Spicy government
-
కొత్తగా 14 జిల్లాలు
కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల ఏర్పాటుపై నేడు కే బినెట్ భేటీలో చర్చ ఏపీ డిస్ట్రిక్ట్ ్స (ఫార్మేషన్) చట్టాన్ని వర్తింపజేయడంపై నిర్ణయం మరో పది వేల ఉద్యోగాలు, నూతన మద్యం విధానంపై చర్చ ప్రాజెక్టుల ఎస్కలేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాల పెంపుపైనా చర్చ హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. అందుకు అనుగుణంగా గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం-1974ను తెలంగాణకు వర్తింపజేయాలని భావిస్తోంది. తెలంగాణ డిస్టిక్ట్స్ ఫార్మేషన్ యాక్ట్-2015 పేరుతో స్వల్ప మార్పులతో ఈ చట్టాన్ని అమలు చేయనుంది. బుధవారం మధ్యాహ్నం జరిగే రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం తెలిపే అవకాశాలున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. రెండు నెలల తర్వాత జరుగుతున్న కేబినెట్ భేటీ కావటంతో పలు కీలకమైన అంశాలు ఇందులో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. తెలంగాణలో ప్రస్తుతం ఉన్న పది జిల్లాలను పునర్విభజించి 14 కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. సీఎం కె.చంద్రశేఖర్‌రావు వివిధ జిల్లాల్లో పర్యటనల సందర్భంగా కొత్త జిల్లాల ఏర్పాటుపై హామీ ఇచ్చారు. పరిపాలనా సౌలభ్యానికి వీలుగా జిల్లాల సంఖ్యను పెంచనున్నారు. ఈ నేపథ్యంలో చట్టం అమల్లోకి తీసుకురావటం ద్వారా కొత్త జిల్లాల ఏర్పాటుకు మార్గం సుగమం కానుంది. ప్రస్తుతమున్న ప్రతిపాదనల ప్రకారం.. మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి, నాగర్‌కర్నూలు, నల్లగొండ జిల్లాలో సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో భద్రాచలం, ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాల, వరంగల్ జిల్లాలో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలో జగిత్యాల కొత్త జిల్లాలుగా ఏర్పడతాయి. రంగారెడ్డి జిల్లాకు బదులుగా వికారాబాద్‌ను జిల్లాగా మార్చటంతోపాటు హైదరాబాద్‌ను నాలుగు జిల్లాలుగా మార్చే ఆలోచనలున్నాయి. దశలవారీగా వీటిని పునర్విభజించాలని.. తొలిదశలో జిల్లా కేంద్రాలకు దూరంగా ఉన్న వాటిని కొత్త జిల్లాలుగా ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. చీప్ లిక్కర్‌పై చర్చ కొత్తగా అమల్లోకి తీసుకురానున్న మద్యం విధానంపై కేబినెట్లో చర్చ జరగనుంది. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ సిద్ధం చేసిన ఈ ఫైలును అధికారులు కేబినెట్ ఆమోదానికి పంపారు. రూ.15, రూ.30 బాటిళ్లలో చీప్ లిక్కర్‌ను విక్రయించాలనే నిర్ణయం ప్రభుత్వం తుది పరిశీలనలో ఉంది. మరో పది వేల ఉద్యోగాలపై.. ఈ ఏడాది 25 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రకటించారు. జూలైలో 15,552 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువడింది. నోటిఫికేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. మిగతా పది వేల పోస్టుల భర్తీకి లక్షలాది మంది నిరుద్యోగులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్న ఈ ఫైలుపై మంత్రివర్గ సమావేశంలో చర్చించే అవకాశముంది. కేబినెట్లో చర్చకు రానున్న మరిన్ని అంశాలు.. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న 25 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేసేందుకు ఎస్కలేషన్ పెంపు చేయాలనే ప్రతిపాదనలపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ల మార్పుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపైనా చర్చ జరిగే అవకాశముంది. వ్యవసాయ మార్కెట్ కమిటీల చైర్మన్ల నియామకానికి రిజర్వేషన్లపై చర్చించనున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన కరువు భత్యం (డీఏ)పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులకు జీతాలు పెంచాలనే డిమాండ్‌పై చర్చ జరగనుంది. ప్రతిపాదిత జిల్లాలు ►మెదక్ జిల్లాలో సిద్దిపేట, సంగారెడ్డి ►మహబూబ్‌నగర్ జిల్లాలో వనపర్తి, నాగర్‌కర్నూల్ ►నల్లగొండలో సూర్యాపేట.. ►వరంగల్‌లో జనగామ, ఆచార్య జయశంకర్ పేరిట భూపాలపల్లి ►ఖమ్మంలో భద్రాచలం ►కరీంనగర్లో జగిత్యాల.. ►ఆదిలాబాద్‌లో మంచిర్యాల ► హైదరాబాద్ ను 4 జిల్లాలుగా.. రంగారెడ్డికి బదులుగా వికారాబాద్‌ను జిల్లాగా మార్చాలన్న ప్రతిపాదనా ఉంది -
‘పాలమూరు’ అంచనాలు పైపైకి
ప్రాజెక్టు తొలిదశ పూర్తికే రూ.15 వేల కోట్ల వ్యయం! అలుగు పునాదిని పెంచాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సూచించిన సీడీవో ఈ మార్పులతో మరో రూ.500 కోట్ల మేర పెరగనున్న అంచనాలు సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజె క్టు అంచనా వ్యయం మరింత పెరగనుంది. ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేసేందుకే దాదాపు రూ.15 వేల కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు అలుగు పునాది (ఫౌండేషన్ లెవల్)ని మరింత కిందకు తీసుకెళ్లాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) సూచించిన నేపథ్యంలో వ్యయం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల పరిధిలోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం గత జూలై నెలలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీకోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి రూ.5.73 కోట్లను విడుదల చేసింది. ఈ కాలేజీ తొలిదశ సర్వేను డిసెంబర్లోనే పూర్తి చేసింది. పైప్‌లైన్, ఓపెన్ చానల్, టన్నెల్ అలైన్మెంట్, రిజర్వాయర్ల గుర్తింపు, పంపింగ్ స్టేషన్లు, ముంపు గ్రామాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది. దీని ప్రకారం జూరాల నుంచి వరద ఉండే 25 రోజుల్లో 70 టీఎంసీల నీటి తరలింపునకు 5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 25 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను నిర్మించాలని సూచించింది. ఈ నీటిని 70 టీఎంసీల సామర్థ్యం ఉండే మొదటి రిజర్వాయర్ కోయిల కొండలోకి 170 మీటర్ల ఎత్తునుంచి ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ ఏర్పాటు చేసే పంపిం గ్ స్టేషన్ వద్ద 160మెగావాట్ల సామర్థ్యం కలిగిన 14 పంపులను ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణ పనులకు సుమారు రూ. 14,950 కోట్ల మేర అవసరం ఉంటుందని అంచనా వేసింది. దీనిపై డిసెంబర్ రెండో వారంలోనే పరిశీలన చేసిన ఆర్థిక శాఖ రూ.14,400 కోట్లకు డీపీఆర్‌ను ఆమోదించి తదుపరి పరిశీలన కోసం సీడీఓకు పంపింది. అన్ని అంశాలను పరిశీలించిన సీడీఓ, ప్రాజెక్టు వద్ద రాళ్లు, మట్టి సామర్థ్యాన్ని బట్టి అలుగు పునాదిని మరింత కిందకు తీసుకెళ్లాలని సూచించింది. దీని కోసం అదనంగా మరో రూ. 60 నుంచి రూ.80 కోట్ల మేర ఖర్చు పెరుగుతుందని అంచనా వే సింది. ప్రధాన కాల్వలకు కాంక్రీట్ లైనింగ్ చేయాలని దీనికి మరో రూ.200 నుంచి రూ.300ల కోట్ల మేర వ్యయం పెరుగుతుందని సీడీఓ పేర్కొన్నట్లుగా తెలిసింది. ఇక వీటితోపాటే రిజర్వాయర్ల వద్ద ఏర్పాటు చేసే పంప్‌హౌస్‌ల నిర్మాణంలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా సమాచారం. వీటన్నింటినీ కలుపుకొని అదనంగా రూ.500 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ అంచనా వస్తోంది. కాగా మరో మూడు, నాలుగు రోజుల్లోనే సీడీఓ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని తెలిసింది. అనంతరం ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు, శంకుస్థాపన తదితరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
రోడ్ల నిర్వహణ రేట్లు పెంపు
రహదారులు, భవనాల శాఖ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల రహదారుల సాధారణ నిర్వహణ రేట్లను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇంధనం ధరలు, కూలీ రేట్లు పెరగడంవల్ల రహదారుల నిర్వహణ వ్యయం రేట్లను సవరించినట్లు రహదారులు, భవనాల శాఖ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రహదారుల నిర్వహణ రేట్లు కిలోమీటరు కొలమానంగా ఉంటాయి. ఈ మేరకు సింగల్ లేన్ బీటీ రోడ్డు నిర్వహణ రేటు రూ. 12 వేల నుంచి రూ.24 వేలకు పెరిగింది. డబుల్ లేన్ బీటీ రోడ్డుకు రూ. 15 వేల నుంచి రూ. 30 వేలకు, మట్టిరోడ్లు, కంకర రోడ్లకు రూ. 6 వేల నుంచి రూ.12 వేలకు పెరిగింది. తెలంగాణలో ఇక నుంచి నిర్మించే కొత్తరోడ్లను అయిదేళ్లపాటు నిర్వహించే బాధ్యతను కాంట్రాక్టర్లకే అప్పగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే. -
ఆశల పల్లకిలో..
కష్టపడి చదివారు.. ఉద్యోగం రాలేదు. నిర్ణీత వయస్సు దాటిపోతోంది. ఏం చేయాలో తెలియని పరిస్థ్థితి. కొలువుమీద ఆశ వదులుకునే దశలో వారిలో రాష్ట్ర ప్రభుత్వం ఆశలు కల్పించింది. ఖాళీగా ఉన్న ఉద్యోగాలను నింపడంతో పాటు ఉద్యోగాలకు నిర్ణీత వయస్సునూ మరో ఐదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొంది. దీంతో వేలాదిమందికి ఆశలు చిగురించాయి. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు నిరుద్యోగులు సమాయత్తమవుతున్నారు. సాక్షి, మహబూబ్‌నగర్: కొత్తరాష్ట్రంలో నిరుద్యోగుల కోటి ఆశలు నెరవేరబోతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల వయో పరిమితిని ఐదేళ్లు పెంచడంతో నిరుద్యోగుల్లో ఆనందం ఉప్పొంగుతోంది. ఐదేళ్ల పాటు ఎలాంటి నోటిఫికేషన్లూ జారీకాకపోవడంతో తీవ్ర నిరుత్సాహంతో ఉన్న నిరుద్యోగులకు సర్కా రు ప్రకటన ఊరట కలిగించింది. త్వరలో లక్ష ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించిన నేపథ్యంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. జిల్లాలో నిరుద్యోగుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతుంది. ఇప్పటివరకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయంలో నమోదైన వారిని బట్టి 1,61,546 మంది నిరుద్యోగులున్నారు. వీరిలో పదో తరగతి చదివిన వారు 59,129 మంది, ఇంటర్మీడియట్ పూర్తిచేసిన వారు 31,168 మంది, డిగ్రీ, పీజీ వంటి ఉన్నత విద్య చదివిన వారు 31,183మంది ఉన్నారు. అలాగే వృత్తి విద్యాకోర్సులు పూర్తిచేసిన వారు 36,758 మంది ఉన్నారు. వీరికి ఎంప్లాయిమెంట్ కార్యాలయం నుంచి ఇప్పటివరకు ఒక్క కాల్ లెటర్ కూడా వెళ్లలేదు. దీంతో ప్రస్తుతం ఉన్నత చదువులు పూర్తి చేసుకుంటున్న వారు ఎంప్లాయిమెంట్ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు. ఈ నేపథ్యంలో ఐదారేళ్లుగా పేర్లు నమోదులో భారీగా తగ్గిపోయింది. భారీగా పేరుకుపోయిన ఖాళీలు ఉమ్మడి రాష్ట్రంలో సర్కారీ కొలువుల కోసం కొంతకాలంగా ఎలాంటి నోటిఫికేషన్లూ లేకపోవడంతో భారీగా ఖాళీలు ఏర్పడ్డాయి.నాలుగైదు ఏళ్లుగా పదవీ విరమణ పొందినవారి సంఖ్య అదేస్థాయిలో ఉండడంతో ముఖ్యమైన శాఖల్లో ఉద్యోగుల కొరత ఏర్పడింది. జిల్లాలో మొత్తం 84 శాఖల్లో కూడా ఉద్యోగుల కొరత వేధిస్తోంది. పోలీస్‌శాఖ మినహా మిగతా వాటిన్నింటిలో కలిపి జిల్లాలో దాదాపు 2,400 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో అత్యధికంగా పాఠశాల విద్యశాఖలో అత్యధికంగా 1,600 పోస్టులు ఖాళీలున్నాయి. అలాగే వైద్యారోగ్యశాఖలో 600, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కాలేజీల్లో 260, రెవెన్యూశాఖలో 260, పశుసంవర్థక శాఖలో 55పోస్టులు ఖాళీలున్నాయి. ఇవి కాకుండా ప్రభుత్వం ఇటీవల ఆదర్శరైతులను తొలగించింది. కాగా, వారిస్థానంలో ఏఈఓ (అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్)లను నియమించనున్నట్లు ప్రకటించింది. దీంతో దాదాపు రెండు వేలకు పైగా నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరికే అవకాశం ఉంది. అయితే ఇన్నాళ్లూ పుస్తకాలను దూరం పెట్టిన వారు తిరిగి కోచింగ్ సెంటర్లకు వెళ్లడానికి సిద్ధపడుతున్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకోసం త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ వెలువరించనున్నట్లు ప్రభుత్వ ప్రకటించడంతో బీఎడ్, డీఎడ్ పూర్తిచేసిన అభ్యర్థులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరోవైపు రెవెన్యూ ఉద్యోగాల ఖాళీలు కూడా భారీగా ఉన్న నేపథ్యంలో గ్రూప్స్ కోచింగ్ తీసుకునేందుకు హైదరాబాద్ పయనమవుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల్లోనూ.. రాష్ట్ర పరిధిలోని శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనతో కాంట్రాక్టు ఉద్యోగులు సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో మొత్తం 3,800మంది కాంట్రాక్టు ఉద్యోగులున్నారు. వీరిలో అత్యధికంగా డ్వామాలో 1,725, ఆర్వీఎంలో 845, డీఆర్డీఏలో 275, విద్యుత్‌శాఖలో 320మంది పనిచేస్తున్నారు. అయితే ఏయే శాఖల్లో పనిచేస్తున్న వారిని రెగ్యులరైజ్ చేస్తారనే విషయంలో ప్రభుత్వం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. జిల్లాలోని కాంట్రాక్టు ఉద్యోగసంఘాలు మాత్రం అందరినీ రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నారు. విద్యార్హతల వారీగా.. విద్యార్హత నిరుద్యోగులు ఐదేళ్ల సడలింపుతో లబ్ధి 10వ తరగతి 59,129 72,112 ఇంటర్ 31,168 41,317 డిగ్రీ, పీజీ 31,183 45,734 వృత్తివిద్యాకోర్సు 36,758 52,007 -
‘న్యాక్’ వివాదం కొత్త మలుపు
సీఎం చైర్మన్‌గా కొత్త పాలక మండలి ఏర్పాటు చేసిన తెలంగాణ ప్రభుత్వం రెండ్రోజుల క్రితం ఇదే తరహా ఉత్తర్వులిచ్చిన ఆంధ్రప్రదేశ్ సర్కారు ఇరు రాష్ట్రాల మధ్య మరింత ముదిరిన లొల్లి సాక్షి, హైదరాబాద్: తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య నలుగుతున్న నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ (న్యాక్) వివాదం కొత్త మలుపు తిరిగింది. న్యాక్‌కు ఆంధప్రదే శ్ సీఎం చైర్మన్‌గా పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసిన 48 గంటల్లోనే... తెలంగాణ ప్రభుత్వం పాలక మం డలిని నియమించింది. ముఖ్యమంత్రి చైర్మన్‌గా, రోడ్లు భవనాల శాఖ మంత్రి వైస్ చైర్మన్‌గా, న్యాక్ డీజీ సభ్య కార్యదర్శిగా, మరో 23 మందిని సభ్యులుగా పేర్కొంటూ తెలంగాణ సర్కారు బుధవారం ఉత్తర్వు జారీ చేసింది. దీంతో న్యాక్ విషయంలో రెండు రాష్ట్రాల మధ్య అంతరం మరింత పెరిగింది. ఇప్పటికే పలు సమావేశాల పేరుతో తెలంగాణ సీఎం తరచూ న్యాక్‌కు వెళ్తున్నారు. ఏపీ సీఎం అక్కడికి వెళ్తే పరిస్థితి ఉద్రిక్తంగా మారటం ఖాయమని అధికారులు పేర్కొంటున్నా రు. సొసైటీ జాబితాలో ఉన్నందున న్యాక్ విభజన జరగలేదు. సొసైటీల చట్టాన్ని మార్చనందున న్యాక్ తమకే దక్కుతుందని ఏపీ వాదిస్తుండగా, తెలంగాణలో ఉన్నం దున మాకే చెందుతుందని ఈ ప్రభుత్వం పేర్కొంటోంది. పాలక మండలిలో సభ్యులు వీరే... తెలంగాణ ప్రభుత్వం న్యాక్‌కు ఏర్పాటు చేసిన పాలక మండలి సభ్యులు వీరే.. ముంబైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ డీజీ, బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఢిల్లీ) అధ్యక్షుడు, ఆ అసోసియేషన్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కౌన్సిల్ (ఢిల్లీ) చైర్మన్, స్ట్రక్చరల్ ఇంజనీర్స్ రీసెర్చ్ కౌన్సిల్ (ఢిల్లీ) డెరైక్టర్, నేషనల్ కౌన్సిల్ ఫర్ క న్‌స్ట్రక్షన్ అండ్ బిల్డింగ్ మెటీరియల్స్ డెరైక్టర్, జేఎన్టీయూ వీసీ, ఇండియన్ కాంక్రీట్ ఇన్స్టిట్యూట్ డెరైక్టర్, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డీజీ, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీర్స్ తెలంగాణ చాప్టర్ చైర్మన్, హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సీఎండీ, గృహ నిర్మాణం, ఆర్అండ్బీ, పురపాలక, నీటిపారుదల శాఖల ముఖ్య కార్యదర్శులు, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ వీసీఎండీ, గృహ నిర్మాణ సంస్థ, పోలీసు గృహ నిర్మాణ సంస్థల ఎండీలు, ఆర్అండ్బీ ఈఎన్సీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ డెరైక్టర్, డీఆర్డీవో అడిషనల్ డీజీలు. చంద్రబాబు నోట నీతులు.. చేతల్లో రోతలు: మంత్రి హరీశ్‌రావు ఏపీ సీఎం చంద్రబాబు నోటితో నీతు లు చెబుతూ రోత పనులకు దిగజారుతున్నారని మంత్రి టి.హరీశ్‌రావు విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలసి శాసనసభాపక్ష కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హైదరాబాద్‌లోని ‘న్యాక్’ కేంద్ర గవర్నింగ్ బాడీకి చంద్రబాబే చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గానికి పరాకాష్ట అన్నారు. ఫిబ్రవరి దాకా గవర్నింగ్ బాడీకి కాలపరిమితి ఉన్నా ఇప్పటికిప్పుడే చంద్రబాబు స్వయంగా చైర్మన్‌గా నియమించుకోవడం దుర్మార్గం కాదా? అని ప్రశ్నించారు. కేవలం తెలంగాణతో వివాదాలు, గొడవలు పెట్టుకోవడానికే ఈ గవర్నింగ్ బాడీని ఏర్పాటుచేశారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటినుంచి చంద్రబాబు కుట్రలకు పాల్పడుతూనే ఉన్నాడన్నారు. ఎయిర్‌పోర్టుకు ఎన్టీఆర్ పేరును సమర్థించిన టీటీడీపీ నేతలు హైదరాబాద్ న్యాక్‌కు చంద్రబాబు ఉండాలని సమర్థిస్తరా.. వ్యతిరేకిస్తరా? అని హరీష్‌రావు ప్రశ్నించారు. -
1,399 చెరువులకు మహర్దశ
వరంగల్ రూరల్ : తెలంగాణ సర్కారు చిన్న నీటి వనరులపై దృష్టి కేంద్రీకరించింది. చెరువులకు నిధులు కేటారుుంచి అభివృద్ధి పర్చేందుకు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రతి నీటిబొట్టునూ ఒడిసి పట్టుకుని సాగునీటితోపాటు తాగునీటికి ఇబ్బందులు కలుగకుండా చూడాలని చూస్తోంది. స్థానికంగా ఉండే చెరువులు, కుంటల్లో పూడిక తీయకపోవడంతో చిన్నపాటి వర్షానికే మత్తళ్లు పడుతున్నారుు. దీన్ని గమనించిన ప్రభుత్వం చెరువుల్లోని పూడికను తీస్తే నీటి నిల్వ సామర్థ్యంతోపాటు సమీప ప్రాంతాల్లో భూగర్భ జలమట్టం పెరుగుతుందని భావిస్తోంది. వీటిని పరిగణనలోకి తీసుకుని ఒక్కో చెరువుకు రూ.10 లక్షల నుంచి రూ.50 లక్షలతో మరమ్మతులు, పూడికతీత పనులు చేపట్టనుంది. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని చిన్న నీటిపారుదల శాఖ కింద 20 శాతం చెరువులను మొదటి విడతలో అభివృద్ధి చేసేందుకు తెలంగాణ సర్కారు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు చెరువులను గుర్తించాలని నీటి పారుదల శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించగా.... వారు పక్షం రోజులుగా సర్వే చేసి లెక్క తేల్చారు. మొదటి విడతలో.. ఇటీవల నీటి పారుదలశాఖ అధికారులు నిర్వహించిన సర్వేలో జిల్లావ్యాప్తంగా 5,584 చిన్ననీటి వనరులు ఉన్నటు గుర్తించారు. ఎంపికలో ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు సిఫారసు చేసిన చెరువులకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. 20 శాతం అంటే 12 నియోజకవర్గాల్లో 1,399 చెరువులను అభివృద్ధి చేసేందుకు నీటి పారుదల శాఖ అధికారులు నివేదికలు రూపొందించి ప్రభుత్వానికి అందించారు. వీటికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే... నిధుల ప్రతిపాదనలు అందించేందుకు జిల్లా యంత్రాంగం సమాయత్తమవుతోంది. ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సమీక్షించి నిధులు కేటాయించనున్నారు. ఈ చెరువుల పునరుద్ధరణకు ఏటా సుమారు రూ.400 కోట్లకు పైగా నిధులు వ్యయం చేయనున్నట్లు సమాచారం. కాగా, గొలుసు కట్టు చెరువులకు ప్రాధాన్యత ఇవ్వాలని ఇటీవల జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్... ఇరిగేషన్ అధికారులకు ఆదేశించారు. అదే విధానంతో చెరువులను అభివృద్ధి చేసే విధంగా అంచనాలను రూపొందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెరువుల అభివృద్ధి వివిధ పథకాల్లో విడుదలవుతున్న నిధులన్నింటినీ ఈ పథకంలో వ్యయం చేయనున్నారు. చెరువుల సామర్థ్యం పరిగణనలోకి తీసుకుని ఆయూ పథకాల్లో సిఫారసు చేయనున్నారు. కేంద్రం అందజేస్తున్న త్రిపుల్ఆర్, వరల్డ్‌బ్యాంక్, ఏఐబీపీ, ఏపీసీబీటీఎంపీ, ఎన్ఎస్పీ, ఎఫ్డీఆర్ వంటి పథకాల నిధులను వీటికి కేటాయించనున్నారు. సర్వే పూర్తయింది.. చెరువుల పునరుద్ధరణలో భాగంగా సర్వే పూర్తయింది. స్థానిక రైతులు, ప్రజాప్రతినిధులు, ఆయా నియోజకవర్గాల ఎమ్మెల్యేల సూచనలతో జిల్లావ్యాప్తంగా 20 శాతం చెరువులను ఎంపిక చేశాం. సర్వే పూర్తయినందున ప్రతిపాదనల రూపకల్పనల్లో అధికారులు ఉన్నారు. నిధులు కేటాయిస్తే పనులు చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. - వి.పద్మారావు, ఎస్ఈ, ఐబీ, వరంగల్ -
సర్వం.. సర్వేనే
గ్రేటర్లో ఆసక్తి చూపిన రాజకీయ, సినీ ప్రముఖులు సమగ్ర వివరాలు అందజేసిన గవర్నర్ నరసింహన్ వివరాలిచ్చిన వైఎస్సార్ సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి బాబు ఇంటికి స్టిక్కర్లు అంటించకుండా అడ్డుకున్న సిబ్బంది నిరాకరించిన పవన్ కళ్యాణ్, విజయశాంతి హైదరాబాద్: మహానగరంలో మహాసన్నివేశం ఆవిష్కృతమైంది. అపూర్వ ఘట్టం నమోదైంది. సర్వే మినహా సకలం బంద్. ఇంటింటా అదే సందడి. గల్లీగల్లీలో అదే కోలాహలం. తెలంగాణ ప్రభుత్వం మంగళవారం చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వే గ్రేటర్ హైదరాబాద్‌లో సక్సెస్ అయింది. విశేష స్పందన లభించింది. వివరాలు చెబుతూ కుటుంబసభ్యులు.. సర్వేఫారాలు నింపుతూ ఎన్యూమరేటర్లు కనిపించారు. పేద, ధనిక తేడాలేకుండా అందరూ సర్వేపట్ల ఆసక్తి కనబర్చారు. గవర్నర్ నరసింహన్, ఆయా పార్టీల రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు సర్వేలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఉదయం బేగంపేటలోని క్యాంప్ కార్యాలయంలో ఎన్యుమరేటర్‌కు తన కుటుంబానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. బంజారాహిల్స్‌లోని పలువురు ప్రముఖులు ఆసక్తి చూపగా, కొంతమంది సెలబ్రిటీలు ముఖం చాటేశారు. లోటస్‌పాండ్‌లో నివాసం ఉంటున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్మోహన్రెడ్డి షేక్‌పేట తహసీల్దార్, బంజారాహిల్స్ నోడల్ అధికారి చంద్రకళ నేతృత్వంలో ఎన్యూమరేటర్ల బృందానికి సాయంత్రం 6:30 గంటలకు వివరాలను అందజేశారు. అడిగి అన్ని ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. ఉదయం నుంచి తాను అసెంబ్లీలో ఉండటం వల్ల రాలేకపోయానని జగన్ తెలిపారు. తెలంగాణ ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, నటుడు తనికెళ్ల భరణి, జూనియర్ ఎన్టీఆర్, అల్టు అర్జున్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, తెలంగాణ పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, పొన్నాల లక్ష్మయ్య, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.కేశవరావు, రవాణా శాఖామంత్రి మహేందర్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, మాజీ మంత్రి దానం నాగేందర్, హైదరాబాద్ కలెక్టర్ ఎంకే.మీనా, నవీన్ మిట్టల్, మాజీ ఎంపీ రేణుకా చౌదరి తదితరులు సర్వేకు సహకరించి, కుటుంబ వివరాలు నమోదు చేయించుకున్నారు. హీరో పవన్ కళ్యాణ్, మాజీ ఎంపీ విజయశాంతి వివరాలు ఇచ్చేందుకు నిరాకరించారు. కేంద్ర మాజీ మంత్రి దాసరి నారాయణ రావు వివరాలు అందజేశారు. ప్రముఖ హాస్యనటుడు బ్రహ్మానందం తన కుటుంబ వివరాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నా సేకరించడానికి ఎన్యూమరేటర్లు రాలేదు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తన కుటుంబానికి సబంధించిన వివరాలను ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో అందుబాటులో ఉంచగా ఎన్యూమరేటర్ మానయ్య వాటిని అక్కడి నుంచి సేకరించారు. టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీయం రమేష్ ఇంటికి కూడా స్టిక్కర్ అంటించేందుకు ఒప్పుకోలేదు. గ్రేటర్లో 80 శాతం గ్రేటర్ నగరంలో 2011 జనాభా లెక్కల మేరకు 15.24 లక్షల కుటుంబాలుండగా, రాత్రి 8 గంటల వరకు 15.50 లక్షల కుటుంబాల సర్వే పూర్తయినట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ పేర్కొన్నారు. మరో నాలుగైదు లక్షల కుటుంబాలు మిగిలి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ లెక్కన గ్రేటర్లో దాదాపు 80 శాతం సర్వే జరిగిందని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. సరైన వివరాలు బుధవారం మాత్రమే తెలిసే వీలుందన్నారు. సర్వే బాగుంది: లింగ్డో శంకర్పల్లి: కుటుంబ సమగ్ర సర్వేలో భారత ఎన్నికల మాజీ కమిషన్ జేఎం లింగ్డో వివరాలు నమోదు చేయించుకున్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండల పరిధిలోని పొద్దుటూర్ ప్రగతి రిసార్ట్‌లో నివాసం ఉంటున్న లింగ్డో ఇంటికి వెళ్లారు. ఎన్యూమరేటర్లు అడిగిన వివరాలను ఆయన అందజేశారు. ప్రభుత్వం నిర్వహిస్తున్న సర్వే బాగుందని, ఈ సర్వేతో ప్రభుత్వానికి ప్రజలకు సంబంధించి అన్ని విషయాలూ తెలుస్తాయని ఆయన పేర్కొన్నారు. ఎన్యూమరేటర్‌గా జీహెచ్ఎంసీ కమిషనర్ సమగ్ర కుటుంబ సర్వేలో జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ స్వయంగా పాల్గొని కాసేపు ఎన్యుమరేటర్ పాత్ర కూడా పోషించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ ఇ.ఎస్.ఎల్.నరసింహన్, క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్, సర్కిల్-7 పరిధిలో నగర మేయర్ మాజిద్ హుస్సేన్ నివాసానికి సర్వే సిబ్బందితో పాటు కమిషనర్ కూడా వెళ్లి సర్వే నిమిత్తం కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. మరోవైపు రాజేంద్రనగర్‌లోని జీహెచ్ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, సర్కిల్-9 పరిధిలో డిప్యూటీ మేయర్ రాజ్‌కుమార్ నివాసాలకు ఉన్నతాధికారులు వెళ్లి వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించారు. హర్షణీయం: జస్టిస్ చంద్రకుమార్ ప్రజల సమగ్ర సమాచారం ప్రభుత్వం వద్ద ఉండాల్సిందేనని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బి.చంద్రకుమార్ అన్నారు. సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా మంగళవారం రాత్రి ఎల్బీనగర్ హస్తినాపురంలోని ఆయన నివాసానికి వచ్చిన ఎన్యూమరేటర్‌కు కుటుంబ సమాచారం అందజేశారు. చంద్రకుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సమాచారాన్ని పదిలంగా ఉంచి దుర్వినియోగ పరచడానికి అవకాశం కల్పించకుండా ఉండాలి. సర్వేతో పేద ప్రజలకు ఎంతో మేలు కలుగుతుంది. సమగ్ర కుటుంబ సర్వే హర్షనీయమని ఆయన పేర్కొన్నారు. -
సీమాంధ్ర బీసీలకు రిజర్వేషన్ గండం!
తెలంగాణ బీసీల జాబితాలో లేని ఆంధ్ర బీసీ విద్యార్థికి అందని రిజర్వేషన్ బీసీ కులాల సంఖ్యను 138 నుంచి 112కు కుదించడంతో కొత్త సమస్య ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా తెరపైకి వచ్చిన రిజర్వేషన్ అంశం లా సెక్రటరీల సలహాకోరనున్న తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల సంఖ్యను 138 నుంచి 112కు కుదించడంతో... సీమాంధ్రలో బీసీలుగా గుర్తింపు పొందిన కొన్ని కులాల విద్యార్థులు తెలంగాణలో బీసీ రిజర్వేషన్‌ను కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఈ పరిణావుంతో ఆయూ వర్గాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే బీసీ-ఏ,బీ,సీ,డీ,ఈ.. కేటగిరీలలో ఏయే కులాలు వస్తాయనే అంశంపై ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలు ఉండగా, తెలంగాణలో ఉన్న బీసీ కులాల వివరాలను బట్టి 112 కులాలున్నట్లు ఇక్కడి ప్రభుత్వం తేల్చింది. గోదావరి జిల్లాల్లో అధికసంఖ్యలో ఉండే శెట్టిబలిజలు ప్రస్తుతం తెలంగాణ బీసీ జాబితాలో లేరు. కేవలం కృష్ణబలిజ, సూర్యబలిజ, లింగబలిజ కులాల పేర్లు వూత్రమే తెలంగాణ బీసీ జాబితాలో ఉన్నారుు. అలాగే ఉత్తర కోస్తాలో అధికంగా ఉండే తూర్పు కాపు ప్రస్తుతం తెలంగాణ జాబితాలో లేదు. కేవలం వుున్నూరుకాపు, లక్కవురికాపు కులాలు వూత్రమే తెలంగాణ బీసీ జాబితాలో ఉన్నారుు. అలాగే కొప్పుల వెలవు కులం కూడా తెలంగాణ జాబితాలో లేదు. ఈ కులాలకు చెందిన వేలాది వుంది హైదరాబాద్, పరిసరాల్లో నివసిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో బీసీల జాబితాలో ఉన్నా ... తెలంగాణ జాబితాలో లేని బీసీ కులాలకు చెందిన విద్యార్థుల్లో ఈ కొత్త ఆందోళన మొదలైంది. తెలంగాణ బీసీ జాబితాలో లేనందువల్ల రిజర్వేషన్ వర్తించదని, ఇతర కులాల కేటగిరీలో సీట్లు తీసుకోవాలంటూ అడ్మిషన్ల సందర్భంగా అధికారులు స్పష్టం చేయడంతో ఈ సవుస్య జటిల రూపం దాల్చింది. ఆదివారం ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా ఈ సమస్య ఉత్పన్నం కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు సోమవారం సచివాలయంలోని తెలంగాణ అధికారుల దృష్టికి దీనిని తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని బీసీకులాల జాబితాను పరిశీలించి తెలంగాణలో ఉన్న కులాలను బట్టే తాజా జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారని సమాచారం. ఇది వురో పెద్ద సమస్యగా మారుతుందోమోనన్న అనుమానాన్ని ఇరురాష్ట్రాల అధికారులు వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని రెండు రాష్ట్రాలు తమ తమ న్యాయ కార్యదర్శుల (లా సెక్రటరీ) దృష్టికి తీసుకె ళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. న్యాయశాఖ చెప్పే అభిప్రాయాన్ని బట్టి ఈ అంశంపై తదుపరి చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తెలంగాణలోని పది జిల్లాలకు సంబంధించి బీసీ జాబితాను ఖరారు చేసిన నేపథ్యంలో ఈ జాబితాలో లేని కులాలను ఓసీలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు.