Vana mahotsavam
-
రేపు సీఎం జగన్ గుంటూరు జిల్లా పర్యటన
సాక్షి, అమరావతి: సీఎం వైఎస్ జగన్ సోమవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. సీఆర్డీఏ పరిధిలో (కృష్ణాయపాలెం జగనన్న లే అవుట్) పేదల ఇళ్ల నిర్మాణాలకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి కృష్ణాయపాలెం హౌసింగ్ లే అవుట్‌కు చేరుకుంటారు. వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడ ఏర్పాటు చేసిన మోడల్ హౌస్‌ను పరిశీలిస్తారు. అనంతరం వెంకటపాలెం చేరుకుని లబ్ధిదారులకు ఇంటి మంజూరు పత్రాల పంపిణీకోసం ఏర్పాటుచేసిన బహిరంగసభలో పాల్గొంటారు. -
యజ్ఞంలా చెట్ల పెంపకం
అందరం కలిసికట్టుగా అడుగులు వేస్తే మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. మొక్కలు నాటి.. అవి వృక్షాలుగా ఎదిగే వరకు తోడుగా నిలుద్దాం. తద్వారా మనకు విస్తృత ప్రయోజనాలు ఉన్నాయనే విషయం ఎల్లప్పుడూ గుర్తుంచుకుని, విరివిగా మొక్కలు నాటుదాం.. చెట్లను సంరక్షించుకుందాం. – సీఎం వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా సాగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. ప్రస్తుతం 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతానికి పెంచే దిశగా అందరం కలిసి ప్రయత్నం చేయాలన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో ‘జగనన్న పచ్చతోరణం – వన మహోత్సవం’ కార్యక్రమాన్ని గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడ వేప, రావి మొక్కలు నాటి నీళ్లు పోశారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్స్‌లో రాష్ట్రంలో అడవులు, అటవీ ఉత్పత్తులకు సంబంధించిన అంశాలను పరిశీలించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ.. చెట్ల పెంపకానికి సంబంధించి రెండు, మూడు విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే అవి ఎంత అవసరమో నిరంతరం తెలుస్తుందన్నారు. మనం పీల్చే గాలి ఆక్సిజన్ అని, ప్రపంచంలో ఏ జీవి అయినా ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ డయాక్సైడ్ను వదిలేస్తుందని, ఒక్క చెట్టు మాత్రమే పగటి పూట కార్బన్ డయాక్సైడ్ను తీసుకుని ఆక్సిజన్‌ను వదులుతుందని చెప్పారు. ఒక చెట్టు ఉంటే స్వచ్ఛమైన ఆక్సిజన్ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయనే విషయం జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశమని తెలిపారు. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కురిసే పరిస్థితి ఉంటుందన్నారు. మనం పదో తరగతి చదువుల్లో, పరీక్షలు రాసేటప్పుడు ఆస్మోసిస్ అని, ట్రాన్స్పిరేషన్, గటేషన్ అని రకరకాల సిద్ధాంతాలు చదివి ఉంటామని గుర్తు చేశారు. చెట్ల వల్ల వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయనే విషయాలను జ్ఞాపకం ఉంచుకోవాలన్నారు. వాటి వల్ల మనకు జరిగే మంచిని జ్ఞాపకం పెట్టుకుంటే, చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుందని పేర్కొన్నారు. దాదాపు 5 కోట్ల మొక్కలను నాటడానికి అటవీ శాఖను పురమాయిస్తూ ఆ పనికి పూనుకోవాలని అందరినీ కోరుతున్నానని చెప్పారు. ఇందుకోసం అందరూ ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని, ఇక్కడున్న వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత తమ మనసులో ప్రతిజ్ఞ చేయాలని కోరారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్‌ను పరిశీలిస్తున్న సీఎం వైఎస్ జగన్. చిత్రంలో మంత్రి బాలినేని అటవీ విస్తీర్ణంలో మొదటి స్థానమే లక్ష్యం ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. అటవీ విస్తీర్ణంలో రాష్ట్రం దేశంలో రెండో స్థానంలో ఉందని, దాన్ని మొదటి స్థానంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. నాడు–నేడు కార్యక్రమంలో, జగనన్న కాలనీల్లో, ఇతరత్రా 5 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. టీడీపీ ప్రభుత్వంలో కోట్లు అప్పులు చేసినా, ఎల్లో మీడియాకు కనిపించలేదని, కానీ సీఎం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక తప్పుడు రాతలు రాస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే), అటవీ, పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ఆర్కేఆర్ విజయ్‌కుమార్, అటవీ దళాల అధిపతి ఎన్ ప్రతీప్‌కుమార్, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని పచ్చని తోరణంగా తీర్చిదిద్దుదాం.. ‘ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగ పరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ.. వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడ వాడా, ఇంటా.. బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అని అందరితో సీఎం ప్రతిజ్ఞ చేయించారు. మనసా, వాచా, కర్మణా అందరం దీనికి కట్టుబడి ఉంటూ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. -
మొక్కలు పెంచడం చాలా అవసరం: సీఎం జగన్
-
5 కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళిక: మంత్రి బాలినేని
-
చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి: సీఎం జగన్
సాక్షి, మంగళగిరి: రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో గురువారం ‘జగనన్న పచ్చ తోరణం-వన మహోత్సవం’ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదని పేర్కొన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే... ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాలి.. చెట్ల పెంపకానికి సంబంధించి రెండు, మూడు చిన్న చిన్న విషయాలు జ్ఞాపకం పెట్టుకుంటే... అవి ఎంత అవసరమో మనకు నిరంతరం తెలుస్తుంది. ఒకటి.. మనం పీల్చే గాలి ఆక్సిజన్. ప్రపంచంలో ఏ జీవి అయినా ఆక్సిజన్‌ను పీల్చుకుని కార్బన్ డై ఆక్సైడ్ వదిలేస్తుంది. ఒక్క చెట్టు మాత్రమే పగటి పూట కార్భన్ డై ఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్‌ను వదులుతుంది. అంటే ఒక చెట్టు ఉంటే ప్యూర్‌గా ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ మెరుగ్గా ఉంటాయన్నది ఎప్పటికీ జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. రెండో అంశం.. చెట్లు ఉన్న చోట మాత్రమే మంచి వర్షాలు కూడా కురిసే పరిస్ధితి ఉంటుంది. మనం పదో తరగితి చదువుల్లో, పరీక్షలు రాసేటప్పుడు తెలుసుకున్న విషయాలివి. ఆస్మోసిస్ అని, ట్రాన్సిపరేషన్, గటేషన్ అని రకరకాలు సిద్ధాంతాలు అన్నీ చదివాం. చెట్లు వలన వర్షం ఎలా ప్రభావితం అవుతుంది, ఎక్కువ వర్షాలు పడే అవకాశాలు ఎందుకుంటాయి అనే ఈ రెండు విషయాలును జ్ఞాపకం ఉంచుకోవాలి. చెట్లు వలన మనకు జరిగే మంచిని మనం జ్ఞాపకం పెట్టుకుంటే, చెట్లను పెంచాల్సిన అవసరం ఎప్పుడూ కనిపిస్తుంది. చెట్ల పెంపకం–ఒక యజ్ఞం రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలి. రాష్ట్రంలో ఈరోజు 23 శాతం మాత్రమే ఉన్న అటవీ విస్తీర్ణాన్ని 33 శాతం పెంచే దిశగా అందరం ప్రయత్నం చేయాలి. మనందరం కలిసి చెట్లను నాటి, వాటిని సంరక్షించేందుకు అందరం కలిసి ప్రతిజ్ఞ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ మనం, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి సోదరుడు, స్నేహితుడు, ప్రతి అవ్వా, తాత తమ మనసులో ఈ ప్రతిజ్ఞ చేయాలి. చెట్లకు తోడుగా అందరం కలిసికట్టుగా ఉండి అడుగులు వేస్తే.. .మన రాష్ట్రంలో చెట్లు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది జరగాలని కోరుకుంటున్నాను. ఈ రోజు దాదాపు 5 కోట్ల మొక్కలను నాటడానికి అటవీశాఖను పురమాయిస్తూ... ప్రతిజ్ఞతో ఈ పనికి పూనుకోవాలని అందరినీ కోరుతున్నాను. అందరినీ ప్రతిజ్ఞ చేయడానికి ముందుకు రావాలని కోరుతున్నాను. సభలో ప్రతిజ్ఞ చేయించిన సీఎం ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరిగి, ప్రకృతిలోని సమతుల్య స్ధితి అవసరాన్ని గుర్తిస్తూ... ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగపరుస్తానని, చెట్ల ఆవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ వనాలను నరకనని, నరకనివ్వనని, విరివిగా మొక్కలు నాటుతానని మన ఊరూరా, వాడవాడా, ఇంటా బయటా, అన్ని చోట్ల మొక్కలు నాటడంతో పాటు వాటి సంరక్షణ బాధ్యతను కూడా స్వీకరించి ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు ప్రతిజ్ఞ చేస్తున్నాను. మనసా, వాచా, కర్మణా అందరం దీనికి కట్టుబడి ఉండి ఈ చెట్లకు మానవజాతి తోడుగా ఉండాలని కోరుకుంటూ, మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను అని సీఎం వైఎస్.జగన్ తన ప్రసంగం ముగించారు. ఈ కార్యక్రమంలో అటవీ, పర్యావరణశాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, గృహనిర్మాణశాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాధరాజు, హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ముఖ్యమంత్రి కార్యక్రమాల సమన్వయకర్త తలశిల రఘురాం, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది: మంత్రి బాలినేని పర్యావరణ సమతుల్యాన్ని సాధించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. నాడు-నేడు పథకంలో భాగంగా స్కూళ్లు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటాలని ఆయన పిలుపు నిచ్చారు. పచ్చదనం పెంపొందించడం, అడవుల సంరక్షణకు ప్రాధాన్యతనిస్తున్నామని తెలిపారు. ‘‘ప్రజలకు ఆరోగ్యకరమైన, ఆనందకరమైన జీవితం కల్పించడానికి ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. అందులో భాగంగా మన రాష్ట్రంలో 23 శాతం ఉన్న అటవీ విస్తీరణం 33 శాతం పెంచడానికి ప్రయత్నిస్తున్నాం. మన రాష్ట్రం అటవీ విస్తరణలో దేశంలో రెండో స్ధానంలో ఉంది, దానిని మొదటి స్ధానంలోకి తీసుకొచ్చేందుకు కృషిచేస్తున్నాం. దీనికి తోడు అటవీ శాఖ జగనన్న పచ్చ తోరణం కార్యక్రమం ద్వారా వివిధ శాఖల ద్వారా మొక్కలు నాటే కార్యక్రమాలు చేస్తున్నాం, దీంతో పాటు నాడు-నేడు కార్యక్రమం, జగనన్న కాలనీలలో కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నాం. ప్రతీ విషయానికి ఎల్లో మీడియా దుర్మార్గంగా వక్రీకరిస్తుంది. సీఎం వైఎస్ జగన్‌పై ఎంత బురదచల్లినా ప్రజల మనసులో ఆయన చిరస్ధాయిగా నిలిచిపోయారు. అదే టీడీపీ ప్రభుత్వంలో కోట్లు అప్పులు చేసినా ఎల్లో మీడియాకు కనిపించలేదు కానీ, సీఎం జగన్ చేస్తోన్న అభివృద్ది, సంక్షేమాన్ని చూసి ఓర్వలేక పచ్చ పత్రికలు తప్పుడు రాతలు రాస్తున్నాయి. కోవిడ్ నేపథ్యంలో ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా ప్రతీ కార్యక్రమం కూడా చెప్పిన తేదీకే అమలు చేస్తూ పాలన సాగిస్తున్నారని’’ మంత్రి బాలినేని అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు: ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాష్ట్రంలో పచ్చదనం పూర్తిగా విస్తరించాలని, మొక్కలు నాటడమే కాదు, నాటిన ప్రతీ మొక్క కూడా వృక్షంలా తయారయ్యేందుకు అందరూ కృషిచేయాలని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అన్నారు. పచ్చని చెట్లే ప్రగతికి మెట్లు అనే నినాదాన్ని ముందుకు తీసుకెళ్లేలా మనం రాష్ట్రంలో ప్రతీ రోజూ వీలైనంత మేరకు మొక్కలు నాటాలన్నారు. వాతావరణ సమతుల్యం, వాతావరణ కాలుష్యం తగ్గడానికి, ఆక్సీజన్ అవసరం కూడా తెలుసుకున్నాం. కాబట్టి, మొక్కలు, వృక్షాలు అనేది మానవ జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మనం తలంచి మొక్కలు విరివిగా పెంచాలని ఆయన పిలుపునిచ్చారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
మంగళగిరి ఎయిమ్స్ ఆవరణలో మొక్కలు నాటిన సీఎం వైఎస్ జగన్
-
ఏపీలో జగనన్న పచ్చతోరణం - వనమహోత్సవం
-
వన మహోత్సవం కార్యక్రమానికి సీఎం జగన్ శ్రీకారం
సాక్షి, మంగళగిరి: జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం ప్రారంభమైంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ చెట్లను పెంచాలని సీఎం జగన్ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చెట్లను పెంచడం చాలా అవసరమని, చెట్ల పెంపకంతో కాలుష్యం ఉండదన్నారు. చెట్లు ఉన్న చోటే వర్షాలు ఎక్కువగా పడే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర విస్తీర్ణంలో 33 శాతం పచ్చదనం ఉండేలా చర్యలు చేపడుతున్నామన్నారు. రాష్ట్రంలో చెట్ల పెంపకం ఒక యజ్ఞంలా జరగాలన్నారు. రాష్ట్రాన్ని పచ్చతోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని సీఎం జగన్ పిలుపునిచ్చారు. వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటనున్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నేడు ‘పచ్చ తోరణం, వన మహోత్సవం’
సాక్షి, అమరావతి/మంగళగిరి: వాతావరణ సమతుల్యత, పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా రాష్ట్రంలో విరివిగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. జాతీయ అటవీ విధానానికి అనుగుణంగా 33 శాతం పచ్చదనాన్ని పెంపొందిస్తూ.. తద్వారా ఆకుపచ్చని ఆంధ్రావని సాధనే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఏటా వర్షా కాలంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీశాఖ నిర్వహిస్తుంది. ఈ సారి దాన్ని భారీ ఎత్తున చేపట్టింది. ఇందులో భాగంగా జగనన్న పచ్చ తోరణం, వన మహోత్సవం కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గురువారం నుంచి ప్రారంభం కానుంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్ ఆవరణలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్క నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. అక్కడ మొత్తం రెండు వేల మొక్కలను నాటతారు. అన్ని జిల్లాల్లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు మొక్కలు నాటి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు నర్సరీలు, టింబర్ మిల్లులు, సామాజిక వనాల్లో ఏటా వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి మొక్కలు నాటే కార్యక్రమాన్ని అటవీ శాఖ చేపడుతుంది. ఈ సారి వాటితో పాటు 17 వేల వైఎస్సార్ జగనన్న కాలనీల్లోనూ మొక్కలు నాటనున్నారు. నాడు–నేడు పథకంలో భాగంగా పాఠశాలలు, ఆస్పత్రుల్లో మొక్కలు నాటించనున్నారు. గత రెండేళ్లలో రాష్ట్రంలో 33.23 కోట్ల మొక్కలు నాటినట్టు అటవీ శాఖాధికారులు చెప్పారు. వర్షాకాలమంతా మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు అటవీశాఖ ప్రధాన ముఖ్య సంరక్షణాధికారి ప్రతీప్‌కుమార్ చెప్పారు. 5 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు వన మహోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కోట్ల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, సైన్స్, టెక్నాలజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఎయిమ్స్ ఆవరణలో సీంఎ వైఎస్ జగన్ ప్రారంభించనున్న నేపథ్యంలో బుధవారం జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిలతో కలిసి సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం మంత్రి బాలినేని మీడియాతో మాట్లాడుతూ పచ్చదనంలో రాష్ట్రం దేశంలోనే రెండో స్థానంలో ఉందని, దానిని ప్రథమ స్థానానికి తెచ్చేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. మంత్రి చెరుకువాడ మాట్లాడుతూ మొక్కలు నాటడమే కాక వాటిని పరిరక్షించాలని సూచించారు. సీఎం వైఎస్ జగన్ పాల్గొనే కార్యక్రమాన్ని కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్టు చెప్పారు. ఏర్పాట్లను పరిశీలించిన వారిలో అటవీ పర్యావరణ శాఖ ముఖ్య కార్యదర్శి విజయ్‌కుమార్, గుంటూరు జిల్లా కలెక్టర్ వివేక్ యాదవ్ తదితరులున్నారు, జేసీ దినేష్‌కుమార్ తదితరులున్నారు. -
దౌర్భాగ్యపు రాజకీయం
గాజులపేటలో 33 ఎకరాల లేఅవుట్లో 1,600 మందికి ఇళ్ల స్థల పట్టాలు ఇస్తున్నాం. ఇక్కడ ఎకరా కనీసం రూ.3 కోట్లు ఉంటుంది. చదరపు గజం విలువ రూ.5 వేలు. ఇంత మంది పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వనుండటం.. ఆ స్థలాల పక్కనే వారు చక్కగా మొక్కలు నాటడం చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. సీఎం చేతుల మీదుగా వన మహోత్సవం కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలోని గాజులపేట ‘వనం మనం’ ప్రాంగణానికి చేరుకున్న సీఎం వైఎస్ జగన్ పేదల కోసం ఏర్పాటు చేసిన లే అవుట్లో మొక్కలు నాటి ‘జగనన్న పచ్చతోరణం’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వేప, రావి మొక్కలు నాటి, నీరు పోశారు. వన మహోత్సవంలో భాగంగా 20 కోట్ల మొక్కల్ని నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. హంగూ ఆర్భాటాలకు ప్రాధాన్యం ఇవ్వకూడదన్న సీఎం సూచనల మేరకు నిరాడంబరంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. సాక్షి, అమరావతి/ అమరావతి బ్యూరో: రాష్ట్రంలో పేదల ఇళ్ల స్థలాలను సైతం అడ్డుకునే దౌర్భాగ్యపు రాజకీయం సాగుతోందని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలకు మేలు చేసే ప్రతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కోర్టుల ద్వారా అడ్డుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. పేదలకు ఇళ్ల స్థలాలు కూడా ఇవ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారని, దీంతో చివరకు పేదల పక్షాన ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సి వచ్చిందని చెప్పారు. బుధవారం ఉదయం ఆయన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని గాజుల పేట వైఎస్సార్ జగనన్న కాలనీలో మొక్కలు నాటి.. 71వ వన మహోత్సవం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆగస్టు 15న పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని, ఆలోగా దేవుని దయవల్ల కోర్టులో ప్రభుత్వానికి అనుకూలంగా నిర్ణయం వస్తుందనే విశ్వాసం ఉందన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థల పట్టాలు ఇస్తామని తెలిపారు. సీఎం ఇంకా ఏమన్నారంటే.. టీడీపీ వేస్తున్న కేసుల తీరు అందరికీ తెలుసు ► ఏ రకంగా టీడీపీ వాళ్లు కేసులు వేస్తున్నారో మీ అందరికీ తెలుసు. చివరకు పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వడాన్ని కూడా అడ్డుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలు దౌర్భాగ్యంగా ఉన్నాయనడానికి ఇంతకంటే వేరే నిదర్శనం అవసరం లేదు. ► రాష్ట్రంలో 1.48 కోట్ల ఇళ్లు ఉంటే, ఇప్పుడు ఒకేసారి 30 లక్షల కుటుంబాలకు అనగా 20 శాతం మందికి ఇంటి స్థలం ఇస్తున్నాం. అర్హుల్లో ఎవరికైనా ఇంటి స్థలం రానిపక్షంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటే 90 రోజుల్లో ఇస్తాం. రాష్ట్రమంతా దాదాపు 13 వేల గ్రామ పంచాయితీలుంటే 17 వేల లేఅవుట్లు వేసి, పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తున్నాం. ప్రజలతో ప్రతిజ్ఞ.. – మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా పచ్చదనం పెంపుదలకు పాటు పడతామంటూ సీఎం ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ‘ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తోడ్పడతానని, పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరుగుతాను. ప్రకృతిలోని సమతుల పరిస్థితి అవసరాన్ని గుర్తిస్తూ ప్రతి నీటి బొట్టును సద్వినియోగ పరుస్తాను. చెట్ల అవశ్యకత పట్ల అవగాహన పెంచుతూ, వనాలను నరకను.. నరకనివ్వను. విరివిగా మొక్కలు నాటుతాను. మన ఊరూరా వాడ వాడలా ఇంటా బయటా, అన్ని చోట్లా మొక్కలు నాటడంతో పాటు, వాటి సంరక్షణ బాధ్యత కూడా స్వీకరిస్తాను. ఆంధ్రప్రదేశ్‌ను పచ్చని తోరణంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను’ అని సీఎం ప్రమాణం చేశారు. కార్యక్రమానికి హాజరైన వారు కూడా ఇలాగే ప్రమాణం చేశారు. – ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్, ప్రభుత్వ విప్ సామినేని ఉదయభాను పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. కోవిడ్ నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ వీరందరూ నవరత్నాల తరహాలో తొమ్మిది రకాల మొక్కలు నాటారు. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నం వద్ద వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటుతున్న ఇళ్ల పట్టాల లబ్ధిదారులు ఉద్యమంలా జగనన్న పచ్చతోరణం జగనన్న పచ్చ తోరణం కార్యక్రమంలో భాగంగా గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బుధవారం రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల పట్టాల లే ఔట్ల వద్ద, రోడ్ల వెంబడి, ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల్లో మొక్కలు నాటే కార్యక్రమం పెద్ద ఎత్తున సాగింది. ఒక్క రోజునే.. ఒక్క గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలోనే 40 లక్షల మొక్కలు నాటారు. కృష్ణా జిల్లాలో సీఎం వైఎస్ జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించగా, జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల మొక్కలు నాటారు. శ్రీకాకుళం జిల్లాలో 68 వేలు, విజయనగరం జిల్లాలో 5.20 లక్షలు, విశాఖపట్నం జిల్లాలో 1.90 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 4.10 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో 1.21 లక్షలు, గుంటూరు జిల్లాలో 3.10 లక్షలు, ప్రకాశం జిల్లాలో 5.10 లక్షల మొక్కలు నాటారు. నెల్లూరు జిల్లాలో 2.80 లక్షల మొక్కలు, వైఎస్సార్ కడప జిల్లాలో 2.60 లక్షలు, చిత్తూరు జిల్లాలో 1.20 లక్షలు, కర్నూలు జిల్లాలో 60 వేల మొక్కలు, అనంతపురం జిల్లాలో 8.70 లక్షల మొక్కలు నాటారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. -
జగనన్న పచ్చతోరణం
-
నేడు ఏపీలో వనమహోత్సవం
-
నేడు జగనన్న పచ్చ తోరణం
సాక్షి, అమరావతి: ‘ప్రతి ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి చెట్లు పెంచడం ద్వారా ప్రతి ఇంటినీ, ప్రతి ఊరునూ పచ్చదనంతో సింగారిద్దాం’ అనే నినాదంతో 71వ వన మహోత్సవాన్ని బుధవారం సీఎం వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. నూతన మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవానికి ముందు ఆయన కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో ఉదయం 9 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి పాల్గొననున్నారు. వనమహోత్సవంలో 20 కోట్ల మొక్కలు నాటడానికి ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. పచ్చదనం పెంపునకు ప్రతిన బూనుదాం జీవరాశులకు ప్రాణవాయువు అందించే మొక్కలను విరివిగా నాటడం ద్వారా చెట్ల పెంపకానికి త్రికరణ శుద్ధితో పాటుపడతామని ప్రతి ఒక్కరూ ప్రతిన బూనుదామని రాష్ట్ర అటవీ దళాల అధిపతి ఎన్.ప్రతీప్ కుమార్ పిలుపునిచ్చారు. ఆయన ‘జగనన్న పచ్చతోరణం’ ప్రచార సామగ్రిని మంగళవారం విడుదల చేశారు. మొక్కల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానిదే : పెద్దిరెడ్డి జగనన్న పచ్చతోరణంలో భాగంగా రాష్ట్రంలో 20 కోట్ల మొక్కలు నాటి, వాటిని సంరక్షించే బాధ్యత కూడా ప్రభుత్వమే చేపడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నంలో ఈ కార్యక్రమ ప్రారంభ ఏర్పాట్లను మంగళవారం ఆయన మంత్రులు పేర్ని నాని, వెలంపల్లి, సీఎం ప్రోగ్రాం కన్వీనర్ తలశిల రఘురాం, ఎమ్మెల్యేలు వసంత కృష్ణప్రసాద్, జోగి రమేష్‌లతో కలిసి పరిశీలించారు. -
గ్రీన్.. గ్రీన్.. ఎవర్గ్రీన్
లేబాక రఘరామిరెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక అటవీ విభాగానికి చెందిన అన్ని నర్సరీలు రకరకాల మొక్కలతో కొత్త కళ సంతరించుకున్నాయి. మొక్కలు నాటే పండుగ వన మహోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ బృందం ఇటీవల ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు, కొత్తపట్నం నర్సరీలను సందర్శించింది. వాతావరణం అనుకూలించడంతో నర్సరీల్లో మొక్కలు పచ్చగా కళకళలాడుతున్నాయి. నల్లని, తెల్లని పాలిథిన్ సంచుల్లో లైను కట్టినట్లున్న రకరకాల మొక్కలతో నర్సరీలు కొత్త శోభ సంతరించుకున్నాయి. ఆరు కోట్లకు పైగా మొక్కలతో సామాజిక అటవీ విభాగానికి చెందిన 737 నర్సరీలు ఈ బృహత్తర కార్యక్రమంలో పాలుపంచుకోనున్నాయి. ఉద్యానవన విభాగం, ప్రయివేటు నర్సరీల్లో 6.03 కోట్ల మొక్కలు సిద్ధమయ్యాయి. ఒక్కొక్కరు ఒక్కో మొక్క.. ► గత ప్రభుత్వాలు మొక్కలు నాటి, వాటి సంరక్షణ గురించి పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో నాటిన ప్రతి మొక్కను బిడ్డలా సంరక్షించి చెట్టుగా మారేలా చూడాలని సీఎం జగన్ ఆదేశిం చారు. దీంతో ప్రభుత్వం ‘ఒక్కొ క్కరు ఒక్కో మొక్క’ నాటి సం రక్షించాలనే నినాదం తెచ్చింది. ► పచ్చదనం పెంపునకు గ్రామ సచివాలయాలు, గ్రామ వలంటీర్ల సేవలను ప్రణాళికా బద్ధంగా వాడుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ► అన్ని రకాల రహదారులు, విద్యా సంస్థలు, పారిశ్రా మిక సంస్థలు, ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో మొక్కలు నాటుతారు. 33% గ్రీన్ కవర్ లక్ష్యం ► పర్యావరణ పరిరక్షణ, కాలుష్య రహిత సమాజం కోసం ఇప్పటికే దేశంలోనే మొట్టమొదటిసారిగా ‘ఆన్లైన్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫాం’ అమల్లోకి తెచ్చిన సీఎం జగన్ ఇప్పుడు పచ్చదనం పెంపుపై దృష్టి పెట్టారు. ► జాతీయ అటవీ విధానం ప్రకారం రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో 33 శాతం గ్రీన్ కవర్ (పచ్చదనం) సాధన లక్ష్యంగా ముందుకెళ్లాలన్న సీఎం మార్గనిర్దేశం మేరకు అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. ► రాష్ట్ర అటవీ శాఖ నోడల్ ఏజెన్సీగా అటవీ శాఖతో పాటు 29 ప్రధాన శాఖలు ఈ ఏడాది 20 కోట్ల మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేసుకున్నాయి. స్వచ్ఛంద సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, వన సంరక్షణ సమితుల ప్రతినిధులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాలుపంచుకోనున్నారు. ► రాష్ట్రంలో 1,62,968 చదరపు కిలోమీటర్ల మేర భూభాగం ఉంది. ఇందులో 37,258 చదరపు కిలో మీటర్ల (మొత్తం భూభాగంలో 23 శాతం) మేర అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. దీంతో పాటు అడవి వెలుపల మూడు శాతం చెట్లు ఉన్నాయి. నాలుగు రకాల ప్లాంటేషన్లు ఎవెన్యూ ప్లాంటేషన్: జాతీయ రహదా రులు, రాష్ట్ర రహదారులు, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ రహదారులు తదితర చోట్ల మొక్కలు పెంచుతారు. వేప, చింత, కానుగ, మర్రి, రావి, నిద్రగన్నేరు, బాదం, ఏడాకులపాయ, నేరేడు తదితర మొక్కలను ఈ ప్లాంటేషన్‌కు వినియోగిస్తారు. బ్యాంక్ ప్లాంటేషన్: స్థానిక పరిస్థితులు, భూమిని బట్టి సాగునీటి కాలువల వెంబడి టేకు, సుబాబుల్, మలబార్ నీమ్, వేప తదితర మొక్కలను నాటుతారు. బ్లాక్ ప్లాంటేషన్: చెట్లు క్షీణించిన అటవీ ప్రాంతం, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములు, రెవెన్యూ పోరంబోకు, దేవాలయాల భూములు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, పరిశ్రమలు తదితర సంస్థల ప్రాంగణాల్లో మొక్కలు నాటుతారు. ఆయా అటవీ ప్రాంతాల వాతావరణం, నేల పరిస్థితులను బట్టి మోదుగ, ఎర్ర చందనం, శ్రీగంధం, రోజ్ ఉడ్, నేరవేప, మద్ది, నీరుద్ది, ఏగిస తదితర మొక్కలు నాటుతారు. ఇళ్లు, పొలాలు: ఇళ్ల వద్ద, పొలం గట్లపైనా నాటుకోవడం కోసం అటవీ శాఖ మొక్కలు ఇస్తుంది. సాధారణంగా రైతులు టేకు, ఎర్రచందనం, శ్రీగంధం, వేప, చింత, దానిమ్మ, జామ, ఉసిరి, సపోటా తదితర మొక్కలను నాటుతారు. 3 రకాలుగా వర్గీకరణ ► పనస, మామిడి, ఉసిరి, సపోట, దానిమ్మ తదితరాలు ఫలసాయం ఇచ్చే మొక్కల జాబితాలో ఉన్నాయి. ► ఎర్రచందనం, శ్రీగంధం, వేప, వేగిస, నారవేప, టేకు, రోజ్ ఉడ్ తదితర మొక్కలను కలప ఇచ్చేవిగా పేర్కొంటారు. ► ఏడాకులపాయ, నిద్రగన్నేరు, సుబాబుల్ లాంటి మొక్కలను సాధారణంగా నీడ కోసం పాఠశాలల్లో నాటుతారు. రేపే శ్రీకారం వన మహోత్సవాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంలో బుధవారం ఉదయం 9 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కలు నాటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర అటవీ పర్యావరణ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, పేర్ని నాని, వెలంపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొననున్నారు. ► గ్రామాల్లో నాటిన మొక్కలను సంరక్షించే బాధ్యత పంచాయతీలకు అప్పగిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ► నాటిన వాటిలో కనీసం 85 శాతమైనా బతికేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఆ ఉత్తర్వుల్లో ఆదేశించారు. ట్రీ గార్డుల ఏర్పాటు: మంత్రి పెద్దిరెడ్డి జగనన్న పచ్చతోరణం కార్యక్రమంలో నాటే ప్రతి మొక్కను రక్షించేందుకు దాని చుట్టూ ట్రీ గార్డులను ఏర్పాటు చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. వనమహోత్సవం ఏర్పాట్లపై సోమవారం మంత్రి అధికారులతో సమీక్షించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్, ఉపాధి హామీ పథకం డైరెక్టర్ చినతాతయ్య తదితరులు పాల్గొన్నారు. 365 రోజులూ పని.. ప్రతిరోజూ పనికెళ్తున్నా. ఏడాదిలో 365 రోజులూ నర్సరీల్లో పని ఉంటోంది. లాక్‌డౌన్‌లోనూ పని దొరికింది. భర్త పనికి వెళ్లకపోయినా నాకు పని ఉండటం వల్ల కుటుంబ పోషణ సజావుగా సాగుతోంది. నర్సరీలో మాకు రోజుకు రూ.200 కూలి చెల్లిస్తున్నారు. – కొల్లిమేర వెంకటలక్ష్మి, కూలీ, ప్రియదర్శిని సెంట్రల్ నర్సరీ, ధవళేశ్వరం, తూర్పుగోదావరి జిల్లా. -
కోటి మొక్కలతో వన మహోత్సవం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు కోటి మొక్కలు నాటి ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 22వ తేదీన తాడేపల్లిలో మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి 12,721 కి.మీ. పొడవునా రోడ్లకు ఇరువైపులా 70 లక్షల మొక్కలు, పేదలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్ల వద్ద మరో 30 లక్షల మొక్కలు మొత్తం సుమారు కోటి మొక్కల వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది నాటాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్ బుధవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ నెల 20వ తేదీలోగా మొక్కలు నాటే కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. -
వనం ఉంటేనే మనం
సాక్షి, అమరావతి బ్యూరో: మనం నాటే ప్రతి మొక్క భూమాతకు ఎనలేని మేలు చేస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు. ఈ సృష్టిలో సమతూకం ఉండాలంటే అందరూ కచ్చితంగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అడవులను పెంచితేనే భూమిపై మనుషుల మనుగడ కొనసాగుతుందని ఉద్ఘాటించారు. గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు వద్ద శనివారం 70వ వన మహోత్సవాన్ని ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా వేప మొక్క నాటారు. అటవీ శాఖ ఏర్పాటు చేసిన జీవ వైవిధ్యం, వన్యప్రాణి సంరక్షణ ప్రదర్శనశాలను తిలకించారు. అనంతరం అటవీ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో వైఎస్ జగన్ ప్రసంగించారు. రాష్ట్ర భూభాగం 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే, ఇందులో 23 శాతం భూభాగంలో మాత్రమే అడవులు ఉన్నాయని తెలిపారు. జాతీయ అటవీ విధానం ప్రకారం 33 శాతం భూభాగంలో అడవులు పెంచాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఇంకా ఏం చెప్పారంటే.. ‘‘కేవలం రెండు మూడు నెలలు మాత్రమే ఉండే పంటలు వేస్తుండడం, మిగతా తొమ్మిది నెలలు భూమిపైకి నేరుగా సూర్యకిరణాలు పడుతుండడం వల్ల రాయలసీమ జిల్లాలు మరింత వేగంగా ఎడారిగా మారుతున్నాయని సీనియర్ పాత్రికేయుడు పాలగుమ్మి సాయినాథ్ ఒక సందర్భంలో చెప్పారు. సంవత్సరమంతా భూమిపై పచ్చదనం ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు. పర్యావరణం బాగుంటేనే మనమంతా బాగుంటాం. అందుకే పర్యావరణాన్ని తప్పనిసరిగా పరిరక్షించుకోవాలి. మన రాష్ట్రంలో 2,351 రకాల వృక్ష జాతులు, 1461 రకాల జంతు జాతులు ఉన్నాయి. కొన్ని జంతు జాతుల, వృక్ష జాతులు అంతరించిపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్రంలో ఇప్పుడున్న పులుల సంఖ్య 48 మాత్రమే. వీటి గురించి మనం పట్టించుకోవడం మానేస్తే రాష్ట్రంలో ఇక పులులు అనేవే ఉండవు. సింహాలది కూడా అదే పరిస్థితి. వనమహోత్సవం కార్యక్రమానికి హాజరైన ప్రజానీకంలో ఓ భాగం 25 కోట్ల మొక్కలు నాటుతాం మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తున్నాం. వన మహోత్సవం సందర్భంగా ఈ సీజన్లో రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈ వ్యవసాయ సీజన్లో ఇప్పటిదాకా 4 కోట్ల మొక్కలు నాటాం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా కోటి మొక్కలు నాటబోతున్నాం. ప్రతి ఒక్కరూ ఒక మొక్క నాటడం కాదు, కనీసం మూడు, నాలుగు మొక్కలు నాటాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుగుతాం. గ్రామ వలంటీర్ల ద్వారా ప్రజలకు మొక్కలు పంపిణీ చేస్తున్నాం. మొక్కల పెంపకం కార్యక్రమంలో భాగంగా పండ్ల చెట్లు, నీడనిచ్చే చెట్లు, ఎర్ర చందనం, టేకు.. ఇలాంటివి అక్షరాలా 12 కోట్ల మొక్కలు నాటడానికి అటవీ శాఖ సిద్ధంగా ఉంది. మరో 13 కోట్ల మొక్కలను మన పట్టు పరిశ్రమ శాఖ, ఉద్యానవన శాఖ, పేపర్ మిల్లులు నాటనున్నాయి. పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలల్లో తప్పనిసరిగా మొక్కలు నాటాలని కోరుతున్నా. పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం.. పర్యావరణ పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉంది. ఇటీవల సమీక్ష చేస్తున్నప్పుడు కొన్ని విషయాలు తెలిశాయి. రాష్ట్రంలో పరిశ్రమలు తెచ్చుకోవడానికి అడుగులు ముందుకు వేస్తున్నాం. ఏదైనా ఒక పరిశ్రమ వచ్చేటప్పుడు దానివల్ల పర్యావరణానికి మేలు జరుగుతుందా లేదా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. కాలుష్య నియంత్రణ మండలి వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. ఏదైనా పరిశ్రమ రావడానికి సంసిద్ధత వ్యక్తం చేస్తే తొలుత ఆ ఫైల్‌ను పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు పంపించాలి. సదరు పరిశ్రమ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని లేదు అని బోర్డు ధ్రువీకరించిన తర్వాతే ఆ ఫైల్ ముందుకు కదిలేలా ప్రక్షాళన చేయబోతున్నాం. ఫార్మా రంగం ద్వారా భారీగా కాలుష్యం వెలువడుతోంది. ఇందులో చాలా వరకు వాతావరణంలో, సముద్రంలో కలిసిపోతోంది. ఇలాంటి పరిస్థితి మారాలి. పరిశ్రమలకు సంబంధించిన కాలుష్యాన్ని పూర్తిగా నివారించే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుంది. ఆర్టీసీలో ఎలక్ట్రికల్ బస్సులు ప్రజా రవాణా వ్యవస్థను ప్రక్షాళన చేస్తున్నాం. ఈ సంవత్సరం ఏపీఎస్ఆర్టీసీలో 1,000 ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొస్తున్నాం. ఆర్టీసీలో ఉన్న 10 వేల బస్సులను దశలవారీగా తొలగిస్తూ, ఎలక్ట్రిసిటీతో నడిచే బస్సులను తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నాం. నింగి, నేల, నీరు, గాలి.. ఇవి కలుషితం అవుతుంటే కళ్లు మూసుకుని కూర్చోకూడదు. వాటిని కాపాడుకునే ప్రయత్నం అందరూ చేయాలి’’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. అనంతరం నవ్యాంధ్రప్రదేశ్‌ను పచ్చని హారంగా తీర్చిదిద్దడానికి కృషి చేస్తామంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆరుగురు అటవీ శాఖ సిబ్బందికి ముఖ్యమంత్రి ఆయుధాలు అందజేశారు. విధి నిర్వహణలో అత్యుత్తమ సేవలందించిన 80 మంది అటవీ అధికారులు, సిబ్బందికి ప్రశంసా పత్రాలు ఇచ్చి, సత్కరించారు. వన మహోత్సవంలో మంత్రులు మేకతోటి సుచరిత, పేర్ని వెంకట్రామయ్య, మోపిదేవి వెంకటరమణ, శాసన మండలిలో చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్, ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, సామినేని ఉదయభాను, ఆళ్ల రామకృష్ణారెడ్డి, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, నంబూరు శంకర్రావు, కిలారి వెంకట రోశయ్య, విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, మల్లాది విష్ణు, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ప్రభుత్వ ఉన్నతాధికారులు, సిబ్బంది, వైఎస్సార్సీపీ నేతలు పాల్గొన్నారు. -
వన మహోత్సవం సందర్భంగా సీఎం జగన్ ట్వీట్
సాక్షి, గుంటూరు : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వంతో పాటు అదరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు. అడవుల సంఖ్య ఏటేటా తగ్గిపోతుందని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం జగన్ గుంటూరు జిల్లా డోకిపర్రు గ్రామంలో శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులలతో కలిసి మొక్కలు నాటారు. ‘చెట్లవల్లే జనం, జీవం. మనం చెట్లను కాపాడితే, అవి ధరిత్రిని రక్షిస్తాయి. వన మహోత్సవం సందర్భంగా మొక్కలను విరివిగా నాటుదాం, వాటిని పెంచే బాధ్యతను తీసుకొందాం, కొత్తవనాల్ని సృష్టిద్దాం. అనూహ్య వాతావరణ మార్పులనుంచి మానవాళిని, జీవజాతులను సంరక్షించుకుందాం’అని సీఎం ట్విటర్లో పేర్కొన్నారు. (చదవండి : అందరూ తోడుగా నిలవాలని కోరుతున్నా : సీఎం జగన్) -
అందరూ తోడుగా నిలవాలి : సీఎం జగన్
సాక్షి, గుంటూరు : పర్యావరణ రక్షణ కోసం ప్రభుత్వంతో పాటు అదరూ కలిసి రావాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరారు. నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిది అని పిలుపునిచ్చారు. విరివిగా మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుకుందామని కోరారు. అడవుల సంఖ్య ఏటేటా తగ్గిపోతుందని, వీటిని పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం పేర్కొన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని సీఎం జగన్ శనివారం గుంటూరు జిల్లా డోకిపర్రు గ్రామంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులలతో కలిసి మొక్కలు నాటారు. అనంతరం ఆక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించారు. మొక్కలు నాటే కార్యక్రమంలో అందరూ పాలుపంచుకొని ప్రభుత్వానికి తోడుగా నిలవాలని కోరారు. సీఎం జగన్ ఇంకా ఎమన్నారంటే.. (చదవండి : వన మహోత్సవాన్ని ప్రారంభించిన సీఎం జగన్) అందుకే అశోకుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు ‘మనం నాటే ప్రతి మొక్కభూమాతకు మేలు చేస్తుంది. మనం పెంచే ప్రతి చెట్టు తరువాతి తరానికి కూడా వీటి ఫలాలను ఇస్తుంది. మాములుగా మనిషి బతకాలంటే ఆక్సిజన్ కావాలి. అటువంటి ఆక్సిజన్ ఇచ్చే ఏకైక ప్రాణి ఒక్క చెట్టు మాత్రమే. ఈ సృష్టిలో బ్యాలెన్స్‌గా ఉండాలంటే చెట్లు బలంగా ఎదగాలి. రాష్ట్ర భూభాగంలో 37,258 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇందులో 23 శాతం మాత్రమే అడువులు ఉన్నాయి. ఇందులో 13 శాంక్షరీలు, మూడు నేషనల్ పార్కులు, రెండు జులాజికల్ పార్కులు, ఒక టైగర్ రిజర్వ్, ఒక ఎనుగు రిజర్వ్ అడవులు మన రాష్ట్రంలో ఉన్నాయి. ఇవన్నీ మన రాష్ట్రంలో ఉన్నాయి కదా అని గొప్పగా ఫీల్ కావాలా? లేక మొత్తం భూభాగంలో మూడింతల్లో ఒక భాగం అడవులు ఉండాలని జాతీయ అడవుల విధానం చెబుతున్నప్పుడు 33 శాతం ఉండాల్సిన అడవుల్లో మన రాష్ట్రంలో కేవలం 23 శాతం మాత్రమే ఉన్నాయని భాధపడాలో ఆలోచించుకోవాలి.అశోకుడి గురించి మనం వింటుంటాం. ఆయన గొప్ప చక్రవర్తి అని విన్నాం. రోడ్డుకు ఇరువైపు చెట్లను నాటించాడు కాబట్టే అశోకుడు గొప్ప చక్రవర్తి అయ్యాడు. ఆయన నాటించిన చెట్లు వందల సంవత్సరాలు బతికాయి, తరువాత తరాలకు మేలు చేశాయి. 25 కోట్ల మొక్కలు నాటేందుకు శ్రీకారం చుట్టాం పర్యావరణం బాగుంటేనే మనమంతా కూడా బాగుంటాం. వీటిని రక్షించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన రాష్ట్రంలో 2351 వృక్షజాతులు, 1461 జంతు జాతులు ఉన్నాయి. రాష్ట్రంలో కొన్ని జంతువులు, మొక్కలు అంతరించి పోతున్నాయి. మనం డైనోసార్స్ గురించి వింటుంటాం. ఇవి ఇప్పుడు కనిపించడం లేదు. ప్రపంచంలో ఇవాళ పరిస్థితి ఎలా ఉందంటే..పులులు అంతరించిపోతున్నాయి. పులుల సంఖ్య రాష్ట్రంలో కేవలం 48 మాత్రమే ఉన్నాయి. ఈ ఏడాది ఆరు పెరిగాయని సంబరాలు చేసుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచన చేయండి. వీటిని గురించి మనం పట్టించుకోవడం మానేస్తే పులులు, సింహాలు ఏవి కూడా ఉండవు. మన రాష్ట్రాన్ని కాపాడుకునే దిశగా అడుగులు వేస్తూ..రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నాం. ఇప్పటిదాకా నాలుగు కోట్ల మొక్కలు నాటాం. ఈ ఒక్క రోజు కోటి మొక్కలు నాటబోతున్నాం. ప్రతి ఒక్కరు ఒక్క మొక్క నాటడం కాదు. ప్రతి ఒక్కరు మూడు, నాలుగు మొక్కలు నాటాలి. అప్పుడే మన రాష్ట్రాన్ని కాపాడుకోగలుతామని గుర్తు ఎరగాలి. రాష్ట్రంలో గ్రామ వాలంటీర్ల ద్వారా పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. గ్రామ వాలంటీర్ల చేత మొక్కల పెంపకం నాటే కార్యక్రమం చేపట్టాలని కోరుతున్నాను. నీడనిచ్చే మొక్కలు, టేకు మొక్కలు, ఎర్రచందనం మొక్కలు 12 కోట్లు మొక్కలు నాటేందుకు అటవీ శాఖ సిద్దంగా ఉంది. దశల వారిగా 10వేల ఎలక్ట్రిక్ బస్సులు తెస్తాం ఇవాళ ఫార్మా పరిశ్రమల గురించి మాట్లాడుతున్నాం. పరిశ్రమలు వచ్చేసమయంలో పర్యావరణానికి మేలు చేస్తుందా? అన్నది ఆలోచన చేయాలి. పొల్యూషన్ కంట్రోల్ బోర్డును ప్రక్షళన చేయబోతున్నామని చెబుతున్నాను. ఫార్మా రంగంలో లక్ష టన్నుల కాలుష్యం వస్తుందని నా దృష్టికి వచ్చింది. కేవలం 30 వేల టన్నులు మాత్రమే ఆడిట్ జరుగుతుందని, మిగతాది కాల్చివేయడం, లేదా సముద్రంలో వేయడం జరుగుతుంది. పరిశ్రమల్లో ఎంత కాలుష్యం వస్తుంది. ఏ రకంగా మనం డిస్పోజ్ చేయాలో ఆలోచన చేయాలి. ప్రభుత్వమే బాధ్యత తీసుకోబోతోంది. పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయబోతున్నాం. ఈ ఏడాది అక్షరాల ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో 100 ఎలక్ట్రసిటీ సౌకర్యం ఏర్పాటు చేస్తున్నాం. దశల వారిగా 10 వేల ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తాం. నీరు, నేల, నింగి, గాలి వీటంన్నిటిని కూడా కాలుషితం కాకుండా చూడాల్సిన బాధ్యత అందరిపై ఉంది. వీటిని కాపాడుకుందాం’ అని సీఎం జగన్ ప్రజలకు పిలుపునిచ్చారు. -
మనం నాటే ప్రతి మొక్క భూమాతకు మేలు చేస్తుంది
-
వన మహోత్సవానికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం
-
పుడమితల్లికి పచ్చల హారం