వైఎస్సార్ జిల్లా : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని కోరుతూ వైఎస్సార్ జిల్లా కడప నగరంలో ఇన్సాఫ్ విద్యా సమాఖ్య ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. గురవారం జరిగిన ఈ కార్యక్రమంలో జస్టిస్ లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు శివాజీతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.