంటి స్థలాన్ని ఇచ్చారో చూపించడమే కాకుండా పట్టా, సంబంధిత డాక్యుమెంట్లన్నీ ఇవ్వాలి. స్థలాన్ని సమకూర్చడంతోపాటు పట్టా, ఇతర డాక్యుమెంట్లు కూడా ఇచ్చారని లబ్ధిదారుల నుంచి ధ్రువీకరణ పత్రం తీసుకోవాలి. హాజరైన మంత్రులు, ఉన్నతాధికారులు సమావేశంలో రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్, గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ దవులూరి దొరబాబు, సీఎస్ సమీర్ శర్మ, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీలక్ష్మి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ సాయి ప్రసాద్, గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌జైన్, గృహ నిర్మాణ సంస్థ ఎండీ ఎండీ నారాయణ భరత్ గుప్తా, జేఎండీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నాణ్యతలో రాజీ వద్దు వైఎస్సార్–జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల నాణ్యత విషయంలో రాజీ పడొద్దు. కాలనీల్లో డ్రైన్లు సహా విద్యుత్, నీటి సరఫరా లాంటి కనీస మౌలిక సదుపాయాల కల్పనకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి. అధికారులు ప్రతి దశలోనూ నాణ్యతపై దృష్టిపెట్టాలి. ఇళ్లకు సమకూర్చే ఫ్యాన్లు, బల్బులు, ట్యూబ్ లైట్లు నాణ్యమైనవిగా ఉండాలి. కాలనీల రూపంలో కొన్ని చోట్ల ఏకంగా మునిసిపాలిటీలే వెలుస్తున్నాయి. అలాంటి చోట్ల మౌలిక సదుపాయాల కల్పనతో పాటు పౌర సేవలు తదితర అంశాలపై ప్రత్యేక ప్రణాళిక ఉండాలి. -
ఇళ్లపై కుళ్లు రాతలు!
మొన్న ఐదేళ్లు. అంతకు ముందో ఎనిమిదేళ్లు. ఇన్నాళ్లు పాలించడాన్ని చంద్రబాబు నాయుడు రికార్డుగా చెబుతుంటారు. రామోజీరావు దాన్నో అద్భుతంలా ప్రశంసిస్తారు. బాబు ఆ కాలంలో ఏమీ చేయకున్నా సరే!! అదంతా గుప్తుల స్వర్ణయుగం మాదిరే చూపించాలని తాపత్రయపడుతుంటారు. మరోవైపు సీఎంగా బాధ్యతలు చేపట్టిన మూడేళ్లలోపే ఏకంగా 30.76 లక్షల కుటుంబాల సొంతింటి కలను నిజం చేస్తున్నారు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి. దీనికోసం ఏకంగా రాష్ట ప్రభుత్వం తరఫున 1,05,886 కోట్లు వెచ్చిస్తున్నారు. అయినా రామోజీకి నచ్చటం లేదు. ఇళ్లు కట్టుకోవటానికి కేంద్రమే 1.8 లక్షలిస్తోందని... రాష్ట్రమేమీ చేయట్లేదనే సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. కానీ బాబు హయాంలో ఎన్నిళ్లు ఇచ్చారో ఎన్నడూ అడగరు. ఎందుకిన్ని ఇళ్లు ఇవ్వలేదని ప్రశ్నించరు. అసలిన్నాళ్ల తరవాత కూడా 30.76 లక్షల కుటుంబాలకు ఇళ్లు ఇవ్వాల్సిన దయనీయ పరిస్థితులున్నాయనే వాస్తవం వయసు మీరిన ఆయన కళ్లకు ఆనదు. మరీ ఇంత దారుణమైన రాతలా రామోజీరావుగారూ? రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్లకు ఏం చేస్తోందో మీకు కనిపించటం లేదా? లేక మీరు చూడాలనుకోవటం లేదా? అసలు పనిగట్టుకుని ‘ఈనాడు’ రాస్తున్న రాతల్లో నిజమెంత!. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఇళ్లకోసం ఏం చేస్తోంది? ఎంత వెచ్చిస్తోంది? ఏది నిజం?... ఒకసారి చూద్దాం... అసలు 30.76 లక్షల మంది సొంతింటి కలను నిజం చేయటం కోసం భారీ లే ఔట్లు వేస్తుండటంతో ఏకంగా ఊళ్లే పుట్టుకొస్తున్న చరిత్ర దేశంలో ఇప్పటిదాకా ఎక్కడా లేదు. వీరికి రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా రూ.56,102 కోట్ల విలువైన భూములు కేటాయించింది. ఆ కాలనీల్లో మౌలిక సదుపాయాల కోసం రూ.36,026 కోట్లు వెచ్చిస్తోంది. ఇసుకను ఉచితంగా ఇవ్వటమే కాక ఇతర నిర్మాణ సామగ్రిని తక్కువ ధరలకే అందిస్తోంది. ఇన్ని చేసినా కొందరి ఇళ్లకు ఇంకా నిధులు కావాల్సి రావటంతో... వారికి రూ.35 వేల వరకూ బ్యాంకు రుణాన్ని పావలా వడ్డీకే ఇప్పిస్తోంది. వారిపై వడ్డీ భారం పడకుండా మిగిలిన వడ్డీని తనే చెల్లిస్తోంది. అయితే ఇన్ని ప్రత్యామ్నాయాలున్నప్పటికీ కొందరికి ఇళ్లు నిర్మించుకునే స్థోమత లేదు. అలాంటివారికి ఆప్షన్–3 కింద తనే ఇళ్లు పూర్తిగా నిర్మించి ఇస్తోంది. అలా ఇప్పటికి 3.27 లక్షల మందికి ఇళ్లు నిర్మిస్తోంది. ఇదీ... రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నది. ఇదంతా కేంద్రం చెల్లిస్తున్న 1.8 లక్షలకు అదనంగా..!!. చూస్తున్నారా రామోజీరావు గారూ!! ‘‘నాకు రూ.11 లక్షల విలువైన ఇంటి స్థలంతో పాటు ఉచితంగా 20 టన్నుల ఇసుక, 90 బస్తాలు సిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది’’ అంటున్న విశాఖ వాసి జి.అప్పల నారాయణమ్మకు జవాబు చెప్పే ధైర్యం మీకుందా? మీకోసం ఇవిగో... మీరు చెప్పని నిజాలు... ఈనాడు ఆరోపణ జగనన్న కాలనీల్లో స్థలం ఇస్తున్నారు. కట్టుకోవడానికి రూ.1.8 లక్షలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఘనంగా చెబుతోంది. నిజానికి ఇది కేంద్రం ఇచ్చే సాయం. నిజం ఇంటి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షలే ఇస్తోంది. మిగిలిన మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తోంది. ఇంటి పట్టా విషయంలో కేంద్ర ప్రభుత్వ పాత్ర లేదు. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే 30.76 లక్షల ఇళ్ల స్థలాలను పంపిణీ చేసింది. వీటి ప్రస్తుత మార్కెట్ విలువ రూ.56,102 కోట్లు. ఇంటి స్థలాన్ని ఇవ్వడమే కాకుండా జగనన్న కాలనీల్లో భూమిని చదును చేయడంతో పాటు రోడ్లు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ తదితర మౌలిక సదుపాయాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం రూ.36,026 కోట్లు వ్యయం చేస్తోంది. ఈనాడు ఆరోపణ అరకొరగా సామగ్రి పంపిణీ. ఆశించిన మేర లబ్ధిదారులకు అందించడం లేదు. నిజం లబ్ధిదారులకు సమీప గిడ్డంగుల వద్దే సామగ్రి అందచేస్తున్నారు. గత ఐదేళ్లలో 2.12 లక్షల టన్నుల సిమెంట్ ఇచ్చారు. వాటితో పోల్చితే గత సంవత్సరంలో ఇచ్చిన సిమెంట్ మూడు రెట్లు ఎక్కువ. ఈనాడు ఆరోపణ ఇల్లు కట్టుకునేందుకు రూ.ఐదారు లక్షలు అవుతుంది. అత్యంత సాధారణ ఇల్లు అయితే రూ.మూడు లక్షలు అవుతుంది. నిజం ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు మాత్రమే కాకుండా రూ.15,000 విలువైన ఇసుక, సామగ్రిలో ధరల వ్యత్యాసంతో రూ.45,000 మేర ప్రయోజనం, పావలా వడ్డీ ద్వారా రూ.35 వేల దాకా సాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం అందజేస్తోంది. ఇంటి నిర్మాణానికి ఒక్కో లబ్ధిదారుడికి చేకూర్చిన ప్రయోజనం రూ.2.75 లక్షలు ఉంటుంది. వీటికి స్థలం విలువ, మౌలిక వసతుల కోసం వెచ్చిస్తున్నది అదనం. ఈనాడు ఆరోపణ అది కేంద్ర సాయమే నిజం కేంద్ర సాయాన్ని మినహాయిస్తే... ఇళ్ల స్థలాలు, ఇసుక, రాష్ట్ర ప్రభుత్వ వాటా, పావలా వడ్డీ, కాలనీల్లో మౌలిక సదుపాయాలైన రోడ్లు, నీరు, విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయాలకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తం రూ.1,05,886 కోట్లను వ్యయం చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఇంతకు ముందు ఏ ప్రభుత్వమూ చేయనంత ఖర్చు ఇది. పేదలకు ఎలాగైనా సొంతిల్లు ఇవ్వాలన్న వై.ఎస్.జగన్ బలమైన సంకల్పానికి ఫలితమిది. ఈ స్థాయిలో వెచ్చిస్తున్నా కళ్లు మూసుకుని, తానేమీ చూడటం లేదు కాబట్టి అక్కడేమీ జరగటం లేదన్న తీరులో వ్యవహరిస్తోంది ‘ఈనాడు’. అదే దురుద్దేశంతో కుట్రపూరిత కథనాలు వండి వారుస్తోంది. ఇంకెన్నాళ్లు రామోజీ ఈ బరితెగింపు? వాస్తవాలు తెలిసినా.. భారీ గృహ నిర్మాణ బాధ్యతను భుజానికెత్తుకున్న ప్రభుత్వం... తొలిదశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం చేపట్టింది. పేదలకిచ్చిన ఇంటి స్థలం విలువ గ్రామీణ ప్రాంతాల్లో రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉండగా పట్టణ ప్రాంతాల్లో రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షల దాకా ఉంటోంది. రానురాను ఈ విలువ ఇంకా పెరుగుతూ వస్తోంది. ఈ పనే గనక చంద్రబాబు చేసి ఉంటే ‘ఈనాడు’ ఆయన్ను ఆకాశానికెత్తేసి ఇప్పటికీ కిందకు దించేది కాదు. కానీ చేసింది జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఏదో ఒకరకంగా దుష్ప్రచారం చేస్తూ ఆయనకొస్తున్న ఆదరణను తగ్గించటమే రామోజీ పన్నాగం. అసలు చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఓ పేదవాడి ఇల్లున్న లే అవుట్‌కి కనీసం కరెంట్ వైర్ లాగిన సందర్భాలున్నాయా? ఇప్పుడు 2,563 జగనన్న కాలనీల్లో విద్యుదీకరణ పనులు ప్రారంభం కావడం నిజం కాదా? గతంలో ఏ ప్రభుత్వమైనా ఇల్లు కట్టుకునేందుకు స్టీలు సమకూర్చిందా? ఈ ప్రభుత్వం ఇప్పటివరకు 67 వేల టన్నులు స్టీలు ఇవ్వటం నిజం కాదా? చెప్పండి రామోజీరావు గారూ? పొంతన ఉందా? కోవిడ్ కారణంగా గతేడాది నాలుగు నెలల పాటు ఇళ్ల పనులు మందగించాయి. ఈర్షా్య ద్వేషాలతో న్యాయస్థానాల్లో దాఖలు చేసిన కేసులతో మరో మూడు నెలలు నష్టపోవాల్సి వచ్చింది. ఇన్ని అవాంతరాలు సృష్టించినా ఇప్పటివరకు 67 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తి అయ్యాయి. తొలిదశలో చేపట్టిన గృహ నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటివరకు మూడు లక్షల మంది అక్క చెల్లెమ్మలు పావలా వడ్డీకే రూ.35 వేల చొప్పున సాయం అందుకున్నారు. ఇంటి నిర్మాణానికయ్యే ఖర్చు గురించి ఒకచోట రూ.2.25 లక్షలు అని, అతి సాధారణంగా నిర్మించుకుంటే రూ.3 లక్షలు అని, అదే జిల్లాలవారీగా అయితే రూ.ఐదారు లక్షలు అని రామోజీ రాసుకొచ్చారు. నిజమే.. రామోజీ ఇంటికి, పేదవాడి ఇంటికీ పొంతన ఉంటుందా? మార్బుల్ ఫ్లోర్, ఎయిర్ కండిషన్‌తో కూడిన రామోజీ విలాసవంతమైన భవనాన్ని ఓ పేదవాడు నిర్మించుకునే ఇంటితో ఎలా పోల్చగలం? జగనన్న రూ.6 లక్షల ఆస్తిచ్చారు మేం ముగ్గు అమ్ముకుంటూ, ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరిస్తూ జీవనం సాగిస్తాం. దుర్భర దారిద్య్రంలో ఉన్న మా కుటుంబానికి సుమారు రూ.6 లక్షల విలువైన స్థలాన్ని ఎలాంటి పైరవీలు లేకుండా జగనన్న ప్రభుత్వం మంజూరు చేసింది. ఇంటి నిర్మాణానికి రూ.1.80 లక్షలు సాయం అందించారు. డ్వాక్రా ద్వారా సున్నా వడ్డీకి రూ.50 వేలు, సుమారు రూ.30 వేలు విలువ చేసే నాలుగు లారీల ఇసుకను ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. రాయితీపై సిమెంట్, ఐరన్ తదితర సామగ్రిని సమకూర్చారు. కాలనీకి తాగునీరు, విద్యుత్, రోడ్లు, డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలను కల్పించారు. – ముదరగడ దానమ్మ, ఆలమూరు మండలం, ఎర్రకాలనీ, కోనసీమ జిల్లా రూ.11 లక్షల ఇంటి స్థలం ఇచ్చారు ప్రభుత్వం నాకు ఇటీవల 72 గజాల స్థలాన్ని కేటాయించి పట్టా (ప్లాట్ నెంబర్ 201) అందించింది. ప్రస్తుతం ఇక్కడ గజం విలువ రూ.15 వేలు ఉంది. దీని ప్రకారం స్థలం విలువ దాదాపు రూ.11 లక్షలు ఉంటుంది. ఇంటి నిర్మాణం కోసం 20 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేశారు. రూ.1,18,765 బిల్లు మంజూరు చేసి 90 బస్తాలు సిమెంట్ ఇచ్చారు. ఇన్నాళ్లూ అద్దె ఇళ్లలో తలదాచుకున్న మేం జగన్ బాబు దయతో కష్టం లేకుండా సొంతిల్లు కట్టుకోగలుగుతున్నాం. టీడీపీ ప్రభుత్వం మాలాంటి పేదలకు నీడ కల్పించలేకపోయింది. – జి.అప్పల నారాయణమ్మ– వెల్లంకి, ఆనందపురం మండలం, విశాఖపట్నం జిల్లా విలువైన స్థలం ఉచితంగా.. అద్దె ఇంటికి ప్రతి నెలా రూ.3 వేలు చొప్పున ఏళ్ల తరబడి చెల్లించాం. ప్రభుత్వం మాకు రాప్తాడు సమీపంలోని జగనన్న లేఅవుట్లో ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకుంటున్నాం. ఇక్కడ సెంటు స్థలం దాదాపు రూ.3 లక్షలు ఉంది. విలువైన స్థలాన్ని ప్రభుత్వంమాకు ఉచితంగా ఇచ్చింది. ఇప్పటి వరకు ఇంటి నిర్మాణానికి సంబంధించి రూ.90 వేలు బిల్లు చెల్లించడంతోపాటు ఇసుక, సిమెంట్, స్టీల్, ఇటుకలు అందించారు. – దివానం రుద్రమ్మ, రాప్తాడు మండలం, అనంతపురం జిల్లా -
‘ఈనాడు’కు ఇదెక్కడి పైత్యం?
‘పేదలందరికీ ఇళ్ల కల్పనలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉంది. సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోంది’..ఈ వ్యాఖ్యలు.. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం అమలు, రాష్ట్ర అభివృద్ధిపై కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి హరదీప్‌సింగ్ పూరి ఎప్పుడో కాదు.. తాజాగా ఆదివారం చేసినవి. పేదల ఇళ్ల నిర్మాణంలో ఏపీ దేశంలోనే మొదటి స్థానంలో ఉందని కేంద్ర ప్రభుత్వమే ఇలా కితాబిస్తుంటే.. చంద్రబాబుకు అడ్డగోలుగా కొమ్ముకాసే ఈనాడు, ఈటీవీ మాత్రం పథకం నత్తనడకన నడుస్తోంది, లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారంటూ ఎప్పటిలాగే దుష్ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్ర పథకాలకు జాతీయ స్థాయిలో ఎక్కడాలేని గుర్తింపు, ప్రశంసలు లభిస్తుంటే పచ్చమీడియా మాత్రం ప్రజలపై పచ్చివిషం కక్కుతోంది. ‘పునాదే దాటని పేదిల్లు’.. అంటూ సోమవారం ఆ విషపత్రిక ఓ కథనం వండి వార్చింది. ఈ కథనంలో పలు అంశాలను ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న అక్కసు, కడుపుమంటను అక్షరం అక్షరంలో ప్రదర్శించింది. ఆ కథనంలో ప్రస్తావించిన అంశాలు.. వాటి వెనకున్న ఈనాడు చెప్పని అసలు వాస్తవాలపై ‘ఏది నిజం’ చదవండి.. సాక్షి, అమరావతి: ఈనాడు : పథకం నత్తనడకన సాగుతోంది.. నిజం : తొలిదశ ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించి ఏడాదిన్నర కావస్తోంది. ఈ ఏడాదిన్నరలో గత ఏడాది మార్చి నుంచి జూన్ మధ్య కరోనా రెండో దశ వ్యాప్తితో పనులకు ఆటంకం ఏర్పడింది. కరోనా వ్యాప్తి నెమ్మదించి పనులు సజావుగా సాగుతున్న సమయంలో టీడీపీ నాయకులు కుట్రపూరితంగా కోర్టులకు వెళ్లి పథకాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో తిరిగి అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య పథకం పూర్తిగా నిలిచిపోయింది. ఈ ఏడాది ప్రారంభంలో ఒమిక్రాన్ రూపంలో మరోమారు కరోనా వ్యాపించింది. ఈ కారణాలతో ఏడాదిన్నరలో అధిక కాలం ఇళ్ల నిర్మాణాలు సజావుగా సాగలేదు. ఇక ఈ ఏడాది ఏప్రిల్, మే నెలల నుంచి పనులు చకచకా సాగుతున్నాయి. దీంతో ఒక్క మే నెలలోనే 30 వేల ఇంటి నిర్మాణాలు పూర్తయ్యాయి. ప్రస్తుతం రోజుకు రూ.25 కోట్ల మేర పనులు జరుగుతున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 60,783 ఇళ్లు పూర్తయ్యాయి. ఈనాడు: లేఅవుట్లలో విద్యుత్, నీటి సరఫరా లేదు. సదుపాయాలు లేక లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారు.. నిజం: 17వేలకు పైగా వైఎస్సార్, జగనన్న కాలనీల్లో పథకం కింద 30.60 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేలా లేఅవుట్లలో తాత్కాలిక సదుపాయాల కల్పనకు రూ.1,200 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ఈ నిధులతో ఇళ్ల నిర్మాణాలు చేపట్టేందుకు వీలుగా లేఅవుట్లలో విద్యుత్ సరఫరా, బోర్లు వేయడం, మోటార్లు బిగించడం చేపడుతున్నారు. ఇప్పటికే రూ.450 కోట్లు ఖర్చుచేసి తొలిదశ నిర్మాణాలు చేపడుతున్న లేఅవుట్లలో తాత్కాలిక సదుపాయాల కల్పన చేపట్టారు. రూ.32వేల కోట్లతో కాలనీల్లో శాశ్వత సదుపాయాలను ప్రభుత్వం కల్పించనుంది. ఇందులో భాగంగా విద్యుత్ సదుపాయాల కల్పనకు రూ.4,260 కోట్లు కేటాయించారు. విద్యుత్ సదుపాయాల కల్పనకు ఇప్పటికే టెండర్లు పూర్తయి, పనులు కూడా ప్రారంభించారు. ఈనాడు : కేంద్ర సాయానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నదేమీ లేదు.. నిజం: కేంద్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి రూ.1.50 లక్షల చొప్పున సాయం చేస్తోంది. ఇందుకు అదనంగా రూ.30 వేలను రాష్ట్ర ప్రభుత్వం ఇంటి నిర్మాణానికి సాయం అందిస్తోంది. ఇది కాకుండా.. పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం రూ.1.5 లక్షల రిజిస్ట్రేషన్ విలువ గల ప్లాట్లను 30.60 లక్షల మంది పేదలకు ఉచితంగా పంపిణీ చేసింది. ఈ మొత్తం ప్లాట్ల మార్కెట్ విలువను పరిశీలిస్తే.. రూ.56,102 కోట్ల మేర ఉంటుందని అంచనా. ప్లాట్లు పంపిణీ చేసిన లేఅవుట్లు మెజారిటీ శాతం ఊళ్లకు దగ్గరగా, ప్రైమ్ ఏరియాల్లోనే ఉన్నాయి. ఉదా.. బాపట్ల జిల్లా కేంద్రంలోని ప్యాడిసన్‌పేటలో కత్తిపూడి–ఒంగోలు నేషనల్ హైవే 216కు పక్కనే లేఅవుట్లో ప్లాట్ మార్కెట్ ధర రూ.10 లక్షలు పలుకుతోంది. అలాగే, తిరుపతి–శ్రీకాళహస్తి జాతీయ రహదారి పక్కన 5,896 మందికి 220 ఎకరాల్లో ప్లాట్లు పంపిణీ చేశారు. ఇందులో నిర్మాణాలు చేపట్టడానికి వీలుగా 30 బోర్లు వేసి వాటికి విద్యుత్ మోటార్లను బిగించి, ప్లాట్లకు పైప్లైన్లు వేశారు. దీంతో నేటి వరకూ చిల్లిగవ్వ ఆస్తిలేని పేదలకు ఒక్కసారిగా రూ.10లక్షలకు పైగా ఆస్తి సమకూరుతోంది. ఇక ఊళ్లకు దగ్గరగా భూములు లభించని చోట మాత్రమే విధిలేని పరిస్థితుల్లో కొంతదూరంగా ప్రభుత్వం లేఅవుట్లను ఏర్పాటుచేసింది. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు 3 శాతం వడ్డీకి రూ.35వేలు బ్యాంకు రుణసాయం చేస్తోంది. రుణాలు పొందేందుకు వీలుగా సిబిల్ స్కోర్ నుంచి పేదలకు మినహాయింపు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందుకు రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ ఆమోదం తెలుపుతూ నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పటివరకూ 3,70,826 మంది పేదలకు రూ.1,370.39 కోట్ల మేర రుణాలను ప్రభుత్వం అందించింది. రూ.15వేలు విలువ చేసే 20 టన్నుల ఇసుకను లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తోంది. అదే విధంగా సబ్సిడీపై ఇనుము, సిమెంట్, ఇతర వస్తువులను ప్రభుత్వమే సరఫరా చేస్తోంది. తద్వారా ఒక్కో లబ్ధిదారుడికి రూ.40వేల మేర లబ్ధి చేకూరుతోంది. మొత్తంగా 12 రకాల వస్తువులను సబ్సిడీ కింద రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు అందిస్తోంది. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ సుమారు 2000 మంది లబ్ధిదారులకు నిర్మిస్తున్న లే అవుట్ ఈనాడు : ధరల పెరుగుదలతో పేదలపై భారం.. నిజం: గత కొద్దినెలలుగా నిర్మాణ సామాగ్రి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఈ ప్రభావం పేదలపై పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 20 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేయడంతో పాటు, బస్తా సిమెంట్ రూ.225 చొప్పున ఇటీవల వరకూ ప్రభుత్వం సరఫరా చేసింది. ఇటీవల కాలంలో సిమెంట్ ధరలు మళ్లీ విపరీతంగా పెరగడంతో బస్తా సిమెంట్‌ను రూ.260కు అందిస్తున్నారు. ఇనుమును కంపెనీని బట్టి కిలో రూ.53, రూ.63, రూ.72లతో సరఫరా చేస్తున్నారు. మా ర్కెట్ ధరలతో పోలిస్తే కిలోకు రూ.20 తక్కువ. ఈనాడు: ఆప్షన్–3 లబ్ధిదారుల కుదింపు.. నిజం: ప్రారంభంలో ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారులు చాలావరకూ స్వచ్ఛందంగా విరమించుకున్నారు. చివరకు 3.27 లక్షల మంది మాత్రమే ఆప్షన్–3కి కట్టుబడి ఉన్నారు. దీంతో వీరి ఇళ్ల నిర్మాణ బాధ్యతను గృహ నిర్మాణ శాఖ చేపట్టింది. లబ్ధిదారులను గ్రూపులుగా ఏర్పాటుచేసి కాంట్రాక్టర్లను అనుసంధానించి ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. ఈనాడు చెప్పినవి అసత్యాలు డబ్బుల్లేక ఇంటి నిర్మాణం ఆగిపోయిందని ఈనాడులో వచ్చిన కథనం అసత్యాల పుట్ట. నాకు ప్రభుత్వం నుంచి రుణం మొదటి వాయిదా పడింది. ఇప్పటివరకు నాకు రూ.70వేలు మంజూరైంది. 