
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు చేపడుతున్నామని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. ఈ నిర్మాణాలను అడ్డుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పేదలకు ఇబ్బంది కలిగించేలా టీడీపీ కోర్టులకు వెళ్లి అడ్డుకుంటోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధానిలో పేదలకు ఇళ్లు ఇవ్వకుండా అడ్డుకుంటున్నారన్నారు. పేదలకు చరిత్రలో ఎవరూ కట్టనన్ని ఇళ్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిర్మించి ఇస్తున్నారని వివరించారు. సుమారు రూ.50 వేల వరకు సామగ్రి రూపంలో లబ్ధిదారులకు మేలు అని తెలిపారు. ఈ ఇళ్ల నిర్మాణం కోసం ప్రత్యేకంగా జేసీని నియమించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment