- రహదారులు, భవనాల శాఖ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: వివిధ రకాల రహదారుల సాధారణ నిర్వహణ రేట్లను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. ఇంధనం ధరలు, కూలీ రేట్లు పెరగడంవల్ల రహదారుల నిర్వహణ వ్యయం రేట్లను సవరించినట్లు రహదారులు, భవనాల శాఖ శనివారం విడుదల చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. రహదారుల నిర్వహణ రేట్లు కిలోమీటరు కొలమానంగా ఉంటాయి.
ఈ మేరకు సింగల్ లేన్ బీటీ రోడ్డు నిర్వహణ రేటు రూ. 12 వేల నుంచి రూ.24 వేలకు పెరిగింది. డబుల్ లేన్ బీటీ రోడ్డుకు రూ. 15 వేల నుంచి రూ. 30 వేలకు, మట్టిరోడ్లు, కంకర రోడ్లకు రూ. 6 వేల నుంచి రూ.12 వేలకు పెరిగింది. తెలంగాణలో ఇక నుంచి నిర్మించే కొత్తరోడ్లను అయిదేళ్లపాటు నిర్వహించే బాధ్యతను కాంట్రాక్టర్లకే అప్పగించాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించిన విషయం తెలిసిందే.