10 టన్నుల ఇసుక అందించారు. 343 కేజీల ఇనుము, 40 బస్తాల సిమెంట్ సబ్సిడీపై ఇచ్చారు. అంతేకాక.. స్త్రీ నిధి నుంచి రూ.50 వేల రుణం మంజూరైంది. జగనన్న సాయంవల్లే నేను ఇల్లు కట్టుకుంటున్నాను. ఈ విషయాలే ఈనాడు వారికి చెప్పాను. అయితే, వారు ఎలా రాసుకున్నారో నాకు తెలీదు. – జుత్తిగ పద్మావతి, పాలకోడేరు, పశ్చిమ గోదావరి జిల్లా లబ్ధిదారు జుత్తిగ పద్మావతితో మాట్లాడుతున్న భీమవరం ఆర్డీఓ దాసిరాజు (ఇక జుత్తిగ పద్మావతి విషయాలనే భీమవరం ఆర్డీఓ దాసిరాజు కూడా చెప్పారు. ఈనాడులో వచ్చిన వార్తలు నిజం కావని ఆయన స్పష్టంచేశారు. భీమవరం ఆర్డీఓ దాసిరాజు ఆమెను కలిసి వివరాలు సేకరించారు.) ఇమాములు ఇంటికి రూ.70వేల మేర సాయం ఈనాడులో పేర్కొన్న కర్నూల్ జిల్లా మద్దికెర గ్రామానికి చెందిన ఇమాములు భార్య కవిత పేరిట ఇల్లు మంజూరైంది. వీరికి ఇప్పటివరకూ 10 టన్నుల ఇసుక ఉచితంగా, 25 బస్తాల సిమెంట్ సబ్సిడీపై సరఫరా చేశారు. దీనితో పాటు ఇంటి నిర్మాణ బిల్లు రూ.64,200 మంజూరు చేశారు. ఇలా మొత్తంగా రూ.70,875 మేర ఇమాములుకు లబ్ధి చేకూరింది. సబ్సిడీతో తగ్గిన భారం ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణాలకు కావాల్సిన సిమెంట్, ఐరన్‌ను సబ్సిడీపై ప్రభుత్వం అందిస్తోంది. దీంతో మాపై చాలా భారం తగ్గుతోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణం దాదాపు 90 శాతం పూర్తయింది. మరికొన్ని రోజుల్లో నా సొంతింటి కల నెరవేరుతున్నందుకు సంతోషంగా ఉంది. – జె. రేణుక, కడప, వైఎస్సార్ జిల్లా పదేళ్లుగా మాకు ఇల్లు లేదు గతంలో మాకు ఎవ్వరూ ఇల్లు మంజూరు చేయలేదు. జగనన్న సీఎం అయ్యాక మా కల నెరవేరింది. గత ఏడాది ఇంటి కోసం సచివాలయంలో దరఖాస్తు చేసుకోగానే స్థలం ఇచ్చారు. అలాగే.. ఇల్లు కట్టుకునేందుకు సహాయం చేస్తున్నారు. ఇంటి నిర్మాణానికి పునాది వేసుకున్నాం. బిల్లు కూడా పడింది. సిమెంటు ఇచ్చారు. గ్రూప్ తరఫున రుణం కూడా అందించారు. – నస్రీన్, యాదమరి, చిత్తూరు జిల్లా జగనన్నకు రుణపడి ఉంటాం నాకు వివాహమై దాదాపు 20 ఏళ్లు అయింది. ఒక కుమారుడు, కుమార్తె. పెళ్లయి నప్పటి నుంచి అద్దె ఇంట్లోనే ఉంటున్నాం. ఇంటి స్ధలం కోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా గతంలో ఎవ్వరూ పట్టించుకోలేదు. ప్రస్తుతం వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే ఇంటి స్థలం మంజూరైంది. – దోమ లక్ష్మి, మార్టేరు, పెనుమంట్ర మండలం, పశ్చిమ గోదావరి జిల్లా విలువైన స్థలం ఇచ్చారు పల్నాడు జిల్లా వినుకొండ రోడ్డులోని జగనన్న కాలనీలో ఎంతో విలువైన స్థలం ఇచ్చారు. కలలో కూడా నేను ఇల్లు కట్టుకుంటానని అనుకోలేదు. ఇంటి స్థలమిచ్చి,æ నిర్మాణం కోసం డబ్బులిస్తున్నారు. ఇల్లు మొదలు పెట్టాను. పూర్తిచేసి ఆ ఇంట్లోకి వెళ్తాను. చాలా సంతోషంగా ఉంది. – చెరుకూరి లక్ష్మి, లబ్ధిదారురాలు, నరసరావుపేట -
AP: జగనన్న కాలనీ ఇళ్లకు.. ఉదారంగా రుణాలు
సాక్షి, అమరావతి: నవరత్నాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు నిర్మాణానికి ఎటువంటి షరతుల్లేకుండా రుణాలు మంజూరు చేయడానికి బ్యాంకులు ముందుకు వచ్చాయి. ఈ పథకం కింద ఇంటి రుణం తీసుకునే వారికి సిబిల్ స్కోర్ (రుణం తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని తెలియజేస్తుంది) నుంచి కూడా మినహాయిస్తూ రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ (ఎస్ఎల్బీసీ) తాజాగా నిర్ణయం తీసుకుంది. వైఎస్సార్ జగనన్న కాలనీల పేరుతో రాష్ట్రవ్యాప్తంగా 30.75 లక్షల మంది పేదలకు సొంతింటి కలను నిజం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్న సంగతి తెలిసిందే. కానీ, దీనికి గృహ రుణం మంజూరులో కీలకమైన సిబిల్ స్కోర్ అడ్డంకిగా మారింది. ఇదే విషయాన్ని గత ఎస్ఎల్బీసీ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల దృష్టికి తీసుకెళ్లింది. ప్రైవేటు బ్యాంకులతో సహా అన్ని బ్యాంకులు జగనన్న కాలనీలకిచ్చే ఇంటి రుణాలను సిబిల్ స్కోర్ నుంచి మినహాయించాలని కోరింది. ఈ అంశాన్ని పరిశీలించిన ఎస్ఎల్బీసీ.. ఏపీ టిడ్కో, పీఎంఏవై, వైఎస్సార్ జగనన్న కాలనీల్లో నిర్మిస్తున్న ఇళ్లకు ఇచ్చే రుణాలను సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపునిస్తూ ఆదేశాలు జారీచేసింది. కానీ, అప్పటికే బ్యాంకుకు రుణం ఎగ్గొట్టిన వారికి ఈ మినహాయింపు వర్తించదు. 1.20 లక్షల మందికి లబ్ధి పేద ప్రజల ఇంటి రుణాలకు సిబిల్ స్కోర్ నుంచి మినహాయింపు ఇవ్వడంతో 1,19,968 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఏపీ టిడ్కో పథకం కింద 2.62 లక్షల ఇళ్లు నిర్మాణంలో ఉండగా అందులో 300 చదరపు అడుగులు విస్తీర్ణంలో ఉన్న ఇంటిని ప్రభుత్వం ఒక రూపాయికే అందిస్తోంది. 365, 435 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇళ్లకు బ్యాంకులు రుణం మంజూరు చేస్తున్నాయి. ప్రస్తుతం 1,19,968 ఇళ్లు బ్యాంకుల ఆర్థిక సహాకారంతో నిర్మాణంలో ఉన్నట్లు ఎస్ఎల్బీసీ అధికారులు వెల్లడించారు. ఒక్కో ఇంటికి సగటున రూ.2.65 లక్షల చొప్పున మొత్తం రూ.4,107.93 కోట్ల రుణాన్ని బ్యాంకులు అందిస్తున్నాయి. ఇందుకోసం ఇప్పటివరకు 87,756 మంది దరఖాస్తు చేసుకోగా అందులో 46,330 మందికి రూ.1,389.90 కోట్ల రుణాలను మంజూరయ్యాయి. ఇప్పుడు సిబిల్ స్కోర్ మినహాయింపు ఇవ్వడంతో రుణ మంజూరు వేగంగా జరుగుతుందని బ్యాంకు అధికారులు తెలిపారు. మరోవైపు.. గ్రామీణ ప్రాంతాల్లో నిర్మించుకునే ఇళ్లకు ప్రభుత్వం రూ.35,000 వరకు పావలా వడ్డీకే రుణం మంజూరు చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఇళ్లు నెలలో డబుల్
సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న ప్రోత్సాహంతో రాష్ట్రవ్యాప్తంగా పేదల ఇళ్ల నిర్మాణాలు వేగం పుంజుకున్నాయి. సిమెంట్, ఇసుక, ఇనుము, ఇతర వనరుల కొరత లేకుండా సరఫరా చేయడం, చకచకా బిల్లుల చెల్లింపులతో ఏప్రిల్ నాటికి 27,420 ఇళ్ల నిర్మాణాలు పూర్తి కాగా మే నెలాఖరుకు రెట్టింపు కావడం గమనార్హం. ఒక్క మే నెలలోనే 27,136 గృహ నిర్మాణాలు జరగడంతో రాష్ట్రవ్యాప్తంగా పూర్తైన ఇళ్ల సంఖ్య 54,556కు చేరుకుంది. మరింత వేగం పెంచేలా నవరత్నాలు–పేదలందరికీ ఇళ్ల పథకం కింద పేదలకు దాదాపు 31 లక్షల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. తొలిదశలో 15,60,227 ఇళ్ల నిర్మాణం చేపట్టారు. ఇవి వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. ప్రస్తుతం రోజుకు సగటున 900 ఇళ్ల నిర్మాణాలు పూర్తవుతుండగా ఈ సంఖ్యను గణనీయంగా పెంచేందుకు గృహ నిర్మాణ శాఖ సిద్ధమైంది. పర్యవేక్షణకు నియమించిన ప్రత్యేకాధికారులు తమకు కేటాయించిన జిల్లాల్లో నిర్మాణాల పురోగతిపై వాకబు చేస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. జేసీలు, గృహ నిర్మాణ, మున్సిపల్, ఇతర శాఖల అధికారులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలకు రోజువారీ లక్ష్యాలను నిర్దేశిస్తున్నారు. ప్రతి నెలా 75 వేల ఇళ్ల నిర్మాణాలు పూర్తవ్వాలని ఇటీవల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించిన నేపథ్యంలో అందుకు అనుగుణంగా అధికారులు సన్నద్ధమయ్యారు. మొదటి స్థానంలో చిత్తూరు ఇళ్ల నిర్మాణంలో చిత్తూరు జిల్లా ఆది నుంచి మంచి పనితీరు కనబరుస్తూ తొలి స్థానంలో నిలిచింది. విశాఖ, పార్వతీపురం మన్యం, అన్నమయ్య జిల్లాలు తరువాత స్థానాల్లో ఉన్నాయి. పల్నాడు, కృష్ణా, గుంటూరు, కర్నూలు, ఎన్టీఆర్ జిల్లాలు చివరి వరుసలో నిలిచాయి. రూ.950 కోట్లు చెల్లింపు ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి బిల్లుల చెల్లింపుల్లో జాప్యం లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పుష్కలంగా నిధులను అందుబాటులో ఉంచుతోంది. సక్రమంగా బిల్లులు అప్లోడ్ చేస్తే సాంకేతిక సమస్యలు తలెత్తని పక్షంలో మూడు, నాలుగు రోజుల్లో లబ్ధిదారులకు చెల్లింపులు చేపడుతున్నారు. ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ రూ.950 కోట్ల మేర బిల్లులు చెల్లింపులు చేసింది. వివిధ దశల్లో 12.48 లక్షల ఇళ్లు దాదాపు 12.48 లక్షల ఇళ్లు శంకుస్థాపనలు పూర్తై నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని లేఅవుట్లలో భూమి చదును చేయడం, అప్రోచ్ రోడ్లు లాంటి పనులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో అక్కడ నిర్మాణాలు ప్రారంభించలేదు. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి కాగానే మిగిలిన ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తాం. గృహ నిర్మాణాలకు అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తున్నాం. లబ్ధిదారులకు ఏవైనా సమస్యలుంటే అధికారుల దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తాం. – నారాయణ భరత్‌గుప్తా, గృహ నిర్మాణ సంస్థ ఎండీ -
రెండంతస్తుల శోభ
తెనాలి: జగనన్న కాలనీ ఇళ్ల నిర్మాణాల్లో గుంటూరు జిల్లా తెనాలిలో సరికొత్త ప్రయోగం అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో మరెక్కడా లేనివిధంగా అమలవుతున్న ఈ విధానంలో పునాదుల నుంచి గోడలతో సహా ఇళ్లను పటిష్టంగా నిర్మిస్తున్నారు. దీనివల్ల భవిష్యత్‌లో ప్రతి ఇంటిపైనా మరో రెండు అంతస్తులు (జీ+2) నిర్మించుకునే అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానంలో ఇళ్లు నిర్మించడంపై లబ్ధిదారులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకంలో తెనాలి పట్టణం, రూరల్ మండలం, కొల్లిపర మండలాలతో కలిపి రికార్డు స్థాయిలో 27 వేల ఇళ్ల పట్టాలను పేదలకు పంపిణీ చేశారు. తొలి దశలో 17 వేల ఇళ్ల నిర్మాణానికి అనుమతి లభించింది. డెల్టా ప్రాంతమైన తెనాలిలోని లే–అవుట్లలో మెరక సమస్యలను అధిగమించి ప్రస్తుత వేసవిలో ఇళ్ల నిర్మాణం ఆరంభమైంది. ప్రస్తుత సీజనులో కనీసం 10 వేల ఇళ్ల నిర్మాణాలను పూర్తిచేయాలని సంకల్పంతో శరవేగంతో పనులు జరుగుతున్నాయి. సిరిపురం లే–అవుట్లో బోర్లలో రెడీమిక్స్ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని.. ఇక్కడ నిర్మాణంలో ఉన్న ఇళ్లపై లబ్ధిదారులు భవిష్యత్‌లో మరో రెండు అంతస్తులు నిర్మించుకునేలా ఆధునిక బోర్ కటింగ్ యంత్రంతో ఒక్కో ఇంటికి 10 అడుగుల లోతు, అడుగు డయామీటరుతో తొమ్మిది బోర్లు తీస్తున్నారు. ఒక్కో బోరులో 12 ఎం.ఎం. ఇనుప రాడ్లు నాలుగు చొప్పున కడుతున్నారు. పైన పైల్ కాపింగ్ మరో ప్రత్యేకత. దానిపై ప్లింత్బీమ్కు 10 ఎం.ఎం. స్టీల్ రాడ్లు ఐదేసి చొప్పున వాడుతున్నారు. ప్లింత్ బీమ్‌పై 9 అంగుళాల గోడ నాలుగు అడుగులు మేర కట్టి, ప్రభుత్వం ఉచితంగా ఇస్తున్న ఇసుకతో నింపి బెడ్ వేస్తున్నారు. అక్కడి నుంచి ఒక్కో కాలమ్‌కు 10 ఎం.ఎం. రాడ్లు నాలుగు చొప్పున 9 కాలమ్స్‌ను శ్లాబ్ వరకు తీసుకెళుతున్నారు. లోడ్ బేరింగ్ కోసం పునాదిని పకడ్బందీగా వేయడం, డిజైన్‌లో లేనప్పటికీ 9 కాలమ్స్ నిర్మించటంతో ఇంటి నిర్మాణం పూర్తయిన తరువాత ఎప్పుడు కావాలంటే అప్పుడు అదే ఇంటిపై మరో రెండు అంతస్తుల నిర్మాణం నిరభ్యంతరంగా చేసుకోవచ్చని ఇళ్ల నిర్మాణ పర్యవేక్షకుల్లో ఒకరైన ఏఆర్ఏ కనస్ట్రక్షన్స్ నిర్వాహకుడు అడుసుమల్లి వెంకటేశ్వరరావు వెల్లడించారు. కట్టుబడి చాలా బాగుంది సిరిపురం లే–అవుట్లో నాకు ఇంటిస్థలం ఇచ్చారు. డబ్బులు చాలక లబ్ధిదారులు ఎవరికి వారు ఇల్లు కట్టుకోలేని స్థితిలో ఉండటంతో ఇంటి నిర్మాణాల బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంది. పర్యవేక్షకులను నియమించి కట్టుబడి బాగా చేయిస్తున్నారు. పునాదులు, గోడలు పటిష్టంగా వేస్తున్నందున మళ్లీ ఎప్పుడైనా మేం పైన మరో రెండంతస్తులు వేసుకునే అవకాశం ఉండేలా కడుతున్నారు. చాలా సంతోషంగా ఉంది. – అద్దంకి హేమలత, 10వ వార్డు, తెనాలి ఊపందుకున్న నిర్మాణాలు తెనాలి పట్టణ లబ్ధిదారులకు కేటాయించిన పెదరావూరు, సిరిపురం లే–అవుట్లలో పేదల ఇళ్ల నిర్మాణం ఊపందుకుంది. లే–అవుట్లలోనే తాత్కాలిక గిడ్డంగులను నిర్మించి ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఇసుకతో సహా ఇనుము, సిమెంట్, ఇటుకలను ముందుగానే చేర్చటం కలిసొచ్చింది. లే–అవుట్లలో అవసరమైన నీటి వసతి, విద్యుత్ లైట్లను ఏర్పాటు చేశారు. మెప్మా సహకారంతో లబ్ధిదారులకు రూ.50 వేల వంతున రుణ సదుపాయం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ప్రత్యేకంగా లే–అవుట్లలో క్యాంప్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. బోర్లు తీయడం నుంచి ప్లింత్‌బీమ్, పైల్ కాపింగ్, కాలమ్స్ అన్నీ ఆయన డిజైన్ ప్రకారం ఏడెనిమిది మంది పర్యవేక్షకులతో ఇళ్ల నిర్మాణం కొనసాగిస్తున్నారు. -
పేదల ఇళ్ల నిర్మాణాల్లో జోరు
సాక్షి, అమరావతి: తొలి దశలో నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాల లబ్ధిదారులందరికీ ప్రభుత్వ ఆదేశాల మేరకు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. ఇళ్ల నిర్మాణాలు వీలైనంత త్వరగా పూర్తి అయ్యేందుకు వీలుగా ఒక్కో లబ్ధిదారునికి రూ.35 వేల చొప్పున బ్యాంకులు పావలా వడ్డీకి రుణాలు ఇచ్చేందుకు వీలుగా గృహ నిర్మాణ శాఖ పరిపాలన అనుమతి మంజూరు చేసింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ అన్ని బ్యాంకులకు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే 3,59,856 మంది ఇళ్ల లబ్ధిదారులకు బ్యాంకులు రూ.1,332 కోట్ల మేర పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేశాయి. రాష్ట్రంలో తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. ఒక్కో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం రూ.1.80 లక్షలు వ్యయం చేస్తోంది. అయితే లబ్ధిదారుల వెసులు బాటు కోసం పావలా వడ్డీకే రూ.35 వేలు చొప్పున రుణాలు మంజూరు చేయిస్తోంది. ఇప్పటికే అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 45 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 38, తిరుపతి జిల్లాలో 35, కాకినాడ జిల్లాలో 33, పల్నాడు జిల్లాలో 28 శాతం మేర లబ్ధిదారులకు బ్యాంకులు రుణాలు మంజూరు చేశాయి. వెనుకబడిన జిల్లాలపై ప్రత్యేక శ్రద్ధ పావలా వడ్డీకి రుణాలు మంజూరు చేయడంలో వెనుకబడిన జిల్లాల్లో ప్రత్యేకంగా బ్యాంకర్లతో సమావేశాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించినట్లు గృహ నిర్మాణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ తెలిపారు. రుణాల మంజూరులో వెనుకబడిన పార్వతిపురం మన్యం, నంద్యాల, కృష్ణా, నెల్లూరు, వైఎస్సార్ జిల్లాల్లో బ్యాంకులతో సమన్వయం చేసుకుని, త్వరితగతిన రుణాలు మంజూరు చేయించాలని ఆదేశించినట్లు తెలిపారు. తరచూ జిల్లా స్థాయిలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించాలని సూచించామన్నారు. దీంతో ఈ వేసవిలో ఇళ్ల నిర్మాణాలు మరింత వేగం పుంజుకోనున్నాయని చెప్పారు. ఈ రుణాలకు సంబంధించి లబ్ధిదారులకు పావలా వడ్డీయే పడుతుందని, మిగతా వడ్డీని ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. -
మే నెలాఖరుకు 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేస్తాం: ఆదిమూలపు సురేశ్
సాక్షి, విశాఖపట్నం: అర్హులైన పేదలకు కేవలం ఒక్క రూపాయి రిజిస్ట్రేషన్‌తో మే నెలాఖరు నాటికి 40 వేల టిడ్కో ఇళ్లు పూర్తి చేసి అందించేందుకు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని మునిసిపల్ శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న టిడ్కో ఇళ్ల పనుల పురోగతిపై విశాఖలోని వీఎంఆర్డీఏ కార్యాలయంలో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఎల్లో మీడియా అసత్యాల్ని పదే పదే ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుండటం హేయమన్నారు. గత ప్రభుత్వం 5 లక్షల టిడ్కో ఇళ్లను కట్టిస్తామని చెప్పి టెండర్ల దశలో 4,54,706కి కుదించి.. గ్రౌండింగ్ సమయానికి 3,13,832కు తగ్గించిందన్నారు. 2019 ఎన్నికల సమయంలో 90 శాతం ఇళ్లు పూర్తయిపోయాయంటూ అబద్ధపు ప్రచారాలు చేశారనీ, తాము అధికారంలోకి వచ్చాక క్షేత్రస్థాయిలో పరిశీలిస్తే 1.22 లక్షల ఇళ్లు బేస్మెంట్, దానికంటే కింద స్థాయిలో ఉన్నాయనీ, 81 వేల ఇళ్లు 90 శాతం పూర్తయినా అందులో కేవలం 10 శాతం ఇళ్లకు కూడా కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేదని స్పష్టం చేశారు. ఐదేళ్ల కాలంలో ఒక్క టిడ్కో ఇల్లయినా చంద్రబాబు లబ్ధిదారులకు అందించారా అని ప్రశ్నించారు. డిమాండ్ లేని ప్రాంతాల్లో నిర్మించదలచిన 51,616 ఇళ్లని రద్దు చేశామని, మొత్తంగా 2,62,216 టిడ్కో ఇళ్లని నిర్మించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. డిసెంబర్ నాటికల్లా అన్ని ఇళ్లు ప్రారంభోత్సవానికి సిద్ధం చేస్తామని చెప్పారు. సమీక్షలో టిడ్కో చైర్మన్ ప్రసన్నకుమార్, టిడ్కో ఎండీ శ్రీధర్, జీవీఎంసీ కమిషనర్ డా.లక్ష్మీశ, టిడ్కో చీఫ్ ఇంజనీర్ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
పేదలందరికీ ఇళ్లపై కేంద్ర బృందం పరిశీలన
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం అమలు, గృహనిర్మాణాల తీరును పరిశీలించేందుకు 25 మంది సభ్యులతో కూడిన కేంద్ర ప్రభుత్వ సచివాలయ బృందం గురువారం కృష్ణాజిల్లా వణుకూరు లేఅవుట్‌ను పరిశీలించింది. అక్కడ 621 ఇళ్ల నిర్మాణాలను చూసింది. తమ శిక్షణలో భాగంగా ఏపీ మానవ వనరుల అభివృద్ధిని పరిశీలించేందుకు వచ్చిన కేంద్ర బృందంలోని కార్యదర్శులు, సెక్షన్ అధికారుల బృందం ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ కార్యాలయాన్ని సందర్శించింది. రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ స్పెషల్ సెక్రటరీ రాహుల్‌పాండే, జాయింట్ మేనేజర్ ఎం.శివప్రసాద్ పేదల ఇళ్ల నిర్మాణాల్లో భాగంగా లేఅవుట్లలో కల్పిస్తున్న విద్యుత్, డ్రెయినేజీ, అంతర్గత రోడ్లు, నీటిసరఫరా వంటి మౌలిక సదుపాయాలను వివరించారు. 30 లక్షల మంది మహిళల పేరుతో 71,811 ఎకరాల్లో ఇళ్లస్థలాలు పంపిణీ చేసినట్టు చెప్పారు. రూ.55 వేల కోట్లతో 2 దశల్లో ఇళ్ల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ప్రభుత్వం 20 టన్నుల ఇసుకతో పాటు సిమెంట్, ఇనుము, ఎలక్ట్రికల్, శానిటరీ వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువకు సరఫరా చేస్తోందని చెప్పారు. -
