కోటి మొక్కలతో వన మహోత్సవం | Vana Mahotsavam with One Crore Plants | Sakshi
Sakshi News home page

కోటి మొక్కలతో వన మహోత్సవం

Published Thu, Jul 16 2020 4:32 AM | Last Updated on Thu, Jul 16 2020 4:32 AM

Vana Mahotsavam with One Crore Plants - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో దాదాపు కోటి మొక్కలు నాటి ఈ ఏడాది వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాట్లు చేస్తోంది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 22వ తేదీన తాడేపల్లిలో మొక్కలు నాటి వనమహోత్సవ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభిస్తారు. ఇందుకు సంబంధించి 12,721 కి.మీ. పొడవునా రోడ్లకు ఇరువైపులా 70 లక్షల మొక్కలు, పేదలకు ఇళ్ల పట్టాలిచ్చేందుకు సిద్ధం చేసిన లేఅవుట్ల వద్ద మరో 30 లక్షల మొక్కలు మొత్తం సుమారు కోటి మొక్కల వరకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ ఏడాది నాటాలని అధికారులు నిర్ణయించారు.

ఈ మేరకు పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్‌ గిరిజా శంకర్‌ బుధవారం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించి ఈ నెల 20వ తేదీలోగా మొక్కలు నాటే కార్యక్రమానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement