తెలంగాణ బీసీల జాబితాలో లేని ఆంధ్ర బీసీ విద్యార్థికి అందని రిజర్వేషన్
బీసీ కులాల సంఖ్యను 138 నుంచి 112కు కుదించడంతో కొత్త సమస్య
ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా తెరపైకి వచ్చిన రిజర్వేషన్ అంశం
లా సెక్రటరీల సలహాకోరనున్న తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల సంఖ్యను 138 నుంచి 112కు కుదించడంతో... సీమాంధ్రలో బీసీలుగా గుర్తింపు పొందిన కొన్ని కులాల విద్యార్థులు తెలంగాణలో బీసీ రిజర్వేషన్‌ను కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఈ పరిణావుంతో ఆయూ వర్గాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే బీసీ-ఏ,బీ,సీ,డీ,ఈ.. కేటగిరీలలో ఏయే కులాలు వస్తాయనే అంశంపై ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలు ఉండగా, తెలంగాణలో ఉన్న బీసీ కులాల వివరాలను బట్టి 112 కులాలున్నట్లు ఇక్కడి ప్రభుత్వం తేల్చింది. గోదావరి జిల్లాల్లో అధికసంఖ్యలో ఉండే శెట్టిబలిజలు ప్రస్తుతం తెలంగాణ బీసీ జాబితాలో లేరు. కేవలం కృష్ణబలిజ, సూర్యబలిజ, లింగబలిజ కులాల పేర్లు వూత్రమే తెలంగాణ బీసీ జాబితాలో ఉన్నారుు. అలాగే ఉత్తర కోస్తాలో అధికంగా ఉండే తూర్పు కాపు ప్రస్తుతం తెలంగాణ జాబితాలో లేదు. కేవలం వుున్నూరుకాపు, లక్కవురికాపు కులాలు వూత్రమే తెలంగాణ బీసీ జాబితాలో ఉన్నారుు. అలాగే కొప్పుల వెలవు కులం కూడా తెలంగాణ జాబితాలో లేదు. ఈ కులాలకు చెందిన వేలాది వుంది హైదరాబాద్, పరిసరాల్లో నివసిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో బీసీల జాబితాలో ఉన్నా ... తెలంగాణ జాబితాలో లేని బీసీ కులాలకు చెందిన విద్యార్థుల్లో ఈ కొత్త ఆందోళన మొదలైంది. తెలంగాణ బీసీ జాబితాలో లేనందువల్ల రిజర్వేషన్ వర్తించదని, ఇతర కులాల కేటగిరీలో సీట్లు తీసుకోవాలంటూ అడ్మిషన్ల సందర్భంగా అధికారులు స్పష్టం చేయడంతో ఈ సవుస్య జటిల రూపం దాల్చింది. ఆదివారం ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా ఈ సమస్య ఉత్పన్నం కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు సోమవారం సచివాలయంలోని తెలంగాణ అధికారుల దృష్టికి దీనిని తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని బీసీకులాల జాబితాను పరిశీలించి తెలంగాణలో ఉన్న కులాలను బట్టే తాజా జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారని సమాచారం.
ఇది వురో పెద్ద సమస్యగా మారుతుందోమోనన్న అనుమానాన్ని ఇరురాష్ట్రాల అధికారులు వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని రెండు రాష్ట్రాలు తమ తమ న్యాయ కార్యదర్శుల (లా సెక్రటరీ) దృష్టికి తీసుకె ళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. న్యాయశాఖ చెప్పే అభిప్రాయాన్ని బట్టి ఈ అంశంపై తదుపరి చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తెలంగాణలోని పది జిల్లాలకు సంబంధించి బీసీ జాబితాను ఖరారు చేసిన నేపథ్యంలో ఈ జాబితాలో లేని కులాలను ఓసీలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.
సీమాంధ్ర బీసీలకు రిజర్వేషన్ గండం!
Published Tue, Aug 19 2014 2:01 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 PM
Advertisement
Advertisement