జగనన్న ఇళ్లకు ఉచిత విద్యుత్ సర్వీసు
సాక్షి, అమరావతి: నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో 21.25 లక్షల ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుండగా 17 వేల జగనన్న కాలనీలు రూపుదిద్దుకుంటున్నాయి. ఈ కాలనీలకు డిస్కమ్‌ల ద్వారా మొదటిదశలో 14,49,133 సర్వీసులకు విద్యుత్ సదుపాయాలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందిస్తోంది. దీనికి అవసరమైన నిధులను గృహ నిర్మాణ శాఖకు సమకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వమే రుణ దాతలకు హామీ ఇస్తోంది. రూ.4,600 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ (పీఎఫ్సీ), రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్(ఆర్ఈసీ) ముందుకొచ్చినట్లు అధికారులు తెలిపారు. మొదటి దశ పనులు మొదలు పేదలందరికీ ఇళ్లు పథకం మొదటి దశకి సంబంధించి ఏపీఈపీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 3,951 లే అవుట్లు ఉండగా 3,28,383 ఇళ్లకు విద్యుత్ సర్వీసులు అందించనున్నారు. దీని కోసం రూ.1,217.17 కోట్లు వెచ్చిస్తున్నారు. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2,813 లే అవుట్లు ఉండగా 5,16,188 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను రూ.2,519.73 కోట్లతో అందించనున్నారు. ఏపీసీపీడీసీఎల్‌లోని మూడు జిల్లాలతోపాటు సీఆర్డీఏ పరిధిలో 3,977 లే అవుట్లు ఉన్నాయి. వీటిలో 6,04,562 ఇళ్లకు విద్యుత్ సర్వీసులను రూ.1,805.04 కోట్లతో ఇవ్వనున్నారు. దీనికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించి ఇప్పటికే పనులు ప్రారంభించారు. వాటర్ వర్క్స్‌కు సంబంధించి బోర్లకు విద్యుత్ సర్వీసులు అందిస్తున్నారు. లైన్లు మారుస్తున్నారు. జాతీయ, అంతర్జాతీయ సహకారం రాష్ట్రంలో 15,000 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను పొదుపు చేసే అవకాశం ఉన్నట్లు గుర్తించడంతో ప్రభుత్వం ఇప్పటికే ఎనర్జీ కన్సర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఈసీబీసీ)–2017ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. దీన్ని అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ సంస్థ బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (ఈఈఎస్ఎల్) సహకారంతో ఒక్కో ఇంటికి నాలుగు ఎల్ఈడీ బల్బులు, రెండు ఎల్ఈడీ ట్యూబ్ లైట్లు, రెండు ఎనర్జీ ఎఫిషియెంట్ ఫ్యాన్లను అందించనున్నారు. లబ్ధిదారుల అంగీకారంతో ఇంటి నిర్మాణానికి విద్యుత్ పొదుపు డిజైన్లను అనుసరించనున్నారు. ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహకారాన్ని అందించేందుకు జర్మనీకి చెందిన అంతర్జాతీయ బ్యాంకు కేఎఫ్‌డబ్ల్యూ 152 మిలియన్ యూరోలు అందిస్తామని హామీ ఇచ్చింది. అత్యున్నత ప్రమాణాలు.. రాష్ట్రంలో మొత్తం విద్యుత్ వినియోగంలో 42 శాతం బిల్డింగ్ సెక్టార్లోనే జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇంధన సామర్థ్య సాంకేతికత పరిజ్ఞానం కలిగిన గృహాల నిర్మాణాన్ని దేశంలోనే తొలిసారిగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. జగనన్న ఇళ్లలో అత్యున్నత ఇంధన పొదుపు ప్రమాణాలను పాటించేందుకు ఇండో స్విస్ బీప్ (బిల్డింగ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ ప్రాజెక్ట్) సాంకేతికత పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. దీనివల్ల బయట ఉష్ణోగ్రతతో పోలిస్తే ఇళ్లలో 3 నుంచి 5 డిగ్రీలు తగ్గుతుంది. సహజ సిద్ధమైన గాలి, వెలుతురు ఉండటం వల్ల విద్యుత్ వినియోగం 20 శాతం తగ్గి కరెంటు బిల్లులు ఆదా కానున్నట్లు ఇంధన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. -
ఇళ్ల నిర్మాణాలతో ప్రగతి పరుగులు
సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణం కోసం ఈ ఏడాది రూ.13 వేల కోట్లకుపైగా వ్యయం చేయనున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. భారీగా గృహ నిర్మాణాలతో జిల్లాల ఆర్థిక ప్రగతి, రాష్ట్ర జీఎస్డీపీ పెరగడంతోపాటు పెద్ద ఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. ఉత్పత్తి రంగం సామర్థ్యం పెరిగి ప్రతి జిల్లా జీడీపీ మరోస్థాయికి చేరుకుంటుందన్నారు. ఆప్షన్ 3 లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ఈనెల 28న ప్రారంభిస్తున్నామని, అదే రోజు విశాఖలో 1.23 లక్షల ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని, లబ్ధిదారులకు ఇళ్ల మంజూరు పత్రాలను కూడా ఇస్తామని చెప్పారు. అదేరోజు 1.79 లక్షల పీఎంఏవై – వైఎస్సార్ గ్రామీణ ఇళ్ల నిర్మాణాన్ని కూడా ప్రారంభించనున్నట్లు ప్రకటించారు. వీటితోపాటు మొదటి దశ పేదల ఇళ్ల నిర్మాణంలో భాగంగా 15.6 లక్షల గృహాలు, 2.62 లక్షల టిడ్కో ఇళ్లు కలిపి మొత్తం 21.24 లక్షల ఇళ్లను నిర్మిస్తున్నామని చెప్పారు. స్పందనలో భాగంగా పేదల ఇళ్ల నిర్మాణం, పెండింగ్ కోర్టు కేసుల పరిష్కారం, జగనన్న సంపూర్ణ గృహ హక్కు, జగనన్న శాశ్వత భూహక్కు– భూరక్ష పథకాలపై మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన సీఎం జగన్ ఉన్నతాధికారులకు మార్గ నిర్దేశం చేశారు. 1,000 ఇళ్లకు ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఆప్షన్ 3 ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణంపైనా కలెక్టర్లు దృష్టి సారించి ప్రతి వెయ్యి ఇళ్లకు ప్రత్యేకంగా ఇంజనీరింగ్ అసిస్టెంట్‌ను నియమించాలి. ఇళ్ల నిర్మాణంపై రోజూ వారి నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి. లే అవుట్లలో నీరు, విద్యుత్తు లాంటి ప్రాథమిక మౌలిక సదుపాయాల కల్పన పనులు వేగంగా పూర్తి చేయాలి. మురుగునీరు బయటకు వెళ్లే సదుపాయాలను కూడా కల్పించాలి. పెద్ద లే అవుట్లలో ఇటుకల తయారీ యూనిట్లు నెలకొల్పాలి. గృహ నిర్మాణ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే స్థానిక ప్రజాప్రతినిధులను సత్కరిస్తాం. మండలానికో సర్పంచి, మున్సిపాలిటీల్లో కౌన్సిలర్, జిల్లాకు ఒక ఎంపీపీ, ఒక జడ్పీటీసీ చొప్పున అవార్డులు అందచేస్తాం. మే 31లోగా గృహ హక్కు పెండింగ్ రిజిస్ట్రేషన్లు జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం కింద పెండింగ్‌లో ఉన్న అన్ని రిజిస్ట్రేషన్లు మే 31 లోగా పూర్తి చేయాలి. 21 ఏ డిలీషన్ ప్రక్రియను జూన్ చివరినాటికి పూర్తి చేయాలి. ఈ పథకాన్ని వినియోగించుకున్న వారికి రూ.3 లక్షలు చొప్పున రుణం ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తున్నాయి. పథకం వల్ల చేకూరే లబ్ధిని తెలియచేస్తూ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలి. పేదలకు 90 రోజుల్లోగా ఇళ్ల పట్టాలు ఇవ్వడంపైనా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. ఇందులో ఎలాంటి జాప్యం ఉండకూడదు. అవసరమైన భూమిని సేకరించి వెంటనే పట్టాలు అందించేలా చర్యలు చేపట్టాలి. 14 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో సమగ్ర సర్వే జగనన్న శాశ్వత భూ హక్కు– భూ రక్ష పథకం కింద 14 వేలకు పైగా రెవెన్యూ గ్రామాల్లో మూడు విడతల్లో సమగ్ర సర్వే పూర్తవుతుంది. రికార్డుల స్వచ్ఛీకరణ కూడా వెంటనే జరుగుతుంది. నవంబర్ 30లోగా మొదటి విడతలో సర్వే చేస్తున్న 5,200 గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ డేటా వస్తుంది. డిసెంబర్ 31లోగా రెండో విడత సర్వే చేస్తున్న 5,700 గ్రామాల ఓఆర్ఐ డేటా సిద్ధమవుతుంది. 2023 జనవరి నెలాఖరున మూడో విడతలో భాగంగా సర్వే చేస్తున్న 6,460 గ్రామాలకు సంబంధించి ఓఆర్ఐ డేటా వస్తుంది. డేటా వచ్చాక ఐదు నెలల్లో మొత్తం సర్వే ప్రక్రియ పూర్తి కావాలి. అనంతరం గ్రామ సచివాలయాల్లో తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఏర్పాటు కావాలి. ఎంత ఖర్చైనా అర్హులందరికీ ఇళ్ల స్థలాలు పేదలకు తొలిదశలో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. కోర్టు కేసుల కారణంగా 42,639 ఇళ్ల నిర్మాణం పెండింగ్‌లో పడింది. ఈ కేసుల పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాలి. వీలుకాని పక్షంలో ప్రత్యామ్నాయ స్థలాలను ఎంపిక చేయాలి. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇంటి స్థలం అందాలి. అర్హులకు ఇళ్లు రాకుండా కత్తిరించడం సరైనది కాదు. అర్హులందరికీ ఇళ్లస్థలాలు ఇవ్వాల్సిందే. దీనికి ఎంత ఖర్చైనా భరించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కలెక్టర్లు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. -
పేదల ఇళ్లకు రాయితీపై 140 బస్తాల సిమెంట్
సాక్షి, అమరావతి: నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు పథకం కింద గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రస్తుతం రాయితీపై ఇస్తున్న 90 బస్తాల సిమెంట్‌ను ఇకపై 140 బస్తాలకు పెంచుతున్నట్లు గృహ నిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్ తెలిపారు. తద్వారా లబ్ధిదారులకు మరింత ప్రయోజనం చేకూర్చేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. సచివాలయం 4వ బ్లాక్‌లో మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ఇళ్ల స్థలాలు, ఇళ్లు మంజూరు ఫైలుపై తొలి సంతకం చేశారు. గృహ నిర్మాణ లబ్ధిదారులకు 140 బస్తాల సిమెంట్ ఇచ్చే ఫైలుపై రెండో సంతకం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మంత్రి రమేష్ మాట్లాడుతూ.. విశాఖపట్నంలో లక్ష మంది మహిళలకు ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేస్తుంటే కొందరు అడ్డుపడ్డారన్నారు. నవరత్నాల్లో మేలిమి రత్నం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకమని కొనియాడారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కొద్దిమందికే ఇళ్లు ఇచ్చారని.. నేడు కులం, మతం, ప్రాంతం, పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్క పేద కుటుంబానికి సంతృప్త స్థాయిలో ఇళ్లు మంజూరు చేశామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సామాజిక న్యాయం చేస్తున్న విప్లవవాది, అభినవ పూలే, బీఆర్ అంబేడ్కర్‌కు అసలైన వారసుడు వైఎస్ జగన్ అని ఉద్ఘాటించారు. కాగా, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్సీలు తలశిల రఘురామ్, లేళ్ల అప్పిరెడ్డి, మాజీమంత్రి వెలంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యేలు డి. నాగేశ్వరరావు, రక్షణ నిధి, గృహ నిర్మాణ సంస్థ ఎండీ నారాయణ భరత్‌గుప్త, జాయింట్ ఎండీ శివశంకర్ జోగి రమేష్‌కు పుష్పగుచ్ఛాలు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. -
30 లక్షల ఇళ్ల పట్టాల పంపిణీకి స్కోచ్ అవార్డు
సాక్షి, అమరావతి: కనీ వినీ ఎరుగని రీతిలో 30 లక్షల మంది పేదింటి అక్కచెల్లెమ్మలకు సొంతింటి కలను నిజం చేస్తూ వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నిర్వహించిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి ప్రతిష్టాత్మకమైన స్కోచ్ మెరిట్ ఆఫ్ ఆర్డర్ అవార్డు లభించింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఇన్ని లక్షల మందికీ ఒకేసారి పట్టాలు పంపిణీ చేశారు. పూర్తి పారదర్శకంగా ఆన్లైన్లో లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు ఈ అవార్డు దక్కింది. ఇది కాకుండా మరో మూడు అవార్డులూ రాష్ట్రానికి వచ్చాయి. మీ భూమి ప్రాజెక్టుకి స్కోచ్ సిల్వర్ అవార్డు దక్కింది. కౌలు రైతులకు ఆన్లైన్లో కార్డులు జారీ చేసే క్రాప్ కల్టివేటర్ రైట్స్ కార్డ్స్ (సీసీఆర్సీ), భూసోదక్ యాప్‌కు స్కోచ్ ఆర్డర్ ఆఫ్ మెరిట్ అవార్డులు వచ్చాయి. మొత్తం 9 ప్రాజెక్టులకు సీసీఎల్ఏ (భూ పరిపాలన ప్రధాన కమిషనర్) స్కోచ్ అవార్డ్స్–2022కి నామినేషన్లు పంపగా వాటిలో నాలుగింటికి అవార్డులు వచ్చాయి. ఈ ప్రాజెక్టుల ప్రజెంటేషన్లు, వివరణలన్నింటినీ సీసీఎల్ఏ అధికారులు అవార్డుల ఎంపిక కమిటీకి గతంలోనే పంపారు. ఎంపికైన ప్రాజెక్టులను అవార్డుల కమిటీ మంగళవారం ఆన్లైన్లో ప్రకటించింది. సీసీఎల్ఏ సాయి ప్రసాద్ ఆన్లైన్లో వాటిని స్వీకరించారు. అవార్డులను కమిటీ పోస్టులో సీసీఎల్ఏకి పంపిస్తుంది. పారదర్శకతకు అవార్డు రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాల కార్యక్రమంలో భాగంగా విప్లవాత్మకమైన రీతిలో సొంతిళ్లు లేని 30 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు ఒకేసారి ఇళ్ల పట్టాలను ఉచితంగా పంపిణీ చేసింది. అత్యంత పారదర్శకంగా నిర్వహించిన ఈ ప్రక్రియ ప్రశంసలందుకొంది. ఇప్పుడు స్కోచ్ మెరిట్ అవార్డు పొందింది. ఇళ్ల పట్టాల పంపిణీకి వెబ్ పోర్టల్‌ను ఏర్పాటు చేసి దాని ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. కులాలు, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక చేశారు. గ్రామీణ ప్రాంతంలో సెంటున్నర, పట్టణ ప్రాంతాల్లో సెంటు భూమిని పేదలకు పంపిణీ చేశారు. చరిత్రలోనే కనీవినీ ఎరుగని స్థాయిలో వైఎస్సార్ జగనన్న ఇళ్ల పట్టాల పేరుతో 17 వేలకుపైగా కాలనీల్లో లేఅవుట్లు వేసి ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. పట్టాదార్ పాస్ పుస్తకాల మీద ముద్రించిన క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే భూ యజమాని, భూమి వివరాలు తెలుసుకునేలా భూశోధక్ యాప్‌ను తీసుకొచ్చారు. పాస్‌బుక్ నిజమైనదో కాదో కూడా తెలుస్తుంది. ఈ యాప్ ద్వారా సర్వే నంబర్‌తో భూమి వివరాలు తెలుసుకోవచ్చు. భూ యజమానుల కోసం మీ భూమి పోర్టల్ మీ భూమి పోర్టల్ గతం నుంచి ఉన్నా ఎప్పుడూ అవార్డు రాలేదు. ఈ సంవత్సరం అవార్డుకు ఎంపికైంది. గతంలో భూముల రికార్డులు వెబ్ ల్యాండ్‌లో ఉండేవి. జాయింట్ కలెక్టర్, ఆర్డీవో, తహశీల్దార్ కార్యాలయాల్లో మాత్రమే భూయజమానులు వాటిని చూసే అవకాశం ఉండేది. భూయజమానులు వారి భూముల వివరాలు తెలుసుకోవాలంటే తహశీల్దార్ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ ఇబ్బందులు లేకుండా మీ భూమి పోర్టల్ ద్వారా భూముల వివరాలు సులభంగా తెలుసుకొనే అవకాశం కలిగింది. -
ఇళ్ల యజ్ఞం పూర్తి చేస్తాం
చరిత్ర ఎరుగని రీతిలో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణం వల్ల 30 రకాల వృత్తుల వారికి ఉపాధి లభిస్తోంది. తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణానికి 71 లక్షల టన్నుల సిమెంట్, 7.56 లక్షల టన్నుల స్టీల్, 312 లక్షల టన్నుల ఇసుక, 1,250 కోట్ల ఇటుకలు అవసరం. కార్మికులకు 21.4 కోట్ల పని దినాల ఉపాధి లభిస్తుంది. వృత్తి నైపుణ్య కార్మికులకు అదనంగా మరో 10.60 కోట్ల పని దినాలు లభిస్తాయి. ఇవన్నీ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ఎంతగానో దోహద పడతాయి. రాష్ట్ర జీఎస్డీపీ పెరుగుదలలో కీలక పాత్ర పోషిస్తాయి. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎవరెన్ని కుట్రలు పన్నినా రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్లు సొంతం చేసి తీరతామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పష్టం చేశారు. వివిధ దశల్లో ఈ మహాయజ్ఞాన్ని పూర్తి చేసి, నిరుపేదలందరినీ ఇంటి యజమానులు చేయాలన్న లక్ష్యంతో అడుగులు ముందుకు వేస్తున్నామని చెప్పారు. ‘పేదలందరికీ ఇళ్లు’ పథకంపై శాసనసభలో గురువారం జరిగిన చర్చలో ఆయన ప్రసంగించారు. ‘దాదాపు 30.76 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేశాం. 17,005 వైఎస్సార్ జగనన్న కాలనీల్లో దశల వారీగా ఇళ్ల నిర్మాణం సాగుతుంది. తొలి దశలో 10,067 కా>లనీల్లో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణం మొదలైంది. రూ.28 వేల కోట్లతో పనులు జరుగుతున్నాయి. పేదవాళ్లకు ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసికట్టుగా ఒక మహాయజ్ఞం చేశాం. ఇందుకోసం 71,811 ఎకరాల భూమిని వివిధ రూపాల్లో సేకరించాం. ఈ భూమి విలువే కనీసం రూ.25 వేల కోట్లు ఉంటుంది. పూర్తి నాణ్యత ప్రమాణాలతో నిర్మిస్తున్న 17,005 కాలనీల్లో మౌలిక వసతుల కోసమే రూ.32,909 కోట్లు వెచ్చించనున్నాం. నిర్మాణాలు పూర్తయితే రూ.4 లక్షల కోట్ల సంపద పేదల చేతుల్లో ఉంటుంది. ఒక్కొక్కరికి గరిష్టంగా రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల విలువైన ఆస్తి సమకూరుతుంది’ అని తెలిపారు. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు ఎదురైనా సరే ఈ మిషన్‌ను పూర్తి చేస్తామని చెప్పారు. అక్కచెల్లెమ్మల ఫొటోతో సహా పట్టాను ఇస్తున్నప్పుడు వారి కళ్లల్లో కనిపించే ఆనందమే తమకు శక్తినిస్తుందని, తమను ముందుకు నడిపిస్తుందని అన్నారు. సీఎం వైఎస్ జగన్ ఇంకా ఏమన్నారంటే.. సొంతింటితో సామాజిక హోదా ► త్వరితగతిన ఇళ్ల నిర్మాణం పూర్తయ్యాక సొంత ఇల్లుతో అక్కచెల్లెమ్మలకు సామాజిక హోదా వస్తుంది. భద్రతతో పాటు భరోసా వస్తుంది. ► ఇటువంటి భద్రత ప్రతి అక్క, చెల్లెమ్మకు ఇవ్వాలని, ఆత్మ విశ్వాసం పెంచే గొప్ప ఆస్తిని వారి చేతిలో పెట్టాలని మా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. తద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, అగ్రవర్ణ పేదలకు కూడా మేలు జరుగుతుంది. ఎమ్మెల్యేలు గర్వపడే పరిస్థితి ► ఎమ్మెల్యేలు నియోజకవర్గంలో తిరిగితే పెన్షన్ రాలేదనో.. ఇల్లు లేదనో.. ఫలానా పథకం అందలేదనో.. అర్హత ఉన్నా ఇవ్వలేదనో ఇలా.. గతంలో రకరకాల ఫిర్యాదులు వినిపించేవి. ► ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లోకి వెళ్లడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉండేవి. అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు ప్రతి ఎమ్మెల్యే సగర్వంగా, కాలర్ ఎగరేసుకునే పరిస్థితులు తీసుకువచ్చాం. ప్రతి పథకం పారదర్శకంగా అమలు చేస్తూ లంచాలు, వివక్షకు తావు లేకుండా అందిస్తున్నాం. ► అర్హత ఉంటే చాలు మన పార్టీయా, మరో పార్టీయా అని ఎక్కడా చూడటం లేదు. కులం, ప్రాంతం, మతం, పార్టీ చూడకుండా అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నాం. ఇళ్లు కాదు.. ఊళ్లు నిర్మిస్తున్నాం ► 30.76 లక్షల ఇళ్లలో టిడ్కోకు సంబంధించినవి 2.62 లక్షల ఇళ్లు ఉన్నాయి. అందులోనూ అన్ డివైడెడ్ షేర్ అప్ ల్యాండ్ లబ్ధిదారులకు వస్తుంది. రాష్ట్రంలో ప్రస్తుతం దాదాపు 13 వేల పంచాయతీలు ఉంటే.. మా ప్రభుత్వం కొత్తగా 17,005 కాలనీలు నిర్మిస్తోంది. ► కొన్ని చోట్ల ఆ కాలనీలు చూస్తే.. మున్సిపాల్టీలు, నగర పంచాయతీలు, మేజర్ పంచాయితీల సైజులో కనిపిస్తున్నాయి. ఇవాళ మేం కడుతోంది ఇళ్లు కాదు.. ఊళ్లు కడుతున్నాం అని చెబుతున్నా. ► ఈ స్థాయిలో ఇళ్ల స్థలాలు సేకరించగలిగాం కాబట్టే కేంద్రం నుంచి కూడా మనకు సహాయం అందుతుంది. అందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. 17,005 కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్, ఇంటర్నెట్.. తదితర మౌలిక సదుపాయాలతో పాటు పాఠశాలలు, ఆస్పత్రులు, సచివాలయాలు, ఆర్బీకేలు, డిజిటల్ లైబ్రరీలు ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ► ఈ మౌలిక సదుపాయాల కోసమే రాబోయే రోజుల్లో రూ.32,909 కోట్లు ఖర్చు చేయబోతున్నాం. కొన్ని సంవత్సరాల పాటు ఈ మౌలిక సదుపాయాలు అభివృద్ధి చేసే కార్యక్రమాలు నిర్వహిస్తాం. సకల వసతులు, నాణ్యతతో నిర్మాణం ► గతంలో చంద్రబాబు హయాంలో ఇంటి విస్తీర్ణం గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు 215 చదరపు అడుగులు. ఇవాళ మనం కడుతున్న ఇంటి విస్తీర్ణం 340 చదరపు అడగులు. ప్రతి ఇంట్లో బెడ్ రూమ్, లివింగ్ రూమ్, కిచెన్, బాత్రూమ్ కమ్ టాయ్‌లెట్, వరండా.. ఇవన్నీ ఉంటాయి. ► ప్రభుత్వమే దగ్గరుండి తొలుత 20 ఇళ్లు కట్టించింది. ఎంత ఖర్చవుతుందో లెక్క వేసేందుకు ఆ పని చేశాం. ఆ తర్వాత నిర్మాణ వ్యయాన్ని ఏ విధంగా అయినా తగ్గించగలిగితే పేదలకు మెరుగ్గా ఇళ్లు కట్టంచగలుగుతామని రకరకాల ఆలోచనలు చేసి ఒక కార్యాచరణ రూపొందించాం. ► సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ విధానం ద్వారా ఇంటి తలుపులు, పెయింటింగ్, శానిటరీ, ఎలక్ట్రికల్ పరికరాలు వంటి 14 రకాల నాణ్యమైన సామగ్రిని తీసుకువచ్చాం. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్ అయితే రివర్స్ టెండరింగ్‌కు ఆస్కారం ఉంటుంది. నాణ్యత కూడా ఉంటుంది. సామగ్రిని పెద్ద ఎత్తున కొనుగోలు చేయడంతో ధరలు కూడా తగ్గుతాయి. ► ఒక్కో ఇంటికి 90 బస్తాల సిమెంట్ పడుతుంది. మార్కెట్లో సిమెంట్ బస్తా రూ.350 నుంచి రూ.400 ఉంది. సిమెంట్ కంపెనీలతో మాట్లాడి పేదల ఇళ్లకు మాత్రం పీపీసీ సిమెంట్ బస్తా రూ.225, ఓపీసీ బస్తా రూ.235కే సరఫరా చేసేట్లు ఒప్పించాం. ప్రతి లబ్ధిదారుడికి అవసరమైన 20 టన్నుల ఇసుకను కూడా ఉచితంగా డోర్ డెలివరీ చేస్తున్నాం. దాదాపు 7.50 లక్షల టన్నుల స్టీల్‌ను రివర్స్ టెండరింగ్ ద్వారా మార్కెట్ రేటు కన్నా తక్కువకే కొనుగోలు చేశాం. 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లు ఉచితం ► టిడ్కో ద్వారా 2.62 లక్షల ఇళ్లను జీ ప్లస్ త్రీ పద్ధతిలో మూడు కేటగిరీల్లో నిర్మిస్తున్నాం. 300, 365, 430 చదరపు అడుగుల విస్తీర్ణంతో ఆ ఇళ్లు కడుతుండగా, వాటిలో 300 చదరపు అడుగుల ఇంటిని పేదలకు పూర్తిగా ఉచితంగా ఇస్తున్నాం. ► ఇవే ఇళ్లకు చంద్రబాబు హయాంలో.. ఒక చదరపు అడుగుకు రూ.2 వేల చొప్పున ఒక్కో ఇంటి వ్యయం రూ.6 లక్షలుగా లెక్కేశారు. అందులో కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ రూ.1.50 లక్షలు పోగా, మిగిలిన రూ.3 లక్షలు బ్యాంకు రుణం ఇప్పించే వారు. ఆ రుణం తీర్చేందుకు పేద కుటంబం నెలకు రూ.3 వేల చొప్పున ఏకంగా 20 ఏళ్ల పాటు వాయిదాలు కట్టాల్సి వచ్చేది. ఇవాళ మన ప్రభుత్వం అవే ఇళ్లకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా రిజిస్ట్రేషన్ చేసి పేదలకు ఇస్తోంది. ► 365 చదరపు అడుగుల ఇళ్లకు రూ.25 వేల చొప్పున, 430 చదరపు అడుగుల ఇళ్లకు రూ.50 వేల చొప్పున సబ్సిడీ ఇస్తున్నాం. ఆ విధంగా వారికి కూడా మేలు చేస్తున్నాం. టిడ్కో ఇళ్లలో ఇప్పటికే 1,07,814 ఇళ్లు పూర్తి కాగా, మరో 63,306 ఇళ్లు పూర్తయ్యే దశలో ఉన్నాయి. ఈ ఇళ్ల పంపిణీని గత జనవరిలో మొదలు పెట్టాం. వచ్చే డిసెంబర్ నాటికి పూర్తి చేస్తాం. ఎప్పటికప్పుడు బిల్లులు ► ప్రభుత్వ పని అంటే నాసిరకం అని గతంలో పేరు ఉండేది. అయితే ప్రస్తుత ప్రభుత్వం ఏ పని చేసినా పూర్తి నాణ్యత ఉంటుందనే పేరు తెచ్చుకున్నాం. పూర్తి నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నాం. ఇళ్ల నిర్మాణ పర్యవేక్షణ కోసమే ప్రతి జిల్లాలో ప్రత్యేకంగా ఒక జాయింట్ కలెక్టర్‌ను నియమించాం. ► అధికారులు, సచివాలయాల్లో ఉన్న ఇంజనీర్లు ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షించాలని నిర్దేశించాం. గతంలో ఇళ్లు కట్టిన తర్వాత బిల్లులు రావడం కాదు కదా.. చివరకు ఆ బిల్లులు తయారు చేయడం కూడా గగనమై పోయేది. ఇవాళ సచివాలయాల్లో ఆ పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. ఇంటి నిర్మాణం పురోగతిని బట్టి ఇంజినీరింగ్ అసిస్టెంట్లు ఎప్పటికప్పుడు బిల్లులు జనరేట్ చేస్తున్నారు. ఆ వెంటనే సకాలంలో బిల్లులు చెల్లిస్తున్నాం. పుట్టగతులు ఉండవనే టీడీపీ కుట్ర ఈ యజ్ఞం పూర్తయితే రాజకీయంగా పుట్టగతులు ఉండవనే ఆందోళనతోనే టీడీపీ ఈ పథకాన్ని అడ్డుకునేందుకు కుట్రలు పన్నుతోందని విమర్శించారు. ► ఈ మహాయజ్ఞానికి ఆటంకం కలిగించేందుకు తెలుగుదేశం పార్టీ శాయశక్తులా ప్రయత్నించింది. ఈ ఇళ్ల నిర్మాణం పూర్తయితే జగన్‌కు ఇంకా మంచి పేరు వస్తుంది.. దీంతో తమ అడ్రస్ పూర్తిగా గల్లంతు అవుతుందన్న భయంతో ఏవేవో కారణాలు చూపుతూ కోర్టులను ఆశ్రయించారు. ► నా నియోజకవర్గం పులివెందులతో పాటు విశాఖపట్నం, ఇతర చోట్ల ఇళ్ల పట్టాల పంపిణీ ఆగిపోయింది. ఆ విధంగా ఏడాది పాటు ఈ కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. ► విశాఖపట్నంలో భూముల సేకరణకు హైకోర్టు ఇటీవలే క్లియరెన్స్ ఇచ్చింది. దాంతో ఇళ్ల పట్టాల పంపిణీకి సన్నాహాలు చేయండని అధికారులను ఆదేశించాం. ఏప్రిల్‌లో విశాఖపట్నం వెళ్లి 1.80 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వడమే కాకుండా వెంటనే ఇళ్ల నిర్మాణం మొదలు పెడతాం. -
ఉచితంగా టిడ్కో ఇళ్ల రిజిస్ట్రేషన్
సాక్షి, అమరావతి: పట్టణ ప్రాంత పేదల సొంతింటి కలను సాకారం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ టౌన్షిప్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (టిడ్కో) నిర్మించిన ఇళ్లను లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. రిజిస్ట్రేషన్‌కు అయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరించి పేదలపై ఎలాంటి భారం లేకుండా చర్యలు తీసుకోనుంది. ఈ నెల 21వ తేదీ నుంచి డాక్యుమెంటేషన్ పనులు ప్రారంభించి రిజిస్ట్రేషన్ చేసి ఈ నెల చివరి వారంలో లబ్ధిదారులకు అందించనున్నారు. ప్రస్తుతం అన్ని హంగులతో సిద్ధంగా ఉన్న 45 వేల యూనిట్ల రిజిస్ట్రేషన్‌కు దాదాపు రూ.700 కోట్లకు పైగా ఖర్చవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఆ మొత్తాన్ని పూర్తిగా భరించి లబ్ధిదారులకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేస్తామని టిడ్కో ఎండీ చిత్తూరి శ్రీధర్ తెలిపారు. ఈ ఏడాది 365 చదరపు అడుగులు, 430 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన 1.18 లక్షల ఇళ్లను పంపిణీ చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. వీటిలో జనవరి చివరి వారంలో 45 వేల ఇళ్లను ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి అందించేందుకు టిడ్కో అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. -
AP: పేదల ఇళ్లు చల్లగా.. నిర్మాణాల్లో ప్రపంచశ్రేణి సాంకేతికత
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ నిర్మాణాల్లో ప్రపంచశ్రేణి సాంకేతికతను వినియోగించడం ద్వారా గాలి, వెలుతురు బాగా వచ్చేలా.. ఇళ్లలో శీతలీకరణ ఉండేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. విద్యుత్ బిల్లులను ఆదా చేసే ఈ సాంకేతికతను ‘ఎకో–నివాస్ సంహిత’ పేరిట అమలు చేయాలని నిర్ణయించింది. గృహ నిర్మాణ శాఖ ద్వారా చేపడుతున్న 28.3 లక్షల ఇళ్లలో బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ) ఆధ్వర్యంలో లబ్ధిదారుల అంగీకారంతో దీనిని అమలు చేస్తారు. ఇంధన సామర్థ్య బిల్డింగ్ డిజైన్ల ద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే విధంగా ఇళ్ల నిర్మాణాలు జరుపుతారు. ప్రజాహితం.. పర్యావరణ పరిరక్షణ దేశంలో మొత్తం విద్యుత్ వినియోగంలో భవనాల వాటా 38 శాతం కాగా.. 20 ఏళ్ల నుంచి ఇప్పటివరకు ఈ రంగంలో విద్యుత్ వినియోగం మూడు రెట్లు కంటే ఎక్కువగా పెరిగింది. భవిష్యత్‌లో ఇది మరింత పెరగనుంది. ఎకో నివాస్ పథకం ద్వారా ప్రపంచ శ్రేణి ‘ఇండో స్విస్ ఎనర్జీ ఎఫిషియంట్ బిల్డింగ్ టెక్నాలజీ’ని అమలు చేస్తారు. దీనివల్ల శీతలీకరణ జరిగి ఇళ్లలో ఉష్ణోగ్రతలు కనీసం 2 డిగ్రీల వరకు తగ్గుతాయి. ఈ టెక్నాలజీ వల్ల సహజ వెలుతురు పెరగడంతో పాటు 20 శాతం విద్యుత్ బిల్లులు కూడా ఆదా అవుతాయి. గ్రీన్హౌస్ వాయువులు (కర్బన ఉద్గారాలు) కూడా తగ్గుతాయి. ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, భవిష్యత్‌లో ఇంధన డిమాండ్‌ను అరికట్టడానికి, ఇంధన పొదుపు చేయడానికి ఇది సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ భవనాల్లోనూ.. వెయ్యి చదరపు మీటర్ల ప్లాట్ లేదా 2 వేల చదరపు మీటర్ల విస్తీర్ణంలో గల కమర్షియల్, నాన్ రెసిడెన్షియల్ భవనాల నిర్మాణ అనుమతులు పొందేందుకు ఆంధ్రప్రదేశ్ ఎనర్జీ కన్జర్వేషన్ బిల్డింగ్ కోడ్ (ఏపీ ఈసీబీసీ)ని తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం గతేడాది అక్టోబర్‌లో ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల నిర్మాణంలోనూ ఈ పథకాన్ని తీసుకువచ్చింది. మొదటి దశలో రూ.28 వేల కోట్ల అంచనా వ్యయంతో 15.6 లక్షల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం చేపడుతోంది. ఇప్పటికే 10,055 లేఅవుట్లలో 10.7 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. వీటన్నిటితో పాటు మొత్తం 28.3 లక్షల ఇళ్లలోనూ ఈసీబీసీని అమలు చేయనుంది. ‘ఎకో–నివాస్’ ఇలా.. ►పగటిపూట సహజ సిద్ధ వెలుతురు (సూర్యరశ్మి) ఇంటిలోకి వచ్చే విధంగా డిజైన్ ఉంటుంది. ►రేడియంట్ కూలింగ్ విధానం ద్వారా ఇంట్లో ఉష్ణోగ్రతలు సమతుల్యంగా ఉండేలా సీలింగ్, గోడలకు ప్రత్యేక ఫోమ్‌ని, పెయింట్స్ వినియోగిస్తారు. ►ఫ్లోర్పైనా ఇంటిని చల్లబరిచే ప్రత్యేక టైల్స్ అమర్చుతారు. హార్డ్ ఉడ్‌ను ఎక్కువగా వినియోగిస్తారు. ►కిటికీలకు అమర్చే అద్దాలు కూడా ప్రత్యేకంగా రూపొందించినవే ఉంటాయి. ►అత్యంత మన్నిక కలిగిన ఇన్సులేటెడ్ తలుపులను అమర్చుతారు. ఇవి ఫైబర్ గ్లాస్‌తో తయారైనప్పటికీ కలపతో చేసినవిగానే కనిపిస్తాయి. ►వాటర్ పైపులు కూడా ప్రత్యేకమైనవే ఉంటాయి. ఇవి వేడి నీటిని త్వరగా చల్లారనివ్వవు. ►ఇంటి ఆవరణలో మొక్కలు, ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తారు. ఇంటి లోపల విద్యుత్‌ను ఆదా చేసే ఎల్ఈడీ బల్బులు, ట్యూబులైట్లు, ప్రత్యేకంగా రూపొందించిన ఫ్యాన్లు అమర్చుతారు. ►వంట గది, బాత్రూమ్, టాయిలెట్.. ఇలా ప్రతి నిర్మాణంలోనూ ఇంధన ఆదాను దృష్టిలో ఉంచుకుంటారు. -
ఇళ్ల నిర్మాణం నిలిపివేతపై రంగంలోకి కేంద్రం
సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపటొద్దన్న హైకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పీల్లో కేంద్ర ప్రభుత్వం ఇంప్లీడ్ కానుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన (పీఎంఏవై) కింద చేపట్టిన ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అప్పీల్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ అప్పీల్లో ఇంప్లీడ్ అవుతామని కేంద్ర ప్రభుత్వం తరఫున అసిస్టెంట్ సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) ఎన్.హరినాథ్ మంగళవారం హైకోర్టుకు నివేదించారు. సింగిల్ జడ్జి వాస్తవాలను పరిగణనలోకి తీసుకోలేదని, ఇంప్లీడ్ పిటిషన్ దాఖలుచేసి పూర్తివివరాలను కోర్టు ముందుంచుతామని చెప్పారు. ఇందుకు అనుమతివ్వాలని కోరారు. దీనికి హైకోర్టు స్పందిస్తూ.. ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేస్తే దాన్ని పరిశీలించిన తరువాత అనుమతి విషయంలో తగిన ఉత్తర్వులు ఇస్తామంది. తదుపరి విచారణను గురువారానికి (ఈ నెల 28వ తేదీకి) వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ ఆకుల వెంకటశేషసాయిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును రద్దుచేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్ గురించి మంగళవారం అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి సీజే ధర్మాసనం ముందు ప్రస్తావించారు. ఈ వ్యవహారం 30 లక్షల మంది జీవితాలకు సంబంధించినదని తెలిపారు. ఇప్పటికే కోర్టు తీర్పు సర్టిఫైడ్ కాపీని కోర్టు ముందుంచామని, అత్యవసరం దృష్ట్యా ఈ వ్యాజ్యంపై త్వరితగతిన విచారణ చేపట్టాలని కోరారు. ఇది పీఎంఏవైతో ముడిపడి ఉన్నందున తమ అప్పీల్లో కేంద్రం ప్రతివాదిగా ఉండటం తప్పనిసరి అని తెలిపారు. ఈ సమయంలో ఏఎస్జీ హరినాథ్ స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం అప్పీల్లో ఇంప్లీడ్ అవుతామని, ఈ విషయంలో కేంద్రం నుంచి ఇప్పటికే ఆదేశాలు అందాయని చెప్పారు. -
‘పేదలందరికీ ఇళ్లు’ అప్పీలుపై విచారణ 26కి వాయిదా
సాక్షి, అమరావతి: ‘పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మందికిపైగా పేదలకు ఇచ్చిన భూముల్లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదంటూ సింగిల్ జడ్జి జస్టిస్ సత్యనారాయణమూర్తి ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ప్రభుత్వం హైకోర్టులో దాఖలు చేసిన అప్పీల్‌పై విచారణ వాయిదా పడింది. ఈ అప్పీల్‌తో సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీని జత చేయాలని ప్రభుత్వం తరఫున వాదనలు వినిపిస్తున్న అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకరరెడ్డికి సూచిస్తూ తదుపరి విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ చాగరి ప్రవీణ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్ ప్రస్తావించని అంశాలపై కూడా సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని నివేదించారు. ఆ అంశాలపై తమకు వాదనలు వినిపించే అవకాశం ఇవ్వలేదన్నారు. అభ్యంతరం లేదు.. దుష్ట సంప్రదాయం కారాదనే పేదలందరికీ ఇళ్ల పథకం వ్యవహారం త్రిసభ్య ధర్మాసనం ఎదుట విచారణ పెండింగ్‌లో ఉందని, ఈ విషయాన్ని పట్టించుకోకుండా సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని ఏఏజీ పేర్కొన్నారు. సింగిల్ జడ్జి తీర్పు వల్ల 30 లక్షల మందికిపైగా ప్రభావితం అవుతున్నారని తెలిపారు. ఈ సమయంలో ప్రభుత్వ అప్పీల్‌ను పరిశీలించిన ధర్మాసనం సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పు సర్టిఫైడ్ కాపీ లేకపోవడాన్ని గమనించింది. దీనిపై ఏఏజీ సుధాకర్‌రెడ్డిని వివరణ కోరింది. ఈ నెల 8న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారని, ఆ మరుసటి రోజే తాము అప్పీల్ దాఖలు చేశామని, అప్పటికి తీర్పు సర్టిఫైడ్ కాపీ అందుబాటులో లేనందున అప్పీల్‌తో జత చేయలేకపోయామని తెలిపారు. సర్టిఫైడ్ కాపీ స్థానంలో వెబ్ కాపీని జత చేశామని వివరించారు. అందువల్ల సర్టిఫైడ్ కాపీ దాఖలు నుంచి మినహాయింపునివ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ కూడా దాఖలు చేశామని తెలిపారు. ఈ అనుబంధ పిటిషన్‌ను అనుమతించడానికి తమకు అభ్యంతరం లేదని, అయితే సర్టిఫైడ్ కాపీ లేకుండా ప్రభుత్వ అప్పీల్‌ను విచారిస్తే అది ఒక దుష్ట సంప్రదాయంగా మారుతుందని, రేపు ప్రతి ఒక్కరూ సర్టిఫైడ్ కాపీ లేకుండా అప్పీళ్లు వేసి విచారించాలని కోరతారని ధర్మాసనం వ్యాఖ్యానించింది. ఈ నేపథ్యంలో సర్టిఫైడ్ కాపీని తమ ముందుంచాలని సూచిస్తూ అప్పీల్‌పై విచారణను ఈ నెల 26కి వాయిదా వేసింది. -
ఏపీలోనే పేదల ఇళ్ల నిర్మాణం విస్తీర్ణం ఎక్కువ
సాక్షి, అమరావతి: పేదలకు ఇళ్ల నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది. కేంద్ర నిబంధనలకు లోబడే పేదల ఇళ్ల నిర్మాణం చేపడుతోంది. ఏపీతో పోలిస్తే చాలా రాష్ట్రాల్లో నిర్మిస్తున్న ఇళ్ల విస్తీర్ణం తక్కువగా ఉంది. ఆయా రాష్ట్రాలు 247 చదరపు అడుగుల నుంచి 322 చదరపు అడుగుల మధ్యనే ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నాయి. అరుణాచల్‌ప్రదేశ్‌లో 255.1, ఉత్తరప్రదేశ్‌లో 291.7, నాగాలాండ్‌లో 292.45, ఉత్తరాఖండ్‌లో 293.74, ఒడిశాలో 302.14, తమిళనాడులో 304.08, జార్ఖండ్‌లో 305, జమ్మూకశ్మీర్‌లో 318.5 చ.అడుగుల్లోనే ప్రభుత్వాలు పేదల ఇళ్లు నిర్మిస్తున్నాయి. అయితే రాష్ట్రంలో ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద 30 లక్షల మంది పేదలకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం 340 చ.అడుగుల విస్తీర్ణంలో ఇళ్లు నిర్మించి ఇస్తోంది. ఈ లెక్కన దేశంలో పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తున్న 7 రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో నిర్మిస్తున్న ఇళ్ల విస్తీర్ణం 18 నుంచి 93 చ.అడుగులు ఎక్కువగా ఉంటోంది. ఏపీ తరహాలోనే.. దేశంలో 12 రాష్ట్రాలు పేదల ఇళ్ల నిర్మాణానికి స్థలాలు పంపిణీ చేస్తున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఏపీ తరహాలో లక్షల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. 10 రాష్ట్రాలు ఇళ్లు పంపిణీ చేయడం లేదు. స్థలాలు పంపిణీ చేస్తున్న జాబితాలో ఉన్న యూపీ, మహారాష్ట్రల్లో ఏపీ తరహాలోనే 1 సెంటు, 1.5 సెంట్లను ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్నాయి. దేశంలోనే అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్ కన్నా ఏపీనే ఎక్కువ ఇళ్లను నిర్మిస్తోంది. పక్కాగా సెట్‌బ్యాక్స్.. ప్రభుత్వం ఇళ్ల నిర్మాణాల్లో నేషనల్ బిల్డింగ్ కోడ్ (ఎన్బీసీ)–2016, ఏపీ బిల్డింగ్ రూల్స్–2017, ప్రధానమంత్రి ఆవాస్ యోజన నిబంధనలను పక్కాగా పాటిస్తోంది. నిబంధనల ప్రకారం ఉండాల్సిన దానికన్నా ఎక్కువ విస్తీర్ణాన్ని కేటాయిస్తూ ఇళ్ల నిర్మాణాలు చేపడుతోంది. -
అయ్యా.. ఇది అన్యాయం!
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామానికి చెందిన తేనె గంగాధర్ కౌలు రైతు. ఇతనికి ఒక సోదరుడు ఉన్నాడు. ఇప్పటి దాకా వారికి సొంత ఇల్లు లేదు. వారు పుట్టినప్పటి నుంచి అద్దె ఇంట్లోనే పెరిగారు. వారి అమ్మానాన్నలు కూలి పనులు చేసి, ఇంటి అద్దెలు కట్టుకుంటూ వారిని పెంచి, పెద్ద చేసి పెళ్లిళ్లు చేశారు. వివాహం అనంతరం ఇద్దరు అన్నదమ్ములు వేర్వేరుగా మూడు దశాబ్దాలుగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. గంగాధర్‌కు ఇద్దరు పిల్లలు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో వారిని చదివించుకుంటూ ఇంటి అద్దె కట్టడానికి చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రభుత్వం సొంత ఇల్లు లేని వారికి స్థలం ఇచ్చి, ఇల్లు కట్టిస్తోందని తెలిసి అతని భార్య తేనె మణి, అతని సోదరుడి భార్యతో దరఖాస్తు చేయించారు. ఇద్దరికీ ఇంటి స్థలం, ఇల్లు మంజూరైంది. లేఅవుట్–1లో ఇంటికి పునాది వేసుకున్నారు. వారి దశాబ్దాల సొంతింటి కలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాకారం చేస్తున్నందుకు చాలా సంతోష పడ్డారు. కొద్ది రోజుల్లో సొంతింట్లో ఉంటామనుకున్నారు. అయితే ఇళ్ల నిర్మాణ పనులన్నీ ఆపేయాలని కోర్టు చెప్పిందని శనివారం ఉదయం టీవీలో వార్తలు చూపినప్పుటి నుంచి గంగాధర్ చాలా దిగాలుగా ఉన్నాడు. ఎందుకలా దిగులుగా ఉన్నావని ఎవరైనా అడిగితే.. ‘ఇది సరికాదయ్యా.. ఇళ్ల నిర్మాణం ఆపడమేంటయ్యా.. ఇలా ఎప్పుడైనా జరిగిందా.. దుర్మార్గమయ్యా.. పేదల కడుపు కొట్టడం బాగోదయ్యా’ అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలా ఒక్క గంగాధర్ మాత్రమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది పేదలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బిడ్డలకు మేమిచ్చే ఆస్తి ఈ ఇల్లే ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇళ్ల నిర్మాణం నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. ఆ తీర్పు వెలువడినప్పటి నుంచి రాష్ట్రంలోని పేద వర్గాల్లో తీవ్ర చర్చ మొదలైంది. కృష్ణా జిల్లా పెనమలూరు మండలం వణుకూరు గ్రామంలోని 13.5 ఎకరాల లేఅవుట్–1లో 621 మంది పేదలకు ప్రభుత్వం ప్లాట్లు కేటాయించింది. చాలా వరకు ఇళ్లకు శంకుస్థాపనలు పూర్తయ్యాయి. ఈ లేఅవుట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల్లో సెంటు స్థలం రూ.4 లక్షల పై మాటే. అంత విలువైన స్థలాన్ని ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి, నిర్మాణానికి యూనిట్‌కు రూ.1.80 లక్షలు ఇస్తుండటంతో పేదలందరు సంతోషంగా ఇళ్లు నిర్మించుకుంటున్నారు. అయితే వీరందరిలోనూ రెండు రోజులుగా తీవ్ర ఆందోళన కనిపిస్తోంది. ఇక్కడి లబ్ధిదారురాలైన సారమ్మ, ఆమె భర్త దువ్వనపూడి స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మేము వ్యవసాయ కూలీలం. ఇద్దరం పనికి వెళ్తే నెలకు రూ.15 వేలు సంపాదిస్తాం. ఇంటి అద్దె రూ.6వేలు. పిల్లల చదువులు, ఇతర ఖర్చులకు వచ్చిందంతా సరిపోతుంది. ఈ ప్రభుత్వం పుణ్యమా అని ఇల్లు మంజూరైంది. ఖర్చు తగ్గించుకోవడం కోసం మేము కూడా కూలీగా పని చేస్తూ ఇల్లు కట్టుకుంటున్నాం. ఇళ్ల నిర్మాణం మధ్యలో ఉన్నప్పుడు ఆపేస్తే.. మా సంగతేం కావాలి?’ అని ప్రశ్నించారు. ‘నాకు ఇద్దరు కుమార్తెలు.. పెద్ద కుమార్తెకు పెళ్లి అయింది. త్వరగా ఇంటి నిర్మాణం పూర్తయితే రెండో కుమార్తెకు పెళ్లి చేయాలనుకున్నాను. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ ఇల్లు కట్టుకోలేనని నిర్మాణం ప్రారంభించాను. నా తదనంతం ఈ ఇంటిని ఇద్దరు కుమార్తెలకు ఇచ్చేద్దామనుకున్నా. ఇదే మా పిల్లలకు ఇచ్చే ఆస్తి అనుకున్నా. కానీ ఇప్పుడిలా..’ అని ఇదే లేఅవుట్లోని లక్ష్మి వాపోయింది. పేదోళ్ల జీవితాలతో ఆటలొద్దు ఇప్పుడు మా ఇంటి నిర్మాణం శ్లాబు దశలో ఉంది. ఇప్పటికే చాలా మెటీరియల్ తెచ్చుకున్నా. ఎక్కడి పనులు అక్కడే నిలిపి వేయాలంటే తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి. అప్పు చేసి మరీ ఇల్లు కట్టుకుంటున్నా. ఇసుక, ఇటుక, సిమెంటు వచ్చాయి. మళ్లీ పనులు మొదలు పెట్టుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? అసలు అనుమతి ఇస్తారా? ఇవ్వరా? పేదోళ్ల జీవితాలతో ఆటలాడటం బాగోదు. దయచేసి పనులు ఆగకుండా చూడాలి. – ఉప్పలపాటి నాగలక్ష్మి, కొంకేపూడి, పెడన మండలం, కృష్ణా జిల్లా సారోళ్లు ఇలా చేయడం మంచిది కాదు నా భర్త నాగమల్లేశ్వర రావు కూలి పని చేస్తుంటాడు. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. అద్దె కట్టలేక నా తల్లిదండ్రుల వద్ద రేకుల షెడ్డులో ఉంటున్నాం. అక్కడ 9 మందిమి చిన్న రేకుల షెడ్డులో నివసిస్తూ ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం మాకు ఉచితంగా స్థలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసింది. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తయింది. త్వరలో మాకంటూ ఓ సొంత చిరునామా ఏర్పడుతుందని అనుకుంటున్న సమయంలో నిర్మాణాలు ఆపినారని చెబుతున్నారు. సారోళ్లు ఇలా చేయడం మంచిది కాదు. – కె.సునీత, కంటెపూడి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా మాకు సెంటున్నరే చాలు పదేళ్లుగా మేము ఇరుకుగా ఉండే చిన్న గదుల్లో నివాసం ఉంటున్నాం. వైఎస్ జగన్ మాకు సెంటున్నర స్థలాన్ని కేటాయించారు. ఆ స్థలంలో సొంత ఇల్లు కట్టుకునేందుకు పునాదులు వేసుకున్నాం. ఇప్పటి వరకు లక్ష రూపాయలు ఖర్చు పెట్టుకున్నాం. ఈ దశలో ఇళ్ల నిర్మాణాన్ని నిలుపుదల చేయాలని కోర్టు చెప్పడం సబబు కాదు. ఇది మాకు తీవ్ర ఆందోళన కలిగించింది.ఈ తీర్పు పట్ల చాలా విచారిస్తున్నాం. ఎక్కువ స్థలం కావాలని ఎవరం కోరలేదు. మాకు ప్రభుత్వం ఇచ్చిన సెంటున్నర చాలు. – రెడ్డి వరలక్ష్మి, పెదపాడు, పశ్చిమగోదావరి జిల్లా ఇది న్యాయం కాదయ్యా.. మేము కడప శివారులోని రామాంజనేయపురం వరద కాలనీలో ఉంటున్నాం. జగనన్న ప్రభుత్వం మాకు సెంట్రల్ జైలు వెనుక ఉన్న టిడ్కో–2 లే ఔట్లో ఇంటి స్థలం మంజూరు చేసింది. బేస్మట్టం నిర్మించుకొని, గోడలు కూడా పూర్తి చేసుకున్నాం. బేస్మట్టం బిల్లు కూడా వచ్చింది. ఇంత పని జరిగాక ఇంటి నిర్మాణం ఆపమని చెప్పడం న్యాయం కాదయ్యా. ఆలోచించి కోర్టు వారు ఈ నిర్ణయాన్ని మార్పు చేయాలి. – జె.అమ్ములు, రామాంజనేయపురం, వైఎస్సార్ జిల్లా నోటికాడి కూడు తీస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి సొంత ఇల్లు లేక అవస్థలు పడుతున్న నాకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పుణ్యమా అని స్థలం వచ్చింది. భగత్‌సింగ్‌కాలనీ వద్ద జగనన్న స్థలం మంజూరు చేశారు. జగనన్న కాలనీలో ఇళ్లు నిర్మించవద్దంటూ కొందరు హైకోర్టుకు వెళ్లడంతో ఇళ్ల నిర్మాణం నిలిపేయాలని తీర్పు ఇచ్చిందని చెబుతున్నారు. రూ.లక్షలు విలువ చేసే స్థలాన్ని, ఇంటిని మాలాంటి పేదలకు ఇస్తే వారికి వచ్చే ఇబ్బంది ఏమిటో తెలియడం లేదు. పేదల నోటికాడ కూడు తీస్తున్నారు. ఇది భావ్యం కాదు. – ఎస్కే ముంతాజ్‌బేగం, వెంకటేశ్వరపురం, నెల్లూరు -
లబ్ధిదారులతో గ్రూపుల ఏర్పాటు
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంచుకున్న లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించేందుకు గృహ నిర్మాణ శాఖ అధికారులు వడివడిగా అడుగులు వేస్తున్నారు. అక్టోబర్ 25న వీటి నిర్మాణాలను ప్రారంభించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో నిర్దేశించిన గడువులోగా పనులు ప్రారంభించేలా కసరత్తు మొదలైంది. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించి ఇచ్చే ఆప్షన్–3ని రాష్ట్రవ్యాప్తంగా 3,25,899 మంది లబ్ధిదారులు ఎంచుకున్నారు. వీరందరినీ గ్రూపులుగా ఏర్పాటు చేసి ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. 12,855 గ్రూపుల ఏర్పాటు ఆప్షన్–3ని ఎంచుకున్న లబ్ధిదారుల్లో 10 నుంచి 20 మందిని ఒక్కొక్క గ్రూపుగా గృహ నిర్మాణ శాఖ ఏర్పాటు చేస్తోంది. ఇప్పటివరకూ రాష్ట్ర వ్యాప్తంగా 1,77,421 మందితో 12,855 గ్రూపులను ఏర్పాటు చేసింది. గుంటూరు జిల్లాలో గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ నూరు శాతం పూర్తయింది. ఈ జిల్లాలో 12,632 మంది లబ్ధిదారులు ఉండగా.. 1,087 గ్రూపులు ఏర్పాటు చేశారు. పశ్చిమ గోదావరిలో 92%, కర్నూలు జిల్లాలో 78 %గ్రూపుల ఏర్పాటు పూర్తయింది. అత్యల్పంగా విజయనగరంలో 14% మాత్రమే గ్రూపుల ఏర్పాటు జరిగింది. తగ్గనున్న నిర్మాణ వ్యయం లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన గ్రూపులను స్థానికంగా ఉన్న భవన నిర్మాణ కాంట్రాక్టర్లను గుర్తించి అనుసంధానిస్తున్నారు. ఈ విధానం వల్ల గ్రూప్‌లో ఉన్న లబ్ధిదారుల ఇళ్లన్నింటికీ ఒకే నిర్మాణ ధర వర్తిస్తుంది. దీంతో నిర్మాణ వ్యయం తగ్గుతుంది. ఈ నెలాఖరు నాటికి స్థానికంగా కాంట్రాక్టర్ల గుర్తింపు, గ్రూపుల ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. వేగంగా గ్రూపుల ఏర్పాటు ఆప్షన్–3 ఎంచుకున్న లబ్ధిదారుల గ్రూపుల ఏర్పాటు ప్రక్రియను వేగంగా చేపడుతున్నాం. ఈ నెలాఖరులోగా గ్రూపుల ఏర్పాటు పూర్తికి కృషి చేస్తున్నాం. వచ్చే నెల 25 నుంచి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించేందుకు కార్యచరణ రూపొందిస్తున్నాం. – నారాయణ భరత్‌గుప్తా, ఎండీ, హౌసింగ్ కార్పొరేషన్ -
Andhra Pradesh: కళ్లెదుటే కలల గృహం
అన్ని లక్షల మందికి ఇళ్ల పట్టాలా? ఎలా ఇవ్వగలరు? ఇది అసాధ్యం అన్నారు. సాధ్యం చేసి చూపించారు. పట్టాలిచ్చారు సరే, వాటి నిర్మాణం ఎప్పుడు మొదలెడతారో.. అన్నారు. వెయ్యి కాదు.. లక్ష కాదు.. ఏకంగా 10.11 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. కొన్ని లక్షల ఇళ్లు పునాదులు దాటాయి. ఆపై చకచకా పనులు సాగుతున్నాయి. అసాధ్యం అన్న నోళ్లు.. కళ్లప్పగించి చూస్తున్నాయి. సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో సొంతిల్లు నిర్మించుకోవాలనే లక్షలాది మంది పేద కుటుంబాల కల కార్యరూపం దాల్చింది. ఇదివరకెన్నడూ.. ఎక్కడా కనీవినీ ఎరుగని రీతిలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా ఆ కలను సాకారం చేసేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. దరఖాస్తు చేసుకున్న అతి తక్కువ రోజుల్లోనే.. ఎవరి సిఫారసులు అవసరం లేకుండా.. పైసా అవినీతికి ఆస్కారం లేకుండా ఇళ్ల స్థలాలు అందజేసింది. అంతటితో ఆగకుండా ఇళ్ల నిర్మాణానికి ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. ఇంటి నిర్మాణానికి ఐఎస్ఐ మార్కు ఉన్న నాణ్యమైన వస్తువులను సరఫరా చేస్తోంది. 10.11 లక్షల ఇళ్లకు శంకుస్థాపనలు తొలి దశలో రాష్ట్ర వ్యాప్తంగా 15,60,227 ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. వీటిలో 10,11,006 ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. ఇందులో 8,74,569 ఇళ్లు పునాది దశలో ఉండగా 81,467 ఇళ్లు పునాది దశను పూర్తి చేసుకున్నాయి. 23,226 ఇళ్లు పైకప్పు దశలో ఉండగా.. మరో 27,036 ఇళ్లకు పైకప్పు పూర్తయింది. కాగా, 4,708 ఇళ్ల నిర్మాణాన్ని ఇప్పటికే పూర్తి చేశారు. ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.938.03 కోట్లు మంజూరు చేసింది. ఆప్షన్–3.. అక్టోబర్ 25న ప్రారంభం ప్రభుత్వమే ఇళ్లు కట్టించి ఇచ్చే ఆప్షన్–3ని ఎంచుకున్న 3,25,899 మంది లబ్ధిదారుల ఇళ్ల నిర్మాణాన్ని అక్టోబర్ 25న ప్రారంభించడానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా 10–20 మందిని కలిపి ఒక గ్రూపుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే 1,77,421 మందితో 12,855 గ్రూపులు ఏర్పాటు చేశారు. మిగిలిన లబ్ధిదారులను కూడా గ్రూపులుగా ఏర్పాటు చేసే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో భవన నిర్మాణ మేస్త్రీలను గుర్తించి.. వారికి గ్రూపులను అనుసంధానించి నిర్మాణ పనులు అప్పగిస్తున్నారు. నాణ్యమైన వస్తువులు సరఫరా ఇళ్లు నిర్మించుకుంటున్న లబ్ధిదారులకు ప్రభుత్వం ఒక్కో ఇంటికి 20 టన్నుల ఇసుకను ఉచితంగా సరఫరా చేస్తోంది. ఐఎస్ఐ మార్కు ఉన్న నాణ్యమైన సిమెంట్, స్టీల్, ఇతర వస్తువులను మార్కెట్ ధరల కంటే తక్కువకే అందిస్తోంది. ఇలా ఇప్పటి వరకు 1,85,696 మెట్రిక్ టన్నుల సిమెంట్, 12,086 మెట్రిక్ టన్నుల స్టీల్, 3,87,562 మెట్రిక్ టన్నుల ఇసుకను సరఫరా చేసింది. (చదవండి: ఎన్టీఆర్ విగ్రహానికి పూలదండ వేయమన్నా వేయని లోకేశ్) ప్రత్యేక యాప్ ద్వారా ఫిర్యాదులకు అవకాశం పేదలందరికీ ఇళ్లు పథకం కోసం ప్రత్యేకంగా వలంటీర్ యాప్‌ను ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ సంస్థ అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌లో లాగిన్ అయితే వలంటీర్‌కు తన పరిధిలోని ఇళ్ల లబ్ధిదారుల వివరాలు ఉంటాయి. ఇళ్ల నిర్మాణంలో లబ్ధిదారులకు ఏవైనా సమస్యలు తలెత్తితే వలంటీర్ ద్వారా ఈ యాప్‌లో ఫిర్యాదులు చేయొచ్చు. నిర్మాణానికి అవసరమైన సిమెంట్, ఇసుక, ఇనుము, తదితరాల కోసం వలంటీర్లను సంప్రదిస్తే వారు యాప్‌లో ఇండెంట్ పెడతారు. అధికారులు ఆ ఇండెంట్లను పరిశీలించి కావాల్సిన మెటీరియల్‌ను సమకూరుస్తారు. అవినీతికి తావు లేకుండా పారదర్శకంగా ఉండేందుకు బయోమెట్రిక్ విధానాన్ని కూడా ఈ యాప్ ద్వారా అందుబాటులోకి తెచ్చారు. పావలా వడ్డీకే రుణాలు.. లబ్ధిదారులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా), గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ఫ్)ల నుంచి లబ్ధిదారులకు పావలా వడ్డీకే ప్రభుత్వం రుణాలు అందిస్తోంది. లబ్ధిదారులకు రుణాలు మంజూరయ్యేలా బ్యాంకర్లతో మాట్లాడి చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే ఆదేశించారు. లబ్ధిదారులపై రవాణా ఖర్చుల భారం పడకుండా లేఅవుట్ల వద్దే ఇసుక డిపోలు, ఇటుకల తయారీ యూనిట్లను ఏర్పాటు చేస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఇసుక రీచ్‌ల వద్ద లబ్ధిదారుల కోసం ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. పశ్చిమగోదావరి జిల్లా చేబ్రోలు, ప్రత్తిపాడు, తీపర్రుల్లో ఇళ్ల లబ్ధిదారుల కోసం ఇసుక డిపోలను కేటాయించారు. టౌన్షిప్లకు దీటుగా సకల వసతులు లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం విద్యుత్, నీటి సరఫరా వసతులు కల్పించింది. తొలి దశలో 8,247 లేఅవుట్లలో నీటి వసతి కల్పించాల్సి ఉండగా ఇప్పటి వరకు 8,147 (99 శాతం) లేఅవుట్లలో పనులు ప్రారంభించారు. 7,172 (87 శాతం) లేఅవుట్లలో బోర్లు వేయగా.. 6,884 (83శాతం) లేఅవుట్లలో వేసిన బోర్లకు మోటార్లు బిగించి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ప్రైవేట్ వెంచర్లు, టౌన్షిప్లకు దీటుగా వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ప్రభుత్వం సకల వసతులను కల్పిస్తోంది. 20–60 అడుగుల రోడ్లు, ఫుట్‌పాత్‌లు, భూగర్భ డ్రైనేజీ, వర్షపు నీరు వెళ్లేలా కాల్వలు, విద్యుత్, పార్కులు, 13 శాతం ఓపెన్ ఏరియా, ఇతర మౌలిక వసతుల కల్పన చేపట్టింది. ప్రతి రెండు వేల జనాభాకు అంగ¯న్వాడీ కేంద్రం, 1,500 నుంచి 5,000 ఇళ్లకు గ్రంథాలయం ఏర్పాటుతోపాటు కాలనీల్లో ఆహ్లాదం, ఆరోగ్యం అందించే మొక్కల పెంపకానికి పెద్దపీట వేస్తోంది. కాలనీల పరిమాణం, జనాభా సంఖ్య ఆధారంగా స్కూళ్లు, కాలేజీ, బస్టాండ్, గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేయనున్నారు. ప్రతి జిల్లాకు హౌసింగ్ జేసీ పేదల ఇళ్ల నిర్మాణంలో ఎదురయ్యే ఇబ్బందులను అధిగమించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రతి జిల్లాకు ఒక హౌసింగ్ జేసీని నియమించి ఎప్పటికప్పుడు ఇళ్ల నిర్మాణాలను పర్యవేక్షిస్తోంది. ప్రజా ప్రతినిధులు, గృహ నిర్మాణ, మున్సిపల్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణాలను క్షేత్ర స్థాయిలో పరిశీలిస్తున్నారు. లబ్ధిదారులతో ఏర్పాటు చేసిన ప్రతి గ్రూపునకు గ్రామ స్థాయి అధికారి, లేఅవుట్‌ను మండల స్థాయి అధికారి, నియోజకవర్గాలకు జిల్లా స్థాయి అధికారులను పర్యవేక్షకులుగా నియమించారు. (చదవండి: హెచ్ఆర్సీ ఏర్పాటుపై స్టేకు హైకోర్టు నిరాకరణ) మా కష్టాలు తీరనున్నాయి నా భర్త నాగమల్లేశ్వరరావు కూలీ. మాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. మాకు సొంతిల్లు లేదు. అద్దె కట్టుకునే స్థోమత కూడా లేదు. దీంతో నా తల్లిదండ్రుల రేకుల షెడ్డులో ఉంటున్నాం. అమ్మా నాన్న, నా సోదరుడు, అతడి భార్య, మేం ఐదుగురం కలిపి మొత్తం తొమ్మిది మందిమి ఆ చిన్న ఇంటిలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాం. వైఎస్ జగన్ ప్రభుత్వం మాకు ఉచితంగా స్థలం ఇచ్చి, ఇల్లు కట్టుకోవడానికి ఆర్థిక సాయం చేసింది. ఇంటి నిర్మాణం దాదాపు పూర్తవడంతో మా కష్టాలు తీరనున్నాయి. – కె.సునీత, కంటెపూడి, సత్తెనపల్లి మండలం, గుంటూరు జిల్లా స్వగ్రామంలో సొంత ఇంటి కల నెరవేరుతోంది మా ఊరిలో మాకు ఇల్లు లేదు. దీంతో హైదరాబాద్‌లో ఇల్లు అద్దెకు తీసుకుని నా భర్త, నేను ఫ్యాక్టరీలో పని చేస్తున్నాం. సొంత ఊరిలో ఇల్లు కట్టుకుని స్థిరపడాలనేది మా కోరిక. అయితే సంపాదన అంతా ఇంటి అద్దె, నా కుమారుడి చదువు, ఇతర ఖర్చులకే సరిపోయేది. జగన్ ప్రభుత్వం ఇల్లు లేనివారికి స్థలం ఇవ్వడంతోపాటు ఇల్లు కట్టిస్తోందని తెలిసి దరఖాస్తు చేసుకున్నాను. స్థలం మంజూరవడంతో నెల క్రితం ఇంటి నిర్మాణం ప్రారంభించాం. మరో నెలలో పూర్తికానుంది. సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. – మానం సుబ్బలక్ష్మమ్మ, గిద్దలూరు, ప్రకాశం జిల్లా దరఖాస్తు చేయగానే మంజూరైంది 20 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం గొల్లగూడెం వచ్చాం. నా భర్త పెయింట్, నేను కూలి పనులకు వెళ్తున్నాను. మాకు ఇద్దరు పిల్లలు. ఊర్లోకి వచ్చినప్పటి నుంచి అద్దె ఇంట్లోనే జీవిస్తున్నాం. ఇంటి స్థలం కోసం ఎన్నో ఏళ్లు అధికారుల చుట్టూ తిరిగాం. టీడీపీ ప్రభుత్వంలో ఎన్నో అర్జీలు పెట్టినా ఫలితం దక్కలేదు. జగన్ ప్రభుత్వం వచ్చాక దరఖాస్తు చేసీ చేయగానే ఇంటి స్థలం మంజూరు చేశారు. ప్రస్తుతం బేస్మట్టం వరకు ఇంటి పని పూర్తయ్యింది. 20 ఏళ్లుగా ఎదురుచూస్తున్న సొంతింటి కల నెరవేరబోతోంది. – కటికల నాని, గొల్లగూడెం, కంకిపాడు మండలం, కృష్ణా జిల్లా రూ.15 లక్షల ఆస్తి సొంతం కానుంది మాకు ఉండడానికి ఇల్లు లేదు. అద్దె ఇంటిలో ఉంటున్నాం. ఇక్కడ సెంటున్నర స్థలం కొనాలంటే రూ.4 లక్షల నుంచి రూ.4.5 లక్షలు ఉంటుంది. ఇల్లు కట్టుకోవాలంటే రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు అవుతుంది. ఇలాంటి పరిస్థితిలో సీఎం వైఎస్ జగన్ సొంత అన్నయ్యలా ఆదుకున్నారు. జగనన్న కాలనీలో సెంటున్నర స్థలం, ఇంటి నిర్మాణంతో కలిపి మొత్తం రూ.14 లక్షల నుంచి రూ.15 లక్షల ఆస్తి మాకు ఇచ్చి గూడు కల్పించారు. – విత్తనాల రాజేశ్వరి, దార్లపూడి, తూర్పుగోదావరి జిల్లా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు ఇళ్ల నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. లక్షల సంఖ్యలో నిర్మాణాలు చేపడుతుండటంతో మెటల్ సరఫరాదారులు రేట్లు పెంచుతున్నట్టు గుర్తించాం. ఈ నేపథ్యంలో అధికారులు కంకర, రాళ్లు, ఇతర మెటీరియల్ సరఫరా చేసే వారితో సమావేశాలు ఏర్పాటు చేసి ధరలు నిర్ధారిస్తున్నారు. రవాణా వ్యయం పెరగకుండా చూస్తున్నాం. లేఅవుట్ల వద్దే ఇసుకను అందుబాటులోకి తెస్తున్నాం. 13 జిల్లాల్లో నిర్మాణాలపై సమీక్షలు చేశాం. ఇకపై నిర్మాణాలు మందకొడిగా సాగుతున్న లేఅవుట్లు, నియోజకవర్గాలను గుర్తించి అక్కడ పర్యటిస్తాం. లేఅవుట్లలో మోడల్ కాలనీల తరహాలో వసతులు కల్పిస్తాం. – చెరుకువాడ శ్రీరంగనాథరాజు, గృహ నిర్మాణ శాఖ మంత్రి నిర్మాణాలు వేగవంతం వైఎస్సార్–జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేక అధికారుల ద్వారా పర్యవేక్షణ చేస్తున్నాం. ఏవైనా సమస్యలు ఎదురైతే వేగంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నాం. సీఎం ఆదేశాల మేరకు కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. – అజయ్ జైన్, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సన్నాహాలు చేస్తున్నాం.. ప్రభుత్వమే ఇళ్లు నిర్మించే మూడో ఆప్షన్ ఎంచుకున్న లబ్ధిదారులను గ్రూపులుగా చేస్తున్నాం. సీఎం ఆదేశాల మేరకు అక్టోబర్ 25న నిర్మాణాలు ప్రారంభిస్తాం. స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, అధికారులను సమన్వయం చేసుకుంటూ ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నాం. – నారాయణ భరత్‌గుప్తా, ఎండీ, హౌసింగ్ కార్పొరేషన్ తొలి దశలో ప్రభుత్వం నిర్మిస్తున్న ఇళ్లు : 15,60,227 ఇందుకు ఖర్చయ్యే వ్యయం : రూ.28,084 కోట్లు సిమెంట్: 69.70 లక్షల మెట్రిక్ టన్నులు స్టీల్: 7.44 లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక: 310 లక్షల మెట్రిక్ టన్నులు మెటల్: 223.10 లక్షల మెట్రిక్ టన్నులు సిమెంట్/బ్రిక్స్: 232.50 కోట్లు రెండో దశలో ప్రభుత్వం నిర్మించే ఇళ్లు : 12,70,000 ఇందుకయ్యే వ్యయం : రూ.22,860 కోట్లు – కృష్ణా జిల్లా కంకిపాడు మండలం వణుకూరుకు చెందిన మాతంగి కీర్తన షాపింగ్ మాల్లో పనిచేస్తోంది. ఈమె భర్త మాతంగి రాజేశ్ ఎలక్ట్రీషియన్. ఇద్దరూ కష్టపడితే వచ్చేది నెలకు రూ.18 వేలు. ఇందులో రూ.4 వేలు ఇంటి అద్దె. ఇతరత్రా ఖర్చుల కోసం మిగతా మొత్తం సరిపోతోంది. దీంతో పొదుపు చేసి, స్థలం కొని.. సొంత ఇల్లు కట్టుకోవడం అన్నది కలగానే మిగిలిపోయింది. ఈ పరిస్థితుల్లో వైఎస్ జగన్ ప్రభుత్వం ఎటువంటి సిఫార్సులు లేకుండానే వీరికి ఇంటి స్థలం కేటాయించింది. గృహ నిర్మాణానికీ ఆర్థిక సాయం అందిస్తోంది. ప్రస్తుతం వీరి ఇంటి నిర్మాణం పైకప్పు దశకు చేరుకుంది. ఇతని పేరు వజ్రాల కోటిరెడ్డి. గుంటూరు జిల్లా తాడికొండ గ్రామం. పొగాకు కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాడు. తద్వారా వచ్చే ఆదాయం ఇంటి అద్దె, పిల్లల చదువులు, కుటుంబ పోషణకే సరిపోతోంది. దీంతో 40 ఏళ్లకు పైగా అద్దె ఇంట్లోనే ఉంటున్నారు. సొంతిల్లు కట్టుకోవాలనే ఆయన ఆశకు ఆర్థిక పరిస్థితి సహకరించడం లేదు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ ప్రభుత్వం కోటిరెడ్డి భార్య శారద, చిన్న కుమారుడి భార్య తహేరాకు ఇళ్ల స్థలాలు కేటాయించింది. శారద ఇంటి నిర్మాణం పునాది దశలో, తహేరా ఇంటి నిర్మాణం పైకప్పు దశలో ఉంది. -
ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు
-
ఇళ్ల నిర్మాణాలను అడ్డుకోవడానికి టీడీపీ కుట్రలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణాలను అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పేదలకు ఇబ్బంది కలిగించేలా టీడీపీ కోర్టులకు వెళ్లి అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. పేదలకు చరిత్రలో ఎవరూ కట్టనన్ని ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్మించి ఇస్తున్నారని వివరించారు. సుమారు రూ.50 వేల వరకు సామగ్రి రూపంలో లబ్ధిదారులకు మేలు అని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా జేసీని నియమించినట్లు తెలిపారు. -
పేదల ఇళ్ల నిర్మాణంలో నాణ్యతకు పెద్దపీట
సాక్షి, అమరావతి: ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ కింద తొలి దశలో నిర్మిస్తున్న 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాల నాణ్యతలో ఎక్కడా రాజీ పడేందుకు వీల్లేదన్న ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో గృహ నిర్మాణ శాఖ ఆ మేరకు చర్యలు తీసుకుంటోంది. ఇళ్ల నిర్మాణాల్లో వినియోగించే మెటీరియల్‌కు నాణ్యత పరీక్షలు నిర్వహిస్తోంది. ప్రధానంగా సిమెంట్ నాణ్యత విషయంలో ఎటువంటి తేడా రాకుండ పటిష్టమైన నాణ్యత పరీక్షలకు మార్గదర్శకాలు జారీ చేసింది. పేదల ఇళ్ల నిర్మాణాలకు తక్కువ ధరకే నాణ్యమైన సిమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వమే సమకూరుస్తున్న విషయం తెలిసిందే. ఇందు కోసం గృహ నిర్మాణ శాఖ గ్రామ సచివాలయాలు, మండల స్థాయిల్లో గోదాములను అద్దెకు తీసుకుంది. సిమెంట్, స్టీలు, ఇతర మెటీరియల్‌ను ఆ గోదాముల్లో నిల్వ చేస్తోంది. సిమెంట్‌ను జిల్లాల వారీగా వైఎస్సార్ నిర్మాణ పోర్టల్ ద్వారా కొనుగోలు చేయాల్సిందిగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. కొనుగోలు చేసే సిమెంట్‌కు తొలుత 98 శాతం మాత్రమే బిల్లు చెల్లించాలని, నాణ్యత పరీక్షలు పూర్తయ్యాకే మిగతా రెండు శాతం చెల్లించాలని స్పష్టం చేసింది. మార్గదర్శకాలు ఇలా.. ► ప్రతి సంస్థ సరఫరా చేసిన సిమెంట్ నుంచి జిల్లా యూనిట్‌గా రెండు గోదాముల నుంచి ప్రతి మూడు నెలలకు ఒకసారి (ఏప్రిల్–జూన్, జూలై–సెప్టెంబర్, అక్టోబర్–డిసెంబర్, జనవరి–మార్చి) నమూనాలను సేకరించాలి. ► ప్రతి త్రైమాసికంలో వేర్వేరు గోదాముల నుంచి నమూనాలను సేకరించాలి. నమూనాల సేకరణ సమయంలో సిమెంట్ కంపెనీల ప్రతినిధిని భాగస్వామ్యం చేయాలి. ► సేకరించిన నమూనాలను ప్రాజెక్టు డైరెక్టర్లు పరీక్షల కోసం తిరుపతిలోని ఐఐటి, ఎస్వీ విశ్వవిద్యాలయం.. తాడేపల్లిగూడెం ఎన్ఐటి, హైదరాబాద్‌లోని ఎన్‌సీసీబీఎం, విమ్తా ల్యాబ్స్, బ్యూరో వెరిటాస్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భగవతి–అనా–ల్యాబ్స్‌కు పంపాలి. ► వీటితో పాటు విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం, కాకినాడ జేఎన్టీయూ, విజయవాడలోని కేఎల్ విశ్వవిద్యాలయం, సిద్ధార్థ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, విజయనగరం, అనంతపురంలోని జేఎన్టీయూ ప్రయోగశాలలకు పంపించాలి. ► సిమెంట్ నాణ్యతను నిర్ణయించడానికి గోదాముల వద్ద క్షేత్ర స్థాయి పరీక్షలు చేయాలి. సిమెంట్‌లో గట్టి ముద్దలు ఉంటే తిరస్కరించాలి. సిమెంట్‌ను వేళ్లతో రుద్దినప్పుడు సున్నితంగా ఉండాలి. అలాకాకుండా కణికలాగ ఉంటే ఇసుకతో కల్తీ చేసినట్లు భావించాలి. క్షేత్ర స్థాయి తనిఖీల్లో తేడా ఉంటే ఆ సిమెంట్‌ను తిరస్కరించాలి. -
ఇళ్ల నిర్మాణంపై ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు..
సాక్షి, అమరావతి: ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల నిర్మాణం చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. 28.30 లక్షల ఇళ్ల నిర్మాణానికి కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ మేరకు జిల్లా స్థాయిలో టెండర్ కమిటీల ఏర్పాటుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్ ఛైర్మన్‌గా 10 మందితో టెండర్ కమిటీని నియమించింది. కమిటీ వీసీగా జేసీ (అభివృద్ధి), మెంబర్ కన్వీనర్‌గా గృహనిర్మాణ జిల్లా స్థాయి అధికారి.. సభ్యులుగా పరిశ్రమలు, గ్రామీణ నీటి సరఫరా, ఆర్అండ్బీ, విద్యుత్, పంచాయతీరాజ్, కార్మిక, గనుల శాఖల జిల్లా స్థాయి అధికారులు ఉంటారు. ఇళ్ల నిర్మాణం ప్రక్రియలో రివర్స్ టెండరింగ్ పద్ధతిని నిర్వహించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. చదవండి: ప్రజారోగ్యానికి ప్రాధాన్యం: సీఎం జగన్ -
‘పట్టా’భిషేకాల కోలాహలం
సాక్షి, అమరావతి: దేశ చరిత్రలోనే కనీవినీ ఎరుగని విధంగా ‘నవరత్నాలు–పేదలందరికీ ఇళ్లు’ పథకం కింద ఇంటి స్థల పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన సంబరాలు అక్కచెల్లెమ్మల సంతోషాల మధ్య ఉత్సాహపూరితంగా, కోలాహలంగా సాగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పేదలంతా ఇళ్ల స్థల పట్టాలు తీసుకుంటూ.. దశాబ్దాల నుంచి కలగానే మిగిలిపోయిన సొంతిల్లు సాకారమవుతున్న వేళ ఆనందంతో భూమి పూజల్లో పాల్గొంటున్నారు. శంకుస్థాపనల సందర్భంగా జగనన్న కాలనీలను అరటి పిలకలు, మామిడి తోరణాలతో అలంకరిస్తున్నారు. పట్టాల పంపిణీ, శంకుస్థాపన సందర్భంగా కాలనీలకు వస్తున్న ప్రజాప్రతినిధులకు మంగళ వాయిద్యాల నడుమ ఘన స్వాగతం పలుకుతున్నారు. శ్రీకాళహస్తి నియోజకవర్గం రేణిగుంట మండలంలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి హాజరైన లబ్ధిదారులు 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ పూర్తి గత నెల 25వ తేదీన తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి వైఎస్సార్ జగనన్న కాలనీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇంటి పట్టాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేయగా.. అప్పటినుంచి ప్రతిరోజూ రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడలా ఈ కార్యక్రమాలు పండుగలా కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం నాటికి 21.96 లక్షల మందికి ఇళ్ల స్థలాలు/టిడ్కో ఇళ్ల పంపిణీ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలను రూపొందించగా.. 13,595 కాలనీల్లో పట్టాలు పంపిణీ చేశారు. అంటే 80 శాతం కాలనీల్లో పట్టాల పంపిణీ ప్రక్రియ పూర్తయింది. కోర్టు కేసులున్న చోట్ల త్వరగా వాటిని పరిష్కరించి లబ్ధిదారులకు పట్టాలు ఇవ్వనున్నారు. కోర్టు కేసులు ఉన్నచోట్ల ఎంపికైన 3.79 లక్షల మంది లబ్ధిదారులకు లేఖలు అందజేస్తున్నారు. ఆ ప్రాంతాల్లో సోమవారం నాటికి 2.95 లక్షల మందికి లేఖలు ఇచ్చారు. మహాక్రతువు ముందుకే.. రాష్ట్రంలో ఇళ్లు్ల లేని పేదలందరికీ వచ్చే మూడేళ్లలో గృహ సౌకర్యం కల్పించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సాహసోపేత నిర్ణయం తీసుకుని మహా క్రతువుకు శ్రీకారం చుట్టి ప్రజల్లో సంతోషం నింపారు. రాష్ట్రంలో ఏ ఒక్క పేదకూ ఇల్లులేని పరిస్థితి లేకుండా చేయాలని ఉక్కు సంకల్పం పెట్టుకున్న ఆయన ఇళ్ల నిర్మాణాన్ని కూడా స్వల్పకాలంలో పూర్తి చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి సంకల్ప సాధన కోసం అధికార యంత్రాంగం 30.76 లక్షల మందిని ఇళ్ల పట్టాల కోసం ఎంపిక చేసింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,460 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. కొత్తగా దాదాపు అదే సంఖ్యలో కొత్త కాలనీలను ప్రణాళికాబద్ధంగా రూపొందించింది. ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం సకల సౌకర్యాలతో రూపొందించిన 17,054 వైఎస్సార్ జగనన్న కాలనీలు భవిష్యత్‌లో సకల సౌకర్యాలతో కూడిన ప్రణాళికాబద్ధమైన గ్రామాలు, పట్టణాలు, నగరాలుగా విలసిల్లనున్నాయి. సకల సదుపాయాలతో.. కాలనీల్లో చక్కటి రహదారులు, డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్ సదుపాయాలతోపాటు ఉద్యాన వనాలు, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు, రైతు భరోసా కేంద్రాలు తదితరాల కోసం ప్రత్యేకంగా స్థలాలు కేటాయించారు. ఎక్కడా వంకర్లు లేకుండా సరళరేఖల్లా ఇళ్లు ఉండనున్నాయి. కొత్తగా రూపొందించిన వైఎస్సార్ జగనన్న కాలనీల్లో 24 చోట్ల 5వేలకు పైగా ఇళ్లు రానున్నాయి. ఒక్కో ఇంట్లో సగటున నలుగురు జనాభా లెక్కవేసుకుంటే 24 కాలనీల్లో ఒక్కోచోట కనీసం 20 వేల చొప్పున జనాభా ఉండనున్నారు. విజయనగరం జిల్లా గుంకలాం, తూర్పు గోదావరి జిల్లా కొమరగిరి, గుంటూరు జిల్లా పేరేచెర్ల లాంటి కాలనీల్లో తొమ్మిది వేల పైగా ఇళ్లు రూపుదిద్దుకోనున్నాయి. ఇళ్ల నిర్మాణం పూర్తయి గృహప్రవేశాలు చేసేసరికే ఇవి పట్టణాలు కానున్నాయి. ఎవరూ ఊహించని రీతిలో అనువైన ప్రాంతాల్లో స్థలాలు కేటాయించడంతోపాటు ఇళ్లు కట్టుకోవడానికి వీలుగా వారికి నచ్చేవిధంగా ఐచ్ఛికాలు ఇవ్వడంతో లబ్ధిదారుల మోముల్లో చెప్పలేనంత సంతోషం కనిపిస్తోంది. వారంతా ఆనందంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను వేనోళ్ల ఆశీర్వదిస్తున్నారు. -
26 వేల కోట్లతో పేదలకు ఇళ్లు
విజయవాడ : రాష్ట్రంలో తొలి విడతగా 15 లక్షల 10 ఇళ్లను నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చేరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. ఇందుకు లబ్ధిదారులు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 26 వేల కోట్లతో, నాణ్యమైన మెటీరియల్‌తో ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. సీఎం జగన్ పాదయాత్రలో పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 1400 కోట్లు బకాయిలు పెట్టగా, వాటిని కూడా పేదలకు రెండు విడతల్లో విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు శ్రీరంగనాథ రాజు తెలిపారు. (డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు) -
ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ
సాక్షి, అమరావతి: ‘‘రాష్ట్రంలో పేదలందరికీ సొంత ఇళ్లు ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్ జగన్ మహాయజ్ఞం చేస్తుంటే చంద్రబాబు, టీడీపీ నేతలు రాక్షసుల్లా అడ్డుపడుతున్నారు. గత ప్రభుత్వాల మాదిరిగా డి–పట్టాలు ఇవ్వకుండా పేద అక్కాచెల్లెమ్మలకు సర్వహక్కులతో పట్టాలిచ్చి ఇళ్లు కట్టించి ఇవ్వాలని సీఎం భావించారు. దీన్ని సహించలేని చంద్రబాబు తన మనుషులతో కోర్టుల్లో కేసులు వేయించి ఇళ్ల పట్టాల పంపిణీని అడ్డుకోవడానికి కుట్ర పన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా జూలై 8న రాష్ట్రంలో 30 లక్షలమంది పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సంసిద్ధమవుతుంటే టీడీపీ నేతలు సాంకేతిక కారణాలు లేవనెత్తుతూ కేసులు వేయడమే దీనికి నిదర్శనం’’ అని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ధ్వజమెత్తారు. ఇళ్లస్థలాల పంపిణీని వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు వేసిన నాలుగు రిట్ పిటిషన్లపై న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చిందన్నారు. అయితే కరోనా వైరస్ పరిస్థితుల్లో న్యాయస్థానాల్లో ఇప్పటికిప్పుడు రివ్యూ పిటిషన్ వేసే అవకాశం లేనందున జూలై 8న పేదలకు ఇళ్ల పట్టాలు మంజూరు చేయలేకపోతున్నామని చెప్పారు. టీడీపీ కుట్రలను తిప్పికొట్టి, న్యాయస్థానాల నుంచి అనుమతి తీసుకుని ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారని తెలిపారు. విజయవాడలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. ♦ పాదయాత్రలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ పేదలందరికీ ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు కట్టించాలన్నదే సీఎం వైఎస్ జగన్ దృఢ సంకల్పం. ఇళ్ల స్థలాల పంపిణీకి 30 లక్షలమంది అర్హులైన పేదలున్నారని ప్రభుత్వం గుర్తించింది. వారికి ఇళ్లస్థలాలకోసం 26,034 ఎకరాల్లో లేఅవుట్లు వేసి పేదలకు పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ♦కానీ టీడీపీ రాక్షస బుద్ధితో అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోంది. పేదలకు ఇళ్లస్థలాలివ్వడం నేరమా? అక్కాచెల్లెమ్మల పేరున ఇళ్లస్థలాలిస్తే పాపమా? సొంత ఇళ్లు కల్పించి పేదలకు సామాజిక గౌరవం కల్పించాలని సీఎం నిర్ణయించడం అన్యాయమా? మరి ఎందుకు కేసులు వేయించి ఇళ్ల స్థలాల పంపిణీని చంద్రబాబు అడ్డుకున్నారో సమాధానం చెప్పాలి. ♦ టీడీపీ ఎన్ని కుట్రలు పన్నినా సీఎం వెనుకడుగు వేయరు. ఈ అంశంపై కోర్టులో రివ్యూ పిటిషన్ వేసి.. అనుమతి తీసుకుని మరీ పేదలకు ఇళ్లస్థలాలు పంపిణీ చేస్తాం. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఆగస్టు 15న రాష్ట్రంలోని పేదలకు ఆనందాన్ని పంచుతూ ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని సీఎం నిర్ణయించారు. పేదలు నిరాశ చెందనక్కర్లేదు. పేద అక్కాచెల్లెమ్మలను ఆగస్టు 15న ఇంటిస్థల యజమానులను చేస్తారు. టీడీపీ ఐదేళ్లలో పేదలకు ఒక్క ఇల్లు ఇవ్వలేదు ♦ చంద్రబాబు ఐదేళ్లపాలనలో పేదలకు ఒక్క ఇల్లు కూడా ఎందుకివ్వలేకపోయారో టీడీపీ సమాధానం చెప్పాలి. 2014 నుంచి 2016 వరకు ఒక్క ఇంటికి శంకుస్థాపన చేయలేదు. ఆ తరువాత మూడేళ్లలో వివిధ పథకాల కింద కేవలం 6.20 లక్షల ఇళ్లు కట్టాలని నిర్ణయించింది. కానీ 3.50 లక్షల ఇళ్లే పూర్తి చేసింది. ఒక్క లబ్ధిదారునికీ అందించలేకపోయింది. ♦ ఇక టిడ్కో ద్వారా జీ+3 విధానం కింద 7,01,401 హౌసింగ్ యూనిట్ల నిర్మాణంలో టీడీపీ భారీ అవినీతికి పాల్పడింది. చదరపు అడుగుకు ఏకంగా రూ.2,500 కింద కాంట్రాక్టర్లకు కట్టబెట్టింది. అంతేగాక బ్యాంకు రుణాల పేరిట పేదలపై ఆర్థికభారం మోపింది. కేవలం 3,09,432 ఇళ్లు మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయి. వాటిలోనూ 77,371 ఇళ్లనే 90 శాతం పూర్తి చేసింది. 50 వేల ఇళ్ల పునాదులు కూడా పూర్తి చేయలేదు. ప్రభుత్వానికి రూ.4,322 కోట్లు బకాయిలు పెట్టింది. ఏపీ టిడ్కో ఇళ్లపై ప్రభుత్వ విధానమిదీ.. ♦ టీడీపీ అసంపూర్తిగా వదిలేసిన ఏపీ టిడ్కో ప్రాజెక్టులపై సీఎం జగన్ సమీక్షించి విధాన నిర్ణయం తీసుకున్నారు. టిడ్కో ప్రాజెక్టుల్లో రివర్స్ టెండరింగ్ నిర్వహించి ఆదా చేసిన రూ.400 కోట్లను పేద లబ్ధిదారులకు బదలాయిస్తూ ప్రయోజనం కల్పించాలని నిర్ణయించారు. ♦ 300 చ. అ ఇళ్లకు టీడీపీ రూ.3.50 లక్షల ధర నిర్ణయించింది. కానీ ఆ ఇళ్లను పేదలకు ఫ్రీగా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ♦ 365 చ.అ. ఇంటికి రూ.4.15 లక్షలు, 430 చ.అ. ఇంటికి రూ.4.65 లక్షలుగా టీడీపీ ప్రభుత్వం ధర నిర్ణయించింది. వాటిపై ఆ లబ్ధిదారులదే తుది నిర్ణయం. వారు కోరుకుంటే ఆ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఇస్తుంది. వద్దంటే రద్దు చేస్తుంది. వారు టిడ్కోకు చెల్లించిన రిజిస్ట్రేషన్ ఫీజును వెనక్కిచ్చేస్తుంది. వారందరికీ ఉచితంగా ఇళ్ల స్థలాలిచ్చి.. ఇళ్లు కట్టించి ఇస్తుంది. -
ఇళ్ల పట్టాల పంపిణీ ఆగదు
-
ఇళ్ల స్థలాల పట్టాలు 8న ఇవ్వాల్సిందే
నూటికి నూరు శాతం ఇళ్ల పట్టాలు పంపిణీ కావాలి. 80 శాతం.. 85 శాతం.. 90 శాతం అయ్యిందని చెబితే అంగీకరించేది లేదు. ప్లాట్ల కేటాయింపు కోసం లాటరీ ప్రక్రియ వెంటనే పూర్తి కావాలి. లబ్ధిదారుల తుది జాబితా గ్రామ సచివాలయాల్లో ప్రదర్శించాలి. సరైన కారణం లేకుండా ఎవరికైనా ఇంటి పట్టా రాలేదంటే అధికారులదే బాధ్యత. ఎక్కడా వివక్ష ఉండకూడదు. సంతృప్త స్థాయిలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం పట్టా అందాలి. ప్రతి గ్రామ, వార్డు సచివాలయంలో కోవిడ్‌పై పూర్తి సమాచారంతో ఒక హోర్డింగ్ పెట్టాలి. కోవిడ్ అనుమానం ఉంటే ఎవరెవర్ని సంప్రదించాలనే వివరాలు ఇవ్వాలి. ప్రతి గడప వద్దకూ వెళ్లి.. అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకోవాలి. కోవిడ్ వ్యాప్తిని అరికట్టడానికి ఇదొక్కటే మార్గమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీ వచ్చే నెల 8వ తేదీన నూటికి నూరు శాతం జరగాల్సిందేనని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగానికి స్పష్టం చేశారు. తనకు ఓటు వేయని వారైనా సరే, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ఇంటి పట్టా ఇవ్వాల్సిందేనని చెప్పారు. కోవిడ్ పరిస్థితులు తగ్గు ముఖం పట్టాక గ్రామాల్లో పర్యటిస్తాని, అప్పుడు ఇంటి పట్టా లేదని ఎవ్వరూ చేయి ఎత్తని విధంగా పారదర్శకంగా, ప్రభావవంతంగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేయాలని సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన సచివాలయం నుంచి పలు కార్యక్రమాలు, పథకాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఉన్నతాధికారులకు మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్ జగన్ తదితరులు ఇళ్ల పట్టాల పంపిణీ అతి ముఖ్యం జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. దాదాపు 30 లక్షల దాకా ఇళ్ల పట్టాలు ఇవ్వబోతున్నాం. ఆ రోజు ఎంతో దూరంలో లేదు. అత్యంత ప్రాధాన్యతతో కూడిన కార్యక్రమం ఇది. భూసేకరణ, పొజిషన్, ప్లాట్ల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించాలి. పెన్షన్ కార్డు 10 రోజులు, రేషన్ కార్డు 10 రోజులు, ఆరోగ్య శ్రీ కార్డు 20 రోజులు, ఇంటి స్థలం పట్టా 90 రోజుల్లో గ్రామ సచివాలయాల ద్వారా అందాలి. ఈ గడువులోగా అందించేలా వ్యవస్థలను తయారు చేయాల్సిన బాధ్యత కలెక్టర్లదే. వర్షాకాలంలోగా పుష్కలంగా ఇసుక నిల్వలు నిర్దేశించుకున్న 70 లక్షల టన్నుల ఇసుకను వర్షాకాలంలో పనుల కోసం నిల్వ చేయాలి. వచ్చే రెండు వారాలు మాత్రమే మనకు ఇసుక అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత వర్షాలు కురుస్తాయి. రీచ్‌లు మునిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి త్వరితగతిన ఇసుకను నిల్వ చేయాలి. (ఇప్పటికే 46.30 లక్షల మెట్రిక్ టన్నులు నిల్వ చేశామని అధికారులు వివరించారు) శ్రీకాకుళం జిల్లాలో 20 వేల టన్నులు, తూర్పు గోదావరిలో 60 వేల టన్నులు, పశ్చిమ గోదావరిలో 35 వేల టన్నులు, కృష్ణా జిల్లాలో 50 వేల టన్నులు, గుంటూరులో 40 వేల టన్నుల ఇసుక ప్రతి రోజూ ఉత్పత్తి చేయాలి. భారీగా ఉపాధి హామీ పనులు ఉపాధి హామీ కింద భారీగా పనులు కల్పించడంపై కలెక్టర్లు దృష్టి పెట్టాలి. గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, అంగన్వాడీ కేంద్రాల మీద కలెక్టర్లు ధ్యాస పెట్టాలి. వీటి నిర్మాణాల కోసం స్థలాలను గుర్తించి, వాటిని సంబంధిత శాఖకు అప్పగిస్తే వెంటనే పనులు మొదలు పెడతారు. నిర్మాణాల విషయంలో ఆలస్యం చేయకూడదు. ఇవన్నీ వచ్చే ఏడాది మార్చి 31లోగా నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వార్డు హెల్త్ క్లినిక్స్ పట్టణ ప్రాంతాల్లో వైఎస్సార్ అర్బన్ (వార్డు) హెల్త్ క్లినిక్స్ ఏర్పాటు చేయాలి. 2 కి.మీ పరిధిలో కనీసం 15 నిమిషాల వ్యవధిలో నడుచుకుంటూ వెళ్లే దూరంలో వీటి నిర్మాణాలు చేపట్టాలి. ఇందుకు వెంటనే స్థలాలను గుర్తించాలి నాడు–నేడు పనులు త్వరగా పూర్తవ్వాలి ఈ కార్యక్రమాన్ని ఇంకా ఎక్కడైనా స్కూళ్లలో పనులు మొదలుపెట్టకపోతే.. దాన్ని తీవ్రంగా చూడాల్సి వస్తుంది. ఆగస్టు 3న స్కూళ్లు ప్రారంభం అవుతున్నందున వెంటనే ఆ పనులు పూర్తి చేయాలి. ఫర్నిచర్, ఫ్యాన్లు.. అన్నీ కూడా స్కూళ్లకు వస్తున్నాయి. పనులు పూర్తి కాకపోతే ఇబ్బందికరంగా ఉంటుంది. స్కూళ్లు తెరిచేలోగా నాడు –నేడు కింద పనులు పూర్తి కావాలి. కచ్చితంగా కలెక్టర్లు దీనిపై దృష్టి పెట్టాలి. అర్బన్ ప్రాంతాల్లో కాంపౌండ్ వాల్ లాంటి పనుల విషయంలో అక్కడక్కడా వెనకబాటు కనిపిస్తోంది. నాడు – నేడుకు నిధుల కొరత లేదు. వెంటనే మున్సిపల్ కమిషనర్లతో సమన్వయం చేసుకుని స్కూళ్లలో పనులు పూర్తయ్యేలా చూడాలి. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఆగస్టు 9న ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పంపిణీ చేసి, తద్వారా గిరిజనులకు జీవనాధారం చూపించాలి. అప్పుడే వారికి మెరుగైన జీవన ప్రమాణాలు అందే అవకాశాలు ఉంటాయి. ఇ–క్రాపింగ్‌పై దృష్టి పెట్టాలి ఆర్బీకేల కోసమే ఒక జాయింట్ కలెక్టర్‌ను పెట్టాం. 10,641 ఆర్బీకేలు, 65 ఆర్బీకే హబ్స్‌ను ఏర్పాటు చేశాం. నాణ్యమైన ఎరువులు, పురుగు మందుల కోసం.. రైతులు ఆర్డర్ ఇవ్వగానే 48 గంటల్లోగా అవి డెలివరీ కావాలి. ఇ–క్రాపింగ్ చాలా ముఖ్యం. గ్రామ సచివాలయంలో ఉన్న అగ్రికల్చర్, రెవిన్యూ అసిస్టెంట్లు, సర్వేయర్లు దీన్ని పటిష్టంగా అమలు చేయాలి. పంటలు కొనుగోలు, ఇన్పుట్ సబ్సిడీ, బీమా, పంట రుణాలు ఇవ్వాలంటే ఇ–క్రాపింగ్ ముఖ్యం. హార్టికల్చర్, ఫిషరీస్ కూడా ఇ– క్రాపింగ్‌లో నమోదు కావాలి. అంగన్వాడీ కేంద్రాల నిర్మాణం నాడు– నేడు కింద 55 వేల అంగన్వాడీ కేంద్రాలను అభివృద్ఢి చేస్తున్నాం. భవనాలు ఉన్న చోట మరమ్మతులు, పునరుద్ధరణ పనులు చేస్తాం. సొంతంగా భవనాలు లేని చోట కొత్తగా నిర్మాణాలు చేస్తాం. వీటి కోసం స్థలాల సేకరించి.. వాటిని పంచాయతీరాజ్‌కు బదిలీ చేయాలి. ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటాలి పచ్చదనం పెంపునకు జగనన్న పచ్చతోరణం కింద 6 కోట్ల మొక్కల నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. నాడు –నేడులో స్కూళ్లకు ప్రహరీలు నిర్మిస్తున్నందు వల్ల అక్కడ.. ఇంకా ఖాళీ స్థలాలు, ఇంటర్నల్ రోడ్లు, అప్రోచ్ రోడ్లు తదితర ప్రాంతాల్లో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలి. ఇళ్ల స్థలాల లే అవుట్లలో కూడా బాగా మొక్కలు నాటాలి. ప్రతి ఇంటి స్థలం పట్టా లబ్ధిదారునికీ నాలుగు మొక్కలు ఇవ్వాలి. ఆదోని ప్రాంతంలో మెడికల్ కాలేజీ క్యూ ఆర్ కోడ్‌తో ఉన్న ఆరోగ్య శ్రీ కార్డులు ఇస్తున్నాం. దాదాపు 22 లక్షల కార్డులు ఇంకా పంపిణీ కాలేదు. ఇవి పూర్తిగా పంపిణీ చేయాలి. 16 మెడికల్ కాలేజీలను కొత్తగా కట్టబోతున్నాం. ఇందుకోసం ప్రతి చోటా 50 ఎకరాలు పొజిషన్లోకి తీసుకునే కార్యక్రమాన్ని వెంటనే సంబంధిత శాఖకు అప్పగించాలి. రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇప్పటి వరకు ఉన్న మెడికల్ కాలేజీలు కేవలం 11 మాత్రమే. కర్నూలు జిల్లా ఆదోని ప్రాంతంలో కొత్తగా మరో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేస్తున్నాం. సాగునీటి ప్రాజెక్టులు వంశధార, తోటపల్లి, పోలవరం, వెలిగొండ, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లకు సంబంధించి మిగిలిపోయిన భూ సేకరణ, పునరావాస పనులు త్వరితగతిన పూర్తి చేయాలి. ఈ సీజన్లో వెలిగొండ అందుబాటులోకి వస్తుంది. ఇందు కోసం అన్ని చర్యలూ తీసుకోవాలి. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కలెక్టర్లు పునరావాస పనులు చేపట్టాలి. 41.5 మీటర్ల ఎత్తు వరకు ఎక్కడా ముంపునకు గురి కాకుండా.. ప్రభావితమైన వారిని తరలించే కార్యక్రమాలు చురుగ్గా తీసుకోవాలి. సొంత అవసరాలకు ట్రాక్టర్ల ద్వారా ఇసుక ఉచితం సొంత అవసరాల కోసం నదుల నుంచి, వాగుల నుంచి ఎడ్ల బండ్లతో పాటు, ట్రాక్టర్ల ద్వారా ఇసుకను ఉచితంగా తీసుకువెళ్లడానికి సీఎం అనుమతించారని పంచాయతీరాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ గోపాలకృష్ణ ద్వివేదీ తెలిపారు. ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. కోవిడ్–19 వ్యాప్తి నివారణపై ఫోకస్ వ్యాక్సిన్ కనుక్కునేంత వరకూ కోవిడ్‌తో కలిసి బతకాల్సిన పరిస్థితి. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై మనం ఫోకస్ పెట్టాలి. దాని పట్ల ఉన్న భయం (స్టిగ్మా తొలగించాలి) పోవాలి. ఆ మేరకు చైతన్యం, అవగాహన కలిగించాలి. అప్పుడే మరణాలు తగ్గుతాయి. కోవిడ్ సోకిందనే అనుమానం రాగానే వెంటనే చికిత్స తీసుకుంటే తగ్గిపోతుంది. భయం, ఆందోళనతో చివరి వరకూ చెప్పకపోతే అది ప్రాణాలకు ముప్పు తెస్తుంది. ఆ పరిస్థితి రాక ముందే జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ సోకిందన్న అనుమానం రాగానే.. ఏం చేయాలన్న దానిపై ఎస్ఓపీపై అవగాహన కల్పించాలి. జిల్లాల్లోని ఆస్పత్రుల్లో సదుపాయాలపై దగ్గరుండి పర్యవేక్షణ చేయాలి. 85 శాతం కేసులు ఇంట్లోనే ఉన్నా నయం అయిపోతాయి. వారికి మందులు ఇవ్వాలి. ఆ యంత్రాంగం కరెక్టుగా ఉందా లేదో పరిశీలించాలి. ఆస్పత్రులకు వచ్చే 15 శాతం మందికి సదుపాయాలు సరిగా ఉన్నాయా.. లేవా చూడండి. ప్రతి జిల్లాకు కనీసం 1500 బెడ్లు ఉండేలా చూసుకోవాలి. అక్కడ సదుపాయాలు బాగా ఉండేలా చూసుకోండి. 108, 104 వాహనాలు ఒకేసారి 1060 ప్రారంభించబోతున్నాం. ఇవన్నీ కూడా కొత్త వాహనాలే. ప్రతి మండలానికి ఒక 104 వాహనం ఉంటుంది. ఈ వెహికల్ ద్వారా మండలంలోని ప్రతి గ్రామంలో ఉన్న వారికి స్క్రీనింగ్ చేయాలి. ఇంటింటికీ సర్వే చేసి, ప్రతి ఇంట్లో ఉన్న వారందరి ఆరోగ్య వివరాలను క్యూఆర్ కోడ్ ఉన్న ఆరోగ్యశ్రీ కార్డులో నమోదు చేయాలి. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యా«ధులున్న 40 ఏళ్లకు పైబడ్డ వారికి పరీక్షలు చేయాలి. డబ్ల్యూహెచ్ఓ, జీఎంపీ ప్రమాణాలున్న మందులు అందుబాటులో ఉంటాయి. ఈ మందులను వారికి అందించాలి. -
స్వగృహ ప్రాప్తిరస్తు
సాక్షి, విశాఖపట్నం: నవరత్నాల అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం దూకుడుగా వ్యవహరిస్తోంది. అధికారంలోకి రాగానే నవరత్నాలపై దృష్టి సారించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికార యంత్రాంగాన్ని ఆ దిశగా నడిపిస్తున్నారు. ఇందులో భాగంగా నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఇళ్లులేని లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేసేందుకు చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం జీవీఎంసీ పరిధిలో ఇళ్లు లేని వారి జాబితాను సిద్ధం చేస్తోంది. గత ప్రభుత్వం వివిధ ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించేందుకు వివిధ ప్రాంతాల్లో నిర్మాణాలు తలపెట్టింది. ఆ గృహ నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల ప్రక్రియ సక్రమమా.. కాదా.. అనే విషయాలపై ప్రభుత్వం ఆరా తీస్తోంది. దానికనుగుణంగా తదుపరి నిర్మాణాలు పూర్తి చేసి అందరికీ ఇళ్లు మంజూరు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ముందస్తుగా లబ్ధిదారుల సమాచారం సేకరణ ప్రక్రియ ప్రారంభించింది. వార్డు వలంటీర్ల ద్వారా సర్వే.. నగర పరిధిలో ఇళ్లు లేని లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియను ఇప్పటికే జీవీఎంసీ ప్రారంభించింది. ఇటీవల నియమితులైన వార్డు వలంటీర్లు ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. ఒక్కో వలంటీరు 50 నుంచి 100 ఇళ్లకు వెళ్లి వారి వివరాలు సేకరిస్తున్నారు. ప్రజాసాధికార సర్వేలో నమోదై, సొంత ఇల్లు కానీ, స్థలం కానీ లేని వారి వివరాలు, ఆధార్ నంబర్లు, రేషన్‌కార్డు వివరాలు తీసుకొని ఆయా జోన్ పరిధిలో ఉన్న అర్బన్ కమ్యూనిటీ డెవలప్మెంట్(యూసీడీ) అధికారులకు అందజేస్తున్నారు. ఆధార్ కార్డులు, ఇతర డాక్యుమెంట్ల ఆధారంగా అధికారులు లబ్ధిదారులను గుర్తించి.. దరఖాస్తులు సిద్ధం చేస్తున్నారు. ఈ దరఖాస్తుల్ని నవరత్నాలు హౌస్‌సైట్స్ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి లబ్ధిదారులకు సంబంధించిన దరఖాస్తులన్నీంటినీ వార్డు, జోన్ వారీగా అప్లోడ్ చెయ్యాలని మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ అండ్ డైరెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు యూసీడీ అధికారులు ఈ ప్రక్రియను వేగవంతం చేశారు. త్వరితగతిన లబ్ధిదారుల జాబితా రూపొందించి నివేదికల్ని సిద్ధం చేసి అప్లోడ్ చేసేందుకు జీవీఎంసీ అధికారులు, సిబ్బంది ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వెంటపడుతున్న దళారులు.. గత ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో గృహాలు మంజూరు చేసే ప్రక్రియ ప్రారంభించింది. నాలుగు విడతల్లో 56,059 ఇళ్లు ఇవ్వాలని టీడీపీ ప్రభుత్వం గాలిలో లెక్కలు వేసి.. కేవలం వందల సంఖ్యలో మాత్రమే కేటాయింపులు జరిపింది. కానీ ఎన్నికలు వస్తున్న సమయంలో ప్రజల్ని మభ్యపెట్టి లక్షలాది మంది వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించేశారు. తీరా ఎన్నికలయ్యాక ఆ దరఖాస్తుల్ని తిరిగి ప్రజలకు ఇచ్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పైగా ప్రభుత్వం మారిన తర్వాత కొందరు టీడీపీ దళారులు కొత్త వ్యాపారం ప్రారంభించారు. ఇప్పటికే ఇళ్లు మంజూరైన వారి వద్దకు వెళ్లి కొత్త ప్రచారం నిర్వహిస్తున్నారు. ‘కొత్త ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో మీకు ఇచ్చిన ఇళ్లు రద్దు అయిపోతాయి.. కాబట్టి.. మాకు ఎంతో కొంత ధరకు అమ్మేస్తే.. ఆ తర్వాత మేము వాటిని కాపాడుకోగలమని కొందరు మభ్యపెడుతున్నారు’. లబ్ధిదారుల వద్దకు వెళ్లి మీకు మంజూరైనప్పటికీ ఫైనల్ లిస్టులో పేరు తొలగించకుండా ఉండాలంటే.. డబ్బులు చెల్లించాలంటూ ఇంకొందరు రూ. 5 నుంచి రూ.10 వేల వరకు వసూలు చేస్తున్నారు. పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక.. లబ్ధిదారుల ఎంపికను ప్రభుత్వం పారదర్శకంగా నిర్వహిస్తోంది. వలంటీర్లు స్వయంగా ప్రతి ఇంటికీ వెళ్లి వారి వివరాలు నమోదు చేస్తున్నారు. పూర్తిస్థాయి డేటా తీసుకొని ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డుల ద్వారా డేటాను పరిశీలించి అసలైన లబ్ధిదారులుగా గుర్తించేందుకు కసరత్తులు చేస్తున్నారు. రేషన్‌కార్డు, ఆధార్‌కార్డు, ప్రస్తుతం నివసిస్తున్న ఇల్లు ఎవరిది.. ఇలా మొత్తం సమాచారం అధారంగా అప్లికేషన్లు స్వీకరిస్తున్నారు. మొత్తంగా ఈ నెలాఖరునాటికి దరఖాస్తుల స్వీకరణ పూర్తి చేసేందుకు జీవీఎంసీ యూసీడీ ప్రాజెక్టు డైరెక్టర్ వై శ్రీనివాసరావు నేతృత్వంలో సిబ్బంది తీవ్రంగా కృషిచేస్తున్నారు. వదంతులు నమ్మొద్దు.. నవరత్నాల్లో భాగంగా అందరికీ ఇళ్లు కేటాయింపునకు ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. ముఖ్యమంత్రి ఆలో చనలకు అనుగుణంగా జీవీఎంసీ పరిధి లో హౌస్ సర్వే నిర్వహించి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. దరఖాస్తుల్ని నవరత్నాలు వెబ్సైట్లో అప్లోడ్ చేసే ప్రక్రియ వేగవంతమవుతోంది. గతంలో ఇళ్లు కేటాయింపులు పూర్తయిన వారు చాలా మంది వదంతులు నమ్ముతున్నారని తెలిసింది. ఎలాట్మెంట్ చేసినవారి దగ్గరికి కొంద రు వెళ్లి వాళ్ల ఎలాట్మెంట్ క్యాన్సిల్ అయ్యిందనీ.. ఇప్పుడే దాన్ని తమ పేరుపై రాయకపోతే కట్టిన డబ్బులు వృథా అని మాయమాటలు చెబుతున్నారని ఫిర్యాదులు వస్తున్నా యి. జీవీఎంసీ కమిషనర్ పేరుతో అధికారికంగా ప్రకటనలు వచ్చేంత వరకూ ఎవ్వరూ ఏ విషయాన్ని నమ్మవద్దు. – జి.సృజన, జీవీఎంసీ కమిషనర్ -
గృహయోగం
ప్రజాసంకల్పయాత్ర సాక్షిగా వై.ఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రంలో ఎంతోమంది నిరుపేదలను కలిశారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి కష్టాలు స్వయంగా చూశారు. వారందరికీ ‘నేనున్నాను’ అంటూ భరోసా కల్పించారు. అధికారంలోకి వచ్చాక నవరత్నాలతో వారి జీవితాలను మార్చేయాలని సంకల్పించారు. అదే తమ మేనిఫెస్టో అని ప్రకటించారు. నిత్యం వాటిని గుర్తు చేసేలా ఆయన క్యాంప్ కార్యాలయంలో గోడలపై పెయింట్ చేయించారు. త్వరితగతిన వాటిని అమలు చేయాలని సంకల్పించారు. అందులో ముఖ్యమైన అంశం అందరికీ ఇళ్లు పథకం. రాబోయే ఐదేళ్లలో రాష్ట్రంలో సొంత ఇల్లు, ఇంటిస్థలం లేనివారు ఉండకూడదన్న లక్ష్యంతో వచ్చే ఉగాది నాటికి తొలివిడతగా ఇంటిస్థలాలు, ఇళ్లు పంపిణీ చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా వలంటీర్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించేందుకు ఆదేశాలు జారీ చేశారు. సాక్షి, విజయనగరం మున్సిపాలిటీ: రాష్ట్ర ప్రభుత్వం నవరత్నాలలో భాగంగా 2020 ఉగాది నాటికి అందరికీ ఇళ్లు ఇవ్వాలని సంకల్పించింది. దీనికి సంబంధించిన అర్హులను ఎంపిక చేసే బాధ్యత వలంటీర్లకు అప్పగించింది. వారు సోమవారం నుంచి సర్వే చేపట్టనున్నారు. జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలు, మున్సిపాలిటీల్లో ఈ నెల 30వరకు ఈ సర్వే చేపడతారు. గ్రామాల్లో కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఆర్ఐల పర్యవేక్షణలో సర్వే చేస్తారు. ఇందుకోసం జిల్లాలోని 919 గ్రామ పంచాయతీల్లో గ్రామ పర్యవేక్షణాధికారులను నియమించారు. సేకరించాల్సిన వివరాలు.. లబ్ధిదారుని వ్యక్తిగత వివరాలైన ఆధార్, కులం, వృత్తి, వయసు, సెల్ నంబరు వంటి ప్రాథమిక సమాచారంతో పాటు తెల్ల రేషన్ కార్డు ఉన్నదా... ఉంటే కార్డు సంఖ్య, రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు ఉందా లేక ఇంటి స్థలం ఉందా, గతంలో ప్రభుత్వం ద్వారా మంజూరు చేసిన ఇల్లు, లేదా ఇంటి స్థలం కలిగి ఉన్నారా అన్నవి నమోదు చేస్తారు. 2.5 ఎకరాల మాగాణి, 5 ఎకరాల మెట్ట భూమి కలిగి ఉన్నట్టయినా... రాష్ట్రంలో ఎక్కడైనా ఇల్లు ఉన్నా నివేశన స్థలానికి అనర్హులు. ఈ వివరాల నమోదు అనంతరం ఆయన అర్హుడా కాదా అన్నది నిర్ధారించి ప్రభుత్వానికి నివేదిస్తారు. వలంటీర్ల కీలక బాధ్యతలు.. వలంటీర్లుగా ఎంపికైన వారికి రాష్ట్ర ప్రభుత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఈ నెల 26 నుంచి ఇంటి స్థలం లేని వారు, స్థలం ఉండి ఇల్లు కట్టుకోనివారి వివరాలు నమోదు చేస్తారు. ప్రతి యాభై కుటుంబాల సంక్షేమ బాధ్యత, ప్రభుత్వ పథకాల పంపిణీ వీరిద్వారానే సాగుతుంది. వీరి పని తీరును పట్టణాల్లో కమిషనర్లు, గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండల స్థాయిలో ఎంపీడీవోలు పర్యవేక్షిస్తారు. ప్రభుత్వం ప్రకటించిన నవరత్నాల అమలు ప్రక్రియ వలంటీర్ల వ్యవస్థ ద్వారానే చేపట్టనుంది. కుటుంబ సర్వే నివేదికను 30వ తేదీ నాటికి జిల్లా కేంద్రానికి అందేలా చర్యలు తీసుకుంటారు. నవరత్నాలలో భాగంగా 25 లక్షల ఇళ్లు ఇవ్వడమే ఈ సర్వే లక్ష్యం. లబ్ధిదారుల ఎంపికకు వార్డు వలంటీర్ల సర్వే ప్రాతిపదిక కానుంది. నివేశన స్థలానికి అర్హుడు అవునో కాదో వలంటీర్లే నిర్థారిస్తారు. సర్వేలో ఇంకేం వివరాలు సేకరిస్తారంటే.. -యజమాని వివరాలు, కుటుంబంలోని సభ్యు ల వివరాలు సేకరిస్తారు. కుటుంబ సభ్యుల ప్రాథమిక సమాచారాన్ని అందించాలి. -గృహనిర్మాణం కింద సొంత ఇల్లు ఉందా. ఉం టే ఎవరి పేరున ఉంది. ఇంటికి తాగునీటి వసతి, మరుగుదొడ్డి ఉంటే వివరాలు, విద్యుత్ కనెక్షన్, నెలవారీ బిల్లు వివరాలు, వంట కట్టెలపొయ్యితోనా.. గ్యాస్‌తోనా అనే వివరాలు సేకరిస్తారు. -ఇంటి పరిసరాలు పరిశుభ్రత గురించి ఫార్మెట్లో వివరాలను పొందుపరచాలి. పరిశుభ్రత గు రించి తగిన సమాచారాన్ని వలంటీర్లు సేకరించాలి. -వ్యవసాయ కుటుంబం అయితే ఎంత భూమి ఉంది. బ్యాంకు రుణం. కౌలు రైతు అయితే ఆ వివరాలు. వ్యవసాయ పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు. రైతు తీసుకున్న అప్పుల వివరాలు ఇందులో పొందుపరచాలి. -పశుపోషణ వివరాలుంటే ఏ తరహా పశువులు ఎన్ని ఉన్నాయో నమోదు చేస్తా రు. వీటి ద్వారా ఆదాయం పొందుతుంటే వాటి వివరాలు. పశుపోషణలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో నమోదు చేస్తారు. -ఆరోగ్యం అంశంలో పిల్లల ఆరోగ్యం వివరాలను నమోదు చేస్తారు. వారికి అందుతున్న పౌష్టికాహారాన్ని ఏ విధంగా పొందుతున్నారో సేకరిస్తారు. -విద్యకు సంబంధించి 6–15 ఏళ్ల వయస్సు ఉన్న వారు అభ్యసిస్తున్న విద్య వివరాలు. ఆ పై వయస్సున్న వారు చదువుతుంటే ఎక్కడ.. ఎలా చదువుతున్నారో వివరాలను నమోదు చేస్తారు. ప్రభుత్వ లబ్ధి పొందుతుంటే వాటి వివరాలను నమోదు చేయాలి. -స్వయం సహాయ బృందాల మహిళలు కుటుంబంలో ఉంటే వారి వివరాలు, తీసుకున్న రుణం, ఇతర వివరాలను నమోదు చేస్తారు. పొదుపు సంఘాల సభ్యుల పని తీరును ఈ సర్వేలో నమోదు చేస్తారు. -ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల కింద లబ్ధి పొందుతుంటే పింఛన్, రేషన్, ఇతర పథకాల ద్వారా లబ్ధి వివరాలను సర్వేలో నమోదు చేస్తారు. కుటుంబ సంక్షేమంలో ఇతరత్రా ఎలాంటి సమస్య గుర్తించినా వాటిని ప్రత్యేకంగా సర్వేలో నమోదు చేస్తారు. మీ ఇంటి వద్దకే వాలంటీర్లు.. వార్డు వలంటీర్లు ఈ నెల 26వ తేదీ నుంచి 30 వరకు వారికి నిర్దేశించిన గృహాలకు వస్తారు. నివాస స్థలాలు/గృహాల అర్జీలు వారికి ఇవ్వాలి. దీనికోసం స్పందన కార్యక్రమానికి రానక్కర లేదు. వలంటీర్లకు ఇళ్ల అర్జీలను ఇస్తే సరిపోతుంది. ఇప్పటి వరకు దాఖలైన అర్జీలను వలంటీర్లు పరిశీలిస్తారు. ఇళ్ల అర్జీలు కూడా స్వీకరించి, మొత్తం వివరాలను అధికారులకు నివేదిస్తారు. – ఎస్.సచ్చిదానంద వర్మ, కమిషనర్, నగరపాలక సంస్థ, విజయనగరం -
బెజవాడలో లక్ష ఇళ్లు
పేదింటి కల సాకారం చేసే దిశగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన నవరత్న హామీలను అమలు చేస్తూ.. వచ్చే ఉగాది నాటికి అర్హులైన పేదలకు ఇళ్లు లేదా ఇళ్ల స్థలాలు అందివ్వాలన్న లక్ష్యంతో పనిచేస్తున్నారు. ఈ మేరకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. రాజధాని నగరం విజయవాడలోనే దాదాపు లక్ష ఇళ్లు నిర్మించాలని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. దీనికోసం వెయ్యి ఎకరాలు స్థలం అవసరం అవుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో నగర పరిధిలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలాలపై ఇప్పటికే సర్వే చేపట్టారు. సాక్షి, విజయవాడ : వచ్చే ఉగాది నాటికి పేదింటి కల సాకారం చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా గృహ నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం మంజూరు చేసే 25లక్షల ఇళ్లలో లక్ష ఇళ్లు విజయవాడ నగరానికి కేటాయించినట్లు అధికారులు చెబుతున్నారు. రాబోయే ఐదేళ్లలో ఈ లక్ష ఇళ్లు నిర్మాణం జరుగుతుందని స్పష్టం చేస్తున్నారు. కాగా నగరంలో ఇప్పటికే సుమారు 1.25లక్షల మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెయ్యి ఎకరాల స్థలం సేకరణ.. విజయవాడలో ఇళ్ల స్థలాలు ఇవ్వడం సాధ్యపడదు కాబట్టి ఇళ్లనే నిర్మించి ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా జీ+3 పద్ధతిలో ఇళ్లు నిర్మించాలని నిర్ణయించారు. వెయ్యి ఎకరాలు స్థలాన్ని సేకరించాలని నిర్ణయించారు. ఒక్కొక్క ఎకరంలోనూ జీ+3 పద్ధతిలో 100 ఇళ్లు నిర్మిస్తారు. ఈ లెక్కన వెయ్యి ఎకరాల్లోనూ లక్ష ఇళ్లు నిర్మాణం జరుగుతుంది. నగర పరిసర ప్రాంతాల్లో.. అయితే నగరంలో వెయ్యి ఎకరాలు సేకరణ సాధ్యపడదు. ఈ నేపథ్యంలో పరిసర ప్రాంతాల్లో సేకరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. రామవరప్పాడు, జూపూడి, అంబాపురం, జక్కంపూడి, నున్న, గొల్లపూడి తదితర గ్రామాల్లో అన్వేషిస్తున్నారు. ఆయా గ్రామాల్లో ప్రభుత్వ స్థలాలు ఉంటే వాటిని గుర్తించి.. అక్కడ ఇళ్ల నిర్మాణం చేపడతారు. లేకపోతే రైతుల నుంచి కొనుగోలు చేయాలని భావిస్తున్నారు. రూ.వెయ్యి కోట్లు వ్యయం.. ప్రస్తుతం విజయవాడ చుట్టు పక్కల గ్రామాల్లో కనీసం రూ.కోటి పెట్టందే ఒక ఎకరా పొలం లభించదు. అందువల్ల వెయ్యి ఎకరాలు కొనుగోలు చేయాలంటే కనీసం వెయ్యి కోట్లు అవుతుందని అధికారులు అంచనాలు వేస్తున్నారు. అయితే అసైన్డ్, ప్రభుత్వ భూములు, నిరుపయోగంగా ఉన్న పారిశ్రామిక భూములను కూడా తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. స్థల సేకరణకు సంబంధించి ఇప్పటికే అధికారులు మూడు సమావేశాలు నిర్వహించి, భూముల లభ్యత గురించి చర్చించారు. -
'పేదింటి'పై పెద్ద మనసేదీ?
