కాంట్రాక్టు లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు | Glimpses in the lives of contract lecturers | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టు లెక్చరర్ల జీవితాల్లో వెలుగులు

Published Sat, Aug 19 2023 3:00 AM | Last Updated on Sat, Aug 19 2023 8:14 AM

Glimpses in the lives of contract lecturers - Sakshi

సాక్షి, అమరావతి: ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులకు సంబంధించి ఇబ్బందికరంగా ఉన్న ఐదేళ్ల నిబంధనను తొలగించి 2014 జూన్‌ 2వ తేదీకి ముందు పనిచేసిన అందరినీ రెగ్యులర్‌ చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకున్న నిర్ణయానికి కాంట్రాక్టు లెక్చరర్లు హర్షం వ్యక్తంచేశారు. తాడేపల్లిలో వీరంతా జేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపే కార్యక్రమం నిర్వహించారు. సీఎం జగన్‌ నిర్ణయంతో విద్యాశాఖలో జూనియర్, డిగ్రీ, పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు లెక్చరర్లు ఎక్కువమందికి లబ్ధి చేకూరిందన్నారు.

రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది కాంట్రాక్టు లెక్చరర్లు తాడేపల్లిలోని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సీఎం చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి భారీ కేక్‌ను కట్‌చేసి సజ్జల రామకృష్ణారెడ్డిని గజమాలతో సత్కరించారు. తమ తరఫున సీఎంకు ధన్యవాదాలు తెలియజేయాలని వారు విన్నవించారు. అనంతరం జై సీఎం జగన్‌ అంటూ నినదించారు. పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. తాత్కాలిక ఉద్యోగుల గుండెల్లో సీఎం జగనన్న చిరస్థాయిగా నిలిచిపోతారని వారందరూ కొనియాడారు.

అనంతరం సజ్జల మాట్లాడుతూ.. సీఎం జగన్‌ అటు ప్రజలు ఇటు ఉద్యోగుల శ్రేయస్సు కోసం అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకున్నారన్నారు. రెండు దశాబ్దాలకు పైగా అపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్‌ ప్రభుత్వం ఆర్థిక భారమైనా పరిష్కరించి రెగ్యులరైజ్‌ చేయడం చారిత్రాత్మక నిర్ణయమని తెలిపారు. ఈ సందర్భంగా.. ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగులు పలువురు మాట్లాడారు. వారు ఏమన్నారంటే..


గత పాలకులు ఎగతాళి చేశారు
ప్రభుత్వ కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచమంటే మీకిదే ఎక్కువని గత పాలకులు గేలి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగనన్న మా బాధలు చూసి స్వయంగా మా ధర్నా శిబిరాలకు వచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక రెగ్యులరైజ్‌ చేస్తామని హామీ ఇచ్చి మాట నిలబెట్టుకున్నారు. కలకాలం ఆయనకు రుణపడి ఉంటాం. – కల్లూరి శ్రీనివాస్, కాంట్రాక్ట్‌  లెక్చరర్స్‌ జేఏసీ కో–చైర్మన్‌

10 వేలకు పైగా కుటుంబాల్లో వెలుగులు
రెండు దశాబ్దాలకు పైగా ఆపరిష్కృతంగా ఉన్న సమస్యను సీఎం జగన్‌ పరిష్కరించారు. చంద్రబాబు మమ్మల్ని పట్టించుకోలేదు. కానీ, జగన్‌ పాదయాత్రలో మా సమస్యను విని సీఎం అయ్యాక చిత్తశుద్ధితో పరిష్కరించారు. ఈ నిర్ణయంతో 10,117 కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపారు. మా కుటుంబాలు ఆయనకు అండగా ఉంటాయి.  – డి. ఉమాదేవి, కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి

సీఎం మేలు మరువలేం..
సీఎం జగనన్న మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు. పది కాలాలపాటు సీఎం జగనన్న ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని పాలించాలి. మహిళా ఉద్యోగులందరం కలిసి ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసు­కుంటున్నాం. ఆయనకు దైవకృçప, ప్రజ­ల ఆశీçస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.– ఆర్‌. దీప, కాంట్రాక్ట్‌ లెక్చరర్‌ (కాంట్రాక్ట్‌ లెక్చరర్ల జేఏసీ మహిళా కార్యదర్శి)

ఐదేళ్ల నిబంధన తొలగింపు చరిత్రాత్మకం..
సీఎం జగనన్న తీసుకున్న రెగ్యులరైజేషన్‌ నిర్ణయం 4,500 మంది కాంట్రాక్టు ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. ఐదేళ్ల నిబంధన తొలగింపు నిర్ణయం చరిత్రాత్మకం. జీవితాంతం సీఎం జగన్‌కు రుణపడి ఉంటాం. వైఎస్‌ జగన్‌ మళ్లీ సీఎం అయ్యేందుకుకృషిచేస్తాం.– కుమ్మరకుంట సురేష్, కాంట్రాక్ట్‌ లెక్చరర్స్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement