సాక్షి, అమరావతి: కలల రాజధాని కట్టబోతున్నామని చంద్రబాబు భ్రమలు కల్పించారు తప్ప చేసిందేమి లేదని వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఈ ప్రాంతం జీవం ఏమీ లేదని.. త్వరలోనే ఇళ్ల నిర్మాణాలతో ఈ ప్రాంతంలో జీవం కన్పిస్తోందన్నారు. ఈ నెల 24న సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేతుల మీదగా రాజధాని ప్రాంతంలో ఇళ్ల పేదల నిర్మాణాలకి శంకుస్థాపన జరుగుతుందని చెప్పారు. ఆరు నెలలలో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని లక్ష్యంతో ఉన్నట్లు చెప్పారు.
కొత్తగా 25 ఊర్లు ఈ ప్రాంతంలో రాబోతున్నాయన్నారు. అన్ని ప్రాంతాలు అభివృద్ది చేయాలని సీఎం జగన్ సంకల్పించారన్నారు. కేంద్రం ఒప్పుకోకపోయినా ఈ భారాన్ని భరించడానికి ఏపీ ప్రభుత్వం సిద్దంగా ఉందన్నారు.
ఆరు నెలలలో ఊళ్లు వస్తాయి.. పాఠశాలలు, డిజిటల్ లైబ్రరీలు లాంటివి వస్తాయి.. ఏ ప్రభుత్వం చేపట్టని విధంగా అన్ని సౌకర్యాలతో కొత్త ఊళ్లు రాబోతున్నాయని అన్నారు. పేదల నివాసానికి అనువుగా అన్ని మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేస్తున్నామని సజ్జల తెలిపారు.
చదవండి మూడు నెలల తర్వాత ఐటీ ఉద్యోగి సమాధి బద్ధలు.. పిల్లల భవిష్యత్తు కోసమేనట
Comments
Please login to add a commentAdd a comment