సాక్షి, అమరావతి : పట్టణాల్లో పేదల ఇళ్ల నిర్మాణాలకు కేంద్రం మంజూరు చేసే నిధులను తెచ్చుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కానీ, ప్రభుత్వ పెద్దలు మాత్రం ఈ ఇళ్ల నిర్మాణ వ్యయాలను భారీగా పెంచేయడమే కాకుండా ఒక్కో పేదవాడిపై రూ.4లక్షల మేర అప్పుల భారం మోపుతూ కాంట్రాక్టర్ల నుంచి కమీషన్లు పొందడానికి ఎక్కువ ఆసక్తి కనబరుస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ఇళ్లకు సంబంధించి కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అసమగ్ర ప్రతిపాదనలను వచ్చినట్లు ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో పేర్కొన్నారు. 20 కేంద్ర పథకాలకు సంబంధించి అసలు ప్రతిపాదనలే పంపలేదని.. పది పథకాలకు అసమగ్ర ప్రతిపాదనలు కేంద్రానికి వచ్చాయని.. దీంతో కేంద్రం మరిన్ని వివరాలతో పంపాలని కోరినందున వాటిని పంపించేలా చూడాలని తన నివేకలో ఆయన రాష్ట్ర ప్రభుత్వానికి కోరారు. పట్టణ పేదల ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల జాబితాను పోర్టల్‌లో అప్లోడ్ చేయడంతోపాటు థర్డ్ పార్టీ తనిఖీ నివేదికను కేంద్రానికి పంపిస్తే రూ.2,169 కోట్లు రాష్ట్రానికి వస్తాయని ఆయన అందులో తెలిపారు. అలాగే, పట్టణ స్వచ్ఛ భారత్ కింద రూ.114కోట్ల నిధుల కోసం క్షేత్రస్థాయి పురోగతి నివేదిక పంపలేదని, ఆ నివేదికను కూడా పంపాల్సిందిగా కేంద్రం కోరినట్లు తెలిపారు. కాగా, నివేదికలో రెసిడెంట్ కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించిన మరిన్ని అంశాలు.. - ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద 2017–18లో రూ.7.31 కోట్ల రాష్ట్ర వాటాను, 2018–19లో రూ.65.17 కోట్ల రాష్ట్ర వాటాను వ్యయం చేయకపోవడాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రస్తావించింది. అలాగే.. 2017–18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆడిట్ నివేదికను సమర్పించకపోవడంతో పాటు కొత్తగా పూర్తిచేసే పనుల ప్రణాళికను పంపించలేదు. - సమగ్ర చేనేత డెవలప్మెంట్ పథకం కింద రాష్ట్ర వాటా 50 శాతం వ్యయం చేసినట్లు డాక్యుమెంట్‌ను సమర్పిస్తే తదుపరి మార్కెటింగ్ రాయితీని విడుదల చేస్తామని కేంద్రం తెలిపింది. - గిరిజన విద్యార్థుల స్కాలర్షిప్ నిధుల విడుదలకు సంబంధించి గత ఆర్థిక సంవత్సరానికి చెందిన వినియోగ పత్రాలను సమర్పించాలి. - ఎస్సీ విద్యార్థుల స్కాలర్షిప్ నిధుల కోసం కూడా కేంద్రం కొన్ని వివరాలు అడిగింది. - ఫిషరీస్ మేనేజ్మెంట్కు సంబంధించి గత ఆర్థిక సంవత్సరానికి చెందిన నిధుల వినియోగ పత్రాలను సమర్పించడంతో పాటు పర్యావరణ అనుమతి పత్రాలను ఇవ్వాలి. - ఇ–ఆసుపత్రుల్లో ఎలక్ట్రానిక్ గవర్నెన్స్‌కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం వడ్డీ కింద రూ.9 లక్షలను డిపాజిట్ చేయాల్సి ఉంది. - ఇన్స్పెక్షన్ అండ్ సర్టిఫికెట్ శిక్షణ కేంద్రం ఏర్పాటుకు 14వ ఆర్థిక సంఘం నిబంధనల మేరకు ప్రతిపాదనలను పంపాలి. - అలాగే, బీసీల స్కాలర్‌షిప్‌లకు సంబంధించి వినియోగ పత్రాలను సమర్పిస్తే డిసెంబర్ 15లోగా కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. -
అక్రమ దందా
పేదల ఇళ్లను అడ్డుపెట్టుకుని కాసుల పంట పండించుకుంటున్నారు.. మౌలిక వసతుల కోసం మంజూరైన నిధులు బొక్కేయాలని చూస్తున్నారు.. ప్రారంభోత్సవం పేరుతో అక్రమ వసూళ్లకు తెగబడుతున్నారు.. అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. చిలకలూరిపేటలో గృహకల్ప, ఇందిరమ్మ ఇళ్ల విషయంలో అక్రమార్కుల దందాపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిలకలూరిపేట: గృహకల్ప ఇళ్లలోనూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. గూడు లేని పేద, దిగువ మధ్యతరగతి వారి కోసం నిర్మించిన గృహాలూ వారి దోపిడీకి వరప్రదాయనిగా మారాయి. మరోవైపు తాగునీరు, పక్కా రోడ్లు వంటి మౌలిక వసతులు సమకూర్చకుండానే గృహసముదాయానికి రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆదివారం రాత్రి ప్రారంభోత్సవం నిర్వహించటంపై లబ్ధిదారులు మండిపడుతున్నారు. ఇళ్లు పూర్తయినా... 2006లో అప్పటి సీఎం వైఎస్సార్ ప్రభుత్వ హయాంలో చిలకలూరిపేట పట్టణంలోని పోలిరెడ్డిపాలెం సమీపంలో ఎన్ఆర్టీ రోడ్డు పక్కన సొంత ఇళ్లు లేని వారి కోసం రాజీవ్ గృహకల్ప పథకం ద్వారా అపార్ట్మెంట్ల తరహాలో మూడు బ్లాకులుగా 72 గృహాల నిర్మాణం ప్రారంభించారు. లబ్ధిదారు వాటాగా రూ.8250, ప్రభుత్వ సబ్సిడీ రూ.10 వేలు, బ్యాంకు రుణం రూ.74,250గా నిర్ణయించి ఇళ్ల నిర్మాణం పూర్తిచేశారు. అయితే తలుపుల ఏర్పాటు, విద్యుద్దీకరణ పనులు పెండింగ్‌లో ఉండిపోయాయి. అదే ప్రాంగణంలో 2008లో ఇందిరమ్మ ఇళ్లు జీ ప్లస్ 2 ప్రాతిపదికన ఎనిమిది బ్లాకులుగా 192 గృహాలు నిర్మించేందుకు అనుమతి లభించింది. వాటిని పేద, దిగువ మధ్యతరగతి ఆర్యవైశ్యులకు కేటాయించారు. అయితే బ్యాంకు రుణాలు అన్ని ఇళ్లకూ లభించకపోవటంతో ఒక్కో బ్లాకుకు 24 ఇళ్ల చొప్పున 120 ఇళ్ల నిర్మాణం శ్లాబుల వరకు పూర్తయి ఆగిపోయింది. మరో 72 ఇళ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. వీటిలో ఇళ్ల నిర్మాణానికి యూనిట్ ధర రూ.1.28 లక్షలుగా నిర్ణయించగా లబ్ధిదారు వాటాగా మొత్తం 192 మంది రూ.20 వేల చొప్పున డీడీలు చెల్లించారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం అవసరమైన స్థలాన్ని అప్పటి ప్రభుత్వమే కేటాయించింది. వైఎస్సార్ మరణంతో గృహ నిర్మాణం మధ్యలో నిలిచిపోవటంతో రాజీవ్ గృహకల్ప, ఇందిరమ్మ జీ ప్లస్ 2 లబ్ధిదారులు కలిసి బాపూజీ పౌరసేవా కేంద్రంగా ఏర్పడి ఇళ్ల నిర్మాణం పూర్తి చేయాలని అధికారులు, పాలకుల చుట్టూ అనేక పర్యాయాలు తిరిగారు. అనంతరం రూ.3.85 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో రాజీవ్ గృహకల్ప 72 ఇళ్లు, ఇందిరమ్మ జీ ప్లస్ 2కు సంబంధించిన 120 ఇళ్లు వెరసి మొత్తం 192 ఇళ్లు పూర్తి చేసి మౌలిక వసతులు కల్పించి ఇవ్వాల్సి ఉంది. వసూళ్ల పర్వం ఇలా... లబ్ధిదారులే ఒక సంఘంగా ఏర్పడి ఇళ్ల నిర్మాణం పూర్తి కోసం కృషి చేయగా, నిధులు మంజూరైన అనంతరం లబ్ధిదారు కూడా కాని టీడీపీ పట్టణ వాణిజ్య విభాగం అధ్యక్షుడు, మంత్రికి అనుంగు అనుచరుడైన వెల్లంపల్లి రవిశంకర్ అధ్యక్షుడు గృహ సముదాయం పేరును ఆదర్శ గృహకల్ప, ప్రత్తిపాటి నగర్‌గా మార్చేశారు. గృహ ప్రవేశాలకు ఖర్చులు అవుతాయంటూ 192 మంది లబ్ధిదారులు ఒక్కొక్కరు రూ.5 వేలు చొప్పున చెల్లించాలని చెప్పారు. సొమ్ము ఎందుకు చెల్లించాలని పలువురు లబ్ధిదారులు ప్రశ్నించటంతో ఒక్కొక్కరు రూ.2500 చొప్పున చెల్లించాలని అందరికీ ఫోన్ మెసేజ్‌లు పెట్టి మరీ వసూలు చేశారు. బ్యాంకు రుణం ఇవ్వకపోయినా... జీ ప్లస్ 2 గృహాలకు సంబంధించి 120లో 96 గృహాలకు మాత్రమే వివిధ బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. మిగిలిన 24 ఇళ్లకు రుణాలు మంజూరు కాలేదు. రుణాలు మంజూరైన 96 మంది వన్‌టైం సెటిల్మెంట్గా ఒక్కొక్కరు రూ.26 వేల చొప్పున ఆయా బ్యాంకులకు ఇప్పటికే చెల్లించేశారు. రుణం మంజూరుకాని 24 ఇళ్లు కూడా అంతకు ముందే శ్లాబు దశ వరకు పూర్తయి ఉండటంతో ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతోనే నిర్మాణం పూర్తి చేసుకున్నాయి. దీంతో 96 మంది లబ్ధిదారులు బ్యాంకుకు రూ.25 వేలు చెల్లించిన విధంగా తమకూ చెల్లించాలని ఆదర్శ గృహకల్ప అధ్యక్షుడిగా చెప్పుకొంటున్న మంత్రి అనుచరుడైన టీడీపీ నాయకుడు వెల్లంపల్లి రవిశంకర్ డిమాండ్ చేస్తున్నాడని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలా మొత్తం 24 మంది వద్ద నుంచి రూ.6 లక్షలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారని వారు చెబుతున్నారు. ఇలా అక్రమంగా వసూలు చేసిన డబ్బు ఎవరి కొంగున ముడిపడతాయన్నది జగమెరిగిన సత్యమేనని మండిపడుతున్నారు. మౌలిక వసతులేవీ? ఆర్భాటంగా ప్రారంభించిన ఆదర్శ గృహకల్పలో మౌలిక వసతులు సమకూరలేదు. మంచినీటి పైపులైన్ కూడా ఏర్పాటు చేయలేదు. పక్కా రోడ్లు నిర్మించలేదు. విద్యుత్ పనులు పూర్తికాలేదు. దీనిపై లబ్ధిదారుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. డబ్బు కట్టమంటున్నారు జీ ప్లస్ 2 గృహ సముదాయంలో బ్యాంకు రుణం లేకుండా ఇల్లు వచ్చింది. బ్యాంకు రుణం తాలూకు డబ్బులు తమకు చెల్లించాల్సిందిగా వెల్లంపల్లి రవిశంకర్ అడుగుతున్నాడు. అసలు రుణం మంజూరుకాకుండా డబ్బులు ఎందుకు చెల్లించాలి? ప్రభుత్వ శాఖల రసీదు ఉంటే కడతానన్నాను. – కొత్త వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు తాళాలు ఇవ్వలేదు ప్రారంభ ఖర్చులకని రూ.2500 అడిగారు. నేను మసాలా బండి వేసుకొని జీవనం వెళ్లదీస్తాను. డబ్బులు ఇవ్వలేనన్నాను. దీంతో రవిశంకర్ నాకు తాళాలు ఇచ్చేందుకు నిరాకరించాడు. డబ్బులు చెల్లిస్తేనే ప్లాటు తాళాలు ఇస్తామంటున్నారు. – కె.వెంకటేశ్వర్లు, లబ్ధిదారుడు డీడీ చెల్లించాం జీ ప్లస్ 2లో ఇంటి కోసం నా భార్య జయలక్ష్మి పేరున రూ.20 వేలు డీడీని 2008లో చెల్లించాం. మాకు అప్పట్లోనే ప్రభుత్వం స్థల కేటాయింపు పత్రం ఇచ్చింది. అయితే మాకు ప్లాటు రాలేదు. ఇళ్లు నిర్మించని 72 మంది జాబితాలో మా పేరు ఉంది. మా డబ్బు, ఇంటి స్థలం ఏమైనట్టు? – పోలిశెట్టి సాంబశివరావు, లబ్ధిదారుడు -
అపెరల్‌కు ఎసరు
చేనేతల అభ్యున్నతి కోసం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రొద్దుటూరు సమీపంలో అపెరల్‌పార్కును ఏర్పాటు చేశారు. ఇప్పటిదాకా రూ. 5.58 కోట్ల రూపాయల మేర ఖర్చు చేశారు. అయితే ఇప్పుడు ఈ స్థలాన్ని ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణం కోసం తీసుకోవాలని భావిస్తోంది. ఇదే జరిగితే ఈ ప్రాంతంలో గార్మెంట్స్, హ్యాండ్లూమ్ పరిశ్రమల ఏర్పాటుతో చేనేతలను ఆదుకోవాలన్న వైఎస్ సంకల్పం నెరవేరకుండా పోతుంది. సాక్షి ప్రతినిధి, కడప : ప్రొద్దుటూరు పట్టణంలోని కొర్రపాడు రోడ్డులో ఏర్పాటు చేసిన అపెరల్ పార్కులో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు అధికార యంత్రాంగం సన్నాహాలు చేయకపోగా.. ఇప్పుడా స్థలంలో కొంత భాగం పేదల ఇళ్ల నిర్మాణాల కోసం కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. పవర్లూమ్, డైయింగ్, హ్యాండ్లూమ్ పరిశ్రమలతోపాటు గార్మెంట్స్ తయారీ యూనిట్ల కోసం ఈ స్థలాన్ని 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కేటాయించారు. ఆ మేరకు ఏపీఐఐసీకి బాధ్యతలు అప్పగించారు. 76.17 ఎకరాల స్థలంలో అపెరల్ పార్కు ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. 15 నుంచి 20 సెంట్ల విస్తీర్ణంలో ప్లాట్లను ఏర్పాటు చేయడానికి సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు 47 ప్లాట్లను ఏర్పాటు చేశారు. పార్కు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి.. అంతర్గత రోడ్ల నిర్మాణం పూర్తి చేశారు. మరిన్ని మౌలిక వసతులు కల్పించాల్సి ఉంది. పార్కు స్థలంపై పలువురి కన్ను... అపెరల్ పార్కు స్థలంపై పలువురు కన్నేశారు. దశాబ్ద కాలంగా పనులు ముందుకు సాగకపోవడం.. అత్యంత విలువైంది కావడంతో దానిని హస్తగతం చేసుకోవాలని బడాబాబులు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. ఇదివరకే ఆ స్థలాన్ని కొంతమంది ఆక్రమించడం.. ఆ ఆక్రమణలను తొలగించడానికి అధికారుల పడిన హైరానా అందరికీ తెలిసిందే. ఇప్పటికే అందులో 5 ఎకరాల స్థలాన్ని రవాణా శాఖ కార్యాలయానికి విక్రయించడం జరిగింది. అప్పుడు 71.17 ఎకరాల స్థలం మాత్రమే అపెరల్‌పార్కుకు ఉంది. ప్రణాళిక ప్రకారమే పక్కన పెట్టారు.. వాస్తవానికి అపెరల్ పార్కులో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులైన పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానించాల్సిన ప్రభుత్వం దశాబ్దకాలం గడిచినా ఆ దిశగా చర్యలు చేపట్టలేదనే చెప్పాలి. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మరణించకముందు వరకు అక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చకచకా పనులు జరిగాయి. ఆయన మరణించాక.. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు దీనిపై దృష్టి సారించకపోవడంతో అపెరల్ పార్కు అభివృద్ధికి నోచుకోలేదు. పైగా కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న హయాంలో ఈ స్థలం నుంచి 5 ఎకరాలను రవాణాశాఖకు కేటాయించారు. అనంతరం చంద్రబాబు ప్రభుత్వం ఇక్కడ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు తీసుకునే విషయంలో నిర్లప్తత చూపింది. ఇప్పుడు ఎన్టీఆర్ అర్బన్ పేరిట ఇళ్ల నిర్మాణం కోసం ఈ స్థలాన్ని సేకరించాలని భావిస్తోంది. ప్రతిపాదించిన మంత్రి నారాయణ.. పురపాలకశాఖ మంత్రి నారాయణ అపెరల్ పార్కు స్థలంలోని 35 ఎకరాలను ఇళ్ల నిర్మాణం కోసం కేటాయించాలని ఏపీఐఐసీ చైర్మన్‌కు ప్రతిపాదించారు. అందుకుగాను మరోప్రాంతంలో చేనేతలకు స్థలం కేటాయిస్తామని చెప్పినట్లు తెలుస్తోంది. ఇక్కడ ఎకరా రూ. 69 లక్షల చొప్పున ఏపీఐఐసీ ధర నిర్ణయించింది. అయితే దీనిపై చేనేత వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. చేనేతల అభ్యున్నతి కోసం కేటాయించిన పార్కు స్థలాలను పూర్తిగా వారికి కేటాయించాలంటున్నారు. అపెరల్పార్కులో ఏర్పాటు చేసే పరిశ్రమల్లో తయారయ్యే వస్త్రాలకు మార్కెటింగ్ కల్పించడంతోపాటు పెట్టుబడికి రుణసాయం అందించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు.. చేనేతలను ఆదుకునేందుకే అపెరల్ పార్కును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ స్థలానికి సంబంధించిన వ్యవహారాలన్నీ మొదటి నుంచి ఏపీఐఐసీనే చూస్తోంది. ఇప్పుడా స్థలంలో ఇంటి నిర్మాణాలకు కేటాయించాలనే ప్రతిపాదనలు మా దృష్టికి రాలేదు. అయితే చేనేతల కోసం కేటాయించిన స్థలాన్ని వారికే కేటాయిస్తాం. అయితే ఏపీఐఐసీకి మా శాఖ నుంచి రూ. 2.50 కోట్లు చెల్లించాల్సి ఉంది. అందుకోసం అక్కడ ప్లాట్లు ఏర్పాటు చేసి వాటిని విక్రయించి చెల్లించాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. – జయరామయ్య, ఏడీ, చేనేత జౌళి శాఖ అభివృద్ధి కోసమే వినియోగించాలి అపెరల్ పార్కు స్థలాన్ని చేనేతల అభివృద్ధి కోసమే వినియోగించాలి. ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేనేతల దుస్థితిని చూసి 90 ఎకరాలు కేటాయించారు. ఈ ప్రభుత్వం ఆస్థలాన్ని ఇళ్ల కోసం కేటాయిస్తామని చెప్పడం చేనేతలను అవమానించినట్లే. ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఉన్నాడంటే అది చేనేతల పుణ్యమేనని టీడీపీ గుర్తు పెట్టుకోవాలి. మెండిగా ముందుకెళితే మా సత్తా ఏంటో చూపిస్తాం. – దశరథరామయ్య, చేనేత సంఘ రాష్ట్ర నాయకులు చేనేతల అభ్యున్నతికి కృషిచేయాలి చేనేత పరిశ్రమలకే అపెరల్ పార్కు స్థలం వాడాలి. కడప జిల్లాలో చిన్నతరహా, భారీ పరిశ్రమలు లేవు. ప్రధానంగా అపెరల్‌పార్కును గార్మెంట్స్ సంబంధిత పరిశ్రమలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే అనుభవజ్ఞులైన కళాకారులు అందుబాటులో లేక పోవడం, పెట్టుబడీ దారులు ముందుకు రాక పోవడంతో చేనేతల అభ్యున్నతి కోసమే 2005లో ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ఆర్ కేటాయించిన స్థలంలో ఎలాంటి అభివృద్ది జరగలేదు. చేనేతల అభివృద్ధికి కృషి చేయాలి – అవ్వారు ప్రసాద్, చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కన్వీనర్ ప్రభుత్వ నిర్ణయం సరికాదు చేనేతలను అభివృద్ది చేస్తామని చెబుతున్న ప్రభుత్వం ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అపెరల్ పార్కు స్థలాన్ని 13 ఏళ్ల కిందట కేటాయించినా ఒక్క పరిశ్రమను కూడా నెలకొల్పలేదు. చేనేతలు పనులు లేక ఎన్నో అవస్థలు పడుతున్నారు. ఈ రోజు ఆ స్థలాన్ని ఇళ్లకు ఇస్తామంటూ ప్రకటనలు చేస్తుండటం దారుణం. – నాగరాజు, చేనేత కార్మికుడు -
పేదలను విస్మరించిన కేసీఆర్
హన్మకొండ చౌరస్తా: సీఎం కేసీఆర్ పేదలను విస్మరిస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బుధవారం వరంగల్ జిల్లా హన్మకొండలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 14 నెలల పాలనలో పేదలకు ఒక్క ఇల్లు నిర్మించి ఇవ్వలేదన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ధనవంతులు, బడా పారిశ్రామికవేత్తలకు రాయితీలు ఇస్తున్న సీఎం.. ఏళ్లకు ఏళ్లుగా గుడిసెల్లో మగ్గుతున్న పేదలపై దాడులు చేయిస్తున్నారని విమర్శించారు. పేదల ఇళ్ల కూల్చివేతలపై మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. వరంగల్ నగరంలో 24 వేల మంది పేదలు ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. తెలంగాణలో ఆక్రమణలకు గురైన భూముల లెక్కలు వెలికితీసి.. భూపోరాటాలు చేపడుతామని హెచ్చరించారు. వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో పది వామపక్షాల ఉమ్మడి అభ్యర్థిని బరిలో దించుతామని తెలిపారు.