BC Reservation
-
మీ రాజకీయ పొత్తుల కంటే తక్కువైపోయారా బీసీలు?
-
బీసీల గణనతోనే.. బీసీ కోటా సాధ్యం!
స్థానిక సంస్థల్లో వార్డు మెంబర్లు, సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్ల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అమలును రాజ్యాంగంలోని లోపాలను చూపిస్తూ కోర్టులు అడ్డుకుంటున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో రాష్ట్రంలో సమగ్ర కులగణన చేసి, స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేస్తామని హామీ ఇచ్చింది. స్థానిక సంస్థల్లో 34 శాతం బీసీ రిజర్వేషన్ల అమలు సాధ్యం కానప్పుడు, 42 శాతం అమలు సాధ్యం కాదనే విషయం వారికి తెలియక కాదు. ఓట్ల కోసం ఆ విధంగా వాగ్దానం చేశారు.కేంద్ర ప్రభుత్వం 1993/ 94లో స్థానిక సంస్థల్లో వెనుకబడిన తరగతులకు కనీస భాగస్వామ్యం కల్పించాలనే ముఖ్యోద్దేశంతో 73, 74వ రాజ్యాంగ సవరణ ద్వారా రాజ్యాంగంలో ఆర్టికల్ 243ని చేర్చి స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు ప్రవేశ పెట్టింది. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలకు వారి జనాభా దామాషా పద్ధతిలో, మహిళలకు ఒకటిలో మూడో వంతును, వెనుకబడిన పౌరులకు (బీసీలకు) మాత్రం నిర్దిష్టమైన కోటాను నిర్ధారించకుండా వీటిని ప్రవేశ పెట్టారు. స్థానిక సంస్థల్లో బీసీ కోటా అమలుపై సుప్రీంకోర్టు ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం 2010లో కె.కృష్ణమూర్తి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా మధ్య జరిగిన కేసులో బీసీ కోటా అమలు ట్రిపుల్ ట్రస్ట్ ద్వారా మాత్రమే చేయాలని ఆదేశించింది.అందులో (1) బీసీ కోటా అమలుకు ప్రత్యేకంగా బీసీ కమిషన్ ఏర్పాటు చేయాలి. (2) అట్టి బీసీ కమిషన్ ద్వారా బీసీ లెక్కలు తీయాలి. (3) మొత్తం నిలువు రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా, అందులో ఎస్సీ, ఎస్టీ వారికి జనాభా దామాషా పద్ధతిలో పోగా మిగిలిన కోటాను బీసీలకు అమలు చెయ్యాలని ప్రభుత్వాలను ఆదేశించింది. సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం 2022లో మరో సంచలనా త్మకమైన తీర్పును వెలువరిస్తూ సురేష్ మహజన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మధ్యప్రదేశ్ కేసులో దేశంలోని అన్ని రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రభుత్వాలను ఆదేశిస్తూ, స్థానిక సంస్థల ఎన్ని కలను ప్రతి ఐదు సంవత్సరాలకు తూచా తప్పకుండా నిర్వహించాలనీ, బీసీ గణాంకాలు లేనట్లయితే బీసీ రిజ ర్వేషన్లు లేకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలనీ ఆదేశించింది.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో 1994 నుండి బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో అమలు చేస్తున్నారు. సుప్రీంకోర్టు 2010లో స్థానిక సంస్థల బీసీ కోటాపై తీర్పు వెలువరించిన తర్వాత మొత్తం రిజర్వేషన్లు 50 శాతం పరిమితిలో భాగంగా బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించాలని 2013 స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆంధ్ర ప్రదేశ్ హైకోర్టు ప్రభుత్వన్ని ఆదేశించింది. ఆ తీర్పుపై నాటి కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్టే తీసు కొని యధావిధిగా బీసీ రిజర్వేష న్లను 34 శాతం అమలు చేసింది. కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2019లో స్థానిక సంస్థల్లో బీసీ కోటాను 34 నుండి 24 శాతానికి తగ్గించి ఎన్నికలు నిర్వహించింది.ఇప్పుడున్న పరిస్థితుల్లో బీసీ లెక్కలు లేకుండా ఎన్నిక లకు వెళ్ళినట్లయితే 24 శాతం రిజర్వేషన్లు కూడా దక్కే అవ కాశం లేదు. ఎవరైనా ఎన్నికల ప్రకటనను సవాల్ చేసినట్ల యితే, బీసీ గణాంకాలు శాస్త్రీయబద్ధంగా లెక్కించనందున బీసీ రిజర్వేషన్లు లేకుండానే ఎన్నికలు నిర్వహించుకోవాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించే ప్రమాదం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేక బీసీ కమిషన్ ద్వారా సాధారణ పరిపా లన శాఖ సమన్వయంతో కులగణన చేసి, ఇచ్చిన హామీ ప్రకారం స్థానిక సంస్థల్లో బీసీ కులాలకు 42 శాతం రిజర్వే షన్లను అమలు చేయాలి.– కోడెపాక కుమార స్వామి, వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు, మొబైల్: 94909 59625 -
బీసీ బిల్లుపై బీజేపీ విధానం ప్రకటించాలి
సాక్షి, న్యూఢిల్లీ: బీసీలకు 50% రిజర్వేషన్లు కల్పిస్తూ బీసీ బిల్లును రూపొందించి పార్లమెంటులో ప్రవేశపెట్టే విషయమై బీజేపీ తన విధానాన్ని ప్రకటించాలని వైఎస్సార్సీపీ ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. జనాభా ప్రకారం చట్టసభలతోపాటు విద్యా, ఉద్యోగ రంగాలు, స్థానిక సంస్థలు, కేంద్రస్థాయిలో బీసీ రిజర్వేషన్లను 50 శాతానికి పెంచాలని, బీసీ ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్ కల్పించాలని కోరారు. ఆర్.కృష్ణయ్య, బీసీ సంక్షేమ సంఘం జా తీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నేతలు ఆళ్ల రామకృష్ణ, వెంకన్న గౌడ్, మెట్ట చంద్రశేఖర్ ఆధ్వర్యంలో గురువారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీల మహాధర్నా చేపట్టారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌సహా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాల నుంచి కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మోదీపైనే బీసీల ఆశలు ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ రిజర్వేషన్లపై విధించిన గరిష్ట పరిమితి 50 శాతాన్ని సుప్రీంకోర్టు తొలగించడంతో ఎలాంటి న్యాయపరమైన, రాజ్యాంగపరమైన అవరోధాలు లేనందున బీసీ, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం పెంచాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లను జనాభా ప్రకారం 27 నుంచి 50 శాతానికి పెంచాలని కోరారు. బీసీల సమస్యల పరిష్కారం విషయంలో బీసీలంతా ప్రధాని నరేంద్ర మోదీపైనే ఆశలు పెట్టుకున్నారని, మోదీ హయాంలో బీసీ బిల్లు ప్రవేశపెట్టకపోతే చరిత్ర క్షమించబోదని అన్నారు. లోక్‌సభలో ఉన్న 94 మంది బీసీ ఎంపీలు పార్టీలకతీతంగా బీసీల బిల్లుకు మద్దతు ఇవ్వాలని ఆయన విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో బీసీ ఎంపీలకు ప్రజలు తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. వచ్చే జనగణనలో తప్పనిసరిగా కులాలవారీగా బీసీ జనాభా గణన చేయాలని కోరారు. పులులు తదితర జంతువుల లెక్కలు తీస్తున్న ప్రభుత్వం బీసీ జనగణనకు మాత్రం అభ్యంతరాలు చెప్పడం విడ్డూరంగా ఉందని ధ్వజమెత్తారు. ఇప్పటికైనా బీసీ వ్యతిరేక వైఖరి మార్చుకోవాలని, లేకపోతే దేశవ్యాప్తంగా బీసీలు బీజేపీపై తిరగబడతారని ఆర్.