High Court Green Signal To Distribution Of Houses For Poor People In Amravati - Sakshi

అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌

May 5 2023 2:47 PM | Updated on May 5 2023 3:47 PM

High Court Green Signal To Distribution Of Houses For Poor People In Amravati - Sakshi

అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జీవో నెం.45పై రద్దు కోరుతూ దాఖలైన పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది.

సాక్షి, అమరావతి: అమరావతి పేదల ఇళ్ల పట్టాల పంపిణీకి ఏపీ హైకోర్టు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. జీవో నెం.45పై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని దాఖలైన పిటిషన్‌ కోర్టు కొట్టివేసింది. ప్రభుత్వం తరపున అడిషనల్‌ ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ప్రభుత్వ వాదనతో ఏపీ హైకోర్టు ఏకీభవించింది. ఇళ్ల స్థలాల పంపిణీ కోర్టు తీర్పుకు లోబడి ఉండాలని, రాజధాని ఏ ఒక్కరికో.. ఒక వర్గానికో పరిమితం కాదని.. పిటిషన్‌ విచారణ సందర్భంగా సీజే ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధాని ప్రజలందరిది. రాజధానిలో పేదలు ఉండకూడదంటే ఎలా అని ధర్మాసనం ప్రశ్నించింది.

‘‘రాజధాని ప్రాంతంలో ప్రభుత్వం పేదలకు ఇళ్ల స్థలాలు కేటాయించడం అభివృద్ధిలో భాగమే. పలానా వారికి ఇళ్ల స్థలాలు ఇవ్వొద్దని చెప్పడం కరెక్ట్‌ కాదు. రాజధాని భూములు ప్రస్తుతం సీఆర్డీఏవే. భూములు వారివి కావు. ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయంపై కోర్టును ఆశ్రయిస్తున్నారు. రాజధాని విషయంలో కొన్ని అంశాలు హైకోర్టులో.. కొన్ని అంశాలు సుప్రీంకోర్టులో సవాల్‌ చేశారు. నిర్ణయాలు తీసుకోకుండా ప్రభుత్వాన్ని నిరోధించలేం. నిర్ణయాలు తీసుకోవడం ప్రభుత్వం విధుల్లో భాగం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది.
చదవండి: బాబు అక్రమాలపై విచారణకు సుప్రీం గ్రీన్‌సిగ్నల్‌ ఇవ్వడం శుభ పరిణామమే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement