
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఆర్‌డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్‌కు చేరుకుంటారు.
వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన మోడల్ హౌస్‌ను పరిశీలిస్తారు. అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీకోసం ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు.