సాక్షి, తాడేపల్లి: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘బీసీలకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం-బీసీలకు అందిస్తున్న పథకాలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారన్నారు.
చదవండి: ‘మద్రాస్, హైదరాబాద్‌లో తంతే అమరావతిలో పడ్డాం’
‘‘వైసీపీ బీసీ డిక్లరేషన్ పెట్టినపుడు ఎన్నికల జిమ్మిక్కులంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. ఓట్ల రాజకీయం అని ఆరోపించాయి. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత. విద్య ద్వారా సాధికారత సాధ్యమని వైఎస్సార్ నమ్మారు. అందుకే ఫీజు రీయింబర్స్‌మెంట్ ప్రవేశపెట్టారు. వైద్యం ఖరీదైన రోజుల్లో నేనున్నాంటూ పేదలకు ఆపన్నహస్తం అందించిన నేత వైఎస్సార్. ఎంబీసీలు నేడు తమ ఉనికి నిలబెట్టుకుంటున్నారు. తమకు కావాల్సిన హక్కుల సాధనకు పోరాడగలుగుతున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
బీసీల సాధికారతకు ఆనాడు వైఎస్సార్ హయాంలో తొలి అడుగు పడింది. నేడు వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు. ఈ రోజు మా పార్టీ సభలు జరిగితే సగానికి పైగా వేదికపై బీసీ నేతలే ఉంటున్నారు. రిజర్వేషన్లు అమలు చేయడం పెద్ద పరీక్ష. అనుకున్న దానికంటే ఎక్కువ శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందని’’ సజ్జల అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment