విజయవాడ : రాష్ట్రంలో తొలి విడతగా 15 లక్షల 10 ఇళ్లను నిర్మిస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి చేరుకువాడ శ్రీరంగనాథ రాజు అన్నారు. ఇందుకు లబ్ధిదారులు ఒక్కరూపాయి కూడా చెల్లించాల్సిన అవసరం లేదన్నారు. 26 వేల కోట్లతో, నాణ్యమైన మెటీరియల్తో ఇళ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. సీఎం జగన్ పాదయాత్రలో పేదలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారని, నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడొద్దని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో పేదల ఇళ్ల నిర్మాణానికి 1400 కోట్లు బకాయిలు పెట్టగా, వాటిని కూడా పేదలకు రెండు విడతల్లో విడుదల చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు శ్రీరంగనాథ రాజు తెలిపారు. (డిసెంబర్ 10 నాటికి ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో హెల్ప్ డెస్క్‌లు)
Comments
Please login to add a commentAdd a comment