కృష్ణయ్య హెచ్చరించారు. విద్యా, ఉద్యోగ, రిజర్వేషన్లపై ఉన్న క్రిమీలేయర్‌ను తొలగించాలని, బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని కృష్ణయ్య కోరారు. బీసీల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించాలని, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం మాదిరిగా బీసీలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి బీసీ చట్టాన్ని తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. -
ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత: సజ్జల
సాక్షి, తాడేపల్లి: బీసీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ‘బీసీలకు అండగా వైఎస్ జగన్ ప్రభుత్వం-బీసీలకు అందిస్తున్న పథకాలు’పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ కృష్ణమూర్తి, బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సజ్జల మాట్లాడుతూ వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారన్నారు. చదవండి: ‘మద్రాస్, హైదరాబాద్‌లో తంతే అమరావతిలో పడ్డాం’ ‘‘వైసీపీ బీసీ డిక్లరేషన్ పెట్టినపుడు ఎన్నికల జిమ్మిక్కులంటూ ప్రతిపక్షాలు విమర్శించాయి. ఓట్ల రాజకీయం అని ఆరోపించాయి. కానీ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటమే అసలైన నిబద్ధత. విద్య ద్వారా సాధికారత సాధ్యమని వైఎస్సార్ నమ్మారు. అందుకే ఫీజు రీయింబర్స్మెంట్ ప్రవేశపెట్టారు. వైద్యం ఖరీదైన రోజుల్లో నేనున్నాంటూ పేదలకు ఆపన్నహస్తం అందించిన నేత వైఎస్సార్. ఎంబీసీలు నేడు తమ ఉనికి నిలబెట్టుకుంటున్నారు. తమకు కావాల్సిన హక్కుల సాధనకు పోరాడగలుగుతున్నారని’’ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. బీసీల సాధికారతకు ఆనాడు వైఎస్సార్ హయాంలో తొలి అడుగు పడింది. నేడు వైఎస్సార్ బాటలోనే సీఎం జగన్ నడుస్తున్నారు. ఈ రోజు మా పార్టీ సభలు జరిగితే సగానికి పైగా వేదికపై బీసీ నేతలే ఉంటున్నారు. రిజర్వేషన్లు అమలు చేయడం పెద్ద పరీక్ష. అనుకున్న దానికంటే ఎక్కువ శాతం రిజర్వేషన్లు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్‌కే దక్కిందని’’ సజ్జల అన్నారు. -
బీసీలను వాడుకుని వదిలేసిన వ్యక్తి చంద్రబాబు : ముత్యాల నాయుడు
-
కాకాని గోవర్ధన్ రెడ్డి. టీడీపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు
-
న్యాయమూర్తుల నియామకాల్లో రిజర్వేషన్ కల్పించండి
సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టుతో పాటు దేశంలోని వివిధ హైకోర్టుల్లోని న్యాయమూర్తుల నియామకాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు జనాభా నిష్పత్తిలో రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈమేరకు మంగళవారం కేంద్ర న్యాయశాఖ సహాయమంత్రి ఎస్పీ సింగ్ భగేల్‌కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో కృష్ణయ్య మీడియాతో మాట్లాడుతూ వివిధ కోర్టుల్లో జరిగిన న్యాయమూర్తుల నియామకాల్లో ఇప్పటివరకు 3% కంటే ఎక్కువ బీసీలకు, 2% కంటే ఎక్కువ ఎస్సీ, ఎస్టీలకు అవకాశం రాలేదన్నారు. తాము చేసిన విజ్ఞప్తులపై కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించినట్లు కృష్ణయ్య చెప్పారు. అనంతరం కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖమంత్రి కిషన్‌రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం నేతలు కలిశారు. బీసీలకు సంబంధించిన డిమాండ్లను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని కిషన్‌రెడ్డి హామీ ఇచ్చారు. -
బాబు మార్కు రాజకీయం.. బీసీలకు విలువలేని పదవులు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీలో బీసీలకు పదవులు ఇచ్చే విషయంలో చంద్రబాబు మార్కు రాజకీయం మరోసారి బయటపడింది. ఆ పార్టీ రాష్ట్ర కమిటీలో కీలకమైన పదవులను తన వర్గం వారికి కట్టబెట్టి విలువలేని పదవులు తమకు అంటగట్టారని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల నేతలు వాపోతున్నారు. బీసీలకు 41 శాతం, ఎస్సీలకు 11 శాతం, మైనార్టీలకు 6 శాతం, ఎస్టీలకు 3 శాతం పదవులు మొత్తం 61 శాతం ఇచ్చామని చంద్రబాబు ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే రాష్ట్ర కమిటీలో కీలకంగా చెప్పుకునే ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధులు, నాలెడ్జి కమిటీ, కోశాధికారి పదవుల్లో ఎక్కువభాగం అగ్రవర్ణాలకే కట్టబెట్టారని ఆ పార్టీ బీసీ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యమైన ఈ 55 పదవుల్లో 55 శాతం (30) ఓసీలకు ఇవ్వగా, 24 శాతం (13) బీసీలు, 16 శాతం (9) ఎస్సీలకు, ఐదు శాతం (3) మైనార్టీలకు ఇచ్చినట్లు పార్టీ నేతలు లెక్కలు వేసి చెబుతున్నారు. పత్తిపాటి పుల్లారావు, వైవీబీ రాజేంద్రప్రసాద్, హనుమంతరాయ చౌదరి, దామచర్ల జనార్దన్ వంటి వారికి ఉపాధ్యక్ష పదవులు, పయ్యావుల కేశవ్, దేవినేని ఉమా, గన్ని కృష్ణ వంటి వారికి ప్రధాన కార్యదర్శి పదవులు, గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, మద్దిపట్ల సూర్య ప్రకాష్ వంటి నేతలకు అధికార ప్రతినిధి పదవులు కట్టబెట్టారు. వీటిని బట్టి తన సామాజికవర్గం వారికి బాబు ప్రాధాన్యం ఇచ్చినట్లు స్పష్టమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అక్కరకురాని పదవులు సృష్టించి.. పనికిరాని పదవులుగా భావించే రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి, కార్యదర్శి పదవులను ఎక్కువగా బీసీలు, ఎస్సీలకు ఇచ్చారనే వాదన పార్టీలో వినిపిస్తోంది. గుర్తింపు లేని పదవులే కావడంతో వాటి సంఖ్య కూడా భారీగా పెంచేశారు. ఏకంగా 59 ఆర్గనైజింగ్ కార్యదర్శులు, 108 కార్యదర్శి పదవులు సృష్టించి వాటిని బీసీలు, ఎస్సీలకు ఇచ్చారు. వాటిని చూపించి బీసీలకు పెద్దపీట వేశామని, ఎస్సీలను అందలం ఎక్కించామని, మైనారిటీలను నెత్తిన పెట్టుకున్నామని ప్రచారం మొదలుపెట్టారని ఆ పార్టీ నేతల్లోనే ఆగ్రహం వ్యక్తమవుతోంది. అలంకారం కోసం ఎందుకూ పనికిరాని పదవుల్ని సృష్టించి వాటిని ఈ వర్గాలకు కట్టబెట్టారని పలువురు పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఆ పదవులతో పార్టీలో కనీస విలువ కూడా ఉండదని అవి వచ్చిన నేతలు చెబుతున్నారు. తమను అవమానించేలా పనికిమాలిన పదవులను ఇచ్చారని, కీలకమైన పదవుల్ని మాత్రం కావాల్సిన వారికి ఇచ్చుకున్నారని మండిపడుతున్నారు. ఉపాధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, అధికార ప్రతినిధి వంటి కీలకమైన పదవుల్లో ఒక్క గిరిజనుడికి అవకాశం ఇవ్వలేదని, దీన్నిబట్టే ఆ వర్గం పట్ల బాబుకు ఉన్న చిన్నచూపు అర్థమవుతోందని విమర్శిస్తున్నారు. -
బీసీ రిజర్వేషన్లు శాశ్వతంగా తగ్గిపోయే ప్రమాదం: ఆర్.కృష్ణయ్య
హైదరాబాద్: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 34 శాతం నుంచి 22 శాతానికి తగ్గిస్తూ శనివారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టి చర్చ జరగకుండానే ఆమోదించడాన్ని బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య ఖండించారు. పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించడం వల్ల భవిష్యత్‌లో బీసీ రిజర్వేషన్లు శాశ్వతంగా తగ్గిపో యే ప్రమాదముందని హెచ్చరించారు. ఆదివారం విద్యానగర్ లో జరిగిన వివిధ బీసీ సంఘాల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే బీసీ రిజర్వేషన్లు తగ్గించామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చెబుతున్నారని, సుప్రీం తీర్పును అధిగమించడానికి ప్రభు త్వాలకు ప్రత్యామ్నాయ మార్గాలున్నాయన్నారు. సీఎం కేసీఆర్ చొరవ తీసుకుని అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ప్రధానిని కలసి తద్వారా రాష్ట్రపతితో బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ఆర్డినెన్స్ తీసుకురావచ్చని తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రముఖ న్యాయవాదులను నియమించి సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ దాఖలు చేయాలని కోరారు. త్వరలో 112 బీసీ కుల సంఘాలతో ప్రధాని, రాష్ట్రపతిని కలసి వినతి పత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. సమావేశంలో వివిధ బీసీ సంఘాల నాయకులు ఎర్ర సత్యనారాయణ, గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు. -
అగ్రవర్ణ రిజర్వేషన్ రాజ్యాంగ స్వభావానికి విరుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ: అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్ కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వత్యిరేకిస్తూ బీసీ సంఘాలు సోమవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌లో ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. కేంద్రం తీరుపై మండిపడ్డారు. అగ్రకుల పేదల పేరుతో అగ్రకుల ధనికులకు 10 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారని, చాతుర్వర్ణ వ్యవస్థను శాశ్వతంగా ఉంచేందుకే ఆర్ఎస్ఎస్ ఆలోచనలకు అనుగుణంగా ఈ రిజర్వేషన్ తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. రాజ్యాంగ మూల స్వభావానికి విరుద్ధంగా ఈబీసీ రిజర్వేషన్లు ఇస్తున్నారని అన్నారు. సమానత్వానికి విరుద్ధంగా అగ్రకుల రిజర్వేషన్ల బిల్లు తెచ్చారని విమర్శించారు. ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని, యూనివర్సిటీ నియామకాల్లో 13 పాయింట్ల రిజర్వేషన్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఓబీసీలకు 52 శాతం రిజర్వేషన్ కల్పించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలలోనూ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలన్నారు. ప్రైవేటు రంగంలోనూ రిజర్వేషన్లు కల్పించాలన్నారు. కులాలవారీగా జనగణన శాస్త్రీయంగా జరగాలని, చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని పేర్కొన్నారు. అణగారిన వర్గాలను బానిసలుగా అణగదొక్కేందుకే 10 శాతం ఈబీసీ రిజర్వేషన్‌ను తీసుకొచ్చారని మండిపడ్డారు. -
నాలుగేళ్లలో చంద్రబాబు బీసీలకు చేసిందేమీలేదు
-
అధికారులు కండువాలేని కార్యాకర్తల్లా వ్యవహరిస్తున్నారు
-
బీసీల రిజర్వేషన్లకు పోరాటం
హైదరాబాద్: స్థానిక సంస్థల్లో బీసీలకు ప్రస్తుతం ఉన్న 34 శాతం రిజర్వేషన్లు కొనసాగించాలనే డిమాండ్‌కు పార్టీలు, జెండాలు పక్కనబెట్టి తెలం గాణ ఉద్యమాన్ని స్పూర్తిగా తీసుకుని పోరాడాలని బీసీ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మాజీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు అధ్యక్షతన ‘ఇప్పుడున్న బీసీల 34 శాతం రిజర్వేషన్లు రాబోయే గ్రామపంచాయతీ ఎన్నికల్లో అమలు చేయాలి’ అనే అంశంపై రౌండ్‌టేబుల్ సదస్సు జరిగింది. ఐక్యమైతేనే రాజ్యాధికారం: జస్టిస్ ఈశ్వరయ్య సమావేశంలో జాతీయ బీసీ కమిషన్ మాజీ అధ్యక్షుడు, రిటైర్డు న్యాయమూర్తి జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. లెక్కల ప్రకారం 18 జిల్లాల్లో బీసీలు 55 శాతంకన్నా ఎక్కువగా ఉన్నారని, మిగిలిన జిల్లా ల్లో కూడా 50 శాతం ఉన్నామని తెలిపారు. అయితే సీఎం కేసీఆర్ తన సొంత లెక్కల ద్వారా ఎస్సీ, ఎస్టీలు పెరిగారని చెప్తూ వారికి రిజర్వేషన్లు పెంచి, బీసీలకు తగ్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలు ఇప్పుడు చైతన్యం కాకపోతే ఎప్పటికీ కాలేరని అంతా ఐక్యమై రాజ్యాధికారం దక్కేలా కృషిచేయాలన్నారు. ఉత్తరభారత దేశంలో మాదిరి ఇక్కడకూడా బీసీలపార్టీ ఒకటి ఏర్పాటు చేయాలన్నారు.రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీలకు 26 శాతం పోతే మిగిలిన 74 శాతం బీసీలే కైవసం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ.. వివిధ బీసీ కుల సంఘా ల ఆశీర్వాద సభలు పెట్టి అధికారంలోకి వచ్చిన వెంటనే బీసీలకు రాజ్యాధికారం దూరం చేసే కుట్ర లు పన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ.. రిజర్వేషన్లు తగ్గించడం చారిత్రాత్మక తప్పని, దీన్ని బడుగు, బలహీనవర్గాలవారు సహించరని నిరూపించాలన్నారు. వెంటనే ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. వీహెచ్ మాట్లాడుతూ .. సీఎం కేసీఆర్‌కు బీసీలంటే ఎందుకు ఇంత కక్షో అర్థం కావడంలేదన్నారు. ఈ అంశంపై ఓ వైపు న్యాయబద్ధంగా పోరాడుతూనే తెలంగాణ ఉద్యమస్పూర్తితో ఉద్యమాలు చేద్దామని, ప్రతీ జిల్లాలో నిరసనలు చేద్దామని పిలుపునిచ్చారు. బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ .. ప్రొఫెసర్ జయశంకర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ, ఆలె నరేంద్ర లాంటి బీసీ నేతల పునాదులమీద పుట్టిన టీఆర్ఎస్ పార్టీ, చీమలు పెట్టిన పుట్టలో పాములు దూరినట్లు బీసీలకే ద్రోహం చేస్తోందని ఆగ్రహంవ్యక్తం చేశారు. రిజర్వేషన్లపై కేసు వేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన స్వప్నా రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కి చెందిన గోపాల్ రెడ్డిలను ఆయా పార్టీలు సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆకుల లలిత, కాంగ్రెస్ బీసీ సెల్ చైర్మన్ చిత్తరంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల సాధనకోసం జాజుల శ్రీనివాస్ నేడు ధర్నాచౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాకు అన్ని పార్టీలు, సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. పార్టీలు, జెండాలు పక్కన పెట్టి అందరూ రిజర్వేషన్ కోసం పోరాడాలని సదస్సులో తీర్మానించారు. -
పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టాలి
హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు కల్పించే విధంగా పార్లమెంట్లో తక్షణమే బీసీ బిల్లు ప్రవేశపెట్టాలని బీసీ సంఘం నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. పంచాయతీరాజ్, మున్సిపల్ ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని సుప్రీంకోర్టు శనివారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఈ సమస్యకు రాజ్యాంగ సవరణే శాశ్వత పరిష్కారమన్నారు. ఈ అంశంపై ప్రధాని నరేంద్రమోదీతో పాటు 36 జాతీయ పార్టీల అధ్యక్షులకు వేరువేరుగా లేఖలు రాశారు. బీసీ భవన్లో ఆదివారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఈ నెల11 నుంచి జరిగే పార్లమెంట్ సమావేశాల్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టే విధంగా రాష్ట్రంలోని ఆపద్ధర్మ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బీసీ రిజర్వేషన్లను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించినప్పటికీ కోర్టు తీర్పులను సాకుగా చూపుతూ అమలు చేయడం లేదన్నారు. దీంతో బీసీలు తీవ్రంగా నష్టపోతున్నారని, రాజకీయ కోణంలొనే బీసీ రిజర్వేషన్లు సాధ్యమవుతాయని భావించి ఈమేరకు సహకరించాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో బీసీ సంఘం నేతలు గుజ్జ కృష్ణ, రాజేందర్, నర్సింహాగౌడ్, టీఆర్ చందర్, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
2019 ఎన్నికల్లో 12 సీట్లల్లో 6 సీట్లు ఇవ్వాలి
మిర్యాలగూడ టౌన్ : వచ్చే ఎన్నికల్లో అన్ని పార్టీలు బీసీలకు సముచిత స్థానం కల్పించకుంటే తగిన బుద్ధి చెప్పుతామని బీసీ సంక్షేమ సంఘం జిల్లా వర్కింగ్ కమిటీ ప్రె సిడెంట్ మేకల వెంకన్న, తెలం గాణ విద్యుత్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్, టీడీపీ రాష్ట్ర నాయకులు వెంకటేశ్వర్లు అన్నారు. బుధవారం బీసీ కులాల సంఘాల సమావేశానికి అతిథిగా హాజరయ్యారు. 2019 ఎన్నికల్లో 12 సీట్లల్లో 6 సీట్లు బీసీ జనా భా ప్రాతిపదికన సీట్లు పార్టీలు కేటాయిం చాలని డిమాండ్ చేశారు. మిర్యాలగూడ నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు కూడా బీసీకి ఎమ్మెల్యే టికెట్‌ను కేటాయించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. సమావేశంలో అంజి, శ్రీను గిరి, సత్యనారాయణ, లక్ష్మినారాయణ, కృష్ణ, , పుప్పాల సత్యం, రాచూరి మహేష్, పందిరి వేణు, కంచి సత్యనారాయణ, లోహిత్, ఆనంద్, ప్రశాంత్ ఉన్నారు. -
‘బీసీ రిజర్వేషన్లపై తీర్మానం చేయాలి’
సాక్షి, హైదరాబాద్: బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం నేత, టీటీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య మంగళవారం సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనచారిని కలిసి విజ్ఞప్తి చేశారు. గతంలో బీసీ సమస్యలపై చర్చించడానికి రెండు రోజుల పాటు అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తామని హామీ ఇచ్చిన సీఎం ఎలాంటి చర్య తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. బీసీల సమస్యలు, డిక్లరేషన్‌పై అసెంబ్లీలో చర్చించడానికి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. కలిసిన వారిలో గుజ్జ కృష్ణ, భూపేశ్ సాగర్ ఉన్నారు. -
బీసీల భవిష్యత్ బంగారుమయం
జడ్చర్ల : బీసీల భవిష్యత్ బంగారుమయం కానుందని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ పేర్కొన్నారు. సోమవారం వనపర్తి జిల్లా పెబ్బేరులో మత్స్య కళాశాల శంకుస్థాపనకు వెళ్తున్న సందర్బంగా ఆయన జడ్చర్ల ప్రభుత్వ అతిథిగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. బీసీలకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని, బీసీల సంక్షేమం కోసం ప్రత్యేకంగా అసెంబ్లీని ఒక రోజు సమావేశపరుస్తామన్నారు. 103 బీసీ కులాల అభివృద్ధికి, సంక్షేమానికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి నూకలు చెల్లిపోయాయని, వారి ఊకదండపుడు ఉపన్యాసాలకు, హూంకరింపులకు భయపడేదిలేదని అన్నారు. బీసీలపై కాంగ్రెస్ నాయకులు ఇన్నాళ్లు లేని ప్రేమను ఇప్పుడు ఒలకబోస్తుండటం ఆశ్చర్యంగా ఉందని విమర్శించారు. అచ్చంపేటలో జరిగిన సమావేశంలో బీసీల గురించి కాంగ్రెస్ నాయకులు మాట్లాడడం, అదికూడా ఒకే సామాజిక వర్గానికి చెందిన నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. బీసీలకు సంబందించి సీఎం కేసీఆర్ ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యేందుకు ఒక్క బీసీ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్‌లో లేరని అన్నారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఎంతమేర ప్రాధాన్యం ఇచ్చిందో తెలుస్తుందన్నారు. ముదిరాజ్‌లకు, గంగపుత్రులకు, కురుమయాదవులకు తాము చేసినంతగా ఎవ్వరూ చేయలేదన్నారు. రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో రొయ్యల పెంపకం రాష్ట్రంలోని పది ప్రాంతాల్లో రొయ్యల పెంపకాన్ని పైలెట్‌గా చేపట్టామని, జిల్లాలోని కోయిల్‌సాగర్‌లో రొయ్యల పెంపకాన్ని చేపట్టినట్లు తెలిపారు. ముదిరాజులు, గంగపుత్రులకు 70కోట్ల చేపపిల్లల పంపిణీని లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇప్పటివరకు 50కోట్లు పంపి ణీ చేశామన్నారు. ఇంటికో ఉద్యోగం తాము ఇస్తామంటూ.. కాంగ్రెస్ చెబుతున్న మాటలు పూర్తి అవాస్తవమన్నారు. 1.14లక్షల ఉద్యోగాలు కల్పించే దిశగా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. టీఆర్ఎస్ పాలనలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మెరుగైన వైద్యం అందుతున్నదని చెప్పారు. పాలమూరు ఎత్తిపోతల పనులు చురుగ్గా సాగుతున్నాయని తెలిపారు. ప్రాజెక్ట్ పనులపై కోర్టులలో కేసులు వేసి కాంగ్రెస్ అడ్డుకుంటుందని ఆరోపించారు. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీలో సమస్యలపై మాట్లాడలేని కాంగ్రెస్ నాయకులు బయట మాట్లాడుతుండడం విచిత్రంగా ఉందన్నారు. మార్కెట్ వైస్ చైర్మన్ శ్రీశైలంయాదవ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు యాదయ్య, నాయకులు శంకర్‌నాయక్, శ్రీకాంత్, ఇమ్ము పాల్గొన్నారు. -
చట్ట సభల్లో బీసీ కోటా
సాక్షి, హైదరాబాద్ : బీసీలకు చట్ట సభల్లో రిజర్వేషన్ల అమలుకు పార్లమెంటులో చట్టం తేవాలని రాష్ట్రం తరఫున కేంద్ర ప్రభుత్వాన్ని కోరనున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తెలిపారు. తెలంగాణ ఏర్పడిన కొత్తలోనే చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్లు కావాలని తీర్మానం చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కావాలని కోరుకుంటున్నాయని, దీన్ని తెలంగాణ డిమాండ్‌గా కేంద్రం ముందు పెడతామన్నారు. రాష్ట్రం నుంచి అఖిలపక్ష కమిటీ ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలసి ఈ విషయంపై ఒత్తిడి తెస్తుందని ప్రకటించారు. కేంద్రంలో బీసీ సంక్షేమ శాఖ ఏర్పాటు చేయాలని, పదోన్నతుల్లోనూ బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కేంద్రాన్ని కోరతామన్నారు. బీసీల సంక్షేమం, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సీఎం కేసీఆర్ ఆదివారం అసెంబ్లీ కమిటీ హాల్లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సమాజంలో సగభాగం కన్నా అధికంగా ఉన్న బలహీన వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. బీసీల అభ్యున్నతికి ఇప్పటికే ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని, వారి జీవన ప్రమాణాలు మరింతగా పెరగాలంటే మరిన్ని చర్యలు అవసరమని పేర్కొన్నారు. అసెంబ్లీలో బీసీలపై చర్చ బీసీ డిమాండ్లు, అభ్యున్నతి కోసం త్వరలోనే అసెంబ్లీలో ఒకరోజు పూర్తిస్థాయి చర్చ చేపట్టాలని అసెంబ్లీ స్పీకర్‌ను సీఎం కోరారు. బీసీ ప్రజాప్రతినిధులంతా రెండు మూడ్రోజులపాటు సమావేశాలు నిర్వహించుకుని, తమకు ఏం కావాలో నిర్ణయించుకున్న తర్వాత అసెంబ్లీలో చర్చించాలని, ఆ మేరకు అవసరమైన తీర్మానాలు, చట్టాలు, జీవోలు తేవాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వాటిని నూటికి నూరు శాతం చిత్తశుద్ధితో అమలు చేస్తామని ప్రకటించారు. బీసీ ప్రజాప్రతినిధులు చెప్పిన ప్రకారం అవసరమైన చట్టాలు తేవడానికి, ఉత్తర్వులు జారీ చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రస్తుత విధానంలో ఏమైనా లోపాలుంటే మార్చుకోవడానికి కూడా తమకు ఎలాంటి భేషజాలు లేవన్నారు. అంతిమంగా కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో బీసీలకు మేలు కలగాలని, వారి భవిష్యత్‌కు మంచి బాటలు పడాలన్నదే తన లక్ష్యమన్నారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ప్రభుత్వాలు మారినా విధానపరమైన విషయాల్లో స్థిరత్వం ఉంటుందని, కానీ మనదేశంలో విధానపరమైన స్థిరత్వం లేకపోవడం ప్రధానలోపమన్నారు. బీసీల కోసం విధానాలు, పథకాలు రూపకల్పన చేసే సందర్భంలో భవిష్యత్‌లో వాటినెవరూ తొలగించలేనంత పకడ్బందీగా రూపొందించాలన్నారు. బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్ ఎలా పనిచేయాలో, స్వయం ఉపాధి పథకాల స్వరూపం ఎలా ఉండాలో సూచించాలన్నారు. రాజకీయాలకతీతంగా బీసీ వర్గాల ప్రజాప్రతినిధులు అన్ని కులాల అభిప్రాయాలు తీసుకుని.. ఏం చేయాలన్న దానిపై ప్రభుత్వానికి దిశానిర్దేశం చేయాలన్నారు. బీసీ పారిశ్రామికవేత్తలకు భూముల్లో రిజర్వేషన్ ‘‘కొన్ని కులాలకు సర్టిఫికెట్లు ఇచ్చే విషయంలో ఇబ్బందులున్నాయి. ప్రభుత్వ లబ్ధి అందుకునే అంశంపై కొన్ని కులాల మధ్య ఘర్షణలున్నాయి. కొన్ని కులాల గుర్తింపునకు సంబంధించిన సమస్యలున్నాయి. ఇలాంటి అన్ని విషయాల్లో ఆచరణీయమైన మార్గాన్ని ప్రజాప్రతినిధులు సూచించాలి’’ అని సీఎం కోరారు. ‘‘బీసీల అభ్యున్నతి కోసం రాష్ట్ర పరిధిలో ఉన్న అన్ని అంశాలపై సానుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు అమలు చేసుకుందాం. బీసీ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించడానికి టీఎస్ఐఐసీ ఇచ్చే భూముల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తాం. ఇంకా బీసీలకు ఏం చేయాలో కొత్త పథకాలు రచించండి. అన్ని కుల సంఘాలతో సమావేశాలు నిర్వహించండి. అందరి అభిప్రాయాలు తీసుకుని ప్రభుత్వానికి నివేదిక ఇవ్వండి. మీరు ఇచ్చిన నివేదికనే ప్రభుత్వం ఆదేశంగా స్వీకరించి అమలు చేస్తుంది. మీరు చర్చించిన అంశాలపై స్పష్టత వచ్చిన తర్వాత అసెంబ్లీలో చర్చించి అప్పటికప్పుడు విధానపరమైన నిర్ణయాలు ప్రకటిద్దాం. బీసీల విషయంలో రాజకీయాల్లేవు. అన్ని పార్టీల ప్రజాప్రతినిధులు ఒకేలా కోరుకుంటున్నారు. ఉన్నంతలో బీసీల కోసం ఎంత ఉన్నతంగా పనిచేయగలమన్నదే ప్రధానాంశం. కేవలం ప్రభుత్వమే ఖ్యాతి పొందాలనుకోవడం లేదు. అన్ని పార్టీలు కలసి సమిష్టిగా తీసుకున్న నిర్ణయాలని ప్రజలకు చెబుదాం. దీంతో ప్రజలకు కూడా మంచి సందేశం పోతుంది’’ అని ముఖ్యమంత్రి అన్నారు. అమలు చేసే బాధ్యత నాది.. ‘‘సమున్నత లక్ష్యం కోసం తెలంగాణ సాధించుకున్నం. అన్ని వర్గాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి. ప్రతీ వర్గం ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు రావాలి. ఎవరూ ఆత్మన్యూనతతో ఉండడానికి వీల్లేదు. అంతా ఆత్మవిశ్వాసంతో బతకాలి. అందరికీ అవకాశాలు రావాలి. ఎవరి పెత్తనం కిందో బతకాల్సిన అవసరం లేదు. అందరూ బాగుపడాలి. అందరూ అవకాశాలు పొందాలి. ఇందుకనుగుణంగానే ఇప్పుడు బాటలు పడాలి. అదే బాటలో భవిష్యత్ తెలంగాణ నడవాలి. సగానికి పైగా ఉన్న బీసీల కోసం ప్రజాప్రతినిధులు సమయం వెచ్చించి, లోతుగా అధ్యయనం చేసి విధానాలు రూపకల్పన చేయాలి. ఇందులో రాజకీయ ప్రయోజనం లేదు. అన్ని పార్టీల ప్రతినిధులు కలిసి చర్చించండి. సమైక్యంగానే ప్రభుత్వానికి సిఫారసులు ఇవ్వండి. వాటిని అమలు చేసే బాధ్యత నాది. అనుకున్నట్లుగానే తెలంగాణకు మంచి ఆదాయ వనరులున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలకు కలిపి ఏడాది రూ.1.25 లక్షల కోట్ల వరకు ఖర్చు చేశారు. ఇప్పుడు ఒక్క తెలంగాణలోనే అంత ఖర్చు పెడుతున్నాం. ఈ ఖర్చంతా రాష్ట్రంలోని పేదరికాన్ని నిర్మూలించడానికి ఉపయోగపడాలి’’ అని సీఎం కేసీఆర్ ప్రకటించారు. బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ పెంచుతాం.. ‘‘బీసీల అభివృద్ధి, సంక్షేమానికి ప్రభుత్వం ఇప్పటికే అనేక చర్యలు తీసుకుంది. అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయి. తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో బీసీల కోసం కేవలం 19 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత కొత్తగా 123 స్కూళ్లు స్థాపించుకున్నాం. వీటి ద్వారా 91,520 మంది బీసీ పిల్లలకు అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య అందుతున్నది. రెసిడెన్షియల్ స్కూళ్ల సంఖ్యను ఇంకా పెంచడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. పిల్లలకు మంచి విద్య అందించడం ద్వారా భావి తరాలకు బంగారు భవిష్యత్ ప్రసాదించగలుగుతాం’’ అని సీఎం అన్నారు. బీసీలకు కల్యాణలక్ష్మి, మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు అమలు చేస్తున్నామన్నారు. రిజర్వేషన్లతో రాష్ట్రంలో 50 మంది బీసీలకు మార్కెట్ చైర్మన్ పదవులు లభించాయన్నారు. బీడీ కార్మికులకు భృతి ఇవ్వాలనే నిర్ణయం వల్ల ఎక్కువ మంది బీసీలు, అందులోనూ పద్మశాలిలకు ఎక్కువ మేలు కలిగిందన్నారు. అత్యంత వెనుకబడిన వర్గాలకు బ్యాంకులతో సంబంధం లేకుండా నేరుగా ఆర్థిక సహాయం అందించే పథకాలకు రూపకల్పన చేయాలని కోరారు. కుల వృత్తులకు ప్రోత్సాహం.. ‘‘చెప్పులు కుట్టుకునే వృత్తి తప్ప మిగతా వృత్తిదారులంతా బీసీలేæ. చేతి వృత్తులను నమ్ముకుని బతుకుతున్నారు. వారి వృత్తిలో వారికి నైపుణ్యం ఉన్నా సరైన ప్రోత్సాహం, ఆర్థిక చేయూత లేక వారు సతమతమవుతున్నారు. అందుకే మనుగడ సాధ్యమయ్యే కుల వృత్తులను, చేతి వృత్తులను ప్రోత్సహించాలని నిర్ణయించుకున్నాం. సమైక్య రాష్ట్రంలో హైదరాబాద్‌లో కల్లు దుకాణాలు మూసివేయడంతో గీత కార్మికులు ఉపాధి కోల్పోయారు. తెలంగాణ వచ్చిన వెంటనే కల్లు దుకాణాలు పునరుద్ధరించాం. దీనివల్ల హైదరాబాద్‌లో ఉన్న వారికే కాకుండా గ్రామాల్లోని గీత కార్మికులకు కూడా మేలు కలిగింది. చేనేత కార్మికుల కోసం ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది. రూ.1,200 కోట్ల వ్యయంతో కార్యక్రమాలు అమలు చేస్తోంది. పవర్‌లూమ్‌లను వందశాతం ప్రభుత్వ ఖర్చుతో ఆధునీకరిస్తున్నాం. 50 శాతం సబ్సిడీతో నూలు, రసాయనాలు అందిస్తున్నాం. నేత కార్మికులు తయారు చేసిన దుస్తులు, ఇతర ఉత్పత్తులను ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. వరంగల్‌లో టెక్స్టైల్ పార్కుతో.. వలసలు పోయిన వారు తిరిగి సొంత గడ్డకు వస్తున్నారు. సిరిసిల్లలో కాటన్ టు గార్మెంట్ పద్ధతిలో వస్త్ర పరిశ్రమను విస్తరిస్తున్నాం. 75 శాతం సబ్సిడీపై గొర్రెల పంపిణీ కార్యక్రమం చేపట్టాం. పథకం ప్రారంభించిన నాలుగు నెలల్లోనే 29.50 లక్షల గొర్రెల పంపిణీ జరిగింది. పంపిణీ చేసిన గొర్రెలకు మరో 10 లక్షల పిల్లలు పుట్టాయి. ఇప్పటికి లక్షా 41 వేల కుటుంబాలకు గొర్రెల పంపిణీ జరిగింది. మొత్తం 7.30 లక్షల కుటుంబాలకు గొర్రెలు పంపిణీ చేస్తాం. దేశంలోకెల్లా తెలంగాణలోని గొర్రెల కాపరులే అత్యంత ధనవంతులు అవుతారు. గొల్ల, కుర్మల జీవితంలో గొప్ప మార్పు రాబోతోంది. 100 శాతం సబ్సిడీపై చేపల పంపిణీ చేపట్టాం. మత్స్యకారులకు ఉపయోగకరంగా ఉండేలా రూ.5 వేల కోట్లతో మత్స్య పరిశ్రమను అభివృద్ధి చేస్తున్నాం. రజకులకు అవసరమైన చేయూత అందిస్తాం. నాయీ బ్రాహ్మణులకు ఆధునిక సెలూన్లు ఏర్పాటు చేసుకోవడానికి అవసరమైన ఆర్థిక సహాయం అందిస్తాం. విశ్వ బ్రాహ్మణుల కుల వృత్తులను ప్రోత్సహించడానికి రూ.250 కోట్లతో కార్యక్రమాలు అమలు చేస్తాం’’ అని సీఎం ప్రకటించారు. ఈ సమావేశంలో శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, అసెంబ్లీ స్పీకర్ మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ విద్యాసాగర్, మంత్రులు జోగు రామన్న, ఈటల రాజేందర్, పద్మారావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ విప్‌లు బోడకుంటి వెంకటేశ్వర్లు, గంప గోవర్ధన్, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, ఎంపీలు కె.కేశవరావు, డి.శ్రీనివాస్, రాపోలు ఆనంద భాస్కర్, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. ఎవరేమన్నారు? బీసీ సంక్షేమంపై సీఎంతో సమావేశమైన తర్వాత పలువురు సభ్యులు మీడియాతో అభిప్రాయాలను పంచుకున్నారు. అవి వారి మాటల్లోనే... అన్ని వర్గాలకూ ప్రాధాన్యం : రాజేందర్, ఆర్థిక మంత్రి ఉమ్మడి రాష్ట్రంలో బీసీ సమస్యలపై గళమెత్తితే అధికార పార్టీ అహంకారంతో స్పందించింది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మన రాష్ట్రంలో అన్ని వర్గాల నుంచి అభిప్రాయాలు తీసుకుని బీసీ ప్రణాళిక రూపొందిస్తున్నాం. పది రకాల అంశాలను ప్రాతిపదికన తీసుకుంటున్నాం. ఉత్పాదక కులాలు, సేవా ఆధారిత కులాలు, ఆదరణ లేని కులాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించే ప్రణాళిక దేశానికే ఆదర్శంగా నిలవాలి. మరో రెండ్రోజుల పాటు ఇదే హాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు చర్చా కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం ప్రతిపాదనలను సీఎంకు నివేదిస్తాం. – ఈటల అన్ని వర్గాలకు న్యాయం : జోగు రామన్న, బీసీ మంత్రి బీసీ కులాల్లో కిందిస్థాయిలో ఉన్న వర్గాలకూ న్యాయం జరగాలి. కులాల వారీగా స్థితిగతులను అంచనా వేసి ప్రతిపాదనలు రూపొందిస్తాం. ఫెడరేషన్ల విషయంలో ప్రత్యేక చర్చ నిర్వహించి తగిన విధంగా వాటిని అభివృద్ధి చేస్తాం. గతంలో ఏ ప్రభుత్వం కూడా బీసీల అభివృద్ధికి శ్రద్ద చూపలేదు. కొత్త రాష్ట్రంలో అణగారిన వర్గాలను ఆర్థిక, సామాజిక, రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకురావాలనే ఉద్దేశంతో సీఎం ఈ మేరకు నిర్ణయించారు. బీసీ ఉప ప్రణాళిక తేవాలి : ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్యే బీసీలు సమగ్రంగా అభివృద్ధి చెందాలంటే ప్రత్యేకంగా ఉప ప్రణాళిక తీసుకు రావాలి. ఈ డిమాండ్ గతంలో ఎన్నో సందర్భాల్లో ప్రస్తావించాం. తాజా చర్చలో సీఎం సానుకూలంగా స్పందించారు. సభ్యులంతా ఏకాభిప్రాయంతో వస్తే ఎన్ని ప్రతిపాదనలైనా ఏకపక్షంగా ఆమోదిస్తామని చెప్పడం సంతోషకరం. బీసీల సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చించి ప్రతిపాదనలు రూపొందిస్తాం. ముఖ్యంగా విద్య, ఉద్యోగ, ఆర్థిక, రాజకీయ రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. బీసీ కార్పొరేషన్, ఎంబీసీ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపుతో పాటు రుణాల వితరణపైనా చర్చించాలి. 12 ఫెడరేషన్లకు కూడా బడ్జెట్ కేటాయించాలి. కుల సంఘాలతో చర్చించి వారి అభిప్రాయాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. బీసీలకున్న క్రీమీలేయర్‌ను తొలగించాలి. రాజకీయ రిజర్వేషన్లు కల్పించాలి : కె.లక్ష్మణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీసీ సంక్షేమానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, ఆర్థిక, సామాజిక, విద్యాపరమైన అభివృద్ధికి నిధులిచ్చి ఖర్చు చేయాలనే అంశాన్ని గత అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించా. దానికి అనుగుణంగా సీఎం స్పందించి ఒకరోజు బీసీ సంక్షేమంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించి చర్చిద్దామని చెప్పారు. రాష్ట్ర జనాభాలో 54 శాతం బీసీలున్నారు. బీసీలు మరింత వేగంగా అభివృద్ధి కావాలంటే రాజకీయంగా ఎదగాలి. అందుకు రాజకీయ రిజర్వేషన్లు తీసుకురావాలి. ఎస్సీ, ఎస్టీల మాదిరిగా బీసీ విద్యార్థులకు కూడా పూర్తిస్థాయి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఫెడరేషన్లతో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి : ఆకుల లలిత, ఎమ్మెల్సీ ప్రస్తుతమున్న బీసీ ఫెడరేషన్లలో చాలావరకు పనిచేయడం లేదు. వీటన్నిటినీ కలిపి ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. నిధులు వేరుగా కేటాయించినా పనితీరు వేగవంతమయ్యేందుకు కార్పొరేషన్ కిందకు తేవాలి. బీసీ కార్పొరేషన్ ద్వారా ఇచ్చే రుణాల పరిమితిని పెంచాలి. గ్రామ స్థాయిలో కులవృత్తులకు ఆర్థిక చేయూత ఇవ్వాలి. మండలానికో గురుకులం : శ్రీనివాస్‌గౌడ్, ఎమ్మెల్యే అభివృద్ధిలో కీలకం విద్యే. అందులో భాగంగా బీసీ పిల్లలందరికీ చదువును మరింత చేరువ చేయాలి. అందుకు ప్రతి మండలంలో ఒక గురుకులాన్ని తెరవాలి. ఒకేసారి సాధ్యం కాదు కాబట్టి ఏటా వంద చొప్పున ప్రారంభిస్తే మూడు, నాలుగేళ్లలో అన్ని మండల కేంద్రాల్లో గురుకులాలు అందుబాటులోకి వస్తాయి. కొన్ని కులాలు లెక్కలో లేవు. వాటికి కుల ధ్రువీకరణ అందని పరిస్థితి నెలకొంది. వాటిని గుర్తించేందుకు బీసీ కమిషన్ చర్యలు చేపట్టాలి. -
ఉద్యోగుల్లో బీసీలెందరూ?
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో తొలిసారిగా ప్రభుత్వ ఉద్యోగుల సమగ్ర సర్వేకు తెరలేచింది. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సామాజిక, ఆర్థిక స్థితిగతులపై అధ్యయనంలో భాగంగా రాష్ట్ర బీసీ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగుల వివరాలు సేకరిస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న 3.5 లక్షల ప్రభుత్వ ఉద్యోగులతోపాటు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమగ్ర వివరాలను ఆయా ప్రభుత్వ శాఖల నుంచి తెప్పించుకుంటోంది. బీసీల స్థితిగతులపై వివిధ కోణాల్లో పరిశీలనకు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కులాలు, ఉప కులాల ప్రాతిని«ధ్యంపై తులనాత్మక విశ్లేషణకు వీలుగా ఏడు రకాల ఫార్మాట్లో ఉద్యోగుల సమాచారం సేకరిస్తోంది. నిర్దేశించిన నమూనాల్లో ఉద్యోగుల పూర్తి సమాచారాన్ని అక్టోబర్ 15లోగా పంపాలని ప్రభుత్వ శాఖలన్నింటినీ కోరింది. సర్వే వివరాలు అందిన తర్వాత 2011 జనాభా లెక్కలతో పోల్చి ప్రభుత్వ కొలువుల్లో బీసీల్లోని 112 ఉప కులాల ప్రాతినిధ్యంపై విశ్లేషణలు చేయనుంది. రాష్ట్రంలోని బీసీల ఆర్థిక, సామాజిక స్థితిగతులపై ప్రభుత్వానికి అందజేసే అధ్యయన నివేదికలో సైతం ఈ సమాచారాన్ని పొందుపరచనుంది. ప్రభుత్వ ఉద్యోగాల్లో తగిన ప్రాతినిధ్యం లేని బీసీ ఉప కులాలకు జనాభా దామాషా ప్రకారం ఉద్యోగావకాశాలు కల్పించేందుకు ఆయా కులాల రిజర్వేషన్లను పెంచాల్సిందిగా ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది. అలాగే ఉప కులాల స్థితిగతుల ఆధారంగా బీసీ రిజర్వేషన్ల వర్గీకరణలో మార్పుచేర్పులు జరపాలని సూచించనుంది. సర్వేలో భాగంగా ఉద్యోగి కులం, ఉప కులం, ప్రభుత్వ శాఖ, విభాగం, జిల్లా, లింగం, స్థూలవేతనం, విద్యార్హతలు, నియామకం చేసిన ఉద్యోగ సంస్థ, మిగిలి ఉన్న సర్వీసు కాలం, క్యాడర్, హోదా, సర్వీసులో చేరినప్పటి వయసు, పట్టణం, గ్రామీణం.. తదితర అంశాలను బీసీ కమిషన్ సేకరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల రిజర్వేషన్ల పెంపునకు సైతం ఈ అధ్యయనం ఉపయోగపడనుంది. ఈ అంశాల వారీగా బీసీ కమిషన్ ప్రభుత్వ ఉద్యోగుల సమాచారం సేకరిస్తోంది కులాలు, ఉప కులాల వారీగా రూ.20 వేలలోపు నుంచి రూ.2 లక్షలకు పైగా స్థూల వేతనం అందుకుంటున్న వారి వివరాలు పదో తరగతి లోపు నుంచి పీహెచ్డీ వరకు విద్యార్హతలున్న వారి వివరాలు ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, డీఎస్సీ, ఏపీపీఆర్బీ, టీఎస్పీఆర్బీ, కారుణ్య నియామకాలు, ఇతర పద్ధతుల్లో నియమితులైనవారి వివరాలు ఏ వయసులో ఉద్యోగంలో చేరారన్న సమాచారం హైదరాబాద్, జీహెచ్ఎంసీ, ఉమ్మడి జిల్లాల కేంద్రాలు, కొత్త జిల్లాల కేంద్రాలు, గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్నవారి వివరాలు -
సీమాంధ్ర బీసీలకు రిజర్వేషన్ గండం!
తెలంగాణ బీసీల జాబితాలో లేని ఆంధ్ర బీసీ విద్యార్థికి అందని రిజర్వేషన్ బీసీ కులాల సంఖ్యను 138 నుంచి 112కు కుదించడంతో కొత్త సమస్య ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా తెరపైకి వచ్చిన రిజర్వేషన్ అంశం లా సెక్రటరీల సలహాకోరనున్న తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల సంఖ్యను 138 నుంచి 112కు కుదించడంతో... సీమాంధ్రలో బీసీలుగా గుర్తింపు పొందిన కొన్ని కులాల విద్యార్థులు తెలంగాణలో బీసీ రిజర్వేషన్‌ను కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఈ పరిణావుంతో ఆయూ వర్గాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే బీసీ-ఏ,బీ,సీ,డీ,ఈ.. కేటగిరీలలో ఏయే కులాలు వస్తాయనే అంశంపై ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలు ఉండగా, తెలంగాణలో ఉన్న బీసీ కులాల వివరాలను బట్టి 112 కులాలున్నట్లు ఇక్కడి ప్రభుత్వం తేల్చింది. గోదావరి జిల్లాల్లో అధికసంఖ్యలో ఉండే శెట్టిబలిజలు ప్రస్తుతం తెలంగాణ బీసీ జాబితాలో లేరు. కేవలం కృష్ణబలిజ, సూర్యబలిజ, లింగబలిజ కులాల పేర్లు వూత్రమే తెలంగాణ బీసీ జాబితాలో ఉన్నారుు. అలాగే ఉత్తర కోస్తాలో అధికంగా ఉండే తూర్పు కాపు ప్రస్తుతం తెలంగాణ జాబితాలో లేదు. కేవలం వుున్నూరుకాపు, లక్కవురికాపు కులాలు వూత్రమే తెలంగాణ బీసీ జాబితాలో ఉన్నారుు. అలాగే కొప్పుల వెలవు కులం కూడా తెలంగాణ జాబితాలో లేదు. ఈ కులాలకు చెందిన వేలాది వుంది హైదరాబాద్, పరిసరాల్లో నివసిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో బీసీల జాబితాలో ఉన్నా ... తెలంగాణ జాబితాలో లేని బీసీ కులాలకు చెందిన విద్యార్థుల్లో ఈ కొత్త ఆందోళన మొదలైంది. తెలంగాణ బీసీ జాబితాలో లేనందువల్ల రిజర్వేషన్ వర్తించదని, ఇతర కులాల కేటగిరీలో సీట్లు తీసుకోవాలంటూ అడ్మిషన్ల సందర్భంగా అధికారులు స్పష్టం చేయడంతో ఈ సవుస్య జటిల రూపం దాల్చింది. ఆదివారం ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా ఈ సమస్య ఉత్పన్నం కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు సోమవారం సచివాలయంలోని తెలంగాణ అధికారుల దృష్టికి దీనిని తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని బీసీకులాల జాబితాను పరిశీలించి తెలంగాణలో ఉన్న కులాలను బట్టే తాజా జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారని సమాచారం. ఇది వురో పెద్ద సమస్యగా మారుతుందోమోనన్న అనుమానాన్ని ఇరురాష్ట్రాల అధికారులు వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని రెండు రాష్ట్రాలు తమ తమ న్యాయ కార్యదర్శుల (లా సెక్రటరీ) దృష్టికి తీసుకె ళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. న్యాయశాఖ చెప్పే అభిప్రాయాన్ని బట్టి ఈ అంశంపై తదుపరి చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తెలంగాణలోని పది జిల్లాలకు సంబంధించి బీసీ జాబితాను ఖరారు చేసిన నేపథ్యంలో ఈ జాబితాలో లేని కులాలను ఓసీలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.