AP: రాజధానిలో 900.97 ఎకరాల్లో పేదలకు ఇళ్లు | Houses For The Poor In 900 97 Acres In Amaravathi Capital | Sakshi
Sakshi News home page

AP: రాజధానిలో 900.97 ఎకరాల్లో పేదలకు ఇళ్లు

Published Sat, Oct 29 2022 11:36 AM | Last Updated on Sat, Oct 29 2022 3:17 PM

Houses For The Poor In 900 97 Acres In Amaravathi Capital - Sakshi

సాక్షి, అమరావతి: అమరావతి రాజధాని ప్రాంతంలో ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం ముందడుగు వేసింది. గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలం కృష్ణాయపాలెం, నిడమర్రు, కురగల్లు, తుళ్లూరు మండలంలోని మందడం, ఐనవోలు గ్రామాల పరిధిలో 900.97 ఎకరాలను గృహ అవసరాలకు అనుగుణంగా వినియోగించేలా సీఆర్‌డీఏ మాస్టర్‌ ప్లాన్‌లోని జోన్‌లలో మార్పులు చేసింది.
చదవండి: ఎగుమతుల హబ్‌గా ఏపీ..

ఈ మేరకు శుక్రవారం డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ప్రస్తుతం ఉన్న అఫర్టబుల్, ఈడబ్ల్యూఎస్‌ హౌసింగ్‌ జోన్‌తోపాటు రెసిడెన్షియల్‌ జోన్‌ నిబంధనల్లో మార్పులు చేస్తూ కొత్త జోన్‌ను తీసుకురానుంది. దీనిపై నవంబర్‌ 11వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ప్రజల నుంచి అభ్యంతరాలు, సలహాలు స్వీకరించనున్నట్లు తెలిపింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement